ముద్దు ముద్దుగ
Appearance
అఠాణ రాగం - చాపు తాళం
[మార్చు]
పల్లవి:
ముద్దు ముద్దుగ పిలవనా నాసామిని
ముద్దు ముద్దుగ పిలవనా నా సామిని ||
అనుపల్లవి:
ముద్దు ముద్దుగ పిలవ చులక సేయునేమో
ముద్దు ముద్దుగ పిలవ బాగని తోచెనే ||
చరణం 1:
పాటలు పాడుదునా మంచి ఆటలు ఆడుదునా
వాటమైన గుబ్బ పోటు జూపింతునా తేట
చెక్కిలి కొన గోట మీటుదునా ||
చరణం 2:
ఆకుమడుపు లిత్తునా మంచి తావి
అత్తరు పై బూతునా
తేకువతో జడ త్రిప్పి కొట్టుదునా
మోక మావి తలిరు మోవి గరతునా ||
చరణం 3:
కోపగించకు మందునా యేర వేణు
గోపాల రమ్మందునా
శ్రీ పుర్ణుడగు దాసు శ్రీరాము మనమున
ప్రాపై నివసించి పాలించమందునా ||