ముత్యాల సరాలు

వికీసోర్స్ నుండి

ప్రచురణ నెం. 117

అన్నిహక్కులు

ప్రథమ ముద్రణ

ప్రచురణకర్తలవే

ఫిబ్రవరి 1953

ద్వితీయ ముద్రణ

మే 1955





వెల : పది అణాలు





ముద్రణ :

స్వతంత్ర ఆర్టు ప్రింటర్సు,

విజయవాడ - 2.

పరిచయం

"ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయ్!
పలుకులను విని దేశమం దభి
మానములు మొలకెత్తవలెనోయ్!"


ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి శ్రీ వీరేశలింగం పంతులుగారు యుగపురుషులు. ఈ ప్రభాతకాలంలోనే శ్రీ గురజాడ అప్పారావుగారి రచనలు నూతన విజ్ఞానభానూదయకాంతులు ప్రసరింపజేశాయి. వీరి రచనలు సంఖ్యలో స్వల్పమే అయినా సాటిలేనివి. కవులకు ఆదర్శమార్గాన్ని చూపించాయి. ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించాయి. భాషలో, భావంలో విప్లవాన్ని సాధించాయి.

నవ్యాంధ్రసాహిత్యానికి యుగకర్త అయిన శ్రీ అప్పారావుగారు 1861 నవంబరు 30వ తేదీన విశాఖజిల్లా రాయవరంగ్రామంలో జన్మించారు. విజయనగరం కాలేజీలో చదివి 1878లో బి. ఎ. పరీక్ష ప్యాసయ్యారు. వీరు చదువుకుంటూన్న రోజుల్లోనే, ఇంగ్లీషులో కవిత్వంవ్రాసి పత్రికల్లో ప్రచురిస్తూండేవారు. పట్టభద్రులు కాకపూర్వమే 1884 లో విజయనగరం కాలేజీలో కొన్నాళ్లు ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని, అప్పుడు వారికిచ్చే జీతం నెలకు పాతిక రూపాయలుమాత్రమే. ఈ స్వల్పజీతంతో అసంతృప్తి చెంది కాబోలు, తర్వాత కొన్నాళ్ళు డిప్యూటీకలెక్టరు ఆఫీసులో హెడ్‌క్లార్కుగా చేరారు. కాని, విజ్ఞానఖనియైన ఈ మహనీయునికి గుమస్తాగిరి ఎంతకాలం సహిస్తుంది? అయిదారు మాసాల్లోనే ఆ గుమస్తాపనికి స్వస్తి జెప్పి, కాలేజీలో మళ్ళీ లెక్చరరుగా ప్రవేశించారు. జీతంకూడా వందరూపాయలకు పెరిగింది. ఉపాధ్యాయవృత్తిలో ఉన్నంతకాలం జీతపురాళ్ళనే తన జీవిత పరమావధిగా ఎంచుకోక, విద్యార్థుల విజ్ఞాన వికాసాలకు ప్రత్యేకించి కృషి చేస్తూండేవారు. అందువల్లనే విద్యార్థులకు వీరెంతో ప్రీతిపాత్రు లయ్యారు.

పుట:ముత్యాల సరాలు.pdf/3 పుట:ముత్యాల సరాలు.pdf/4 పుట:ముత్యాల సరాలు.pdf/5 పుట:ముత్యాల సరాలు.pdf/6 పుట:ముత్యాల సరాలు.pdf/7

ముత్యాలసరములు

|

గుత్తునా ముత్యాలసరములు
కూర్చుకొని తేటైనమాటల,
కొత్తపాతల మేలు కలయిక
క్రొమ్మెరుంగులు జిమ్మగా,

మెచ్చనంటావీవు; నీ విక
మెచ్చకుంటే మించిపొయెను;
కొయ్యబొమ్మలె 'మెచ్చుకళ్ళకు
కోమలులసౌరెక్కునా?

తూర్పు బలబల తెల్ల వారెను, .
తోకచుక్కయు "వేగుచుక్కయు,
ఒడయుడౌ వేవెల్గు కొలువుకు
'నెడలి మెరసిరి మిన్ను వీధిని.

వెలుగునీటను గ్రుంకే చుక్కలు;
చదలచీకటి కదలబారెను;
యెక్కడనొ వోక చెట్టుమాటున
నొక్క కోకిల పలుకసాగెను.

మేలుకొలుపులు కోడికూసెను,
విరులు కన్నులు విచ్చిచూసెను;
ఉండి, ఉడిగియు, ఆకులాడగ,
కొసరెనోయన గాలివీచెను,

పట్టమున పదినాళులుంటిని
కార్యవశమున పోయి; యచ్చట

సంఘసంస్కరణ ప్రవీణుల
సంగతుల మెలగి,

యిల్లు జేరితి నాటి వేకువ;
జేరి, ప్రేయసి నిదుర లేపితి;
"కంటి వే" నేనంటే, “మింటను
కాము బాణం బమరియున్నది.”

తెలిసి, దిగ్గున లేచి, ప్రేయసి
నన్ను గానక, మిన్ను గానక,
కురులు, సరులును కుదురు జేయుచు
ఓర మోమిడ, బల్కితిన్,

“ధూమ కేతువు కేతువనియో
మోముచందురు డలిగిచూడడు!
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా!

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా.

అంతేకాని రవంతయైనను
వంత నేగతి కూర్చ నేర్చునె ,
నలువ నేరిమి కంతుయిదియన
నింగితోడవయి వ్రేలుచున్.

కవుల కల్పన కలిమి నెన్నో
వన్నె చిన్నెలు గాంచు వస్తువు
లందు వెఱ్ఱి పురాణగాథలు
నమ్మ జెల్లునె పండితుల్.

కన్ను కానని వస్తుతత్వము
కాంచనేర్పరు లింగిరీజులు;
కల్లనొల్లరు;వారి విద్యల
కరచి సత్యము నరసితిన్.

దూరబంధువు యితడు భూమికి,
దారిబోవుచు చూడవచ్చెను
డెబ్భదెనుబది యేండ్ల కొక తరి
నరుల కన్నుల పండువై.

తెగులు కిరవని కతల పన్నుచు
దిగులుజెందు టదేటికార్యము?
తలతు నేనిది సంఘ సంస్కర
ణ ప్రయాణ పతాకగాన్.

చూడు మునుమును మేటి వారల
మాటలనియెడి మంత్ర మహిమను,
జాతిబంధము లన్న గొలుసులు
జారి సంపద లుబ్బెడున్.

ఎల్ల కోకము వొక్కయిల్లై
వర్ణ భేదము లెల్ల కల్లై,

వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ.

మతములన్నియు మాసి పోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్.

మొన్న పట్టణమందు ప్రాజ్ఞులు
మొట్టమొదటిది మెట్టు యిదియని,
పెట్టినా రొక విందు, జాతుల
జేర్చి;వినవైతో?"

అంటి నే నిట్లంత ప్రియసఖి
యేమి పలకక యుండి యొక తరి,
పిదప కన్నుల నీరు కారుచు
పలికె నీరీతిన్.

"వింటి మీ పోకిళ్ళు వింటిని,
కంట నిద్దుర కానకుంటిని
యీ చిన్న మనసును చిన్న బుచ్చుట
యెన్నికని యోచించిరో?

తోటి కోడలు దెప్పె; పోనీ;
సాటివా రోదార్చె; పోనీ;
మాటలాడక చూచి నవ్వెడి
మగువకే మందున్.

తోడుదొంగని అత్తగారికి
తోచెనేమో యనుచు గుందితి;
కాలగతియని మామలెంతో
కలగ సిగ్గరినై.

చాలునహ! మీ చాకచక్యము.
చదువు కిదె కాబోలు ఫలితము!
ఇంతయగునని పెద్ద లెరిగిన
యింగిలీషులు చెపుదురా?

కోటపేటలు నేల గలరని
కోటివిద్యలు మీకు గరిపిరి;
పొట్టకూటికి నేర్చువిద్యలు
పుట్టకీట్లు కదల్చెనా?

కట్టుకున్నది యేమి కానీ;
పెట్టిపొయ్యక పోతెపోనీ;
కాంచిపెంచిన తల్లిదండ్రుల
నైన కనవలదో?

కలసి మెసగిన యంతమాత్రనె
కలుగబో దీయైకమత్యము;
మాలమాదిగ కన్నె నెవతెనొ
మరులుకొనరాదో?"

అనుచు కోపము నాపజాలక
జీవితేశ్వరి సరుల నామై

చరచి చనె క్రొమ్మెరుగు చాడ్పున
మనసు వికలముగాన్.

తూర్పు బల్లున తెల్లవారెను;
తోకచుక్క యద్రుశ్యమాయెను
లోకమందలి మంచి చెడ్డలు
లోకు లెరుగుదురా?