ముక్కు పచ్చలారని
స్వరూపం
రాగం యదుకుల కాంభోజి - త్రిపుట తాళం
[మార్చు]
పల్లవి:
ముక్కు పచ్చలారని చిన్నదాన నన్నెక్కడ కంపదరే
సిగ్గాయె నన్నెక్కద కంపెదరే ||
అనుపల్లవి:
నిక్కము రేయెల్ల నిదుర బోయెదనమ్మా
తక్కిన పనులేమి నేనెరుగ నో యమ్మా ||
చరణం 1:
వంచిన నాచేయి మంచి గంధము లోన
ముంచి ఎత్తెదరేలనే సిగ్గాయె నన్నెక్కడి కంపెదరే
మంచిదే లేరమ్మ మగవారి చేయి పట్టు
మంచు దెల్పెదరు నాకలవాటు లేదమ్మా ||
చరణం 2:
అందగాని నోటి కందీయమని అందముగా సున్నమాకీనె దీసి
నేనంట రాయ నేరనే
అందగాని నోటి కందీయ మనియెద
రిందరిలో మనసెట్టులొప్పు నోయమ్మా ||
చరణం 3:
ఈపనులాపనులేల చెప్పుదురు నే
నే పని కోపలేనే
ప్రాపై దాసు శ్రీ రాము నేలిన వేణు
గోపాల దేవుని గూడి యుండెద నమ్మా ||