ముకుందవిలాసము/బంధములు

వికీసోర్స్ నుండి

శేషబంధము




కందద్వయగర్భిత చంపకమాలిక

అతివిమలా యనంతసుకరా కమనీయ యశోవిహార క
ల్పిత సుమహారరీతిక నవీనమిలజ్జయతావధాని నం
ద్యతరవిభాతమాతత సదాసవవద్వరధామ జాలసం
గత నవనాయజాతవరగౌరవరక్షిత సోమభూవరా!(1.291)

శైలబంధము



క. శ్రీశా గరుడాంచద్వా
   హా శివసఖలలితశీలి యాదృతకేళీ
   దాశరథి కనకరశన ద
   యాశరధి శ్రితాంబుజభవ యంచితవిభవా!

చక్రబంధము



శా. సత్యోపేత సుకేళి సోత్కర శమీసంవిద్విచార ప్రధీ
నిత్యోదంచిత శర్మమందిర సుపాణీనుత్యభా కృష్టమా
సత్యానాథనవస్వభూతి రసలక్ష్యాతీర్థ రీతీఖనీ
నీత్యుల్లాస విధాని తల్పసమకంధీ వశ్యమాభామినీ(2 - 279)

పుష్పగుచ్ఛబంధము










నరాదరా! సురావనా! సనాతనా! ఘనాకృతీ!
పరావరా! కరాహృతా భపాదపా! కృపామతీ!
ధరామరాత్మ రాజితా! సదాప్రదా! చిదాదృతీ!
స్మరాభిరామ! రాధికాసమాగమా! రమాపతీ!1-295

ఛత్రబంధము






దారవతనువభ జయజయ
సారశమ సమగ్రమహిమ శరహాసరసా
సారసహార సుకరభా
భారక సురసాయ జయజ భవనుతవరదా!2-280

గోమూత్రికాబంధము



'శ్రీరమారసాత్యగత్య సేవ్యభావ్యలక్షణా
సారదీప్త సారసాప్త సారసారి వీక్షణా
ధీరవారనుత్యసత్య దివ్యభవ్య రక్షణా
వైరదృప్త వీరగుప్త వారణారి రక్షణా.2-281


సర్వతోభద్రబంధము





రమావాససవామార
మావతారరతావమా
వాతాదసాసాదతావా
సరసాననసారస.3-319