మారిషస్‌లో తెలుగు తేజం/కృతజ్ఞతలు
Jump to navigation
Jump to search
కృతజ్ఞతలు
"మారిషస్‌లో తెలుగుతేజం" గ్రంథాన్ని చదవి ఆశీస్సులు అందించి, ప్రోత్సహించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సేవా పరాయణులు శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్యగారికి, మలేసియా ఆంధ్ర సంఘ వ్యవస్థాపకులు, తెలుగు భాషా సేవకులు శ్రీ మదిని సోమనాయ్డుగారికి - గ్రంథరచనలో నాకు తగు సలహాలిస్తూ అండదండగా నిలిచిన ప్రియమిత్రులు, నవలారచయిత శ్రీ జి.యన్. సూరిగారికి- గ్రంథముద్రణ వ్యవహారాన్నంతా తన భుజస్కంధాలపై వేసుకుని, అందంగా తీర్చిదిద్దిన "ప్రింటిక" అధినేత, మిత్రులు శ్రీ సి.హెచ్. రమేష్ గారికి ఇంకా... నాకు అనేక విధాలుగా నహకారాన్నందించిన మా బాబాయి శ్రీ మండలి దామోదర రావుగారికి సోదరులు శ్రీ మండలి భాస్కరరావుగారికి పెద్దలు శ్రీ బుడ్డిగసుబ్బరాయన్ గారికి ఇంకా..
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
మండలి బుద్ద ప్రసాద్