మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము/అవతారిక

వికీసోర్స్ నుండి

అవతారిక.


1917 వ సంవత్సరమున జనేవరి 20వ తేదీనాడు మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ వార్షికోత్సవ సందర్భమున, కాకినాడ బ్రాహ్మ సమాజమునందు, ఉపాసనానంతరమున వేంకటరత్నమునాయుడు గారు ధర్మ ప్రసంగము కావించిరి. ప్రసంగవిషయము మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ జీవితము!. బోధించినది వేంకటకత్నము నాయుడుగారు! వినలేని బధిరులును, గ్రహింపలేని దీనులును ఉండరుగదా! నాడా ప్రసంగము నాలకించు భాగ్యము నాకు లభించెరు. త్వరలోనే మహర్షి స్వీయచారిత్రమును పఠించి, అత్యంత ఉత్సాహమును జెంది, నా ఆధ్యాత్మికా భావమును, పాండిత్యరాహిత్యమును సహితము గమనింపక గ్రంధము నాంధ్రీకరించుటకు పూనుకొంటిని. నాడు నాయుడుగారు చెప్పిన కథ యీ సందర్భమున స్మరణకు వచ్చుచున్నది. నాయుడుగారు కళాశాలయందు బాలురకు షేక్స్పియర్ మహాకవి నాటకమునకు వ్యాఖ్యానము గావించుచుండగా నేడేండ్లబుడుత డొకడు వచ్చి, కొండొక తడవు బాలురతో గూర్చుండి, యింటికిపోయి, తండ్రితో, నాయుడుగారి షేక్స్పియర్ పాఠమును వింటిన'ని చెప్పెను. మహర్షి స్వీయచారిత్రమును బంగాళీ భాషనుండి శ్రీయుత సత్యేందనాధ ఠాకూర్ , శ్రీమతి ఇందిరాదేవి వంటివారలు భాషాంతరీకరించి ఆంగ్లభాషా ప్రపంచమున కర్పించి యుండగా, ఆంధ్ర ప్రపంచమున కాగ్రంథము నర్పించుటకు తగుదునని నేనును వచ్చితిని.

మహర్షి దేవేంద్రనాధ రాకూర్ జీవిత రహస్యమును సంపూర్ణముగ గ్రహించితినని ఎంతమాత్రము జెప్పసాహసింపనుకాని, నాడు నాయుడుగారొసంగిన ధర్మప్రసంగ దీపికాసహాయ్యమున, నాహ్రస్వదృష్టికింగూడ ఆజీవితమూలసూత్రము లొకింత గోచరములయ్యెనని తోచెను. ఒకనాటిరాత్రి యిట్లు కల గాంచితిని. మా ఘోత్సవమున పాల్గొనుటకు కలకత్తాకు దూత జేసి తినట. కలకత్తా చేరగానే యొక దివ్యమందిరమును జూచితిని. 'వెలుపలకువచ్చుచున్న యొక పెద్ద మనుష్య నుద్దేశించి, “అయ్యా, ఈ రాజభవనమున కధిపతియైన మహా రా ఔన్వర”ని ప్రశ్నించితిని, మహ: దే మేడనాధఠాకూర్ అని ఆయన ప్రత్యుత్తరమిచ్చెను. “ ఆయనను దర్శింపవలెనని యున్నది, లోనికి దారియెట్లు ? " అని అడిగితిని. సింహ ద్వారమువక దారిజూపెను, పోయిచూడ సి)హ ద్వారలలాట భాగమున " ఈశావాశ్యమిదంసర్వం” అని స్వర్ణాక్షరములలో వాయబడి యుండెను.

మహనీ జీవితమును గురించి ఈయవ తారికలో నేను ప్రసంగింప యత్నించుట కేవలము సాహ సము. జీవితమునకు పీఠిక మెకటి ఆంగ్ల గంధమునందలి F.V1 71 | 17tlerhill'i Int "ot11ction వంటి దేవ్యరైననువ్రాసియిచ్చి నాకు తోడ్సడుదు రేమోయని యాశించి విఫలమనోరధుడనైతీని. కీర్తిశేషుడును, చిరస్మరణీయుడును, నాక త్యంత పూజనీయుడు నైన నా జ్యేషసోదరుకు దినాన్ మొక్కపాటి సుబ్బారాయుడు గారిని ఈ గంధమున కుపోద్గాతమును వ్రాసి నాదుర్బల ప్రయత్నమును పవిత్రషరుపుమని వేడితిని; గాని అంతకుముందే అల్పప్రాయముననే తనబుద్ధి విశేషముచే నవేకుల కాశ్చర్యము కలిగించిన ఆయన ప్రధమ పుత్రికారత్నము, మాగృహలక్ష్మియగు మహలక్ష్మి వ్యాధిగ్రస్తయై, "గజేంద్రు'ని 'మొసలి పట్టుకున్నట్లే నన్నీవ్యాధి పట్టుకున్నది. గజేంద్రుని రక్షించిన వైవమే నాకును మోక్షము నిచ్చు”ననుచు మమ్ములను వదలి పరలోకమునకు పోయియుండుటటచే విషణ్ణమనస్కుడై, “ మహ లక్ష్మి మరణముతో నా జీవితములో " ని యుత్సాహమంతయు నంతరించెను. గ్రంధరచనకిప్పుడుద్యక్షుడను కాజాల”నని ఆయన నాకు ప్రత్యుత్తర మిచ్చెను. భాషాంతరీకరణమును సాధ్యమైనంతవరకు బంగాళీ గ్రంధమునకు సరిగా నుండునట్లు జేసితిని. వీలుపడినంతవరకు మహర్షి వాక్యములనే ప్రయోగించితిని. కావున ఇందలి శైలి సామాన్యరచనకు కటువుగను, అచ్చటచ్చట వెగటుగను కూడ తోచవచ్చును. వ్యాకరణము నందు ప్రవేశమించుకయు నాకు లేదు. వ్యాకరణ దోషములను, తప్పుడు సమాసములను సవరించుట కేపండితుల సహాయ్యమును నేను కోర లేదు. ముద్రాలయము కాకినాడయందును, నాయునికి రాజుమహేందవరమందును అగుటచే అచ్చు ప్రతులను విశేషశ్రద్దతో సరిచూచుట కవకాశము లేకుండెను.

విశేషముశ్రమనంది వాతప్రతులను, అచ్చుప్రతులను సరిచూచి, అత్యంత ఉత్సాహముతో గ్రంధ ప్రచురణమందు తోడ్పడి, గ్రంధమునకు ప్రాణముపోసి రూపము తెచ్చిన నామిత్రుడు శ్రీయుత గాడేపల్లి సూర్యప్రకాశ రావు ఎం.ఏ., ఎల్.టి., గారికి నా హృదయ పూర్వక వందనము లర్పించుచున్నాడను. గంధమునందలి తప్పులు నావిగను, ఒప్పులాయనవిగను పొఠకులు గ్రహింతురుగాక.

గంధమును ముద్రించుటకు నాకు ధన సహాయము జేసిన మిత్రులందరకును కృతజ్ఞుడను. శ్రీయుత దర్భా శివరామరాస్ బి.యె., బి. యల్, గారును, శ్రీయుత పి. బసవరాజు బి. యే. బి.యల్ . గారును, చెరి యొక ఏబదిరూపాయలనిచ్చి నాకత్యంత సహాయ మొనర్చి నందుకు వారికి శాశ్వత కృతజ్ఞుడను.

గ్రంధమును నామనసువచ్చినరీతిని అచిర కాలముననే ముద్రించి యిచ్చిన Scape & Co., వారికిని వందనములు.

రాజమండ్రి, , 29-9-1922.

మొక్కపాటి రామమూర్తి.