మనసిచ్చి నాతో
Appearance
బేహాగ్ రాగం- ఆది తాళం
[మార్చు]
పల్లవి:
మనసిచ్చి నాతో మాటాడవేమిరా ||
చరణం 1:
మనవి వినరాదా మమతింతలేదా
మునుపటి చెలిమి కాదా మోదము కాదా ||
చరణం 2:
విను నేను బాలా విడనాడ మేలా
చనువుంచు మీ చాల జాలమిదేల ||
చరణం 3:
వర దాసు శ్రీరామా వన సుగుణ ధామా
శరణు నన్నేలు ప్రేమ శ్యామాభిరామా ||