Jump to content

మతము - పథము/బోధలు

వికీసోర్స్ నుండి

త్రైత సిద్ధాంతమును తెల్పు

ఇందూ జ్ఞానవేదిక బోధలు చదవండి !!!

1. విశ్వవ్యాప్తముగా అందరిలో ఉన్నది ‘‘త్రైతము’’ అని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

2. విశ్వవ్యాప్తిగనున్న అన్ని మతములలో ఇందూమతము కలదని చెప్పునది ఇందూ జ్ఞానవేదిక.

3. ఏ మతములోని వారికైనా మత సామరస్యము కలగాలంటే దేవుని జ్ఞానము తెలియాలంటున్నది ఇందూ జ్ఞానవేదిక.

4. అన్ని మతములను సామరస్యముగా బోధించునది ఇందూ జ్ఞానవేదిక.

5. అన్ని మతముల సారాంశము కల్గియున్నది ఇందూ జ్ఞానవేదిక.

6. మంత్రములు, జపములు, ఉపవాసములు, ధ్యానములతో సంబంధము లేకుండ ఇంద్రియాతీత జ్ఞానమును బోధించునది ఇందూజ్ఞానవేదిక.

7. నీవు నీ మతములో స్వచ్ఛమైన జ్ఞానివి కావాలని కోరుకునేది ఇందూ జ్ఞానవేదిక.

8. మనుజుల మతాలకతీతమైన జ్ఞానమును తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

9. జీవునికంటే పెద్దది మరియు దేవునికంటే చిన్నది మరొకటి గలదు. అదేదో తెలుపునది ఇందూ జ్ఞానవేదిక.

10. హిందూ మతముకంటే అతీతమైన ఇందూమతమును గురించి చెప్పి అన్ని మతములవారిచేత నేను ఇందువునని (జ్ఞానినని) చెప్పించునది ఇందూ జ్ఞానవేదిక. 11. జ్ఞాన విషయము తెలుసుకొంటే ప్రతి ఒక్కరు నేను ఇందువు కావలెనని ఆత్రుత పడులాగున చేయునది ఇందూ జ్ఞానవేదిక.

12. మాయ (సాతాన్‌) లేక సైతాన్‌ను మరియు దేవుడు అను ఇద్దరిని మాత్రమే తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

13. భగవద్గీత, ఖుర్‌ఆన్‌, బైబిల్‌ యొక్క సారాంశము తెలిసి ఆచరించునది ఇందూ జ్ఞానవేదిక.

14. దేవున్ని తప్ప ఇతర మాయను ఆరాధించవద్దని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

15. దేవుని జ్ఞానము అర్థము కాకపోవడమే భూమిమీద అన్ని అనర్థములకు కారణమని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

16. హింసతో ఏ మతమునూ, ఏ మనిషినీ మార్చలేమనీ, దేవుని జ్ఞానముతో ఎవరినైనా మార్చవచ్చనీ తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

17. జ్ఞానము తెలిసేంతవరకు ఏ మతమునకు సంబంధించినదో ఎవరికీ అర్థముకానిది ఇందూ జ్ఞానవేదిక.

18.అణగారిపోయిన ఆచారములకు, సాంప్రదాయములకు అర్థములను తెలియజేయునది ఇందూ జ్ఞానవేదిక.

19. భగవద్గీత శ్లోకాలకు, పరిశుద్ధ గ్రంథము యొక్క వాక్యములకు, పవిత్ర గ్రంథము యొక్క సూత్రములకు సారాంశమైన దేవున్ని మాత్రము తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

20.దేవుని జ్ఞానమను ఆయుధముతో దేవుని సైనికునిగా మారి ప్రక్కదారి పట్టిస్తున్న మాయ లేక సాతాన్‌ మీద పవిత్ర యుద్ధము చేయాలి కానీ సాటి మనుషుల మీద కాదని తెలియజేయునది ఇందూ జ్ఞానవేదిక. 21.శాస్త్రీయతను, అశాస్త్రీయతను తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

22. గీతాశాస్త్ర ఆధారముతో ఆస్తికుల, నాస్తికుల వాస్తవమును తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

23. జ్యోతిష్యము శాస్త్రమని, వాస్తు శాస్త్రము కాదని వివరించి చెప్పునది ఇందూ జ్ఞానవేదిక.

24.యజ్ఞయాగాదులు, వ్రతక్రతువులు, వేదాధ్యయనములు, తపస్సులు దైవసమ్మతముకాదని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

25.నమ్మకము, మూఢనమ్మకము కావచ్చు జాగ్రత్తగా పరిశీలించమని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

26. మూఢనమ్మకములలో మూఢత్వమును వివరించి ఖండించునది ఇందూ జ్ఞానవేదిక.

27.నాలుగు కులములు లేవని, నాలుగు పద్ధతులు గలవని కులరహితమును తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

28. మతములు మనుషుల సృష్ఠియేనని, దేవునికి మతములు లేవని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

29. దేవుడు ఒక్కడేననీ, అందరికంటే పెద్దయనీ చెప్పువారు, మా మతమని, మా దేవుడని చెప్పడము తప్పుకాదా? అని విమర్శించునది ఇందూ జ్ఞానవేదిక.

30.మనుషులందరికీ దేవుడు ఒక్కడే, దైవ జ్ఞానము ఒక్కటేనని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

31.జ్ఞానమును విజ్ఞానసహితముగా వివరించి చెప్పునది ఇందూ జ్ఞానవేదిక.

32.ప్రజలకు మహత్యములు అనవసరమని, జ్ఞానము అవసరమని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

33.శాస్త్రబద్దముగాని రామాయణమును, హేతుబద్దముగాని భాగవతమును వదలి శాస్త్రబద్దత, హేతుబద్దత కల్గిన గీతను చూడమంటున్నది ఇందూ జ్ఞానవేదిక.

34. హేతువులేని హేతువాదులను, ఆస్తికత్వములేని ఆస్తికులను విమర్శించునది ఇందూ జ్ఞానవేదిక.

35.భగవంతునికీ, పరమాత్మకూ, దేవునికీ విడివిడిగా నిర్వచనము తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

36. జ్యోతిష్యములోని జ్యోతిని, మూలికలలోని మూలమును, జ్ఞానములోని శక్తిని, మంత్రములోని మహిమను తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

37.టక్కు, టమారా అంటే ఏమిటో, ఇంద్రజాల మహేంద్రజాలమంటే ఏమిటో, గోకర్ణ గజకర్ణ విద్యలంటే ఏమిటో విడివిడిగా వివరించి తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

38. ప్రభువు దేవుడు, శిలువ మాయ అని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక. 39. మతములలోని విధానమును, సిద్ధాంతములలోని సారమును, శాస్త్రములోని శాస్త్రీయతను వెతికి, ఉంటే చూపునది లేకుంటే ప్రశ్నించునది ఇందూ జ్ఞానవేదిక.

40. మనిషి ఒక్కడే, దేవుడు ఒక్కడే అయినపుడు ఇన్ని మతములు, ఇందరు దేవుళ్ళు ఎందుకని ప్రశ్నించునది ఇందూ జ్ఞానవేదిక.

41. మనుషులనుండి ‘మహాత్ముడు’, చెట్లనుండి ‘బదనిక’ బయటికి వచ్చునట్లు, అజ్ఞానులనుండియే ‘జ్ఞాని’ పుట్టగలడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

42.చెట్టుమీద తీగను భూమిలోని గడ్డ (దుంప)కనిపించు ఏ సంబంధము లేకుండ ఆధారమైనట్లు, భూమి మీద మనిషికి శూన్యములోని దేవుడు కనిపించని ఆధారమై ఉన్నాడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

43.వేరు మతములలోని అపార్థములకు నిజార్థమునిచ్చి జ్ఞానబోధ చేయునది ఇందూ జ్ఞానవేదిక.

44.ఐదున్నొకటి అయిన ఆరు శాస్త్రములలోని శాస్త్రబద్ధతను చూపించునది ఇందూ జ్ఞానవేదిక.

45.శాస్త్రముకాని విషయములు శాస్త్రములో కలిసియున్ననూ, వాటిని తీసివేసి శాస్త్రమునకు స్వచ్ఛతను చేకూర్చునది ఇందూ జ్ఞానవేదిక.

46.శాస్త్రమును గుర్తించలేక అశాస్త్రీయమనువారికి కళ్ళు తెరిపించి శాస్త్రములోని శాస్త్రీయతను తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

47.అజ్ఞానములోని అంధకారమును, జ్ఞానములోని ప్రకాశమును, విజ్ఞానములోని అనుభవమును వివరించి తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

48.సత్యమును ప్రకటించడము, అసత్యమును ఖండించడమును ముఖ్యకార్యముగా పెట్టుకొన్నది ఇందూ జ్ఞానవేదిక.

49. పూర్వమునుండి ఇపుడు లేకుండా పోయిన విజ్ఞానమును వివరించి తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

50.శరీరమునందు పిట్యూటరీ గ్లాండ్‌, మిగతా ఆరు గ్రంథులకు రాజైనట్లు, విశ్వమునందు బ్రహ్మవిద్యాశాస్త్రము మిగతా ఐదు శాస్త్రములకు రాజుగానున్నదని తెలుపునది ఇందూ జ్ఞానవేదిక.

51.ఆస్తికవాదులకు, నాస్తికవాదులకు హేతువాదులకు మొదలగు ఎవరికీ తెలియనివాడు దేవుడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.

52.టెలివిజన్‌ను కనిపించు ఏ సంబంధము లేకుండా చేతిలో రిమోట్‌ నడిపించినట్లు, చెట్టుమీద తీగను కనిపించు ఏ సంబంధము లేకుండా భూమిలోని గడ్డ (దుంప) పెంచునట్లు, మనిషిని కనిపించు ఏ సంబంధము లేకుండా శూన్యములోని దేవుడు పోషించుచున్నాడని తెల్పునది ఇందూ జ్ఞానవేదిక.