మణి మాలికలు/రాంకిషన్‌ గొల్లపెల్లి

వికీసోర్స్ నుండి

రాంకిషన్‌ గొల్లపెల్లి 10-140, గోదావరి రోడ్‌, ఓం శ్రీసాయి జ్యోతిష్య విధ్యాపీఠం, ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా. కలం పేరు: రాఖీ వృత్తి: సీనియర్‌ మేనేజర్‌ (డెక్కన్‌ గ్రామీణ బ్యాంకు) మొబైల్‌ నెం: 9849693324 ఈ-మెయిల్‌: rakigita9@gmail,com బ్లాగర్: raki9-4U.blogpost.in

రాఖీ పుష్యరాగాలు... 1.

రెండు కణాలు సంకలిస్తే జననం ఒకక్షణం ఫఠేల్మని పగిలితే మరణం

2.

మతి శ్రీమతి పరంబైనపుడు మతి మరపు...పునóపునరుక్తంబగు

3.

వెన్నెల రుచి తెలిసిందోచ్‌ నిను ముద్ధు పెట్టుకున్నాక

4.

రాయబారమౌ...లేఖ రాయ భారమైంది...ఎద తట్టుకోలేక

5.

మెలకువకి సెలవిక కలలకి అవుతోంది వేకువ కనుక

మణి మాలికలు జ రాంకిషన్‌ గొల్లపెల్లి

109 110

6.

ఆశనేరవేరితే...కల 'వరం' ఆశ చేజారితే...'కలవరం'

7.

చెలి వరమిస్తే కల వరం..కరమిస్తే...కలవరం

8.

బాధల్లారా...కాస్త ఓపిక పట్టండర్రా ఆమాత్రం కన్నీరుంటే..ఆనందంగా ఏడవనూ

9.

ఘల్లుఘల్లున మ్రోగుతా నాగుండెని తగిలించుకో నీ తాళంగుత్తికి.

10.

మరణం అంటే నీకు నువ్వు లేకపోవడం కాదు ఈ ప్రపంచానికి నువ్వులేకపోవడం ..చిత్రం కదూ

11.

ఎదురుపడితే ఏమో గాని పరోక్షంలో.. ప్రతిక్షణం నీదే

12.

నీ చూపు గీస్తోంది ...చిత్రాలు మత్తుగా నీ నవ్వు చేస్తోంది చిత్రాలు గమ్మత్తుగా

13.

గుచ్చితేనేమి..గుండెలో సూది చేరుకుంది మల్లి నీ వాలు జడ కౌగిలి

14.

రాత్రంతా నిద్ర లేదు ప్చ్‌..!ప్రేమ విఫలమై...కాదు..దోమ సఫలమై

15.

హెర్క్యులాస్‌ భూమిని ఎత్తాడేమో వాలిపోయే రెప్పలని ఎత్తగలడా

మణి మాలికలు * రాంకిషన్‌ గొల్లపెల్లి 16.

నువ్వతికించే..ఉత్తరానికెంత అదృష్టమో నీ లాలాజలామృత రుచినెరిగింది

17.

నీ హృదాయం కృష్ణ బిలం ఒక్కసారి పడ్డమా..అస్తిత్వం మటుమాయం

18.

నీ పాదా మంజీర నాదాం కన్నా ముందుగానే ఓహ్‌ ...గుభాళించే నీ పరిమళం నన్ను చేరుతుంది

19.

నిప్పూ నీరూ ఒకటె కడుపుమంటే...కింవరదా...కదా

20.

ఏమీ లేని బికారినయ్యాను స్నేహమంతా మీకే పంచేసి

21.

నడయాడే పూదోట మావిడ నాసిక, నవ్వులు, పెదాలు, బుగ్గలు, కన్నులు, పూలే

22.

భాష చెప్పలేని భావం ఒక స్పర్శ తెలుపుతుంది

23.

చంద్రుడికి వేరేపనేం లేదు భూమిచుట్టూ చక్కర్లు కొడ్తూ, వెన్నెల తాయిలం పెడ్తూ

24.

తెలుసుకుంటే సర్వం బ్రహ్మ తెలియకుంటే సకలం భ్రమ

25.

ఊరంతా క్షామం మాచెరువు మాత్రం నిండింది..నాకన్నీటితో

మణి మాలికలు * రాంకిషన్‌ గొల్లపెల్లి

111 112

26.నీ పెదాల మధురిమ

ఏ పదాలకూ..అందదు.ఒక్క..నాపెదాలకు తప్ప

27.చెప్పలేని భావాలు త్రుప్పు పడుతున్నాయి

అప్పుడప్పుడూ ఆకురాయి పట్టాలి కలంతో

28.రోజొక యుద్ధం

మాటలతో...మౌనంతో...తనువులతో...తడికలతో

29.తోలుకప్పిన ఆస్థిపంజరం మనిషి,

మనసూ మానవతా మృగ్యమైతే

30.రోజూ మాకు గృహప్రవేశమే

నిత్యం పాలు పొంగి నేలపాలు ఔతూనే ఉంటాయి

31.రాలాయి దార్లో పారిజాతాలు నీ పాదాల క్రిందా నలిగినా జన్మకు చాలని

32.అలదీ చెలిదీ ఒకటే వైనం

దాగ్గరికెళ్తే దూరం వెనుదిరిగితే తీరం

33.పండింది గోరింట కాదు

ఇందాక సిగ్గుతో అరచేతుల ముఖం దాచిన ఫలితం

34.మల్లె గొల్లుమంది

నువ్‌ తనతో తూచుకొన్నాక... బరువయ్యానని

35నువ్వు నవ్వితే అమృత మథనమే

హాలహలం తప్ప అన్నీ పుడతాయి

మణి మాలికలు * రాంకిషన్‌ గొల్లపెల్లి