మణి మాలికలు/రాజేష్‌ యాళ్ల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Manimalikalu.pdf

రాజేష్‌ యాళ్ల హౌస్‌ నెం. 38-31-150/1, గ్రీన్‌ గార్డెన్స్‌, మర్రిపాలెం, విశాఖపట్నం - 530018 వృత్తి: బ్యాంకు కేషియర్‌ (IOB) మొబైల్‌ నెం: 9700467675 ఈ-మెయిల్‌: rakeshyalla@gjmail.com

మాలికా ' రాజ'తరంగిణి... 1.

మన పెళ్ళి రోజే అసూయ పడ్డ నీ బుగ్గను ముందే ముద్దాడిన దిష్టిచుక్కపై

2.

రెక్కలు వచ్చి పిల్లలెక్కడికో రెక్కలుడిగి... కళ్ళుకాయలై... అమ్మానాన్నా

3.

చాప కింద నీరులా ముదిమి వెలిసే హరివింకి రంగులెలా వేసేది?

4.

సమసమాజాన్నినిర్మిద్దాం మన కులంవాళ్ళు ముందుకు రండి

5.

పొద్దుటే విప్పారుస్తుంది ముఖం

నిన్ను చూడగానే అద్దం

మణి మాలికలు : రాజేష్‌ యాళ్ళ

97 98

6.

ఎకరాలు గజాలు ఐపోతున్నాయ్‌ ఆరాటమేల? ఆరడుగులేగా చివరకు!

7.

హృదయ కవాటం తెరిస్తే కనులు రెండూ జలాశయాలే

8.

నాదిష్టే పడేలా ఉంది నీపై బుగ్గపై చుక్క పెట్టనా పెదవులతో?

9.

సూరీడులా ఆమె ప్రొద్ధుతిరుగుడుపువ్వుల్లా కుర్రకారు

10.

చితే చల్లన చితికిన మనసుకన్న

11.

వేడని శిలకు నైవేద్యం వేడుతున్నబిచ్చగాడికి పూజ్యం

12.

అమావాస్య రోజూ వెన్నెల చెలిజాబిలి జ్ఞాపకాలు పరుస్తూ

13.

చెలి నీడ జాడైనా లేదు పిచ్చి కాకపోతే వెన్నెలకు నీడెంటి?

14.

ఆకాశపు దారాలతో నీలంచీర నేసినట్టుగా చినుకులలో సముద్రం

15.

నేనెన్ని లెక్కలు రాసినా నీ లెక్క ముందే రాసి పెట్టేసావుగా విధీ?

మణి మాలికలు :: రాజేష్‌ యాళ్ళ 16.

ముంగురుల కాపలా నీమోవి చెంతకు నేను రాకుండ

17.

కాసేపు ఉండనీ... కన్నీటి తటాకంలో... బాధలకు సేదా

18.

కోమలి కోపం కాసేపైనా కోి రైళ్ళు గుండెల్లో

19.

అసలే అధిక జనాభా అమృతం అందించకు నీనవ్వుల్తో

20.

నాకలానికి ఆకలెక్కువే సిరా తాగేస్తుంది... భావాలు ఒంపదు

21.

ఏడుపెక్కువైపోతోంది..నాకు ఎదిగెదిగిపోతున్నాడు పక్కవాడు

22.

తమకంలో అక్షరాలు తమలో తాము నీవర్ణన చదువుకుంటూ

23.

పెళ్ళికి ముందెన్నిచెప్పావ్‌. బాణాసంచాకు బయల్దేరిన నాన్నలా?

24.

భయపడకు... చావంటే బ్రతుక్కంటే భయంకరమైనది మాత్రం కాదులే

25.

జ్ఞాపకాలను గుచ్చుతోంటే వాలిపోతోంది భారంతో... మస్తిష్కపు దారం

మణి మాలికలు జ రాజేష్‌ యాళ్ళ

99 100

26.

నలుగురక్కల్నిచంపావట నన్నైనా బైటకు రానీ నాన్నా -నీ కూతురు

27.

గుండెనిపుణుడివి నీవు ఎలా చీల్చాలో బాగా తెలుసు

28..

చీకటంటే నచ్చదా? చందామామకు కళ తెచ్చేది తనేగా

29.

నేత్రాల నైజాన్ని నిద్రాపుచ్చావు నిద్రాన్నదే వాికి మరిపించావు

30.

మువ్వలకా అందమెట్ట్గబ్బా? నీ కాలిని చుట్టే కదా

31.

నాకు వ్యాకరణం రాదు కానీ నీవే కర్తా కర్మా క్రియా

32.

దూరంగా నీవు శిశిరంగా నేను

33.

తను ముగ్గేస్తుంది బంగారు కలువల్లోంచి వెండిపొడి రాలుతున్నట్టుగా!

34.

కొత్త అత్తర్లు ఎన్నొచ్చినా తొలకరిలో మట్టివాసన తేలేవుగా

35.

ఇంకొన్ని అక్షరాలు...ఇంకొంచం భాష తెలుగుకి కావాలి...నిన్ను వర్ణించడానికి

మణి మాలికలు జ రాజేష్‌ యాళ్ళ 36.

మల్లెల శరాన్ని విసరకు వాలుజడను మంత్రదండం చేయకు

37.

ష్‌.... మెల్లగా చిరుగాలీ సుమబాలలు గాయపడతాయి పాపం

38.

చెలి ఒడి చిలిపిబడి అమ్మ ఒడి ఆప్యాయతగుడి

39.

భావచిత్రాలు గీసుకోడనికి మరో చోటు లేదా... నాబుగ్గలేనా

40.

మనసద్దం ముక్కలైనా అన్ని ముక్కల్లోనూ ఇంకా నీముఖమే

41.

కోకిల రావడంలేదు కాలుష్యం కారణమనుకున్నా.... నీ మాటలనుకోలేదు

42.

ముత్యాల వ్యాపారులు వరసకట్టారు నవ్వుల్న్ని కాసేపు దాచుకుంటావా

43.

చెరసాలలో చందమామ కొబ్బరాకు కటకాల్లోంచి తొంగి చూస్తుంటే

44.

నువ్వుహత్యలు బాగా చేస్తావ్‌ నవ్వునవ్వుకీ చంపేస్తూనే ఉంటావ్‌

45.

నీ చెలికన్నా మేమే సున్నితమన్నాయి పూలు పోనీలే.. నీ బాటకు నా అరచేతులున్నాయిగా

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ

101 102

46.

శీతాకాలమంటే అసూయ నీ అణువణువునూ గిలి పెడుతోంది.

47.

కుసుమాలన్నీ కోయబోయి. కన్నీటి మంచు చూసి ఆగిపోయా

48.

ఇరుకిల్లన్న బాధలేదు నీ విశాల నయనాలు చాలు.

49.

డబామీద వెన్నెల ముగ్గులు జాబిల్లీ కొబ్బరాకులూ కలిసి

50.

శాశ్వతనేస్థం కన్నీరే ప్రతిసారీ నాకోసం వెచ్చదనం వెచ్చిస్తూ

51.

పసితనపు స్కూలుపెట్టె పరిమళాలను తెచ్చేపెట్టె.

52.

నాలో నేనుగా మొదలయ్యా నీలో నేనుగా మరణిస్తా

53.

నిష్పక్షపాత నయనాలు కలలూ కంటాయి! కన్నీరూ కారుస్తాయి

54.

జాబిల్లిని జత రమ్మంటే ఉరిమి మూసేసింది మబ్బు

55.

సూరీడి తుదిమెరుగులు మబ్బు అంచులకు మెరుపులు పూస్తూ

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ 56.

చెరిగితే ఒట్టు గుండెలో నీ జ్ఞాపకాల పచ్చబొట్టు

57.

కులాన్నేం అనకు కనిపెట్టిన కుటిలత మనిషిది కదా

58.

ఆకాశంలోనూ షరతులే అందాుకే అన్ని పువ్వు గుర్తులు

59.

జ్ఞాపకాలపూలు దండ చేస్తుంటే వర్తమానపు సూది కసుక్కుమంది.

60.

అడుగులో అడుగయ్యను చేతిలో చెయ్యే బావుంది నీ పక్కన నడుస్తూ

61.

అవినీతి-కులాల మబ్బుల్లో మా ప్రజాస్వామ్యపు చందమామ

62.

పెళ్ళే!! తగలబడుతోంది.. నీవు పేర్చిన ఒంటరితనపు చితిలో

63.

జీవిత శిశిరం వసంతించేలోగా మరణించే ఆలోచన దేనికి?

64.

నీ సాంత్వన సంద్రాం ముందాు నా కన్నీటి అల చిన్నదే.

65.

తులసీదళాల్లా నీ జ్ఞాపకాలు బ్రతుకుభారాన్నిమరింతగా పెంచుతూ

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ

103 104

66.

అమ్మ వదిలిన ప్రతినిధి గోరుముద్దలు గుర్తుతెస్తూ జాబిలమ్మ

67.

సమతూకం అంటే పిడికెడు గుండె, కడలంత దు:ఖమూనా?

68.

రెప్పల రగడతో ఛస్తున్నా నీవెదు రుగా వసేనే తెరు చుకుంటాయట

69.

పెదాల పడవ తపిస్తోంది. అధరాల మధురతీరం చేరాలని

70.

ప్రేమించడం నేర్పినవాడివి విరహా న్నీ నేర్ప లేదేం ?

71.

బాల్యం తలొంచుకుంది... నా పెద్దరికపు చిన్నతనాన్ని చూస్తూ

72.

క్రొంగొత్త రంగులతో మనసు. నీ తలపుల కుంచెతో

73.

చల్లని నీడ కోరుకున్నా మల్లెల మేడనే ఇచ్చావు

74.

అకర్ష ాలు తలొంచుతున్నాయి నిన్ను వర్ణించడానికి వాటికి సిగ్గట

75.

దిష్టి తీయనా నీ అందాల మోముపై పుట్టుమచ్చనై?

మణి మాలికలు జ రాజేష్‌ యాళ్ళ 76.

ఎలా ఉంచుతావ్‌ తాజాగా అహరహం అమృతమయమే అధరాలు

77.

అద్బుతాలు రాస్తోంది నా ఎదకాగితంపై నీ అధరకలం

78.

చాలా మంచివైధ్యుడు పెద్దాస్పత్రిలో కాదు.. సొంతాస్పత్రిలో చూస్తాడు

79.

నీవేనా దొంగిలిసున్నది నిదురంతా నీవై నా నిదురను?

80.

రెప్పల్ని తెరవలేనిక కలలోని నీవు దూరమైపోతే ఎలా?

81.

అబద్ధాల చితిపై బ్రతుకు శవం

82.

నీరదమై కురుస్తావని నేలంతా నేత్రాలుగా చేసికొని నేను

83.

ప్రబంధాలకంది ఉండవు ప్రాచీనకాలంలో పుట్టుంటే

84.

కలల్ని కబ్జా చేస్తూ ఎన్నాళ్ళు? నిజంగా ఎదురు రా.... చూసుకుందాం

85.

అప్పుడూ ఇప్పుడూ ముత్యాలే నవ్వులు కన్నీటిగా మారి

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ

105 106

86.

అలవోకగా నవ్వుతావు అల్లకల్లోలం రేపుతావు

87.

జ్ఞాపకాల చేదుమాత్రలకు వర్తమానపంచదార పూస్తున్నా

88.

మంత్రాలతో బందీనయ్యా నీ పెదవులతో కదా మంత్రించావు

89.

నిలువద్దం నీరసించింది నీ అందాంతో పోటీ పడలేదట

90.

ఇసుకలో గుజ్జెనగూళ్ళు గుండెల్లో గుబులుగూళ్ళు

91.

ఎర్ర గులాబీలా నీ అంగీకారం బుగ్గల్లో పూచాక సంతోషానికి అంతేముంది?

92.

చదువులతల్లికెంత మొక్కినా... అర్థం కానివ్వదు వాళ్ళాయన రాతేంటో!

93.

కాలమే కదా అద్భతమైన వెధ్యుడు

94.

నిన్ను చూసాకే గ్రహించా వెన్నెలనూ పోత పోయొచ్చని

95.

బ్రహకు ముద్దులు పెట్టాలనుంది నిన్ను సృష్టిం చినందుకు కృతజ్నతగా

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ 96.

కలం బానిసైంది.. కాగితపు స్పర్శకి

97.

తన్మయమౌతూ కాగితకన్నె కితకితలు పెడుతున్నది కలంకుర్రాడు మరి

98.

మౌనం రాజ్యమేలితే ఏలనీ చూపుల సామ్రాజ్యాల్లో ఉన్నాంగా

99.

కులుక్కో కుదుపు నీ లోలాకుతో... నా గుండెలో

100. బూచాడని భయపెట్టేది దేవుడే బూచాడై ఎత్తుకుపోయాడు అమ్మని

101. మాఊరు తప్పిపోయింది రచ్చబండ లేదు.... గంగరావీ లేదు

102. నీ మధుర జ్ఞాపకాలకు ముత్యాలు అడ్డుకుంటున్నా కన్నీటితో

103. కూసింత సోటెట్టు సాలు మనసంతా మేడ కట్టేస్తా

104. కవితాపల్లకిని మోస్తూ భావాల బోయీలు

105. అయిష్టంగానే శిశిరమయ్యా వసంతమై వాటేస్తావని

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ

107 106. స్థితప్రజ్ఞతలో మేటి. మనుషుల్ని కలుపుతూ, విడదీస్తూ... రైలు

107. ఓపిక లేని భ్రమరం రాలు పూలకై చూస్తూ

108. తులసి తీర్థంలా. చెలి నవ్వు... చివరి క్షణాల్లో

109. పేదోడు ఆకలి వల్ల దొంగ పెద్దోడు వాళ్ళ వల్ల దొర

110. నా చూపుల గోరింట చెలి చెక్కిళ్ళలో పండుతూ

111. కాలుతున్న భూగోళం పట్టుకోవడానికి ఆకులేవీ?

112. సూర్యుని చెర్నాకోల మేఘాల వృషభాలపై

113. స్రవిస్తున్న శవాన్నయ్యా నీ జ్ఞాపకాలకాకి పొడిచి పొడిచి

114. జాబిల్లిని వీడని తారల్లా చెలి మోమున మొటిమలు

115. శ్రీనాధుని కలంలా నీ వేలికొసలతోనే ఎంత శృంగారమొలికిస్తావు!

108

మణి మాలికలు * రాజేష్‌ యాళ్ళ
Manimalikalu.pdf

రాంకిషన్‌ గొల్లపెల్లి 10-140, గోదావరి రోడ్‌, ఓం శ్రీసాయి జ్యోతిష్య విధ్యాపీఠం, ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా. కలం పేరు: రాఖీ వృత్తి: సీనియర్‌ మేనేజర్‌ (డెక్కన్‌ గ్రామీణ బ్యాంకు) మొబైల్‌ నెం: 9849693324 ఈ-మెయిల్‌: rakigita9@gmail,com బ్లాగర్: raki9-4U.blogpost.in

రాఖీ పుష్యరాగాలు... 1.

రెండు కణాలు సంకలిస్తే జననం ఒకక్షణం ఫఠేల్మని పగిలితే మరణం

2.

మతి శ్రీమతి పరంబైనపుడు మతి మరపు...పునóపునరుక్తంబగు

3.

వెన్నెల రుచి తెలిసిందోచ్‌ నిను ముద్ధు పెట్టుకున్నాక

4.

రాయబారమౌ...లేఖ రాయ భారమైంది...ఎద తట్టుకోలేక

5.

మెలకువకి సెలవిక కలలకి అవుతోంది వేకువ కనుక

మణి మాలికలు జ రాంకిషన్‌ గొల్లపెల్లి

109 110

6.

ఆశనేరవేరితే...కల 'వరం' ఆశ చేజారితే...'కలవరం'

7.

చెలి వరమిస్తే కల వరం..కరమిస్తే...కలవరం

8.

బాధల్లారా...కాస్త ఓపిక పట్టండర్రా ఆమాత్రం కన్నీరుంటే..ఆనందంగా ఏడవనూ

9.

ఘల్లుఘల్లున మ్రోగుతా నాగుండెని తగిలించుకో నీ తాళంగుత్తికి.

10.

మరణం అంటే నీకు నువ్వు లేకపోవడం కాదు ఈ ప్రపంచానికి నువ్వులేకపోవడం ..చిత్రం కదూ

11.

ఎదురుపడితే ఏమో గాని పరోక్షంలో.. ప్రతిక్షణం నీదే

12.

నీ చూపు గీస్తోంది ...చిత్రాలు మత్తుగా నీ నవ్వు చేస్తోంది చిత్రాలు గమ్మత్తుగా

13.

గుచ్చితేనేమి..గుండెలో సూది చేరుకుంది మల్లి నీ వాలు జడ కౌగిలి

14.

రాత్రంతా నిద్ర లేదు ప్చ్‌..!ప్రేమ విఫలమై...కాదు..దోమ సఫలమై

15.

హెర్క్యులాస్‌ భూమిని ఎత్తాడేమో వాలిపోయే రెప్పలని ఎత్తగలడా

మణి మాలికలు * రాంకిషన్‌ గొల్లపెల్లి 16.

నువ్వతికించే..ఉత్తరానికెంత అదృష్టమో నీ లాలాజలామృత రుచినెరిగింది

17.

నీ హృదాయం కృష్ణ బిలం ఒక్కసారి పడ్డమా..అస్తిత్వం మటుమాయం

18.

నీ పాదా మంజీర నాదాం కన్నా ముందుగానే ఓహ్‌ ...గుభాళించే నీ పరిమళం నన్ను చేరుతుంది

19.

నిప్పూ నీరూ ఒకటె కడుపుమంటే...కింవరదా...కదా

20.

ఏమీ లేని బికారినయ్యాను స్నేహమంతా మీకే పంచేసి

21.

నడయాడే పూదోట మావిడ నాసిక, నవ్వులు, పెదాలు, బుగ్గలు, కన్నులు, పూలే

22.

భాష చెప్పలేని భావం ఒక స్పర్శ తెలుపుతుంది

23.

చంద్రుడికి వేరేపనేం లేదు భూమిచుట్టూ చక్కర్లు కొడ్తూ, వెన్నెల తాయిలం పెడ్తూ

24.

తెలుసుకుంటే సర్వం బ్రహ్మ తెలియకుంటే సకలం భ్రమ

25.

ఊరంతా క్షామం మాచెరువు మాత్రం నిండింది..నాకన్నీటితో

మణి మాలికలు * రాంకిషన్‌ గొల్లపెల్లి

111 112

26.నీ పెదాల మధురిమ

ఏ పదాలకూ..అందదు.ఒక్క..నాపెదాలకు తప్ప

27.చెప్పలేని భావాలు త్రుప్పు పడుతున్నాయి

అప్పుడప్పుడూ ఆకురాయి పట్టాలి కలంతో

28.రోజొక యుద్ధం

మాటలతో...మౌనంతో...తనువులతో...తడికలతో

29.తోలుకప్పిన ఆస్థిపంజరం మనిషి,

మనసూ మానవతా మృగ్యమైతే

30.రోజూ మాకు గృహప్రవేశమే

నిత్యం పాలు పొంగి నేలపాలు ఔతూనే ఉంటాయి

31.రాలాయి దార్లో పారిజాతాలు నీ పాదాల క్రిందా నలిగినా జన్మకు చాలని

32.అలదీ చెలిదీ ఒకటే వైనం

దాగ్గరికెళ్తే దూరం వెనుదిరిగితే తీరం

33.పండింది గోరింట కాదు

ఇందాక సిగ్గుతో అరచేతుల ముఖం దాచిన ఫలితం

34.మల్లె గొల్లుమంది

నువ్‌ తనతో తూచుకొన్నాక... బరువయ్యానని

35నువ్వు నవ్వితే అమృత మథనమే

హాలహలం తప్ప అన్నీ పుడతాయి

మణి మాలికలు * రాంకిషన్‌ గొల్లపెల్లి
Manimalikalu.pdf

సాయికామేష్‌ గంటే 23-20-1, రెండవ అంతస్థు, సుబ్బారావు వీధి, సత్యనారయణపురం, విజయవాడ-520011 కలం పేరు : అన్వేషి వృత్తి : సీనియర్‌ పాసింజర్‌ గార్డ్‌ (రైలేfiస్‌) మొబైల్‌ నెం. 7702772301 ఈ-మెయిల్‌: sandyamadhuri@gmail.com వెబ్‌: WWWfacebook.com/sai.... ...

పారేసుకు క్షణాలు... 1.సప్తపదిలో ఏఅడుగు తప్పుగా పడిందో

సమిధాగా మారిపోయింది నవవధాువు చిరునవ్వు

2.హరివిల్లులో చోటివ్వలేదానా

నలుపు రంగు... రాత్రిలో ఒదిగిపోయింది

3.మాతృదినోత్సవం అనుకుాం

వృధ్ధాశ్రమం గేటుకతుక్కున్నాయ్ ..కొన్ని కళ్ళు

4.స్కూలుకెళుతూ కనిపించింది పసితనం

పుస్తకాల శిలువని మోస్తూ

5.

మనసు అట్టడుగు పొరలలో వెతుకుతున్నా ఆశగా

చిరునవ్వుల తడి ఎమైనా మిగిలుందా అని

మణి మాలికలు *సాయి కామేష్‌ గంటి

113 114

6.

విరహమంటే ఎప్పికైనా నువ్వొస్తావనే ఆశ
విషాదామంటే నువ్వెప్పటికి రావన్న వాస్తవం

7.

నీమది చేరని నాభావాలు
నీకాలను పట్టుకుని వేలాడుతున్నాయి

8.

ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు'
బాధాగా అంటోంది మరణ లేఖలో చివరి అక్షరం

9.

కన్నీళ్ళతో కడగి యడనికి
నువ్వు నలుసువి కాదు...కనుపాపవి

10.

చెత్తబుట్ట నోరు తెరిచింది
తొలిప్రేమలేఖ రాయడం మొదలెట్టగానే

11.

ఆగకుండ ఎక్కిళ్ళ చప్పుళ్ళు
మదిఖర్కానాలో జ్ఞాపకాలు తయారౌతుంటే

12.

ఆలుమగల మధ్యా గొడవట
భార్య ఏకపాత్రాభినయమే వినిపిస్తోంది

13.

ఎన్ని తారలు మింగిందో మరి
అమాశలోనూ..చీకటి మెరుస్తోంది..వింతగా

14.

హోళీ అంటె తనకిష్టమంది
నల్లరంగే చల్లుతోంది...మనసుపై

15.

మాటలు మరణించాయి మరి
నిశ్శబ్దంగా మøనంచెక్కిలిపై...జ్ఞాపకాలచారికలు

మణి మాలికలు * సాయి కామేష్‌ గిం

16.నా వేదనతో రమిస్తూ నిశి
అక్షరాలు ప్రసవిస్తోంది..నా డైరీలో
17.వర్షంలో తడవటం ఇష్టమన్నావుగా
ఇదిగో నా కనులు వర్షిస్తున్నాయి.. ఇపుడైనా రావా
18.నా కలానికి పదాును ఎక్కువ
ఒక్కోసారి నా మనసునే కోసేస్తుందాది.
19.ఎక్కడ ప్రారంభమైనా
నీతోనే అంతమøతోంది..నా ప్రతీఅలోచన
20.ఎటు వెళ్ళాలో సందిగ్ధం మనసుకి.
అటువైపు తాను...ఇటువైపు నేను
21.తాగిన వెన్నెల చాల్లేదేమో
తొడిమలింకా ఎర్రనే ..పారిజాతాల్లో
22.నీ తలపులు
ప్రతిరాత్రీ నా నిదురని భోంచేస్తూ
23.ప్రేమకు తను పెద్దాబాలశిక్ష
విరహా నికి నేను విజ్ఞాన సర్వస్వం
24.మానవత్వం మరణిం చింది
నడివేసవిలో..గుక్కెడు నీళ్ళు దొరక్క.
25.అమ్మాయి చేతి స్పర్శ తాకినందాుకేనేమో
వాకిట్లోముగ్గులకి అన్నాన్ని మెలికలు

మణి మాలికలు *సాయి కామేష్‌ గిం</poem>

115 116

26.

నా కలం అక్ష(ర)యపాత్ర
అనుక్షణం అక్షరాలు రా(లు)స్తూ

27.

కన్నీలో తడిసాయేమో కలలు
నా ఆశల వెలుగులు ప్రసరించగానే జ్ఞాపకాల హరివిల్లు

28.

ప్రపంచమంతా ఎదురొ(రి)స్తోంది.
తనకోసం గతంలోకి నేను పయనిస్తుంటే

29.

మరోరోజు గడచి పోయింది
నువ్వు రాకుండనే..విధిచేతిలో నేనోడిపోతూ

30.

అమ్మాయి బీకాం అనుకున్నా..కాదు..బీయెస్సీనే
చూపుల్లో యాసిడ్‌ వర్షం..మనసును దహించేస్తూ

31.

ఒంటరితనానికి...ఏకాంతానికి.
ఒకటే తేడ...నీ జ్ఞాపకాలు

32.

మనమధ్యా దాూరం అడుగే
చేరడనికే... జీవితం సరిపోదాంతే

33.

చీక టి దుప్పటికి చిరుగులెక్కువే

బైటపడుతోంది వెలుగు అక్కడక్కడ...తారలుగా

34.

సిగ్గులు గగ్గోలెడుతున్నాయి
చెలి చెక్కిలిని విడిచి వెళ్ళేదారిలేక

35.

నీ చూపులు గుర్తుచేస్తూ
వేళ్ళ చివర 'చురుక్కు'మంటున్న సిగరట్

మణి మాలికలు * సాయి కామేష్‌ గంటి