Jump to content

మణి మాలికలు/మా భావాక్షరాలు... తొలిపలుకై

వికీసోర్స్ నుండి

మా భావాక్షరాలు... తొలిపలుకై

నిరంతరం నేర్చుకోవాలన్న తపన మనల్నిపుసక్త ప్రియు లను చేస్తుంది. ఎందరో కవులు, రచరయితలు తమ ఊహలు, భావాలు, ఆలోచనలు, అనుభవవాలను పుసక్త రూ పంలో ముద్రించి పఠన ప్రియులకు కానుకగా అందించారు. కొన్ని దాశాబ్దాల క్రితం వరకూ పుస్తకం విజ్ఞానాన్ని పంచే మాధ్యమాలలో ముందు వరసలో ఉంటూ వచ్చింది. అయితే విజ్ఞాన రంగంలో వచ్చిన సమూల మార్పులు కారణంగా కంప్యూటర్‌, అంతర్జాలం అనేవి మనిషి జీవితంలో తమ చోటును సుస్థిరం చేసుకుంటూ వచ్చిన నేపధ్యంలో, ఇప్పుడు రచయితల చూపుకూడ నేటి తరం సోషల్‌ నెట్వర్క్‌ అయిన ఫేస్‌బుక్‌, టిట్వర్‌ వంటి వాటిపై పడింది, ఈ పరిస్థితికి ముఖ్య కారణం ఒక రచయిత లేక కవి తన భావాన్ని క్షణాల్లోప్రపంచం నలుమూలలకు చేర్చ గలగడమే కాకుండ ఆ భావంపై ప్రతిస్పందనను కూడ వెంటనే పొందాగలిగే అవకాశం మరియు సౌలభ్యం ఉండటమే. సోషల్‌ నెట్వర్క్‌ విస్తరిస్తున్న తీరుని గుర్తించి, అప్పటికే ఫేస్‌బుక్కులో గ్రూప్స్‌ఏర్పాటు చెయ్యటం ద్వారా చాలామంది కవులను ఒకచోటుకి చేర్చి కవిత్వాన్ని కంప్యూటర్‌ లోనూ మొబైల్‌ లోనూ అందుబాటులోకి తేవడానికి ముందుకు వచ్చిన కవి యాకూబ్‌ గారి కవి సంగమం ఇంకా అలాింటి రెండు మూడు ఇతర గ్రూపుల్ని ఆదర్శంగా తీసుకుని మణిమాలిక గ్రూప్‌ న్‌ 20, 2012న ప్రారంబించాం. అయితే ఎప్పటి నుండో కవిత్వం రాస్తున్న, అప్పుడప్పుడే రాయగలుగుతున్న వారికి మాత్రమే పరిమితమై పోకూడదనే ఉద్ధేశ్వతో కవిత్వమంటే ఆసక్తి వున్నవారు, కవిత్వాన్నిఆసకత్తితో చదు వుతున్న వారందరూ తాము కూడ కవిత్వం రాయగలమన్న ధీమా, నమ్మకం కల్పించే విధంగా గ్రూపునుతీర్చిదిద్దాలని భావించి,రెండువాక్యాలలో మాత్రమే వుండే 'ద్విపాదా కవితలను గ్రూప్‌ వస్తువుగా ఎన్నిక చేసుకోవటం జరిగింది. ఏ ప్రక్రియైునా నియమాలతో, పరిమితులతో చెయ్యబడితే కొంత అదనపు సోయగాన్ని, శోభను పొందటం సహజం. అందరికీ అర్ధమయ్యేలా సరళంగా ఉండే ఒక నమూనాలో కవిత్వం అందించాలని తలచి మొదటి వాక్యంలో ఎన్నిపదాలు ఉంటే... రెండో వాక్యంలో కూడ అన్నే పదాలు గాని లేక గుణిజాల్లో గాని వుండాలి అనే

4 నమూనాను పదాల గణన ఆధారంగా ఉండేట్టు నిర్ణయించాం. దైనందిన జీవితంలో మనం అనుభవించే ఆనందాం, విషాదం, ప్రేమ, విరహం వంటి భావాలు, అనుభూతులే కాకుండ సామాజిక ,రాజకీయ అంశాలలో వేటినైనా రెండు వాక్యాలలోనే స్పురించిన వెంటనే చెప్పగలిగే అవకాశం మాలికలుగా మార్చుకునే సౌలభ్యం ఈ నమూనాలో వుండటం వలన, అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది మన్ననలు చూరగొని ఇప్పటివరకూ సుమారు పదిహేను వేల మాలికలు రాయబడి మూడువేల మంది సభ్యులతో ఈ గ్రూపు ప్రస్థానం కొనసాగిస్తోంది. గ్రూపు మొదలుపెట్టినప్పుడు చేరిన చాలామంది సభ్యులు ఇప్పటికీ కొనసాగుతుండగా మధ్యలో ఎంతోమంది కొత్తవారిని కలుపుకుంటూ కవిత్వం రాయాలన్న తపనకు బీజాలు వేస్తూ కవులుగా మారుస్తూ ముందుకు సాగుతోంది మణిమాలిక. ఈ ప్రక్రియలో భాగంగా సభ్యులు రాసిన మాలికల నుండి ప్రతివారం అత్యుత్తమమైన మాలికల్ని సభ్యులచేతనే ఎంపిక చేయిస్తూ ప్రతివారం మధ్యలో నేటి పదం, వాక్యపూరణం నుండి శీర్షికలతో సభ్యులలో ఆసక్తిని పెంచే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం.

ఇంతమంది కవులు ఇన్నివేల మాలికలు వ్రాసిన తరువాత వారి భావాల్ని,అనుభూతుల్నిఅంతర్జాలానికి ఫేస్‌బుక్కుకూ మాత్రమే పరిమితం చెయ్యకుండ, పుస్తకరూపంలోకి తీసుకువచ్చి కవిత్వం ప్రియులకు కూడ అందించాలనే సంకల్పంతో, ఎంత ఎక్కువ మంది సభ్యుల మాలికలు వీలైతే అంతమందివి తీసుకుని పుస్తకంగా అచ్చు వేయించడానికి నడుం బిగించాం. రాసిన అన్ని మాలికల్నిఅచ్చుకు తీసుకోలేము కాబట్టి, వారు గ్రూపులో రాసిన మాలికల సంఖ్య ఆధారంగా కొందరికి అవకాశం కల్పిసూ,నాణ్యతలిగిన వాటిని ఎంపిక చేసి ప్రచురణకు స్వీకరించాం. నాణ్యత కలిగిన మాలికల ఎంపికకు గ్రూపు కో-అడ్మిన్‌లు మా ఇద్దరితో పాటు సభ్యులు దయానంద్‌ దేవరాజుల, లక్ష్మీ యలమంచిగార్లతో ఒక కమిటె ఏర్పరచి 20 మంది సభ్యుల యొక్క మాలికల నుండి అత్యుత్తమ కవితా మాలికలకు పుస్తకంలో చోటు కల్పించాం. ఈ పుస్తకంలో చోటు సంపాదించిన సభ్యులలో ఒకరిద్దరు తప్ప మిగతా సభ్యులందరూ మొదటిసారి తమ కవిత్వాన్ని పుసక్త రూపంలో చూసుకోబోతున్నందుకు సంతోషపడు తున్నవారే అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులకు వారు చేసిన సేవలకు మా మనóపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కోరిన వెంటనే...

5 తమవంతు సహకారంగా...తమ మాలికల్ని, వారి వివరాల్నిసకాలంలో అందజేసిన సభ్యులందారికీ ధాన్యవాదాలు తెలియజేస్తున్నాం

తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగంతో వస్తున్న మా సంకలనానికి ముందుమాట వ్రాసిన ప్రసద్ధ కవులు శ్రీ యాకూబ్‌ గారికి, యానాం కథలు అక్షరీకులు శ్రీ దాట్ల దేవదానం రాజు గారికి మరియు పాపులర్‌ తెలుగు సినీ గీత రచయిత శ్రీ సాహితీ గారికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పుసక్తం అచ్చువేయించాలన్న సంకల్పానికి తన వంతు సహకారాన్ని అందించి తమ సంస్థ పాలపిట్ట పబ్లికేషన్స్‌ ద్వారా పుస్తకాన్ని విడుదల చేస్తున్నశ్రీ గుడిపాటి గారికి, కవర్‌ పేజీ డిజైన్‌ చేసి కంపోజ్‌ చేసిన శ్రీ మహేష్‌ మాళేకర్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం

సంపాదక వర్గం...
ప్రసాద్‌ అట్లూరి (వ్యవస్థాపక నిర్వాహకుడు)
పద్మా శ్రీరామ్‌ (సహ నిర్వాహకురాలు)


6