మణి మాలికలు/మాధవి అన్నాప్రగడ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Manimalikalu.pdf

మాధవి అన్నాప్రగడ

ఎ1-204, సిలవ్ర్‌ స్ప్రింగ్స్ (మోడి), హెచ్‌.ఎమ్‌టి టౌన్ షిప్, కుత్బూల్లాపూర్‌, హైదారాబాద్‌-54. వృత్తి: గృహిణి మొబైల్‌ నెం: 9441938135 ఈ-మెయిల్‌:madhavi.annapragada@yahoo.com


మధుర మాలికలు... 1.

నాతలంపుల పుస్తకం లో దాచుకున్నా నీ జ్ఞాపకాల పరిమళాలన్నీ

2.

అచ్చం మనప్రేమలానే కాలాల కౌగిళ్ళల్లో కణాలు కరిగిపోతున్నాయి

3.

నా తల లో జాజులై పరిమళిసున్నాయి నణ్ణొంపుకున్నకళ్ళ లో నిన్నునింపుకున్నాను

4.

కన్నీరై కరు గువో... ఎదకు పన్నీరే చిలకరిస్తావో నిన్న నా కౌగిలిలో ఒదిగిన నువ్వునేడు ...

5.

నా అక్షరాల్లో మాత్రమే మిగిలావు నువ్వు ఎదురుచూసే నేటిని నేను

మణి మాలికలు జ మాధవి అన్నాప్రగడ

77 78

6.

మేఘమై నువ్వొస్తావని నామది సంద్రమై ఎదురు చూస్తోంది

7.

మోహాల వాకిట్లో నువ్వున్నావు ప్రేమవాకిట్లోనేను ఎదురుచూస్తుంటే

8.

నాచుట్టూ నువ్వో మరి నీచుట్టూ నేనో అల్లుకు పోతున్నాం అందంగా ఏదో తెలియని బంధంగా

9.

గాయాన్నే నేను గతించిన మన జ్ఞాపకాల గేయంలో

10.

వలపుతీరాన్ని చేరే అలను నేను గాయాల వలవేసే జాలరివి నువ్వు

11.

కవ్వించే కాలమే కాలనాగై కాటేస్తుందెందుకో..!

12.

కలల వాకిళ్ళు నీకై చేస్తున్నాయి వెన్నెల జాగారాలు

13.

మౌనాన్నోమంత్రాన్నోమరి నీకై తపిం చే వలపుతీరాన్ని

14.

తప్ప క చేసు న్త ాfl మదిని ముక్కలు గాయం నాకే అని తెలిసినా

15.

జీవితకాలపు ఖెదీౖ నే నీమది చెరసాలలో

మణి మాలికలు జ మాధవీ అన్నాప్రగడ 16.

నీ జ్ఞాపకాల వర్షం.. నాచెక్కిట కన్నీరై కురుస్తోంది

17.

తొలకరిచినుకులు చెప్పేశాయి మన ప్రేమాభిషేకానికి తలంబ్రాలై తరలొస్తామని

18.

తనువంతా తలపుల గాయం నీ జ్ఞాపకాల చెమరింతల్లో

19.

నీ మనసే తలపుల విషాదాన్ని మిగిల్చింది మళ్లీ మళ్ళీ జ్ఞాపకాల రంపంతో కోస్తూ

20.

జ్ఞాపకాల తలపుల్లో చెరో తలపు చివర మనం

21.

తలపుల చెమరింతల్లో ఊసుల గంధం నువ్వు వలపుల బంధం నేను

22.

దెబ్బే దైనా తల్లడిల్లే తీరొకటే కళ్ళ పైనా చెమరింతల తడుపొకటే

23.

నువ్వు విసిరన జ్ఞాపకాలన్నీ అకక్షరాల మైదానంలో వెతు క్కుంటున్నా

24.

వెలుగు ముగుల్గను పెడుతున్నా కలల దారిన నువ్వొస్తావని

25.

అక్షరాలకందని శిక్షేదో వేశావు మది మౌన పోరాటంలో నను బందీని చేశావు

మణి మాలికలు జ మాధవీ అన్నాప్రగడ

79 80

26.

ఆరు ఋతువులు ఆరు క్షణాలే నువ్వుతోడుంటే
అరక్షణం మైనా కదల దు నావెంట నువ్వులేకుంటే

27.

కాలం కాంవాసుపై
కణ్ష ాలుగీసే చిత్రాలెన్నో

28.

నీ పేర లిఖిసున్నా
ఆవిరెనౖ నా ఆశలపెనౖ

29.

నీ జ్ఞాపకాల పువ్వులన్నీ దాచుకున్నా
మరు జన్మల ప్రేమ సంతకానికై

30.

కన్నీటిని వర్షించే గగనాన్నే
బాధలమేఘాలు గుండెల్లో దాచుకుని

31.

అంబరమే నామది
నీ చెలిమి సంబరమైచేరేవేళ

32.

జ్ఞాపకాలని చిదిమేసున్నా
రాలిన నా ఆశలకు సాక్క్ష్యంలేకుండా

33.

కలవరింతల సుప్రభా తాన్నే
నీచూపుల సూర్యోదయంలో

34.

ఆనందపు వెన్నెలనే నీ జతలో
అమాస నిశినే నీజాడలనిే నిశీధిలో

35.

ప్రతిపేజీలో నీ జ్ఞాపకాలే
నా ఒంటరితనాన్ని వెక్కి రిస్తూ

మణి మాలికలు జ మాధవి అన్నాప్రగడ