మగువ నేనెంత
స్వరూపం
తోడి రాగం - చాపు తాళం
[మార్చు]పల్లవి:
మగువ నేనెంత మంద బుద్ధినైతి
మగని తూలనాడితి మోసపోయితి ||
అను పల్లవి:
తెగువతో నిల్లిల్లు తిరిగి చూచుచున్న
నగధర నిను జూచి నగరా పోపొమ్మంటి ||
చరణం 1:
బెట్టు విడచి మ్రొక్కుబెట్ట వచ్చిన నన్ను
బట్ట రాకురా నీబవిసె తెలిసెనంటి ||
చరణం 2:
ఆసించి గోపాలుడంత వచ్చినంతటనే
దాసు శ్రిరామ కవి దాసి ఏలు కొమ్మంటినే ||