భృంగరాజ మహిమము
శ్రీ
భృంగరాజ మహిమము
శ్రాద్ధ సంశయ విచ్ఛేది
మహాకవి దాసు శ్రీరాములు
ప్రకాశకులు:
మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితి
3-4-885/A. బర్కత్‌పురా, హైదరాబాద్ - 27
ప్రథమ ముద్రణము 1989250 ప్రతులు
సర్వసామ్య సంకలితము
ప్రతులకు
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి
వాణీ సదనము 3-4-885/A
బర్కత్పురా, హైదరాబాదు 27.
వెల: రూ.6.0u
ముద్రణ : వాణీ ప్రెస్, విజయవాడ - 2. 
'మహాకవి'
దాసు శ్రీరామ పండితులు
భృంగరాజమహిమము
ఇవి ఆదినాధ సిద్ధునిచే నవనాధసిద్ధునకు ఉపదేశింపబడెను పండిత శ్రీ దాసు శ్రీరామమంత్రిగారిచే అనువదింపబడినది
భృంగరాజము అనగా గుంటగలగర చెట్టు. ఇది మానవుల రోగనివారణార్ధమై యాదికాలమున శ్రీమహాదేవి యవతారమైన భ్రామరీదేవివలన సృష్టింపబడినట్లును, సర్వరోగములను నివారింపజేయుశక్తి దీనియందున్నదనియు పూర్వకాలమున ఆది నాధుడను సిద్దుడు నవనాధుడను సిద్ధునితో జెప్ప కొంత గ్రంధము నుపదేశించినట్లు సంస్కృతములో నొక చిన్న పుస్తక ముండెను. ఆ గ్రంధము ఎట్లెట్లో సత్తెనపల్లి తాలూకాన సంచారవశముగా వచ్చిన గోసాయివలన నొక బ్రాహ్మణవృద్ధుడు గ్రహించెగాని అది వ్రాయుటలో గణములు మొదలగునవి మిక్కిలి తప్పులుగా నుండెను. కొన్ని చోటుల తెలుగున వ్రాయబడియుండెను. ఆ భాగమును గణ యతి ప్రాసాదులు మిక్కిలి తప్పులుగా నుండెను. కాని యందులోని యోషధులు వస్తువులు వీని పేళ్ళు మాత్రము తెలిసికొనదగియే యున్నవి. ఇట్లుండగా ఆ సత్తెనపల్లి తాలూకా ప్రాంతములలో రాజకీయ వ్యవహార మొకటి యవలంబించి యున్నప్పుడు నా నాల్గవకుమారుడు గోవిందరావు మామగారగు శ్రీ గోవిందరాజు భావనారాయణ వంతులుగారు ఆ పుస్తకమును తామొక ప్రతి వ్రాసుకుని తమ ప్రాతపెట్టెలో పడవైచియుంచిరి. ఇటీవల యనగా 1906 వ సంవత్సరం ఆగస్టు నెల 9,10 తారీఖులను నేను గుంటూరు వెళ్ళి మా వియ్యంకుడుగారి యింటి వద్ద నుండగా వైద్యశాస్త్ర సంబంధ ప్రసంగము వచ్చినప్పుడు వారి దగ్గరనున్న శ్లోకములు పద్యములు నాకు కనుపరుచుటలో యీ చిన్న పుస్తకమును గూడ చూపిరి. అంతట నేను పరమానందభరితుడనయి తక్కిన వన్నియు నేననుదినము చూచుచున్నవేకాని, ఇది క్రొత్తదియం జెప్పి స్ఖాలిత్యములు లేకుండ జక్కగ వ్రాయవలయునని తలంచి 1906 ఆగష్టు 11వ తారీఖు ననే నా శక్తి కొలది పరిశుద్ధి గలుగ వ్రాసితిని. కాని దాని యుపయోగమును కనుంగొనుటకు నేను అప్పుడే అదివరకు వ్యాధిగ్రస్త శరీరుడనయియున్నను విశేషబాధ లేకుండుట వలన యీ పుస్తకమునకు ప్రతియొకటి వ్రాయవలసి యుండెను. కాని చిరంజీవులగు నా మేనల్లుడు ఉప్పులూరి మల్లిఖార్జున రావు (గుడివాడలో ప్లీడరు) ఇతని తమ్ముడు నరసింహారావుల యొద్దనుంచి శాస్త్రవాదములకై విశాఖపట్టణముల వరకు బోవలసినట్లు తంతివార్తలు వచ్చియున్నందున నేను అట్లే వెళ్ళియుంటిని. తరువాత ఆదేశములోనే నాకు దేహవ్యాధి ముదిరి నానావిధములగు దుగు౯ణములు ప్రబలినందున 1906 అక్టోబరు 10వ తారీఖునకు ఏలూరు చేరినాను. వైద్యులు నానావిధములగు నౌషధసేవలు సేయించుచునే యున్నారు, ఆ నెల 23వ తారీఖున హఠాత్తుగా జ్ఞాపకశక్తియు తగ్గినది. గ్రంథము చదువలేక పోతిని. నా వ్యాధిగుణములు ఏవి యనగా శ్వాస, దగ్గుఁ నీరసము, అన్నపుతిండి క్షీణించుట, విరేచనబంధము, గొంతువాసన, రొమ్ముమంట, మిక్కిలి బరువు, విశ్రాంతి లేకపోవుట, బ్రతుకనను నిశ్చయబుద్ధి. ప్రపంచ ముందు నిరాశ, ఒకప్పుడు దుఃఖము. బహీిర్దేశమునకు బోయెడి ముందు, వెళ్ళివచ్చిన తరువాత కొంతసేపు చెప్పలేనంత ఆయాసము, విసుగు, మొగము తెల్లబడుట, అంతట యెట్లాయెనేమి ఏ ఔషథములు పుచ్చుకొన్నను వినియోగములేదని యెంచుకొనియు పనియుండియు నా కొమరులు కొందరు నివసించియున్న బెజవాడకు 7–11–1908 తారీఖున ప్రవేశించి యున్నాను. నా కొమరుల యొక్క ప్రోద్బలము చేతను, నాకు బుట్టిన కొన్ని యూహల చేతను నానావిధ వైద్యములు జరిగినవి కాని యెంతమాత్రము నిమ్మళింపకపోగా ఇకను దేహము నీరుపట్టెడి చిహ్నములు కూడ గాన్పించినవి. నేను వైద్యసేవ చేయువాడను కాను గాన నాస్వకీయ వైద్యమునకు దేనికి ప్రయత్నించనేలేదు. ఇట్లుండగా నెవ్వరో యిద్దరు ముగ్గురు కామరాజుగడ్డ రామయ్యవంతులుగారిని చూచినారాయాని యడిగిరి. వారికి వైద్యము తెలియునాయని నేను అడుగగా తెలియునని చెప్పిరి. ఆ మరునాటి యుదయమున వారి యింటికి నేను వెళ్ళి నాకు ఆయనగారు తండ్రిగారి కాలము నుండియు పరిచితులేగనుక నా దేహస్థితి చెప్పి చూచితిని అంతట వారు మందు యెల్లుండి నుండి యిచ్చెదమనియు రేపు మాయింటికి వచ్చెదమనియు చెప్పి వాగ్దాన ప్రకారము వచ్చి గుంటగలగరాకు తెప్పించి తమ యింటికి పంపవలసినదని చెప్పిరి. ఇట్లు ఏడుదినములు 2 తులముల పసరులో తమరొక యౌషధముంచి ఇత్తుమనియు, గోధుమలుపొట్టుతో విసరిచేసిన అప్పడాలు నమలితిను టయు, కావలసినన్ని ఆవుపాలు త్రాగుటయు పధ్యమని చెప్పిరి. అనుదినము అదే విధముగా కావించుచున్నాను. నీరుపట్టు చిహ్నాలతో నాకు అదివరకున్న యన్ని బాధలును మొదటిదినముననే నివ ర్తించినవి. కాని అయనగారు యింకను నాకు అన్నియు తినుటకు ఆజ్ఞ యివ్వలేదు.
ఇంతట నేను చేసిన గ్రంధ "భృంగరాజమహిమము" జ్ఞాప కమువచ్చి గుడివాడకు జాబు వ్రాసి తెప్పించి తేట తెల్లముగా టీక వ్రాసి యచ్చు వేయించెదమని బుద్ధి పుట్టింది. యదార్థమునకు గుంటగలగరాకు సిద్ధౌషధము. అమృతతుల్యము. ఇప్పుడు పత్రిక లలో ఆర్థాశచే ప్రకటించు మందులు నేను చూచినట్లు నిష్ఫల ములు. గుంటగలగరాకు వైద్యము మాత్రము డబ్బడిగి వైద్యము చేయరాదని సిద్ధుడు చెప్పినాడు.
శ్రీ కామరాజుగడ్డ రామయ్య పంతులుగారి యాజ్ఞ పుచ్చు కొని ఇదివరలో నేను రచియించియున్న భృంగరాజ మహిమమును గ్రంధమును మంచి తేటతెల్లమైన టీకతో వేరుగ వ్రాయ బూనితిని.
వైద్యము చేయువాని విధులు
1.రోగి యీ వైద్యమును కోరగానే దాని వస్తు సామ గ్రిని వాడు తెచ్చుకొనుటతప్ప తననిమిత్తము యేదైనా నివ్వ వలసినదని యడుగరాదు.
2.రోగి ఔషధసామగ్రిని తెచ్చుకొనలేక వైద్యునిం గోరినప్పుడు ఆ సామగ్రికి యదార్థముగా నెంత వెచ్చపడునో అంతియే పుచ్చుకొనవలయును.
3. భ్రామరీస్తవము, భృంగరాజస్తవము యీ గ్రంథాదియందున్నవి వానిని చదువనిది మందు నూరరాదు.
4. రోగికి రోగనివృత్తియై సంతోషముచే నేదైన నీవచ్చిన యెడల యింత స్వల్పము తెచ్చితివేమని యనరాదు. ఇచ్చిన ఎంతైనను సరే. అది గాని ఒకవేళ ఔషధ ద్రవ్యములకై షుమారుగా నిచ్చిన దానిలో నెప్పుడయినా స్వల్పముగా మిగిలియున్న యెడల నదిగాని చక్కగా జ్ఞాపకముంచుకొని లేక వ్రాసిపెట్టి ధర్మకార్యమున కుపయోగించవలసినది గాని వైద్యుడు స్వోపయోగము చేసికొనరాదు.
5. ధనమార్జించు నిమిత్తము వైద్యము సేయు వైద్యులతో వైద్యవిషయమై యేమియు మాటలాడరాదు.
6. భృంగరాజౌషధములచేతనిమ్మళించని దేహరోగములు అరుదుగా నుండుననియు, అవి యధార్థముచేత రోగములే కావనియు, బరమేశ్వరునిచే బంపబడిన సాక్షాస్మృత్యు దేవతలనియు గట్టి నమ్మకముతో నుండవలయును.
7. వైద్యుడు పరిశుద్దదేహుడు, ఆస్తికుడు, మాంసాద్యాహార వర్జితుడు సత్కర్మ సహితుడుగా నుండవలయును.
8. వైద్యుడు సంగరహితుడుగా నుండుట మొదటి పక్షము.దురాశారహితుడుగా నుండుట రెండవపక్షము. ఆశాపిశాచగ్రస్తుడు, అధముడు.
9. వైద్యుడు 16 సంవత్సరములకు లోబడి యుండరాదు. 75 సంవత్సరములకు పైవాడుగా నుండరాదు. వీరే వైద్యులు, తక్కినవారు కారని ఆదినాధ సిద్ధుని మతము.
రోగుల విధులు
1. భ్రామరీస్తవము, భృంగరాజస్తవము చేసియైనను వినియైనను ఔషధము పుచ్చుకొనవలయును.
2. ఈ భృంగరాజౌషధమందు భక్తియు నమ్మకము నుండవలయును. లేనియెడల నీమందు పుచ్చుకొననే కూడదు.
3. ధనము పుచ్చుకొని మందివ్వని వైద్యులు మోసగాండ్రని గట్టిగా నమ్మక ముంచవలయును.
4. రోగము నివారణమయినప్పటికీ యీ భృంగరాజ వైద్యునకు విధిగా నేమయిన నివ్వవలయునని యనుకొనరాదు.
5. మందుకు అయ్యెడు స్వల్పముగు వ్యయము తప్ప నాకికనేమియులేదను నిర్విచార మనస్సుతో నుండవలయును.
6. వైద్యునియందు భక్తియు నమ్మకమునుగలిగియున్న యెడల మాత్రమే యీ వైద్యమునకు పూనవలెను.
7. సంసారరహితుడు వైద్యుడయిన యెడల మిక్కిలి మంచిది. సంసారియైనను, సన్మార్గవర్తియు పరులను బాధించని వాడును సద్వంశము గలవాడును మాంసాహార వర్జితుడును నగునట్టి వైద్యునిం గోరుట సమపక్షము. తదితరులు యీ వైద్యమునకు సుతరాం పనికిరారు.
8. వైద్యుడు చెప్పిన పథ్యము తప్పక చేయవలయును.
9. వస్తుసామగ్రి తనంతట తాను సంపాదించు కొని పుటములు వేసికొని మందు వేసుకొని అనుభవించ గల నేర్పరి యట్లుచేయవచ్చును.(ఇది కష్టము.) ఈ వైద్యమందు తాత్పర్యము గలవారు యీ చిన్న పుస్తకమును సంపాదించుకొని యింటిలో జాగ్రత్తగా నుంచుకొన వలయును. లేదా చదువు వచ్చిన వారి యొద్దనుంచుకొని వినుచుండ వలయును.
ఇట్లని యాదినాధ సిద్ధునిమతము.
బెజవాడ
10.3_1907దాసు శ్రీరాములు
భృంగరాజ మహిమము
(గుంటకలగరచెట్టు మహిమ)
భ్రామరీదేవి స్తవము
శ్లో॥ | ఆదిశక్తి స్వరూపాంచ | నిర్జరావనతత్పరామ్ | |
భృంగరాజ స్తవము
శ్లో॥ | భ్రామరీపద సంభూతం గంగాతటనివాసినం | |
ఆదినాధస్తవము
శ్లో॥ | ఆదినాధం మహాసిద్ధం| చంపకారణ్యవాసినం | |
నవనాధ స్తవము
శ్లో౹౹ | భావయేనవనాధంచ నిత్యంవననివాసినం | |
క. | శ్రీకరముగ నవనాధుడు | |
శ్రీ మన్నవ నాధుండను మహా సిద్దుడు సంస్కృతమున జేసిన భృంగరాజ మహిమమను వైద్యగ్రంధమునకు నేను తెనుగు జేసి పద్యములలో వ్రాసేదను.
ఆదినాధ సిద్ధుడు నవనాధ సిద్ధునితో నిట్లని వచించె.
ఆ.వె. | భృంగరాజ శక్తి సంగతియేమందు | |
గుంటగలగర చెట్టుయొక్క ప్రభావము నేనేమని చెప్పుదు ఈ మొక్క ప్రధమమందు గంగానదియొడ్డున వెలసినది. సర్వరోగ తాపములను బోగొట్టును.
ఆ.వె. | చెలగి భృంగరాజ సేవనంబువ నెన్న | |
ఈ గుంటగలగర మొక్క యెంతటి కఠినమైన రోగములనయినను మాన్పును, శరీరమునకు మంచి బలముపట్టును.
ఆ.వె. | గుంటకల్గ రొడలి పుంటిని గింటిని | |
ఈ గుంటగలగర బలమునిచ్చును, మేహపుండ్లను, కురువులను మాన్పును, నేత్రరోగములు కుదుర్బును. అంటు వ్యాధుల నివారించును.
| గుంటగలగర మొలకల గుణములెన్న | |
ఈ గుంటగలగర మొక్కల గుణము లిట్టివని చెప్పుట కెవ్వరికిని సాధ్యముకాదు. ఎంతటి బాధలో నున్నవారయినను ఆనందము కలిగి జీవింతురు. ఆ వైద్య మనుభవించిన వారికే దాని గుణము తెలియగలదు.
సీ౹౹ | భృంగరాజముదెచ్చి పెలుచన నెండించి | |
| మిరియాలచూర్ణంబు మిళితంబుగా మూడు | |
గీ. | గాలిసౌరకుండ నొకబు ర్రగట్టిసేని | |
గుంటగలగరాకు బాగుగా నెండించి చూర్ణము చేసి వస్త్రఖాళికము చేసి దానిని అయిదు భాగములుగా బెట్టి మిరియాలపొడి కలిపిన మూడు భాగములను, శొంఠి, పిప్పిళ్ళు, మిరియాలు కలిపిన రెండు భాగములను అక్కలకర్రపొడి రెండు భాగములను గలిపి యొక బుర్రలో (సీసాలో) బోసి గాలి తగలకుండగజేసి పరిశుద్ధ ప్రదేశమునందుంచి యనుదినము మూడువేళ్ళ చివరలకు వచ్చినంత తేనెతో గలిపి సేవించుచుండెనేని సాధారణముగా జన్మావధివరకు రోగము రాదని సిద్ధుడు చెప్పెను.
తే.గీ. | వాతరోగంబులకు నిదివై రిసుమ్ము | |
ప్రాతబెల్లము, గుంటగలగరాకు పసరులో భావనచేసి రేగుపండ్లంత మాత్రలు చేసి అనుదినము సేవించుచుండెనేని వాత శూలలు హరించును.
సీ. | చక్కగా భృంగరాజము సమూలముదెచ్చి | |
తే.గీ. | బుర్రలో మూసి చక్కగా బుచ్చుకొనెడి | |
గుంటగలగరాకు యెండను సమూలము నెండించి మెత్తగా రెండుజాములు పొడిచేసి వస్త్రఘాలితముజేసి ఆ పొడి తొమ్మిది పాళ్ళును శొంఠి పిప్పళ్ళు మిరియాల చూర్ణము మూడుపొళ్ళును,కరకకాయల బెరడు చూర్ణము 1 పాలును, కటుక రోహిణి పొడి యొకపాలును గలిపి సీసాలో గాలి తగులకుండా గట్టివేసి ఔషధ సేవ సేయునప్పుడు మూడువేళ్ళ చివరలకు వచ్చినంత తీసుకొని తొమ్మిది మినపగింజలయెత్తు రససింథూరము పొడి కలిపి తేనెతో చక్కగా మాత్రలు చేసి పుచ్చుకొనెనేని వాతపిత్త శ్లేష్మముల వలన కలిగిన క్షయరోగములు, కుష్ఠురోగములు మానునని ఆదినాధ సిద్ధుడు చెప్పేను. అనిన విని సంతసించి నవనాధు డాదినాధుని కిట్లనియె.
తే.గీ. | గుంటగలగర మొలకల బండుతనము | |
నీవలన గుంటగలగరాకు మహిమ కొంత వింటిని. దీనితో అండురోగములెట్లు మానునో తెలియజేయగోరుచున్నాను, అనిన విని యాదినాథుండు జెప్పెద వినుమని యిట్లనియె.
క. | మిరియపు గింజలు తొమ్మది | |
మిరియపు గింజలు తొమ్మిదింటిని చూర్ణముచేసి గుంటగల గరాకులు తొమ్మిది ఆ చూర్ణముతో గట్టిగా మెదపి తినుచుండెనేని సెగ మొదలగు అంటురోగములు మానును.
క. | పిప్పళ్ళును మిరియంబులు | |
పిప్పళ్లు మిరిముములు, శొంఠి, పిప్పలిమోడి, వస, కరకకాయల పప్పర సమభాగములుగా నూరి గుంటగలగరాకు పసరుతో సేవించిన విషూచి, మొదలగు అంటురోగాలు మానును, అనిన విని నవనాథుండు సన్నిపాతంబులకును జ్వరంబులకును మార్గంబడిగిన నతండు పరమానందమున నిట్టని చెప్ప దొడంగె.
చ. | గుటగుటవేళ్ళ చెక్క యును గోరిక మీరగిదెచ్చి పిమ్మటన్ | |
గుటగుటచెక్కయనగా కొందరుకాడమునగ చెక్కయనియు గొందరు తెల్లగలిజేరుపప్పరయనియు చెప్పుచున్నారు. యధార్ధమయిన యర్ధము ఇదియని తిన్నగా తెలియలేదు. గుంటగుటవేళ్ళ చెక్కను గుంటగలగరాకు రసముతో మర్దనచేసి నాలుగేసిగుంజల యెత్తు మాత్రలు చేసి పుచ్చుకొనినయెడల సన్నిపాతములు మానును.
తే.గీ. | శొంఠి పిప్పలి మిరియాలు సొరిదిగటుక | |
శొంఠి పిప్పళ్ళు మిరియాలు కటుకరోహిణి గంటు బారంగి మునగచెక్క కరకకాయలపేళ్ళు, ఉప్పి చెక్క చూర్ణము సమభాగములుగా జేసి ఒకజాము తములపాకుల రసమున, మరియొక జాము గుంటగలగరాకు రసమున మర్దనజేసి రేగుపండ్లంత మాత్రలు చేసి సేవించిన సన్నిపాతంబులన్నియు మానును.
సీ౹౹ | భృంగరాజపు చెట్టు పొంగుచు గొనివచ్చి | |
తే.గీ. | యందుసిందూరమును గల్పియంతసేపు | |
గుంటగలగరచెట్టు సమూలముదెచ్చి చిల్లులులేని కుండకు వాసెనగట్టి దాని మీదనుంచి శొంతి పిప్పళ్ళు మిరియాలపొడి బాగుగావై చి మూకుడుతో గట్టిగా మూసి మధ్యాగ్నిచే నొక జామువండి బయటకుదీసి గుంటగలగరాకు రసముతో ఖల్వాన జాము నూరి గురిగింజలంత మాత్రలు చేసి పుచ్చుకొనిన యెడల జ్వరములు మానును.
అంత నవనాధుండు భృంగరాజం జండళూలాదుల కుపయోగించు విధంబుపదేశింపవే యని యడిగిన నతండు.
తే.గీ. | కండచక్కెర మిరియాలు గలయనూరి | |
పంచదార మిరియాలు బాగా సూరి గుంటగలగరాకు పసరులో కలిపి మూడేసి తులాల చొప్పున పుచ్చుకొనవలయును. వృషణాది (అండవాతము) శూలలు మానును.
సీ. | అండశూలలనెల్ల ఖండించు విధమును | |
| భృంగరాజంబున బేర్మిరసము దీసి | |
తే.గీ. | మూడుదినముల నీరితి మొనసిచేయ | |
కటుకరోహిణి గుంటగలగరాకు రసముతో నూరి తేనెలో రంగరించి తడిబట్టకు పూసి అండముల మీద వైచి పండునిప్పుల మీద కొంత సేపు కాచుచుండవలెను. మూడు దినములీలాగున జేయగా వాపుతీసి నొప్పి శమించును.
క. | వెలిగారము పొంగించియు | |
మేహవాయువుతో గూడిన శూలలకు
తే.గీ. | ఆరతులము కట్కరోహిణి సరగసూరి | |
అరతులము కటుకరోహిణి అంతే మిరియాల చూర్ణముతో కలిపి నాల్గుతులముల గుంటగలగర పసరులో బాగుగా గలిపి పుచ్చుకొన్న యెడల శూలలు హరించును.
తే.గీ. | భృంగరాజపు కొనలను సంగతముగ | |
గుంటగలగరాకులు ఏడుకొనలతోనున్నవి,మిరియాలు ఏడు కల్పి సేవించిన యెడల చురుకు సెగలు మానును.
తే.గీ. | ఏడుదినములు సేవింపనెల్ల గతుల | |
పై పద్యములో చెప్పినమందును 7 రోజులు పుచ్చుకొనిన యెడల పొక్కు సవాయి, చచ్చు మొదలగు చెడు రోగములు మానును. అనిన నవనాథుండు నేత్రరోగంబుల కుపాయంబడిగిన నాదినాథుండు
ఆ.వె. | భృంగరాజ రసము పొలుపొందగా దీసి | |
పిప్పళ్ళను తుమ్మియాకు రసముతోను గుంటగలగరాకు రసముతోను చక్కగా కాటుకవలె జేసి కన్నులకు పెట్టిన దుర్మాంస దోషములడగిపోవును.
ఆ.వె. | కలగరాకు రసము గారవంబునతీసి | |
గారపండు జిగట తెచ్చి గుంటగలగరాకురసముతో బాగుగా నూరి కన్నులకు బెట్టిన యెడల కన్ను అదురుట మిటమిటలాడుట మానును. ఒక నెలరోజులు బెట్టిన పూలు కూడా మానును.
సీ | భృంగరాజరసంబు సంగతం బొనరించి | |
| తలమాదలకు దీని దట్టంబుగ బూయ | |
తే.గీ | శ్రవణరంధ్రబులను నొక్క జాము బిడిచి | |
మిరియాలు కటుకరోహిణి ఖల్వములో బాగుగా గుంటగలగరాకు పసరుతోనూరి తలమాదలకు రాచినయెడల మానును, ఇది మూడుజాములు మర్ధన పదిదినాలు రాయవలెను.
మరియు గుంటగలగరరసముతో తెల్లజిల్లేడాకు రసములో జాము పిడిచిన పాముకాటు మానును. వేరిరసము తేలుకాటును మాన్పును.
తే.గీ | ఆరువిధముల మాదలు నణగిపోవు | |
అనుపాన విశేషములు బాగుగా దెలిసి పరిశుద్ధాంతస్సుకల వైద్యుడు పనిచేసేనేని అరు విధములగు మాదలును కుదురును. తేలు చచ్చును. పురుగులు నశించును. రోమములూడిపోయిన స్థలములలో రోమములు మొలచును. అంత నవనాధుండు విశేష విధులడిగిన నాదినాథుండిట్లని వచియించెను.
జ్వరాదులకు అమృతసంజీవనీ రసము
కం. | రసవిష గంధకములతో | |
రసము, నాభిగంధకము ఇంగిలీకము కటుకరోహిణి సమభాగములుగా పాళ్ళువేసి గుంటగలగరాకు రసముతో మర్దించి సేవింపజేసిన సర్వజ్వరసులు మానును.
ఆ.వె. | భృంగరాజ రసముపోసి యందును బ్రాత | |
గుంటగలగలర రసములో ప్రాతయినుప చిట్టెమును కరికతాడియుసిరికలును సుగంధిపాల వేళ్ళరసమును బోసి కల్పి బాగుగా కాచి తలకు బాగా మర్దన చేసి వెంట్రుకలకు రాచిన యెడల అకాలపు నెరుపు తక్షణము మానును.
కం. | కస్తురి గోరోజనమును | |
కస్తూరి గోరోజనము తు౦గముస్తలు శొంఠి పిప్పళ్ళు మిరియాలు కరకతాడి ఉశిరికలు, బాగుగా మర్ధించి మాత్రలు చేసి ప్రసూతి, విషరోగముల కిచ్చిన యెడల, నవి మానును.
ఆ.వె. | భృంగరాజరసమునిడి పొన్నగంటియు | |
గుంటగలగరాకు రసము, పొన్నగంటిరసము పాలు ఆముదము, నెయ్యి, ఉశిరికాయరసము, కలబందరసము, కొబ్బరి పూవుకషాయము, తిప్పతీగెరసము, పోసి కాచి చమురుతీసి తలకు మర్ధన చేసిన యెడల నేత్రములకు మంచిది. దీనినే భృంగామలక తైలము అందురు.
కం. | తే.గీ.ముషిణివేళ్ళ పొట్టు ముగినల్ల యుప్పియు | |
ముషిణివేళ్ళ పొట్టును, నల్ల యుప్పి పొట్టును, గానుగ వేళ్ళ పొట్టును బాగా నూరి గుంటగలగరాకు రసములోను వేపచెక్క రసముతోను కలిపి సేవించిన యెడల సల్లకుష్టు మానును.
తే.గీ. | నల్ల కుష్ఠు చూర్ణమెల్లవరా యెత్తు | |
పైన చెప్పబడిన సల్లకుష్ఠు కేర్పడిన చూర్ణము పూటకొక్క వరహాయెత్తు చొప్పున పుచ్చుకొనవలసినది. పచ్చ పెసలపప్పును ఆపు మజ్జిగయును పధ్యములు. తక్కినవేమియు పనికిరావు.
తే.గీ. | నల్ల కుష్టు మాన నరుడెంచినేనియు | |
పైన చెప్పబడిన కష్టురోగమున కేర్పడిన చూర్ణమును సేవించునప్పుడు వేపచెక్క గంధమును గుంటగలగర ఆకురసమును కలిపి దేహమునకు రాయుచుండవలెను.
క. | ఇలనల్ల కుష్ఠుపోవగ | |
పైన చెప్పిన చూర్ణము సేవించునప్పుడు ఆమిదముతో మూడేసి దినముల కొకసారి తలయంటుకొనుచుండవలెను.
తే.గీ. | భృంగరాజ రసము బేర్మి యంత్రంబున | |
గుంటగలగరాకు రసమును బట్టిబెట్టి సారము దీసి నిలువ యుంచుకొనిన యెడల అన్ని రోగములకు వాడవచ్చును.
కం. | తంగేడు వేపచెట్టును | |
తంగేడుచెట్టు వేపచెట్టు గుంటగలగర కానుగవేరు శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, కరకతాడీ యుసిరికలు యివి రోగనాశకములందురు.
క. | విసపుముసిణి జిల్లేడును | |
విషముషిణి వేరు జిల్లేడు చిగుళ్ళు ఈశ్వరచెట్టు, దుష్టుపు యిగుళ్ళు తెల్లగలిజేరు ఆకురసము చెంచలిచెట్టు సహదేవిచెట్టు యివి గుంటగలగరాకు రసముతో కలిసిన యెడల అన్ని విషములు హరించును.
కం. | కడులేత కలగరాకును | |
లేత గుంటగలగరాకు పచ్చడి చేయించి అనుదినము సేవించినయెడల దేహమునకు బలమిచ్పునని సిద్దుడు చెప్పెను.
క. | దొడ్డిన్ గల కరమేడియు | |
గుంటగలగరచెట్టు, మేడిచెట్టు, తెడ్లపాలచెట్టు, తెల్లదింటెనచెట్టు, యీ నాల్గును దొడ్లో పెంచినయెడల దొడ్డిలోనికి త్రాచుపాములు సాధారణముగా రానేరావు.
తే.గీ. | కృతయుగంబున శ్రీదేవి యతిముదమున | |
కృతయుగములో "ఆదిశక్తి భ్రామరీయను అవతార మెత్తెను. అపుడు దుర్మార్గులయిన రాక్షసులను జంపునట్టి శక్తి దేవతలకు కలుగునట్లు యీ భృంగరాజమను గుంటగలగరాకును ఆశక్తి సృజించెనని ఆదినాధ సిద్ధుడు నవనాధ సిద్ధునకు చెప్పెను.
తే.గీ. | మానవులకును రోగముల్ మాన్పునట్టి | |
అప్పటినుంచి యీ గుంటగలగరాకును వైద్యులందరు వాడుచుందురు.
క. | అని భృంగరాజ మహిమము | |
శ్లో. | సలక్షా పద్మినీ జాయా బృంగరాజస్య సర్వదా | |
దీని యర్ధమును అర్హులయినవారు భృంగరాజ మహిమము పూర్తిగా తెలిసిన పెద్దల వలన గ్రహించ వలసినది.
(భృంగరాజ మహిమము సమాప్తము.)
ఈ ప్రాచీన గ్రంధమును శ్రమతో వెతికి యిచ్చి ప్రచురణకు ప్రోత్సహించిన శ్రీ దాసు వద్మనాభరావు గారికి కృతజ్ఞులము.
- సంపాదకుడు.