భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/హాజఁరా బీబీ ఇస్మాయిల్‌

వికీసోర్స్ నుండి

సాంఫిుక బహిష్కరణలకు వెరవని ధీమంతురాలు

హాజఁరా బీబీ ఇస్మాయిల్‌

(-1994)

జీవిత భాగస్వాములతో పాటుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని త్యాగాలతో చరిత్ర సృష్టించిన మహిళల జీవిత విశేషాలను కొంతలో కొంతవరకు జాతీయోద్యమ చరిత్ర మనకు అందిస్తుంది. బానిస బంధానాల విముక్తి కోసం పోరాడుతున్న సహచరుడు కన్నుమూసినప్పటికీ ఆయన నడిచిన సన్మారం వీడకుండ, ముందుకు సాగిన మహిళలు అరుదుగా కన్పిస్తారు. శ్రీమతి హాజౌరా బీబీ అటువంటి అరుదైన మహిళామణులలో ఒకరు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధుడు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ సాహెబ్‌ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆయన భార్య హాజౌరా బీబీ. గాంధీజీ ప్రబోధంతో ప్రభావితులైన ఆయన ఖద్దరు ప్రచారోద్యమంలో అమితోత్సాహంతో పాలుపంచుకున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఖద్దరు దుకాణం ప్రారంభించి, ఖద్దరు ప్రచారంలో నిత్యం నిమగ్నమై ఉండే భరకు హాజౌరా బీబీ అపూర్వమెన తోడ్పటునిచ్చారు.

అఖిల భారత ముస్లింలీగ్‌ ప్రభావం తెనాలిలో కొంత ఉండేది. ఖద్దర్‌ ఇస్మాయిల్‌ దంపతులు భారత జాతీయ కాంగ్రెస్‌లో కొనసాగటం, గాంధీజీ విధానాల పట్ల అత్యంత 227 గౌరవభావంతో ఉండటం లీగ్‌ కార్యకర్తలకు, లీగ్‌ అభిమానులకు ఇష్టం లేకపోయింది. ఆ కారణంగా ఆ దంపతులు అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో హాజౌ రా బీబీ ఎంతో ఓర్పుతో కుటుంబ వ్యవహారాలను సరిచూసుకుంటూ, తన ఇంటికి వచ్చే జాతీయోద్యమ కార్యకర్తలకు అవసరమై న సహాయ సహకారాలు అందిస్తూ భర్తకు అండగా నిలిచారు.

జాతీయోద్యమకారుడు ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ పలుసార్లు జైలు పాలైనప్పటికీ హాజౌరా అధైర్యపడలేదు. జాతీయోద్యమ కార్యకర్తగా భర్త జైలుకు వెళ్ళటం గౌరవంగా భావించి ప్రోత్సహించారు. పల్లలకు జాతీయవిద్యను అందించాలన్న లక్ష్యం స్వసమాజం నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఆడబిడ్డలను జాతీయ విద్యాబోధన గావించే హిందీ పాఠశాలకు పంపారు. ఈ పద్ధతు లు నచ్చని వ్యకులు ఇస్మాయిల్‌ కుటుంబాన్ని అప్రకటిత సాంఫిుక బహిష్కరణకు గురిచేశారు. ఆ చర్యకు ఆమె ఏ మాత్రం చలించలేదు. భర్త ఇస్మాయిల్‌గాని తాను గాని నడుస్తున్నది గాంధీ మార్గంలో కనుక ఎవరు ఏమనుకున్నా, ఏమి చేసినా ఎదుర్కోవడం తప్ప గాంధీబాట నుండి వెనుదిరిగేది లేదని హాజౌరా స్థిరంగా నిర్ణయించుకుని, ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకు సాగారు.

జాతీయోద్యమంలో ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ మొత్తం మీద ఏడు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించారు. చివరి సారిగా జైలులో అనారోగ్యంపాలై, ఆ తరువాత 1948లో ఆయన కన్నుమూశారు. ఆయన కన్ను మూశాక స్వాతంత్య్ర సమరయాధులకు ఇచ్చే భూమిని ప్రభుత్వం ఆమెకు సంక్రమించ చేయదలచింది. స్వాతంత్య్ర సమర యోధురాలుగా తమ దేశభక్తికి విలువ కట్టటం ఇష్టం లేని ఆమె ప్రభుత్వం ఇవ్వదలచిన భూమిని తిరస్కరించారు.

ప్రభుత్వం ఇస్తానన్న భూమిని తిరస్కరించటం మాత్రమే కాకుండ తన భర్త వాగ్దానం నెరవేర్చేందుకు తెనాలి సమీపాన గల కావూరు వినయాశ్రమానికి రెండున్నర ఎకరాల విలువైన మాగాణి భూమిని ఆమె దానం చేశారు. స్వాతంత్య్రయోధుల సమావేశస్థలిగా భాసిల్లిన ఖద్దరు విక్రయశాలను భర్త మరణానంతరం కూడ తన బిడ్డల చేత నిర్వహింప చేశారు. చివరివరకు ఖద్దరు ధరించారు. చివరి క్షణం వరకు గాంధీజీ బాటలో భర్త ఆశయాలకు అనుగుణంగా జీవితం గడపన శ్రీమతి హాజౌరా బీబీ 1994లో తుది శ్వాస విడిచారు.

228