భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/హబీబా బేగం
మాతృదేశ విముక్తి కోసం ఉరిని లెక్క చేయని సాహసి
హబీబా బేగం
(1833-1857)
పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడుకునేంఫదుకు ఆత్మాభిమానులైన బిడ్డలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధాపడతారన్న విషయం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర నిరూపిస్తుంది. అటువంటి నిరూపణలకు దాష్టాంతరంగా నిలుస్తారు శ్రీమతి హబీబా బేగం.
హబీబా బేగం 1833లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనం నుండే బానిస భావాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించిన హబీబా మనస్సును బ్రిటిషర్ల బానిసత్వంలో మగ్గుతున్నమాతృభూమి దమనీయ స్థితి కలచివేసంది. ఆ వ్యధ నుండి వలస పాలకుల మీద ఆగ్రహం ప్రజ్వరిల్లింది. తెల్లపాలకులను శత్రువులుగా పరిగణంచి, మాతృభూమిని బ్రిటిషర్ల నుండి విముక్తం చేసు కునేందుకు సరైన అదనుకోసం ఎదురు చూడసాగారు.
1857లో ఆమెకు ఆ అవకాశం లభించింది. భారతావనిలోని పలు ప్రాంతాలలో హబీబా లాంటి వీర నారీమణులు, వీర పుత్రులు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల, అధికారుల మీద కత్తులు దూశారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న హబీబా తిరుగుబాటు యోధులతో కలసి రణరంగ ప్రవశం చేశారు. సోదర తిరుగుబాటు వీరులతో కలిసి బ్రిటిష్ సైనికపాలకుల మీదా తిరగబడ్డారు. ఆ నేరానికి ఆమెను అరెస్టు చేశారు. నాటి దేశభక్తులకు ప్రాణాలు లెక్కలోనివి కావు. మాతృభూమి పరిరక్షణలో ప్రాణాలు విడవడం ఎంతో గర్వంగా భావించారు. హబీబా కూడ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. పరాయి ప్రభుత్వంపై తిరగబడిన నేరానికి 1857లో బ్రిటిషు సైనిక న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్షవిధించింది. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ యోధురాలు హబీబా సంతోషంగా ఉరిని స్వీకరించారు.
58 గెరిల్లా దాడులతో బ్రిటిష్ సైనిక దాళాలను హడలెత్తించిన
"ఆకుపచ్చ దుస్తుల యోధురాలు
భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో ప్రథమ స్వాతంత్య్రపోరాటం మహత్తర ఘట్టం. ఈ పోరాటంలో అసమాన్యులు మాత్రమే కాకుండ సామాన్యులు కూడ ఆయుధాలు చేపట్టి మాతృభూమి రక్షణకు శత్రువుతో పోరాటం చేశారు. ప్రాణాలను అర్పించారు. ఈ అర్పణకు వయస్సుతో నిమిత్తం లేకుండ పోయింది. అందరి లక్ష్యం ఒక్కటే ! పరాయి పాలకుల పెత్తనం నుండి మాతృభూమికి విముక్తి కలిగించటం. అందుకోసం ప్రతిఒక్కరూ కొదమసింగాలై పోరాడారు, సివంగులై గర్జించారు. ఈ మేరకు శత్రువును గడగడలాడిస్తూ పోరాటపదంలో అమరత్వం పొందిన అజ్ఞాత మహిళలు పలువురున్నారు. ఆ కోవకు చెందిన ఆకుపచ్చ దుస్తుల మహిళ గా ఖ్యాతి చెందిన ఓ మహిళ చరిత్రపుటలలో అస్పష్టంగా దర్శనమిస్తారు.
చరిత్రలో ఆమె పేరు ప్రస్తావన లేదు. ఆమె ఆకుపచ్చ దుస్తుల మహిళ గా మిత్రులు-శత్రువులచే గుర్తించబడ్డారు. ఆమె ఎల్లప్పుడు ఆకు పచ్చరంగు దుస్తులు ధారించటంతో ప్రజలతోపాటుగా శత్రువు కూడ ఆ పేరుతో ఆమెను పిలుచుకున్నాడు. ఆమె మగదుస్తులతో కన్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడమని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆమె పిలుపులో ఉన్న ఆకర్షణ ఫలితంగా ప్రజలు అసంఖ్యాకంగా ఆమెను
59
అనుసరించారు. ఆ విధంగా ఆమె వెంట నడిచిన దేశభక్తి ప్రపూరితులైన ప్రజలతో ఆంగ్లేయ సైనికుల శిబిరాల మీద దాడులు నిర్వహించారు. ప్రజలలో మాతృదేశ భక్తి భావనలను రచ్చగొట్టి శత్రువుకు వ్యతిరేకంగా ప్రేరేపించి, ప్రజలను తన వెంట తీసుకుని, ప్రళయ భీకరంగా గర్జిస్తూ బ్రిటిష్ సైనికుల మీద విరుచుకుపడ్డారు. స్వంత దాళాలతో అకస్మికంగా దర్శనమిచ్చి, అద్భత కౌశల్యంతో కత్తి తిప్పుతూ, గురితప్పకుండ తుపాకి పేల్చుతూ శత్రుమూకలను చీల్చి చెండాడిన ఈమె పలుసార్లు శత్రుస్థావరాల మీద విజయవంతంగా దాడులు నిర్వహించారు. అనుచరులు యుద్ధ్దరంగం వదలి వెళ్ళినా ఆమె మాత్రం చెక్కుచెదరని ధైర్యసాహసాలతో శత్రువును ఎదుర్కొని, శత్రువు కంట పడకుండ చాకచక్యంగా గెరిల్లా పోరు జరిపి తప్పంచుకున్న ఘట్టాలున్నాయి. ఆ విధగా తప్పించుకున్న ఆమె ఎక్కడకు వెడుతుందో, మళ్ళీ ఆమె ఎక్కడ నుండి వస్తుందో, ఎలా వస్తుందో, ఏం చేస్తుందో, ఏలా మాయమøతుందో శత్రుగూఢచారులకు అంతుబట్టలేదు.
ఈ మేరకు బ్రిటిష్ సైనికుల మీద, సైనిక స్థావరాల మీద ఆమె చేసిన దాడులు, ఆ దాడుల తీరుతెన్నులను దర్శించిన అదృష్టవంతులు వివరించిన కథనాలు, బ్రిటిష్ అధికారులు రాసుకున్న అధికార, అనధికార లేఖలు, ప్రభుత్వ రికార్డులు ఆమె సాహస కృత్యాలను వెల్లడిస్తున్నాయి. ఈ పచ్చదుస్తుల మహిళ సాహసాన్ని ప్రస్తావిస్తూ, ' బేగమత్ కి అంశూం ' అను గ్రంథంలో రచయిత పేర్కొనట్లు ' భారత్ కే స్వాతంత్య్ర సంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్ ' అను పుస్తకంలో రచయిత్రి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అచార్యులు డాక్టర్ అబిదా సమీయుద్దీన్ (పేజి. 44లో) ఈ విధంగా ఉటంకించారు.
'..ఆ మహిళ అద్వితీయ ధైర్యశాలి. ఆమెకు మృత్యుభయం ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు గుండ్లను వర్షిస్తున్నా అత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్ని సార్లు నడిచి వస్తుంటే చూశాం. మరికొన్నిసార్లు గుర్రం మీద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గవిన్యాసంలో, గురి తప్పకుండ తుపాకి పేల్చటంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది..'. ఈ వర్ణన ద్వారా ఆమె గరిల్లా పోరు సాగించేదని మనం అరం చేసుకోవచ్చు. ఆమె ఎక్కడనుంచి వసుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో శత్రువుకు తెలియకుండ దాడులు జరిపిన తీరు ఆమె గెరిల్లా
60
రణతంత్రాన్ని స్పురణకు తెస్తుంది.
బ్రిటిష్ స్థావరం మీదదాడి చేసి శత్రుసైనికులతో పోరాడుతూ ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయం కారణంగా అమె గుర్రం మీదనుండి కింద పడపోయారు. ఆ సమయాన్నిఅదునుగా ఉపయాగించుకుని శత్రువు ఆమెను చుట్టుముట్టి బంధించాడు. అక్కడి నుండి ఆమెను సైనిక స్థావరానికి తరలించాడు. ఆమెను బ్రిటిషు అధికారి లెఫ్టినెంటుహడ్సన్ కట్టుదిట్టమైన బందోబస్తుతో అంబాలాలోని బ్రిటిషు సైనిక స్థావరానికి పంపాడు. ఆ సమయంలో అంబాలాలోని ఆంగ్లేయ సైనికాధికారులకు ఆమె గురించి, ఆమె నిర్వహించిన దాడుల గురించి, ఆమె తిరుగుబాటు కార్యకలాపాల వివరాలను, ఆమె ధైర్యసాహసాలను వివరంగా ఎకరువు పెడుతూ, జాగ్రత్తలు చెబుతూ అంబాలా సైనిక స్థావరం డిప్యూీ కమీషనర్‌కు 1857 లై 29న లేఖ రాశాడు. ఆ లేఖలో, నేను మీ వద్దకు ఒక ముస్లిం ముదుసలిని పంపుతున్నాను. ఆమె విచిత్రమైన మహిళ. ఆమె ఆకుపచ్చ దుస్తులు ధరిస్తుంది. కంపెనీ మీద తిరుగుబాటు చేయ మని ప్రజలను రచ్చగొట్టడం ఆమె పని. స్వయంగా ఆయుధాలు చేపట్టి తిరుగుబాటు దారులకు నాయకత్వంవహించి మన స్తావరాల మీద దాడులు చేస్తుంది. పలుమార్లు మన స్థావరాలపై ధర్య సాహసాలతో విరుచుకుపడంది. ఆమె ఆయుధ చేపడతే ఐదాుగురు సాయుధా పురుషులతో పోరాడగల శక్తిమంతురాలని, ఆమె బారిన పడన మన సిపాయిలు, అధికారులు చెబుతున్నారు. ఆమె పట్టుబడిన రోజున, శిక్షణ పొందిన సైనికాధికారిలా నగరంలోని తిరుగుబాటుదారులను కూడేసుకుని, మన స్థావరాల మీద దాడి చేసి పోరాడుతూ పట్టుబడింది. ఆమె కడు ప్రమాదాకారి. జాగ్రత్త సుమా, అని పేర్కొన్నాడు.
ఈ లేఖను ఖుర్షీద్ ముస్తఫా రజ్వీప్రాసిన జంగ్-యే-ఆజాది 1857 అను ఉర్దూ గ్రంథంలో ప్రచురించారని, ' భారత్ కే స్వాతంత్ర్యసంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్ ' గ్రంథ రచయిత్రి డాక్టర్ ఆబిదా సమీయుద్దీన్ తన గ్రంథంలో (45వ పేజిలో) వివరంగా ఉటంకించారు. ఈ లేఖతో పాటుగా అంబాలాలోని ఇతర ఆంగ్లేయాధికారులకు పలు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ఆకుపచ్చ దుస్తుల మహిళను అంబాలలోని బ్రిటిషు సైనిక స్థావరానికి పిష్టమైన బందోబస్తుతో తరలించారు. భారత స్వా తంత్ర్య సంగ్రామ చరిత్రలో అత్యంత క్రూరుడిగానూ, ఇచ్చిన మాట తప్పటంలో ప్రప్రథమునిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నఆంగ్లేయాధికారి లెఫ్టినెంట్
61 హడ్సన్ లాంటి బ్రిటిష్ సైనికాధికారి ఆమె ధైర్య సాహసాలను స్వయంగా ప్రశంసించాడు. ఈ మేరకు ఆయన తన సహచర అధికారులకు లేఖల ద్వారా తెలియచేశాడు. మాతృదేశం పట్ల ఆమెకున్న గౌరవం అతడిని అమితంగా ఆకట్టుకుంది. అ ప్రభావంతో ' జోన్ ఆఫ్ ఆర్క్ ' తో ఆమెను పోల్చుతూ కీర్తించాడు. (భారత్ కే స్వాతంత్ర్య సంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్, డాక్ల్టర్ ఆబిదా సమీయుద్దీన్, పేజి.45)
ఆ ఆంగ్లేయాధికారి రాసిన లేఖలలోని హెచ్చరికలను, ఆమె చర్య లను అధికారిక లేఖలలో ఆమె కార్యకలాపాలను వివరించిన తీరు, ఆ సంద ర్భంగా లేఖలో వాడిన భాష తీవ్రతను బట్టిఆకుపచ్చ దుస్తుల. మహిళ గా ఖ్యాతిగాంచిన ఆ యోరాలుధురాలు బ్రిటిTo ష్ సైనికాధికారుల గుండెల్లో ఎంతటి గుబులు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మేరకు అంబాలా సైనిక స్థావరానికి పంపబడిన ఆమె ఆ తరువాత ఏమైందో తెలియరాలేదు. శత్రుదాళాలలో అంతి భయోత్పాతం సృష్టించి ఆంగ్లేయ అధికారులను హడలగొట్టడం కాకుండ కడు జాగ్రత్త సుమా అంటూ పరస్పరం ముందస్తు జాగ్రత్తలు తెలుపుకోవాల్సినంత భయానక పరిస్థితులను బ్రిటిషు సైనిక స్థావరాలలో కల్పించిన ఆ యోధు రాలిని శత్రువు ఏం చేసి ఉంటాడన్న విషయం మనం ఊహించలేనిది ఏమాత్రం కాదు
*****
హిందూ- ముస్లింలకు ధర్మం, ఆత్మ గౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలకులు మాత్ర ంఏ ప్రసాదించగలరు.కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్నారు. స్త్రీలమీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు. హిందూ ముస్లిం పౌరులను హెచ్చరిసస్తున్నాం ఆత్మగౌరవంతో, ధర్మ బద్ధం గా ప్రశాంత.
జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శతృవులకు వ్యతిరేకంగా ఆయుధాలు
చేపట్టండి. స్వదేశీ సైన్యంలో భర్తీకండి...మాతృదేశం కోసం సాగుతున్నపోరాటంలో
భాగస్వాములు కండి. శతృవుకు సహకరించకండి. ఆశ్రయం ఇవ్వకండి.
-బేగం హజరత్ మహాల్
62