Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ముందర్‌

వికీసోర్స్ నుండి

ఝాన్సీ రాణి వెన్నంటి నిలచి ప్రాణాలర్పించిన యోధురాలు

ముందర్‌

(- 1857)

1857 నాటి సంగ్రామంలో మాత్రభూమిని బ్రిటిషు పాలకుల నుండి విముక్తి చేయ డానికి కులమతాలకు అతీతంగా ప్రజలు పోరులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల పక్షాన తిరుగుబాటు చేసిన యోధులు చివరి వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టినాయకుల వెంట నడిచారు. చివరకు ప్రాణాలను కూడ తృణప్రాయంగా భావించి త్యజించారు. ఆ విధంగా పోరుబాటలో నడిచి అమరత్వం పొందిన ముస్లిం యువతులలో ఝాన్సీ రాణి లక్ష్మిబాయి నీడలా వెన్నంటి నిలచి శత్రువుతో పోరాడిన ఓ సాహస యువతి కథనం తెలుస్తుంది. ఆమె పేరు ముందర్‌.

ఝాన్సీ రాణి లక్ష్మీమబాయి అమరత్వం పొందిన తీరు గురించి ప్రధానంగా రెండు కథానాలు ఉన్నాయి. ఆ కథానాలలో ఒకి రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్ల తుపాకి గుండ్లకు బలైందన్నది. ఈ విషయాన్నిచాలామంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఆ కథనం ప్రకారంగా ఝాన్సీ రాణి లక్ష్మీ బాయికి అంగరక్షకుల్లా ఇరువురు యువతులు మగ వేషాల్లో ఆమెను ఎల్లప్పుడూ వెన్నంటిఉండేవారు. ఆ ఇద్దరిలో ఒకరు ముస్లిం యువతి. ఆమె రాణితో పాటు బ్రిటిష్‌ సైనికాధికారుల తుపాకి గుళ్ళకు బలయ్యారు. అప్పటి 63 సెంట్రల్‌ ఇండియా ప్రాంతానికి గవర్నర్‌ జనరల్‌ ప్రతినిధిగా నియమించబడిన రాబర్ట్‌ హెమిల్టన్‌ 1858 అక్టోబర్‌ 30న అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి ఎడ్‌సన్‌కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో రాణి లక్ష్మీబాయి మీద తాము సాధించిన విజయాన్ని వివరించాడు. రాణి లక్ష్మీబాయి ఏ విధంగా మరణించింది వివరంగా తెలిపాడు. ఆ కథనం ప్రకారంగా, రాణి వెన్నంటి ఒక ముస్లిం యువతి గుర్రం మీద అనుసరించేది. కొఠాకి సరాయి ప్రాంతంలో రాణితోపాటుగా ఆమెకు తుపాకి గుండ్లు తగిలాయి. ఆమె రాణితోపాటుగా ఒకేసారి నేలకొరిగిందని వివరించాడు.

ఆ విషయాన్నిEIGHTEEN FIFTY SEVEN గ్రంథంలో Dr. Surendra Nath Sen ఆంగ్లేయాధికారి రాబర్ట్‌ హెమిల్టన్‌ వివరణను ఉటంకించారు. ( '.. The Rane was on Horse back, and close to her was the female (a Mohomaden) who seems never to have left her side on any occasion, these two were struck by bullets and fell ' (Page 295) ఈ లేఖలో ఎక్కడ కూడ ఆ యువతి ఎవరన్న విషయం ప్రస్తావించలేదు.

ఆ కారణంగా ఆమె అజ్ఞాత యోధురాలుగా మిగిలిపోయింది. భారత ప్రభుత్వం 1973లో ప్రచురించిన Who's who of Indian Martyrs, Vol. 3 లో మాత్రం ఝాన్సీ రాణితో పాటుగా పలు పోరాలలో పాల్గ్గొన్న ఆ ముస్లిం మహిళ గురించిన సంక్షిప్త వివరాలను డాక్టర్‌ పి.యన్‌. ఛోప్రా ఈ క్రింది విధంగా పేర్కొన్నారు. '..Fought by the side of Maharani Lakshmi Bai during the battles against the British at Jhansi, Koonch, Kapi and Gwalior, Killed in the battle at Kotah-kisarai in Gwalior, where the Rani attained martyrdom. Her Body was also cremated in the garden of Baba Ganga Das at Gwalior on June 17, 1857 ' - Who's who of Indian Martyrs, Vol.3, Govt. of India Publications, New Delhi, 1973, Page.102. ఆ యోధాురాలి పేరు ముందార్‌ (MNDAR) అని డాక్టర్‌ ఛోప్రా పేర్కొన్నారు. ఈ వివరణలను, చరిత్ర గ్రంథాలలో వ్యక్తం అవుతున్న కథానాలకు అంవయించుకుని చూస్తే ఆ అజ్ఞాత యోధురాలు పేరు ' ముందార్‌ ' గా భావించవచ్చు.

64