భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/సఫియా అబ్దుల్‌ వాజిద్‌

వికీసోర్స్ నుండి

మాతృదేశ సేవ విలువకట్టరానిదని ప్రకటించిన

సఫియా అబ్దుల్‌ వాజిద్‌

(1905-)

ఈ గడ్డ మీద పుట్టి పెరిగి, ఇక్కడి గాలి పీల్చి, నీరు తాగిన ప్రతి ఒక్కరూ తమ ప్రతిభా సంపన్నతను బట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. మనిషి తాను సాధించినదాంతాస్వశక్తి ద్వారా మాత్రమే సాధించాడని భావిస్తాడు. ఈ దేశం కోసం ఏ కించిత్తు పనిచేసినా తానేదో సేవ చేస్తున్నట్లు భుజకీర్తులు తగిలించుకుాండు. ప్రతిభా సామర్ధ్యాలన్నీ ఈ నేలతల్లి బిడ్డలు అందించిన ఉమ్మడి ఆస్తి అని గ్రహిస్తే, అప్పుడు మాత్రమే ఈ గడ్డకు తాను ఎంత రుణపడి ఉన్నాడో అర్థం చేసుకుని ప్రవర్తిస్తాడు. ఆ దిశగా మాతృదేశ విముక్తి కోసం తాను చేసినదంతా తల్లి రుణం తీర్చుకోవడమేనని తన ప్రవర్తన ద్వారా తెలియజేసిన మహిళ శ్రీమతి సఫియా అబ్దుల్‌ వాజిద్‌. శ్రీమతి సఫియా అబ్దుల్‌ వాజిద్‌ 1905లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఉన్నతాధికారులు. విశాల దృక్పథం గల కుటుంబమది. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఆమె పోస్ట్‌ గాడ్యుయేషన్‌ చేశారు. చిన్నతనం నుండి తాత తండ్రుల వద్దకంటే జాతీయ భావాలు గల మేనమామ సయ్యద్‌ అబ్దుల్‌ వదూద్‌ వద్దా పెరగటంతో, ఆమెకు జాతీయోద్యమం పట్ల అధిక ఆసక్తి కలిగింది. ఆమె ప్రముఖ న్యాయవాది మౌల్వీ 231 అబ్దుల్‌ వాజిద్‌ బరేల్విని వివాహమాడరు.ఆయన బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటాలలో పాల్గొంటున్న జాతీయవాది. పుట్టినింటనే కాకుండ, మెట్టినింట కూడ ఆమెకు జాతీయ భావాల సమర్థకులు తోడు కావటంతో భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వంస్వీకరించి, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యకలాపాలలో ఆమె పాల్గొన్నారు.

ఈ కారణాన్ని సాకుగా చూపి ప్రభుత్వంఆమెను లెక్చరర్‌ ఉద్యోగం నుండి తొలగించింది. ఆమె కార్యనిర్వహణా దక్షత, రాజకీయాల పట్ల గల అవగాహనను గమనించిన మహాత్మాగాంధీ పర్దా ను వదిలి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. భర్త కూడ గాంధీజీ మాటను గౌరవిస్తూ ఆమెను ప్రోత్సహించారు. అప్పటినుండి ఆమె జాతీయోద్యమ నాయకురాలిగా పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజాదరణతోపాటుగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.

భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించాక ఆమె అందించిన త్యాగమయ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వంఆమెకు స్వాతంత్య్రసమరయాధుల పెన్షన్‌ మంజూరు చేసింది. ప్రభుత్వాధినేతలు తన కృషిని జ్ఞప్తియందుచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెన్షనను నిరాకరించారు. ఈ సందర్బంగా ఆమెమాట్లడుతూ, స్వాతంత్య్ర సమరయోధాుల పెన్షన్‌ స్వీకరిస్తే అది నా మాతృదేశ భక్తికి ఖరీదు కట్టినట్లు కాగలదు అని ప్రకించారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి పెన్షన్‌ సౌకర్యాన్ని తిరస్కరించారు.

1952లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సఫియా అబ్దుల్‌ వాజిద్‌ కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు మీద పోటిచేశారు. ప్రజలు ఆమెను గెలిపించి శాసనసభకు పంపారు. ప్రజా ప్రతినిధిగా 1957 వరకు ఆమె పనిచేశారు. శాసనసభ్యురాలిగా రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు.

పండు వయస్సులో కూడ జాతి జనుల సేవలో గడిపిన సఫియా అబ్దుల్‌ వాజిద్‌ తానేదో ప్రజాసేవ చేస్తున్నట్లుగా ప్రకించుకోలేదు. తాను ప్రత్యేకంగా త్యాగాలు చేసింది ఏమిలేదని, ఈ గడ్డమీద పుట్టి పెరిగి నందున గడ్డ రుణం తీర్చుకుంటున్నానని వినమ్రపూర్వకంగా తెలుపుకున్నారు.

232

జనచైతన్య కార్యక్రమాల నిర్వహణలో దిట్ట

ఫాతిమా బేగం

భారత స్వాతంత్రోద్యమంలో మహిళలు తమ సహజ పరిమితులకు మించిన భాగస్వామ్యాన్ని అందించారు. బ్రిటీష్‌ ప్రభు త్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష్య కార్యకలాపాలలో పాల్గొని కొందరు పోరాటరంగాన అగ్రభాగాన నిలిస్తే మరికొందరు పరోక్షంగా జాతీయోద్యమానికి క్రియాశీలక తోడ్పటు నిచ్చారు. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న మహిళల వివరాలు కొంతలో కొంతగానైనా అందుబాటులో ఉన్నాయి. ఎందువల్లనంటే ప్రబుత్వాలు, తమను ఎదిరిస్తున్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి, వ్యక్తిగత రికార్డులను ద్రాపరుస్తాయి. ఉద్యమాలకు, ఉద్యామకారులకు పరోక్షంగా తోడ్పట నందించిన వారి గురించి రికార్డుల పరంగా సమాచారం లభించే అవకాశాలు అంతగా ఉండవు. అటువంటి వ్యక్తులు ఎంత త్యాగమయ సేవలను అందించినా, గొప్ప బాధ్యతలు నిర్వర్తించినా ఆయా వివరాలు గుప్తంగానే ఉండిపోతాయి. ఈ విధంగా పరోక్షంగా జాతీయోద్యమానికి ఎనలేని తోడ్పాటు అందచేసిన మహిళ శ్రీమతి ఫాతిమా బేగం.

బేగం ఫాతిమా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయాధురాలు. ఆమె జాతీయ కాంగ్రెస్‌ పంజాబ్‌ రాష్ట్ర శాఖ సభ్యురాలు. జాతీయోద్యమ లక్ష్యాలను ప్రజలకు వివరించి ఉద్యమ కార్యక్రమాల వైపు వారిని ఆకర్షించి ఉద్యమంలో చురుకుగా

33 పాల్గొనేట్టుగా చేయటంలో ఆమె దిట్టగా ఖ్యాతిగడించారు. ఈ విశిష్టతను గమనించిన జాతీయ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా జనచైతన్య కార్యక్రమాల బాధ్యాతలను ఆమెకు అప్పగించారు.

బేగం ఫాతిమా 1939 నుండి 1940 వరకు పంజాబ్‌ రాష్ట్రమంతా పర్యిస్తూ జాతీయోద్యమ లక్ష్యాలను, స్వరాజ్యం సాధించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో ప్రజలను కార్యోన్ముఖులను చే టంలో అద్వితీయ ప్రతిభను కనపర్చారు. ఆమె ఆకర్షణీయమైన విగ్రహం, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ప్రజలను తనవైపుకు ఇట్టే తిప్పుకునేవారు. విషయ వివరణ, ప్రత్యర్థుల వాదనను తిప్పికొడుతూ సాగించే సంవాదమ్, ప్రత్యర్థ్ధులను సహితం సమ్మోహితులను చేయటం ఆమె విశిష్టత.

భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు రాష్రంలో పలు సభలను, సమావేశాలను ఆమె ప్రతిభావంతంగా నిర్వహించారు. స్వయంగా ఆమె మంచి వక్త కావటంతో ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరిలో స్వరాజ్య కాంకను రగిలించారు. స్వరాజ్య సాధనా మార్గంలో ధనమాన ప్రాణాలను అర్పించేందుకు ప్రజలను సన్నద్దం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామ పోరాటయోధులను సమీకరించటం, నిబద్ధత గల ఉద్యామకారులను ఎంపిక చేయటంలో దిట్టగా ఆమె జాతీయ నాయకుల ప్రశంసలు పొందారు.

ఆ రోజుల్లో ఉద్యామకారుల మీద బ్రిటీష్‌ గూఢచారి దాళం ఎల్లప్పుడూ తీవ్ర నిఘా ఉంచేది. బ్రిటీష్‌ పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా వారి కన్నుగప్పి ఆమె తన కార్యకలాపాలను నిరాఘాటంగా సాగించారు. జాతీయ కాంగ్రెస్‌ ఆదేశాల మేరకు పంజాబ్‌ శాఖ అప్పగించిన బాధ్యాతలన్నింటినీ చాకచక్యంగా నిర్వహించిన ఫాతిమా బేగం జీవిత విశేషాలు చరిత్రపుటలలో సమగ్రంగా నిక్షిప్తం కాలేకపోయాయి.

జాతీయోద్యమ నాయకుల సంభాషణలలోని ప్రస్తావనలు, నేతలు పరస్పరం రాసుకున్న లేఖలలో దొర్లిన వాక్యాలు, ఆమె కార్యకలాపాలతో పరిచయం ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు డక్టర్‌ హషీం కిద్వాయ్‌ లాంటి పెద్దలు వెల్లడించిన వివరాల ద్వారా మాత్రమే ఫాతిమా బేగం ప్రశంసనీయ పాత్రకు సంబంధించిన విశేషాలు నమోదు కాగలిగాయి.

234