భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/మజీదా హసీనా బేగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కలకత్తా పారిశుధ్య కార్మికుల పెద్దమ్మగా ఖ్యాతిగడించిన

మజీదా హసీనా బేగం

భారతదేశంలోని విప్లవదళాలు బ్రిటిష్‌ ప్రభుత్వ పైశాచిక దాడులకు గురై, విప్లవకారులు భయంకర శిక్షలకు బలి కావటంతో స్వాతంత్య్రోద్యమంలో అగ్నియుగం గా భాసించిన విప్లవోద్యమం కొంత మేరకు బలహీనపడింది. మాతృభూమి విముక్తి కోసం ఆ యోధులు ప్రదర్శించిన అసమాన దేశబక్తి ప్రజలలో, ప్రదానంగా యువకులలో, త్యాగపూరిత ఆలోచనలకు అంకురార్పణ చేసింది. ఆ సమయంలో రష్యాలో ప్రజలు సాధించిన విజయం ప్రపంచ వ్యాపితంగా యువతరాన్ని ఉత్సాహపర్చింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఒకవైపున పోరాడటమే కాకుండ అన్నిరకాల దోపిడుకి వ్యతిరేకంగా ఉద్యామించాలన్న చైతన్యానికి ఆ ఉత్సాహం కారణమయ్యింది. ఈ మేరకు వెలువడిన చైతన్యదీప్తుల వెలుగులో అంకిత భావం గల యువత పుట్టుకొచ్చింది. ఆ వెలుగు దివ్వెలలో ఒకరు శ్రీమతి మజీదా హసీనా బేగం.

ప్రసుత పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాను ప్రదాన కేంద్రంగా చేసుకుని బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించి మజీదా హసీనా బేగం ప్రజా పోరాటాలకు నాంది పలికారు. జాతీయోద్యామంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరుతూ జనచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజలలో బ్రిటిష్‌ వ్యతిరేక భావాలను పెంపొందించారు. ఈ జనచెతన్య కార్యక్రమాలలో భాగంగా ఆమె సాగించిన పర్యటనల్లో కలకత్తా పట్టణాన్ని


123 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

శుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల దుర్బర పరిస్థితు లను స్వయంగా గమనించారు. సాfiతంత్య్రోద్యమకారిణిగా ఉద్యమాల అనుభవంగల ఆమె శ్రమ జీవులు కష్టనష్టాలను అనుభవపూర్వకంగా తెలుసుకుని అసహాయులైన కార్మికులను సంఘటితంచేసి కనీస హక్కుల సాధానకు సంకల్పించారు. ఆ దిశగా కార్మికులను సమైక్యపర్చి పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో పలు ఇక్కట్లకు గురయ్యారు, పలుమార్లు అరెస్టయ్యారు. బ్రిటిష్‌ పోలీసుల లాఠీ దెబ్బలను రుచి చూశారు.

ఆమె ప్రారంభించిన పోరాటానికి కార్మిక సంక్షేమం ఆశించే యువకులు, ప్రజలు అన్నివిధాల అండదండలిచ్చారు. కలకత్తా మహానగరంలోని పారిశుధ్య కార్మికులు, పేదాసాదా జనం మజీదా హసీనా బేగంను, తమ ఆత్మబంధువుగా మనస్సులలో ప్రతిష్టించుకుని ఆమె వెంట నడిచారు. కనీస హక్కులను సాధించుకున్నారు. ఈ విజయాలు హసీనా బేగంలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. ఆమె మరింతగా ఉద్యమించారు. బ్రిటిష్‌ ప్రబుత్వ ప్రజా వ్యతిరేక చర్య లను ఆమె ఏమాత్రం సహంచలేదు. ద్వితీయ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొని ఆమె జైలు కెళ్ళారు. పోరాటమే ఊపిరిగా తన కార్యక్షేత్రాన్ని నిర్దేశించుకుని కృషి ప్రారంభించిన ఆమె మహిళల సమస్యల మీద కూడ దృష్టిసారించారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆందోళను విసరింప చేశారు. జాతీయోద్యమం చివరి దశలో మతం పేరుతో మనుషులను చీల్చపూనుకున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమెకు వేర్పాటువాదుల నుండి ప్రమాద ఘంటికలు వినవచ్చినా ఏ మాత్రం అధైర్యపడకుండా ఆ శక్తుల కుయుక్తులను, కుట్రలను ఎండగడ్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేయగల ప్రసంగాలు చేస్తూ ప్రజలను సంఘటిత పర్చారు.

ఆమె నిరంతరం ప్రజల కోసం శ్రమించారు. ఆ కారణంగా ప్రజల ప్రశంసలను అందుకుమన్నారు. చివరకు ...the lady of incomparable audacity and uncommon dedication..darling of Calcutta scavengers..., అని ప్రముఖ చరిత్రకారుడు Prof.Santimoy Ray చే ప్రస్తుతించబడిన శ్రీమతి మజీదా హసీనా బేగం పలు విజయాలు సాధించి స్వాతంత్రోద్యమ చరిత్రలోనే కాకుండ, కార్మిక పోరాటాల చరిత్రలో కూడా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించారు.

124