భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం జొహరా అన్సారి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తల్లి తండ్రులను మించిన త్యాగగుణశీలి

బేగం జొహరా అన్సారి

( -1988)

భారత స్వాతంత్య్రోద్యమంలో వ్యక్తులు పాల్గొనటమే కాకుండ కుటుంబాలకు కుటుంబాలు పాల్గొని బ్రిటీష్‌ ప్రభుత్వ దాష్టీకాలను ఓర్పుతో భరించిన త్యాగశీలురైన కుటుంబ సభ్యులు జాతీయోద్యమ చరిత్రపు టలలో దర్ నమిస్తారు . ఆ విశిష్ట కుటుంబాలలో డక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి కుటుంబం ఒకటి. ఆ కుటుంబానికి చెందిన మహిళారత్నం బేగం జొహరా అన్సారి.

భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యాక్షపదవిని అత్యంత సమర్థ్ధవంతంగా నిర్వహించిన స్వాతంత్య్రోద్యమ నాయకులలో అగ్రగణ్యుడిగా ఖ్యాతిగాంచారు డాక్తర్ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి. అనితర సాధ్యమైన దాయాగుణంతో స్వయంగా మహాత్ముని వందనాలందుకున్న శ్రీమతి షంషున్నీసా అన్సారి, డాక్టర్ అన్సారిల పెంపుడు కూతురు బేగం జొహరా అన్సారి.

ఆనాడు జాతీయోద్యమానికి ఢిల్లీలోని డాక్టర్‌ అన్సారి గృహం ప్రధాన కేంద్రంగా ఉండేది. జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ కార్యక్రమం ఢిల్లీలో జరిగినా, ఆ సమావేశాలకు హాజరయ్యేవారికి అన్సారి ఇంట ఆతిధ్యం తప్పనిసరి. చిన్నారి జొహరా ఆ సమావేశాల ప్రాంగణంలో కలయతిరుగుతూ నాయకుల ఉపన్యాసాలు, చర్చలు వింటూ

221 చిన్ననాటినుండే జాతీయోద్యమం పట్ల అవగాహన, ప్రముఖ నేతలతో సన్నిహిత పరిచయాలను పెంచుకున్నారు. చిన్నతనంలోనే తల్లితండ్రుల్లా తాను కూడ స్వరాజ్యం కోసం బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిరయించుకున్నారు. ఆ నిర్ణయాలకు తగ్గట్టుగానే 1926లో జాతీయోద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న యువకులు ష్ధకతుల్లాను ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటినుండి ఆ యువ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని మరింత విస్తరింపచేసుకుని జాతీయోద్యమంలో అమితోత్సాహంతో పాల్గొన్నారు.

ఆదునిక ఆంగ్ల విద్యావంతురాలైన జొహరా బేగం సాంప్రదాయ విద్యను శ్రద్ధతో అభ్యసించారు. ఆమెకు ఉర్దూ, పర్షియన్‌, ఆంగ్లం, హిందీ, అరబిక్‌ భాషలు బాగా వచ్చు. చరిత్ర-సామాజిక శాస్త్రాలపట్ల ఆమె అధిక శ్రద్ధచూపారని Inside India గ్రంథంలో రచయిత్రి Halide Edib పేర్కొన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని విశాల దృక్పథాన్ని సంతరించుకున్న ఆమె సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పాించటంలో తగినంత శ్రద్ధా వహించారు. జాతీయోద్యామ మార్గంలో ఆ ఆచార సాంప్రదాయాలు ఆమెకు ఏవిధాంగా ఆటంకం కానివ్వకుండ, మరెవ్వరికీ బాధాకరం కాకుండ జొహరా బేగం వ్యవహరించారు.

మహాత్మాగాంధీచే బేటి అని ప్రేమతో పిలిపించుకున్న బేగం జొహరా అన్సారి వార్ధా ఆశ్రమంలో గాంధీజీ వద్దా చాలా కాలం గడిపారు. ఆశ్రమంలో ఆమె గాంధీజీకి చేదోడువాదోడుగా వ్యవహరించి, ఆయన మన్నన పొందినట్టు, గాంధీజీ రాసిన లేఖల ద్వారా తెలుస్తుంది. వార్దా ఆశ్రమంలోని వంటగదిలో ఆమె బేగం అముత్సలాంకు సహకరించేదని గాంధీజీ పేర్కొన్నారు. ఉర్దూ భాషను నేర్పందుకు జొహరాను తన గురువుగా వ్యవహరించమని గాంధీజీ స్వయంగా కోరటం విశేషం. ఆమె గాంధీజీకి చక్కని ఉర్దూ నేర్పారు. గాంధీజీ నేర్చుకున్న ఉరూబాషా పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోడనికి జొహరా బేగం రాసిన లేఖలు ఎంతో తోడ్పడ్డాయి. ఆశ్రమం నుండి వెళ్ళిపోయాక కూడ ప్రతి వారం గాంధీజీకి ఉత్తరం రాయటం ఆమె అలవాటు. ఆ లేఖలు ఉర్దూ భాషాభివృద్ధికి అవసరమగు సలహాలతో నిండి ఉండేవి. ఈ లేఖలను ప్రస్తావిస్తూ, ఆమె లేఖలు నా ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి...ప్రతివారం వచ్చే ఆమె లేఖల కోసం నేను ఎదురు చూసేవాడ్ని అని మహాత్ముడు పలుసార్లు పేర్కొనటం విశేషం.

222 జాతీయోద్యమంలో భాగంగా జైలుకెళ్ళేందుకు జోహరా అన్సారి ఉవ్విళారారు. బ్రిటిషు బానిస బంధానాల నుండి దేశాన్ని విముక్తం చేయటంలో భాగంగా జైలుకు వెళ్ళడం ఎంతో గౌరవమని ఆమె భావించారు. ఈ విషయ మై గాంధీజీ అనుమతి కోరుతూ ఆయనకు ఆమె పలు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలకు సమాధానంగా, ఆమె ఆరోగ్యం దృష్ట్యా కొంత సహనం వహించు. నీవు జైలుకు వెళ్ళేందుకు ఒక రోజున నేను తప్పకుండ అనుమతిస్తా, అని 1941 న్‌ 19నాి లేఖలో గాంధీజీ ఆమెకు నచ్చచెప్పారు.

చిన్నతనంలో తల్లితోపాటుగా జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడకు తాను హాజరయ్యేదానినని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ సమయంలో సేవాదళం కార్యకర్తలు నిర్వహించే పనులలో తాను భాగం పంచుకునేదానినని బేగం జొహరా పేర్కొన్నారు.స్వాతంత్య్ర సమరయోధాులైన తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జోహరా అన్సారి జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

జాతీయోద్యామ నేతలు, ప్రధానంగా గాంధీజీ ఆమెకు అప్పగించిన ప్రతి పనిని ఎంతో సమర్థ్ధవంతంగా నిరfiహించి ప్రశంసలందుకున్నారు. భారతదేశం నుండి బ్రిీష్‌ పాలకులను పూర్తిగా తరిమివేసి సంపూర్ణస్వరాజ్యాన్ని సాధించుకోవాలంటే, భారతీయ జన సముదాయాలలో ఐక్యతావశ్యకతను అమె గ్రహంచారు. ఆ కారణంగా ఆమె హిందాూ - ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛించారు. మతం పేరుతో ఆనాడు సాగిన వేర్పాటువాద ధోరణులను తీవ్రంగా నిరసించారు. మత సామరస్యాన్ని కాపాడాలని, మత విద్వేషం కూడదాని, మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టరాదని ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.

బేగం జొహరా అన్సారి దానగుణంలో తన తలిదడ్రులకు ఏమాత్రం తీసిపోకుండ వ్యవహరించారు. ఆమె తన కుటుంబానికి చెందిన ఆస్తిపాస్తులను జాతీయ ప్రయాజనాల కోసం త్యాగం చేయడనికి వెనుకాడలేదు. జాతీయోద్యమంలో పాల్గొన్న యోధుల కుటుంబాలను ఆమె ఆర్థికంగా ఆదుకున్నారు. 1946లో జరిగిన ఎన్నికల సందర్భంగా అఖిలభారత ముస్లింలీగ్‌ నాయకులు సాగిస్తున్న వేర్పాటువాద రాజకీయాలను ఎదుర్కొనడనికి నిధులు అవసరమని ఆమె తలచారు. ఐక్యతను చెడగొట్టి, ప్రజలలో విభజనకు కారణమవుతున్న విద్వేష, విభజన రాజకీయాలను ఆమె సహంచలేకపోయారు.


223 ఆ శక్తుల పరాజయాన్ని ఆమె ఆశించారు. అందుకు అవసరమగు నిధులను అందించేందుకు ఆమె ముందుకు వచ్చారు.

ఆనాటికి డాక్టర్ అన్సారి అపార ఆస్తిపస్తులు జాతీయోద్యమ కార్యక్రమాల కోసం కరిగి పోయాయి. స్వాతంత్య్ర సమరయోధులకు, కార్మిక ప్రముఖులకు, దేశ, విదేశీ ప్రముఖులకు ఎంతో గౌరవాభిమానాలతో అతిధ్యమిచ్చి, జాతీయోద్యమంలో నాయకుల చారిత్రక చర్ లకు, సంచలన నిర్ణయాలకు వేదికగా నిలిచిన DAR-US-SALAM భవంతి తప్ప మరోక విలువైన అస్తి ఆమెకు కన్పించలేదు. ఆ సమయంలో జాతి ప్రయోజనాల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధమని ఆమె, ఆమె భర్త ష్ధకత్‌ అన్సారి ప్రకిటించారు. ఆ ప్రకటనకు తగ్గట్టుగా DAR-US-SALAM భవంతిని, ఆ భవనం చుట్టూ ఉన్న సువిశాలమెన ఆవరణను అమ్మేశారు. ఆ విధగా DAR-US-SALAM ను విక్రయించగా లభించిన సొమ్మును జాతీయ కాంగ్రెస్‌ నాయకుల ఎన్నికల ప్రచారం కోసం జోహరా అన్సారి దంపతులు వ్యయం చేశారు. రాజప్రసాదాన్ని మించిన DAR-US-SALAM భవంతిని విక్రయించాక జోహరా అన్సారి దంపతులు మరొక చిన్న గృహంలోకి మారి అతి సాదాసీదా జీవితం గడిపారు.

భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించాక ఇతర నాయకుల వారసుల్లా ఆమెగాని ఆమె భర్తగాని ప్రభుత్వంలో ఎటువంటి పదవులను స్వీకరించలేదు. లక్షలాది రూపాయల ఆస్తిని జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలకు వినియోగించి అతి సామాన్య గృహిణిగా జీవితం గడిపిన జోహరా తమ ఆర్థ్ధిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా చెయ్యిచాచి ఎవ్వరిని సహాయం అడగలేదు. ప్రభుత్వం సహాకారం ఆశించలేదు.

స్వాతంత్య్రోద్యమం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, మత సామరస్యం కాపాడేందుకు, ప్రజలలో పరస్పరం సద్భావనలను పరిపుషం చేసేందుకు తమ జీవితాలు, ఆస్థిపాస్తులు కొంతవరకైనా ఉపయోగపడినందుకు సంతోషిస్తూ ఆమె కాలం గడిపారు. చివరకు 1988 లై 28న ఇంగ్లాండ్‌లో దానగుణసంపన్నురాలు శ్రీమతి బేగం జొహరా అన్సారి అంతిమ శ్వాస విడిచారు.

224