భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/బేగం అక్బర్‌ జెహాన్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రజల భవిష్యత్తు ప్రజలే నిర్ణయించుకోవాలని కోరిన

బేగం అక్బర్‌ జెహాన్‌

(1916-2000)

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహిళలు తొలిదశలో భర్తల ప్రోత్సాహంతో రంగ ప్రవేశం చేసినా ఆ తరువాత ఉద్యామబాటలో ఎదురయ్యే పరిస్థితులనుబట్టి తమ వ్యక్తిత్వాలను, సంపూర్ణ శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించి చరిత్ర సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. బేగం హసరత్‌ మోహాని, కుల్సుం సయాని, సాదాత్‌ బానో కిచ్లూ షంషున్నీసా అన్సారి ఈ కోవలోకి వస్తారు. ఆ కోవకు చెందిన కశ్మీరి మహిళ బేగం అక్బర్‌ జెహాన్‌.

అక్బర్‌ జెహాన్‌ 1916లో కశ్మీర్‌లోని గుజ్జర్‌ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి గుజ్జర్‌ కమ్యూనిీకి చెందిన ఆడపడుచు కాగా తండ్రి మైఖేల్‌ హ్యారి నిడోయ్‌ (Harry Nedou). తల్లి తండ్రులది ప్రేమ వివాహం. ఆమె తండ్రి మైఖేల్‌ హ్యారి నిడోయ్‌ క్రైస్తవ మతానికి చెందిన సంపన్న వ్యాపారి. ఆయన ఇస్లాం మతం స్వీకరించి తన పేరును షేక్‌ అహమ్మద్‌ హుస్సేన్‌గా మార్చుకున్నారు. షేక్‌ అహమ్మద్‌ హుస్సేన్‌ అక్బర్‌ జెహాన్‌ బేగం తల్లిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఆ వివాహం వలన తల్లి సంబందీకులైన గుజ్జర్‌ కమ్యూనిటీకి ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేసి వారికి దూరమయ్యారు. ఆ వ్యతిరేక పరిస్థితులలో కూడ ఆ దంపతులు ఎంతో ధైర్యంతో తమ జీవితాలను ఉజ్వలంగా మలచుకున్నారు. ఆ దంతుల తొలి సంతానంగా అక్బర్‌ జెహాన్‌ బేగం జన్మించారు.

అక్బర్‌ జెహాన్‌ బేగం మంచి కాన్వెంటు విద్యను గరిపారు. విద్యార్థిగా మంచి తెలివితేటలను ప్రదర్శించిన అక్బర్‌ జెహాన్‌ చక్కనిసౌందర్యరాశిగా ప్రజల మనస్సులను దోచుకున్నారు. ఆమె అందంలో అగ్రగామి మాత్రమే కాకుండ ధర్య సాహసాలలో కూడ అగ్రగణ్యురాలుగా ఖ్యాతిగాంచారు. చిన్నతనంతో తన తల్లికి సంబంధించిన గుజ్జర్‌ కమ్యూనిటీ ప్రజలు దూరం కావటం, తండ్రి పరదేశం నుండి వచ్చి కశ్మీరులో స్థిరపడిన వ్యక్తి కావటంతో ఆ కుటుంబం తొలిదశలో పలు ఇక్కట్లను ఎదుర్కొంది. తొలి సంతానంగా ఆ ఇక్కట్లును స్వయంగా అనుభవించిన అక్బర్‌ జెహాన్‌ బేగం ధైర్యశాలిగా స్వతంత్ర భావనలతో ఎదిగారు.

చిన్నవయస్సులో కరామత్‌ షా అను ఓ మత గురువుతో ఆమె తల్లితండ్రులు వివాహం జరిపించారు. ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదు. చివరకు ఆక్బర్‌ జెహాన్‌ బేగం భర్తను నుండి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె 1932లో షేక్‌ ముహమ్మద్‌ ఇబ్రహీం కుమారుడు, షేర్‌-యే-కశ్మీర్‌గా ఖ్యాతిగాంచిన షేక్‌ ముహమ్మద్‌ అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు. ఆమె వివాహాన్ని ప్రముఖ కవి డక్టర్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ తోడ్పటుతో ముఫ్తీ జియాయుద్దీన్‌ నిర్వహించారు.

విద్యాధికుడైన డక్టర్‌ అబ్దుల్లా తొలి నుండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయడనకి ఆసక్తి చూపారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలు విద్యావంతులైన తన మిత్రులతో కలసి రీడింగ్‌ రూం పార్టీ అను సంస్థ ఏర్పాటుకు దారి తీశాయి. ఈ సంస్థద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి వ్యవస్థాగతంగా శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో కశ్మీర్‌ ప్రజల సమస్యలను బయటి ప్రపంచానికి తెలియచేసేందుకు రీడింగ్‌ రూం పార్టీ సభ్యులు కృషిచేశారు. ఆ ప్రయత్నాలు ప్రజల మన్నన పొందాయి, కశ్మీరేతర ప్రజల అభినందనలు డాక్టర్‌ అబ్దుల్లాకు దక్కాయి. ఆ అనుభవంతో 1932లో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలికల్‌ కాన్పెరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పేరులో ముస్లిం అని పదం ఉన్నా, ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్పెరన్స్‌ కమ్యూనల్‌ పార్టీ ఏమాత్రం కాదన్నారు. కశ్మీర్‌ ప్రజల ఉద్యమం మతఉద్యమం కాదని ఇది రాజకీయ ఉద్యమమని ఆయన అన్నారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని డాక్టర్‌ అబ్దుల్లా ప్రకించారు. ‘Muslim conference is not a communal organization and its existence will help all communities living in the State. The Kashmir agitation is not a communal movement but a political movement for redress of all people living in the state. We assure all our brethren whether they be Sikhs or Hindus, that we are ready to fight for their cause also ‘ - Encyclopedia of Muslim Biography, Ed. by Nagender Kr. Singh, APHPC, New Delhi, 2001, Page. 173)

ఆ ప్రకటన మేరకు అబ్దుల్లా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు. మతంతో సంబంధ లేకుండ ఆల్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌ ముసిం పొలిటికల్ కాన్పెరన్స్‌లో అందరికి ప్రవేశం కల్పించారు, ఆ సందర్భంలో బేగం అక్బర్‌ జెహాన్‌ భర్త అబ్దుల్లాకు తోడుగా నిలిచారు. ఆ క్రమంలో మహాత్మాగాంధీ, మౌలానా ఆజాద్‌, పండిత నెహ్రూ, అలీ సోదరుల ప్రబావంతో 1938 ప్రాంతంలో అబ్దుల్లా తన ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ముస్లిం పొలిటికల్‌ కాన్పెరెన్స్‌ను ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ నేషనల్‌ పొలిటికల్‌ కాన్పెరెన్స్‌గా మార్చారు.

ద్వితీయ ప్రపంచ సంగ్రామం సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆల్‌ జమ్మూ అండ్‌ కశ్మీర్‌ నేషనల్‌ పొలిటికల్‌ కాన్పెరెన్స్‌ కూడ క్విట్‌ఇండియా తీర్మానానికి మద్దతు పలికింది. జాతీయ కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. జమ్మూ-కశ్మీర్‌లో క్విట్ ఇండియా నినాదం ప్రతిధ్వనించింది. ఈ సందర్బంగా డాక్టర్‌ అబ్దుల్లా మ్లాడుతూ ఇండియా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇండియా భూభాగంలోని నాల్గవ వంతు కలిగి ఉన్న సంస్థానాధీశులు స్వరాజ్యం విషయంలో విద్రోహులయ్యారు. సంస్థానాధీశులు వెళ్ళిపోవాలన్న డిమాండ్‌క్విట్ ఇండియా ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే, అని ఆన్నారు.

‘India is fighting against imperialism. The rulers of the Indian States who posses’ 1/4th of the country have always played the role of the traitors to the cause of Indian Freedom. The demand that the Princely States should quit is a logical extension of the policy of Quit India’ Encyclopedia of Muslim Biography: Page. 174) 1946 ప్రాంతంలో భారత దేశానికి బ్రిటీష్‌ ప్రభుత్వం పంపిన క్యాబినెట్ మిషన్‌ ఫెడరల్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రతిపాదించింది. ఇండియా నుండి బ్రిటీషర్లు వైదొలిగాక సంస్థానాధీశుల స్థానంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడాలని డాక్టర్‌ అబ్దుల్లా ఆశించారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి ఆయన ఉపక్రమించగా ఆయనతోపాటుగా బేగం అక్బర్‌ జెహాన్‌ ఉద్యమించారు. ఈ ఉద్యమాన్ని ఆ దంపతులు కశ్మీర్‌ సంస్థానం వరకు పరిమితం చేయలేదు. ఆనాడు ఇండియాలోని సుమారు 600 సంస్థానాలలోని ప్రజలను ఈ విషయమై చైతన్యపర్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు డాక్టర్‌ అబ్దుల్లా క్యాబినెట్ మిషన్‌కు మహజరు కూడ సమర్పించారు. బ్రిటీషు ప్రభుత్వం అధికారంలో నుండి వైదొలిగాక ప్రభుత్వాధికారాన్ని ప్రజల పరం చేయాలని, సార్వభౌమత్వం ప్రజల చేతుల్లో ఉండాలని ఆ మహజరు కోరింది. ఆ నేపథ్యంలో క్విట్ కశ్మీర్‌ ఉద్యమానికి డాక్టర్‌ అబ్దుల్లా శ్రీకారం చుట్టారు. ఉద్యమం ఉదృతంగా సాగింది. అరెస్టుల పరంపరలో భాగంగా 1946 మే మాసంలో బేగం అక్బర్‌ జెహాన్‌ భర్త అబ్దుల్లాను ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణల మీదా తొమ్మిది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఆ సమయంలో బేగం అక్బర్‌ జెహాన్‌ రంగంలోకి దిగారు. అంతవరకు పరోక్షంగా భర్త అబ్దుల్లాకు సహాయకారిగా ఉన్న ఆమె ప్రత్యక్షరాజకీయాలలోకి ప్రవేశించారు. ఆమె స్వయంగా గ్రామాలకు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలను కూడగట్టారు. బాధితులను ఆదుకున్నారు. ప్రజలలో భయాలను తొలగించి ఆశాజ్యోతులను వెలిగించారు. క్విట్ కాశ్మీర్‌ ఉద్యమానికి ప్రజల మద్ధతు సాధించేందుకు ఆమె నడుం కట్టారు . జనసమూహాలను ప్రబావితం చేయగల విధగా చర్యలు తీసుకున్నారు. ఆ కారణంగా క్విట్ కశ్మీర్‌ ఉద్యమానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. కశ్మీర్‌ ఉద్యమం సందర్భంగా ప్రజలను సమీకరించగల శక్తియుక్తులు, ఆమెలో నిబిఢుకృతమై ఉన్న శక్తి సామర్థ్యాలు బహిర్గత మయ్యాయి. డాక్టర్‌ అబ్దుల్లా జైలులో ఉన్న సమయంలో కశ్మీర్‌ వచ్చిన మహాత్మా గాంధీని ఆమె స్వయంగా కలుసుకుని చర్చించారు. (‘ Her ability to mobilize people came to the fore during ‘ Quit Kashmir ‘ movement and subsequently when her husband was in prison in 1946-47 as she came out of the confines of home and visited villages of the state and burn the ‘ lamp of hope ‘ for the oppressed people.’ - The Legend Makers Some Eminent

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf

కుమారుడు ఫరూఖ్‌ అబ్దుల్లా మంత్రివర్గంతో ఆక్బర్‌ జహాన్‌ బేగం Muslim Women of India, Gouri Srivastava, Concept Publishing Company, New Delhi, 2003, Page.108 -109).

1947 న్‌లో లార్డు మౌంటుబాటన్‌ తన ప్రణాళికను వెల్లడించాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా భారతదేశం రెండుగా చీలిపోవటం ఖాయమయ్యింది. ఆ సమయంలో పండిత నెహ్రూ సలహా మీదా డాక్టర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయన విడుదల కాగానే కశ్మీరు సంస్థానం భవిష్యత్తును ప్రజలు నిర్ణయించాలి తప్ప సంస్థానాధీశులు నిర్ణయించటం సముచితం కాదని ప్రకటించారు. ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఆయనతో ఏకీభవించారు.

ఇండియా విభజన సందర్భంగా పాకిస్తాన్‌ నాయకుల ప్రేరణతో కశ్మీరును ఇండియా నుండి దూరం చేయాలని ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. కశ్మీరులోని గిరిజన జాతులను రెచ్చగొట్టి జమ్మూ-కశ్మీరులోని కొన్ని ప్రాంతాల ఆక్రమణకు ప్రయత్నాలు సాగాయి. ఆ ప్రమాదకర పరిస్థితులలో డాక్టర్‌ అబ్దుల్లా, బేగం అక్బర్‌ జెహాన్‌ తమ నిర్ణయాల మీద స్థిరంగా నిలబడ్డారు. పాక్‌ ప్రేరిత ఆక్రమణదారులను తిప్పికొట్టేందుకు ప్రజలను కూడగట్టారు . ప్రజలను భయ భ్రాంతుల్ని చేయడానికి వ్యాపింపచేస్తున్న పుకార్లను ఖండిస్తూ అబ్లుల్లాతో పాటుగా అమె కూడ వీధుల్లోకి వచ్చి ప్రజలకు నచ్చచెప్పి భీతాహులు కాకుండ పరిస్థితులను అదుపులోకి తీసుకరావటంలో అమె తొడ్పడ్డారు

ఆ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్లా మ్లాడుతూ ఈనాడు పాకిస్తాన్‌ నుండి బయలుదేరిన ఆక్రమణదారులు శ్రీనగర్‌ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు. వాళ్ళు ఇస్లాం నినాదం చేస్తున్నారు. మీరు నావెంట ఉంటారో వారితో కలుస్తారో తేల్చుకోవాల్సింది మీరే.. నాతో ఉండాలనుకుంటే మనం హిందూ, ముస్లిం, శిక్కులంతా కలసి ఆన్నదమ్ముల్లా జీవించాలన్న సూత్రానికి బద్ధులై ఉండాలి. ఈ విధానం ఓ 'కాఫిర్‌'దిగా మీరు భావిస్తే, మీరు మీ ఆయుధాలను ముందుగా నామీద ప్రయోగించండి. మీరు 'కాఫిర్‌'ల మీద దాడులు, అత్యాచారాలకు పాల్పడదలిస్తే దానిని నా కుటుంబం నుండి ఆరంభించండి అని అన్నారు.

('..Today the raiders from Pakistan are a few miles from Srinagar. Tehy are raising the slogan of Islam. It is open to you to be with them or tobe with me...If you opt to be with me you must know that you have to live for all times on the principle that Hindus, Muslims and Sikhs are brothers. If that is the language of a Kafir you should raise your sword first against me. If you want to raid or rape ' Kafirs ' I am the first Kafirand you must start it from my place and my family. ' - Encyclopaedia ofMuslim Biography, Page. 174)

ఆ తరువాతి కాలంలో వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనల మూలంగా డాక్టర్‌ అబ్దుల్లా అరెస్టులకు, జైలు శిక్షలకు గురవుతూ వస్తున్నసందర్భంగా బేగం అక్బర్‌ జెహాన్‌ అటు పార్టీ శ్రేణులను కాపాడుకుంటూ ఇటు కుటుంబీకుల పట్ల ఉన్నబాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతూ అబ్దుల్లా గైర్హాజరిని వారి అనుభవంలోకి రానివ్వకుండ చూడటంలో ప్రధాన పాత్ర వహించారు. జమ్మూ-కశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయశూన్యత నుండి కార్యకర్తలను కాపాడుకుంటూ వారిలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్నినింపారు. కశ్మీరు లోయలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండ ఆమె ఎంతగానో సహాయపడ్డారు.

( '..filled in the vacum and helped in maintaining peace in the vally and unity in the ranks of his followers. ' Encyclopaedia of Muslim Biography, Page. 173)

1947-48 నాటి భయానక పరిస్థితుల నుండి జమ్మూ-కాశ్మీర్‌ను కాశ్మీర్‌ ప్రజలను కాపాడేందుకు డాక్టర్‌ అబ్దుల్లా దంపతులు ముందుకు వచ్చారు. పాక్‌ ఆక్రమణదారులు కశ్మీరు ప్రజల మీద సాగిసున్న దాడులను ఖండించారు. ఆ దాడులలో గాయపడిన వారిని, ఆస్థిపాస్తులను కొల్పోయి నిరాశ్రయులై ప్రజలను ఆదుకునేందుకు