భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ఫాతిమా యఫ్.తయ్యాబ్ అలీ
పండు వయస్సులో క్రూడా ప్రజాసేవకు వెనుకాడని
ఫాతిమా యఫ్.తయ్యాబ్ అలీ
( 1902-)
ప్రఖ్యాతి నొందిన గుజరాత్ తయ్యాబ్జీల కుటుంబానికి చెందిన మరో మహిళ శ్రీమతి ఫాతిమా తయ్యాబ్ అలీ. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తనదైన పాత్రనిర్వహించిన ఆమె 1902 నవంబరు 2న గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. తండ్రి పేరుఅబ్దుల్ అలీ. మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ సర్దార్ వల్లబాయి పటల్ లాంటి ప్రముఖులరాజకీయాలోచనలతో ఆమె ప్రభావితమయ్యారు.
తయ్యాబ్ అలీతో వివాహం తరువాత ఆమె జాతీయ కాంగ్రెస్‌లో సభ్యతస్వీకరించారు. జాతీయోద్యామంలో ప్రవేశించిన పిమ్మట గాంధీజీ అనుమతితో వ్యక్తిగత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఖద్దరు ధరించారు. ప్రజలలో ఖద్దరు ధారణను ప్రోత్సహించారు. మహిళలను చెతన్య పర్చందుకు ఎంతగానో కృషి చేశారు.క్విట్ ఇండియాఉద్యామంలో చురుగ్గా పాల్గొని రండుసార్లు కారాగారానికి వెళ్ళారు. ప్రజాచైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆమె పలు పర్యటనలు జరిపారు.
బ్రిీష్ బానిస బంధనాల నుండి భారతదశం విముకమయ్యాక ఫాతిమా తయ్యాబ్ అలీ సామాజిక సేవకు అంకితమయ్యారు. గుజరాత్ రాష్ట్రంలోని ' పడేలా ' గ్రామాన్ని దాత్తత తీసుకుని మహాత్ముని మార్గంలో ఆ గ్రామాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించారు. ఆమె కృషి ఫలించి పడేలీ గ్రామం, అహమ్మద్ నగర్ జిల్లాలో ఆదర్శగ్రామంగా ఖ్యాతి
గడించింది.
ఈ మేరకు ఆమె వృద్ధ్యాప్యాన్నికూడ లెక్క చేయక గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా అంకితమై పనిచేశారు. ఆ కృషికి గుర్తింపుగా శ్రీమతి ఫాతిమా తయ్యాబ్ అలీని భారత ప్రభుత్వం విశిష్ట మహిళ పురస్కారం అందించి గౌరవించింది. 150