Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/జులేఖా బేగం

వికీసోర్స్ నుండి

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు స్పూర్తి ప్రదాత

జులేఖా బేగం

(1893-1942)

భర్తతో పాటు భుజం భుజం కలిపి కొందరు మహిళలు జాతీయోద్యమంలో పాల్గొంటే, ఉద్యమకారుడైన భర్త దృష్టిని కుటుంబ సమస్యల వైపుకు మళ్ళనివ్వకుండ స్పూర్తిని ప్రసాదించిన మహిళామణులు మరికొందరు. ఈ మేరకు పోరాట జీవితంలోని కడగండ్లను స్వయంగా భరించి స్వాతంత్య్ర సమరయాధు డైన జీవిత భాగస్వామిని మాతృదేశ సేవకు అర్పించిన సతీమణులలో ప్రముఖులు శ్రీమతి జులేఖా బేగం.

దశాబ్దానికి పైగా జైలు జీవితం గడిపిన మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ భార్య బేగం జులేఖా 1892-93 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. ఆమెకు 7-8 సంవత్సరాల వయస్సు ఉండగా అనగా 1900-01 ప్రాంతంలో 12-13 ఏండ్ల వయస్కుడైన అబుల్‌ కలాం ఆజాద్‌తో వివాహం జరిగింది. ఆ ఇద్దరు తగిన వయస్సు వచ్చాక భార్యభర్తలుగా నూతన జీవితాన్ని ఆరంభించారు. (మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ (హిందీ), క.సి యాదవ్, హోప్‌ ఇండియా పబ్లికషన్స్‌ , గుర్‌గావ్‌, 2004, పేజీ.17). ఆ దంపతులకు హసీన్‌ అను కుమారుడు కలిగాడు. బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో నిరంతరం గడుపుతున్న భర్త ఇంట ఉంటున్న సమయం తక్కువ కావటంతో కుమారుడి

129 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రాక ఆమెకు కొంత ఊరట కలిగించింది. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. తల్లితండ్రులమయ్యామని మౌలానా దాంపతులు సంతోషించేలోగా నాలుగు సంవత్సరాల వయస్సు గల ఆ పిల్లవాడు మరణించాడు. కుమారుని మరణం జులేఖా బేగం దంపతు లను కలచి వేసింది.

జులేఖా బేగం నూతన జీవితాన్ని ఆరంభించేందుకు మెట్టినింట అడుగు పెట్టేసరికి మౌలానా ఆజాద్‌ బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో భాగస్వాములయ్యారు. విప్లవోద్యమంతో బ్రిటిషు వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన ఆయన ఆ తరువాత మహాత్ముని మార్గంలో పయనం ఆరంభించారు. మౌలానా బెంగాల్‌ కేంద్రాంగా జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్రను స్వీకరించి బాధ్యతలు నిర్వహించసాగారు. అచిరకాలంలోనే ఉర్దూ పత్రిక అల్‌ హిలాల్‌ సంపాదకునిగా, రచయితగా, బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక పోరాటయోధుడిగా రూపొందిన మౌలానా క్షణం తీరుబడి లేకుండా కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఆ విధగా మౌలానా రచయితగా సాహిత్యరంగంలో శ్రమిసున్నా, విముక్తి పోరాట యోధు డిగా రాజకీయ రంగంలో నిమగ్నమైయున్నా జులేఖా బేగం ఆయనకు నిరంతరం తోడ్పాటునందించారు. ఏ విధమైన కష్టం కలగకుండా, ఆయన దృష్టి కుటుంబ సమస్యల మీదకు మళ్ళకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.

మౌలానా ఆజాద్‌ 1916లో మొట్టమొదట సారిగా నిర్బంధానికి గురయ్యారు. ఆ సందర్భంగా ఆమె మానసిక స్థితిని తెలియచేస్తూ ఆజాద్‌ ఇలా రాశారు. ఆమె తన భావోద్వేగతను ఆపుకోలేకపోయింది. తరువాత చాలా కాలం వరకూ నేనామెను క్షమించ లేదు. ఆ సంఘటన ఆమెను పూర్తిగా మార్చివేసింది. నా జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకు ని నిలబడే స్థయిర్యాన్ని అలవర్చుకుంది. (అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, అర్షమల్సియాని, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1983. పేజీ.111) ఆ నిర్బంధం సందర్భంగా రాంచీలో ఆయన మూడు సంవత్సరాలు గడపారు. ఆ సమయంలో ఆమె భర్త నిర్వహిస్తున్న కార్యక్రమాలు కుంటుపడకుండా తన పరిధుల మేరకు స్వయంగా చర్య లు తీసుకున్నారు.

1920లో మౌలానా జైలు నుండి విడుదల కాగానే ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. మౌలానా ఇల్లు విడిచి, ఇల్లాలిని మరచి ఖిలాపత్‌-సహాయ నిరాకరణ ఉద్యామానికి పూర్తిగా అంకితమయ్యారు. ఈ సందర్భంగా బ్రిటిషు పాలకుల చర్య లను విమర్శిసూ, వారి చర్య ల మీద నిప్పులు చెరిగే ఉపన్యాసాలు చేస్తూ పర్య టనలు


130 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

గావించారు. అందుకు ఆగ్రహంచిన ప్రబుత్వం 1921 డిసెంబరులో ఆయనను కలకత్తాలో అరెస్టు చేసింది. విచారణ తరువాత 1922 ఫిబ్రవరిలో ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుచెప్పింది.

ఈ సందర్బంగా ఎప్పుడూ బయటకు రాకుండ ఇంటిపట్టున కాలం గడుపుతున్న జులేఖా బేగంలోని అత్మవిశ్వాసం, దేశభక్తి, మాతృభూమి పట్ల తనకున్నబాధ్యత, జాతీయోద్యామం పట్ల ఉన్ననిబద్ధత బహిర్గతమయ్యాయి. మౌలానాకు శిక్ష పడటం పట్ల ఆమె ఆశ్చర్యపడలేదు. అందుకు ఆమె మానసికంగా సిద్ధాంగా ఉన్నారు. మౌలానాకు చాలా తక్కువ శిక్షపడినందుకు ఆమె అగౌరవంగా భావించారు. ఈ విషయాన్ని, ఈ రోజున నా భర్త కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. మేము అనుకున్న దానికంటే ఇది చాలా తక్కువ. నా భర్తకు అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తారని అనుకుంటా అని గాంధీజీని ఉద్దేశించి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. (Understanding The Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, New Delhi, 1987, Page. 228-229)

మౌలానాను అరెస్టు చేయటంతో కలకత్తా కేంద్రంగా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు జులేఖా బేగం ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని గాంధీజీకి రాసిన లేఖలో, నా భర్త అరెస్టు వలన బెంగాల్‌ ఖిలాఫత్‌ కమిటీ కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడిన ఖాళీని నా కృషితో భర్తీ చేస్తాను. ఆయన ఇక్కడుంటే జరిగే పనులన్నీ యధాతదంగా జరుగుతాయని తెలుపుకుంటున్నాను. గతంలో నా భర్త నిర్బంధలో ఉన్నప్పుడు నా శక్తి మేరకు ఆయన బాధ్యతలను నేను నిర్వర్తించాను. గత ఐదు సంవత్సరాల నుండి నా ఆరోగ్యం బాగాలేదు. మానసికంగా బలహీనంగా ఉన్నాను. నా ఆనారోగ్యం దృష్ట్యా నా విధిని నేను నిర్వహించేందుకు మౌలానా అనుమతించేవారు కారు. అయినప్పటికి ఈ నశ్వరమైన శరీరాన్ని ఖిలాఫత్‌ ఉద్యమానికి సంపూర్ణంగా అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను, అని రాశారు.

మౌలానా రాజకీయ కార్యకలాపాలలో ఎంతో తోడ్పాటు అందించిన ఆమె ఆయన సాగించిన సాహితీ వ్యవసాయంలో ఆమె చేయూత ఎంతో ఉంది. ఓసారి నిద్రాలేమి వలన ఎర్రగా మారిన ఆమె కళ్ళను చూసి ఆమె మరదలు కళ్ళు అలా ఉన్నాయేంటని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ మధ్యాకాలంలో మౌలానా

131 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

గారు ఖురాన్‌ తర్జుమా గావిస్తున్నారు. రాత్రి 2 గంటల తరువాత లేచి కూర్చోని ఆయన ఎంత సేపు ఆ పనిలో ఉంటారో అంతసేపు నేనూ మేల్కొని ఆయనకు వింజామర వీస్తూ గడుపుతున్నాను. బాగా ఉక్కపోతగా ఉంది కదా. ఆయన మేల్కొని పనిచేస్తుంటే నేనెలా నిద్రపోగలను చెప్పు? (Bharath Ke Swatantra Samg ram me Muslim Mahilavonka Yogdan (Hindi), Dr. Abida Samiuddin, IOS, New Delhi, 1997 Page.168) అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాధానం దాfiరా ఆమెలోని సేవాగుణం, భర్తకు అందచేసిన సేవల తీరుతెన్నులు వెల్లడవుతున్నాయి.

1923 ప్రాంతంలో తన 35 సంవత్సరాల వయస్సులో మౌలానా భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షు లుగా ఎంపిక కావటంతో ఆయ న కార్య క లాపాలు బాగా విస్తృతమయ్యాయి. అప్పటి నుండి ఆయన రాజకీయాలలో మరింత బిజీ అయ్యారు. భారతదేశం అంతా పర్యటిస్తూ, కార్యక్రమాలలో పాల్గొంటూ, అరెస్టులు, జైళ్ళల్లో గడుపుతూ మౌలానా ఇంటిపట్టున ఉండటమే కరువైంది.1939లో మరోసారి ఆయన జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షస్థానం అలకరించారు. స్వాతంత్య్రోద్యమం అతి కీలక దశలో ఉన్నందున జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు మరింతగా పెరిగాయి. ఆ సమయంలో ఆయనకు భార్య గురించిగాని, ఆమె ఆరోగ్యం గురించిగాని, ఆర్థిక పరిస్థితుల గురించి గాని పట్టించుకునే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. ఆ బాధాకరమైన వాతావరణాన్ని ఏకాంతంగా భరిస్తూ, అన్ని అవస్థలను సహిస్తూ జులేఖా బేగం గడిపారు.

ఆ క్రమంలో భర్తకు అన్ని విధాల తోడ్పాటు అందించటం మాత్రమేకాకుండ అవసర సమయాల్లో ఇంటి నుండి బయటకు వచ్చి భర్త స్థానాన్ని భర్తీ చేయడానికి సాహసించిన జులేఖా బేగం అంతితో ఆగలేదు. స్వాతంత్య్రసమరంలో పాల్గొంటున్న ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటూ పట్టుదల సడలిపోకుండ ఆ త్యాగమూర్తులు సమరభూమిలో సాగిపోవడానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఆమె తన అనారోగ్యాన్ని లెక్కచేయలేదు. ఆ కారణంగా నా భావాలను విశ్వాసాలను పంచుకోనడమే కాక నా జీవితంలో నిజమెన సహచరిణిగా నిలచింది అని ఆమె గురించి ఆజాద్‌ స్వయంగా పేర్కొన్నారు. (అబుల్‌ కలామ్‌ ó పేజి. 111)

1941లో జులేఖా బేగం అనారోగ్యం తీవ్రతరమయ్యింది. స్థల, జల మార్పిడి

132 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

చేస్తే ఆమె ఆరోగ్యం కుదటపడుతుందని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు జులేఖా బేగం కలకత్తా వదలి రాంచీ వెళ్ళారు.ఆరోగ్యం కొంత మెరుగుపడ్డాక 1942 జూలై 31న తిరిగి కలకత్తా వచ్చారు. ఆమె కలకత్తాకు వచ్చి నాలుగు రోజులు గడవక ముందే ఆగస్టు 1942న మౌలానా కలకత్తా నుండి అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు బొంబాయికి బయలుదేరాల్సి వచ్చింది.

మౌలానా బొంబాయికి బయలు దేరుతున్నప్పుడు చివరి సారిగా వీడ్కోలు పలికిన ఆవేదనాభరిత సంఘటనలో జులేఖా బేగం ప్రవర్తన తీరు గురించి India Wins Freedom (page.95) లో ఆజాద్‌ రాస్తూ, ఆగస్టు 3న బొంబాయి బయలేరుతున్నప్పుడు ఎప్పటివలే నన్ను సాగనంపడానికి ఆమె వీధి గుమ్మం వరకు వచ్చింది. అనూహ్యమైన పరిస్థితులేమి ఎదురవ్వకపోతే 13న తిరిగి వస్తానని చెప్పాను.' ఖుదా- హాఫీజ్‌ ' అన్న మాటతప్ప ఇంకొక్క మాట ఆవిడ నోివెంట రాలేదు. ఆమె ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నా, దుఖం ఛాయలు ఆమె ముఖం మీద తారాడుతున్నాయి. ఆమె కళ్ళు వర్షించటం లేదు కాని ఆమె మోము బాధను వ్యకంచేస్తుంది. నేను గతంలో అనేకసార్లు ఆమెను వదలి వెళ్ళాను. నేనప్పుడూ ఆమెను అంత బాధాతప్తంగా చూడలేదు అని వివరించారు. (Understanding The Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, New Delhi, 1987, Page. 240).

ఆ విధంగా బొంబాయి వెళ్ళిన మౌలానా పలు కారణాల మూలంగా భార్యకు వాగ్దానం చేసినట్టు కలకత్తాకు రాలేకపోయారు. బ్రిటిషు ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి నైనిటాల్‌ జైలులో బంధించింది. ఆ సమయంలో జులేఖా బేగం ఆయనకు పలు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలలో ఎక్కడ కూడ తన అనారోగ్యం గురించి పేర్కొనలేదు . ఆమె ప్రాణాంతక రుగ్మతతో తీవ్రంగా బాధాపడుతున్నందున, ఆ పరిస్థితిని మిత్రుల ద్వారా, పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా మాత్రమే మౌలానా తెలుసుకున్నారు. ఆయనను పెరోల్‌ మీద విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకు తలవంచి భార్యను చూడడానికి మౌలానా నిరాకరించారు. ఈ విషయం మీద జవహర్‌ లాల్‌ నెహ్రూ˙తోపాటుగా ఇతర నాయకులు కూడ ఎంతగా నచ్చచెప్పినా అవమానకర ఆంక్షలను శిరసావహించి పెరోల్‌ మీద విడుదల పొందాడనికి మౌలానా ఆజాద్‌ ససేమిరా అంగీకరించలేదు.

133 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

బేగం జులేఖా అనారోగ్యం రోజురోజుకు తీవ్రతరమైంది. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు భర్త కడసారి చూపుకు నోచుకోకుండానే 1943 ఏప్రిల్‌ 19న భర్తకు 1500 మైళ్ళ దాూరంలో ఉన్న కలకత్తాలో జులేఖా చివరి శ్వాసవిడిచారు. ఆమె కన్నుమూసిన విషయం తెలిసిన మౌలానా ఆజాద్‌ మా 26 సంవత్సరాల వైవాహిక జీవితం సమాప్తమయ్యింది. మృత్యువు మా మధ్యాన అడ్డుగోడలు నిర్మించింది అంటూ నిస్సహాయంగా విలపించారు.

ఈ విధంగా జీవితాంతం మౌలానాకు మానసిక స్థైర్యాంన్ని కలుగచేస్తూ, ఆయన మనస్సు విముక్తి పోరాటం మీదా లగ్నమయ్యే విధంగా తోడ్పడిన జులేఖా బేగంలోని పట్టుదల, ధైర్యసాహసాలనులను, త్యాగాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎంతో ధైర్యశాలి, నా ఆలోచనల ఆచరణలో ఆమె సహ భాగస్వామి. ఆమె తోడ్పాటు లేనట్టయితే నా రాజకీయ జీవితం అసంపూర్ణంగా మిగిలిపోయేది అని మౌలానా అబుల్‌ కలాం అన్నారంటే ఆయన జీవిత సహచరిణిగా ఆమె ఎంతి మహత్తర పాత్రను నిర్వహించారో అర్థ్ధమౌతుంది.

స్వాతంత్య్రోద్యామంలో బేగం జులేఖా నిర్వహించిన పాత్రను సక్రమంగా అర్థ్దం చేసుకున్నందున ఆనాడు మౌలానాతోపాటుగా దేశమంతా శోకసంద్రమయ్యింది. భారత దేశం యావత్తు ఆమెకు శ్రద్దాంజలి ఘటించింది. ఆది నుండి మౌలానా రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లింలీగ్ కూడ ఎంతో గౌరవంతో ఆమెకు అంజలిఘటిస్తూ ప్రత్యేక సమావేశం జరిపి సంతాప తీర్మానాలు చేసింది. ఆ తీర్మానాలలో జులేఖా బేగం త్యాగ నిరతిని, లక్ష్యం పట్ల ఉన్ననిబద్ధ్దతను కొనియాడటం విశేషం.

స్వాతంత్య్రోద్యమంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనక పోయినప్పటికీ జీవిత భాగస్వామిని విముక్తి పోరాటానికి అంకితం చేసి, భర్తకు నైతిక, మానసిక బలాన్ని అందించి ఆయన దాష్టి స్వరాజ్యమను మహత్తర లక్ష్యం దిశగా సాగేందుకు తోడ్పడి పరోక్షంగా స్వాతంత్య్రసంగ్రామంలో భాగస్వామ్యం అందించి శ్రీమతి జులేఖా బేగం పునీతులయ్యారు.

నా భర్తకు శిక్ష పడినందుకు సంతోషంగా ఉంది. ఆందుకు ఆ ప్రభువుకు నా సాష్టాంగ ప్రణామములు. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తా. ఆ కంటక ప్రాయమెన మార్గంలో సాగి నా ప్రాణాలను బలివ్వడానికి కూడ నేను సిద్ధం. - సాదాత్‌ బానో కిచ్లూ

134