భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తొమ్మిదవ ప్రకరణము

మూల్యము - ప్రయోజనము

శ్రమయెట్లో యట్లే ఖరీదు నిచ్చుటయు గష్టమైనపని. ఈ కష్టమున కన్న వస్తులాభమువలన గలుగు సుఖ మెక్కువయని తోచినంగాని యెవడును దానింగొనడు. వినిమయ కార్యంబులయందెల్ల నిచ్చు వస్తువుయొక్క యంత్యప్రయోజనమునకన్న గొనువస్తువుయొక్క యంత్యప్రయోజన మొకింతయైన నెక్కువగ నుండునను న్యాయము నిత్యము, ఇట్లు కష్టము వ్యవకలితముకాగా మిగిలిన సుఖమునకు "వినియోజకులకు అబ్బు శేష" మని పేరు.

వినియోజకశేషము

దీనిని గొలతవెట్టుట యెట్లనగా. ఒకవస్తువును బొందక పోవుటకన్న నేమాత్రము నిచ్చియైన గొనితీరవలయునని తలంపు గొందుమో యామాత్రము ధరలోనుండి సాక్షాత్తుగా నిచ్చినధరను ద్రోపుడు సేయుటచేత. ఉదా. ఉప్పు. ఇది యపూర్వమైనచో వరహాలనైననిచ్చి కొందుము. సర్వసాధారణముగ బండునది గావున గొన్నిపైసలైన నిచ్చుటయేలయని యలజడి వహింతుము. కావున లవణసంపాదనమున శేషసుఖ మత్యంతమనుట సువ్యక్తము.

ఆవరణ మహాత్మ్యము

యీ సుఖమును మనము స్వయముగ నార్జించితిమా? యోచించి చూచిన కాదనుట నిర్వివాదాంశము. ఖరీదు మన మిత్తుమనుట నిజమేయైనను ఖరీదంత తక్కువపడుటకు గొనువారలా కారణము? కాదు. ఐన మఱియెవరు? ఉప్పుపంట బెట్టువారందమా? కొంతవఱకు వీరు కారణభూతులనుట నిజమే. ఐన నాపంట----యింపజేయు క్రమములు విద్యలును వీరు సృష్టించినయవిగావు. సంఘముచే దరముల పర్యంతము కొంచెము కొంచెముగ వికాసమునకు దేబడినవి. అట్లగుట వినియోజక శేషమునకు నిజమైన మూలాధారము ప్రతిమనుజుని నావరించియుండు సంఘముయొక్క స్థితిగతులు. వీనికే "ఆవరణస్థితు" లని పేరు.

నేను, నాకర్మము, నాసుఖము అని వ్యక్తివాదము సేయువారికి నిది యలంఘ్యమైన ప్రమాణము. మనకుగల జ్ఞానము, చతురత, సుఖదు:ఖావహసమయములు ఇత్యాదు లన్నియు గొంతమాత్రము స్వయంకృషిచే నిర్మింపబడునవియైనను మొత్తముమీద నావరణముచే నిర్మితములనుట యభేద్య న్యాయములలో నాద్యమైన న్యాయము. దీనికిం దృష్టాంతములు పెక్కులేల? బ్రాహ్మణకులము నందు బుట్టిన వానినైన మాలనియింట చిన్నప్రాయముననె చేర్చిన యెడల మాలబుద్ధియేకాని బ్రహ్మజ్ఞానము వానికింబట్టదు. బ్రాహ్మణావరణమునందు బెంపునకు వచ్చినవాడైన మాలబుడుత డాజ్ఞానము సంపాదింపలేకున్నను సంపాదించిన వానివలె వేషము దాల్చినవాడైన నగును. ప్రతిమనుజుని యొక్కయు స్వభావమనబడుదానిలో ముక్కాలు వంతు ఆవరణభావమేయనుట తగ్గించి చెప్పబడినమాట.

ఆవరణము

మనప్రయత్నములేకయ యార్థికస్థితిగతులయందు నిర్ణాయకముగనుండు సంఘాదిసంబంధియైన హేతుజాలం బావరణంబునాబడు. ఆవరణకృతంబైన శేషంబునకు ఆవరణశేషంబని పేరు. ఆవరణం బపౌరుషేయంబుగాదు.

ఆవరణములోన గణనీయ తత్త్వములు రెండు. ప్రకృతి, సంఘము. ప్రకృతిచే సంఘమును, సంఘముచే బ్రకృతియును మార్పులు సెందుననుట పూర్వోదితము. ఆవరణంబు నిర్వికారంబుగాదు. మఱి కాలవిధేయంబై పరివర్తనలం జెందునది. మనుష్యులలోని యైశ్వర్యాంతరములకు నావరణంబు ముఖ్యాశ్రయము.

ఉదాహరణాదులు

నేయి యొక్క మణుగుమాత్రము దొరకునేని వెల మణువు 30 రూపాయలనియు, రెండుమణుగులు దొరకునేని వెల 25 రూపాయలనియు ననుకొందము. అప్పుడు వినియోజకశేషమెంత? -

తొలుతటి మనువు వెల 30 రూపాయలు
రెండవదాని వెల 25 రూపాయలు
మొత్తము 55 రూపాయలు

మూడు మణువు లుత్పత్తియై వెల మనువునకు ఇరువది రూపాయ లాయెననుకొందుము. వినియోజకశేష మింకను నెక్కును. ఎట్లన:-

ఒక్కటే మణుగునెయ్యికల సమయమున నుపయుక్తి 'ఆ ఉ డ ఇ' యను చతుస్కోణమువలన గనుపఱచబడినది. రెండవ మణుగుయొక్క యుపయుక్తిని 'చ డ ఎ క' యను చతుష్కోణము వ్యక్తము చేయుచున్నది. మొత్తముమీద నుపయుక్తి 'ఆ ఉ డ ఇ' + 'చ డ ఎ క' లేక 'ఆ ఉ ఎ క చ ఇ' కాని విలువ కడపటిమణుగుంబట్టియే ఏర్పడుటవలన రెండు మణుగులకునుజేరి 'అ ఉ ఎ క' యను చతు ష్కోణమువలన సూచితమగు నుపయుక్తికే మనము విలువ యొసగెదము. కావున వినియోగించు మనకు 'ఆ అ చ ఇ' చే గనుపఱచబడిన ఉపయుక్తి విశేషముగవచ్చినది. కావున నిది రెండుమణుగులున్నచో నైన వినియోజక శేషము.

Bhaarata arthashaastramu (1958).pdf

ఆద్యోపయుక్తి (మొదటిమణుగు) = ఆ ఉ డ ఇ

మధ్యోపయుక్తి (రెండవమణుగు) = ఈ డ ఎ చ

అంత్యోపయుక్తి (మూడవమణుగు) = చ ఎ గ క

సమాసోపయుక్తి (అన్నిమణుగుల ఉపయుక్తి) = ఆ ఉ గ క చ జ ట ఇ

వెల కడపటి మణుగుంబట్టి నిర్ధారణ యగుటచేత మనము 'అ ఉ గ క' యను చతుష్కోణము వలన సూచితమయిన ఉపయుక్తికే వెల యొసంగెదము. మిగత 'ఆ అ చ జ ట ఇ' మనకు శేషము. ఇదియే మూడుమణుగు లున్నయెడల వినియోజక శేషము.
Bhaarata arthashaastramu (1958).pdf

13, 14 వ పటములను జేర్చినచో 15 వ పట మగుచున్నది. వ్యాఖ్యాన మనవసరము.

Bhaarata arthashaastramu (1958).pdf

ఆద్యోపయుక్తి = 30 రూపాయలు

మధ్యోపయుక్తి = 25 రూపాయలు

అంత్యోపయుక్తి = 20 రూపాయలు

పూర్ణోపయుక్తి 30+25+20 = 75 రూపాయలు

పణ్యమూల్యము. మణుగులు 3x20 =60 రూపాయలు

వినియోజకశేషఫలము = 15 రూపాయలు

రాశి ననుసరించియుండు నంత్యోపయుక్తిచే మూల్య మేర్పడుననుట స్పష్టము. మఱియు వాయ్వాదివస్తువులు పూర్ణోపయుక్తి నఖండముగ గలిగియున్నను నంత్యోపయుక్తి లేనివగుట మూల్యరహితము లాయెననియు మూల్యదారిద్ర్యము వస్తుగౌరవమునకు భంగకరము గాదనియు మున్ను తెలిపిన తత్త్వములకు నియ్యది యింకను నొకసాక్ష్యము. మూల్యరాహిత్యమునకు నిష్ప్రయోజనతకును మిక్కిలి భేదము. మూల్యాభావము సంభవించుమార్గములు రెండు. ఒకటి వస్తువు ఎందునకుం బనికిరానిదగుట. ఉదా. వీధిలోని మన్ను ఇత్యాదులు. రెండు. వస్తువు పరమప్రయోజనకారియయ్యును అఖండముగ లభ్యమగుటచే రాసులు మితిమీరి యంత్యప్రయోజనా వశిష్టముం జేయుట. ఉదా. గాలి.

ఈ రెంటికిని భిన్నలక్షణము:- మొదటి దానికి బూర్ణోపయుక్తిలేదు. రెండవది దాని కది యసమానముగ నున్నది

వీనికి సామాన్య లక్షణము:- మొదటిది నిష్ప్రయోజనము గావునను రెండవది యమితరాశిక మగుటను రెంటికి నంత్యప్రయోజనములేదు. కావున విలువయు గానము.

ఐనను విలువలేని సామ్యముంబట్టి గాలియు వీధిలోని మన్నును దుల్యములే యనుట తులువతనము.

పూర్ణోపయుక్తిని మధింపువేయు పద్ధతు లెవ్వి?

వస్తువు అపురూపమైనదనుకొని యట్లైన నెంతవెల పొడుగగునో యని రమారమిగ నిర్ణయించి, పిమ్మట గ్రమక్రమముగ రాశికిం బరిమాణము లిడుచుంబోయిన వెల లెట్లుపడుననుట యూహించి, తుదకు వర్తమానముననుండు ధరల వఱకును వచ్చితిమేని పూర్ణోపయుక్తి స్ఫుటంబగును. ఇది మిక్కిలి ప్రయాసముచేతనేకాని యలతి దీఱు సాహసంబుగాదు. గాలి మొదలైన వస్తువులేనాడు నరుదుగావు. కావున వానికి క్షామకాలపు ధరల విధించుట యూహపై బోవలసిన లెక్కకాని దృష్టాంతముగజూపి నిర్ణయింప జాలినవికావు. ఇట్టిచోట్ల ననుభవముమీద వస్తుగౌరవముల స్థాపింపజూచుటదప్ప అన్య సాధనములు మృగ్యములు. వజ్ర వైడూర్యములకన్న జలాహారము లధిక పూర్ణోపయుక్తి యుక్తములనుటకు జనుల యభిప్రాయమే సాక్షి. వజ్రవైడూర్యములు లేకపోయినను హాయిగ బ్రతుకువారు కోట్ల కొలది నున్నారు. జలాహారములులేక జీవించువారు పురాణకధల దప్ప నింకెక్కడనులేరు. కావున పూర్ణోపయుక్తిని లెక్కప్రకారము జమగూర్చుట యసాధ్యమైనయెడల లౌకికాచారముల ప్రకారము సకారణముగ గొలతవేయవచ్చును.

"ప్రయోజనమును గొలుచుట సాధ్యమా? యను ప్రశ్న అనేకులకు దోపక మానదు. ఏలయన, ప్రయోజనము భావగర్భితంబు. ఆకృతిగల స్థూలపదార్థముగాదు. సంఖ్యకలదియుగాదు. కావున తూచుట, జమగూర్చుట ఇత్యాది క్రియలు దానియందు జెల్లవు. ఇట్లని ప్రశ్నించువారికొక సమాధానముం జెప్పవచ్చును. ప్రయోజనము భావరూపమే యైనను స్థూలపదార్థములైన ధరలచే దాని ప్రాబల్యము సూచింపబడియెడు. ఉపయుక్తి యెక్కువయని తోచిన వెలల నధికముగ నిచ్చుటయు, తక్కువగా దోచిన దక్కువమాత్ర మిచ్చుటయు సహజములు. శరీరమునందలి యుష్ణముయొక్క తీవ్రతప్రకారము డాక్టరు పెట్టిచూచు 'తాపమాన' యంత్రములోని పాదరసము ఎక్కుచునో, దిగుచునో యుండుమాడ్కి నుపయుక్తత ననుసరించి ధరలు నిలుచుననుట నిక్కమే యైనను ఈన్యాయమునకును ప్రతికూలములు లేకపోలేదు. అట్లగుట నీకార్యము సాధ్యమైనను సులభముగానిదాయెను.

ప్రయోజనమును ధరలచే గొలుచుట కష్టతరముగను సత్యదూరముగను జేయుహేతువులు

1. ధరయన వస్తువులకు నాణెముల రూపముననుండు విలువ. ఒకయెద్దును గొనుటకు 50 రూపాయలుపట్టిన దానిధర 50 రూపాయ లందుము. అనగా దానియందు గ్రాహకునకుగల యంత్యోప యుక్తియు, 50 రూపాయలయందుగల యంత్యప్రయోజనమును ఇంచుమించు సమానములనుట. ప్రతి క్రయ విక్రయములయందును నాలుగు విధములైన మదింపులు వేయబడును. ఎట్లన:-

కొనువాడు వేయునవిరెండు:- రూపాయల యుపయుక్తతంగూర్చిన మదింపు ఒకటి. ఎద్దునుంగూర్చిన మదింపు రెండు.

అమ్మువాడు వేయునవిరెండు:- ఎద్దుయొక్క యుపయుక్తతంగూర్చిన దొకటి. రూపాయల యుపయుక్తతంగూర్చినది రెండు.

కొనువానికి రూపాయలయందలి యాదరమునకన్న ఎద్దునందలి ప్రీతి యొకించుకయైన నధికముగను, అమ్మువానికి ఎద్దునందలి గౌరవమునకన్న రూపాయలయందలి మమత యొక్కింతయైన నధికముగను ఉన్నంగాని వినిమయము సిద్ధింపదు. అట్లగుట:-

ప్రయోజనముచే ధరలు నిర్ణయింపబడునని యొకరుచెప్పిన, ధరలచే ప్రయోజనము నిశ్చయింపబడునని యేల ప్రతివాదము సేయ గూడదు? చూడుడు! వస్తువునందలి ప్రీతి నాణెములగుండ వ్యక్తమాయె ననుట యేమాత్రము సత్యమో, నాణెములయందలి ప్రీతి వస్తువుగుండ వ్యక్తమాయెననుటయు నామాత్రము సత్యమే! మనము వాడుకలో క్రయికులు విక్రయికులని భిన్నపక్షములకుం జేరినవారో యనురీతి వారిని వ్యవహరింతుము. కాని శోధించి చూచిన నిరుతెగల వారును క్రయికులే విక్రయికులే. వర్తకుడు సరకులనమ్ము. రూపాయల గొనును. వినియోజకుడు రూపాయల నమ్మును. సరకులం గొనును! కావున వస్త్వాదరంబు రూప్యములచే గొలువబడుననుట యబాధితంబైన మతంబుగాదు. రూపాయలయొక్క యుపయోగము సరకులచే గొలువబడుచున్నదన్నను సంభావ్యమే.

ధరలచే ప్రయోజనము స్థాపింపబడెడు ననుటకు దృష్టాంతములు మునుపే చూపియున్నాము. వెలలు వ్రాలిన గిరాకి యుచ్ఛ్రితమగును. దీనికొక యపూర్వహేతువు ప్రదర్శింపగలము. ఖరీదు శ్రమ సమానము, క్లేశకరము. వస్త్వాదర మనునది వస్తువులవలన గలుగు సుఖమునుండి తత్ప్రాప్తికై పడవలసిన దు:ఖమును దీసివేయగా నిలిచిన సుఖభావము.

సుఖమునుండి

దు:ఖముపోగా

నిలిచిన ఖరారు సుఖము = వస్తుపార్జన చోదకాదరము. అట్లగుట సుఖము ముందున్న రీతినే యున్నను దు:ఖము క్షయించిన నిశ్చిత సుఖము వృద్ధియగుననుట యప్రతిహత న్యాయము.

1. ఇట్లు ధరలును ఉపయోగములును బరస్పరాశ్రయములై యుండగా ధరలను గొలతగా జేయుటయెట్లు? బట్టలను గజము కొయ్యతో గొలుతుము. ఈ గజముకొయ్య యొక పొడుగుగలదిగా లేక బట్టయొక్క నిడివికొలది విశ్వరూపమును వహించునదియైన దానితో గొలుచుటకు బ్రహ్మదేవునకైన నలవియా?

2. మఱియు రూప్యములును వస్తువులే. వస్తువు లెట్లు రాశి ననుసరించిన విలువగలవిగా నున్నవో యట్లే యవియును సంఖ్యా సమాశ్రితమైన మూల్యముగలవిగా నున్నవి. బంగారు విశేషముగ దేశమున నుపగతమైన బంగారముయొక్క విలువ పలుచబడును. రూప్యములు శాశ్వతమును నిర్వికారమునైన యంత్యోపయుక్తి గలవికావు.

3. సరకులరీతినే నాణెములును బ్రతిమనుజుని ప్రాప్తికొలది లఘువులో గురువులోయైయున్నది. బీదవాడు రూపాయను వరహాగా జూచును. వానికి దానియందలి యంతోపయుక్తి మహాఘనము. కోటీశ్వరుడు వరహాను దమ్మిడిగ బాఱవేయును. వానికి దానియందలి యంత్యానురాగ మించుమించు పూజ్యము. కావున బీదవాడు రూపాయకు గొను వస్తువునే మహారాజైనవాడు పది రూపాయలు లెక్కపెట్టియు బెట్టక వేసికొనుటయుం గలదు. కావున ధరలు చంచలములు. ధరలతో నుపయుక్తతం గొలుచుట యసాధ్యం. అంతకన్న మెఱుగు దీగలతో దులల దీర్చుట సుఖము. దీనికి సమాధాన మేమనగా నాణెములయొక్క విలువ చలించునదియైనను, ఈ చలనముయొక్క పరిమాణమును నిర్ణయించి, యీ చలనమువలన గలిగిన మార్పుల లెక్కకుదెచ్చి తీసివేయ వచ్చును. ఈ విషయము వినిమయకాండమున జర్చించబడును.

ఈ యాక్షేపణలు అసమంజసములుగావు అయిన నొక్క విన్నపము. ఉపయుక్తతయు క్రయమును ఒండొంటి నానియుండుటచేతనే క్రయమును ఉపయుక్తతా సూచకమని యెన్నదగును. రెండవది ప్రతివానియొక్కయు వస్త్వాదరమున భేదములు పెక్కుపోకల బోయినను మొత్తముమీద పణ్యచక్రంబున నట్టివిఱుపులు పరస్పర హతములౌట సాధారణముగాన, గిరాకియొక్క యుత్కర్షమును ధరలు నిష్కపటముగ సూచించుననుట యొప్పుకోవలసిన న్యాయము. ఈ విషయ మటుండనిండు.

ఆవరణకృతమైన శేషము గణనీయ మనుటకు నొకహేతువుం జూపి వాంఛావిచారంబు చాలింతము.

ఇంగ్లాండులో ఏటికి 5000 రూపాయల గడనయున్న నింద్రభోగముగా సర్వసుఖంబుల ననుభవించుట నిఖిలజనవేద్యమైన మహాయోగము. 10,000 రూపాయల జీతమునిచ్చి యొకనిని ఒక గహన స్థలంబున కలెక్టరుపనికి నియమించిన వాడారూపాయలతో నేమిచేయనౌను? సరసకవుల గోష్ఠియు, నాటకప్రయోగములు, పాటవేడుకలు, ఇత్యాది హృదయాహ్లాదక విశేషములు ఎంతవ్యయమునకును లభించునా? తుదకు రుచియైన పదార్థములు, విందులు, పండుగలు సయితము గోచరింపవు. అట్టివాని యావరణకృతమైన సుఖశేషము సున్న. కావున నుండియు నెండినవాడగు.

జనులయొక్క ప్రాభవముంగూర్చి చింతించుటలో నావరణమును మఱవగూడదు సుడీ! జీతముబట్టి సుఖమును నిర్ణయించుట మూఢత్వము. మఱియు ఆస్తికన్న నాదాయము ముఖ్యము. నేలలు, పశువులు, ఇండ్లు, చెఱువులు నమేయములుగ నుండినంజాలదు. వచ్చుబడి పెచ్చుపెఱిగినగాని ప్రయోజనములందుట దుర్ఘటము.