భారతీయ నాగరికతా విస్తరణము/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

భారతదేశ చరిత్ర పరిశోధకుల కిటీవల లభించిన చారిత్రకసామగ్రి యమూల్యమైనది. దానినుండి ప్రాచీనభారతీయుల గౌరవాధిక్యతలను సూచించు రెండు నూతనాంశములు బయల్వెడలినవి. అందు మొదటిది సింధుప్రాంత నాగరీకత. రెండవది దేశాంతరములయందలి భారతీయ నాగరీకత. ఈ రెండంశములునుగూడ ప్రపంచమంతటను విద్వల్లోకము యొక్క దృష్టి నాకర్షించినవి. ఈయంశములనుగూర్చి పలువురు పండితులు జేయుచున్న పరిశోధనల మూలమునను, వారికి తట్టుకున్న సిద్ధంతముల మూలమున నీ నూతనాంశముల ప్రాముఖ్యము దినదినము నభివృద్ధి నందుచున్నది.

సింధుప్రాంత నాగరీకత వలన భారతదేశ నాగరీకత యొక్క ప్రాచినత యినుమడించి, యంతర్జాతీయ చరిత్రమున భారతదేశమునకు గల గౌరవము హెచ్చినది. ఇతర దేశములలో దొరకిన భారతీయ నాగరికతా చిహ్నముల మూలమున భారతదేశ చరిత్ర పరిణామమునం దజ్ఞాతపుర్వమగు నొక నూతనపథము బయల్వెడలినది. అందునను భారతీయ నాగరికతా విస్తరణ చరిత్రము నేటి సంక్షుభిత సమయమున భారతీయులకు నూతనోత్సాహము నొసంగదగియున్నది. నేను పాశ్చాత్యదేశీయులు నాగరికతా ప్రచారకులమనియు, పెక్కు వలసరాజ్యములతో సామ్రాజ్యముల కధినేతలమనియు సగర్వముగ విజృంభించుచున్నారు. ప్రపంచమునం దలి యితరజాతులవలెనే భారతీయులనుగూడ తమ సంస్కృతిని బోధించి నంతరింపజేయు చుంటిమని వారు తలంచుచున్నారు. కాని భారతీయ నాగరికతా విస్తరణ చరిత్ర మీయభిప్రాయములయందలి యసత్యతను వ్యక్తము చేయుచున్నవి. నేటి ప్రపంచమున బ్రబలురుగనున్న పాశ్చాత్య జాతులవా రనామధేయులుగను, అనాగరికులుగను ఉండినకాలమున, భారతదేశము నాటి ప్రాచ్యపాశ్చాత్య ప్రపంచమునంతటికి నధినేతయై, వివిధదేశములలో విజ్ఞాన బీజములను వెదజల్లి విశ్వమానవ కల్యాణమును చేకూర్చెను. పసుబలముచే జయింపబడి, నిర్మింపబడిన నేటి సామ్రాజ్యములకును, నాడు భారతీయులు నిర్మించిన సుస్థిరమగు నాధ్యాత్మిక సామ్రాజ్యమునకును పోలికయేలేదు.

భారతదేశ చరిత్రమున కింత ముఖ్యమగు నంశమైనను, దీనిని గూర్చి యాంధ్రభాషలో నొక గ్రంథమైనను వెలువడియుండలేదు.1922 వ సంవత్సరమున "భారతీయ నాగరికతా విస్తరణము" అను శీర్షికతో నేను త్రిలింగ, రైతు, గోల్కొండ పత్రికలలో గొన్ని వ్యాసములను ప్రకటించియుంటిని అటుపై మరికొంత సామగ్రిని సమకూర్చుకొని యీగ్రంథము తయారుచేసితిని. పిమ్మట నొక ప్రసిద్ధులగు గ్రంథప్రకాశకులు దీనిని ప్రకటింతుమని వాగ్దానముచేసి, తమవద్ద మాతృకను రెండేండ్లకాలము నిల్వ యుంచుకొనిరి. తుదకు మాతృకనుగూర్చి "అస్తి నాస్తి విచికిత్ప" గూడ గలిగినది. ఎట్లో యదృష్టవశమున నిది తిరిగీ నాకులభించినది. నేటికైన నిది ముద్రింపబడుట మిక్కిలి సంతోషకరము.

కలకత్తాలోని "Greater India Society" వారి ప్రకటనలు మ, నయాం, కాంబోడియా, చంపారాజ్యములనుగూర్చిన ప్రత్యేక గ్రంథ