భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/ఉద్దండరాయశతకము
పీఠిక
సుప్రసిద్ధుఁడు దిట్టకవినారాయణకవి కీశతకకర్త యగు రామచంద్రకవి కుమారుఁడు. ఈకవి సమగ్రజీవితము మహిషాసురమర్దనిశతకమునఁ జేర్చియున్నారము గాన నిందు దిఙ్మాత్రముగా నుదాహరించుచున్నారము. ఈ రామచంద్రకవికవిత నిర్దుష్టముగా నిరర్గళధారాశోభితమై మనోహరముగానుండును. ఇతని గ్రంథము లింతవఱకు మా కీక్రిందనుదాహరించినవి మాత్రము లభించియున్నవి. ఇంకను బ్రయత్నించినచోఁ గొన్ని గ్రంథములు లభింపవచ్చుననునాసగలదు. 1.మహిషాసురమర్దనిశతకము, 2. గొట్టుముక్కులరాజగోపాలశతకము, 3. ఉద్దండరాయశతకము, 4.రఘుతిలకశతకము, 5. వాసిరెడ్డివారిచరిత్రము, 6. హేలావతిదండకము, 7. చాటుపద్యములు.
రామచంద్రకవి చిరకాలము వాసిరెడ్డివారిసంస్థానమునందు వేంకటాద్రినాయఁడువారి కాస్థానకవియై యుభయభాషాపండితుఁ డని పేరుగాంచెను. ఇతనిచాటుపద్యములఁ బట్టి చూడఁ గాలక్రమమున నాకాలమునఁ బేరుపడియున్న వెలమసంస్థానము లన్నింటిని జేరి ధనార్థియై రాజాశ్రయముతోఁ గాలము గడిపినటుల ద్యోతకము కాగలదు.
ఉద్దండరాయశతకకర్తయగు దిట్టకవిరామచంద్రకవి యిప్పటికి నూరుసంవత్సరములక్రిందట నుండియుండును. ఇంతవఱ కీకవి గ్రంథములుగాని సుప్రసి ద్ధమగునామముగాని యాంధ్రలోకము ఎఱుంగకుంట పరితాపకరము.
రామచంద్రకవి నూజవీటిప్రభువుల సంస్థానములోనిదగు మద్దాలి కేఁగి యటఁ గలయుద్దండరాయస్వామినిగూర్చి యీశతకమును రచించెను. శతకమునందు భక్తిరసము ప్రధానస్థానము నొందియున్నది. శతకమంతయు జకారప్రాసముతోనున్న ప్రాసస్థానములలోఁ గవి వెదకికొనక క్రొత్తపదములను సందర్భశుద్ధిగా సమకూర్చి తనకవితాప్రాగల్భ్యము వెల్లడించియున్నాఁడు. ఈశతకమునందలి పద్యభావములుగూడ మనోహరభక్తజనహృదయాకర్షణముగానున్నవి. ఈకవి సాహిత్యమందేగాక యద్వైతమతసిధ్ధాంతములందుఁ గూడ జితశ్రముఁడని యీశతకమునందలి పద్యములు చెప్పుచున్నవి.
మా3కుఁ బూర్వతాళపత్రగ్రంథమును బట్టి వ్రాయఁబడిన వ్రాతప్రతి జీర్ణమయమైనది లభించినది. ఇంక నుపేక్షించిన నీప్రతిగూడ నదృశ్యమగునేమో యని ప్రత్యంతరసహాయము లేకున్నను ఎటులో శుద్ధప్రతి నొకవిధముగా సిద్ధపఱచి ముద్రణమునకు నొసంగఁగలిగితిమి. ద్వితీయముద్రణమున శతకమును సర్వవిధముల సంస్కరింపవలెనని యున్నది.
నందిగామ
ఇట్లు భాషాసేవకులు
5.2.25
శేషాద్రిరమణకవులు, శతావధానులు.
శ్రీరస్తు
దిట్టకవి రామచంద్రకవికృత
ఉద్దండరాయశతకము
మ. | అజకాంతన్ భజియించి భాగవతులం బ్రార్థించి డెందంబునన్ | 1 |
మ. | త్రిజగత్పూజ్యము లైన నీపదము లర్థిగా సేవ గావింతు నిన్ | 2 |
మ. | భుజముల్ ఫాల మురంబు చేతులు పదంబుల్ భూమి మోయంగ సా | 3 |
మ. | ప్రజకాంతాహృదయేశ సన్మునిజనవ్రాతాత్మసంవేశ నీ | 4 |
మ. | సజలాంభోధరతుల్య నైల్యకలనాచంచతనూధామ శౌ | 5 |
మ. | భజనీయైకమహాచిదంబర పదాంభస్సిక్తహేమాద్రి ధ | 6 |
మ. | అజగవ్యర్చిత మౌనిచర్చిత సమస్తాదిత్యసంప్రార్థితా | 7 |
మ. | ద్విజరాజాంబుజమిత్రనేత్ర సకలాధిష్ఠానహృత్పాత్ర వా | 8 |
మ. | రజనీవల్లభభానునేత్ర త్రిజగద్రాఘిష్ఠిచారిత్ర నీ | |
| రజగేహైకకళత్ర భవ్యగుణపాత్రా నన్నికన్ నీచక | 9 |
మ. | ద్విజరాజధ్వజ దివ్యవందిత సదాదేదీప్యమానాత్మ దే | 10 |
మ. | గజరాడ్రక్షక నాకుఁ గన్పడవె నే గన్గొందు నీపాదపం | 11 |
మ. | రజతక్ష్మాధరగేహసాయక భవద్రాజత్ప్రభావంబు ల | 12 |
మ. | అజహత్ప్రాభవ తెల్పవే స్మృతి యవిద్యారూపపుంజీనువా | 13 |
మ. | విజయక్షేమదనీదయంగద జయావిర్భూతిసంసారప | |
| ష్మజగత్ప్రాణము కారణంబుగద శ్రీ మద్దాలి... | 14 |
మ. | వ్రజమున్ దామస ముజ్జగించి నినుఁ జీరం దారి గల్పింపవే | 15 |
మ. | అజరుద్రాదులు నిన్నుఁ గొల్తు రమరుల్ ప్రార్థింతురే ప్రొద్దు నె | 16 |
మ. | వృజినంబుల్ హరియించి నన్నెపుడు సంహృష్టాత్ముఁ గావించి నిన్ | 17 |
మ. | త్యజియింతున్ భవబంధముల్ మనములో నర్చింతు నీపాదముల్ | 18 |
మ. | గజఘాటీముఖసంపదల్ సతములా కా వీశరీరంబు లే | 19 |
మ. | సృజియింపన్ సృజియించి మేలొసఁగ నిర్జింపం బ్రజామానసాం | 20 |
మ. | సుజనత్వంబరిదేహిమత్తుఁడయి సంక్షోభింపఁగా నేల ని | 21 |
మ. | యజనామ్నాయతపోజపవ్రతము లత్యంతంబు వర్ధిల్ల భూ | 22 |
మ. | గజ మేదేశికునొద్ద శిక్షఁ గనె సాకల్యంబుగాఁ గుబ్జ యే | 23 |
మ. | అజనుఃశ్లాఘ్యసుఖంబు గైకొనెద భూయఃస్వాయదానందనం | 24 |
మ. | ధ్వజమై వాహనమై పతంగపతి గొల్వ న్ బిల్వరాసెజ్జయం | |
| దు జరీపుట్టము గట్టి కొ ల్వొసఁగి తోడ్తో చెంగటం గల్మికొ | 25 |
మ. | యజమానత్వ మొసంగి జ్ఞానశిఖియం దత్యంతమత్కిల్బిషం | 26 |
మ. | వ్యజనచ్ఛత్రముఖోపచారకలన వ్యాపారులై భక్తి వి | 27 |
మ. | ఇజగుంజెంది కుచేలుఁ డర్థియయి ని న్నీక్షింప నేతేరఁ ద | 28 |
మ. | నిజమాయన్ విధి వే గలంపఁ గలఁడే యింద్రాత్మతన్ నీవు వే | 29 |
మ. | అజమీళుం డొకవిప్రదాసియెడ రత్యాసక్తుఁడై కాలమెం | |
| త్మజునిం జీరినదాన బ్రీతమతివై మద్దాలి... | 30 |
మ. | విజనంబైనమహాటవిన్ శబరి యావిర్భూతసద్భక్తిచే | 31 |
మ. | నిజదాసావనసాభిమానుఁడవయా నీ వాజిలో సోమద | 32 |
మ. | భుజదర్పంబున ద్రౌణి సుప్తవధకై బూనంగ నీవెన్ని భూ | 33 |
మ. | ఋజుతత్త్వం బరినిన్ హసించుఖలు నాభృత్యాత్ముగాఁ గూల్తువౌ | 34 |
మ. | కుజనుల్ నిన్ను భజింపలేక తమకోర్కుల్ వేరుగా గేరికే | 35 |
మ. | రజతస్వర్ణముఖాఖిలార్థకృతగర్వగ్రస్తులై మత్తులై | 36 |
మ. | అజరాధీశ్వరుఁ డైననీకు పరిచర్యల్ సేయఁ బ్రాల్మాలినం | 37 |
మ. | అజనాషాఢకమండలుల్ గమిచి ధర్మాయత్తులై గౌతమీ | 38 |
మ. | కుజముల్ రాజసతామసంబులు త్వదంఘ్రల్ గూర్చు మన్మానసాం | 39 |
మ. | గుజుగుంట్లం గడతేర్పలేని వెడకోర్కుల్ గోరుటల్ వట్టిభే | 40 |
మ. | అజరస్థాపితకల్పకంబ వయి కుయ్యాలింపవే యోయధో | |
| క్షజ నిన్నే నెదనమ్మినాఁడ నిఁక మత్కాలుష్యముల్ బాఱఁజి | 41 |
మ. | గజవక్త్రుండు భుజంగమాధిపతి గంగాద్వీపినీభర్తనీ | 42 |
మ. | యజురాదిశ్రుతులెల్ల నిన్ బొగడు నాహా యండ్రు నీకీర్తి క | 43 |
మ. | విజితత్వంబున నొంద దీషణదవావిర్భూతి యోహో చతు | 44 |
మ. | గిజిగా డెట్టులొ యట్లజీవుఁడును దద్గేహంబె దేహంబు త | 45 |
మ. | గజగండస్థలివోలె నెమ్మన మశక్యంబైన దుర్వాంఛ పే | |
| మజవాకృష్టికి నందనీయఁగదె శ్రీమద్దాలి... | 46 |
మ. | గజపుష్పాంచితదివ్యదామములతోఁ గల్యాణచేలంబుతో | 47 |
మ. | స్వజనుంగా గరుణించి నీస్మృతులు కస్మన్మూఢచేతఃపశు | 48 |
మ. | అజపుత్రాదిమునుల్ భవన్మహిమ మేకాంతంబుగాఁ గాన నో | 49 |
మ. | అజరద్వీపినిగన్న పాదకమలం బాసించితిన్ జూపవే | 50 |
మ. | అజకంఠస్తనమై పరోపకృతి సేయన్ లేని మద్దేహయ | 51 |
మ. | రజనింజోలె యవిద్య నెమ్మదికి నిద్రం గూర్చు విద్యాసమృ | 52 |
మ. | విజిఘత్సుత్వము నద్దురాప్తిభవ ముద్వీతంబుగా నూతనాం | 53 |
మ. | అజ నీదర్శన మబ్బు టెప్పుడొ యనేహస్రోత మంతంత డొం | 54 |
మ. | సుజనుంగాఁ గరుణించి నామదికి సంశుద్ధిం బ్రసాదించి లో | 55 |
మ. | ప్రజిహావల్లికి పాంథుఁ దోరసిలు ఠేవన్ గర్వికిన్ నీవుగా | 56 |
మ. | అజశృంగీకితవార్కముష్టిఫలవాంఛాయోగ్యసంసారమౌ | |
| ఢ్యజదుర్వాంఛలు మాన్పి యొక్కయెడ వేడ్కంబోలె నీదివ్యనా | 57 |
మ. | గుజుగుం ట్లెంతయు దీర కైహికపుసంకోచంబు చేతం గజీ | 58 |
మ. | గజబంధి న్యుపమానమై యిహ మసౌఖ్యప్రాప్తి నొందింపసా | 59 |
మ. | భుజమధ్యంబున లచ్చి పార్శ్వయుగళిన్ భూమీళ లుప్పొంగ భ | 60 |
మ. | గజమె ట్లట్లుగ నేను కర్మఫలనక్రగ్రస్తతన్ బొంది యా | 61 |
మ. | మృజము న్మున్నుగ శుద్ధి దేలిచెద సామీ యోమిఁకన్ నీమహా | |
| త్మజపత్ క్షాళన మాచరించుటకునై మద్దాలి... | 62 |
మ. | భజమానత్వదుపాస్తిమగ్నమతినై భాసిలినట్లున్ సదా | 63 |
మ. | విజితాయాసము గాఁగఁ బంచతయు నిర్వేధాప్తిగా జీవనం | 64 |
మ. | గిజిగిట్లాడెడిదీనతన్ బరులకై కేల్సాచుటేకాని నీ | 65 |
మ. | విలసత్ క్షీరరసానుభూతివలె నీవిఖ్యాతి వర్ణింప నిం | 66 |
మ. | భజనాభావుఁడ నౌట నక్షిగతుగా భావింతువేమో సమ | 67 |
మ. | కుజనాఖ్యాకుఁడ నేను నీవు సదనుక్రోశప్రభావుండ విం | 68 |
మ. | అజఘన్యత్వదుపాస్తి నా కొసఁగవే యాత్మేశభూవహ్నివా | 69 |
మ. | నిజ మొప్పారఁగ నాదుకందొవకు నానెయ్యంబు పేరింటనొ | 70 |
మ. | భజనీయాత్మక నావిశుద్ధి వివరింపం బుద్ధి సన్నాసిరీ | 71 |
మ. | వ్రజముల్ గూడుక గోపగోపికల నిర్వాచ్యైకభక్తిన్ బలా | 72 |
మ. | కుజరూపంబుల నేమి నోచెనొకొ నీకుం గానలోనున్నయా | |
| భుజపత్రద్రువు లారసాలతరు లాపున్నాగముల్ వీచియు | 73 |
మ. | ప్రజలె ట్లట్లుగ నీవు గోపికలు బెంపన్ సొంపు గైకొంటకే | 74 |
మ. | వ్రజడింభఛ్ఛటఁ గూడి నీ వడవిత్రోవం బోవుచో దర్భగు | 75 |
మ. | గజనిమ్మల్ సురపొన్నలుం బనసలుం గన్నేరులున్ మున్నుగాఁ | 76 |
మ. | రజనీచారుఁడు సీతఁ గొందు జన తద్రక్షఃపతిన్ దాఁకి వీఁ | 77 |
మ. | నిజవిత్తంబులు సార్థకంబులుగ నిన్ సేవించి యర్పించి యిం | |
| మ్మ జిగుళ్లొత్తి ఫలించునట్టులుగదా మద్దాలి... | 78 |
మ. | వ్రజముఖ్యుం డొకఁ డేకతంబ తనకు వాలాయమై నెమ్మనం | 79 |
మ. | భజనాభావమతిన్ మదాంధులయి సంపన్మోహబుద్ధిం గిజా | 80 |
మ. | అజరాస్థానవిలాసినీరతిసుఖవ్యాపాదనవ్య క్తవి | 81 |
మ. | యజనంబుల్ పదివేలు చేసిన యనిత్యైంద్రాశ్రయం బింతెకా | 82 |
మ. | ద్విజుఁడైనం బ్లవుఁడైనఁగాని నిను గీర్తింపం బ్రపుణ్యాత్ముఁ డౌ | 83 |
మ. | ఖజకాదండ మెఱుంగునే మృదులశాకస్థాయి యైయుండి వే | 84 |
మ. | భుజియింపన్ నవనీతమై యమృతమై పూదేనెయై నారికే | 85 |
మ. | ఋజుబుద్ధిన్ నిను సంస్మరింపఁగలుగున్ శ్రీశైలకాశీనివా | 86 |
మ. | త్రిజగద్భర్త యథేష్టసేవ్యుఁడు మనోధిష్ఠుం డగణ్యార్థదా | 87 |
మ. | అజునిం బొక్కిట గన్నవేలుపవు నీయం దాపదుద్ధారకా | 88 |
మ. | అజహద్దంభవిజృంభమాణవిపులాజాండంబుదీపైకరూ | |
| పజతేజంబున వెల్లఁజేసెడు భవద్భావంబు వర్ణింప బఁ | 89 |
మ. | భజనీయైకనిగాఢహుంకృతులు సంభావించి వందారువా | 90 |
మ. | విజయున్ భీముని వెంటదోడ్కొని రణోర్విన్ భీముచేతన్ గిరి | 91 |
మ. | అజరద్భావసుఖోదయాప్తి తనసొమ్మై నప్పుడే నిన్ను పం | 92 |
మ. | త్రిజగంబుల్ భరియించి ప్రోతు వెపుడున్ దేవావళుల్ మెచ్చ నం | 93 |
మ. | త్యజియింతున్ జనినీకృపారసముచేతన్ భీతతం బాసి దీ | |
| మజమందత్వము నొందనియ్యకుము శ్రీమద్దాలి... | 94 |
మ. | ధ్వజినీసంగ్రహ మెంత యున్న బహువిత్తం బున్న దివ్యాశుగ | 95 |
మ. | భుజగాధీశశయాన యానవిజితాంభోజాత శ్రీమద్దదా | 96 |
మ. | ఇజుగుంగూర్చి శరీరయాత్రకయి భూభృత్తీరముల్ జేరి చా | 97 |
మ. | ప్రజనశ్రీ వహియించె మత్సుకృతసంపత్కామధేనూత్తమం | 98 |
మ. | రజముంబోలె విధూతమై యఘము బాఱన్ సన్మనుండై జనుం | |
| మజపస్తోత్రములం భజింపవలె నిన్ మద్దాలి... | 99 |
మ. | వజరాల్ దీరిచి పేరుగూర్చుగతి కైవారంపుపద్యంబు ల | 100 |
మ. | స్రజమై యొప్ప వరింపు మత్కవిత యోసర్వేశ యోదైవత | 101 |
మ. | ద్విజరాడ్వాహన నేను దిట్టకవిసూతిన్ గశ్యపర్షీంద్రగో | 102 |
ఉద్దండరాయశతకము సంపూర్ణము.