Jump to content

బొబ్బిలియుద్ధనాటకము/విజ్ఞప్తి

వికీసోర్స్ నుండి

శ్రీ

బొబ్బిలియుద్ధనాటకము.

విజ్ఞప్తి.

ఈ చిన్ని పొత్తమున-శీలసంరక్షణముకై కుసుమ సుకుమారముల నాత్మవపు పుల సగ్ని సాత్కరించువారును నిజ సదాచార మహిమచేత శాసానుగ్రహ సామర్థ్యము కలవారును అగు నర్థాంగలక్ష్ములచే విరాజిల్లుచు, నిజ బాహుపరాక్రమముచేత ఆసేతు వింధ్యాచలము జమీను లేర్పరించుకొని, మానముకై ప్రాణమును తృణముగా నొడ్డుచు, ప్రతాపరుద్రాది రాజాధిరా జాధిష్ఠక హిందూరాజ్య సంస్థాపకు లై క్షత్త్రధర్మౌ దార్య వెదుష్యను లచేత భీష్మ విక్రమ భోజులను మఱపించుచు, అనన్యవిషయ మై పరమశివునియందే వర్తించు నీశ్వరశబ్దమువోలె దొరశబ్దము అనన్యకుల నామసాధారణముగా తమకుల నామముతోనే సుఘటిత మై వెలుఁగొందు ప్రాభవముగల వెలమదొరలలో ఉదాహరణభూతు లైన బొబ్బిలి మహావీరుల పుణ్యచరిత్రనము - కీర్తింపఁబడినది.

ఇక్కథకు ఆకరములు రెండు సులభములు. పెద్దాడ మల్లేశకవి “పాటయు, రంగ రాట్చరిత్ర మను పద్యకావ్యంబును, ఇందు రెండవది కావ్యమార్గమున మెఱుఁ గెక్కి_ యున్నను; రసనిష్యందంబున పాటకు ఈడు mక యున్నది.

ఈముద్రణమున మూలగ్రంథము అచటనచట ఇంచించుక మార్పులంబొరసినది.

వేదము . వేంకటరాయశాస్త్రి.

________

పెద్దలకు విన్నపము.

మాతాతగారి, బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రీగారి, యీ నాటకమునకు ఇప్పటికి పదునెనిమిదేండ్ల ప్రాయము అయినది. శ్రీతాతగారు, దీనిని పలుమార్లు దమ శైక్షులచే బ్రదర్శింపించుచు ఆయా ప్రదర్శన కాలములయందు తమ చిత్తమునకు రసము అందునట్లుగా మరల మరల అచటనచట మార్చుచు తుదకు యిపుడు గ్రంథము ముద్రితమైయుండు ఉత్కృష్ట స్వరూపమునకుం దెచ్చి పునర్ముద్రణోచితముం గావించి యుండిరి. ఆయా సవరణల నెల్ల శ్రీ తాతగారు కావించిన రీతినే యిందుగానించి ఈ ముద్రణమును నెఱవేర్చినాఁడను. బాలుఁడను అజ్ఞుఁడను నగు నా చేతిలో నేవేని పొరబాటు లుప్పతిలిన ప్రాజ్ఞులగు పెద్దలు వానిం దెలిపి ఆనుగ్రహింతురేని వానిని దిద్ది గ్రంధమును చక్కఁజేసికొందును.

1 - ఆగష్టు - 1934.

ముత్యాలపేట, మదరాసు.

వేదము - వేంకటరాయన్.