బొబ్బిలియుద్ధనాటకము/ఈ నాటకమందలి పాత్రములు

వికీసోర్స్ నుండి

ఈ నాటకమందలి పాత్రములు.

పురుషులు.

సూత్రధారుడు.
పారిపార్శ్వికుఁడు.
పూసపాటి విజయరామరాజు, లేక, కళింగరాజు, లేక, రాజు - విజయనగరము రాజు, క్షత్త్రియుఁడు.
౨ హర్కారాలు.
 గుండాల అప్పన్న (పంతులు,) రాజుగారి కార్యస్థుఁడు.
౪ సామంతరాజులు - రాజుగారి సర్దారులు.
మంత్రి - ... మంత్రి.
బూసీ - గోలకొండ నైజాముగారి ఫ్రెంచి సేనానాయకుఁడు; ఈ రణము సర్వాధికారి.
హైదరుజంగు - బూసీకి దివాను.
౨౪ గోలకొండ సర్దారులు.
నీలాద్రిరాయఁడు - సామర్లకోట జమీన్దారు, పిఠాపురము దొర.
సుబ్బన్న, రామయ్య, భీమశంకరము, సోమన్న, పొర్లు బ్రాహ్మణుఁడు, వెంకన్న - బొబ్బిలిలో పెండ్లి సత్త్రభుక్కులు, భూరికి వచ్చినవారు.
వేగులు - రంగారాయనింగారికి బయటి వృత్తాంతములు నివేదించువారు.
రంగారావు, లేక, రంగారాయనింగారు, లేక, రంగారాయఁడు - బొబ్బిలి జమీన్దారుఁడు.
వెంగళరావు - రంగారాయని తమ్ముఁడు.
ప్రతీహారి - రంగారా యాస్థాన దౌవారికుఁడు.

వేదాంతి, శాస్త్రి, జోస్యుడు, విద్యార్థి, కవి, మాంత్రికుఁడు - బొబ్బిలిలో పెద్దచెఱువు స్నానఘట్టమునకు వచ్చిన బ్రాహ్మణులు.
ధర్మారావు - రంగారాయని బావమఱఁది. ఆతని దివాను.
హసేనాలి - గోలకొండవారి రాయబారి.
రాయనివారి సభ్యులు.
రామయ్య - రాయనివారి కరణము.
వేంకటరంగారావు, లేక, చిన్న వేంకటరాయఁడు - రంగారాయని కుమారుఁడు, బాలుఁడు.
౮ బొబ్బిలి దళవాయులు.
పడవాలు రామయ్య, ముత్త్యాలపాపయ్య - బొబ్బిలి దళవాయులు.
అప్పఁడు, సన్నాసి, కుఱ్ఱవాఁడు - బొబ్బిలి పౌరులు.
౪ పౌరులు.
౭ కోమటి చెలువలు.
దౌవారికుఁడు - బుస్సీ డేరాకడ కావలివాఁడు.
ముసేపనాల్ - బొబ్బిలికోటను కొట్టిన సర్దారుఁడు.
౪ సర్దారులు - బుస్సీక్రింద సేనాపతులు.
లాలి. - ఒక ఫ్రెంచిసర్దారుఁడు.
౪ నివేదకులు - బుస్సీకి యుద్ధవృత్తాంతమును ఎప్పటి కప్పుడు వచ్చి చెప్పుచుండువారు.
కింకరుఁడు. - విజయ రామరాజుగారి సేవకుఁడు.
సేవకులు. - బుస్సీదొరగారి నౌకరులు.
చెలికానివెంకయ్య. - రాయనింగారి బంధువు.
జక్కఁడు. - వెంగళరాయని తైనాతువాఁడు.

౫౦ పెండ్లికుమారులు. - వెలమదొరలు.
(బొబ్బిలివారి) నౌకరులు.
(గోలకొండవారి) నౌకరులు.
వెట్టినాయకుఁడు, ౪ వెట్టివాండ్రు, చాటింపు వెట్టివాఁడు - బొబ్బిలివాండ్రు.
తాండ్ర పాపయ్య. - రంగారాయని బావ.
మిరియాలసీతన్న. - పాపయ్యకు దివాను.
(మొగలాయీ) దండు.
(మొగలాయీ) సిఫాయి.
చల్లారాముఁడు. - విజయరామరాజుగారి పాదము లొత్తు సేవకుఁడు.
నైజాము. - గోలకొండ ప్రభువు.
టోగ్రాలి. - వారి వజీరు.

స్త్రీలు.

నటి.
బ్రాహ్మణి. - భూరికి సంతర్పణలకు వచ్చి నట్టిది.
చంటిపిల్ల. - బ్రాహ్మణి కూఁతురు.
మల్లమ్మ దేవి. - బొబ్బిలిరాణి.
వేంకటలక్ష్మి. - బొబ్బిలివారి పెద్ద దాసి.
సుందరమ్మ. - రంగారాయని కూఁతురు. (ఒకపెండ్లి కూఁతురు)
౪౯ పెండ్లికూఁతులు.
అవ్వ. - బొబ్బిలిరాయనింగారి పౌరోహితునిభార్య.
కామాక్షి. - ఒకదాసి.
కమలాక్షి. - ...
పేరఁటాండ్రు. - బొబ్బిలిలోని విప్రపురంధ్రులు.
౨ వేగు యువతులు.

____________