Jump to content

బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు/అంత్యగతులు

వికీసోర్స్ నుండి

5. అంత్యగతులు

మనవిమాట

బైబులు భాష్యం 68–70 సంచికల్లో అంత్యగతులను గూర్చి చెప్పాం. ఆ సంచికలనే యిక్కడ ఏక గ్రంథ్రంగా ప్రచురించాం.

ఈ పుస్తకం మరణానంతరం సంభవించే న్యాయనిర్ణయం, మోక్షం, నరకం మొదలైన అంశాలను పేర్కొంటుంది. ఎన్నేళ్ళు జీవించినా మన యిల్లు ఇక్కడకాదు, అక్కడే .కనుక నరుడు ఈ లోకంలో వుండగానే భావిజీవితానికి సిద్ధంకావాలి. పారమార్థిక దృష్టితో, పరలోక చింతనంతో జీవించాలి. ఈ గ్రంథం మన పాఠకులు పరలోకజీవితాన్ని గూర్చి ఆలోచించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇది నాల్గవ ముద్రణం.

విషయసూచిక

1. మరణం 252
2. తీర్పు 260
3.నరకం 269
4. ఉత్తరించే స్థలం 276
5. మోక్షం 283
6.ఉత్ధానం 294
7. రెండవ రాకడ 302
8. క్రీస్తు మనకు ఓడ లంగరు 309
- ప్రశ్నలు 312
- బైబులు ఆలోకనాలు 315

1. మరణం

చావులో మన దేహాత్మలు తాత్కాలికంగా విడిపోతాయి. దేహం మొదట మట్టిలో

కలసిపోతుంది. లోకాంతంలో మళ్లా వుత్థానమౌతుంది. ఆత్మ శాశ్వతంగా జీవిస్తుంది.
చావు మామూలుగా భయాన్ని కలిగిస్తుంది. ఈ భయాన్ని జయించడం అత్యవసరం. ఈ
యధ్యాయంలో ఐదంశాలు పరిశీలిద్దా0. 

1. యాత్రిక దశ నుండి శాశ్వత దశకు

               మరణం వచ్చేదాకా మనం యాత్రిక దశలో వుంటాం. ఈ లోకంలో జీవితయాత్ర 

సాగిస్తూటాం. కాని మరణంతో శాశ్వతదశలో అడుగిడతాం. ఇక యుహలోక

జీవితమంటూ వుండదు.
            మనం ఏన్నాళ్ల జీవించినా చనిపోక తప్పదు. బైబులు ఆయా వ్యక్తుల మరణాలను
వర్ణించేపుడు "వాళ్ళ తమ పూర్వులను కలసికొన్నారు" అని చెప్తుంది, అబ్రామాము దీర్ఘకాలం
జీవించి పండు ముసలితనాన రాలిపోయి తన పూర్వులను గలసికొన్నాడు–ఆది 25,8
ఇంకా చనిపోవడమంటే “మట్టిలో కలిసిపోవడం” గూడ, పాపం చేసిన ఆదాముకి దేవుడు
నీవు మట్టినుండి పట్టావు గాన చివరికి మట్టిలోనే కలసిపోతావని శాపం పెట్టాడు - ఆది
3,19. కనుక నరుడు ఎన్నాళ్ళు బ్రతికినా కడకు మరణించక తప్పదు.
             మనం మరణించిన తర్వాత మళ్ళా పశ్చాత్తాపపడి పూర్వ పాపజీవితాన్ని
మార్చుకోలేం. వరప్రసాదమూ పుణ్యమూ ఆర్ధించలేం. చనిపోయేపుడు ఏదశలో వుంటామో
ఇక ఆ దశలోనే శాశ్వతంగా ఉండిపోతాం. ఈ జీవితంలో మన ఆత్మ భౌతిక దేహంమీద
ఆధారపడి జీవిస్తుంది. ఈ దశలో అది ఎప్పటికప్పుడు మంచికి గాని చెడ్డకుగాని
మారగలదు. తన నిర్ణయాలను మార్చుకోగలదు. కాని మరణంతో ఈ దేహం
తొలగిపోతుంది. ఆత్మ వంటరిగా జీవించడం మొదలుపెడుతుంది. అది ఈ
భౌతికకాలంలోగాక, ఆ కాలానికి వెలుపల జీవిస్తుంది. ఇక దానిలో మార్పుంటూ ఉండదు.
కనుకనే అది మరణానంతరం పూర్వ పాపాలకు పశ్చాత్తాపపడలేదు. క్రొత్తగా పాపపుణ్యాలను
కట్టుకోలేదు కూడ.
              చాలమంది ఈ ప్రపంచ జీవితంలో కుత్తిక వరకు మునిగి ఉంటారు. ఆ పరలోక
జీవితాన్ని గుర్తుకి తెచ్చుకోనే తెచ్చుకోరు. కూడు గుడ్డ యిలు వాకిలి సంపాదించుకోవడం
డబ్బు జేసికోవడం పేరు  గడించడం మొదలైన వ్యామోహాల్లో తగుల్కొని శాశ్వత
సత్యాలను విస్మరిస్తారు. ఇది పొరపాటు, నీడలాగ, నీటి బుడగలాగ, మనం విడిచే
శ్వాసలాగ, ఈ జీవితం క్షణికమైంది. ఎన్నాళ్లు జీవించినా ఏమేమి సాధించినా నరులు

252 చావక తప్పదు. మనం అక్కడి వాళ్ళమే కాని యిక్కడి వాళ్ళం కాదు. కనుకనే తాత్వికులు యద్దృశ్యం తన్నశ్యం - అనగా కంటికి కన్పించేదల్లా నశించేదే అని వాకొన్నారు.

2. ఆ గడియను దేవుడే నిర్ణయిస్తాడు

            మనం ఎప్పడు మరణిస్తామో, ఏలా మరణిస్తామో, మనకు తెలియదు. మనమరణాకాలాన్ని మనం నిర్ణయించం. దేవుడే ఆ గడియను నిర్ణయిస్తాడు. కొద్దిమంది విషయంలో మాత్రం చావు ఎప్పుడు వస్తుందో ఊహించవచ్చు. కాని చాలమంది అలాంటి వూహకు తావులేకుండానే తలవని తలంపుగానే దాటిపోతారు. 
          మృత్యువకీ జీవానికీ అధిపతులం మనంగాదు, దేవుడు, సొలోమోను జ్ఞానగ్రంథం భగవంతుణ్ణి ఉద్దేశించి 

జీవంమీదా మరణంమీదా నీ కధికార ముంది
నీవు నరుణ్ణీ మృత్యుద్వారం చెంతకు గొనిపోతావు
అక్కడినుండి మరల వెనుకకు తీసుకొని వస్తావు

అని చెప్తుంది – 16,13. అలాగే ద్వితియోపదేశ కాండంగూడ

నేను తప్పక మరో దేవుడు లేడు
జీవానికీ మరణానికీ కర్తను నేనే
గాయపరచేది నయంచేసేది కూడ నేనే
నా కెవరూ అడ్డు రాలేరు

అని వాకొంటుంది - 32,39. ప్రభువు మనుష్యకుమారుడు దొంగలా వస్తాడని చెప్పాడులూకా 12,39-40 దొంగ ఎప్పడొస్తాడో మనకు తెలియదు. అలాగే మరణం ఎప్పుడు వస్తుందో గూడ మన మూహించలేం.

మన బ్రతుకుని దేవుని వద్ద నుండి ఎరువు తెచ్చుకొన్నాం. కనుక మన ప్రాణానికి మనం కర్తలం కాదు. దేవుడు ఊపిరిపోస్తాడు, ఊపిరి తీస్తాడు కూడ. మనతరపున మనం దేవుడు మనకు దయచేసిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసికోవాలి. ఈ లోకంలో సత్కార్యాలు చేయాలి. ఈ మంటిమీద నిరర్థకంగా రోజులు వెళ్ళబుచ్చగూడదు. ఇంకా, దేవుడు మనలను పిల్చిందాకా ఈ నేలమీద మన ప్రాణాన్ని పదిలంగా కాపాడుకోవాలి. మన ప్రాణాన్ని తీసుకొనె హక్కు అనగా ఆత్మహత్యకు పాల్పడే అధికారం, మనకు లేదు.

కొంతమంది మేమెప్పుడు ఏలా చనిపోతామో అని భయపడుతూంటారు. మనకు ప్రాణమిచ్చిన తండ్రి క్రూరుడు కాదు, దయామయుడు. దయామయుడు కనుకనే అతడు మనలను పట్టించాడు. మనలను తీసికొని పోయేపుడుగూడ అతడు క్రూరుడుగా గాక దయాపరుడూనే మెలుగుతాడు. కనుక మనం ప్రభుని నమ్మాలి, మనం ఎప్పడు చనిపోతామో ఏలాంటి పరిస్థితుల్లో చనిపోతామో మనకు ముందుగా తెలియకపోయినా 253 ఆ తండ్రికి తెలుసు. మనం పోయేదికూడ ఆ నాన్న యింటికే. కనుక మన తరపున మనం అకాలమృత్యువు వాతబడతామేమోనని భయపడనక్కరలేదు. అసలు మనచావు మనకు ముందుగా తెలియకుండా ఉంటేనే మంచిది. అలా తెలిస్తే దిగులువల్ల చావు రాకముందే చనిపోమా? అందుకే దేవుడు మంచివాడు కనుక మరణాన్ని మనకు ముందుగా తెలియనీడు.

3. మృత్యువు పాప ఫలితం

       నరులంతా చనిపోవలసిందే. మనం చనిపోయేవాళ్ళను రోజూ చూస్తూనే ఉంటాం. అందుచేత నరులకు మరణం సహజంగానే వస్తుందనుకొంటాం. కాని మరణం సహజ సిద్ధమైంది మాత్రమేకాదు. అది పాపఫలితం కూడ. ఈ సత్యం మనకు దివ్యశ్రుతినుండి మాత్రమే తెలుస్తుంది

. భగవంతుడు మనలను చావడానికిగాక బ్రతకడానికి సృజించాడు. పాపఫలితంగా మనమే చావుని కొనితెచ్చుకొన్నాం. సొలోమోను జ్ఞానగ్రంథం

    దేవుడు నరుడ్డి అమరుడ్డిగా జేసాడు
    అతన్ని తనవలె నిత్యునిగా జేసాడు,
    కాని పిశాచం అసూయవలన
    మృత్యువు లోకంలోనికి ప్రవేశించింది

అని చెప్తుంది - 2,23-24 ఆదాము పాపం చేయకముందు లోకంలో చావలేదు. ఒక నరుని పాపంద్వారా మృత్యువు మొదటిసారిగా లోకంలో అడుగుపెట్టింది-రోమా 5,12. యెషయా ప్రవక్త వర్ణించిన బాధామయ సేవకుడూ, ఆసేవకుడు సూచించే క్రీస్తుకూడ నరుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికే స్వీయప్రాణాలు అర్పించారు - యెష 53.

   పాపం యొక్క ఫలితం మరణం అన్నాడు పౌలు - రోమా 6,23. అనగా పాపఫలితంగా మరణం వచ్చింది. ఇంకా మరణం యొక్క మల్ల పాపం-1కొ 15,56. అనగా చావు మనలను ఓ విషప్రాణిలా కుడుతుంది. అలా కుట్టే శక్తి దానికి పాపంనుండే వచ్చింది. ఆదాము నుంచి సంక్రమించే జన్మపాపమూ మన సొంత పాపాలూ కలసి మనకు ఈ మృత్యువును తెచ్చి పెడతాయి

.

  మూమూలుగా మనం మరణించేప్పడు చాల బాధలను అనుభవింపవలసి ఉంటుంది. మరణంలాగే ఈ బాధలుకూడ పాపజనితాలే. మరణానికీ మరణబాధలకూ గూడ మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవి మన పాపఫలితాలు. వాటిని మనం తప్పించుకోలేం. 

4. క్రీస్తు మరణం మన మరణంమీద సోకుతుంది

         క్రీస్తు వచ్చిందాకా మృత్యువు లోకంలో రాజ్యం చేసింది. నరులు మృత్యువుకి వెరచారు.కాని క్రీస్తు వచ్చాక ఈ పరిస్థితి మారిపోయింది. అతడు మృత్యువుకి గురై దాన్ని జయించాడు. ఆ మృత్యుంజయుని విజయం నేడు మనకు సంక్రమిస్తుంది. మనం అతనిలోనికి మరణించి అతనితోపాటు ఉత్తానమౌతాం. క్రీస్తు రాకముందు మరణం అంతంలేని చీకటి సొరంగంలా ఉండేది. దానిలోనికి అడుగుపెట్టినవాళ్లు ఇక బయటికి రాలేకపోయేవాళ్ళు. కాని క్రీస్తు మరణం ద్వారా ఆ సొరంగానికి ఆవలి ద్వారం ఏర్పడింది. ఆ ద్వారంగుండా మనం ఆవలివెలుగులోనికీ, జీవంలోనికీ నడచిపోవచ్చు. మృత్యువంటే అందరికీ భయమే. కాని క్రీస్తు విజయం మనమీద సోకడంవల్ల మనం మరణించిగూడ మళ్ళా బ్రతుకుతాం అనేభావం ఈభయాన్ని చాలవరకు తగ్గిస్తుంది.
        పూర్వవేదంలోని భక్తులను ఉత్తానమూ మోక్షమూ అనే విషయాలు అంత స్పష్టంగా తెలియవు. వాళ్లు చనిపోయిన వాళ్ళంతా పాతాళమనే చీకటి కోనేటిలోకి వెళ్ళిపోతారని భావించేవాళ్లు. అక్కడ మృతులు దేవుణ్ణి దర్శింపక, సుఖదుఃఖాలు అనుభవింపక కేవలం నిద్రావస్థలో ఉండిపోతారని యెంచేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో గూడకొందరు భక్తులు ఉత్థానాన్ని గూర్చి అస్పష్టంగానైన మాట్లాడారు. ఉదాహరణకు 16వ కీర్తన వ్రాసిన భక్తుడు
       నీవు నన్ను పాతాళానికి పంపవు
       నీ పరిశుద్దుని గోతిపాలు చేయవు
అని వాకొన్నాడు. తర్వాత నూత్నవేద రచయితలు ఈ వాక్యాన్ని మృతక్రీస్తుకి అన్వయింపజేసారు - అచ 2,27. రెండవ మక్కబీయుల గ్రంథం ఉత్తానాన్ని గూర్చి ఇంతకంటె స్పష్టంగా మాట్లాడుతుంది. యూదా మక్కబీయుడు రెండువేల వెండినాణాలు ప్రోగుజేసి యుద్ధంలో చనిపోయినవాళ్ళకు పరిపరిహార బలిని అర్పించడానికి యెరూషలేముకు పంపాడు. మృతులు మళ్లాఉత్తానమౌతారని విశ్వసించాడు కనుకనే అతడు ఈపుణ్యకార్యం చేయించాడు- 12,43.
      నూత్నవేదంలో పౌలు మనం క్రీస్తు మరణంలోనికి మరణించిన అతనితో ఉత్తాన మౌతామని మాటిమాటికి చెప్తూంటాడు. ప్రభువు సిలువ మరణం మరణించేంతవరకూ విధేయుడయ్యాడు - ఫిలి 2,8.అతడు గోదుమ గింజలాగ భూమిలోపడి చివికిపోయాడు. కాని మళ్ళా మొలకెత్తి విస్తారంగా ఫలించాడు-యోహా 12,24. అనగా మరణాన్ని జయించి జీవనమూర్తి అయ్యాడు. నేడు మనం క్రీస్తు మరణంలోనికి జ్ఞానస్నానం పొందుతాంరోమా 6,3–4. దీనివలన పాపజీవితానికి చనిపోయి పుణ్యజీవితానికి ఉత్థానమౌతాం. జ్ఞానస్నానం ద్వారా ప్రభువు మరణం మనమీద సోకుతుంది. అతని చావు మన చావుని 

పునీతం చేస్తుంది. కావున మృత్యువు మనలను ఓడించలేదు. ఆ ప్రభువు మనకు పునరుత్థానమూ జీవమూను. అతన్ని విశ్వసించేవాడు మరణించి గూడ మళ్ళా బ్రతుకుతాడు - యోహా 11:25.

         ఒక్క మరణ సమయంలోనేగాదు, రోజువారి జీవితంలోగూడ క్రీస్తు మరణం మనవిూద సోకుతుంది. అలా సోకితేనేగాని మనకు ఆధ్యాత్మిక జీవనం లభించదు. మనం శారీరక జీవితం - అనగా పాపజీవితం జీవిస్తే తప్పక మరణిస్తాం. కాని పాపక్రియలను నాశంజేసే ఆధ్యాత్మిక జీవితం జీవిస్తే బ్రతుకుతాం - రోమా 8,43. కనుకనే పౌలు ప్రతిదినమూ శారీరక జీవితానికి చనిపోయేవాడు -1కొ 15,31. మనకుకూడ ఇదే నియమం వర్తిస్తుంది. మనం ఈలోకంలో జీవించినా ప్రభువు కొరకే జీవించాలి, మరణించినా ప్రభువుకొరకే మరణించాలి-రోమా 14,8. ఆ ప్రభువునందు కన్నుమూసే భక్తులు ధన్యులు - దర్శ 1413.
         పౌలు ఈ జీవితాన్ని త్యజించి త్వరగా క్రీస్తుని చేరుకోవాలని ఉవ్విళ్ళూరిపోయాడు. మరణం తనకు లాభకరమని యెంచాడు - ఫిలి 1,21-23. ఇది చాల పవిత్రమైన కోర్కె ప్రభువుని అనుభవానికి తెచ్చుకొన్నవాళ్లు మరణానికి భయపడరు. దాన్ని మక్కువతో ఆహ్వానిస్తారు. 
         క్రీస్తు మరణింకిణీ గున మరణాన్ని తొలగించలేదు. నేడు మనంకూడ చావవలసిందే. ఐతే అతడు మున చావుని ఫలప్రదం చేసాడు. ఆ ప్రభువుని నమ్మి అతనియందు మరణించినపుడు అతని మరణం మన మరణంమిూద సోకి మనకు పాపపరిహారమూ వరప్రసాదమూ ఉత్థానమూ జీవమూ మోక్షభాగ్యమూ సంపాదించి పెడుతుంది. క్రీస్తు రాకముందు మరణం నరజాతికి పాపశిక్షగా ఉండేది. అతని మరణం తర్వాత అది మనకు పాపక్షమను దయచేసే సాధనమైంది. అమరత్వానికి ద్వారమైంది. అతని చలవవల్ల నేడు మనం చావు అనే వంతెనగుండా ఈ యిహలోకాన్నుండి దాటిపోయి శాశ్వతమైన మోక్షధామాన్నిచేరుకొంటాం. కనుక చావు మనకు నిరాశను గాక నమ్మకాన్ని కలిగించాలి. భయాన్నిగాక ధైర్యాన్ని పుట్టించాలి. క్రీస్తుమరణం మన మరణాన్ని పూర్తిగా మార్చివేసింది.
         ఈ సందర్భంలోనే పునీతుల భావాలనుకూడ పరిశీలించాలి.మాములుగానే మనంచావంటే భయపడతాం. దాన్ని ఏలాగైనా తప్పించుకోజూస్తాం. కాని పునీతులు మరణాన్ని జూచి సంతోషించారు. దాని కోసం ఉవ్విళ్ళూరారు. దాన్ని ఆహ్వానించారు. పౌలు తన మరణం కోసం ఏలా ఆశతో ఎదురుచూచాడో పైన వివరించాం. ఇక నాల్గవ శతాబ్దానికి చెందిన గ్రెగోరీ నీసా భక్తుడు ఈలా వ్రాసాడు. “మనం చనిపోయినవాళ్ళ కొరకు గాక బ్రతికి వున్నవాళ్ళకొరకు శోకించాలి. ఎందుకంటే బ్రతికివున్నవాళ్ళ పరలోకప 

యెరూషలేమునూ దేవదూతలనూ ఇంకా దర్శింపలేకుండా ఉన్నారు కనుక. ఈ లోకంలో నరుడు చెరలోలాగ ఉండిపోతాడు. చెరలో ఉన్నవాడు క్రమేణ ఆ చెర జీవితానికి అలవాటు పడిపోయి తన దౌర్భాగ్యాన్ని అర్థంజేసికొనే చేసికోడు. ఈ లోకజీవితంలో నరుడు కూడ అంతే. తల్లి గర్భంలోవున్న శిశువు ఆ గర్భంలోని చీకటిజీవితానికి అలవాటు పడిపోతుంది. ఆగర్భం నుండి వెలుపలికి వచ్చి వెలుగుని దర్శించడానికి ఇష్టపడదు. అందుకే శిశువులు పట్టేప్పుడు ఏడ్చి అల్లరిచేస్తారు. అలాగే నరులు కూడ ఈలోక జీవితంనుండి పరలోక జీవితంలోకి ప్రవేశించడానికి ఏమాత్రమూ ఇష్టపడరు. మంత్రసాని బిడ్డ పుట్టడానికి తోడ్పడుతుంది. మృత్యువు గూడ ఓ మంత్రసానిలా మెలుగుతుంది. అది చనిపోయేవాళ్లు పరలోక జీవితంలోకి పుట్టడానికి తోడ్పడుతుంది. పూవునూ దానినుండి పట్టే పిందెనూ చూస్తుంటాంగదా! పూవు రాలిపోతేనేగాని పిందె కాయగా ఎదగదు. అలాగే మనం ఈ జీవితానికి చనిపోతేనే గాని పరలోక జీవితానికి పట్టం". ఈ వాక్యాల్లో గ్రెగోరీ వాడిన మూడు ఉపమానాలు - అనగా చెరలోఉన్న వ్యక్తి ,గర్భస్థశిశువు, కాయగా మారవలసిన పూవు - గమనింపదగ్గవి.

     రెండవ శతాబ్దానికి చెందిన అతనేష్యసు భక్తుడు ఈలా వాకొన్నాడు. "క్రీస్తు చనిపోయి ఉత్థానమయ్యాక మృత్యుభయం తొలగిపోయింది. క్రీస్తుకోసం ప్రాణాలర్పించే భక్తులు చావుని ఓ అల్పవస్తువులాగ తమ కాళ్ళక్రిందపడవేసి తొక్కుతారు. మరణంద్వారా ఈ జీవితం నాశంకాదనీ ఉత్తానంద్వారా అమరత్వాన్ని పొందుతామనీ వాళ్ళకు తెలుసు".
     రెండవ శతాబ్దంలో రోములో వేదసాక్షిగా మరణించిన ఇగ్నేప్యస్ భక్తుడు ఈలా వచించాడు. "రోములోని క్రీడాశాలలో నన్ను సింహాలకు మేతగా వేస్తారు. నన్ను జూచి భయపడకుండా వెంటనే నావిూదికి దూకి నన్నుమింగివేయవలసిందిగా నేను ఆ మృగాలను బుజ్జగిస్తాను. అవి నన్ను వధించినపుడుగాని నేను శిష్యుణ్ణి కాను. ఏశక్తి నన్ను క్రీస్తుని చేరనీయకుండా ఆటంకపరచుకుండునుగాక. నేను క్రొత్త పట్టువు పట్టడానికి ప్రసవవేదన పడుతున్నాను.మీరు నా మరణానికి ఆటంకం కలిగించి నా నూత్న జన్మనుభంగం చేయవద్దు. నన్ను నిర్మలమైన జ్యోతిని చేరుకోనీయండి. ఆ వెలుగుని సమిూపించినప్పడు గాని నేను పరిపూర్ణ మానవుణ్ణి కాను. చావుకి నేను ఉబలాటపడుతున్నాను. నాలోని జీవజలం నీవు శీఘ్రమే తండ్రి వద్దకు వెళ్ళు అని నన్ను హెచ్చరిస్తూంది. నేను మృత్యువుకోసం ఓప్రియునిలాగ తపించిపోతూన్నాను. ఇక యిూలోక సుఖాలమీద నాకు కోర్మెలేదు".
−
     ఇక క్రైస్తవ ఆరాధనంలోని ప్రార్థనలను పరిశీలిస్తే మనం మరణానికిభయపడనక్కరలేదు, దేవుణ్ణి నమ్మితే చాలు అనే భావం కన్పిస్తుంది. మృతుల పూజలో వచ్చే ప్రెఫేస్ ప్రార్థనం ఈలా చెప్తుంది. "మరణం తప్పదనే సత్యం మాకు దుఃఖాన్ని 

కలిగించినా శాశ్వత జీవితం లభిస్తుందనే వాగ్దానం మాకు ఊరట నిస్తుంది. ప్రభూ! విూ విశ్వాసులకు ఈ జీవితం మారుతుందే కాని అంతం కాదు. ఈ భూలోక నివాసం శిథిలం కాగా మాకు పరలోక నిత్యనివాసం సిద్ధమౌతుంది". ఇది చాల గొప్ప భావం.

       విశ్వాసులు చనిపోయేప్పడు చెప్పే మరో ప్రార్ధనం ఇది, "సోదరా! (సోదరీ) మేము నీ యాత్మను సర్వశక్తిమంతుడైన దేవునికి అర్పిస్తున్నాం. నీయాత్మ మరల సృష్టికర్తను చేరునుగాక. నీవు పరలోకంలో సన్మనస్కులనూ వేదసాక్షులనూ స్తుతీయులనూ కలసికొందువుగాక. దేవదూత నిన్ను చల్లని చూపున జూచునుగాక. న్యాయాధిపతియైన యేసుక్రీస్తు నిన్ను అనుగ్రహించునుగాక. ప్రభువువైన యేసూ! నీవు కరుణతో ఈయాత్మను మోక్షంలో ప్రవేశపెట్టు.ఈ యాత్మ ప్రేమ ద్వారా నీతో ఐక్యమగునుగాక".
ఈ ప్రార్థనలో కొండంత నమ్మకం ఇమిడి ఉంది. మనం చావును జూచి భయపడకూడదు. తండ్రిలాంటి వాడైన దేవుణ్ణి నమ్మాలి, అంతే

.

5. ఆధునికుల భావాలు

     మరణాన్ని గూర్చి ఆధునిక వేదాంతులూ శాస్త్రజ్ఞలూ నూత్న భావాలు చాల సూచిస్తున్నారు. ప్రస్తుతానికివాటిల్లో రెండింటినిమాత్రం పేర్కొందాం. మొదటిది, చావులోమనకు స్వేచ్చ ఉంటుందా అనే అంశం. మరణకాలాన్ని ఎన్నుకొనే స్వేచ్చ మనకులేదు. దేవుడే ఆ గడియను నిర్ణయిస్తాడు. ఐనా మరణంలో మన స్వేచ్ఛ నశించదు. ఇహలోక జీవితంలో మనకు స్వేచ్ఛ ఉంది. పరలోక జీవితంలో గూడ స్వేచ్చ ఉంటుంది. మరణసమయంలో మాత్రమే ఆస్వేచ్చ ఎందుకు నశించాలి? చనిపోయేప్పుడు మనంపూర్ణ స్వేచ్చతో భగవంతుణ్ణి అంగీకరించనైనా అంగీకరిస్తాం. నిరాకరించనైనా నిరాకరిస్తాం. అతన్నిఅంగీకరించేవాళ్ళకి శాశ్వత బహుమతీ, నిరాకరించేవాళ్ళకి శాశ్వత శిక్షా ప్రాప్తిస్తాయి.
      కాని మనం ఏలా జీవిస్తామో అలాగే మరణిస్తాం. తమ జీవితకాలంలో భక్తివిశ్వాసాలతో జీవించినవాళ్ళు అవసానక్షణాల్లో గూడ ప్రభువుని ఎన్నుకొంటారు. అలా జీవించనివాళ్లు అంత్యక్షణాల్లో గూడ అతన్ని నిరాకరిస్తారు. నరుడు ఆఖరిక్షణాల్లో పరివర్తనం చెంది జీవితాన్ని మార్చుకోవడమనేది చాల అరుదు.
     ఒక్కోసారి జనులు ప్రమాదాల్లోను గండాల్లోను చిక్కి దిడీలున చనిపోతారు. కాని ఈలాంటి పరిస్థితుల్లో గూడ చావు ఒక్కనిమిషంలో సంభవింపదు. మనం మనిషి చనిపోయాడు అనుకొన్న తర్వాతగూడ అతడు కొంతకాలం బ్రతికేఉంటాడు. అతని మెదడులోని కణాలు చైతన్యవంతంగానే ఉంటాయి. అలా ఉన్నంతకాలం అతడు బ్రతికిఉన్నట్లే .నరులు ఎప్పుడుగూడ దిడీలన మరణించరు నిదానంగా మరణిస్తారు. కనుక ఏలాంటి మరణంలోనైనా సరే నరుడు స్వేచ్చగా భగవంతుణ్ణి ఎన్నుకోవడానికిగాని, నిరాకరించడానికిగాని వ్యవధిఉంటు೦ದಿ. 

రెండవది, చనిపోయేవాళ్ళ అనుభవాలు ఏలా ఉంటాయి అనే అంశం. శాస్త్రజ్ఞలు ఇంచుమించు చనిపోయి మళల బ్రతికిబయటపడ్డవాళ్ళ అనుభవాలనుకొన్నింటిని పరిశీలించారు, వాళ్ళ అనుభవాల ప్రకారం చనిపోయేవాళ్ళు ఓ జ్యోతిర్మూర్తిని కలుసుకొంటారు. అతడు చనిపోయేవాళ్ళను తన దగ్గరికి బలంగా ఆకర్షిస్తాడు. ఆప్యాయతతోను ఆదరాభిమానాలతోను తన దగ్గరికి రాబట్టుకొంటాడు. వాళ్ళని తన కాంతి ప్రవాహంలో మంచుతాడు. ఈ కాంతి యెంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ జ్యోతిర్మూర్తిని క్రీస్తునిగా భావించారు. యూదులు దేవదూతనుగా ఎంచారు.

           ఇంకా, ఈ చనిపోయేవాళ్ళకు ఈ భౌతిక దశలో నుండి మరో దశలోనికి అడుగు పెడున్నట్లుగా కన్పిస్తుంది. ఆ నూత్నదశ ఈ ప్రస్తుత దశకంటె మెరుగైందని కూడ అనిపిస్తుంది. ఆ నూత్నదశలో ఇక్కడ లేని సౌందర్యమూ శాంతీ భద్రతా ప్రేమా ఉన్నట్లుగా స్ఫురిస్తుంది. కనుక చనిపోయేవాళ్లు ఆ నూత్నదశ నుండి మళ్ళా తమ ప్రాత జీవితానికి తిరిగిరావడానికి ఒప్పకోరు. వాళ్ళకు జీవించడం కంటె మరణించడమే మేలనిపిస్తుంది.
       ఈ భావాలనుబట్టిగూడ మృత్యువు భయపడదగింది కాదని అర్థం జేసికోవాలి. పైగా అది అంగీకరింపదగిందీ, ఆహ్వానింపదగిందీని.
                                                   ప్రార్ధనా భావాలు

1. మనం మరణభయాన్ని తప్పక జయించాలి. మామూలుగా నరులంతా ਹ65 తల్లడిల్లిపోతారు. కాని యిది వట్టి అజ్ఞానం. మనం కొన్నాళ్ళపాటు ఈ లోకంలో జీవించగానే ఇక యీ ప్రపంచానికి అంటిపెట్టుకొంటాం. ఇక్కడి వస్తువులూ, సుఖభోగాలూ, వ్యక్తులూ మొదలైన వాళ్లమిూద వ్యామోహాలు పెంచుకొంటాం. కనుకనే ఈ ప్రపంచాన్ని వదలిపెట్టి పోవాలంటే మనకు అనిష్టంగాను బాధగాను భయంగాను ఉంటుంది. మనం ఈలోక వ్యామోహాలను ఎంతగా పెంచుకొంటామో మరణంకూడ అంత చేదుగా ఉంటుంది. ఆ వ్యామోహాలను ఎంతగా తగ్గించుకొంటామో చావుగూడ అంత తేలికగా ఉంటుంది. మృత్యుభయానికి స్వార్థం ప్రబలకారణం, విశ్వాసం నేర్పేదేమిటంటే, మన యీ లౌకిక జీవితం క్షణికమైంది. అది మనలను పరలోక జీవితానికి సిద్ధం జేయడానికి మాత్రమే ఉద్దేశిం పబడింది. మనకు ఇక్కడ స్థిరమైన పట్టం ఏమి లేదు. రాబోయే నగరం కోసం ఎదురుచూడాలి - హెబ్రే 13,14

2. క్రీస్తులోనికి చనిపోయి అతనితో ఉత్తానమౌతామనే నమ్మకమొక్కటే యథార్థంగా మృత్యుభయాన్ని జయించడానికి ఉపయోగపడేది. ఆ ప్రభువునందు మరణించినవాళ్ళకు జీవితం నాశంకాదు, క్రొత్తజీవితం ప్రారంభమౌతుంది. కనుక 259 ఆ ప్రభువు మన ఆశ, మన నమ్మకం. ఒక్కమరణ సమయంలోనేగాదు, రోజువారి జీవితంలో గూడ మనం క్రీస్తుతో చనిపోయి అతనితో ఉత్థాన మౌతుండాలి. ప్రతిదినమూ అతని సిలువా మహిమా మన జీవితంలో ప్రత్యక్షమౌతుండాలి. కాననే పౌలు క్రీస్తుశ్రమల్లో పాల్గొని అతని ఉత్థానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలని కోరుకొన్నాడు - ఫిలి 3,10-11.

3.మనం రాబోయే మృత్యువుని గూర్చి భయపడ్డంకంటె ఆ మృత్యువుని కలిసికోవడానికి ఇప్పటినుండే సిద్ధం కావడం మంచిది. నరులు ఏలా జీవిస్తారో అలాగే చనిపోతారు. ఈయిహలోక జీవితం పరీక్షాసమయం. ఇది కోతకాలం. ఇక్కడ మంచిజీవితమనే పంటను పండించుకొనేవాళ్లు పరలోకానికి ధాన్యం చేకూర్చిపెట్టుకొంటారు. పైగా మనం ఇక్కడ కొన్నియేండ్లు మాత్రమే జీవిస్తాం. ఈ లోకంగుండ ఒక్కసారి మాత్రమే సాగిపోతాం. కనుక దేవుడు మనకు దయచేసిన యీ హ్రస్వకాలాన్ని సద్వినియోగం చేసికోవాలి. సత్ర్కియలతో ఈలోక జీవితాన్నిసార్థకం జేసికోవాలి. ఈలా చేసినవాడు కొలది యేండ్లు జీవించినా పెక్కేండ్లు జీవించినవా డవుతాడు.

4.తరచుగా మృత్యువునిగూర్చి ధ్యానం చేసికోవడంగూడ మంచిది. చాలమంది పునీతులు ఈలాచేసారు. మృత్యుమననంవల్ల లోక వ్యామోహాలనుండి వైదొలగుతాం. పారమార్ధిక ధృష్టినలవర్చుకొంటాం. పాపాలకు పశ్చాత్తాపపడతాం. పుణ్యకార్యాలకు పూనుకొంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే, వళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తాం. ఇది అల్పభాగ్యమేమీ కాదు.

2. తీర్పు

       భగవంతుడు నరులందరికీ ఓదినం ఖండితంగా తీర్పు తీరుస్తాడు. కనుక మనం

ధర్మబద్ధంగా జీవించాలి. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. తీర్పు అంటే యేమిటి?

     మనం చనిపోగానే మన ఆత్మదేవుణ్ణి  చేరుకొంటుంది. భగవంతుడు దానికి

తీర్పు తీరుస్తాడు. మన తలపులకీ మాటలకీ చేతలకీ, చేయవలసిగూడ చేయకుండా వదలివేసిన పనులకీ మనం భగవంతునికి ఖండితమై లెక్క ఒప్పచెప్పాలి.

     ఒక్క క్రైస్తవ యూదమతాల్లోనేగాక ప్రపంచంలోని ముఖ్య మతాలన్నిటిలోగూడ

'భగవంతుడు న్యాయాధిపతి, అతడు నరులందరికీ న్యాయనిర్ణయం చేస్తాడు అనే భావం వుంది. మామూలుగా నరులందరూ అన్యాయానికి జంకుతూనే ఉంటారు. పాపంచేసే ప్రతి నరుణ్ణీ అతని అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంటుంది.

తీర్పుని గూర్చిన పై వేదసత్యంలో మూడంశాలు ఇమిడి వున్నాయి. మొదటిది, మనం చనిపొయేప్పుడే భగవంతుడు మన స్థితిని శాశ్వతంగా నిర్ణయిస్తాడు. అనగా చనిపోయినప్పడు దేవుడు మనలను పుణ్యాత్ములనుగా గణిస్తే ఇక శాశ్వతంగా పుణ్యాత్ములంగానే ఉండిపోతాం. పాపాత్ములనుగా గణిస్తే ఇక శాశ్వతంగా పాపాత్ములంగానే ఉండిపోతాం. ఈ స్థితికి ఇక మార్పంటూ ఉండదు. రెండవది, మన మరణకాలంలో మనం పుణ్యాత్ములమో పాపాత్ములమో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆత్మ తన స్థితిని తాను స్పష్టంగా అర్ధం జేసికొంటుంది. ఈ విషయంలో అనుమానమంటూ ఉండదు. మూడవది, మన ఆత్మ తన పుణ్యపాపాల ఫలితాన్ని వెంటనే అనుభవించడం మొదలుపెడుతుంది. అనగా పాపపుటాత్మకు వెంటనే నరకశిక్షప్రాప్తిస్తుంది. పుణ్యపుటాత్మకు వెంటనేగాని, లేక ఉత్తరించే స్థలంలో శుద్ధిని పొందిన పిదపగాని, మోక్షభాగ్యం సిద్ధిస్తుంది. ఈ పుణ్యపాపాల ఫలితానుభవంలో జాప్యం అంటూ ఉండదు. ఈ మూడు సత్యాలనుగూడ మనం రూఢిగా నమ్మాలి.

2. ఎన్ని తీర్పులున్నాయి?

రెండు తీర్పులున్నాయని జ్ఞానోపదేశంలో నేర్చుకొంటూంటాం. అవి ప్రత్యేకతీర్పు, సాధారణ తీర్పులేక కడతీర్పు, భగవంతుడు ఒక్కో నరుడు చనిపోయిన వెంటనే అతనికి వ్యక్తిగతంగా తీర్చే తీర్పు ప్రత్యేకమైన తీర్పు. అతడు లోకాంతంలో అందరి యెదుటా అందరికీ కలిసి తీర్చే తీర్పు సాధారణతీర్పు లేక కడతీరు బైబులు విశేషంగా సాధారణ తీర్పుని పేర్కొంటుంది. ఐనా ప్రత్యేకమైన తీర్పుని గూర్చిగూడ కొన్ని సందర్భాల్లో చెప్పకపోదు. తొలి రోజుల్లోని పితృపాదులూ వేదాంతులూ సాధారణ తీర్పుని మాత్రమే పేర్కొన్నారు. 7వ శతాబ్దం తర్వాత గాని క్రైస్తవ వేదాంతులు ప్రత్యేక తీర్పుని గూర్చి మాట్లాడ్డం మొదలుపెట్టలేదు. కనుక క్రైస్తవ ప్రజలు తొలిరోజుల్లో సాధారణ తీర్పుని గూర్చి మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. క్రమేణ ప్రత్యేక తీర్పుకూడ ఉందనే భావం ప్రచారంలోకి వచ్చింది. క్రైస్తవులు తొలి రోజుల్లో ప్రత్యేక తీరుపుని గూర్చి మాట్లాడకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, నరుడు దేహాత్మల సంయోగంవల్ల ఏకవ్యక్తిగా రూపొందుతాడని చెప్తుంది బైబులు. కాని ప్రత్యేక తీర్పులో దేహమనేది ఉండదు. కనుక నరుని వ్యక్తిత్వంలో సగం లోపించినట్లే, సగం వ్యక్తియైన నరునికి తీర్పు జరగడమేమిటని తొలినాటీ క్రైస్తవులు ప్రత్యేక తీర్పుని పట్టించుకోలేదు. రెండవది, యూద క్రైస్తవ మతాలు 261 

రెండూ సామూహికమైనవిగాని వ్యక్తిగతమైనవి కావు. కనుక మృతులకు సామూహికంగా తీర్పు జరగాలి గాని వ్యక్తిగతంగా తీర్పు జరగడమేమిటనుకొని తొలిరోజుల్లోనివాళ్ళ ప్రత్యేకతీర్పుని అనాదరం చేసారు. మూడవది, తొలినాటి క్రైస్తవులు ప్రభువు త్వరలోనే - తమ జీవితకాలంలోనే - రెండవమారు వేంచేసి వస్తాడని నమ్మారు, పౌలుకూడ మొదటలో ఈ భావానికి లొంగిపోయాడు. ఇక, యిూలా త్వరలోనే వేంచేసి వస్తాడనుకొన్న ప్రభువు అందరికీ కలిపి సాధారణ తీర్పు తీరుస్తాడు కదా! అందుచేత ప్రత్యేక తీర్చునుగూర్చి ఆలోచించే అవసరం తొలినాళ్ళలోని క్రైస్తవులకు కలుగలేదు.

కాని ఈ రెండవ రాకడ విషయంలో ఆలస్యం జరిగేకొద్దీ తొలినాటి క్రిస్తవ ప్రజలు ఆలోచించడం మొదలెట్టారు. నరుడు చచ్చిపోయినప్పడు ఏం జరుగుతుందా అనీ, దేవుడు వెంటనే న్యాయనిర్ణయం చేయడా అనీ ఊహలు ప్రారంభించారు. అంతలో వేదసాక్షులుగా మరణించినవాళ్లు చనిపోగానే మోక్షానికి వెళ్ళి దేవుణ్ణి దర్శిస్తారనే భావం ప్రచారంలోకి వచ్చింది. అనగా వాళ్ళకు చనిపోగానే న్యాయనిర్ణం - ప్రత్యేకతీర్పుజరిగిందన్నమాట. ఈ వేదసాక్షులకు జరిగే ప్రత్యేక తీర్పే మృతులైన కన్యలు, స్తుతీయులు, మామూలు విశ్వాసులు మొదలైన వాళ్ళందరికీ గూడ జరుగుతుందనే భావం క్రమేణ ప్రచారంలోకి వచ్చింది. ఈలా 13వ శతాబ్దానికల్లా ప్రత్యేకమైన తీర్పు ఒకటుందనే భావం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఆ శతాబ్దంలోనే తిరుసభ ఈ వేదసత్యాన్ని అధికారపూర్వకంగా ప్రకటనచేసింది కూడ.

క్రైస్తవ విశ్వాసులు ఒకమారు ప్రత్యేక తీర్పుని గూర్చి తెలుసుకొన్నంక ఇక సాధారణ తీర్పుతో అవసరమేమిటా అని వితర్మించడం మొదలుపెట్టారు. సాధారణ తీర్పు ప్రత్యేకతీర్పుకి ఏమీ చేర్చదు. దానినుండి ఏమీ తొలగించదు. ప్రభువు అక్కడ చేసిన న్యాయనిర్ణయమే ఇక్కడ కూడ చెల్లుబాటవుతుంది. మరి మల్లా ఈ సాధారణ తీరపనేది ఎందుకు?

సాధారణ తీర్చుని సమర్ధిస్తూ వేదశాస్తులు కొన్ని కారణాలు చెప్పారు. మొదటిది, నరుల్లో ఒకరి పాపాలొకరికి వెల్లడి చేయడం కోసం, సాధారణతీర్పు జరిగిందాకా ఎవరు మంచివాల్లో ఎవరు చెడ్డవాల్లో లోకానికి తెలియదు, అంతవరకూ సజ్జనులూ దుర్మార్డులూ కలిసే జీవిస్తుంటారు. కాని ఈ తీర్పులో నిజానిజాలు వెల్లడి యాతాయి. కడకు సత్యం గెల్చి బహుమతిని పొందుతుంది. అసత్యం ఓడిపోయి శిక్షననుభవిస్తుంది. ఇది ప్రత్యేక తీర్పులో జరుగదు.

రెండవది, మన దేహంకూడ బహుమతినిగాని శిక్షను గాని పొందడంకోసం. ఆత్మ మంచిపనులు చేసినా చెడ్డపనులు చేసినా ఈ దేహంతో చేస్తుంది. కనుక బహుమతి 262 గాని శిక్షగాని దేహాత్మలు రెండిటికీ లభించాలి. కాని ప్రత్యేకతీర్పులో ఆత్మ మాత్రమే, శిక్షనో బహుమతినో పొందుతుంది. సాధారణ తీర్చులోగాని దేహంగూడ ఉత్తానమై శిక్షనో బహుమతినో పొందదు.

మూడవది, సామూహిక భావాన్ని తెలియజేయడం కోసం. మనమంతా క్రీస్తు జ్ఞాన శరీరానిమి. అతని అవయవాలమి, పరలోకరాజ్య సభ్యులం, కనుక కడ తీర్పులో పుణ్యాత్ములంతా కలసే క్రీస్తునుండి బహుమతిని పొందుతారు. పాపాత్ములంతా కలసే అతని జ్ఞాన శరీరంనుండి బహిష్కౄతులగుతారు. జ్ఞానశరీరంగా క్రీస్తుతో మనకున్న ఐక్యతనీ, ఆ జ్ఞానశరీర సభ్యులంగా మనలో మనకున్న ఐక్యతనీ కడతీర్పు స్పష్టం చేస్తుంది

ఇన్ని కారణాలవల్ల కడతీర్పు అవసరమైంది. ప్రత్యేకతీర్పు కేవలం వ్యక్తిగతమైంది. సాధారణ తీర్పు సామూహికమైంది. నేడు కొందరు వేదశాస్తులు రెండు తీర్పులు అక్కరలేదనీ, ఒక తీర్పుతోనే సరిపెట్టుకోవచ్చునని చెప్తున్నారు. ఆ వొక్క తీర్పునే రెండు దృక్పథాలనుండి పరిశీలించి చూడవచ్చునని వీళ్ళ సూచన. దీన్నే మరణ సమయంలో ప్రత్యేక తీర్పనీ, లోకాంతంలో సాధారణ తీర్పనీ పిలవవచ్చునని వీళ్ళ అభిప్రాయం. రెండవ తీర్పు మొదటి తీర్పుకి ఏమీ చేర్చదు. కనుక వీళ్లు ఈలా అభిప్రాయపడుతున్నారు. బైబులు రెండు తీర్పులనుగాక ఒక్క తీర్పునే పేర్కొంటుంది. ఈ విషయంకూడ తమ అభిప్రాయానికి బలం చేకూరుస్తుందని వీళ్ళవాదం. ఇక్కడ ఈవివాదంలోకి మనం ప్రవేశించనక్కరలేదు. శతాబ్దలపొడుగునా పెద్దపెద్ద వేదశాస్రులే తీర్పులు రెండా లేక వొకటా అని చర్చలుచేసి ఎటూ తేల్చలేకపోయారు. కనుక నేడు మనం తీర్పులు రెండా లేక వొకటా అని వాదిస్తూ కూర్చోవడంకంటె, వాటికి ఏలా సంసిద్ధం కావాలా అని ఆలోచించడం మేలు.

3. బైబులు భావాలు

నూత్నవేదం ప్రభువు మనకు తీర్పుతీరుస్తాడని స్పష్టంగా చెప్పంది. ఆ తీర్పు రెండుసార్లుగాక ఒకేసారి జరుగుతుందని చెప్తుంది. కాని ఆ తీర్పు ఎప్పడు జరుగుతుందో స్పష్టంగా చెప్పదు. మత్తయి భావాల ప్రకారం తీర్పు లోకాంతంలో జరుగుతుంది. లూకా భావాల ప్రకారం అది మనం మరణించిన వెంటనే జరుగుతుంది. యోహాను భావాల ప్రకారం అది మనం జీవిస్తూండగానే జరుగుతుంది. ఇక ఈ భావాలను క్రమం పరిశీలిద్దాం.

1. మత్తయి 23,31-46 వచనాల్లో కడతీర్పు సామెత వస్తుంది. తొలిరోజుల్లో క్రైస్తవలోకంలో సాధారణ తీర్పు బాగా ప్రచారంలోకి రావడానికి కారణం ఈ సామెతే "మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమతో వచ్చునప్పడు" అనే ప్రారంభ వాక్యాలనుబట్టి ఈ రచయిత తీర్పు లోకాంతంలో జరుగుతుందని భావించాడు అనుకోవాలి ఈ తీర్పులోని ముఖ్యాంశం ఇది. నరులు దేన్నిబట్టి దేవునినుండి శిక్షనుగాని బహుమతినిగాని పొందుతారు? జనులు తోడినరులపట్ల ప్రవర్తించే తీరునుబట్టే శిక్షనుగాని బహుమతిగాని వస్తుంది. క్రీస్తు తోడినరుల్లో ఉంటాడు. కనుక తోడినరులకు మేలుచేస్తే అతనికి మేలు చేసినట్లే తోడినరులకు కీడుచేస్తే అతనికి కీడుచేసినట్లే, "ఈ నా సోదరుల్లో అత్యల్పుడైన ఏవొక్కనికి విూరు ఇవి చేసినపుడు నాకు చేసితిరి" అనే 40వ వాక్యం భావమూ, "ఈ యత్యల్పుల్లో ఒకనికైనను మీరివి చేయనపుడు నాకును చేయలేదు" అనే 45వ వాక్యం భావమూ ఇదే. కనుక మనం కడతీర్పులో నెగ్గాలంటే దైవప్రేమతోపాట సోదరప్రేమనుగూడ పాటించాలి.

2. లూకాభావాల ప్రకారం తీర్పు లోకాంతంలోగాక మనం మరణించిన వెంటనే జరుగుతుంది. ఇతని సువివేషం 16వ అధ్యాయంలో ధనికుడు - లాజరు అనే సామెత వస్తుంది. ఈ యధ్యాయంలో మనకు కావలసింది 22-23 వచనాలు. లాజరూ ధనికుడూ ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన వెంటనే దేవదూత లాజరుని అబ్రాహాము వొడిలోనికి, అనగా మోక్షానికి చేర్చాడు. ధనికుడు పాతాళానికి, అనగా నరకానికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ లోకాంతంలోని సాధారణ తీర్పుదాకా ఆగకుండానే, చనిపోయిన వెంటనే, దేవునినుండి బహుమతినీ శిక్షనూ పొందారు. అనగా వీళ్ళకు మరణించిన వెంటనే ప్రత్యేక తీర్పు జరిగింది.

ఈలాగే సిలువవిూద చనిపోయే క్రీస్తు మంచి దొంగతో "నేడే నీవు నాతో కూడ పరలోకంలో ప్రవేశిస్తావు” అని చెప్తాడు - లూకా 23,43, ఈ వాక్యంలో "నేడే" అంటే ఈ రోజే అని భావం. యూదులకు రోజు సూర్యాస్తమయంతో ముగుస్తుంది. కనుక మంచిదొంగ శుక్రవారం సాయంకాలం ప్రాదు క్రుంకకమునుపే, తాను చనిపోయిన వెంటనే, మోక్షంలో వుంటాడు. అనగా అతనికి మరణం ముగియగానే తీర్పు జరిగింది,బహుమతి లభించింది.

ఈలాగే అ.చ.1,25లొ "తన చోటికి పోవుటకు యూదా విసర్జించిన యీ పరిచర్యలో" అన్న వాక్యం వస్తుంది. యూదా చనిపోయిన వెంటనే తనకు నిర్ణయింపబడిన తావుకి వెళ్ళిపోయాడు. అనగా అతనికిగూడ మరణించిన వెంటనే తీర్పు జరిగింది.

ఈ యాలోకనాలన్నిటినిబట్టి లూకా భావాన్ని అర్థంజేసికోవచ్చు. లోకాంతంవరకు ఆగనక్కరలేకుండానే మరణించిన వెంటనే మనకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులోనే మనం శాశ్వతంగా బహుమతినో శిక్షనో పొందుతాం.

3. యోహాను 3,17-18లో ఈ వాక్యాలు తగులుతాయి. "ఆయనను విశ్వసించేవాడు తీర్పును పొందడు, విశ్వసించనివాడు ఈవరకే తీర్పుని పొందాడు. ఆ తీర్పు యిది. వెలుగు లోకంలోనికి వచ్చింది. కాని మనుష్యులు దుష్క్రియలుచేస్తూ వెలుగుకంటె చీకటినే యెక్కువగా ప్రేమించారు". ఈ వాక్యాల్లో వెలుగంటే క్రీస్తే నరుల్లో కొందరు క్రీస్తుని అంగీకరిస్తారు, మరికొందరు అంగీకరించరు. ఆ ప్రభువుని విశ్వసించనివాళ్ళకు ఖండనం ఉంటుంది.

యోహాను భావాల ప్రకారం మనం తీర్పుకి లోకాంతందాకా వేచి ఉండనక్కరలేదు. మరణందాకా గూడ వేచి ఉండనక్కరలేదు. ఆ తీర్పు యిప్పడే, మనం జీవించి ఉండగానే జరిగిపోతుంది. క్రీస్తు వెలుగుగా మనకు తీర్పు విధిస్తాడు. అతన్ని అంగీకరించేవాళ్ళకు బహుమతీ, అంగీకరించనివాళ్ళకు శిక్షా ఉంటాయి. క్రీస్తుపట్ల మనకుండే అవిశ్వాసంగాని విశ్వాసంగాని యీ శిక్షా బహుమతులకు ఆధారం. ఇక్కడ క్రీస్తుని అంగీకరించడమూ విశ్వసించడమూ అంటే ఆ ప్రభువుని ప్రేమించి అతని ఆజ్ఞలను పాటించడం.

4. పైన మత్తయి, యోహాను, లూకా భావాలను చూచాం, ఇక మిగిలిన నూత్న వేద రచయితలు, అనగా పౌలు పేత్రు మొదలైనవాళ్ళు ప్రభువు రెండవమారు విజయంచేసినపుడు తీర్పు తీరుస్తాడని చెప్పారు. అనగా యిది లోకాంతంలో జరిగే సాధారణ తీర్పన్నమాట. లోకాంతంలో ప్రభువు స్వయంగా విచ్చేసి బ్రతికినవాళ్ళను చనిపోయినవాళ్ళనూగూడ తీర్పుకి పిలుస్తాడు - 1తెస్స 4,15-18. మనం ఇప్పడు క్రీస్తు శ్రమల్లో పాలుపొందితే అతడు మహిమతో వచ్చినపుడు ఆనందాన్ని పొందుతాం1 పేత్రు 4,14. భక్తులు ఓపికతోను ధైర్యంతోను ప్రభువు విచ్చేసే దినంకోసం వేచివుండాలి - యాకో 5,8. ప్రతివ్యక్తీ ఒక్కసారే మరణిస్తాడు. తదుపరి దేవుని నుండి తీర్పు పొందుతాడు - హెబ్రే 9,27.

5. విశ్వాసులకు దైవభీతి కలిగించడానికి దివ్యగ్రంథం తీర్పుని భయంకరమైన దాన్నిగాకూడ చిత్రిస్తుంది. దేవుడు పక్షపాతానికి లొంగకుండా ఎవరెవరి ప్రవర్తనను ಬಣ್ಣಿ వాళ్ళకు తీర్పు జెప్తాడు - 1షేత్రు 1,17. కాబట్టి నిస్పక్షపాతియైన ఆ న్యాయాధిపతిని జూచి మనం భయపడాలి. పూర్వవేదంలో మోషే ధర్మశాస్తాన్ని విూరినవాళ్ళకు, ఇద్దరు ముగ్గురు సాక్షుల నిదర్శనం లభిస్తే చాలు, మరణశిక్షపడేది, అలాంటప్పుడు నూతవేదంలో దేవుని పుత్రుట్టే నిరాకరించనవాళ్ళ గతి ఏమౌతుంది? నిబంధన రకాన్ని కాలదన్నిదేవుని ఆత్మనే అవమానపరచినవాళ్లు ఎంతటి ఫరోరశిక్షననుభవించరు? సజీవుడైన దేవుని చేతికి జిక్కడం మహాభయంకరంగదా? - హెబ్రే 10,27-31. ఆ దేవుడు మన రహస్యాలోచనలకుగూడ తీర్పు తీరుస్తాడు అంటే మనం ఎంతగా జాగ్రత్తపడవలసి ఉంటుంది! - రోమా 2,16. అతడు మనం పలికే ప్రతి వ్యర్థపు మాటకుగూడ లెక్క అడుగుతాడు అంటే మనం ఎంత మెలకువతో ఉండవలసి ఉంటుంది! - మత్తయి 12,36, మన మంచి పనులూ చెడ్డపనులూకూడ అతని గ్రంథంలో లిఖింపబడి ఉంటాయి అంటే, అతడు మన పాపపుణ్యాలను ఏమాత్రమూ మర్చిపోడు అంటే, మనం ఎంత నిర్మలంగా ప్రవర్తింపవలసిఉంటుంది! - దర్శ 20, 12. మనం ఇతరులకు ఏ కొలతన కొలుస్తామో దేవుడుకూడ మనకు అదే కొలతన కొలుస్తాడు అంటే మనం తోడిజనంతో ఎంత చిత్తశుద్ధితో మెలగవలసి ఉంటుంది! - మత్త 7,2. ఈ భావాలన్నీ మనకు ఆలోచన పుట్టించాలి. మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని చక్కదిద్దుకొని మంచికి మారడానికి ప్రేరణం పుట్టించాలి.

6. దేవుని తీర్పుకి తట్టుకోవడం ఏలా? ఏ ప్రభువు మనకు న్యాయాధిపతో అతడే మనకు ఆశాకిరణం గూడ. మనం దేవుని తీర్పుకి తట్టుకొని నిలబడాలంటే క్రీస్తుని విశ్వసించాలి. మరోమార్గంలేదు. క్రీస్తుని నమ్మినవాళ్ళకు దండనం లేదు -రోమా 8,1. ప్రభువుని నమ్మినవాడికి ఖండనం లేదు.అతడు మరణాన్ని తప్పించుకొని జీవాన్ని పొందుతాడు - యోహా 5,24. తండ్రిగాని క్రీస్తుగాని మనలను ఖండించరు. తండ్రి ప్రేమతో మన కొరకు క్రీస్తుని పంపినవాడు. క్రీస్తు మనకొరకు చనిపోయి, మనకు మధ్యవర్తియై నిరంతరమూ మన తరపున ప్రార్ధనం చేసేవాడు. అలాంటి తండ్రీకొడుకులు మనలను దండించడానికి తయారుగా వుండరు కదా! - రోమా 8,33–34. దేవుడు మనలను ప్రేమించేవాడు కనుక తీర్పుదినాన్ని గూర్చి భయపడక ధైర్యంగా ఉండవచ్చు - 1కోహా 4, 17. మనం చీకటికీ రాత్రికీ సంబంధించనవాళ్ళం కాదు. వెలుగుకీ పగటికీ సంబంధించినవాళ్ళం. కనుక తీర్పుదినం దొంగలావచ్చి మనలను నిశ్చేష్టులను చేయలేదు. ఎప్పడుగూడ ప్రభువు దండనం దుర్మార్డులకుగాని సజ్జనులకుగాదు - 1తెస్స 5,3-6.

కనుక ఓవైపు మనం దేవుని తీర్పుని జూచి భయపడాలి. వళ్లు దగ్గిర పెట్టుకొని జీవించాలి. కాని మరోవైపు క్రీస్తుని విశ్వసించాలి. అతనికి మనపట్లగల ప్రేమను జూచి నమ్మకం దెచ్చుకోవాలి. ఆ నమ్మకంద్వారానే ఆ న్యాయాధిపతి విధించే శిక్షవలని భయాన్ని తొలగించుకోవాలి.

4. ఆధునికుల భావాలు

పూర్వాధ్యాయంలో శాస్త్రజ్ఞలు ఇంచుమించు చనిపోయి మళ్లాబ్రతికి బయటపడ్డవాళ్ళ అనుభవాలను కొన్నింటిని పరిశీలించి చూచారని చెప్పాం. చనిపోయేవాళ్ళ జ్యోతిర్మూర్తిని కలసికొంటారనిగూడ చెప్పాం. ఈ చనిపోయేవాళ్ళ కథనం ప్రకారం, ఆ జ్యోతిర్మూర్తి మరణించేవాళ్ళకు వాళ్ళ జీవిత సంఘటలనన్నిటినీ దృశ్యాలుగా చూపిస్తాడు. ఈ దృశ్యాల్లో నరుల జీవితంలోని ప్రధాన సంఘటలన్నీ ఉంటాయి. అవి త్వరత్వరగా కదిలే సినిమా బొమ్మల్లాగ వాళ్ళ కన్నులయెదుట కన్పిస్తాయి. అలా త్వరగా కదిలినా మరణించేవాళ్లు వాటి భావాన్ని గ్రహించగలుగుతారు. అసలా బొమ్మలన్నీ వాళ్లకు ఏకకాలంలోనే కన్పిస్తాయి. ఏకకాలంలోనే వాటి అర్ధాన్ని గ్రహించే శక్తికూడ వాళ్ళకు 266 ఉంటుంది. ఆ తేజోమూర్తి చనిపోయేవాళ్ళను అడిగే రెండు ముఖ్యవిషయాలు వాళ్ళ లోకంలో తోడినరులను ప్రేమించారా అనీ, తన్ను గూర్చి తెలుసుకోవలసినంతగా తెలుసుకొన్నారా అనీని. ఈ చనిపోయేవాళ్ళ భావాలుకూడ దేవుడు మరణ సమయంలో మనకు తీర్పు తీరుస్తాడనే సత్యాన్ని ధ్రువపరుస్తున్నాయి కదా!

ప్రార్థనా భావాలు

1. న్యాయాధిపతి ఒకడున్నాడనీ అతడు మనకు మరణ సమయంలో ఖండితంగా తీర్పు తీరుస్తాడనీ చెప్పాం. కనుక మన తరపున మనం చిత్తశుద్ధితో జీవించాలి. నరుల కన్నుగప్పినా దేవుని కన్నుగప్పలేం. ఆ ప్రభువుకి మన హృదయాలోచనలు కూడ తెలుసు. కనుక మనం అతి నిర్మలంగా జీవించాలి. ఈ సందర్భంలో ఆత్మజ్ఞానంకూడ ఎంతో ఉపయోగపడుతుంది. అనగా మన లోపాలూ మేలిగుణాలు కూడ వునకు బాగా తెలిసి వుండాలి. ఆలోపాలను రోజురోజూ సవరించుకొంటూండాలి. ఆ మేలిగుణాలనుగూడ రోజురోజుకీ వృద్ధి చేసికొంటూండాలి. ఈలా చేయకుండా లోకాన్ని వంచిస్తూ, మనలను మనం వంచించుకొంటూ కాలం గడిపితే చివరి రోజున విచారించవలసి వస్తుంది.

2. ఇండియా ప్రభుత్వం "సత్యమేవ జయతే" అనే ప్రాచీన సూక్తిని ఆదర్శంగా స్వీకరించింది. ఎప్పటికైనా సత్యం జయించి తీరుతుంది. న్యాయ నిర్ణయ దినాన ఈ సూక్తి అక్షరాల నెరవేరుతుంది. ఆ రోజున సత్యం గెలుస్తుంది. అబద్ధం వోడిపోతుంది. దుర్మారుగులకు శిక్షా సజ్జనులకు బహుమతీ లభించి తీరుతాయి. తాత్కాలికంగా అసత్యం గెలవవచ్చు, మనచుటూ ఉన్నవాళ్లు అక్రమపద్ధతిలో లాభాలు గడించవచ్చు. వాళ్ళను జూచి మనంగూడ ప్రలోభానికి లొంగి అక్రమ పద్ధతులకు పాల్పడబోతాం. కాని ఇది పొరపాటు. అక్రమమార్గాలవల్ల ఇప్పడు తాత్కాలిక లాభం కలిగినా చివరకు న్యాయ నిర్ణయదినాన మన దుర్మార్గం రుజువెతుంది. శిక్షపడుతుంది. కనుక మనం సత్యమార్గాన్ని ఏనాడు విడనాడకూడదు. దుషుల దుష్కార్యాలను జూచి ప్రలోభం చెందకూడదు. 73వ కీర్తన ఈ సంగతినే చెప్తుంది.

"నేను గర్వాత్మలనుగాంచి అసూయ జెందాను

దుర్మారులు వృద్ధిలోనికి వస్తున్నారని గ్రహించి
ప్రలొభంలొ జిక్కుకొన్నాను
జారిపడిపోవడానికి సంసిద్ధుడ నయ్యాను
దుపులు సంపన్నులౌతున్నారు

267 రోజురోజుకీ ఇంకా సంపన్నులౌతున్నారు మరి నేను విశుద్దుణ్ణిగా జీవించడంవల్ల ఫలితమేమిటి?

దుష్కార్యాలు విడనాడ్డం వలన లాభమేమిటి?

నేనీ సమస్యలను అర్థం జేసికోజూచాను

కాని అది నాకు దుర్గహమైంది
అంతలో ఒకనాడు నేను దైవరహస్యాన్ని గ్రహించాను 

దుష్టుల కేలాంటిగతి పడుతుందో తెలిసికొన్నాను

వాళ్ళ క్షణకాలంలో నాశమౌతారు
ఫరోరవినాశానికి జిక్కి కంటికి కన్పించకుండా బోతారు".

3.మనం ఆనాడు ప్రభువు న్యాయనిర్ణయానికి తట్టుకోవాలంటే ఇప్పుడు న్యాయయుక్తంగా జీవించాలి. ప్రతిరోజూ ఈనాడే నాకు న్యాయనిర్ణయం జరగవచ్చుననుకొని విశుద్ధంగా బ్రతకాలి. పునీతులు ఈలా చేసారు. మనలో ప్రతివాణ్ణి దేవుడు ప్రతిరోజూ, ప్రతిక్షణమూ గమనిస్తూనే వుంటాడు కదా! ప్రతిరోజూ, ప్రతిక్షణమూ అతడు మన తలంపులకూ మాటలకూ చేతలకూ తీర్పుతీరుస్తూనే ఉంటాడు కదా! ఈ తీర్ప న్యాయనిర్ణయ దినాన గూడ లెక్కలోకి వస్తుంది. కనుకనే మనం ప్రతిరోజూ ఈదినమే నాకు తీర్పు జరుగుతుందేమో ననుకోవాలి అని చెప్పాం. మనం నరులను మోసగించినా దేవుణ్ణి మోసగించలేం. నరుల దృష్టిలో మనకు విలువ వుండవచ్చు. కాని అది లెక్కలోనికి రాదు.దేవుని దృష్టిలో ఉండే విలువే నిజమైన విలువ. కనుక మనం అనుక్షణమూ అనుదినమూ నిజాయితీతో జీవించాలి. ఈ సందర్భంలో బైబులు అబ్రాహాము హనోకులాంటి పుణ్యపురుషులు దేవుని సన్నిధిలో నడచారని చెప్తుంది. అనగా వాళ్లు చిత్తశుద్ధితోను దైవభక్తితోను జీవించారని భావం. ఈ భాగ్యం మనకుకూడ అబ్బితే యెంత బాగుంటుంది!

4.మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకొంటాం. ఇక్కడ మనం చేసే ప్రతి పుణ్యకార్యమూ మనం నిర్మించుకొనే మోక్షసౌధంలో ఓ రాయి ఔతుంది. అలాగే ఇక్కడ మనం చేసే ప్రతిపాపకార్యమూ పరలోకంలోని మన శిక్షామందిరంలో ఓ రాయి ఔతుంది. ప్రభువు మనం ఇప్పడు చేసే మంచి చెడ్డలకే అప్పడు తీర్పు తీరుస్తాడు. అసలు మన తీర్పుని మనమే తయారు చేసుకొంటాం.న్యాయనిర్ణయ దినాన దేవుడు ఆ తీర్పుని మాటలతో ప్రకటిస్తాడు, అంతే. కనుక ప్రస్తుతం మనం ఏలాంటి జీవితం జీవిస్తున్నాము అనేదానిమిూదనే అంతా ఆధారపడి ఉంటుంది. 268 5. సాధారణ తీర్పు ప్రధానంగా సంఘిభావం కొరకు ఉద్దేశింపబడిందని చెప్పాం. ప్రభువు తన జ్ఞానశరీరానికంతటికీ కలిపి తీర్పు తీరుస్తాడని చెప్పాం. కనుక ఈ జీవితంలో తోడి నరులను పట్టించుకోవడమూ, సోదర ప్రేమను పాటించడమూ చాల ముఖ్యం. ఇండియాలాంటి పేదదేశంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళను ఆదుకొంటూండాలి. మనకు నాల్లు ముద్దలుంటే ఏమిలేనివాడికి ఓ ముద్దపెట్టాలి.

6. మనం న్యాయాధిపతియైన దేవుణ్ణిజూచి భయపడాలి. అతడు ఏ నరునికీ పక్షపాతం చూపించడు. ఎవరినీ వదిలిపెట్టడు. మన పాపపుణ్యాలకు తగినట్లుగా మనకు ప్రతిఫలమిస్తాడు. అంచేత మనం నిరంతరమూ భయభక్తులతో జీవించాలి. ఇప్పడు భయంతో జీవించేవాడు మరణాంతంలో వచ్చే న్యాయనిర్ణయ సమయంలో భయపడనక్కరలేదు.

3. నరకం

నరుల్లో కొందరు బుద్ధిపూర్వకంగా దేవుని రక్షణాన్ని నిరాకరిస్తారు. నిత్యజీవాన్ని పోగొట్టుకొంటారు. దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతారు. ఇదే నరకం. ఈ అధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.


1. తొలి మూడు సువిశేషాల భావాలు

క్రీస్తు తన బోధల్లోను సామెతల్లోను నరకాన్ని చాలసార్లు ప్రస్తావించాడు. ఒక్క మత్తయినే తీసికొంటే, గోదుమలు కలుపు మొక్కలు అనే సామెతలో పాపాత్ములను అగ్నికుండంలో పడద్రోసారు - అక్కడ ఆ పాపులు ఏడుస్తూ పంద్లుకొరుకుకొంటారు - 13,42. పెండ్లివిందు అనే సామెతలో వివాహవస్త్రం లేకుండా వచ్చినవాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేసారు. అక్కడ అతడు విలపిస్తూ పండ్ల కొరుకుకుంటాడు22,13. పదిమంది కన్యలు అనే సామెతలో పెండ్లి కుమారుడు ఐదుగురు కన్యలను వివాహశాల నుండి బహిష్కరిస్తూ నేను మిమ్మ ఎరుగనే ఎరుగను అనిపల్మాడు - 25,12 యూదుల సంప్రదాయం ప్రకారం శిష్యులేమైనా తప్పచేస్తే రబ్బయిలు వాళ్ళను శిష్యబృందం నుండి ఏడునాళ్ళపాటు బహిష్కరించి ఈ మాటలు పలికేవాళ్లు. కనుక ఇక్కడ ఈ వాక్యంలో పెండ్లికుమారుడు ఈ యైదుగురు కన్నెలను తన సన్నిధిలోనుండి బహిష్కరించాడు అనుకోవాలి. ముగ్గురు సేవకులు అన్న సామెతలో డబ్బుని వృథాగా నేలలో పాతిపెట్టిన 269 సేవకుణ్ణి వెలుపలి చీకటిలోనికి త్రోసివేసారు. అచటివాళ్లు ఏడుస్తూ పండ్లు కొరుకుకొంటారు -25,30, కడతీర్పు సామెతలో శాపగ్రస్తులను నిత్యాగ్నిలోనికి పంపారు. అది పిశాచమూ దాని దూతలూ ఉండేచోటు - 25,41. ప్రభువు పేరుమాత్రము వాడుకొంటూ అతని బోధలను పాటించకుండా ఉండేవాళ్ళతో అతడు దుష్టులారా! విూరు నానుండి తొలగిపొండి, నేను మిమును ఎరుగనే యెరగను అని చెప్తాడు–7,23. బహుశా అన్నికటింటె కరోరమైన వాక్యం మార్కు సువిశేషంలో వస్తుంది. ఇతరులను అపమార్గం పట్టించేవాళ్ళను నరకంలో త్రోస్తారు. అక్కడ వాళ్ళ పురుగు చాపదు, అగ్ని చల్లారదు - 9,48.

పైన మనం పేర్కొన్న వాక్యాలన్నిటినీ పరిశీలిస్తే నరక వర్ణనలోని ముఖ్యాంశాలు ఇవి, అది అగ్నిగుండం, చీకటి చెరసాల. అక్కడ పిశాచమూ దాని దూతలూ ఉంటారు. దానిలోనివాళ్లు దుఃఖంతో ఏడుస్తూ పండ్లు కొరుకుకొంటూ ఉంటారు. అక్కడివాళ్ళను ప్రభువు తన సన్నిధిలో నుండి బహిష్కరించాడు. అక్కడి నిపుఆరక మండే నిత్యాగ్ని అక్కడి వాళ్ళ పురుగు చావదు.

2. యోహాను, పౌలు భావాలు

యోహాను తొలి మూడు సువిశేషాల్లాగా వర్ణనలకు పూనుకోడు. కనుక అతడు నరకాగ్నిని గూర్చి చెప్పేప్పడు అగ్నిగుండం, పండ్లు కొరకడం మొదలైన ప్రయోగాలు అట్టేవాడడు. అతని దృష్టిలో నరకం మృత్యువూ, అంధకారమూ, క్రీస్తు జీవమూర్తి, మనకుకూడ జీవాన్ని ప్రసాదించేవాడు. అతన్ని నిరాకరించేవాళ్ళ మృత్యువుని చవిచూస్తారు. అదే నరకం, కుమారుని విశ్వసించేవాడు నిత్యజీవాన్ని పొందుతాడు. విశ్వసించనివాడు ఆ జీవాన్ని ఎంతమాత్రమూ పొందలేడు. దేవుని కోపం అతనిమిూద నిలుస్తుంది-3,36. యోహాను ఈమృత్యువుని "రెండవ మృత్యువు" అని కూడ పిల్చాడు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు లేవో వాళ్ళనందరినీ అగ్నిగుండంలోకి త్రోస్తారు. ఈ యగ్నిగుండమే రెండవ మృత్యువు -దర్శ 20, 14 మొదటి మృత్యువు మన చావే. దీనివల్ల మనం భౌతిక జీవం కోల్పోతాం. రెండవ మృత్యువు నరకం. దీనివల్ల మనం ఆధ్యాత్మిక జీవం కోల్పోతాం. క్రీస్తు వెలుగు. ఆ వెలుగుని కోల్పోతే మనం చీకటికి జిక్కుతాం. ఆ చీకటే నరకం. "లోకానికి వెలుగుని నేనే. నన్ననుసరించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగుని పొందుతాడు" - 8,12 ఇక, పౌలు దృష్టిలో నరకం మరణం - రోమా 6,23. వినాశం-ఫిలి 3,19, \ దేవుని ఆగ్రహం -1తెస్స 1,9. 270 8. నరకాగ్ని అంటే యేమిటి? మనం మామూలుగా నరకం అనగానే అగ్ని అనుకొంటాం, మత్తయి సువిశేషం ఈ యగ్నిని గూర్చిన భావాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. కాని నరకాగ్ని అనేది కేవలం సాంకేతిక పదం. ఈ పదం భావం ఏమిటి? పూర్వవేదంలో నిప్ప దేవుని సాన్నిధ్యానికి చిహ్నంగా ఉంటుంది. మోషే మండుతూన్న పొదలో దేవుణ్ణి చూచాడు - నిర్గ 3,2 మళ్ళా సీనాయి కొండమిూద నిప్ప మంటల్లో దేవుణ్ణి దర్శించాడు - నిర్ణ 19,18. కాని ఈ భావం మనకిక్కడ పనికిరాదు. పూర్వవేదంలో నిప్ప దేవుని కోపానికీ శిక్షక్రీ తీర్పుకీ కూడ చిహ్నంగా ఉంటుంది. యెషయా ప్రవక్త దుషులను శిక్షించడానికి వచ్చే దేవుణ్ణి వర్ణిస్తూ "ప్రభువు శక్తి దూరం నుండి విచ్చేస్తూంది అతని కోపం నిప్పవలె మండుతూంది దట్టమైన పోగవలె రాజుకొంటూంది అతని పెదవులు ఆగ్రహపూరితాలై యున్నాయి అతని జిహ్వ జ్వలించే అగ్గిలా ఉంది" అని వర్ణించాడు-30,27, నరకాగ్నిని అర్థం చేసికోవడానికి ఈ వర్ణనం కొంతవరకు ఉపయోగపడతుంది. నిప్ప దైవకోపానికీ శిక్షక్రీమాత్రమేకాదు, నరుల పాపాలకుగూడ చిహ్నంగా ఉంటుంది, దుషుని అతని పాపమే అగ్నిలా దహిస్తుంది. పై ప్రవక్త పాపాత్ములను వర్ణిస్తూ "ప్రజల పాపాలు అగ్గిలా మండి ముండ్లపొదల నన్నిటినీ తగులబెడతాయి ఆ పాపాలు అడవిలోని కారుచిచ్చులా రగుల్కొని పొగలు వెడలగ్రక్కుతాయి సర్వశక్తిమంతుడైన ప్రభువు కోపాగ్ని దేశాన్నంతటినీ కాల్చివేస్తుంది ప్రజలెల్లరూ ఆ యగ్నికి ఆహుతి యూతారు" అని వర్ణించాడు - 9,18-19. ఇంకా అతడు దుషులను గూర్చి చెపూ "వారి పరుగు చావదు, వారి యగ్లి చల్లారదు" అని చెప్పాడు – 6624. అనగా దుర్మార్డులు నిరంతరం అగ్నిలో కాలతారు, పురుగులకు మేత ఔతారు అని భావం. ఈ వర్ణనలనుబట్టి పూర్వవేదంలో నిప్ప దైవకోపాన్నీ నరుల పాపాన్నీ గూడ సూచిస్తుందనుకోవాలి. క్రీస్తు ఈ పూర్వవేద సంప్రదాయంలో పుట్టి చిన్ననాటినుండే ఈ వర్ణనలు జీర్ణం చేసికొ="^ కనుక అతడు నరకాన్ని గూర్చి చెప్పేపుడు గూడ ఈ వర్ణనలను విరివిగా వాడాడు.

నూత్నవేదరచయితల్లో యోహాను పౌలు నరకాన్ని ప్రస్తావించేప్పడు అగ్నిని అట్టే పేర్కొనలేదు. తొలి మూడు సువార్తలూ, విశేషంగా మత్తయి ఈ నరకాగ్నిని విరివిగా వర్ణించాడు. ఇతడు పూర్వవేద సంప్రదాయాన్ని ఎక్కువగా అనుసరించిన రచయిత. ఇతని సువిశేషం కూడ ఆ పూర్వవేదం బాగా తెలిసిన యూదుల కొరకే ఉద్దేశింపబడింది. ఇక ఈ రచయిత దృష్టిలో నరకాగ్ని అంటే యేమిటి? అది వో సాంకేతికమైన పదం. మత్తయి దృష్టిలో ఈ పదానికి దేవునికి కోపమనీ, శిక్ష అనీ, నరుడుతన పాపాలకు పొందే దండనమనీ అర్థం. కావున మనం నరకాగ్ని మన భౌతికమైన నిప్పునిగా అర్థం చేసికోగూడదు. మన భౌతిక పదార్ధాలేమీ నరకంలో ఉండవు.

ఇంకా నూత్నవేదం నరకంలో "పురుగు" "గంధకం" ఉంటాయని చెప్తుంది - మార్కు9,43. దర్శ 14,10. ఇవి కూడ దైవశిక్షను సూచించే సాంకేతిక పదాలే. ఈలాగే నూత్నవేదం మోక్షాన్ని గూర్చి చెప్పేపుడు దాన్ని వివాహోత్సవంగాను, విందుగాను, జీవజలంగాను, వెండి బంగారాలుగాను వర్ణిస్తుంది. అక్కడ సుఖసంతోషాలుంటాయని ఈ వర్ణనల భావం. కావున ఇవన్నీ వట్టి సంకేతాలు, ఉత్ప్రేక్షలు. మోక్షాన్నీ నరకాన్నీ గూర్చిన ఈ వర్ణనలను ఉన్నవాటిని ఉన్నట్లుగా అర్థం చేసికోగూడదు. ఇవి సూచించే భావాన్ని మాత్రం గ్రహించాలి.

సంగ్రహంగా నరకాగ్ని అంటే యేమిటి? నరుని అతని పాపమే దహిస్తుంది. ఈ స్వీయపాపాన్నే యెషయా అగ్ని అని పేర్కొన్నాడని చెప్పాం. కనుక నరకంలో ఉన్నవాళ్ళని వాళ్ళకి వెలుపలవున్న వస్తువేదో వచ్చి దహింపదు. అసలు అలాంటి వస్తువేదీ నరకంలో ఉండదుకూడ. పాపభరితమైన దుషుల అంతరాత్మే ఆ దుషులను బాధిస్తుంది. వాళ్ళు బుద్ధిపూర్వకంగా దైవదర్శనాన్ని కోల్పోయారు కనుకను, ప్రేమగల తండ్రివంటివాడైన దేవుణ్ణి బుద్ధిపూర్వకంగా నిరాకరించారు కనుకను, వాళ్ళ అంతరాత్మ వాళ్ళని లోలోపలే బాధిస్తుంది. ఈలోపలి బాధనే బైబులు అగ్ని అని పిలుస్తుంది. దీనికిమించి వేరే అగ్ని యేది నరలోకంలోలేదు.

2. దైవసాన్నిధ్యాన్ని కోల్పోవడమే నరకం

1. నరకాన్ని గూర్చిన ముఖ్యాంశం ఏమిటి?

పూర్వాంశంలో నరుని అంతరాత్మ అతన్ని పీడించడమే నరకాగ్ని అనిచెప్పాం. కాని ఈ యంతరాత్మ నరుణ్ణి ఎందుకు బాధపెడుతుంది? అతడు బుద్ధిపూర్వకంగా దైవసాన్నిధ్యాన్ని కోల్పోయాడు కనుక.ఈలా దైవసాన్నిధ్యాన్ని కోల్పోవడమే నరకాన్ని గూర్చిన ముఖ్యాంశం.

భగవంతుడు నరుణ్ణి తనకొరకే చేసాడు. అతని హృదయంలో తనమీద శాశ్వతమైన కోర్కెనుగూడ పెట్టాడు. అందుకే ప్రతినరుడూ సహజంగానే భగవంతుణ్ణి వాంఛిస్తాడు. కాని కొందరు బుద్ధిపూర్వకంగానే ఈ వాంఛను అణగదొక్కుకొంటారు. చావైన పాపంచేసి భగవంతునినుండి వైదొలగుతారు. అతన్ని నిరాకరిస్తారు. ఈ స్థితిలోనే చనిపోతారు. మరణానంతరం ఇక మనసు మార్చుకోవడమనేది ఉండదు. కనుక, వాళ్లు నరకంలో గూడ భగవంతుణ్ణి నిరాకరిస్తారు. అతని సాన్నిధ్యంనుండి వైదొలగుతారు. ఈలా బుద్ధిపూర్వకంగా భగవంతుణ్ణి నిరాకరించి అతని సాన్నిధ్యంనుండి వైదలొగడమే నరకం. సంగ్రహంగా చెప్పాలంటే దైవసాన్నిధ్యాన్ని దైవదర్శనాన్ని కోల్పోడమే నరకం. భగవంతుణ్ణి పొందితే మనకు పూర్ణానందం కలుగుతుంది. అతన్ని కోల్పోతే మనకు దుఃఖం కలుగుతుంది. కనుక నరకం దుఃఖమయమైంది.

మనం మామూలుగా నరకాన్ని ఓ తావుగా భావిస్తాం. కాని అదితావుకాదు, ఓస్థితి. దేవుణ్ణి కోల్పోయి దుఃఖించే స్థితి.

2. నరక శిక్షను ఎవరు విధిస్తారు?

మామూలుగా దేవుడే నరుణ్ణి నరకానికి పంపిస్తాడని అనుకొంటాం. అతడు మనం బ్రతికివున్నపుడు ప్రేమను చూపేవాడే ఐనా, మన మరణానంతరం కఠినంగా ప్రవర్తిస్తాడని యెంచుతాం. కానియిది పొరపాటు. దేవుడు ఎప్పడూ ప్రేమమయుడే అతని ప్రేమ ఏనాడూ మారదు. దేవుడు మనకు నరకాన్ని నిర్ణయించడు, మనమే దాన్ని నిర్ణయించుకొంటాం. అతడు ఓమారు మనకు స్వేచ్ఛను ఇచ్చాక ఆ స్వేచ్ఛను మన్నిస్తాడు. మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసికొంటున్నా చూస్తూ ఊరకుంటాడేగాని మనలను నిర్బంధం చేయడు. నరుడు తన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసికొని నరకానికి పోవడం చూచి భగవంతుడు దుఃఖిస్తాడు. అతని ప్రేమ అంత గొప్పది. అతడు ఓయి నరుడా! నీదుష్ట చిత్తం భూమిమిదవలె నరకంలోకూడ నెరవేరునుగాక అని చెప్తాడు. నరకందేవుడు నరునికి పెట్టే శిక్షకాదు. నరుడు తనకు తానే విధించుకొనేశిక్ష అది దేవుడు విధించే మరణశిక్షకాదు, నరుడు బుద్ధిపూర్వకంగా చేసికొనే ఆత్మహత్య పాపంద్వారా నరుడు దేవుణ్ణి నిరాకరిస్తాడు. ఆ నిరాకరణమే కడన నరకంగా రూపొందుతుంది. పశ్చాత్తాపపడని పాపమే నరకం. నరకంలోని వాళ్ళకు పూర్ణ స్వేచ్చ ఉంటుంది. ఐనా వాళ్ళ పశ్చాత్తాపపడరు, పడలేరుకూడ. పాపి తనపాపాలకు పశ్చాత్తాపపడాలంటే దేవుని వరప్రసాదం అవసరం. నరకంలోని పాపాత్ములకు ఈ వరప్రసాదం లభించదు.

భగవంతుడు అందరిని గాఢంగా ప్రేమిస్తాడు. ఈ ప్రేమవల్లనే అతడు అందరు నరుల్లోను తనపట్ల గాఢమైన ఆకర్షణను పెడతాడు. కనుకనే మనందరి హృదయాలు సహజంగానే భగవంతుణ్ణి కోరుకుంటాయి. పాపి ఈ కోరికను తాత్కాలికంగా అణచివేసికోగలడేగాని దాన్నిమాత్రం హృదయంలోనుండి నిర్మూలించలేడు. ఇక, నరకంలోని వాళ్ళకుకూడ భగవంతునిమిూద గాఢమైన కోరిక ఉంటుంది. వాళ్లు ఒకవైపున తమ స్వేచ్చను దుర్వినియోగం జేసికొని భగవంతుణ్ణి నిరాకరిస్తుంటారు. మరొకవైపున హృదయంలోని సహజవాంఛవలన అతనివైపు ఆకర్షితులౌతూంటారు. ఈ నిరాకరణ ఆకర్షణల మధ్య ఘోరమైన ఘర్షణ జరుగుతూంటుంది. ఇది మహాబాధ. నరకవాసులు దేవుణ్ణి ద్వేషిసూ ఉంటారు, అతన్ని వాంఛిసూ ఉంటారుకూడ. దేవునివైపు ఆకర్షితులౌతూంటారు, అతనినుండి వెనుకకు త్రోయబడుతూంటారుకూడ. దేవునివైపు తిరుగుతూంటారు, అతనినుండి మొగం త్రిప్పకొంటూంటారుకూడ. ఈ విపరీత చర్యలవల్ల వాళ్ళకు కలిగే బాధ అంతాయింతాకాదు, భగవంతునిపట్ల నరునికుండే సహజవాంఛ నరునిపట్ల భగవంతునికుండే ప్రేమకు నిదర్శనం. అలాంటి ప్రేమమయుడైన దేవుడు నరునికి నరకాన్ని విధించడు. కనుక నరకం దేవుడు చేసింది కాదు, అతడే స్వయంగా చేసికొనేది. దేవుడు నరునికి ద్రోహం చేయడు. నరుడే దేవునికి ద్రోహం చేస్తాడు.

౩. నరకం శాశ్వతమైంది

నరకం శాశ్వతంగా ఉండిపోతుంది. అనగా పాపి నిరంతరమూ నరకంలో ఉండిపోతాడు. అతడు పశ్చాత్తాపపబడి, పాపపరిహారంపొంది మళ్ళా దేవుని సన్నిధిలోకి రాలేడు. ఎందుకంటె మనం చనిపోయేప్పుడు ఏస్థితిలో ఉంటామో ఇక ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోతాం. చనిపోయాక మళ్ళా మనసు మార్చుకోవడమూ ఉండదు. కనుక నరకంలోని పాపులు ఏనాటికీ పశ్చాత్తాపపడరు. కనుకనే నరకం శాశ్వతమైందని చేప్తాం.

"శాశ్వతం" అనే పదమే మనకు భీతిని పుట్టిస్తుంది. నరకశిక్షకు ఏనాడూ అంతంలేదు. ఆ బాధ ఏనాడూ ముగియదు. ఈలోకంలో కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించినట్లయితే నరకంలోనివాళ్ళు తమశిక్షను తప్పించుకొని వుండేవాళ్ళే వాళ్లు తమ అజాగ్రత్తవల్లా అహంకారంవల్లా ఆ దండనను చేతులార కొని తెచ్చుకొన్నారు. తాముదాన్ని తప్పించుకోగలిగి కూడ తప్పించుకోలేదు. కనుక తప్ప పూర్తిగా తమదేనని అంతరాత్మ వాళ్ళను చీవాట్లు పెడుతూంటుంది. కావున వాళ్ళు నిరంతరమూ పండ్ల కొరుకుకొంటూ దుఃఖిస్తూంటారు. ఆ దుఃఖం ఘోరాతిఘోరమైంది.

మత్తయి 25వ అధ్యాయంలో కడతీర్పుసామెత వస్తుంది. ఈ కథలో విభిన్న భావాలు జంటలు జంటలుగా కన్పిస్తాయి. న్యాయాధిపతికి కుడివైపున గొర్రెలూ ఎడమవైపున మేకలూ ఉంటాయి. అతడు దీవింపబడినవాళ్ళను తనచెంతకు రండని పిలుస్తాడు. శపింపబడిన వారలతో పొండని చెప్తాడు. ఈ యధ్యాయంలో కడపటిదైన 46వ వాక్యం "వాళ్లు నిత్యశిక్షకు వెడలిపోతారు, నీతిమంతులు నిత్యజీవంలో ప్రవేశిస్తారు" అని చెప్తుంది. ఈ వాక్యం చెప్పేదాన్నిబట్టి నీతిమంతులు "నిత్యజీవం" పొందుతారు. ఈ నిత్యజీవం కొన్నాళ్ళు మాత్రమే ఉండేది కాదు, శాశ్వతమైంది. ఇక, దీనికి భిన్నంగా పాపాత్ములకు సిద్ధించే నిత్యశిక్షకూడ శాశ్వతమైంది. అనగా ఆ శిక్షగూడ కొన్నాళ్ళు మాత్రమే ఉండేది కాదు, అనంతమైంది. ఇక్కడ నిత్యజీవముంటే మోక్షం. నిత్యశిక్ష అంటే నరకం. ఐతే మోక్షమేలా శాశ్వతమైందో, నరకంకూడ అలాగే శాశ్వతమైంది. అవి రెండూ నిత్యమైనవే. నరకం నిత్యమైందనడానికి మత్తయి 25,#6 గట్టి ఆధారం.

కనీసం ఐదవ శతాబ్దంనుండయినాసరే నరకం శాశ్వతమైందనే భావం తిరుసభలో కన్పిస్తూంది. 1215లో తిరుసభ ఈవేదసత్యాన్ని అధికారపూర్వకంగా ప్రకటించింది కూడ.

ప్రార్ధనా భావాలు

1. మనం నరుల్లో అధిక సంఖ్యాకులు నరకానికి వెళ్తారని అనుకోగూడదు, దేవుని కరుణవల్ల చాలమంది రక్షణం పొందుతారు. అలాగంటే అక్కడి కెవ్వరూ వెళ్ళరని భావించకూడదు. నరకానికి పోయేవాళ్ళుకూడ లేకపోలేదు. ప్రభువు చెప్పిన కడతీర్పు సామెతను బట్టి కొందరు రూఢిగా నిత్యశిక్షను పొందుతారని అర్థంచేసికోవాలి. కనుక మనంకూడ నరకానికిపోవచ్చు. ఇది అసంభవంకాదు. ఈ జీవితంలో మనం మాటిమాటికీ మంచికీచెడ్డకీ మారుతూంటాం. పుణ్యంతో పాటు పాపాన్ని కూడ చేస్తూంటాం. కనుక మన తరపున మనం ఎల్లప్పడూ భయభక్తులతో జీవిస్తూండాలి. దైవభీతి లేనివాడు, నరకాన్ని పట్టించుకోనివాడు, తప్పక చెడతాడు. ఇగ్నేష్యస్ భక్తుడు మనలోని దైవప్రేమ చల్లారినపుడు నరక భయం వలనైనా మనం పాపంనుండి వైదొలగాలని చెప్పాడు. కనుక నరకభయం మంచిది. దాన్ని ఏనాడూ మర్చిపోకూడదు.

2. కాని ఈ భయంతోపాటు మనకు దేవునిపట్ల నమ్మకం కూడ ఉండాలి. మానవులందరూ రక్షణాన్ని పొందాలనే దేవుని కోరిక - 2తిమో 2,4. దేవుడు మనలను నరకానికికాదు, మోక్షానికే సృజించాడు. మనం బుద్ధిపూర్వకంగా దేవునికి ఎదురు తిరిగితేతప్ప, నరకానికి పోనక్కరలేదు. క్రీస్తు సిలువ విూద చనిపోయిందికూడ మనలను శిక్షించడానికికాదు, రక్షించడానికే. కనుక మనం రక్షణం పొందవచ్చు, పొందాలి.

3. మన తరపున మనం నరకాన్ని గూర్చి ధ్యానం చేసికొంటూండాలి, బుద్ధి పూర్వకంగా దేవునిప్రేమను నిరాకరించి శాశ్వతంగా అతని సాన్నిధ్యంనుండి వైదొలగడం భయంకరమైన నేరం. మన హృదయంలో ఆ భగవంతుని మిూదవుండే సహజ వాంఛను బుద్ధిపూర్వకంగా అణచుకోవడం ఘోరమైంది. నరకానికి పోయామంటే మన యీ జీవితాన్నే నాశం చేసికొన్నామన్నమాటే. ఈ జీవిత గమ్యాన్ని చేరుకోలేకపోయామన్నమాటే. ఈ జీవితంలో విజయాన్ని సాధించలేక ఓడిపోయామన్నమాటే. ఇంతకంటే దౌర్భాగ్యమేముంటుంది? కనుక భక్తుడు తరచుగా నరకాన్ని స్మరించుకొంటూండాలి, దానికి భయపడుతూండాలి.

గురువులు మొదలైనవాళ్ళ నరకాన్ని గూర్చి బోధిస్తూండాలి. అది మన విశ్వాస సత్యాల్లో ప్రధానమైనది కాదు. కాని మనం అహంకారంవల్ల అక్కడికిపోయే అవకాశం ఉంది. కనుక మన విశ్వాసులకు అప్పడప్పుడూ దాన్ని గూర్చి చెప్తుండాలి. నేడు చాలమంది బోధకులు నరకాన్ని గూర్చి అసలు మాట్లాడ్డమేలేదు. ఇది దురదృష్టకరం.

4. ఉత్తరించే స్థలం

క్రీస్తుని విశ్వసించి వరప్రసాద స్థితిలో చనిపోయిన వాళ్ళకుగూడ పరిశుదుడైన దేవుణ్ణి దర్శించడానికి చాలినంత పావిత్ర్యం ఉండకపోవచ్చు. వాళ్ళ ఆత్మలో ఇంకా మాలిన్యం ఉండవచ్చు. ఈ మాలిన్యాన్ని తొలగించడానికి ఉద్దేశింపబడిందే ఉత్తరించే స్థలం. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. ఉత్తరించే స్థలం అంటే ఏమిటి?

పాపశిక్ష నిత్యశిక్ష అనిత్యశిక్ష అని రెండు రకాలుగా ఉంటుంది, నిత్యశిక్ష అంటే నరకం. అనత్యశిక్ష అంటే కొన్ని తాత్కాలిక బాధలు అనుభవించడం. మనం మనపాపాలకు చక్కగా పశ్చాత్తాపపడి పాపసంకీర్తనం చేసికొన్నపుడు నిత్యశిక్ష తొలగుతుందేగాని అనిత్యశిక్ష తొలగదు. ఈ యనిత్యశిక్షను తొలగించుకోడానికి ఉద్దేశింపబడిందే ఉత్తరించే స్థలం.

మనకు అనిత్యశిక్ష ఎందుకు వస్తుంది? గాయం నయమయ్యాకగూడ దానిమచ్చ మిగిలివుంటుంది. అలాగే మన పాపాలు పరిహారమయ్యాకగూడ వాటి అవశేషాలు లేక దుష్ఫలితాలు మిగిలివుంటాయి. సృష్టివస్తువులకు అంటిపెట్టుకొని ఉండడం, 

చెడ్డనుచేయాలని కోరుకోవడం, తన్నుతాను విపరీతంగా ప్రేమించుకోవడం మొదలైనవి ఈయవశేషాలు. ఈ యవశేషాలవల్లనే మనం అనిత్యశిక్షకు గురౌతాం, భూలోకంలో తపస్సు చేయడంద్వారా ఈ యనిత్యశిక్షను తొలగించుకోవచ్చు. అలా చేయనివాళ్లు పరలోకంలో దాన్ని తొలగించుకోవలసి ఉంటుంది. ఈలా తొలగించుకోడానికి ఉద్దేశింపబడిందే ఉత్తరించే స్థలం.

తెలుగులో "ఉత్తరించే స్థలం" అన్నమాట పూర్వవేదశాస్రులు కల్పించింది. దాటిపోయే తావు అని ఈమాటకర్థం. అనగా వరప్రసాద స్థితిలో చనిపోయినవాళ్ళు ఈ తావుగుండా మోక్షానికి దాటిపోతారు. మొదట ఇక్కడ శుద్ధిని పొంది తర్వాత మోక్షాన్ని చేరుకొంటారు. ఉత్తరించే స్థలంలో జరిగే ప్రధాన కార్యం ఆత్మ తన మాలిన్యం నుండి శుద్ధిని పొందడం. కనుక దాన్ని శుద్దీకరణ స్థలం అనిగానీ, ప్రాయశ్చిత్త స్థలం అనిగానీ పిలవడం ఉచితం.
మన మనుష్యభాషలో మోక్షనరకాలనూ ఉత్తరించే స్థలాన్నీ "స్థలాలు" అని పేర్కొంటాం. కాని ఇవి స్థలాలు కానేకావు. ఇవి మన ఆత్మకు పట్టే స్థితులు లేక దశలు. ఐనా సామాన్య ప్రజలకుగూడ అర్ధంకావడంకోసం వీటిని స్థలాలు అంటూంటాం.
మోక్షనరకాలు శాశ్వతంగా ఉంటాయి. ఉత్తరించే స్థలం శాశ్వతమైంది కాదు. దానికి కాలపరిమితి లేదు. అసలు మన కాలం దానికి వర్తించదు. మన భాషలో చెప్పాలంటే, ఉత్తరించే స్థలానికి వెళ్ళిన ఆత్మలు బహుశ అతిస్వల్పకాలం మాత్రమే అక్కడ వుంటాయి. పూర్వవేదశాస్తులు కొన్ని ఆత్మలు లోకాంతంవరకుగూడ ఆ తావులో ఉండిపోవచ్చునని భావించారు. ఇప్పటి వేదశాస్తులు ఈ భావాన్ని అంగీకరించరు. 

నరకంలో మన భౌతికమైన నిప్పు ఉండదని చెప్పాం. ఉత్తరించే స్థలంలోగూడ భౌతికమైన నిప్పు యేదీ ఉండదు. దేవుణ్ణి దర్శించలేకపోవడమే అక్కడి ఆత్మలు అనుభవించే ప్రధాన శిక్ష.

2. బైబులు బోధ

బైబులు ఉత్తరించే స్థలాన్ని గూర్చి ప్రత్యక్షంగా ఏమీ చెప్పదు. బైబులు మొత్తంలోను ఉత్తరించే స్థలాన్ని సమర్ధించే అలోకనం ఒక్కటే లభిస్తుంది, అదికూడ పరోక్షమైంది. యూదా మక్కబీయుడు అదుల్లాం నగరంలో యుద్ధం చేస్తూండగా అతని సైనికులు స్థానిక దేవతల బొమ్మలను తమ శరీరాలమీద తాయెతులుగా ధరించారు. ఈ కార్యంద్వారా వాళ్లు ధర్మశాస్త్రాన్ని విూరి పాపం కట్టుకొన్నారు. ఈ పాపానికి శిక్షగా వాళ్ల యుద్ధంలో కూలారు. యూదా రెండువేల వెండి నాణాలు యెరూషలేముకు పంపించి యుద్ధంలో దుర్మరణం చెందిన సైనికుల కొరకు పాపపరిహారబలిని అర్పింపజేసాడు-2 మక్క 12,39-45. ఈ సంఘటననుబట్టి మనం చనిపోయినవాళ్ళ పాపపరిహారానికి బలులూ ప్రార్థనలూ సమర్పింపవచ్చునని అర్థం చేసికోవాలి.

ఈ వేదసత్యం బైబుల్లో కన్పించదని చెప్పాం. కాని బైబుల్లో స్పష్టంగాలేని వేదసత్యాలుకూడ తొలినాటి క్రైస్తవుల్లో వ్యాప్తిలోకి వచ్చాయి. ఉత్తరించే స్థలాన్ని గూర్చిన వేదసత్యం గూడ ఈలాంటిదే. తొలిరోజుల్లోనుండి "అర్చ్య శిష్ణుల సంబంధ ప్రయోజనం" అనేది వాడుకలో ఉంది. అనగా మోక్షంలోని విజయక్రైస్తవులు, ఉత్తరించే స్థలంలోని బాధామయ క్రైస్తవులు, భూలోకంలోని యుధ్యమాన క్రైస్తవులు ఒకరికొరకొకరు ప్రార్థనలు చేసికోవడమూ, ఒకరినుండి ఒకరు జ్ఞానలాభాలు పొందడమూ తొలినాళ్ళనుండి వాడుకలో ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ లోకంలో బ్రతికివున్న క్రైస్తవులు చనిపోయిన తమ బంధువుల పాపపరిహారానికి ప్రార్ధన లర్పించేవాళ్లు.

ఇంకా తొలిరోజులనుండి చనిపోయినవారికొరకుకూడ పూజలో ప్రార్ధనలర్పించేవాళ్లు. ప్రస్తుత పూజలో ఈ ప్రార్థనం "ఉత్థాన మౌతామనే నమ్మకంతో చనిపోయిన మా సోదరీ సోదరులనూ, విూకనికరమందు చనిపోయినవారందరినీ స్మరించండి" అనే వాక్యంలో కన్పిస్తుంది.

ఈలా క్రైస్తవుల పరస్పర ప్రార్థనలు, పూజబలి ప్రార్థనలు అనే రెండు క్రియలద్వారా ఉత్తరించే స్థలంలోని ఆత్మలకొరకు ప్రార్ధనలు చేయడం అనే సంప్రదాయం వ్యాప్తిలోకి వచ్చింది. రెండవ శతాబ్దంలోనే ఈ సంప్రదాయం వాడుకలో ఉన్నట్లు తెలుస్తూంది. నాల్గవ శతాబ్దంలో అగస్టీను భక్తుడు ఈ సంప్రదాయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. అతడు చనిపోయినవాళ్ళ సాంకేతికమైన నిప్పలో కాలి తమ మాలిన్యాన్ని తొలగించుకొని శుద్ధిని పొందుతారని చెప్పాడు. ఈ శుద్దీకరణం మరణ సమయంలో జరగవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఈ కార్యాన్నే ఇప్పడు మనం ఉత్తరించే స్థలం అని పేర్కొంటున్నాం. ఈలా ఉత్తరించే స్థలాన్ని గూర్చిన వేదసత్యం బైబుల్లో స్పష్టంగా లేకపోయినా తొలినాటి క్రైస్తవుల్లో క్రమేణ వ్యాప్తిలోకి వచ్చింది. క్రైస్తవమతానికి బైబులొక్కటేగాదు, తొలినాటి క్రైస్తవ పారంపర్యబోధకూడ ఆధారం. బైబుల్లో లేదన్న కారణంతో నేడు ప్రోటస్టెంటు శాఖలు ఉత్తరించే స్థలాన్ని అంగీకరించవు.

3. ఉత్తాన క్రీస్తువల్లా, పవిత్రాత్మవల్లా శుద్ధి

మామూలుగా మనం ఉత్తరించేస్థలం బాధలనుభవించే స్థలం అనుకొంటాం. కాని అది ప్రధానంగా శుద్ధిని పొందే తావు. ఈ శుద్ధి కూడ ఉత్థానక్రీస్తుని కలుసుకోవడం వల్ల లభిస్తుంది. కనుక దాన్ని ఉత్తాన క్రీస్తువల్ల శుద్ధిని పొందే తావునిగా భావించాలి. ఈ శుద్ధి ప్రక్రియలో బాధా ఆనందమూ రెండూ ఉంటాయి. భగవత్సాన్నిధ్యం కలిగిన నరుడు ఆనందాన్నీ భయాన్నీ కూడ పొందుతాడని చెప్తుంది బైబులు, మోషే మండుతూన్న పొదలో దేవుడ్డి చూచి ఆనందించాడు, భయపడ్డాడు కూడ. అలాగే యేలీయా హోరేబు కొండమీద దేవుణ్ణిచూచి సంతోషించాడు, భయపడ్డాడు కూడ. నూత్నవేదంలో శిష్యులు తబోరు కొండమీద క్రీస్తు దివ్యరూపాన్ని చూచి సంతోషించారు, భయపడ్డారు కూడ - మత్త 17,2-6. ఇంకా దేవుడు నిప్పులాంటివాడు. ఆ నిప్పు నరుణ్ణి దహిస్తుంది, శుద్ధిచేస్తుంది కూడ.

మన మరణసమయంలో ఉత్థానక్రీస్తు మనకు జ్యోతిర్మూర్తిగా దర్శనమిస్తాడు. మనలను తన జ్యోతిఃప్రవాహంలో ముంచుతాడు. ఆ జ్యోతి మనకు ఆనందకరంగా ఉంటుంది. ఇంకా ఆ పవిత్రమూర్తి తన తేజోకిరణాలతో మనలను శుద్ధిచేస్తాడు గూడ. అతని తేజస్సూ అగ్నీ మన పాపాభిలాషలనూ వస్తువ్యామోహాలనూ స్వార్థపరత్వాన్నీ దహించివేస్తాయి. దీనివల్ల మన ఆత్మ శుద్ధిని పొందుతుంది. ఈ దహనమూ ఈ శుద్దీకరణమూ మన ఆత్మకు బాధను కలిగిస్తాయి. దైవసాన్నిధ్యం సంతోషాన్నీ బాధనూకూడ కలిగిస్తుంది. కాని ఈ బాధ ద్వారానే మన ఆత్మలోని పాపమాలిన్యం తొలగిపోతుంది. పావిత్ర్యం సిద్ధిస్తుంది. ఉదయాన సూర్యుడు వెలుగొందగానే మంచుబిందువులు కరిగిపోతాయి. అలాగే ఉత్తానమూర్తియైన ప్రభువు సూర్యుడిలా మన ఆత్మవిూద ప్రకాశింపగానే దానిలోని మాలిన్యమంతా కరిగిపోతుంది. అది నైర్మల్యాన్ని పొందుతుంది.

దేవుడే మన కడగతి, మనం దేవుణ్ణి పొందినపుడు అతడే మనకు మోక్షమౌతాడు. అతన్ని కోల్పోయినపుడు అతడే మనకు నరకమౌతాడు. మనకు న్యాయం చెప్పినపుడు అతడే మనకు కడతీర్చు ఔతాడు. మనలను శుద్ధి చేసినపుడు అతడే మనకు ఉత్తరించే స్థలం ఔతాడు. ఈ రీతిగా దేవుడు తన కుమారుడైన క్రీస్తుద్వారా మనకు మోక్షమూ, నరకమూ, కడతీర్పూ ఉత్తరించే స్థలం అన్నీ తాడు.

అగస్టీను భక్తుడు భావించినట్లు మన శుద్దీకరణం మరణ సమయంలోనే జరుగుతుంది. మన మరణంకూడ ఈ శుద్దీకరణంలోను దానివల్ల కలిగే బాధలోను భాగమరొతుంది.

నరులు ఉత్తరించే స్థలంలో ఎంతకాలముంటారనేది మనం కేవలం మనుష్యభాషలో అడిగే ప్రశ్న ఆ చోటుని అసలు మన కాలంతో కొలవలేం. ఉత్థాన క్రీస్తు మనం చనిపోయే సమయంలో ఒక్క నిమిషంలోనే మన ఆత్మను శుద్ధి చేయవచ్చు. ఈ శుద్ధిలో సంతోషమూ బాధా రెండూ ఉంటాయని ఎప్పాం. ఎక్కువ మాలిన్యంకల ఆత్మలు ఒక్క నిమిషంలోనే ఎక్కువ బాధ ననుభవించి పూర్ణశుద్ధిని పొందవచ్చు. కనుక ఉత్తరించే స్థలం మామూలుగా మన మనుకొన్నట్లుగా ఎక్కువకాలముండేది కాదు. కాని అక్కడ ఎక్కువ బాధా, ఎక్కువగా శుద్ధిని పొందడం అనేవి మాత్రం ఉంటాయి.

     ఉత్తరించే స్థలానికి కాలం లేనట్లే అక్కడ అగ్నిగూడ  ఉండదు. ఉత్థానక్రీస్తే అక్కడ మన జ్యోతీ మన అగ్నీఐ మనలను శుద్ధిచేస్తాడు. నూత్నవేదం అతన్ని జ్యోతి అని పిలుస్తుంది —యోహా 1,9. అగ్ని అని కూడ పిలుస్తుంది - దర్శ 1,14.
      ఇంతవరకూ ఉత్దాన క్రీస్తుద్వారా మనం శుద్ధిని పొందే తీరును చూచాం. ఇక పవిత్రాత్మద్వారా ఏలా శుద్ధిని పొందుతామో పరిశీలిద్దాం.
        పవిత్రాత్మ చావైన పాపమూ ఒకేసారి నరుల హృదయాల్లో వసింపవు. కాని పవిత్రాత్మా పాపాభిలాషా ఒకేసారి హృదయంలో ఉండవచ్చు. క్రైస్తవుడు మొదట పాపంతోను పాపాభిలాషతోను పుడతాడు. తర్వాతనే పవిత్రాత్మను పొందుతాడు. మన హృదయంలో పాపాభిలాషా పవిత్రాత్మా అనే ఇద్దరు అతిథులూ ఒకరిప్రక్కన ఒకరు జీవిస్తుంటారు. మన జీవితాంతమూ ఈ రెండు శక్తులూ మనలను పరస్పర విరుద్ధమైన రెండు విభిన్న మార్గాల్లోనికి లాగుతూంటాయి. దీనివల్ల మన హృదయంలో ఈ ఘర్షణ యేర్పడుతుంది. కాని మరణ సమయంలో ఈ ఘర్షణం అంతరిస్తుంది. అప్పడు పాపాభిలాష పవిత్రాత్మకు పూర్తిగా లొంగిపోతుంది. ఆ చివరిక్షణంలో మనం పాపవాంఛలు వదలించుకొని పూర్తి పావిత్ర్యాన్ని పొందుతాం.
       మెస్సీయానుగూర్చి చెపుతూ స్నాపక యోహాను "నా తర్వాత వచ్చేవాడు మిమ్మ పవిత్రాత్మతోను అగ్నితోను స్నానం చేయిస్తాడు" అని చెప్పాడు - మత్త 3,11. ఆ యాత్మ అగ్నిలాంటిది. కనుకనే పెంతెకోస్తు దినాన అగ్నిలా దిగివచ్చింది. "అగ్నిజ్వాలలు నాలుకల్లా వ్యాపించి అక్కడవున్న ఒక్కొక్కరిపై నిల్చాయి" - అ, చ, 1,3. ఆ యాత్మ జ్ఞానస్నాన సమయంలో మనలోనికి ప్రవేశించింది మొదలు మనలను దహించి శుద్ధిచేస్తూనే వుంటుంది. కాని ఈ దహనక్రియ మన మరణ సమయంలో ఎక్కుమోతుంది. ఆ చివరిక్షణంలో మనలోని వవిత్రాత్మ మహాజ్వాలయైు మన హృదయంలోని ప్రతిపాపపుటణువునీ కాల్చి పునీతం చేస్తుంది. ఇదే ఉత్తరించే స్థలం.
    ఈలా ఆత్మ మన పాపపటాత్మను దహించి పునీతం చేస్తూంటే మనకు ఆనందమూ బాధా రెండూ కలుగుతాయి, ఈ సందర్భంలో భక్తురాలు జెనొవా కత్తరీనమ్మ ఈలా నుడివింది. "దేవుని అగ్ని మన హృదయంలోనికి ప్రవేశిస్తూంటే మనలోని పాపపు త్రుప్ప దానికి అడ్డుపడుతూంటుంది. కాని ఆ దివ్యాగ్ని తనకు అదుపడే తుప్పనంతటినీ కాల్చివేస్తుంది. ఆ తపు కరిగిపోయేకొద్దీ మన ఆత్మ దేవుణ్ణి అధికాధికంగా స్వీకరిస్తుంది. దీనివల్ల మన ఆనందం పెరిగిపోతుంది".
       పాపాభిలాషా పవిత్రాత్మారెండూ పరస్పర విరోధ శక్తులుగా మన హృదయంలో వసిస్తూంటాయని చెప్పాం. పాపాభిలాష మనకు దుఃఖాన్ని కలిగిస్తూంటే ఆత్మ మనకు ఆనందాన్ని కలిగిస్తూంటుంది. మృత్యుకాలంలో ఆత్మ ఈ పాపాభిలాషను పూర్తిగా కాల్చి నాశం చేస్తుంది. ఇదే ఉత్తరించే స్థలం. ఈలా మనలోని పాపాభిలాషంతా భస్మమైపోయాక మనకు పూర్ణానందం కలుగుతుంది. దీనితో మనమనుభవించే ఉత్తరించే స్థలం అంతమౌతుంది. మనం దైవదర్శనానికి సిద్ధమౌతాం. అనగా మనం శుద్దీకరణ స్థలాన్ని దాటి మోక్షాన్ని ప్రవేశించడానికి పాత్రులమౌతాం. ఈ భాగ్యం మనకు ఉత్థాన క్రీస్తువల్లా అతని ఆత్మవల్లాకూడ సిద్ధిస్తుంది. మన రక్షణ ఘట్టాలన్నిటిలోనూ క్రీస్తూ, శీర్షికఫార్మాటుబిందుఅతని ఆత్మా యిద్దరూ కలసే పని చేస్తారు. కాని క్రీస్తూ ఆత్మా మనలను శుద్ధిచేయడానికి ఎంతోకాలం పట్టదు. మన మరణ సమయంలో ఒక్క నిమిషంలోనే ఈ కార్యం జరిగిపోతుంది.

4. మన ప్రార్థనలు ఆలస్యం కావా?

ఉత్తరించే స్థలంలోని ఆత్మలు ఒక్క నిమిషంలోనే శుద్ధిని పొందుతాయని చెప్పాం. మరి మనం ఏటేట చనిపోయిన వాళ్ళకొరకు ప్రార్థనలర్పించడంలో భావం ఏమిటి? మన ప్రార్థనలు ఆలస్యం కావా? చనిపోయినవాల్లు అంతకు పూర్వమే మోక్షానికి వెళ్ళివుండరా?

నరులమైన మనకు భూతం, వర్తమానం, భవిష్యత్తు అని మూడుకాలాలుంటాయి. దేవుడికి ఈలా త్రికాలాలు ఉండవు, అతనికి అంతా వర్తమానమే, అన్ని కాలాల్లోని సంఘటనలూ అతనికి వర్తమానంలో కండ్లయెదుట జరుగుతూన్నట్లే కన్పిస్తాయి. "దేవుని దృష్టిలో ఒక దినమనిగాని వేయి సంవత్సరాలనిగాని తేడాలేదు. ఆయనకు రెండూ సరిసమానమే" - 2షేత్రు 3,8. కనుక మనం నరులు చనిపోకముందు ప్రార్ధించినా, చనిపోయేప్పడు ప్రార్ధించినా, చనిపోయిన తర్వాత ప్రార్ధించినా అతనికి అంతా సరిసమానమే ఔతుంది. ఆ ప్రార్థనలన్నీ అతనికి వర్తమాన ప్రార్థనలే ఔతాయి. మనం భూత భవిష్యద్వర్తమానకాలాల్లో చేసే క్రియలన్నీ అతని వర్తమానంలోకి ప్రవేశిస్తాయి. కనుక మనం ఎప్పడు ప్రార్థనలు చేసినా దేవుడు వాటి నంగీకరించి ఉత్తరించే ఆత్మలను శుద్ధిచేస్తాడు

ఈ సత్యాన్ని అర్థంచేసికోవడానికి ఓ వుపమానం చూద్దాం. రాబోయే క్రీస్తు సిలువ మరణం ఫలితాలనుచూచి దేవుడు మరియను జన్మపాపరహితనుగా పుట్టించాడు. మరియ పట్టాక షుమారు యాభై యేండ్లకుగాని క్రీస్తు సిలువ మరణాన్ని అనుభవింపలేదు. ఐనా దేవుని దృష్టిలో మరియు పట్టవూ క్రీస్తు సిలువ మరణమూ అనే రెండు సంఘటనలు ఏకమయ్యాయి, ఆ రెండూ అతని వర్తమానంలోకి ప్రవేశించాయి. క్రీస్తు సిలువ మరణం యాబైయేండ్లు వెనక్కు జరిగి అతని తల్లిని నిష్కల్మషనుగా పుట్టించింది మన ప్రార్థనలు గూడ ఉత్తరించే స్థలంలోని ఆత్మలకు ఈలాగే ఉపయోగపడతాయి. మన కాలం దేవుణ్ణి బాధించదు. మన కాలానికీ ఉత్తరించే స్థలానికీ అసలు సంబంధం లేదనికూడ ముందే చెప్పాం

ఇక, ఉత్తరించే స్థలంలోని ఆత్మలకొరకు మనం ఏలాంటి ప్రార్థనలు చేయవచ్చు? ఈ భూలోకంలో మనం చేసే పుణ్యక్రియలు ఉత్తరించే స్థలంలోని ఆత్మలకు ఉపయోగపడతాయనేది విశ్వసనీయమైన వేదసత్యం. దీనికి కారణం అర్యశిష్ణుల పరస్పర సంబంధం. అనగా మోక్షంలోను ఉత్తరించే స్థలంలోను భూలోకంలోను ఉన్న క్రైస్తవులకు పరస్పర సంబంధం ఉంటుంది. ఒకరి పుణ్యక్రియలొకరికి ఉపయోగపడతాయి. ఒకరి ప్రార్ధన లొకరికి ఫలితాన్నిస్తాయి.

మనమట్టుకు మనం ప్రార్థనలూ దానధర్మాలూ ఉపవాసాలూ శ్రమలూ పరిపూర్ణ ఫలాలూ మొదలైనవాటిని ఉత్తరించే స్థలంలోని ఆత్మల పాపపరిహారం కొరకు అర్పించవచ్చు అన్నిటికంటె ముఖ్యంగా పూజబలి వాళ్ళకుపయోగపడుతుంది. కనుక మనం పూజను వాళ్ళకొరకు అర్పించాలి. పూజలో వాళ్ళను భక్తితో స్మరించుకోవాలి

ప్రార్ధనా భావాలు

1. ఈ లోకంలో మనం సత్కార్యాలు చేయవచ్చు. వాటిద్వారా పుణ్యాన్ని ఆర్థించవచ్చు ఈ పుణ్యంద్వారా మన పాపావశేషాలకు మనమే ప్రాయశ్చిత్తం చేసికోవచ్చు, కాని చనిపోయాక మనం ఇక సత్కార్యాలుచేసి పుణ్యాన్ని ఆర్ధించలేం. మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసికోలేం. అందుకే ఉత్తరించే స్థలంలోని ఆత్మలు తమకుతాము ఏలాంటి సహాయమూ చేసికోలేరు, తమ పాపావశేషాలకొరకు బాధలుమాత్రం అనుభవించగలరు, అంతే. వాళ్లకు వాళ్లు సహాయం చేసికోలేరు కనుక, మన సహాయం వాళ్ళకు అవసరమౌతుంది. మన సహాయాన్ని పొందకపోతే వాళ్ళ పూర్తిగా శిక్షననుభవించి శుద్ధిని పొందాలి. మనసహాయమందితేవాళ్ళ శిక్షకొంతవరకు తగ్గుతుంది. కనుక మన పుణ్యకార్యాలద్వారా మనం వాళ్ళశిక్షను తగ్గిస్తూండాలి. ఉత్తరించే స్థలంలోని ఆత్మలు అక్కడున్నప్పడు మనకేలాంటి సహాయమూ చేయలేరు. మోక్షానికి వెళ్ళాక మనకు సాయం చేస్తారు.

2. చనిపోయిన వాళ్ళల్లో మన దగ్గరి బంధువులూ మనకు మేలు చేసినవాళ్ళూ ఉండవచ్చు. వీళ్ళ మన సహాయాన్ని అపేక్షిస్తారు. కనుక మనం వీళ్ళకొరకు ప్రార్ధనలూ పూజబలులూ మొదలైనవాటినికి తప్పక అర్పించాలి. మన తరపున మనం సాధ్యమైనంతవరకు ఈ లోకంలోనే మన పాపావశేషాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటే పరలోకంలో ఉత్తరించే స్థలాన్ని చాలవరకు తప్పించుకోవచ్చు. దీనికిగాను మనం ఏమి చేయాలి? ప్రార్థనలు ఉపవాసాలు దానధర్మాలు మొదలైన పుణ్యకార్యాలు చేసి వాటిని మన పాపపరిహారానికి సమర్పించుకోవచ్చు. ఈ జీవితంలో మన పాలబడే శ్రమలనుగూడ మంచి ఉద్దేశంతో స్వీకరించి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మన శ్రమలను క్రీస్తు శ్రమలతో చేర్చి పాపపరిహారంగా సమర్పించుకోవచ్చు. ఇంకా, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పూజబలిని గూడ అర్పించుకోవచ్చు. ఈలోకంలో కొద్దిపాటి బాధలతోనే మన అనిత్య శిక్షను తొలగించుకోవచ్చు. పరలోకంలో ఐతే ఫనోర బాధలతోగాని ఆ శిక్షను తొలగించుకోలేం. కనుక ఈ లోకంలో ఉండగానే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొందామనే కోరిక మనకు మిక్కుటంగా ఉండాలి. ఎప్పడుకూడ విశుద్ధ హృదయులేకాని దేవుణ్ణి దర్శించటానికి యోగ్యులుకారు. కనుక దూరదృష్టి కలిగి యిక్కడ ఉండగానే మన భవిష్యత్తుని మనం చక్కదిద్దుకొంటే బాగుపడతాం. బహుశా మనలో చాలామంది ఉత్తరించే స్థలంద్వారా గాని మోక్షాన్ని చేరుకోలేరు. ఈలోకంలో కఠోరమైన తపస్సు ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొన్న ఏకొద్దిమందో గాని నేరుగా మోక్షానికి పోరు.

5. మోక్షం

ముగ్గురు దైవవ్యక్తులను ముఖాముఖి దర్శించి ఆనందించడమే మోక్షం, మనకు మోక్షంమిూద మిక్కుటమైన కోర్కె ఉండాలి, మన యిల్ల అక్కడ. ఈ యధ్యాయంలో ఆరంశాలు పరిశీలిద్దాం.

1. కీర్తనకారుల మోక్షవాంఛ

కీర్తనలు రచించిన భక్తులు మోక్షాన్నీ దైవదర్శనాన్నీ గాఢంగా వాంఛించారు ప్రస్తుతానికి వాళ్ళల్లో ముగ్గురు భక్తుల కోరికలను మాత్రం పరిశీలిద్దాం. "నేను నిరంతరమూ ప్రభువు సాన్నిధ్యం

కలిగించుకొంటాను

అతడు నాచెంతనే వుంటాడుకనుక నాకేభయము లేదు

నేనతనికి వందనాలర్పించి సంతోషిస్తుంటాను,

సురక్షితంగా వుండిపోతాను నీవు నన్ను పాతాళం వాత బడనీయవు

నీ భక్తుణ్ణి మృతలోకంపాలు చేయవు

నీవు నాకు జీవనమార్గాన్ని చూపిస్తావు

నీ సాన్నిధ్యం నా కమితానందం కలిగిస్తుంది

సదా సంతోషాన్ని దయచేస్తుంది" -16,8-11

ఈ కీర్తనలో భక్తుడు భగవత్సాన్నిధ్యాన్ని తలంచుకొన్నాడు. ఆ సాన్నిధ్యం తన్ను సురక్షితంగా వుంచుతుందని నమ్మాడు. ప్రభువు అతని మరణానంతరం అతన్ని పాతాళలోకంలో వదలివేయడు. అతనికి ఉత్తానభాగ్యాన్నీ దైవదర్శనాన్నీ దయచేస్తాడు. అదే జీవనమార్గం, పరలోకంలో దైవసాన్నిధ్యం అతనికి అమితానందాన్ని కలిగిస్తుంది. దైవసాన్నిధ్యం మీదా మోక్షంమీదా ఆ కీర్తనకారునికున్న కోరిక అలాంటిది. "నీ ప్రేమ అమూల్యమైంది

నరులకు నీ రెక్కలమాటున ఆశ్రయం దొరుకుతుంది

వాళ్ళు నీ ఆలయంలో సమృద్ధిగా లభించే

భోజనం సాపడతారు

నీ మంచితనం అనే నది నుండి పానీయం సేవిస్తారు

నీవు జీవపు చలమవు

నీ వెలుగువలన మేమూ వెలుగు చూస్తాం" — 36,7-9,

కీర్తనకారులు యెరూషలేము దేవళంలో దేవుణ్ణి పూజించుకొని అతని సన్నిధిలో ప్రార్థనలు అర్పించుకొన్నారు. వాళ్ళభక్తికి దేవాలయమే కేంద్రం. కాని వాళ్లు దేవాలయంలోని దేవునితోపాటు మోక్షంలోని దైవసాన్నిధ్యాన్ని కూడ నమ్మారు. కనుక వాళ్లు దైవసాన్నిధ్యాన్ని గూర్చి మాటలాడేటప్పడు వాళ్ళ భక్తిలో దేవాలయమూ పరలోకమూ మిళితమై ఉంటాయి. ఈ 36వ కీర్తనను చెప్పిన భక్తుడు దేవునికి రెండుపమానాలు వాడాడు. అతడు జీవపు చెలమ, అనగా ఎప్పడూ వట్టిపోని ఊట. దేవాలయంలోను పరలోకంలోను భక్తులు ఆ వూటనుండి వూరే నీటిని త్రాగుతారు. ఇంకా, ఆ ప్రభువు వెలుగు. ఆ వెలుగులో భక్తులు వెలుగును చూస్తారు. ఇక్కడ ఊటా వెలుగూ దైవజీవనానికి సంకేతాలు. కనుక భక్తులు దేవునినుండి వరప్రసాదమూ ఆనందమూ రక్షణమూ మొదలైన భాగ్యాలు పొందుతారని భావం, సంగ్రహంగా చెప్పాలంటే, 36వ కీర్తన వ్రాసిన భక్తుడు తాను వెలుగూ వూటఐన దేవుణ్ణి దర్శిస్తానని నమ్మాడు, "నేను నిరంతరమూ నీ కంటిపెట్టుకొని వుంటాను

నీవు నా కుడిచేతిని పట్టుకొని నన్ను నడిపిస్తావు

నీ వుపదేశంతో నీవు నన్ను నడిపిస్తావు

కడన నిన్ను నీ మహిమలోనికి గొనిపోతావు

స్వర్గంలో నీవు తప్ప నా కింకెవరున్నారు?

ఈ భూమిమిూద నీవు తప్ప మరొకటి నాకు రుచించదు

నా దేహమూ నా హృదయమూ

ప్రేమవలన కృశించిపోతున్నాయి

దేవుడే సదా నా కాశ్రయం

అతడే నాకు వారసభూమి" - 73,23–26,

ఈ కీర్తనకారుని భావాల ప్రకారం, భగవంతుడు భక్తునికి ధర్మశాస్తోపదేశంచేస్తూ అతన్ని ఈ జీవితంగుండా నడిపించుకొని పోతాడు. ఈ జీవితయాత్ర ముగిసాక అతన్ని మోక్షమహిమలోనికి చేర్చుకొంటాడు. అక్కడ దేవుడు తప్ప అతనికి ఆనందాన్నొసగేదేమి ఉండదు. ఈ లోకంలో ప్రభువు మిది ప్రేమవలన అతని హృదయం కృశించిపోతూంది. అతడు మోక్షంలో ప్రభువుని దర్శించి రక్షణాన్నీ పరమానందాన్నీ పొందుతాడు. కావున స్వర్గంలోని ప్రభువుని చూడాలని అతనికి గాఢమైన కోర్కె

మోక్షాన్నీ దైవదర్శనాన్నీ గూర్చిన మహాభక్తుల కోరికలు ఈలా ఉంటాయి. మనం ఈలోక వస్తువ్యామోహాల్లో కూరుకొనిపోయి మోక్షాన్ని పట్టించుకోం. అలాంటప్పడు ఈ భక్తుల ప్రార్థనలు మనకు ప్రేరణం పట్టిస్తాయి. మన మనసులను ఈలోక వస్తువులనుండి పరలోక్త భాగ్యాలవైపు మరల్చుతాయి.

2. బైబులూ మోక్షవర్ణనమూ

బైబులు మోక్షాన్ని దైవదర్శనంగాను, దైవజ్యోతిగాను, దైవస్పర్శగాను వర్ణిస్తుంది. ఈ మూడంశాలను విపులంగా పరిశీలిద్దాం.

1. మోక్షం దైవదర్శనం

భక్తులు భగవంతుణ్ణి దర్శిస్తారని చెప్తుంది బైబులు, స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్టే మోషే ప్రభువుతో ముఖాముఖి మాట్లాడేవాడు - నిర్గ 33, 11. అతడు దేవుని రూపాన్ని చూచాడు - సంఖ్యా 12,8. ఈ మోషేలాగే కీర్తన కారుడుకూడ తాను దేవుడ్డి చూస్తానని నమ్మాడు. "నేను నిర్దోషిని గనుక నిన్ను దర్శిస్తాను, నేను మేల్కొనినప్పడు నీ-సాన్నిధ్యం వలన సంతృప్తి చెందుతాను" అని పల్కాడు – 17,15. ఈ వేదవాక్యాల్లో దేవుడ్డి దర్శించడమంటే ఆ ప్రభువు సాన్నిధ్యంలో ఉండిపోవడం. అతన్ని వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకోవడం. అతని ప్రేమకు నోచుకోవడం, అతన్ని తలంచుకొని ఆనందించడం. ఈ యనుభూతులన్నిటినీ కలిగించేదే మోక్షం.

సాధారణంగా మనం ఈలోకంలో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడం. విశ్వాసంతో మాత్రం అతన్ని నమ్ముతాం. ఈ నమ్మకం మనకు దైవానుభూతిని కలిగిస్తుంది. కాని ఈ యనుభూతి ఇక్కడ అస్పష్టంగా ఉంటుంది.అద్దంలో ప్రతిబింబం మసకగా కన్పిస్తుంది. అలాగే ఈలోకంలో దేవుడు అస్పష్టంగాగాని అనుభవానికిరాడు. కాని మోక్షంలో అతన్ని ప్రత్యక్షంగా, మూఖాముఖి దర్శిస్తాం. దేవుడు మనలను ఎరిగినట్లే మనమూ అతన్ని ఎరుగుతాం - 1కొరి 13,12,

క్రీస్తు శిష్యులకొరకు తండ్రిని ప్రార్ధిస్తూ "తండ్రీ! ఏకైక సత్యసర్వేశ్వరుడవైన నిన్నూ నీవు పంపిన యేసుక్రీస్తునీ తెలిసికోవడమే నిత్యజీవం" అని పల్కాడు - యోహా 178. హీబ్రూ సంప్రదాయం ప్రకారం "ఎరగడం” “తెలిసికోవడం" అంటే కేవలం జ్ఞానం మాత్రమేకాదు. ప్రేమకూడ. కనుక మనం మోక్షంలో భగవంతుణ్ణి బాగా తెలిసికొంటాం, ప్రేమిస్తాం గూడ.

మనం దేవుని బిడ్డలం. కనుక తండ్రియైన దేవుణ్ణి దర్శిస్తాం. జ్ఞానస్నానం పొందినపడే మనం దేవుని బిడ్డలమౌతాం. అప్పటినుండి దేవుణ్ణి దర్శించేశక్తి మనకు లభిస్తుంది. మోక్షంలో ఈ శక్తిపరిపూర్ణమౌతుంది. కనుక అక్కడ దేవుణ్ణి ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా చూస్తాం - 1 యోహా 32.

2. మోక్షం దైవజ్యోతి

యెరూషలేము దేవళం ఎప్పడూ వెలుగుతో నిండి ఉండేది. దానిలో సప్తశాఖలుకల దీపస్తంభం ఉండేది. వాటిలో మూడుశాఖలు దినమంతా వెలుగుతూండేవి. రాత్రిలో ఏడుశాఖలూ వెలుగుతూండేవి. గుడారాల ఉత్సవం, దేవాలయ ప్రతిష్ఠోత్సవం వచ్చినపుడు ఇంకా యొక్కువ దీపాలుకూడ వెలిగించేవాళ్లు, వీటన్నిటితో యెరూషలేం దేవళం రాత్రంతా మిరుమిట్ల గొల్పుతూండేది. అది ప్రధానంగా తేజోనిలయమైన మందిరం, దాని కాంతిలో యెరూషలేం నగరంకూడ ప్రకాశిస్తూండేది. ఈ కాంతిమయమైన దేవాలయం జ్యోతిర్మయమైన స్వర్గానికి చిహ్నంగా ఉండేది.

వెలుగులేకుండా యూదులు తమ దేవాలయాన్ని కాని దేవుణ్ణి కాని ఊహించుకొనేవాళ్లు కాదు. తండ్రి నరులు చేరరాని దివ్యతేజస్సులో వసించేవాడు - 1తిమో 6,16. అతడు వెలుగునే బట్టనుగా ధరిస్తాడు - కీర్తన 1042. క్రీస్తు ఆ తండ్రి తేజస్సుకి ప్రతిబింబం - హెబ్రే 1,3. తబోరు కొండమీద అతని ముఖం సూర్యుళ్లా ప్రకాశించింది - మత్త 17,2. అతడు జగజ్యోతి - యోహా 8,12. పౌలు డమాస్కు త్రోవలో ఉత్థాన క్రీస్తుని జ్యోతినిగానే దర్శించాడు - అచ 26,13.

బైబులు తండ్రినీ క్రీస్తునీ ఈలా జ్యోతిర్మూర్తులనుగా పేర్కొనడం దేనికి? యూదుల భావాల ప్రకారం వెలుగు నరునికి ఆనందాన్నిస్తుంది. అతన్ని రక్షిస్తుంది కూడ. కనుక జ్యోతిర్మూర్తియైన భగవంతుడు నరుణ్ణి కాపాడేవాడూ, అతనికి సంతోషాన్ని దయచేసేవాడూను.

ఇక, భగవంతునికి వాసస్థలమైన స్వర్గంకూడ జ్యోతిర్మయమైందే. దర్శన గ్రంథం పరలోక యెరూషలేమను అనగా మోక్షాన్ని వర్ణిస్తూ ఈలా వాకొంది. "ఆ నగరంలో నాకు దేవాలయమెక్కడా కన్పించలేదు. సర్వశక్తిమంతుడు దేవుడూ ఐన ప్రభువూ, గొర్రెపిల్లా ఆ నగరానికి దేవాలయమౌతారు. ఆ పట్టణానికి సూర్యచంద్రుల వెలుగు అవసరం లేదు. దేవుని తేజస్సే ఆ నగరానికి వెలుగు, గొర్రెపిల్ల ఆ నగరానికి దీపం" - 21,22-23. ఈ వాక్యాల భావమేమిటి? యూదుల సంప్రదాయం ప్రకారం దేవాలయం అతి ముఖ్యమైంది. భక్తులు దేవుణ్ణి కలుసుకొనేది దేవళంలోనే. ఐనా ఈ వేదవాక్యం పరలోకంలో దేవళం అవసరంలేదని చెప్పంది. మోక్షంలో తండ్రి కుమారుడే మనకు దైవసాన్నిధ్యమౌతారు. అక్కడ యిూ లోకంలోలాగే సూర్యచంద్రుల వెలుగుగాని, దీపాల వెలుగుగాని ఉండదు. తండ్రీ ఉత్థానక్రీస్తూ అక్కడ వెలుగౌతారు. అనగా మోక్షం దేవుని తేజస్సుతో నిండి ఉంటుందని భావం. మోక్షానికి వెళ్ళినపుడు మనంకూడ ఆ తేజస్సులో పాల్గొంటాం. తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యునివలె ప్రకాశిస్తారని క్రీస్తే చెప్పాడు — మత్త 13.43. తండ్రి మనల్ని చీకటిలో నుండి అద్భుతమైన వెలుగులోనికి పిలుస్తాడు - 1షేత్రు 2,9, అది దేవుడు తన ప్రజలకు వారసభూమిగా యిచ్చే వెలుగు సామ్రాజ్యం - కోలో 2,12. ఈ వాక్యాలన్నిటినిబట్టి బైబులు మోక్షాన్ని వెలుగులోకంగా భావిస్తుందని అర్థంచేసికోవాలి.

3. మోక్షం దైవస్పర

స్పర్శ జీవితానికి సంబంధించింది. చిన్న బిడ్డలకేగాక పెద్దవాళ్ళకుగూడ స్పర్శ అవసరం. బాల్యంనుండి చనిపోయిందాకా గూడ మనందరికీ స్పర్శ అవసరమే. మనం ఒక వ్యక్తిని స్పృశ్ఠచినపుడు అతనిపట్ల మనకు ఆప్యాయతా ప్రేమా ఉందని తెలియజేస్తాం. ప్రేమతో గూడిన స్పర్శ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
దేవుడుకి ఈ మర్మం తెలుసు, కనుక అతడుఓఅమ్మలానాన్నలామనలనుఆప్యాయంగాతాకుతుంటాడు.యిస్రాయేలు బాలుడై యుండగా నేనతన్ని ప్రేమించాను. 

అతన్ని నా చేతుల్లోనికి తీసికొన్నాను. నేను క్రిందికి వంగి అతనిచేత అన్నంతినిపించాను” హోషే 11, 1-4, అనగా దేవుడు అమ్మానాన్న ఐ యిస్రాయేలు అనే బాలుడ్డి తన చేతుల్లోకి తీసికొన్నాడు. అతనికి ఆప్యాయంగా అన్నం పెట్టాడు. ఇంకా గరుడపక్షి తనపిల్లల్ని రెక్కలమిూద నిల్పుకొన్నట్లే ప్రభువు యిస్రాయేలు ప్రజల్ని తన భుజాలమీద నిల్చుకొని ఐగుప్తునుండి కనాను మండలానికి కొనివచ్చాడు - ద్వితీ 3211. ఔను, ప్రభువు తన ప్రజల్ని ప్రేమతో తాకేవాడు.

క్రీస్తు ఎందరో రోగుల్ని చేతితో తాకి వాళ్ల రోగాలు కుదిర్చాడు. ఉత్థాన క్రీస్తు తోమాని తన గాయాల్లో వేళ్ళపెట్టి చూడమని ఆహ్వానించాడు - యోహా 20,27, మరియ మగ్డలీన తోటలో ఉత్థాన క్రీస్తు పాదాలు ముట్టుకొంది - యోహా 20,17. అలాగే సమాధివద్ద పుణ్యస్త్రీలు అతని పాదాలు పట్టుకొన్నారు – 28,9. ఈ విధంగా క్రీస్తు నరులను తాకాడు. నరులు కూడ అతన్ని తాకారు.
అసిస్సీ ఫ్రాన్సిస్, అవిలా తేరేసమ్మ, నోర్విచ్చి జూల్యానా మొదలైన భక్తులూ భక్తురాళ్ళు దేవుడు దర్శనాల్లో తమ శరీరాన్ని స్పృశించినట్లుగా చెప్పకొన్నారు. ఈ జీవితంలో లాగే మోక్షజీవితంలో కూడ సర్పర్శ అనేది ఉంటుంది. అక్కడ దేవుడు మనలను తాకుతాడు, మనమూ అతన్ని తాకుతాం. ఆ తండ్రి ప్రేమనీ ఆప్యాయతనీ అనుభవానికి తెచ్చుకొని పులకించిపోతాం.
మోక్షంలో దేవుడు భక్తులను స్పృశించే తీరును దర్శన గ్రంథం మనుష్యభాషలో ఈలా వర్ణిస్తుంది. *సింహాసనం మధ్యలోవున్న గొర్రెపిల్ల వారికి కాపరియై వాళ్ళని జీవజలాల వద్దకు తీసికొనిపోతుంది. దేవుడు వారి నేత్రాలనుండి బాప్పబిందువులను తుడిచివేస్తాడు" - దర్శ 7,17. అనగా మోక్షంలో భక్తులకు క్రీస్తే నాయకుడై వాళ్ళను సంరక్షిస్తుంటాడు. తండ్రి వాళ్ళ దుఃఖాలన్నిటినీ తొలగిస్తాడు.
ఈలా మోక్షమంటే భగవంతుణ్ణి దర్శించడం, అతని వెలుగుని పొందడం, అతన్ని తాకడం. ఈ క్రియలన్నీ మనకు పరమానందాన్ని కలిగిస్తాయి. మోక్షం ఆనందమందిరం,

3. ఉత్థాన క్రీస్తే మనకు మోక్షం

క్రీస్తు సిలువమిూద చనిపోయి మనకు పాపపరిహారం చేసాడు. ఉత్థానమై మనకు వరప్రసాదాన్ని ఆర్జించిపెట్టాడు. ఈ వరప్రసాద ఫలితమే మోక్షం. మోక్షంలో మన భాగ్యం ఉత్తానక్రీస్తే, అతనితో ఐక్యమయ్యే అక్కడ మనం తండ్రినీ ఆత్మనీ దర్శిస్తాం.
అద్దంలో మన ముఖాన్ని చూచుకొంటాం. అలాగే ఉత్తానక్రీస్తు ద్వారా తండ్రిని ఆత్మనీ చూస్తాం, ఆ యిద్దరు దైవవ్యక్తులను పొందడంలో క్రీస్తు మనకు మధ్యవర్తి ఔతాడు. 

ఉత్థాన ఆదివారం క్రీస్తుశిష్యులమీదికి శ్వాసనూది మీరు పవిత్రాత్మను పొందండి అని చెప్పాడు - యోహా 20,23. మోక్షంలో ఉత్థానక్రీస్తు భక్తులలోనికి తన ఆత్మను ఊదుతూంటాడు. ఇక్కడ మనం ఆత్మను పూర్తిగా పొందలేం. పరలోకంలో క్రీస్తునుండి ఆ యాత్మను సమృద్ధిగా పొందుతాం.

ఈ లోకంలో క్రీస్తుకి తండ్రిపట్ల గాధమైన ఆకర్షణం ఉండేది. అతడు నిరంతరము తండ్రికి ప్రీతిని కలిగించే కార్యమే చేసేవాడు - యోహా 8,29. అతనికి తండ్రిపట్ల ఈ యాకర్షణం ఎందుకుండేదంటే, ఆదిలో వాక్కు దేవునివద్ద ఉండేది - యోహా 1,1. ఆ వాక్కే తర్వాత క్రీస్తులోనికి ప్రవేశించి అతడు నిరంతరమూ తండ్రిని స్మరించుకొనేలా చేస్తుండేది. ఆ తండిని ప్రేమించి సేవించేలా చేస్తుండేది. మోక్షంలోగూడ ఉత్తానక్రీస్తు నిరంతరమూ తండ్రిచే ఆకర్షితుడౌతూంటాడు. ఇక, మోక్షంలో ఉత్తాన క్రీస్తుతో ఐక్యమయ్యే భక్తులుకూడ అతనిద్వారా తండ్రిని చూస్తారు. మోక్షమంటే ప్రధానంగా ముగురు దైవవ్యక్తులను దర్శించే తావు.

4. మోక్షానందం అందరికీ సరిసమానం కాదు

మోక్షంలో అందరూ దేవుణ్ణి దర్శించి ఆనందిస్తారు. అందరూ అతని వెలుగునుపొంది సంతోషిస్తారు. ఐనాఅక్కడ అందరి సంతోషమూ సమానంగా ఉండదు. ఈ లోకంలో మనం చేసికొనే పుణ్యంలో తారతమ్యాలుంటాయి. కనుక అక్కడ మనం భగవంతుణ్ణి దర్శించి ఆనందించే తీరులో కూడ తారతమ్యాలుంటాయి. అధిక పుణ్యంచేసికొన్నవాళ్లు ఎక్కువగాను, తక్కుపుణ్యం చేసికొన్నవాళ్ళు తక్కువగాను అతన్ని దర్శిస్తారు. పెద్ద కుండలో ఎక్కువ నీళ్ళు పడతాయి. చిన్నకుండలో తక్కువ నీళ్ళు పడతాయి. మన మోక్షానందం కూడ ఈలాగే ఉంటుంది

అసలు ఈ వ్యత్యాసం మోక్షంలో కాక భూమిమిూదనే ప్రారంభమౌతుంది, మనం ఈలోకంలో వున్నపుడు దేవునితో ఎంతగా సహకరించి కృషి చేస్తామో అంతగా పుణ్యాత్ములమౌతాం. కాని నరుల్లో కొందరు దేవునితో ఎక్కువగా సహకరిస్తారు, కొందరు తక్కువగా సహకరిస్తారు. దీనివల్లనే మనం మోక్షంలో ఎక్కువ మహిమకాని తక్కువ మహిమకాని పొందుతాం. మనం ఇక్కడచేసిన పుణ్యకార్యాలనే సామగ్రితోనే అక్కడ స్వర్గంలో మన సౌధాన్ని నిర్మించుకొంటాం. మన పుణ్యసామగ్రినిబట్టే మనస్వర్గధామం కూడ ఉంటుంది.
ఇంకో విషయంగూడ, మోక్షంలో మన శక్తికొలది దేవుణ్ణి దర్శిస్తాం, తెలిసికొంటాం. ఐనా మనం అతన్ని ఏనాటికీ పూర్తిగా గ్రహించలేం. నరులు అతన్ని 

పూర్తిగా గ్రహించగల్గితే అతడు దేవుడే కాదు. అపరిపూర్ణులైన సృష్టిప్రాణులకు అనంతుడైన భగవంతుడు సంపూర్ణంగా దొరకడు. చిన్న చెంబు సముద్రంలో ఎంతనీటిని గ్రహించగల్లుతుంది? మోక్షంలో నరులు కూడ భగవంతుణ్ణి కొద్దిగానే గ్రహిస్తారు. మన తరపున మనం అతన్ని పూర్తిగా గ్రహించినా, అతని తరపున అతన్ని పూర్తిగా గ్రహించలేం, లోతైన సముద్రంలో రాయివేస్తే అది క్రమేణ అడుగునకు చేరుకొంటుంది. కాని భగవంతుడనే సముద్రంలోకి దిగితే ఆ సముద్రానికి అడుగే ఉండదు. కనుక మనం ఏనాడూ ఆ ప్రభువు అంతాన్ని చూడలేం.

నరునికి భగవంతుణ్ణి తెలిసికొని ప్రేమించాలనేకోరిక మిక్కుటంగా ఉంటుంది. ఈ కోరికతో మనం మోక్షంలో క్షణక్షణమూ భగవంతుణ్ణి అధికాధికంగా తెలిసికొని ప్రేమిస్తూనే ఉంటాం. ఈ దృష్టితో జూస్తే స్వర్గంలో నిరంతరమూ పెరుగుతూనే ఉంటాం. కాని మనం ఆ దేవుణ్ణి ఎంత తెలిసికొన్నామనకుతెలియంది ఇంకా చాలా ఉండిపోతుంది. దీనివల్ల మనకు అసంతృప్తి యేమి కలుగదు. మిక్కుటమైన ఆశతో ఆ ప్రభువుని ఇంకా అధికంగా తెలిసికోగోరుతూంటాం.
పరలోకంలో దేవుడు మనలను శాశ్వతంగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు అంతం ఉండదు. దేవుని ప్రేమనుపొంది మనంకూడ అతన్ని శాశ్వతంగా ప్రేమిస్తాం. ప్రేమిస్తున్నంత కాలం, ప్రేమను పొందుతున్నంతకాలం, నరులు సంతోషంగా ఉంటారు. కనుక మనం అక్కడ దేవుని ప్రేమలో మునిగితేలుతూ కలకాలమూ శాంతిసంతోషాల ననుభవిస్తాం.

5. పునీతుల బాంధవ్యం

మోక్షంలో భక్తులు కేవలం ముగ్గురు దైవవ్యక్తులతో మాత్రమే ఐక్యంగారు, వాళ్ళ ఒకరితో ఒకరుగూడ ఐక్యమౌతారు. ఈ లోకంలో మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడే అతనితో ఐక్యమౌతాం. ప్రభువుతో ఐక్యమైనవాళ్లు తమలో తాము గూడ ఐక్యమౌతారు. ఈ ఐక్యతనే జ్ఞానశరీరం అంటాం. జ్ఞానశరీరం అనే భావం ఓవైపు క్రీస్తుతో మనకుండే సంబంధాన్నీ మరోవైపు క్రైస్తవులతో మనకుండే సంబంధాన్నీ తెలియజేస్తుంది.

క్రీస్తు ఈలోకంలో తన శిష్యులు ఒకరితో ఒకరు ఐక్యం కావాలని తండ్రిని ప్రార్థించాడు. "మనవలె వాళ్లు ఒకరుగా ఐక్యమైయుండాలి" అని మనవి చేసాడు - యోహా 17,22. అనగా తండ్రీ క్రీస్తూ యేలా పరస్పరం ఐక్యమైయుంటారో అలాగే అతని శిష్యులుకూడ ఒకరితో ఒకరు ఐక్యమై యుండాలి.

పూర్వవేదంలో యిస్రాయిలు ప్రజలు సీనాయి నిబంధనం ద్వారా ప్రభువుతో ఐక్యమయ్యారు. ఆ నిబంధనం వల్లనే వాళ్లు పరస్పరంగూడ ఐక్యమయ్యారు. నూతవేదంలో మనం సిలువ నిబంధనం ద్వారా క్రీస్తుతో ఐక్యమౌతాం. ఈ సిలువ నిబంధనమే జ్ఞానస్నానంలో మనమీద సోకుతుంది. క్రీస్తుతో ఐక్యమైనవాళ్లు అతనితో ఐక్యమైన ఇతర నరులతోగూడ ఐక్యమౌతారు.

పైన పేర్కొన్నపూర్వవేదపు యూదుల ఐక్యతకాని నూత్నవేదపు క్రైస్తవుల ఐక్యతగాని ఈ భూమిమిద ముగిసేది మాత్రమే కాదు. అది పరలోకంలోగూడ కొనసాగుతుంది. అదే పునీతుల బాంధవ్యం. మనం దివికేగినపుడు ఈ పునీతులను కలసికొంటాం.
నూత్నవేదంలో పరలోకాన్ని గూర్చిన వర్ణనలు ఎక్కువగా దర్శన గ్రంథంలో ఉన్నాయి. ఆ పుస్తకం మోక్షంలోని భక్తులను గూర్చి చెప్తూ "తదనంతరం నేను అటు చూడగా అక్కడ గొప్ప జనసమూహం కన్పించింది. దానిసంఖ్య లెక్కకు మిక్కుటంగా వుంది. ఆ జనంలో అన్నిజాతులవారు, అన్ని తెగలవారు, అన్ని భాషలవారు కలసిఉన్నారు. వాళ్లు సింహాసనానికి గొర్రెపిల్లకీ ఎదురుగా నిల్చి ఉన్నారు" అని నుడువుతుంది - 7,9, ఈ జనసమూహమే పరలోకంలో పరస్పరం ఐక్యమైయున్న పునీతులు.
రోజూ పూజారాధనంలో "ఉత్థానమౌతామనే నమ్మకంతో చనిపోయిన మా సోదరీసోదరులను, విూ కనికరమందు చనిపోయినవారందరిని స్మరించండి. వారిని మి దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనండి. మా అందరికి దయచూపండి. దేవుని కన్యమాతయగు మరియూంబతోను, అపోన్తలులతోను, ఆదినుండి మీకు సేవలు చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యజీవంలో భాగం దయచేయండి" అని ప్రార్ధిస్తాం. ఇంకా యేటేట సకలార్చ్యశిష్టుల పండుగ జరుపుకొని ఆ పనీతులందరికి ప్రార్థనలర్పిస్తాం. ఈ ప్రార్థనలు ఫలించి మనం మోక్షంలోని పునీతులతో ఐక్యమౌతాం. అక్కడ దేవమాత సన్మనస్కులు అర్చ్యశిష్టులు మొదలైన వాళ్ళనందరినీ కలుసుకొని సంతోషిస్తాం. ఈ లోకంలో మనకు రక్తబంధువులుగా ఉండినవాళ్ళను కూడ మోక్షంలో మళ్ళా కలుసుకొని ఆనందిస్తాం. ఈ సందర్భంలో సిప్రియను భక్తుడు ఈలా చెప్పాడు. "మోక్షంలో ఓ పెద్ద భక్త బృందం మనకోసం ఎదురుచూస్తూంటుంది. వాళ్ళల్లో మనకు ప్రీతిపాత్రులైన తల్లిదండ్రులూ సోదరీసోదరులు పుత్రీపుత్రులుకూడ ఉంటారు. మనకోసం కాచుకొనివుండే ఆ బృందం చాల పెద్దది. వాళ్లకు తమ రక్షణాన్ని గూర్చి చింతలేదు. మన రక్షణాన్ని గూర్చి మాత్రం నిరంతరం చింతిస్తూంటారు. వాళ్ళ సన్నిధిలోనికి వెళ్ళి వాళ్ళను ఆలింగనం చేసికొన్నపుడు మనకు పరమానందం కలుగుతుంది. అక్కడ ఇక మృత్యుభయం ఉండదు. అక్కడ అందరమూ నిత్యజీవాన్ని పొంది మహానందం చెందుతాం." ఈలా మోక్షం దేవుణ్ణి కలుసుకొనే తావు మాత్రమే కాదు, తోడి పునీతులను కలసికొనేతావు కూడ. 

6.మెక్షంమీద కోర్కె నూత్న వేదంలో క్రీస్తు, పౌలు, పేత్రు మొదలైన వాళ్ళను పరిశీలిస్తే వాళ్ళకి మోక్షంమీద గాఢమైన కోర్కెఉందని తెలుస్తుంది. క్రీస్తు బోధల ప్రకారం, ఈ లోకంలో సత్కార్యాలు చేసినవాళ్లు ప్రపంచ ప్రారంభంనుండి సిద్ధమైయున్న రాజ్యాన్ని చేకొంటారు - మత్త 25,34. తండ్రి యింటిలో చాలానివాసాలున్నాయి. క్రీస్తు ముందుగా అక్కడికి పోయి శిష్యులకు ఓ నివాసస్థలాన్ని సిద్ధం చేస్తాడు - యోహా 142. ఈలా ఆ ప్రభువు తన శిష్యులు మోక్షంకొరకు ఉవ్విళ్ళూరాలని కోరాడు. ఇంకా అతడు స్వయంగా గూడ స్వర్గాన్ని ఆశించాడు. కనుకనే తండ్రినిచూచి నేనిపుడు నీవద్దకు వస్తున్నానని పల్కాడు – యోహాను 17, 13. ఆ తండ్రి తన్ను మహిమపరచాలని వేడుకొన్నాడు — 17,5.

పౌలుకి ఫిలిప్పి క్రైస్తవులంటే ఎంతో యిష్టం. వాళ్ళతో ఉండిపోయి వాళ్ళకు సేవలు చేయాలని అతని కోరిక. కాని అతనికి క్రీస్తంటే ఇంకా యొక్కువయిష్టం. కనుక తాను చనిపోయి క్రీస్తుని చేరుకోవడంమేలో, లేక బ్రతికివుండి ఫిలిప్పీయులకు సేవలు చేయడం మేలో అతనికే అర్థం కాలేదు. ఈరెండు కార్యాల్లో దేనిని ఎన్నుకోవాలో తనకే తెలియడంలేదన్నాడు. తన మటుకు తానైతే ఈ జీవితాన్ని త్యజించి క్రీస్తుని చేరుకోగోరుతున్నాని వాకొన్నాడు - ఫిలి 1,11-23. ఈ లోకంలో మనంభరించే చిన్నకష్టాలే మోక్షంలో మనకు అత్యధికమైన నిత్యమహిమను సంపాదించి పెడతాయి. కనుక మనం ఆ మోక్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కష్టాలనుభవించడానికి వెనుకాడకూడదని వాకొన్నాడు -2కొ4,17. ఈ జీవితంలో పౌలు చక్కగా పోరాడాడు. కనుక ప్రభువతనికి మోక్షంలో నీతిమంతుల కిరీటం దయచేస్తాడు. ఒక్క పౌలుకేగాదు, ఇక్కడ భక్తిగల జీవితం జీవించి ప్రభువు దర్శనం కొరకు ప్రేమతో వేచివుంటే వాళ్ళందరికి అలాంటి కిరీటమే లభిస్తుంది -2తిమో 4,7-8. పాలు మోక్షవాంఛ యిలాంటిది.

పేత్రు తననాటి క్రైస్తవ సంఘపాలకులను ప్రోత్సహిస్తూ "ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనపుడు విూరు ఎన్నటికిని క్షీణింపని మహిమాన్వితమైన కిరీటం పొందుతారు" అని చెప్పాడు – 1షేత్రు 5,4

ఈలా క్రీస్తూ, పౌలూ, పేత్రూ మొదలైన వాళ్లంతా మనం మోక్షంమిూద కోర్కె పెంచుకోవాలని సూచించారు. పూజారాధనలోని ప్రార్థనలుకూడ మనం యూలోక వస్తువులను ఉపేక్షించి మోక్షవస్తువులను ఘనంగా యెంచాలని చెప్తాయి. క్రీస్తు జయంతి సందర్భంలో వచ్చే ప్రార్థన "ప్రభూ! నేడు మామీద అవతరించిన జ్యోతిని మేము మోక్షంలోగూడ దర్శించేభాగ్యాన్ని ప్రసాదించు" అంటుంది. క్రీస్తు మోక్షారోహణం సందర్భంలో వచ్చే ప్రార్ధనం "ప్రభూ! మేము ఈ దినం నీ కుమారుడు మోక్షరోహణం చేసాడని విశ్వసిస్తున్నాం. అతనితోపాటు మేముకూడ మోక్షంలో వసించే భాగ్యాన్ని ప్రసాదించు" అంటుంది. దివ్యసత్ర్పసాద పండుగ సందర్భంలో వచ్చే ప్రార్థనం "ఓ ప్రభూ! నీ దివ్యశరీర రక్తాలను స్వీకరించిన మేము మోక్షంలో నీ దివ్యత్వాన్ని దర్శించి ఆనందింతుముగాక" అని చెప్తుంది. మనం ఈలోకానికి అంటిపెట్టుకొని ఉండకూడదనీ, మోక్షాన్నీ దైవదర్శనాన్నీ ఆశించాలనీ ఈ ప్రార్థనల భావం. కనుక మనం అవశ్యం మోక్షంమిూద కోర్కె పెంపొందించుకోవాలి.

ప్రార్థనా భావాలు

1. ఇక్కడ మనకు పరిపూర్ణానందం ఉండదు. అది మోక్షంలోగాని సిద్ధింపదు. మన యిల్లు ఇక్కడకాదు, అక్కడ. మనం చేరవలసిన రేవు అక్కడుంది. కనుక మనం ఆ పరలోకానికి యాత్ర చేసే నావికులం. ఇక్కడ మనకు స్థిరమైన పట్టణం ఏదీ లేదు. రాబోయే నగరం కోసం ఎదురుచూడాలి - హెబ్రే 13,14. మన హృదయాలను పరలోకంలోని వస్తువులవైపు మరల్చాలి - కొలో3,1-2. కనుక ఈ లోకాన్ని మాత్రమే నమ్ముకొనేవాడు మోసపోతాడు. పరలోకంవైపు దృష్టి త్రిప్పేవాడు బాగుపడతాడు.
2. మోక్షంలో మనం పునీతుల బాంధవ్యాన్ని పొంది సంతోషిస్తామని చెప్పాం. కాని తోడినరులతో సఖ్య సంబంధాలను ఈ లోకంలోనే ప్రారంభించాలి. ఇక్కడ తోడిజనుల పట్ల ఆదరాభిమానాలు చూపించాలి. విశేషంగా పేదసాదలను ఆదుకోవాలి. మనకున్నది తులమో ఫలమో వాళ్ళతో పంచుకోవాలి. ఈ లోకంలో తోడినరులపట్ల ప్రేమతో జీవించనివాడు పరలోకంలో పునీతులబాంధవ్యానికి అరుడుకాడు.

3.అగస్టీను భక్తుడు "ఓ ప్రభూ! మా హృదయాన్ని నీ కొరకే చేసావు, నీయందు విశ్రమించిందాకా దానికి విశ్రాంతిలేదు" అని వాకొన్నాడు. ఇది మహవాక్యం. భగవంతుడు తనమిూదా, తన మోక్షంమీదా మన హృదయంలో సహజమైన కోర్మెను పెడతాడు. మనం ఈ లోకవస్తు వ్యామోహాల్లో తగుల్కొని ఆ కోరికను అణచివేసికోగూడదు. పునీతులకు మోక్షంమీద గాఢమైన వాంఛ ఉండేది. ఆ భాగ్యం మనకుకూడ అబ్బితే మన జీవితం ధన్యమౌతుంది.

4.అగస్టీను భక్తుడే మోక్షాన్ని గూర్చి చెపూ "అక్కడ మనం విశ్రాంతిని పొందుతాం. దేవన్షి దర్శిస్తాం, ప్రేమిస్తాం, స్తుతిస్తాం. అంతంలో అనంతంగా జరిగేది యిదే" అని వాకొన్నాడు. మోక్షంలో ఈలోకంలోలాగ కృషిచేయం. ఇక్కడ చేసిన కృషికి ఫలితంగా అక్కడ విశ్రాంతిని పొందుతాం. ఇంకా, అక్కడ దేవుణ్ణి దర్శించి ఆనందిస్తాం. భగవంతుణ్ణి దర్శించినవాళ్ళు అతన్ని ప్రేమించి స్తుతించకుండా ఉండలేరుకదా! మోక్షం మనకు గమ్యం. మనం పొరుగూరు వెళ్ళినపుడు మళ్ళా మనవూరికి తిరిగి పోవాలని ఉబలాటపడతాం. అలాగే మన గమ్యమైన మోక్షానికి తిరిగి పోవడానికి మనం సదా ఉబలాటపడుతూండాలి. మనం పరలోక పౌరులం -ఫిలి 3,20.

6.ఉత్ధానం

లోకాంతంలో మన మృతదేహం మళ్ళా ఉత్తానమై దేవుని సన్నిధిని చేరుతుంది. కనుక మనం దేహాన్ని గౌరవంతో చూడాలి. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1.ఉత్దానాన్ని గూర్చిన బైబులు బోధలు

1. పూర్వవేదం మొదటలో ఉత్థానాన్ని గూర్చిస్పష్టంగా చెప్పదు. కాని దానియేలు గ్రంధాం, మక్కబీయుల గ్రంథాలు మొదలైన చివరి పుస్తకాల్లో ఈ భావం స్పష్టంగా కన్పిస్తుంది.

జీవానికీ మరణానికీ గూడ అధిపతి ప్రభువేనని చెపూ్త మొదటి సమూవేలు గ్రంధం

“చంపేవాడు ప్రాణమిచ్చేవాడు ప్రభువే
పాతాళానికి గొనిపోయేవాడు

పైకి గొనివచ్చేవాడూ అతడే" అంటుంది - 2,6. కీర్తనకారులకు ఉత్థానాన్ని గూర్చి నిక్కచ్చిగా తెలియకపోయినా అస్పష్టంగానైన తెలుసు. కనుకనే

నీ ఉపదేశంతో నీవు నన్ను నడిపిస్తావు
కడన నన్ను నీ మహిమలోనికి గొనిపోతావు"

అన్నాడు వో కీర్తనకారుడు - 73,24, 16వ కీర్తన చెప్పిన భక్తుడు ప్రభువు నుద్దేశించి

"నీవు నన్ను పాతాళానికి పంపవు
నీ పరిశుద్దుని గోతిపాలు చేయవు"

అని వాకొన్నాడు-16,10. ఇక్కడ "గోతిపాలు చేయవు" అనే భాగానికి "కుళ్లు పట్టనీయవ" అనే పాఠాంతరంకూడ వుంది. ఈ భక్తుడు మరణానంతరం తాను పాతాళంలో నాశమైపోననీ ప్రభువు తనకు ఉత్థాన భాగ్యాన్ని దయచేస్తాడనీ నమ్మాడు. తర్వాత నూత్న వేదకాలంలో అపోస్తలులు ఈ కీర్తన వాక్యాన్ని క్రీస్తుకి అన్వయింప జేసారు - అచ 13,35-37.

పూర్వవేదాంతంలో వచ్చే దానియేలు గ్రంథంలో ఉత్తాన భావం స్పష్టంగా కన్పిస్తుంది. "సమాధుల్లో నిద్రించే వాళ్ళల్లో అనేకులు మేలుకొంటారు. వాళ్ళల్లో కొందరు నిత్యజీవాన్ని అనుభవిస్తారు. కొందరు నిత్యావమానం పొందుతారు" అంటుంది ఈ పుస్తకం 12,2.

రెండవ మక్కబీయుల గ్రంథం అంటియోకసురాజు యూదులను వేదహింసకు గురిచేసిన తీరును వివరిస్తుంది. అతడు ఏడురు సోదరులను వరుసగా ఒకరి తర్వాత ఒకరిని చంపించాడు. వారిలో రెండవవాడు ఘటోరబాధలతో ప్రాణాలు విడుస్తూ రాజు నుద్దేశించి “రాక్షసుడా! నీవు మమ్మ చంపించవచ్చుగాక. కాని విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్తాన భాగ్యాన్ని దయచేసి మేము శాశ్వతంగా జీవించేలా చేస్తాడు" అని పల్మాడు - 2 మక్క7,9. 2. నూత్నవేద కాలానికి ఉత్తానాన్ని గూర్చిన భావాలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. నూత్నవేదం క్రీస్తు ఉత్థానాన్ని వర్ణిస్తుంది. ప్రభువు నయీను విధవా పత్రుజ్జీ, యాయిూరు కొమార్తనూ, లాజరునీ జీవంతో లేపాడు. ఇవి ఉత్థానాలు కాదు, పునర్జీవాలు. ఐనా ఈ సంఘటనలు క్రీస్తు ఉత్థానాన్ని సూచిస్తాయి. ఆ ప్రభువు ఉత్థానమూ మనలను కూడ లేపుతుంది. అతడు సజీవుడై లేచినట్లే మనమూ లేస్తాం.

యోహాను భావాల ప్రకారం క్రీస్తుని విశ్వసించడం వల్లా, అతని భోజనంగా స్వీకరించడంవల్లా, ఉత్థానాన్ని పొందుతాం. తమ్ముడు లాజరు చనిపోయినందుకు దిగులుపడుతున్న మూర్తతో ప్రభువు "నేను ఉత్తానాన్ని జీవాన్ని కూడాను. నన్ను విశ్వసించేవాడు మరణించినా మళ్ళా జీవిస్తాడు" అని పల్మాడు-11,25, అనగా క్రీస్తుని విశ్వసించేవాళ్ళు మరణానంతరం మళ్ళా లేస్తారు.

ఇక, క్రీస్తు శరీరమైన దివ్యసత్రసాదంకూడ మనకు ఉత్థానాన్ని దయచేస్తుంది. కనుకనే ప్రభువు "నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం జేసేవాడు నిత్యజీవాన్ని పొందుతాడు. నేనతన్ని అంతిమదినాన లేపుతాను" అని పల్మాడు-6,54. ఉత్థాన క్రీస్తు ప్రధానంగా జీవమయుడు, అతని శరీరాన్ని ఆరగించినపుడు మనంకూడ జీవమయులమౌతాం, ఈ జీవమే మనల్ని లోకాంతంలో లేపుతుంది. క్రీస్తు "నేను తండ్రి మూలాన జీవిస్తున్నాను. అట్లే నన్నుభుజించేవాడు నా మూలాన జీవిస్తాడు" అని నుడివాడు6,57. అనగా జీవవాహిని తండ్రి నుండి కుమారుణ్ణి చేరుతుంది. కుమారుని నుండి మనలను చేరుతుంది. మరో సందర్భంలో అతడు “తండ్రి ఏలా మృతులను సజీవులను చేసాడో అలాగే కుమారుడుకూడ తన కిష్టమైనవారిని సజీవులను చేస్తాడు" అని వాకొన్నాడు–5,21.

యూదుల్లో ఓ తెగవాళ్ళయిన సదూకయిలు ఉత్తానాన్ని నమ్మరు. వీళ్ళ క్రీస్తుతో ఉత్థానం లేదని వాదించారు. కాని ప్రభువు వీళ్ళ నోళ్లు మూయించాడు. దేవుడు సజీవుల దేవుడు కాని మృతుల దేవుడు కాడు. కాని మనం జీవంతో లేస్తేనేగాని అతడు సజీవుల దేవుడు కాలేడు. అందుచేత ఉత్థానమనేది ఉంది అని క్రీస్తు రుజువు చేసాడు - మత్త 22,23-32,

3. నూతవేద రచయితలందరిలోను ఉత్థానాన్ని గూర్చి విస్తృతంగా చెప్పినవాడు పౌలు. అతని భావాలను మనం చక్కగా జీర్ణం చేసుకోవాలి క్రీస్తు ఉత్థానం మన ఉత్థానానికి మాదిరిగాను కారణంగాను ఉంటుంది. క్రీస్తుని జీవంతో లేవనెత్తిన తండ్రి మనలను కూడ లేపుతాడు. క్రీస్తు లేచాడంటే మనమూ లేస్తామన్నమాటే - 1కొరి 15,12-13.

క్రీస్తుని కాని మనల్ని కాని జీవంతో లేపేది పవిత్రాత్మే తండ్రి ఏ యాత్మద్వారా క్రీస్తుని లేపాడో, ఆ యాత్మద్వారానే మనలనుకూడ లేపుతాడు-రోమా 8,11. మనం జ్ఞానస్నానంలోనే ఉత్తాన క్రీస్తు ఆత్మను పొందుతాం. అతనికి దేవాలయమౌతాం-1కొరి 6,19. తనకు దేవాలయమైన నరుడ్డి ఆ దివ్యాత్ముడు వట్టినే వదలివేయడు. మరణానంతరం అతన్ని తప్పకుండా లేపుతాడు.

మనం జ్ఞానస్నానం పొందినప్పటినుండి క్రీస్తు మరణికోత్తానాలు మనమిూద పనిచేయడం మొదలుపెడతాయి. అతడు భౌతికంగా మరణిస్తే మనం ఆధ్యాత్మికంగా, అనగా పాపజీవితానికి చనిపోతాం. అతడు భౌతికంగా ఉత్థానమైతే మనం ఆధ్యాత్మికంగా, అనగా పుణ్యజీవితానికి ఉత్తానమౌతాం. ఈ యాధ్యాత్మిక ఉత్థానం కడన మనకు శారీరకోత్తానాన్ని గూడ సంపాదించి పెడుతుంది- రోమి 64-5.

పౌలుకి క్రీస్తు తబోరు కొండమిూద పొందిన ప్రకాశమంటే చాల యిష్టం. అతడు తన జాబుల్లో చాలాసార్లు ఆ ప్రకాశాన్ని పేర్కొన్నాడు. అది మనకుగూడ లభిస్తుందని వాకొన్నాడు. ప్రభువు కొండమిూద రూపాంతరం చెందగా అతని ముఖం సూర్యుళ్ళా ప్రకాశించింది. అతని దుస్తులు వెలుగువలె తెల్లనయ్యాయి-మత్త 17,2. తండ్రి ఆనాడు క్రీస్తు ముఖంపై ప్రకాశింపజేసిన వెలుగుని ఈనాడు భక్తుల హృదయాల్లో గూడ ప్రకాశింపజేస్తాడు-2కొ46. పౌలుకి డమస్కత్రోవలో దర్శనమిచ్చింది తబోరు కొండమిది ప్రకాశం లాంటి ప్రకాశమే - అచ 9,3. బలహీనమైన మన యీ మర్త్యశరీరాన్ని ఉత్థానక్రీస్తు తన శరీరంలాగ ప్రకాశవంతమైన దాన్నిగా చేస్తాడు-ఫిలి 3,21,

మరణించిన వాళ్ళల్లో ప్రథమఫలమో అన్నట్లుగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు - 1కొరి 15,20. ఈ వాక్యం భావమిది. యూదుల దేవాలయంలో ప్రథమఫలాలు అర్పించేవాళ్లు. దీనిద్వారా పొలంలోని పంటంతా దేవునికే చెందిందని సూచించారు. అలాగే క్రీస్తు మృతులలో నుండి మొదటి ఫలమో అన్నట్లు లేచాడు. అతని ఉత్థానం చనిపోయిన వాళ్ళంతా ఉత్థానమౌతారని సూచిస్తుంది. అతడు మృతులలోనుండి లేపబడిన వారిలో జ్యేషుడు. కనుక మనం కనిషులం - కొలో1,18. ఈలా క్రీస్తుఉత్థానం మన ఉత్తానానికి మాదిరీ కారణమూ ఔతుంది.

2. ఉత్దాన సత్యాలు

1. సజ్జనులకు దుర్మారులకూ గూడ లోకాంతంలో ఉత్తానం సిద్ధిస్తుంది. తొలి మానవుడు అమరుడు. పాపంవలన అతడు అమరత్వాన్ని పోగొట్టుకొన్నాడు. ఉత్తానంద్వారా దేవుడు మళ్లానరులందరికీ ఆదివరమైన ఈ యమరత్వాన్ని దయచేస్తాడు. ఏ నరుడూ ఈవరాన్ని తిరస్కరించలేడు. కనుక పుణ్యాత్ములూ పాపాత్ములూకూడ కడన జీవంతో లేస్తారు. కాని పుణ్యాత్ములు ఉత్తానంద్వారా మహిమను పొందుతారు. వాళ్లు క్రీస్తుద్వారా లేచి క్రీస్తు మహిమలో తామూ పాలుపొందుతారు. ఇక, పాపాత్ములు క్రీస్తుని నిరాకరించినవాళ్ళ కనుక వాళ్లు క్రీస్తు మహిమలో పాలుపొందరు. రెండవ మరణమైన నరకాన్ని పొందుతారు.
2. మనం పూర్వ దేహంతోనే ఉత్థానమౌతాం. అనగా మనం ఈ లోకంలో జీవించినపుడు ఏ దేహంతో ఉన్నామో ఆ దేహంతోనే లేస్తాం. అన్యదేహాన్ని పొందం. ఐతే ఉత్తానమయ్యాక మన పూర్వదేహం మహిమను పొంది పూర్తిగా మారిపోతుంది. ఈ లోకంలో ఉన్నపుడు మన శరీరం ఆకలి దప్పలకూ వ్యాధి బాధలకూ గురౌతూంటుంది. జీవంతో లేచాక దానికి ఈ బాధలేవీ ఉండవు, అప్పడది మహిమ శరీరంగా మారిపోతుంది. కొందరు ఆధునిక వేదశాస్తులు మనం మరణించిన వెంటనే మన దేహం ఉత్థానమౌతుందని చెప్తున్నారు. కాన ఈ భావమింకా వ్యాప్తిలోకి రాలేదు.
3. మహిమ శరీర లక్షణాలు నాలు. 1కొ 15,42–44ను ఆధారంగా తీసికొని వేదశాస్తులు మహిమ శరీర లక్షణాలను నాల్డింటిని పేర్కొన్నారు. మొదటి లక్షణం, అది ప్రకాశవంతంగా ఉంటుంది. ఉత్తానక్రీస్తు శరీరంలాగే మన శరీరంకూడ తేజస్సుని పొందుతుంది-ఫిలి 3,21. రెండవ లక్షణం, అది అవినాశంగా ఉంటుంది, పాపఫలితంగా ఇక్కడ మన శరీరం వ్యాధిబాధలకూ మరణానికి వినాశనానికి గురౌతుంది. కాని ఉత్తాన శరీరం క్రీస్తుఉండి తేజస్సునీపూర్ణజీవాన్ని పొంది అవినాశమౌతుంది. పరలోకంలో ఉత్థాన దెహనికి సంతానేచ్ఛ ఉండదు. అక్కడివాళ్ళు పెండ్లిచేసికోరు - మత్త 22,30. వాళ్ళకు 

ఆకలి దప్పలుండవ-ప్రక7,16. మూడవ లక్షణం, అది శక్తిమంతమైనదిగా ఉంటుంది. దేవుడు తన శక్తితో క్రీస్తుని లేపాడు, అదేశక్తితో మనలనూ లేపుతాడు. కనుక మన ఉత్తాన దేహం దైవశక్తితో నిండివుంటుంది-ఎఫే 1, 19–20. నాల్గవ లక్షణం, అది ఆధ్యాత్మికంగా ఉంటుంది. అనగా మహిమ శరీరం పవిత్రాత్మతో నిండి ఉంటుంది. మన తనువు ఈ లోకంలోనే పవిత్రాత్మకు ఆలయమైవున్నా అది యిక్కడ జంతువాంఛలతో నిండివుంటుంది. ఆత్మకు అట్టే లొంగదు. కాని అది పరలోకంలో పవిత్రాత్మతో నిండి ఆత్మకు వశవర్తినియై ఉంటుంది. కనుక ఈ భౌతిక దేహమే ఉత్తానమైనా, ఈ దేహానికీ, ఆ పరలోక దేహానికీ ఎంతో తేడా వుంటుంది. విత్తనానికీ ఆ విత్తనం నుండి మొలిచే మొలకకీ ఎంత వ్యత్యాసం ఉంటుందో మన యిహలోక శరీరానికీ పరలోక శరీరానికీ అంత వ్యత్యాస ముంటుంది.

4. పరలోకంలో మన ఉత్థాన దేహంకూడ దానంతట అది త్రీత్వైక సర్వేశ్వరుణ్ణి దర్శించలేదు. అక్కడ మన తనువు క్రీస్తు ఉత్తానదేహంతో ఐక్యమై ఆ ప్రభువు నుండి దివ్యశక్తిని పొందుతుంది. ఆ శక్తితోనే అది త్రీత్వైక సర్వేశ్వరుడ్డి చూడగల్లుతుంది.

5. ఒక్క మన శరీరం మాత్రమే కాదు, ఈ విశ్వమంతాగూడ మహిమను పొందుతుంది. నరుడు ఈ విశ్వంలో జీవిస్తాడు. కనుక విశ్వం అతని కోసం ఉంది. నరుడు పాపం చేసి తన ఉన్నతస్థితిని కోల్పోయినప్పడు ఈ విశ్వంకూడ శాపానికి గురైంది. అతడు ఉత్తానమై మహిమను పొందినపుడు ఈ విశ్వంకూడ మహిమను పొందుతుంది. “స్నశానికి గురైంది. కాని ఒకనాడు అది వినాశ దాస్యం నుండి విముక్తి చెంది, దేవుని పుత్రుల మహిమాన్వితమైన స్వాతంత్ర్యంలో పాలు పొందుతుంది" అని వ్రాసాడు పౌలు-రోమా 8,20-21. "దేవుడు నీతికి నిలయమైన క్రొత్త భువిని క్రొత్తదివిని వాగ్హానం చేసాడు. మనం వాటికోసం వేచివుండాలి? అని చెప్నంది-2 పేత్రు 3, 13. "సింహాసనాసీనుడైన ప్రభువనేనిపుడు అన్నిటిని క్రొత్తవాటిని చేస్తానని పల్మాడు" అంటుంది దర్శనగ్రంథం 21,5. ఈ వేద వాక్యాలన్నీ మహిమను పొందబోయే నూత్న విశ్వాన్ని సూచిస్తాయి. కనుక ఈ ప్రస్తుత ప్రపంచం నాశంకాదు. ఇది క్రొత్త ప్రపంచంగా మారిపోతుంది. లోకాంతంలో మన దేహాలు నాశంకావు, మహిమను పొందుతాయి. అలాగే యుగాంతంలో ఈ విశ్వంకూడ నాశంకాదు, క్రొత్తదనాన్ని పొందుతుంది.

ప్రార్ధనా భావాలు

1.వేదశాస్త్రులు ఉత్ధానాన్ని బీజం మొలకైతడంతో పోల్చారు. ఓ ప్రత్యేక బీజంనుండి ఓ ప్రత్యేకమైన మొలకవస్తుంది. చింత విత్తనం నుండి చింత మొలకే మొలుస్తుంది. వేప విత్తనం నుండి వేపమొలకే మొలుస్తుంది. అలాగే మన పూర్వ దేహంనుండే మహిమ దేహం ఏర్పడుతుంది. ఆ రెండింటికీ సంబంధం ఉంటుంది. ఐనా ఆ విత్తనానికీ దానిలో నుండి మొలచే మొలకకీ, ఎంతో వ్యత్యాసముంటుంది. అలాగే నరుని పూర్వదేహమే ఉత్థానమైనా, అది యెంతో మారి మహిమాన్విత శరీరంగా లేస్తుంది. ఈలా సామ్యమూ, భిన్నత్వమూ గల అద్భుతమైన ఉత్థానాన్ని దేవుడు మాత్రమే మనకు దయచేయగలడు. అందుకు ఆ ప్రభువుకి వందనా లర్పించాలి,
2.ఈ ప్రకృతిలో ఎక్కడ చూచినా ఉత్ధానం కన్పిస్తూనే ఉంటుంది. సూర్యచంద్ర నక్షత్రాలు రోజురోజు అస్తమించి మళ్ళా ఉదయిస్తూంటాయి. భూమిలో నాటిన విత్తనం మళ్ళా మొలకెత్తుతూంది. అలాగే ఆకు రాల్చిన చెట్టూ, నేలలో నాటిన కొమ్మా మళ్ళా చిగురిస్తున్నాయి. ఈ ప్రక్రియలన్నీ ప్రకృతిలోని ఉత్ధానానికి నిదర్శనాలు. నరదేహాన్నీ కూడ ఓ విత్తనంలా నేలలో నాటుతారు. అది ఈ నేలనుండి మళ్ళామొలకెత్తుతుంది. బీజంలోని జీవశక్తివల్ల, అనగా క్రీస్తు ఆత్మల సాన్నిధ్యంవల్ల,అది మళ్ళా ఉత్ధామౌతుంది. ఈ యద్భుత వరానికి మనం దేవునికి నమస్కారం చేయాలి.
3.నరులు సహజంగానే అమరత్వాన్నీ శాశ్వతత్వాన్నీ కోరుకొంటారు. "మృత్యోర్మా అమృతం గమయ" అన్నవైదిక ఋషి ప్రార్ధనం మనందరి ప్రార్ధనంకూడ.కాని మనంతట మనం ఈ శాశ్వతత్వాన్ని పొందలేం. ప్రభువే ఉత్థానం ద్వారా ఈ భాగ్యాన్ని మనకు దయచేస్తాడు. ఈ భాగ్యంపట్ల మన హృదయంలో గాఢమైన వాంఛను గూడ ముందుగానే నెలకొల్పుతాడు. ఆ ప్రభువు మంచితనాన్నీ ప్రేమనీ మనం వేనోళ్ళ కొనియాడాలి.
4.హిందూ సంప్రదాయం ప్రకారం దేహం చెడ్డది. పక్షిపంజరంలోలాగ మన ఆత్మదేహంలో బంధింపబడి ఉంటుంది. అది ఆత్మకు చెరలాంటిది. కనుక దేహం

ఎంత త్వరగా నశిస్తే అంత మంచిది, కాని బైబులు సంప్రదాయం ప్రకారం దేవుని సృష్టిలోని అన్ని వస్తువుల్లాగే దేహంకూడ మంచిది. అది ఉత్తానమై దేవుణ్ణి చేరుతుంది. కనుక మనం దాన్ని గౌరవంతో చూడాలి. దాన్ని పాపానికి దూరంగా ఉంచాలి. ఉత్థాన భాగ్యాన్ని పొందడానికి తగినట్లుగా పవిత్రంగా ఉంచాలి. దైనందిన జీవితంలో ఆత్మ దేహాన్ని నడిపించాలి కాని దేహం ఆత్మను నడిపించకూడదు. ఈ లోకంలో శరీరం పశుప్రవృత్తితో నిండివుండి వెర్రిపోకడలు పోతూంటుంది. కనుక దాన్ని నిరంతరమూ అదుపులో ఉంచుకొంటూండాలి.

5.ఆధునిక యుగం లైంగిక యుగం. ప్రచార సాధనాలైన సినిమా, పత్రికలు మొదలైనవి నరదేహాన్ని - విశేషంగా స్త్రీదేహాన్ని - కామపూరితంగా ప్రదర్శించి సొమ్ము చేసికొంటూంటాయి. లోకంలో స్త్రీ పురుషులు ఒకరి దేహాన్నొకరు కామదృష్టితో చూస్తూంటారు. కాని క్రైస్తవులమైన మనకు దేహంపట్ల - అది పురుష దేహమైనా స్త్రీ దేహమైనా - పవిత్ర భావాలుండాలి. అది వోనాడు ఉత్థానమై దేవుని సన్నిధిని చేరేది. ఈ లోకంలో ఉండగానే దేవుని ఆత్మకు ఆలయంగా వొప్పేది. ఈలాంటి తనువుని మనం దేవుని ఆలయంగానే చూడాలి. ఇంకా, దేవుని మందిరమైన ఈ శరీరాన్ని వ్యభిచారంతో కళంకితం చేయకూడదు. పౌలు కొరింతీయులకు వ్రాస్తూ దేహంతోను పాపం చేయవద్దు, దేహంలోను పాపం చేయవద్దు అని హెచ్చరించాడు - 1కొ 6,18-19.
6.ఉత్తాన క్రీస్తు మన ఉత్తానానికి మాదిరిగాను కారణంగాను ఉంటాడని చెప్పాం. ఉత్థాపిత మాతయైన మరియకూడ మనకు ప్రేరణంగా ఉంటుంది. కేవలం మానవమాత్రురాలైన ఆ తల్లి ఉత్తానమై యిపుడు మోక్షంలో ఉంది. ఆమెకు అబ్బిన భాగ్యమే ఓనాడు మనకూ అబ్బుతుంది. ఆమె పరలోకంలో ఉండి మనలను తనచెంతకు పిలుస్తుంది. తన శరీరంలాగే మన శరీరంగూడ మహిమను పొందుతుందని మనకు ఆశ పుట్టిస్తుంది.
7.శరీరంలాగే ఈ లోకంకూడ చెడ్డదికాదు, మంచిది. అది నాశంకాదు, మహిమను పొంది క్రొత్తరూపం తాలుస్తుంది. కనుక ఈ లోకాన్నీ ఇక్కడి భౌతిక వస్తువులనూ

విలువతో చూడాలి. కొందరు భ్రాంతపడినట్లుగా ఈ లోకం మాయకాదు. మనం లోకంలోని వివిధ రంగాల్లోకి ప్రవేశించి కృషి చేయాలి, విజయాలు సాధించాలి. ఈ లోకమంతా యిప్పడే ఉత్థానక్రీస్తు తేజస్సుతో భాసిల్లుతూంది. అతనివైపు ఆకర్షితమౌతుంది. మన శరీరంలాగే అదికూడ కడన మహిమను పొందుతుంది. ఈలాంటి లోకంలో జీవించడం భాగ్యం అనుకోవాలి. మనకు కర్మవాదం పనికిరాదు. నిరుత్సాహ భావాలు కూడవు. కష్టే ఫలి అని నమ్మాలి.

7.రెండవ రాకడ

క్రీస్తు లోకాంతంలో మళ్ళా రెండవమారు విజయం చేసి జనులందరికీ న్యాయతీర్పు తీరుస్తాడు. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1. బైబులు భావాలు
1. రెండవ రాకడను గూర్చిన వేదవాక్యాలు

తొలిరోజుల్లోని క్రైస్తవులు క్రీస్తు మళ్లా తమ జీవితకాలంలోనే తిరిగివస్తాడని నమ్మారు. ఆనాటి క్రైస్తవ జీవితంలో ఈ నిరీక్షణం ముఖ్యాంశంగా ఉండేది. కాని వాళ్ళ భావించినట్లుగా ప్రభువు రెండవసారి తిరిగిరాలేదు. ఈనాడు మనం క్రీస్తు ఎప్పడో లోకాంతంలో తిరిగివస్తాడని ఎంచుతాం. అతడు మన జీవితకాలంలో రానేరాడని తలుస్తాం. కనుక "ఈనాటి మన నమ్మకం తొలిరోజుల్లోని క్రైస్తవుల నమ్మకానికి కేవలం భిన్నమైంది.

మార్కుసువార్త ప్రభువు రెండవరాకడను ఈలా వర్ణించింది. "మనుష్యకుమారుడు మహాశక్తితోను మహిమతోను మేఘారూఢుడై రావడాన్ని ప్రజలంతా చూస్తారు. అతడు దూతలను పంపి భూలోకంనుండి ఆకాశంవరకు నలుదిశలనుండి తానెన్నుకొనినవారిని ప్రోగుజేయిస్తాడు" 13,26-27. ఈ సంఘటనాన్నే పౌలు మొదటి తెస్సలోనీయుల జాబులో ఈలా వర్ణించాడు. "అపుడు ఆజ్ఞారావము ప్రధాన దేవదూత పిలుపు, దేవుని బాకాధ్వని విన్పిస్తాయి. ప్రభువు స్వయంగా పరలోకంనుండి దిగివస్తాడు. క్రీస్తుని నమ్మి మరణించినవారు ముందుగా పునరుత్ధానమౌతారు. పిమ్మట అప్పటికింకా సజీవులై ఉన్నవారు ప్రభువుని వాయుమండలంలో కలసికోవడానికి ఆ ఉత్ధానమైన వారితొపాలు మేఘాలపై ఎక్కిపోతారు. కనుక మనం సదా ప్రభువుతోనే ఉంటాం" - 1తెస్స 4,16-17.

ఈ వేదవాక్యాలు ప్రభువు రెండవరాకడను దర్శనాల భాషలో వర్ణించాయి. ఇక్కడ చెప్పిన అంశాలన్నిటినీ రచయితలు వర్ణించిన వాటిని వర్ణించినట్లుగా మనం స్వీకరించనక్కరలేదు. ఉదాహరణకు ప్రభువు మేఘాలమిూద దిగిరావడం, దేవదూతలు బాకా వూది ప్రజలందరినీ ప్రోగుజేయడం, చనిపోయినవారు మేఘాలనెక్కి దేవుని దగ్గరికి రావడం మొదలైన అంశాలు దర్శనశైలికి సంబంధించినవి. వీటిని మనం గ్రహించనక్కరలేదు. ప్రభువు నరులకు తీర్పు జెప్పడానికి రెండవసారి వేంచేసినవస్తాడనేది ఈ వాక్యాల్లోని ముఖ్యాంశం. మనం ఈ సత్యాన్ని స్వీకరిస్తే చాలు.

2. తిరుసభలోనుండే ప్రభువు దర్శనమిస్తాడు

మనం మామూలుగా క్రీస్తు లోకాంతంలో మోక్షంపెద్దది దిగివస్తాడు అనుకొంటాం. నూత్న వేదవాక్యాలుకూడ ఈ బ్రాంతిని పుట్టిస్తాయి, కాని యథార్థంగా ప్రభువు యుగాంతంలో ఎక్కడో ఆకాశంనుండి దిగిరాడు. అతడు ఇదివరకే తిరుసభలో నెలకొని ఉన్నాడు. అతడే యిప్పుడు మనకు దర్శనమిస్తాడు. కనుక అతడెక్కడో బయటినుండి రాడు. తిరుసభలోనుండే మనకు దర్శనమిస్తాడు. పైగా మనం "రెండవరాకడ” అంటాం. అసలిక్కడ "రాకడ” అనేది లేనేలేదు. ప్రభువు మనకు కన్పిస్తాడు, అంతే కనుక క్రీస్తు మళ్ళా రెండవసారి వేంచేస్తాడు అని చెప్పడం కంటె, అతడు మళ్ళా రెండవసారి తిరుసభలోనుండి మనకు దర్శనమిస్తాడు అని చెప్పడం మెరుగు. కాని మన మనుష్యభాషలో, మనకు సులభంగా అర్థంకావడంకోసం, అతడు రెండవసారి వేంచేస్తాడని చెప్పకొంటాం.

ప్రభువు ఉత్తానమైనంక తిరుసభను వదలిపెట్టలేదు. నిరంతరమూ దానిలోనే వసిస్తూంటాడు. కనుకనే మత్తయి సువార్తలో అతడు "లోకాంతంవరకు సదా నేను విూతో వుంటాను" అని పల్కాడు- 28,20. అనగా అతడు నిరంతరమూ తిరుసభలో వసిస్తూంటాడు. మోక్షారోహణానంతరం క్రీస్తు దశ మారుతుందేకాని తావు మారదు. కనుక అతడు పూర్వమెక్కడున్నాడో అక్కడే ఉంటాడు. మోక్షారోహణానంతరం అతడు నరుల కంటికి కన్పించడు. ఐనా అతడు నరలోకాన్ని వీడిపోలేదు. తిరుసభను వదలిపోలేదు. ప్రేమ, భక్తి విశ్వాసాలతో తన దగ్గరికి వచ్చే భక్తులకు క్రీస్తు తిరుసభలోనుండి నిరంతరం దర్శనమిస్తూనే ఉంటాడు. మబ్బులు కమ్మివన్నదినాన ఆకాశంలో సూర్యుడు కన్పించడు. కాని మనకంటికి కన్పించకపోయినా సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడనుకోవాలి. అలాగే క్రీస్తు నేడు మనకంటికి కన్పింపకపోయినా తిరుసభలో ఉన్నాడనుకోవాలి. ఇంకా సూర్యబింబం ఎక్కడినుండో ఆకాశంలోకి రాదు. అది నిరంతరమూ అక్కడే ఉంటుంది. అలాగే క్రీస్తు లోకాంతంలో ఎక్కడినుండో మనదగ్గరికి రాడు. అతడు నిరంతరమూ మన మధ్యలో, తిరుసభలోనే ఉంటూంటాడు.

మనం సూర్యుణ్ణి నేరుగా చూడలేం. చూస్తే మనకండ్ల మాడిపోతాయి. మేఘంమాటున ఉన్న సూర్యబింబాన్ని మాత్రమే మనం దర్శింపగలం. అలాగే మహా తేజోమూర్తియైన ఉత్తాన క్రీస్తుని మనం నేరుగా చూడలేం. ఈ జీవితంలో విశ్వాసపు తెరలు అడ్డంబెట్టుకొని మాత్రమే అతన్ని దర్శిస్తాం. లోకాంతంలో ఇక ఈ విశ్వాసంతో అవసరంలేదు. అప్పడతన్ని నేరుగా దర్శిస్తాం.

క్రీస్తు నేడు తిరుసభలో చాల రూపాల్లో ప్రత్యక్షమౌతూంటాడు. అతడు క్రైస్తవ సమాజంలో ఉంటాడు. కనుకనే ప్రభువు నా పేరుమీదిగా ఇద్దరు ముగ్గురు సమావేశమైనకాడ నేనూ ఉంటానని చెప్పాడు- మత్త 18,20.అతడు పేదసాదల్లోను ఆకలిదప్పు అనుభవించే వాళ్ళలోను ఉంటాడు. కనుకనే ఈనా సోదరుల్లో అత్యల్పడైన ఒకనికి మిరు చేసింది నాకు చేసినట్లే భావిస్తానని పల్మాడు - మత్త25,40. అతడు తన శిష్య సమూహంలో ఉంటాడు. కావననే లోకాంతంవరకు నేను విూతో ఉంటానని చెప్పాడు - మత్త28,20. అతడు జ్ఞానస్నానంపొందిన క్రైస్తవుల్లో ఉంటాడు. కావననే విశ్వాసంద్వారా క్రీస్తు మీ హృదయాల్లో వసిస్తుంటాడు అని పౌలు పేర్కొన్నాడు - ఎఫే 3,17. భక్తులు వేదగ్రంధాలు చదివేకాడ అతడే దివ్యగ్రంథ బోధను విన్పిస్తూంటాడు. అన్నిటికంటె అధికంగా అతడు దివ్యసత్రసాదంలో ఉంటాడు. ఈ సాన్నిధ్యాలేవి మనకంటికి కన్పించవు. ఐనా మనం విశ్వాసంతో ఈ సాన్నిధ్యాలను నమ్ముతుంటాం. ఐనా ఈ సాన్నిధ్యాలన్నీ తాత్కాలికమైనవే. కనుక ఇవన్నీ అంతరించిపోతాయి. అతడు చివరిసారిగా తిరుసభలోనుండి చూపించే సాన్నిధ్యం మహా తేజోవంతమైంది. విశ్వాసపు తెరలు అడ్డం పెట్టుకోకుండానే ఆ తేజోవంతమైన సాన్నిధ్యాన్ని మనం దర్శించవచ్చు. అదే రెండవ రాకడ.

3. మన మరణ సమయంలోనే ప్రభుదర్శనం

పూర్వవేదశాస్త్రులు ప్రభువు లోకాంతంలో రెండవమారు వేంచేసివస్తాడని చెప్పారు. నూత్నవేదంలో కొన్నివాక్యాలు కూడ ఈ భావాన్ని సమర్ధిస్తున్నట్లు కన్పిస్తాయి. కాని నేటి వేదశాస్తులు మన మరణమే మనకు రెండవరాకడ ఔతుందని చెప్తున్నారు. ప్రభువు లోకాంతంలో వస్తే అప్పటికి బ్రతికివున్న కొద్దిమందికి మాత్రమే ఆరాకడ అర్థవంతంగా ఉంటుంది, అంతకుముందు చనిపోయిన అసంఖ్యాక ప్రజలకు ఆరాకడ ముఖ్యమైంది కాజాలదు. అది మన జీవితకాలంలో జరుగదు కనుక మన మెవ్వరమూ దాన్ని పట్టించుకోం.

అందుకే ఆధునిక వేదశాస్తులు రెండవరాకడ మన మరణకాలంలోనే జరుగుతుందని భావిస్తున్నారు. ఈలా భావిస్తే అది మనకు ముఖ్యమైన సంఘటనం అవుతుంది. మన మందరమూ మన మరణ సమయంలో ప్రభువుని కలుసుకోవాలని యెంచితే, ఆ గడియకోసం చిత్తశుద్ధితో వేచిఉంటాం. ప్రతివాడూ తన మరణానికీ, ఆ మరణంలో ప్రభువుని కలుసుకోవడానికీ జాగ్రత్తగా సంసిద్దుడౌతాడు. ఐనా మన మరణకాలమే మనకు రెండవరాకడ ఔతుంది అనేది కేవలం వేదశాస్త్రు అభిప్రాయం మాత్రమే. అది వేదసత్యంకాదు. తిరుసభ ప్రభువు మళ్ళా రెండవసారి వస్తాడని మాత్రమే చెప్తుంది. ఎప్పడు వస్తాడు, ఏలా వస్తాడు అనే విషయాలను గూర్చి అధికారపూర్వకంగా ఏమిూ చెప్పదు.

నూత్నవేదంలో కొన్నివాక్యాలు ప్రభువు లోకాంతంలో వస్తాడని చెప్తాయి. కాని అతడు మనమరణకాలంలోనే వస్తాడని సూచించే వాక్యాలుకూడ లేకపోలేదు. అలాంటివాటిని కొన్నిటిని పరిశీలిద్దాం. యూదుల సైఫనును రాళ్ళతో కొట్టి చంపగా అతడు పవిత్రాత్మతో నిండినవాడై పరలోకంవైపు చూచాడు. అతని దేవుని మహిమా, దేవునికి కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండడమూ కన్పించాయి. అతడు చూడండి! పరలోకం తెరవబడి ఉంది. మనుష్యకుమారుడు దేవుని కుడిప్రక్కన నిలబడి ఉన్నాడు" అని పల్మాడుఅచ 7,55-56. ఈ వాక్యాలనుబట్టి సైఫను లోకాంతంలో గాక, తాను మరణించిన వెంటనే ఉత్థానక్రీస్త్రుని దర్శించాడు అనుకోవాలి. అతడు ఇక్కడ దర్శించింది ప్రభువు రెందవరాకడనే. అది అతని మరణకాలంలోనే జరిగింది. ఈలాగే మంచిదొంగ కూడ తాను మరణించిన వెంటనే ప్రభువు రెండవరాకడను దర్శించాడు. అలా దర్శించి ఉండకపోతే “నేడే నీవు నాతో కూడ పరలోకం ప్రవేశిస్తావు” అని క్రీస్తు అతనితో చెప్పిన మాటలకు అర్ధం లేదు-లూకా 23,43.

      పై వాక్యాలనుబట్టి లూకా రెండవరాకడ అనేది మన మరణకాలంలోనే జరుగుతుందని భావించాడు అనుకోవాలి, యోహానుకూడ ఈలాగే భావించాడు. అతని సువిశేషంలో క్రీస్తు తన శిష్యులతో "నా తండ్రి గృహంలో అనేక నివాసస్థలాలున్నాయి. నేను విూకు ఓ నివాసస్థలాన్ని సిద్ధం చేయడానికి పోతున్నాను. నేను వెళ్ళితే మికు ఓ నివాసస్థలాన్ని సిద్ధంచేసి మళ్ళా వస్తాను" అని చెప్పాడు - యోహా 14,1–4 ఈ వాక్యాల సందర్భాన్ని జాగ్రత్తగా గుర్తించాలి. ప్రభువు తాను వెళ్ళిపోతానని చెప్పగా శిష్యులు కలవరపడ్డారు. వాళ్ళ విచారాన్ని తొలగించడానికి ప్రభువు పై వాక్యాలు చెప్పి వాళ్ళను ఓదార్చాడు - కనుక అతడు శీఘ్రమే తిరిగివచ్చి వాళ్ళను తనచెంతకు తీసికొనిపోవాలి. అప్పడుగాని వాళ్ళకు ఓదార్పు కలుగదు. అతడెప్పడో లోకాంతంలో వస్తే వాళ్ళకు ఓదార్పేమిూ కలుగదు. కనుక ఇక్కడ "నేను మళ్ళా తిరిగి వస్తాను మిమ్ము   నాచెంతకు తీసికొని పోతాను" అనే మాటలు వాళ్ళ జీవితకాలానికి వర్తించాలి. అందుచేత ఇక్కడ ప్రభువు మళ్లావచ్చే అతని ఉత్ధానం నుండి అపోస్తలుల మరణం వరకు ఉన్న కాలమైయుండాలి. పన్నెండుమంది శిష్యుల్లో ప్రతివాడూ తాను చనిపోయేపుడే ప్రభువు రెండవ రాకడను దర్శించిఉండాలి.
       ఈలా ఈ వేదవాక్యాలు మన మరణకాలంలోనే మనం ప్రభువు రెండవరాకడను చూస్తామని బోధిస్తున్నాయి. కాని ఈ వాక్యాలు లోకాంతంలో ప్రభువు వేంచేసి రాడని చెప్పవు. మనం మరణకాలంలో చూచే రెండవరాకడనే మళ్ళా లోకాంతంలో కూడ చూస్తాం అవి రెండు సంఘటనలు కావు, ఏకసంఘటనమే. రెండవరాకడ మన మరణకాలంలో ప్రారంభమై లోకాంతంవరకు కొనసాగుతుంది. మన వ్యక్తిగతమైన రెండవరాకడా,లోకాంతంలో జరిగే సాధారణ రాకడా ఒకదానితో ఒకటి కలసిపోతాయి.

2. రెండవరాకడకు సంబంధించిన కొన్ని అంశాలు

   1. ప్రభువు లోకాంతంలో ఎప్పడు వేంచేసి వస్తాడు? మన మరణం ఎప్పడు

వచ్చేదీ కొంతవరకైనా వూహించవచ్చు. కనుక మనకు వ్యక్తిగతమైన రెండవరాకడ ఎప్పడు జరుగుతుందో కొంతవరకైనా ముందుగానే తెలిసికోవచ్చు. కాని లోకాంతంలోని సాధారణపురాకడ ఎప్పడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. క్రీస్తు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "ఆ దినం ఎప్పడు వస్తుందో నా తండ్రికి మాత్రమే తెలుసు. కుమారునికి గాని పరలోకంలోని దూతలకుగాని మరెవ్వరికిగాని ఆ గడియ తెలియదు” అని వాకొన్నాడు - మత్త 24,36. కనుక ఆయంత్యదినాన్ని గూర్చి పుకార్లు పుట్టించడం వ్యర్ధప్రయాస మాత్రమే ఔతుంది.

2. ఈ లోకం ఏలా ముగుస్తుంది? క్రీస్తు రెండవమారు విజయం చేసినప్పడు ఈ భౌతికలోకం నాశమైపోతుందనీ, అది అగ్నివల్ల దగ్ధమై పోతుందనీ పూర్వవేదశాస్తులు భావించారు, దీనికి పేత్రు రెండవ జాబులోని వేదవాక్యాలను ఆధారంగా చూపించారు. "ప్రభుదినం దొంగలా వస్తుంది, ఆ రోజున భయంకర ధ్వనితో ఆకాశం అంతరిస్తుంది. గ్రహతారకాదులు దగ్ధమై నశిస్తాయి. సర్వవస్తు సంచయంతోపాటు భువి అదృశ్యమౌతుంది. నీతికి నిలయమైన క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానం చేస్తాడు" - 2 పేత్రు 3,1013. కాని ఈ వేదవాక్యాలు దర్శనాల భాషలో ఉన్నాయి. కనుక మనం వీటిని ఉన్నవాటిని ఉన్నట్లుగా గ్రహించనక్కరలేదు. ప్రభువు ఆకస్మాత్తుగా రెండవమారు వేంచేసి వస్తాడనే ఈ వాక్యాల భావం. అతడేలా వస్తాడు, అగ్నితో వస్తాడా అనే ప్రశ్నలకు ఈ వాక్యాలు జవాబు చెప్పవు,

నేటి వేదశాస్రులు ఈ యంశాన్ని గూర్చి ఈలా బోధిస్తున్నారు. క్రీస్తు రెండవరాకడతో ఈ ప్రస్తుత ప్రపంచమేమో ముగుస్తుంది. కాని అది అగ్నివలన కాలిపోదు. మార్పును మాత్రం చెందుతుంది. మన భౌతికదేహం ఆత్మవలన మార్పు చెందుతుంది, అలాగే క్రీస్తు రెండవరాకడ వలన ఈ భౌతిక ప్రపంచంకూడ మార్పు చెందుతుంది. కాని యిలా మారిన ప్రపంచం స్వరూపం ఏలా ఉంటుందో ఎవరికీ తెలియదు.

3. క్రీస్తు రెండవసారి వచ్చాక ప్రస్తుత తిరుసభ ఏమౌతుంది? బైబుల్లో దైవరాజ్యమనేది పెద్ద భావం. పరలోకంలోని మోక్షమూ భూలోకంలోని తిరుసభా కలసి దైవరాజ్యమౌతాయి. ఇక, క్రీస్తు రెండవరాకడతో భూలోకంలోని తిరుసభ ఏమౌతుంది? తిరుసభ అంటే క్రైస్తవులే. కనుక క్రీస్తు రెండవరాకడతో తిరుసభ తన భౌతిక జీవితాన్ని ముగించి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభిస్తుంది. లోకాంతం తర్వాత ప్రస్తుత తిరుసభ అనేది ఉండదు. మహిమను పొందిన తిరుసభ మాత్రం ఉంటుంది. కనుక తిరుసభ ఏనాటికీ నాశంకాదు. అది లోకాంతంలో ఆధ్యాత్మిక తిరుసభగా మారిపోతుంది. పౌలు ఈ యంశాన్ని గూర్చి యీలా చెప్పాడు. "అప్పడు అంతం వస్తుంది. క్రీస్తు పాలకులను అధికారులను శక్తులను అందరినీ జయించి రాజ్యాన్నితండ్రియైన దేవునికి అప్పగిస్తాడు” - 1కొ15,24. ఇక్కడ పౌలు పేర్కొన్న"రాజ్యం" తిరుసభే. లోకాంతంలో తండ్రి సమస్తాన్ని పరిపాలిస్తాడు-1కొ15,28. కనుక తిరుసభ ఆధ్యాత్మికంగా మారిపోయి కలకాలమూ తండ్రి ఆధీనంలో ఉండిపోతుంది.

4. క్రీస్తు రెండవమారు మహిమతో వేంచేసివచ్చి ఏంచేస్తాడు? అతడు మృతులమైయున్న మనలను జీవంతో లేపుతాడు. మనకు సాధారణ తీర్పు తీర్చి బహుమతినో లేక దండననో విధిస్తాడు. మనలనూ ఈ భౌతిక సృష్టినీ మహిమపరుస్తాడు. రెండవరాకడ అనేది లోకాంతంలో జరిగే అనేక సంఘటనల్లో ఒకటి మాత్రమేకాదు. అతి ముఖ్యమైన సంఘటనం. దానితో పూర్వవేదకాలం నుండి వస్తూన్నప్రస్తుత రక్షణ చరిత్ర ముగుస్తుంది. ఈ లోకంలో భౌతిక తిరుసభ యాత్ర కూడ ముగుస్తుంది. క్రీస్తు తర్వాత నూత్న రక్షకుడెవడూ రాడు. తిరుసభ ప్రజలను రక్షించడమనేది కూడ ఉండదు. క్రీస్తు తన రాజ్యాన్ని పరిపూర్ణం చేసి తండ్రికి సమర్పిస్తాడు. ఆ దినం కొరకు మనమంతా భక్తిశ్రద్ధలతో వేచి ఉండాలి.

ప్రార్థనా భావాలు

1. క్రైస్తవులమైన మనం ప్రధానంగా నిరీక్షణతో జీవించేవాళ్ళం. మన ప్రభువైన క్రీస్తు మరణకాలంలోను లోకాంతంలోను గూడ వేంచేసి వస్తాడు. అతడు మనలను మహిమ పరుస్తాడు. ఈ లోకంలో మన మనుభవించే శ్రమలకూ పడే కష్టాలకూ విలువ ఉంటుంది. అసలు ఇప్పడు మనం పడే కష్టాలు తర్వాత మనకు ప్రత్యక్షమయ్యే మహిమతో ఎంతమాత్రం పోల్చదగినవికావు. అనగా ఇప్పటిశ్రమలకు అప్పడు నూరంతలు ఫలితం పొందుతాం - రోమా 8,18. కనుక మనం ఆ యంత్యదినంకోసం ఆతురతతో వేచివుండాలి.

2. క్రీస్తు సామెతల్లో కొన్ని మనం అతని రెండవ రాకడకొరకు కనిపెట్టుకొని ఉండాలని హెచ్చరిస్తున్నాయి. "యజమానుడు సాయంకాలమో అర్థరాత్రివేళలోనే కోడికూసే వేళనో ప్రాతఃకాలాన్నో యెప్పడు వస్తాడో విూకు తెలియదు. కనుక విూరు మేల్కొనివుండండి" - మార్కు 13,35. కనుక మనం భక్తిగల క్రైస్తవ జీవితం జీవిస్తూ నిరంతరం మేల్కొనివుండాలి. అంత్యదినాన ప్రభువు వచ్చినపుడు మనం అవివేకవతులైన కన్యల్లాగ సత్ర్కియలనే చమురులేకుండా ఉండకూడదు. వివేకవతులైన కన్యల్లాగ మంచి పనులనే చమురుచేకూర్చుకొని ఉండాలి - మత్త 25,8-9.

3.రెండవ శతాబ్దానికి చెందిన టెర్టూలియన్ అనే వేదశాస్తి రైతు పంటకోసం వేచివున్నట్లుగా, యుద్ధం జేసే సైనికులు యుద్దాంతంకోసం వేచివున్నట్లుగా, క్రైస్తవుడు ప్రభువు రాకడకోసం వేచివుండాలని వ్రాసాడు. ప్రభుని భక్తితో సేవించేవాళ్ళకు అతని రాకడ ఎంతో ఆనందాన్నిస్తుంది. కనుక వాళ్లు ఆ సుదినంకొరకు ఉవ్విళూరుతూండాలి.

4.ఈ లోకంలో ప్రభువుకొరకు వేచివున్నపుడు మనకు దివ్యబలాన్నీ శక్తినీ దయచేసేవి దేవద్రవ్యానుమానాలు. వీటిల్లోగూడ దివ్యసత్ర్పసాదం విశేష బలాన్ని చేకూర్చిపెడుతుంది. అది మనకు ప్రభువు దివ్యజీవనాన్ని ప్రసాదిస్తుంది. “ఈ రొట్టెను తిని ఈ పాత్రనుండి త్రాగినపుడెల్ల, ప్రభువు రెండవసారి వచ్చేవరకూ మనం అతని మరణాన్ని ప్రకటిస్తూంటాం." - 1కొ 11,25, కావున భక్తులు ఈ దివ్యభోజనాన్ని యోగ్యంగా స్వీకరిస్తూ ప్రభువు రెండవ రాకడకు సిద్ధమౌతూండాలి.

8. క్రీస్తు మనకు ఓడలంగరు

క్రైస్తవుడు ప్రధానంగా నిరీక్షణతో జీవించేవాడు. ఐనా అతడు ఈ లోకంనుండి తప్పించుకోవాలని కోరుకోదు, ఇక్కడ చక్కగా కృషిచేసి ఈ భౌతిక ప్రపంచాన్ని వశం చేసుకోవాలని కోరుకొంటాడు. ఈ కృషివల్లనే అతనికి రక్షణం లభిస్తుంది. ఈ చివరియధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. క్రైస్తవనీకి నిరీక్షణం ప్రధానం

క్రైస్తవుడు ప్రధానంగా ఆశించేదేమిటి? తన మరణకాలంలో ఉత్తానక్రీస్తుని కలసికొని ఆ ప్రభువునుండి బహుమతిని పొందాలనే. “మనం పరలోక పౌరులం. దివి నుండి మన రక్షకుడు ప్రభువుఐన యేసుక్రీస్తు రాకకై ఆతురతతో వేచివుంటాం-ఫిలి 3,20. క్రీస్తు వేంచేసి వచ్చినపుడు మనం అతని మహిమలో పాలుపొందుతాం. అతడు మనకు నిత్యజీవాన్నీ మోక్షభాగ్యాన్నీ దయచేస్తాడు. కనుక మనం ప్రధానంగా నిరీక్షణంతో జీవిస్తాం.

పదిమంది కన్నెలు చమురుతోను దిటివీలతోను పెండ్లి కొమారుని రాకడకొరకు వేచివున్నారు - మత్త25,10. ఈ కన్నెలు భక్తి విశ్వాసాలుగల క్రైస్తవులందరికీ పోలికగా ఉంటారు. మనం ఈ లోకంలో వసిస్తున్నా ఈలోకానికి కాక పరలోకానికి చెందినవాళ్ళం. రానున్న మరో నగరం కోసం వేచివుండేవాళ్ళం - హెబ్రే 13,14. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం, దేవుడు ఆయుస్సు దయచేసిన కొలది కొంతకాలంపాటు ఇక్కడ జీవించి పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. కనుక ఈ మంటి కట్టిపెట్టుని ఉండిపోవడం, ఈ లోకమే శాశ్వత మనుకోవడం, ఈ లోక వాంఛలకు లొంగిపోవడం ఉత్తమ క్రైస్తవుని లక్షణం కాదు.

2. క్రైస్తవుడు ఈ లోకంలో కృషిచేయాలి

మనం ఈ లోకంలో కొంతకాలంపాటు మాత్రమే ఉంటాం. ఐనా ఇక్కడున్నంతకాలం ఈ ప్రపంచంలో చక్కగా కృషిచేయాలి. కొందరు భావించనట్లు ఈ జగత్తు మాయకాదు. ఇది యథార్థమైన లోకం. నరుడు ఈలోకంలో కృషి చేయాలనే దేవుని కోరిక, అతడు ఆదిమానవులను దీవించి "మిరు చాలమంది బిడ్డలను కని వృద్ధి చెందండి. భూమండల మంతటా నివసించి దానిని వశం చేసికొనండి" అని చెప్పాడు - ఆది 1,28. కనుక ఈ విశ్వాన్నీ దానిలో దాగివున్న శక్తులనూ వశం జేసికోవడానికి నరులు నిరంతరమూ కృషిచేయాలి. ఇది పాపపులోకమైనా దేవుని కుమారుడు దీన్ని రక్షించాడు. అతడు దీనిలో నెలకొని ఉంటాడు.

ఈ లోకంలో మన కృషి స్వార్థరూపంలో ఉండకూడదు. ప్రేమ సేవలరూపంలో ఉండాలి. కేవలం మనకొరకు మనం జీవిస్తే ప్రయోజనంలేదు. పదిమంది మేలుకొరకు జీవించాలి. ప్రభువు ఈలోకంలోని పేదసాదల్లో బాధామయ జీవుల్లో తానూ బాధలనుభవిస్తూంటాడు. కనుకనే ఇక్కడ అత్యల్పులైన వారికి చేసిన ఉపకారాన్ని తనకు చేసినట్లే భావిస్తాడు. వాళ్ళను పట్టించుకోనప్పడు తన్ను పట్టించుకోనట్లే భావిస్తాడు - మత్త 25,40-45.

చాలమంది భగవంతుణ్ణి పూజిస్తే చాలు తోడినరుణ్ణి పట్టించుకోనక్కరలేదులే అనుకొంటారు. ఇది పొరపాటు. భగవంతుడు తరచుగా తోడినరుల్లో దర్శనమిస్తాడు. కనుక అతన్ని తోడిమానవుల్లో గుర్తిస్తుండాలి. ఆ దేవుణ్ణి ప్రేమించే హృదయంతోనే తోడి మానవులను గూడ ప్రేమించాలి.

మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వశం చేసికోవడానికి కృషిచేయాలి. తోడినరులను సేవించి ప్రేమించడానికీ కృషిచేయాలి. ఈలా చేసేవాళ్ళు ఈ లోకంలో దేవుని సృష్టిని కొనసాగించుకొని పోతూంటారు. తామూ ఆ సృష్టికర్తతో కలసి పని చేస్తూంటారు.

3. లోకకృషివల్లనే క్రైస్తవునికి రక్షణం

        ఈ లోకంలో చక్కగా కృషిచేసిన వాళ్లకి మోక్షబహుమతి లభిస్తుంది. ప్రభువు బాగా కృషిచేసిన మంచి సేవకులిద్దరినీ మెచ్చుకొని "విూరు విూ యజమానుని ఆనందంలో పాలు పంచుకొనండి" అని చెప్పాడు - మత్త 25,21-23. కాని అతడు బాగా కృషిచేయని మూడవ దాసుని శిక్షించి వెలుపలి చీకటిలోనికి త్రోయించాడు-25, 30 పిండికొలది రొట్టె, ఇక్కడ కృషిచేసినదాన్నిబట్టి రక్షణ ఫలాన్ని పొందుతాం. ఇక్కడ శ్రమపడి పనిచేయడాన్నే నూత్నవేదం దేవుని చిత్తప్రకారం జీవించడమనీ, ఆజ్ఞలను అనుసరించడమనీ, ప్రేమను పాటించడమనీ పేర్కొంటుంది.

భగవంతుడు నరునికి కృషి, సేవ, ప్రేమ, స్వాతంత్ర్యం, పావిత్ర్యం తన్ను పూర్ణ హృదయంతో ప్రేమించడం మొదలైన దొడ్డ విలువల నిచ్చాడు. మనం ఈ లోకంలో స్వయంకృషిచేసి ఈ విలువలను ఫలసిద్ధికి తీసికొనిరావాలి. వాటిని పరిపూర్ణం చేసికోవాలి. ఈ స్వయంకృషే కడన మనం ఉత్తాన క్రీస్తుని కలుసుకొనేలా చేస్తుంది. ప్రభువు దర్శనంకోసం ప్రేమతో వేచివుండేవాళ్ళ కందరికీ అతడు నీతికిరీటాన్ని బహూకరిస్తాడు -2తిమో 48. మంచి క్రైస్తవుడు నిరంతరమూ "యేసుప్రభూ రమ్మ" అనే భావంతో

జీవిస్తూంటాడు - ప్రక 22,20.

ప్రార్థనా భావాలు

1. ఈ లోకంలో మనం ఇటు నేలవైపు చూస్తూ నడవాలి. అటు పరలోకంవైపు చూస్తూగూడ నడవాలి, ఈ రెండు దృక్పథాలు ముఖ్యమే. ఈ లోకం యథార్థమైంది. ఈ మంటిపై జీవించినంతకాలం మనం ఇక్కడ కృషిచేయక తప్పదు. ఐనా ఈ ప్రపంచం శాశ్వతమైంది కాదు. శాశ్వతలోకం మరొకటుంది. కనుక మనం నిరంతరం దానివిూద దృష్టినిల్పి జీవించాలి. ఈలా ఇహపరాలమిూద దృష్టికలవాడే ఉత్తమ క్రైస్తవుడు. కాని నిత్యజీవితంలో ఈ ఇహపరాలను రెండింటినీ విలువతో చూడ్డం ఎంతమాత్రం సులభం కాదు. అధిక సంఖ్యాకులు ఇహాన్ని ప్రేమించి పరాన్ని అశ్రద్ధ చేస్తారు. స్వల్పసంఖ్యాకులు పరాన్ని ప్రేమించి ఇహాన్ని అశ్రద్ధ చేస్తారు. ఇవి రెండు అపమార్గాలే.

2. ఉత్తానక్రీస్తు దర్శనం కోసం నిరీక్షిస్తూండడమే క్రైస్తవ జీవిత సారాంశం. మనం ఆ క్రీస్తమిూద ఆశపెట్టుకొని జీవించేవాళ్ళం. మన బహుమతి అతనినుండే హెబ్రేయుల జాబు ఈ క్రీస్తునీ ఓడ లంగరుతో పోల్చింది - 6, 19. లంగరు వేసిన ఓడ కొట్టుకొనిపోక స్థిరంగా నిలుస్తుంది. అలాగే క్రీస్తుని నమ్మినవాళ్లు స్థిరంగా నిలుస్తారు. మనం ఓడమైతే అతడు మనకు లంగరు. మరణం, తీర్పు, ఉత్తరించే స్థలం మొదలైన మన కడగతులన్నీ కూడా ఉత్తాన క్రీస్తుమిూది నమ్మకంవల్లనే ఫలసిద్ధిని పొందుతాయి. మన అంత్యగతి అతడే.

ప్రశ్నలు

అధ్యాయం - 1

1. మరణం మనలను యాత్రిక దశనుండి శాశ్వతదశకు ఏలా తీసికొనిపోతుంది?
2. మరణం ఏలా పాపఫలితమౌతుందో వివరించండి.
3. "క్రీస్తు మరణం మన మరణాన్ని పూర్తిగా మార్చివేసింది" - ఎట్లో తెలియజేయండి.
4. గ్రెగోరీ భక్తుడు మృత్యువును చెరసాలలో ఉన్న వ్యక్తితోను, గర్భస్థ శిశువుతోను, కాయగా మారనున్న పిందెతోను పోల్చడంలో భావమేమిటి?

5. "ప్రభూ! మీ విశ్వాసులకు ఈ జీవితం మారుతుందేకాని అంతంకాదు" అనే వాక్యం మనం మృత్యుభయం జయించడానికి ఏలా ఉపయోగపడుతుంది
6. ఇంచుమించు చనిపోయి మళ్ళా బ్రతికి బయటపడ్డవాళ్ళ అనుభవం ప్రకారం మృత్యువు భయపడతగింది కాదని ఏలా నిరూపిస్తావు?
7. విశ్వాసులు మంచి మరణానికి తయారుకావడం ఏలా?

అధ్యాయం - 2

1. తీర్పుని గూర్చిన వేదసత్యంలో ఇమిడివున్న మూడంశాలు ఏమిటివి? 2. సాధారణ తీర్పుని సమర్ధిస్తూ వేదశాస్తులు పేర్కొన్న కారణాలు తెలియజేయండి. 3. తీర్పుని గూర్చిన మత్తయి, లూకా, యోహాను భావాలనూ, వాటిల్లోని వ్యత్యాసాలనూ పేర్కొనండి. 4.తీర్చుని భయంకరమైనదాన్నిగా చిత్రించే నూత్నవేద వాక్యాలను పేర్కొనండి. 5. అక్రమ మార్గాలవల్ల లాభాలు గణించేవాళ్ళను జూచి మనంకూడ ప్రలోభానికి గురౌతూంటాం. న్యాయతీర్పుని గూర్చిన భావన మనం ఈ ప్రలోభం నుండి తప్పకొనేలా చేయగలదా? 6. మనం ఈ లోకంలో జీవిస్తుండగానే న్యాయనిర్ణయ దినానికి తయారుకావడం
ఏలా?

అధ్యాయం - 3

1.తొలిమూడు సువిశేషాలు, యోహాను, పౌలు, నరకాన్ని వర్ణించిన తీరును వివరించండి.
2.నరకాగ్ని అంటే యేమిటి?
3. "దైవసాన్నిధ్యాన్నికోల్పోవడమే నరకాగ్నిని గూర్చిన ముఖ్యాంశం" - వివరించండి.
4. "నరకం దేవుడు నరునికి పెట్టే శిక్షకాదు, నరుడు తనకు తానే విధించుకొనే శిక్ష - వివరించండి.
5.నరకం ఏలా శాశ్వతంగా ఉంటుందో తెలియజేయండి.

అధ్యాయం - 4

1. ఉత్తరించే స్థలం అంటే యేమిటి?
2. ఉత్తరించే స్థలాన్ని గూర్చిన వేదసత్యం బైబుల్లో లేకపోయినా అది తొలినాటి క్రైస్తవ సమాజంలో ఏలా వ్యాప్తిలోకి వచ్చింద
3. ఉత్తానక్రీస్తూ, పవిత్రాత్మా ఉత్తరించే స్థలంలోని ఆత్మలను ఏలా శుద్ధి చేస్తారు?
4. ఉత్తరించే స్థలంలోని ఆత్మలకు మనం ఏలా సహాయం చేయగలం?

అధ్యాయం - 5

1.బైబులు మోక్షాన్ని దైవదర్శనంగాను, దైవజ్యోతిగాను, దైవస్పర్శగాను వర్ణిస్తుంది — వివరించండి.
2. మోక్షంలో ఉత్థాన క్రీస్తుద్వారా తండ్రినీ ఆత్మనూ ఏలా దర్శిస్తామో తెలియజేయండి.
3. మోక్షానందం ఎందుకు అందరికీ సమానం కాదు? మోక్షంలో మనం దేవుణ్ణి పూర్తిగా ఎందుకు గ్రహించలేం?
4.మోక్షంలో తోడి పునీతులను ఏలా కలసికొంటామో తెలియజేయండి.

అధ్యాయం - 6

1.ఉత్తానాన్ని గూర్చిన బైబులుబోధలను వివరించండి.
2. మహిమ శరీర లక్షణాలను పేర్కొనండి.
3.ఈ విశ్వంకూడ ఏలా మహిమను పొందుతుందో, ఈ లోకాన్ని మనం ఏలా విలువతో చూడాలో వివరించండి.
4. నేటి లైంగిక యుగంలో నరదేహంపట్ల మనకు ఏలాంటి పవిత్రభావాలుండాలో వివరించండి.

అధ్యాయం - 7

1.రెండవరాకడలో క్రీస్తు ఎక్కడో బయటినుండి రాడు, తిరుసభలో నుండే మనకు
దర్శనమిస్తాడు - వివరించండి

2.నేటి వేదశాస్తులు మన మరణమే మనకు రెండవరాకడ ఔతుందని చెప్తున్నారు - వివరించండి.
3. క్రీస్తు రెండవమారు వేంచేసి ఏం చేస్తాడు?
4. ప్రభువు రెండవరాకడకు మనం ఏలా సిద్ధంకావాలి?

అధ్యాయం - 8

1. క్రైస్తవునికి నిరీక్షణం ఏలా ప్రధానమో వివరించండి.
2 ఈ లోక్షంలో కృషిచేయడం క్రైస్తవునికి ఏలా ముఖ్యమో వివరించండి.

బైబులు అవలోకనాలు

అధ్యాయం - 1

నరుడు మట్టిలో కలసిపోతాడు - ఆది 3, 19 జీవానికీ మరణానికీ కర్త దేవుడే - ద్వితీ 32,39 మనుష్య కుమారుడు దొంగలా వస్తాడు - లూకా 12,39-40 పాపం చేయకముందు నరుడు అమరుడు - జ్ఞాన 2,23-24 పాపఫలితం మరణం - రోమా 6,23 మనం క్రీస్తు మరణంలోనికి జ్ఞానస్నానం పొందుతాం - రోమా 6,3-4 పౌలు దినదినమూ శారీరక జీవితానికి చనిపోతుండేవాడు - 1కొ 15,31 క్రీస్తునందు చనిపోయేవాళ్ళు ధన్యులు - దర్శ 14,13 మనకు ఇక్కడ స్థిరమైన పట్టణమేమి లేదు - హెబై 13,14

అధ్యాయం - 2

లోకాంతంలో తీర్పు - మత్త 25,31-46
•మరణాంతంలో తీర్చు - లూకా 16,22-23; 23,43 315

జీవించి ఉండగానే తీర్పు - యోహా 3,17-18
ప్రభువు రెండవమారు వచ్చినపుడు తీర్పు - 1తెస్స 4,15-18
ఒకసారి మరణం, ఒకసారి తీర్పు - హెబ్రే 9,27
సజీవుడైన దేవుని చేతికి చిక్కడం భయంకరం - హెబ్రే 10,27-31
ప్రతి వ్యర్థపు మాటకూ లెక్కచెప్పాలి - మత్త 12,86
మన కార్యాలన్నీ దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి - దర్శ 20,12
క్రీస్తుని నమ్మితే దండనం లేదు - రోమా 8,1

అధ్యాయం - 3

నరకం అగ్నికుండం - మత్త 13,42
చీకటి చెరసాల - 22,13
బహిష్కరణం - 25, 12
పండ్ల కొరుకుకోవడం - 25, 30
పిశాచాలుండే తావు - 25,41
పురుగు చావదు, అగ్ని చల్లారదు - మార్కు 9,48
మరణం - యోహా 3,36
రెండవ మృత్యువు - దర్శ 20,14
చీకటి - 8,12
నిప్పు దేవుని కోపానికీ, శిక్షకీ చిహ్నం – యొష 30,27
నిప్ప నరుల పాపాలకు గూడ చిహ్నం - 9,18-19
పరుగు చావదు, అగ్ని చల్లారదు - 66,24
నరకం నిత్యమైంది - మత్త25,46

అధ్యాయం - 4

యూదా మక్కబీయుని పాపపరిహార బలి - 2మక్క 12,39–45

అధ్యాయం -5

మోషేకు దైవదర్శనం - నిర్గ 33,11
మోక్షంలో ప్రత్యక్ష దర్శనం - 1కొ 13, 12
క్రీస్తు జగజ్యోతి - యోహా 8,12
స్వర్గం జ్యోతిర్మయం - దర్శ 21,22-23
యిస్రాయేలనే బాలునికి దేవుని స్పర్మ - హోపే 11,1-4
మోక్షంలో దేవుని స్పర్శ - దర్శ 7,17
శిష్యుల ఐక్యత - యోహా 17,22
మోక్షంలో పునీతులు - దర్శ 7,9

అధ్యాయం - 6

నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు - కీర్త 16,10
అనేకులు మేలుకొంటారు — దాని 12,2
పునరుత్తాన భాగ్యం - 2 మక్క7,9
విశ్వాసం వలనా సత్ర్పసాదం వలనా,ఉత్థానం - యోహా 11,25; 6,54
క్రీస్తు సదూకయుల నోళ్లు మూయించడం - మత్త 22,23–32
ఆత్మద్వారా తండ్రి మనలను లేపుతాడు - రోమా 8,11
జ్ఞానస్నానంద్వారా ఉత్ధానం - రోమా 64-5
క్రీస్తు మరణించిన వాళ్ళల్లో ప్రథమఫలం - 1కొ 15,20
మహిమ శరీరం - 1కొ 15,42-44
విశ్వంకూడ మహిమను పొందుతుంది - రోమా 8,20-21
• మన దేహం ఆత్మకు ఆలయం - 1కొ 6,18-19

అధ్యాయం - 7

         మార్కు 13,26-27

రెండవరాకడ : 1తెస్చ 4,16-17 లోకాంతం వరకు విూతో ఉంటాను - మత్త 28,20

                      అచ 7,55-56

మన మరణకాలమే రెండవరాకడ : లూకా 23,43

                      యోహా 14,1-4

ఆ దినం ఎప్పడు వస్తుందో తెలియదు - మత్త 25,36
క్రీస్తు రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడు - 1కొ 15,24
యజమానుడు ఎప్పడు వస్తాడో విూకు తెలియదు - మార్కు 13,35
ప్రభువ మల్లా రెండవసారి వచ్చేవరకూ - 1కొ 11,25

అధ్యాయం - 8

యేసుక్రీస్తు రాకకొరకు కనిపెట్టుకొని ఉండాలి - ఫిలి 3,20
పదిమంది కన్నెలు - మత్త 25,10
భూమిని వశం చేసికొనండి - ఆది 1,28
తోడినరులపట్ల ప్రేమ, వారికి సేవలు - మత్త 25,40-45
మంచి సేవకులకు మెప్పకోలు - మత్త 25,21-23
నీతికిరీటం - 2తిమో4,8
క్రీస్తు మనకు ఓడ లంగరు - హెబ్రే 6,19.