Jump to content

బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ/బైబులు దృష్టాంతాలు

వికీసోర్స్ నుండి

5.బైబులు దృష్టాంతాలు

మనవిమాట

"బైబులు దృష్టాంతాలు" అనే యీ గ్రంథాన్ని ఇంతకు ముందే బైబులు భాష్యం 24,25 సంచికల్లో ప్రచురించాం. ఆ రెండు సంచికలనూ కలిపి యిక్కడ ఏకగ్రంథంగా అందించాం. దీనిలోని తొలి 16 అధ్యాయాలు ఆయావ్యక్తులు చేసిన దుష్కార్యాలను పేర్కొంటాయి. 17-30 అధ్యాయాలు ఆయావ్యక్తులు చేసిన సత్కార్యాలను పేర్కొంటాయి.

మన ప్రజల్లో చాలమంది ఆవిద్యావంతులూ పిల్లలూను. ఈ వర్గం ప్రజలకు బైబులు సత్యాలను బోధించడం కొంచెం కష్టమే. కాని బైబులు కథలను చెస్తే వీళ్ళ సులభంగానే అర్థంచేసికొంటారు. ఈ లాంటి సందర్భంలో ఈ దృష్టాంతాలు ఉపయోగపడతాయి.

ఇంకా, జ్ఞానోపదేశకులూ ఉపాధ్యాయులూ బోధకులూ మొదలైన వాళ్ళు ఈ దృష్టాంతాలను రకరకాల ఉపన్యాసాలకూ ధ్యానాలకూ వినియోగించుకోవచ్చు. దృష్టాంతం కథలాంటిది. దీనిలో ముఖ్యాంశం ఉపమానం. ఈ వుపమానం శ్రోతమనస్సుని ఆకట్టుకొని చెప్పే విషయాన్ని అతడు శ్రద్ధగా వినేలా చేస్తుంది. ఈ వుదాహరణలను వాడుకొనే బోధకులు వాటికి సంబంధించిన భాగాలను ముందుగనే బైబులు నుండి జాగ్రత్తగా చదువుకొని వుండాలి. ప్రతి ఉదాహరణకీ రిఫరెన్సు ఇచ్చాం,

"బైబులు దృష్టాంతాలన్నీ ఎత్తి చూపించడం అలవిగాని పని. ఇక్కడ ముఖ్యమైన వాటిని కొన్నిటిని పేర్కొన్నాం. వాటిని నమూనాగా పెట్టుకొని ఎవరికి కావలసిన ఉదాహరణలను వాళ్లు బైబులునుండి ఇంకా అధికంగా సేకరించుకోవచ్చు. అది వ్యక్తిగతమైన కృషి. ఇది ఆరవ ముద్రణం.

{{center

విషయసూచిక

}}

1. అసూయ 189

2. వంచన 190

3. వ్యభిచారం 193

4. హత్య 195

5. లంచాలు 197 6.ధనమూ,ధనవాంఛా 198 7.దురాశ 201 8.పదవీ వ్యామోహం 202 9.కోపం 204 10.అశ్రద్ధ 206 11.పగ 208 12.అవిధేయత 209 13.గొణగడు 211 14.తగాదాలు 212 15.గర్వం 214 16.శోధనలు 216 17.భగవంతుని తోడ్పాటు 217 18.శీలవ్యత్యాసం 220 19.అంతరాత్మ 223 20.సలహా 224 21.కృతజ్ఞత 226 22.భక్తుల హృదయం 227 23.క్షమాగుణం 231 24.ప్రభు దీవెన 233 25.దంపతులు 235 26.పశ్చాత్తాపం 236 27.దయ 240 28.పని 241 29.విశ్వాసం 243 30.దైవవాక్కు 246

1. అసూయ

నరులు సులభంగా అసూయకు గురౌతూంటారు. అల్పబుదులు ఇతరుల వృద్ధినిచూచి ఓర్చుకోలేక కీడు తలపెడుతుంటారు. బైబులు అసూయపరుల ఉదంతాలను చాల పేర్కొంటుంది.

1. కయీను హేబెలు అన్నదమ్ములు, కయీను పొలములో పండిన పంటను దేవునికి కానుకగా సమర్పించాడు. హేబెలు గొర్రెపిల్లలను కానుక పెట్టారు. ప్రభువు కయీను కపటబుద్ధినిచూచి అతని కానుకను నిరాకరించాడు. హేబెలు సరళబుద్ధికి మెచ్చుకొని అతని కానుకను అంగీకరించాడు. ఇకనేమి, కయీనుకు హేబెలు మీద కన్నుకుట్టింది. అతడు తమ్మడ్డి పొలానికి తీసికొనివెళ్ళి చంపివేసాడు - ఆది 4:3-8.

2. యాకోబుకు లెయా, రాహీలు అని యిద్దరు భార్యలు. వాళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లు, లెయా కురూపి, రాహేలు సొగసుకత్తె, కాని దేవుని దయవలన పెద్దభార్యయైన లెయాకు బీరపూవుల్లాంటి పిల్లలు పట్టారు. చిన్నభార్య రాహేలు మాత్రం గొడ్రాలుగా వుండిపోయింది. ఆమె లెయా సంతానవతి కావడంజూచి కండ్లల్లో నిప్పలు పోసికుంది. నాకు గూడ పిల్లలను పుట్టిస్తావా లేక నన్ను చావమంటావా అని భర్తమీద విరుచుకపడింది. నీకు బిడ్డలనీయడానికి నేనేమి దేవుణ్బయేమిటి అని యాకోబు తప్పకొన్నాడు. తరువాత దేవుడు రాహేలు మొర ఆలకించి ఆమెకు యోసేపు, బెన్యామీను అనే బిడ్డలను ప్రసాదించాడు - 30: 1-2,

3. యాకోబుకు పండైండుమంది కుమారులు. కాని అతనికి ఇతర కుమారుల మీదకంటే యోసేపుమీద ఎక్కువ ప్రేమ. ఆ కుమారునికి ఓ పొడుగుచేతుల నిలువుటంగీని కుట్టించాడు. అది చూచేటప్పటికి యేసేపు సోదరులకు కడుపు మండింది. వాళ్ళు అతనితో మాటలాడ్డం మానేసారు. తరువాత సోదరులు యోసేపని అడవిలోని ఓ గోతిలో పడద్రోసారు. మళ్ళా అతన్ని ఆ గోతిలోనుండి పైకిలాగి యిష్మాయేలు వర్తకులకు అమ్మివేసారు. వాళ్ళు యోసేపును ఐగుప్తనకు తీసికొని వెళ్ళారు - ఆది 37: 3-4; 19-28,

4. ప్రభువు మోషేను యిప్రాయేలు ప్రజలకు నాయకుణ్ణి చేసాడు. అతడు ప్రజను ఐగుపునుండి నడిపించుకొని పోతున్నాడు. మోషే అన్న అక్క అయిన అహరోను మిర్యాములకు అతని పెద్దరికం నచ్చలేదు. వాళ్ళ చుప్పనాతితనంతో మోషే ఒక్కడే నాయకుడా? అతడొక్కడే ప్రవక్రా? మేము మాత్రంకామా? అని గొణిగారు, దానికి ప్రభువు మిర్యామును కుష్టరోగంతో పీడించాడు. తర్వాత మోషే ప్రార్ధన చేయగా మిర్యాముకు కుష్ట నయిమయింది. - సంఖ్యా 12:1-15. 5. ప్రభువు సౌలును మొదటిరాజుగా నియమించాడు. కాని అతడు మాట విననందున దేవుడు అతన్ని త్రోసివేసి దావీదును రెండవరాజుగా నియమించాడు. దావీదు సౌలు కొలువులో పనిచేస్తున్నాడు. ఓమారు సౌలు దావీదూ ఫిలిస్టీయులమీదికి యుద్దానికి వెళ్ళి వాళ్ళను చితకగొట్టి తిరిగివస్తున్నారు. త్రోవలో ఓ వూరిలో కొందరు స్త్రీలు నాట్యం జేస్తూవచ్చి సౌలు దావీదులకు స్వాగతం చెప్పారు. వాళ్లు సౌలు వేయిమంది ఫిలిస్ట్రీయులను చంపాడు. కాని దావీదు పదివేల మందిని చంపాడు అని పాటపాడారు. ఆ పాట సౌలుకు నచ్చలేదు. యిస్ర్రాయేలు స్త్రీలు తనకంటే దావీదుదే పైచేయి అని పొగడారుకదా అని సౌలు అసూయపడ్డాడు. అప్పటినుండి అతనికి దావీదును అణగదొక్కాలనే కోరిక పట్టింది. ఇంకో మారు దావీదు తనముందట సితారా వాయిస్తుండగా సౌలుకు అతన్ని బల్లెంతో గోడకు గ్రుచ్చాలనిపించింది. దావీదుమీద బల్లెం విసిరాడు. బల్లెంపోయి గోడకు గ్రుచ్చుకొంది. దావీదు మాత్రం నేర్పుతో ప్రక్కకు తప్పకొని పారిపోయాడు. -1 సమూ 18:6-11; 19: 8-10.

6. క్రీస్తు బోధలకూ అద్భుతాలకూ ప్రజలు విస్తుపోయారు. యూదనాయకులను వదలివేసి క్రీస్తును అనుసరించారు. దీన్నిచూడగా యూదుల ప్రధానాచార్యులకు మత్సరం పుట్టింది. వాళ్ల అసూయ క్రీస్తుని పిలాతుని కప్పగించేదాకా పోయింది - మార్కు 15: 10; మత్త 27:18.

7. 1) అసూయ అనేది ఎముకల్లో పుట్టే కుళ్లు - సామె 14:30
2) అసూయవలన సకలవిధాలయిన దుష్టగుణాలు పట్టుకవస్తాయి - యాకో 3:16
3) నరుడు మొదట ఆమరుడుగానే సృజింపబడ్డాడు. కాని పిశాచం అసూయవలన అతనికి శోధనమూ మరణమూ సంభవించాయి — సొలోమోను జ్ఞాన 2: 23-24
4) పిశాచం రెచ్చగొట్టగా యూదనాయకులు క్రీస్తు వధకు పూనుకొన్నారు. ఆదిలో నరహంతకుడై ఆదామునకు చావుతెచ్చిపెట్టిన పిశాచమే క్రీస్తు మరణానికి గూడ కారణమైంది. - యోహా 8:44,

2. వంచన

నరులు ఒకరి నొకరు వంచిస్తూంటారు. ఒకరి నొకరు మోసగించి లాభం పొందాలని చూస్తుంటారు. బైబులు ఈ లాంటి మోసాలను కొన్నింటిని వర్ణిస్తుంది. 1. పిశాచం తొలి నరదంపతులనుజూచి అసూయపడింది. తాను పోగొట్టుకొనిన భాగ్యం నరులకు అబ్బడంజూచి సహించలేకపోయింది. అది "మీరు ఏచెట్టుపండూ తినగూడదట నిజమేనా?” అని ఏవనడిగింది. ఏవ "తోటనడుమనున్న చెట్టుపండు మాత్రం తినకూడదు. అది తింటే మేము చనిపోతాం" అంది. పిశాచం " ఆ చెట్టపండుతింటే మీరు దేవుడంతటివారెపోతారు. పాపం ఈ రహస్యం మీకు తెలీదు” అని ఏవను ఉబ్బించింది. ఆదామేవలు పిశాచంమాట విని పండుతిని భ్రష్టులైపోయారు. ఈవిధంగా దయ్యం ఆదిదంపతులను వంచించింది - ఆది 3:1-6. 2.

యూదుల తండ్రులు తాము చనిపోకముందు పెద్దకొడుకును దీవించేవాళ్ళ ఆ దీవెన ఫలించేది. ఈసాకు చనిపోకముందు తన పెద్దకొడుకయిన ఏసావును దీవించాలనుకొన్నాడు. ఏసావును అడవికిపోయి వేటమాంసం తెచ్చి తనకు వండిపెట్టమన్నాడు. కాని అతడు తిరిగిరాకముందే యాకోబు మాంసం వండుకొనివచ్చి యేసావువలె నటించి తండ్రి దీవెన పొందాడు. ఏసావు వేటనుండి తిరిగివచ్చి సంగతి తెలిసికొని యెంతో విలపించాడు. "నాన్నా! నాకు కూడ ఈయడానికి నీవద్ద మరో దీవెన లేదా?" అని దీనంగా అడిగాడు. కాని లాభం లేకపోయింది, తండ్రిదీవెన ఫలించేది ఒక్కసారి మాత్రమే. ఈ విధంగా యాకోబు ఏసావును వంచించాడు– ఆది 27, 18-27.

3. యాకోబు తన అన్నయైన ఏసావునుండి పారిపోయి మేనమామయైన లాబానునింట ఆశ్రయంపొందాడు. ఈలాబానునకు లెయా,రాహేలు అని ఇద్దరుకుమార్తెలు ఉండేవాళ్ళ యాకోబు రాహేలును పెండ్లియాడగోరి మేనమామకు ఏడేండ్ల జీతం చేసాడు. గడువుకాస్త ముగిసాక లాబాను మేనల్లునకు రాహేలు నిస్తున్నట్లే నటించి లెయానిచ్చి పెండ్లిచేసాడు. రాత్రి ఆ యువతిని కూడిన పిదపగాని యాకోబునకు ఆమె లెయాయని తెలియలేదు. అతడు అదేమనగా లాబాను పెద్ద పిల్లకు పెండ్లికాకముందు చిన్నపిల్లకు పెండ్లిచేయడం మా దేశాచారంకాదు అన్నాడు. తరువాత లాబాను రాహేలునుగూడ యాకోబునకిచ్చిపెండ్లిచేసాడు. కాని అతడు రాహేలుకోసం ఇంకో యేడేండ్లు మేనమామకు జీతం చేయవలసివచ్చింది. ఇవి పెండ్లి సందర్భాలలో జరిగే వంచనలు - ఆది 29, 16-28.

4. యోసేఫనిన అతని సోదరులకు గిట్టేదికాదు. వాళ్ళు అతన్ని ఐగుప్త వెళ్ళే వర్తకులకు అమ్మివేసారు. కాని తండ్రికి ఏమి చెప్పాలి? ఆ సోదరులు ఓ పన్నాగం పన్నారు. ఓ మేకపిల్ల నెత్తుటిలో యోసేపు అంగీనిముంచి దాన్ని తండ్రి వద్దకు పంపించారు. అడవిలో ఆ నెత్తురుగుడ్డ తమ కంటపడిందని చెప్పించారు. యాకోబు ఏ మాయదారి మృగమో యోసేపును మింగివేసిందని తలంచి చాల బాధపడ్డాడు. కొడుకు మీద ఆశవదలుకొన్నాడు - ఆది 37, 31-82. 5. యోసేపును ఐగుప్తలో పోతీఫరు అనే సైన్యాధిపతికి అమ్మివేసారు. యోసేపు అతని యింట్లో మన్ననపొందాడు, యజమానుని భార్య యోసేపు చక్కదనంజూచి అతని మీద కన్ను వేసింది. అతన్ని తనతో శయనింపమని నిర్బంధం చేసింది. యోసేపు ఆ పాడుపనికి సమ్మతింపక పై బట్టను ఆమె చేతుల్లోనే వదలివేసి పారిపోయాడు. ఆమె మత్సరబుద్ధితో ఆ బట్టనే ఆనవాలుగా చూపి యోసేపు తన్ను నిర్బంధించాడని భర్తకు ఫిర్యాదు చేసింది. దానితో యోసేపును చెరలో త్రోయించారు - ఆది 39, 7-20.

6. సంసోను ఫిలిస్టీయులు యువతియైన డెలీలాను పెండ్లిచేసికొన్నాడు. కాని సంసోనుకు ఫిలిస్టీయులకు మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గునమండేది. వాళ్లు ఆమెకు లంచమిచ్చి అతనికి బలం ఎక్కడుంటుందో తెలిసికొమ్మన్నారు. డెలీలా ఆ వీరుణ్ణి మభ్యపెట్టింది. అతనిబలం తలవెండ్రుకల్లో వుంటుందని తెలిసికొంది. అతడు తలజట్టు కత్తిరించేవాడు కాదు. ఆమె సంసోనును నిద్రపుచ్చి అతని తలవెండ్రుకలను గొరిగించింది. అంతట ఫీలిస్ట్రీయులువచ్చి సంసోనుని బంధించి అతని కండ్లు తీయించారు. అతన్ని బానిసను చేసి వెట్టిచాకిరి చేయించుకొన్నారు - న్యాయా 16: 16-22,

7. దావీదు పొరుగింటి ఆడగూతురు బత్షెబాను చూచి మెహించాడు. ఆమె ఊరియా అనే సైనికుని భార్య ఈ ఊరియాని ఏలాగైనా వదలించుకోవాలని దావీదు తలంపు. అపుడు దావీదు సైన్యాధిపతియైన యోవాబు శత్రువులతో యుద్ధం నడుపుతున్నాడు. రాజు అతని కొక జాబువ్రాసి "పోరు జరిగేప్పడు ఊరియాను మొదటివరుసలో నిలబెట్టి మీరంతా కాస్త వెనుకకు తగ్గండి" అని ఆజ్ఞపంపాడు. సైన్యాధిపతి ఆలాగే చేయగా ఊరియా యుద్ధంలో హతుడయ్యాడు. దావీదు కుట్రనెగ్గింది. అతడు బత్షెబాను భార్యగా స్వీకరించాడు. ఇదంతా తెలిసికొని నాతానుప్రవక్త దావీదును నిశితంగా మందలించాడు. అతడు పశ్చాత్తాపపడ్డాడు - 2 సమూ 11, 14-17.

8. పరిసయులు యూదుల్లో ఓ వర్గంవాళ్ళు వాళ్ళకు క్రీస్తు అంటే గిట్టదు. వాళ్ళు ఏలాగైనా అతన్ని వంచించాలన్న బుద్ధితో " కైసరు చక్రవర్తికి పన్నుచెల్లించడం న్యాయామాకాదా?" అని ప్రశ్నించారు. చెల్లించమంటే యూదులకు కోపం, పద్దంటే రోమను ప్రభుత్వానికి కోపం. కనుక వాళ్ళు క్రీస్తు ఏలా జవాబు చెప్పినా అతన్ని ఇరకాటాన పెట్టవచ్చు గదా అనుకొన్నారు. కాని క్రీస్తమాత్రం వాళ్ళకపటబుద్ధిని గ్రహించి చక్రవర్తికి చెల్లించేవి చక్రవర్తికీ దేవునికీ చెల్లించేవి దేవునికి చెల్లించండనిచెప్పి వాళ్ళ నోళ్ళు మూయించాడు - మార్కు 12, 13-17,

9. పిలాతుకు క్రీస్తు ఏ నేరమూ చేయలేదని బాగా తెలుసు. ఐనా అతడు ప్రజలకు భయపడ్డాడు. ద్రోహియైన బరబాను విడుదలచేయించి నిర్దోషియైన క్రీస్తుకు మరణశిక్ష విధించాడు — లూకా 23, 22-25. 10. యూదా క్రీస్తుని పట్టియిూయడానికై యూదనాయకులను గెత్సెమని తోపునకు తీసికొనివచ్చాడు. తానెవరిని ముద్దు పెట్టుకొంటే అతన్ని పట్టుకొమ్మని శత్రువులకు ముందుగనే ఆనవాలిచ్చాడు. బయటికిమాత్రం గురుభక్తి కలవాళ్లాగా నటిస్తూ గురువా నమస్కారమని క్రీస్తును ముదుపెట్టు కొన్నాడు, క్రీస్తు ఆతన్నేమీ నిందించలేదు. ఆ యానవాలు ప్రకారం శత్రువులు క్రీస్తును బంధించి తీసికొనిపోయారు - మత్త 26; 49-49.

11. పసిబిడ్డలను చంపించిన మొదటి హెరోదు మనుమడు మూడవ హెరోదు, ఇతడు యాకోబును చంపించాడు. పేత్రుని చెరలో వేయించాడు. తనవిజయాలను తలంచుకొని పొంగిపోతూ ఓమారు బంటులతో కొలువుతీర్చాడు. తన గొప్పతనాన్ని ప్రకటించుకొంటూ వాళ్ళముందు_ఓ ఉపన్యాసమిచ్చాడు. కొలువుకాళ్ళ అతని మెప్పపొందడంకోసం " నీవు నరమాత్రుడివికావు. ఓ దేవుడిలా మాట్లాడావు సుమా!" అని పొగడారు. ఆ పొగడ్డలకు హెరోదు బలూనులాగ ఉబ్బిపోయాడు. అతడు తన్నుతాను దేవుణ్ణిగా భావించుకొన్నందులకై ఓ దేవదూత అక్కడికక్కణ్ణే అతన్ని ఘోరంగా శిక్షించాడు. దానితో హెరోదు రోగపీడితుడై పురుగులుపడి చచ్చాడు - ఆచ 12, 21-23.

3. వ్యభిచారం

స్త్రీ పురుషులు జంతుదృష్టితో ఒకరినొకరు కామిసూంటారు. ఏవేవో మాయోపాయాలుపన్ని ఒకరి దేహాన్నొకరు అనుభవింప జూస్తూంటారు. బైబులు ఈలాంటి దుష్టచేష్టలను కొన్నింటిని ఉదాహరిస్తుంది.

1. యోసేపు ఐగుప్తున పోతీఫరు అనే సైన్యాధిపతి ఇంటిలో వుండేవాడు. అతని భార్యకు యోసేపుపై కోరిక పట్టింది. అతన్ని పాపకార్యానికి పురికొల్పింది. యోసేపు “అమ్మా! యజమానుడు ఈ యింటికంతటికీ నన్ను అధిపతిని జేసాడు. నీవు యజమానుని భార్యవు కనుక నిన్ను మాత్రం నా కప్పగింపలేదు. నేను స్వామి ద్రోహం చేయను, దేవుడు చూస్తూండగా ఇంతటి చెడ్డపనికి ఒడిగట్టను" అని ఆమెను మందలించాడు, ఆమె చెంతకు పోవడంగూడ మానివేసాడు. అయినా యజమానునిభార్య అతన్ని నిర్బంధంచేసింది. ఆ నిర్బంధానికి గూడ లొంగకపోగా ఆమె అతని మీద నేరం మోపింది. అతన్ని చెరలో త్రోయించింది - ఆది 39, 7-10.

2.యూదులు బాబిలోను ప్రవాసంలో వున్నపుడు ఇద్దరు వృద్దులను న్యాయాధిపతులనుగా నియమించారు. వీళ్ళిద్దరూ సూసన్న అనే ఉత్తమ కుటుంబినిని కామించి ఆమెను చెరచాలనుకొన్నారు. ఓమారు వాళ్ళిద్దరూ ఆమె తోటలో దాగుకొని కూర్చున్నారు. సూసన్న స్నానం చేయడానికి తోటకు రాగా ఆమెను పాపంచేయమని బలాత్కరించారు. కాని ఆ గృహిణి "ఈలాంటి పాడుపనికి పూనుకొని దేవునియెదుట పాపం కట్టుకోవడంకంటె మీరు పెట్టే శిక్షననుభవించడమే మేలు" అంది. వాళ్ళ కోరికను నిరాకరించింది. వాళ్ళిద్దరూ సూసన్నమరెవరితోనో వ్యభిచారం చేసిందని సభ యెదుట ఆమెమీద కూటసాక్షాన్నిచెప్పి ఆమెను చంపించబోయారు. అపుడు దానియేలు ఆ వృదుల కూటసాక్ష్యాన్ని బట్టబయలు చేసాడు. చివరకు వాళ్ళు తలపెట్టిన మరణశిక్ష వాళ్ళమీదికే వచ్చింది — దాని 13, 19-23.

3. దావీదు ఓదినం సాయంకాలం తన మేడమీద పచార్లు చేస్తూ ప్రక్కయింట్లో స్నానమాడుతూన్న ఓ అందగత్తెను చూచాడు. ఆమె పేరు బత్షెబా, ఆమెను చూడగానే దావీదుకు మతిపోయింది. రాజు ఆమెను తన యింటికి రప్పించుకొని తనభార్యను చేసుకొన్నాడు. ఆమె భర్తయైన ఊరియాను మోసంతో యుద్ధంలో చంపించాడు. తర్వాత ఈ పాపానికి నాతాను ప్రవక్త దావీదును కఠినంగా మందలించాడు - 2సమూ 11, 2-5.

4. దావీదునకు ఒక భార్యవలన కలిగిన బిడ్డలు అబ్సాలోమనే కుమారుడు, తామారనేకొమార్తె మరియొక భార్యవలన కలిగినవాడు అమ్మోననే కుమారుడు. ఈయమ్మోనుకు తామారుపై వలపు పుట్టింది. అతడు వ్యాధిగా వున్నట్లు నటించగా దావీదు అతనిని చూడ్డానికి వచ్చాడు. అమ్మోను రాజును తామారును పంపి తనకు భోజనం సిద్ధంచేయించవలసిందిగా కోరాడు. రాజు ఆనతిపై తామారు అన్నకు భోజనం సిద్ధంచేసి ఇంటిలోనికి తీసికొనివెళ్ళి వడ్డింపబోయింది. అప్పడు అమ్మోను మారుచెల్లిని బలాత్కరంచేసి ఆమెను చెరిచాడు. అటుపిమ్మట అతనికి తామారుపై కొండంతద్వేషం పుట్టుకవచ్చింది. ఆమెను ఇంటిలోనుండి బయటికి గెంటివేసాడు. తరువాత అబ్సాలోము ఈ యమ్మోనును విందుకు ఆహ్వానించి అక్కడ అతన్ని కపటంతో చంపించివేసాడు - 2సమూ 13, 10–14.

5. పసిబిడ్డలను చంపించిన మొదటి హెరోదు కుమారుడు రెండవ హెరోదు. ఇతడు తన అన్నయైన ఫిలిప్ప భార్య హెరోదియాను ఉంచుకొన్నాడు. స్నాపక యోహాను హెరోదును నిశితంగా మందలించి ఆమెను పంపివేయమన్నాడు. హెరోదియా మత్సరంతో యోహానును చెరలో వేయించింది. ఓ దినం హెరోదియా కూతురు సభలో నాట్యంచేసి అతన్ని మెప్పించింది. అతడు ఒళ్ళు తెలియక ఆ బాలిక ఏమడిగినాయిస్తానని బాసచేసాడు. హెరోదియా యోహాను శిరస్సు ఆడగమని కూతురికి నూరిపోసింది. కూతురు చేతుల్లో నుండి యోహాను తల అందుకొన్నంకగాని హెరోదియాకు సంతృప్తి కలుగలేదు - మత్త 14, 3-5. 6. వ్యభిచారంలో పట్టుపడిన స్త్రీలను రాళ్ళు రువ్వి చంపమన్నాడు మోషే. ఓ దినం యూదులు ఆలాంటి స్త్రీ నొకతెను క్రీస్తు ఎదుటికి తీసికొనివచ్చి ఈమెకు ఏమి శిక్ష విధించాలో నీవే చెప్పమని అడిగారు. ప్రభువు మీలో పాపం చేయనివాడెవడైనా వుంటే ఆమె మీద మొదటిరాయి విసరవచ్చు అన్నాడు. ఆ మాటకు సిగ్గుపడి వాళ్ళంతా ఆమెను వదలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు ఆమెతో "వాళ్ళ నిన్ను శిక్షింపలేదు. నేను కూడ నీకు శిక్ష విధింపను. ఇక వెళ్ళి పాపం చేయకుండ బ్రతుకు" అన్నాడు - యోహా 8, 10-11

7. శారీరక వ్యభిచారంతోపాటు మానసిక వ్యభిచారమనేది కూడ వుంది. పరస్త్రీని మోహదృష్టితో చూస్తే ఆమెతో మానసికంగా పాపం చేసినట్లే - మత్త 5,28.

8. పౌలు కొరింతీయులకు వ్రాసూ మనదేహం పరిశుద్దాత్మకు ఆలయమై యుంటుందని పేర్కొన్నాడు. జ్ఞానస్నానం పొందినపుడు పరిశుద్దాత్మ మన దేహంలో ఓ దేవాలయంలో లాగ నెలకొంటుంది. ఈలాంటి పవిత్ర దేహాన్ని వ్యభిచారం ద్వారా అమంగళపరచకూడదు - 1కొరి 6,19.

4. హత్య

నరులు కోపతాపాలకూ అసూయకూ గురై తోడి జనులను హత్యచేస్తూంటారు. ప్రాణాన్ని ఇచ్చే అధికారంగాని తీసికొనే అధికారంగాని మనకులేదు. భగవంతుడొక్కడే దానికి కర్త అందుచేత హత్య చాల ఘోరమైంది.

1. కయీను తమ్ముడైన హేబెలుమీద గ్రుడ్లెర్రజేసాడు. హేబెలును పొలానికి తీసుకవెళ్ళి మీదికి దూకి అతన్ని చంపివేసాడు. మా అన్నయ్య నన్ను అన్యాయంగా చంపివేసాడు అని హేబెలు నెత్తురు దేవునికి మొరపెట్టుకొంది. దేవుడు కయీనుని దేశదిమ్మరివి కమ్మని శపించాడు. ఆ శాపానికి కయీను భయపడిపోయి "జనులు నన్ను రాళ్ళ విసిరి చంపరా" అని దీనంగా మనవిజేసికొన్నాడు, దేవుడు కయీనుమీద జాలిబూని అతని నొసటిమీద ఓ భయంకరమైన గుర్తుపెట్టాడు. ఆ గుర్తుచూచి జనం భయపడిపోయి అతని యెదుటికి రాకుండాపారిపోయేవాళ్లు. అలా కయీను బ్రతికిపోయాడు - ఆది 4, 8,16.

2. సౌలుకు తన కొలువుకాడైన దావీదు అంటే కన్నుకుట్టింది. ఓమారు దావీదు సౌలుము0దర సితార వాయిస్తున్నాడు. దావీదును ఉన్నవాణ్ణి ఉన్నట్లు గోడకు గ్రుచ్చాలి అనుకొని సౌలు అతనిమీదికి ఈటె విసరాడు. కాని దావీదు నేర్పుతో ఆ వేటు తప్పించుకొన్నాడు. ఈటె మాత్రంపోయి గోడలో దిగబడింది. దావీదేమో సౌలు కొలువునుండి పారిపోయాడు - 1సమూ 19, 8-10. 3.దావీదు కుమారుడగు అమ్మోను తనకు మారుచెల్లెలు అబ్షాలోముకు సొంత చెల్లెలు ఐన తామారును చెరిచాడు. రెండేండ్లు గడిచిన తర్వాత అబ్షాలోము కపటబుద్ధితో అమ్మోనును విందునకు ఆహ్వానించాడు. అచట అమ్మోను తిని త్రాగిమైమరచి యుండగా అబ్సాలోము బంటులు అతని మీదపడి చిత్రవధ చేసారు - 2 సమూ 18, 28–29.

4. దావీదు తన సైనికుడైన ఊరియా యనువాని భార్య బత్షెబాను పొందగోరాడు. ఊరియాను ఏవిధంగానైనా మట్టుపెట్టాలనుకొన్నాడు. అప్పడు అతని సైన్యాధిపతియైన యోవాబు రాబా పట్టణాన్ని ముట్టడిస్తున్నాడు. రాజు సైన్యాధిపతికి జాబు పంపాడు, ఆ కమ్మలో "పోరు ముమ్మరంగా జరిగే తావులో ఊరియాను ముందటి వరుసలో నిలబెట్టండి. మీరంతా కాస్త ప్రక్కకు తప్పకోండి. అతడే దెబ్బలు తిని చస్తాడు” అని వ్రాసాడు. యోవాబు రాజు చెప్పినట్లేచేసి ఊరియాను చంపించాడు. ఈ విధంగా తడిగుడ్డతో గొంతుకోసాడు = 2సమూ 11, 14-17.

5. ఓ మారు క్రీస్తు తన సొంత గ్రామమైన నజరేతు వెళ్ళాడు. అక్కడి ప్రార్థనామందిరంలో బోధిస్తూ ఏ “ప్రవక్తను గూడ సొంతజనం అంగీకరించరు" అని వాక్రుచ్చాడు. ఆ నగరవాసులు క్రీస్తుమీద మండిపడ్డారు. వాళ్ళ గ్రామం ఓ కొండ మీద కట్టబడి వుంది. వాళ్లు క్రీస్తుని క్రిందికి పడదోయాలనుకొని కొండ అంచునకు తీసికొని పోయారు. కాని ప్రభువు వాళ్ళ మధ్యలోనుండి దాటి వెళ్ళిపోయాడు - లూకా 4, 28-30.

6. యూదులు క్రీస్తుని చంపాలని నిశ్చయించుకొన్నారు. కాని నరులను చంపే అధికారం చట్టరీత్యావాళ్ళకులేదు. కనుక వాళ్ళు క్రీస్తుకి మరణదండన విధించమని రోమను అధికారియైన పిలాతును ఒత్తిడి చేసారు. అతని ఉత్తరువుతో ప్రభుని సిలువ మీద కొట్టి చంపారు - యోహా 19, 15-16.

7. జ్ఞానులు క్రీస్తు శిశువును ఆరాధించడానికి పయనమై వస్తూ దారిలో హెరోదును దర్శించారు. అతడు ఈ క్రీస్తు పాపడు యూదులకు రాజౌతాడని విని తన రాజ్యానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని తల్లడిల్లి పోయాడు. హెరోదుకు ఆ శిశువును ఏలాగైనా చంపించాలన్న బుద్ధి పుట్టింది. అతడు జ్ఞానులతో "మీరువెళ్ళి శిశువును ఆరాధించండి. మళ్ల తిరిగివచ్చి అతని ఉదంతం నాకు తెలియజేయండి" అని చెప్పాడు. కాని జ్ఞానులు మళ్లా కంటబడక పోవడంవల్ల హెరోదుకు విపరీతమైన కోపం వచ్చింది. అతడు క్రీస్తు శిశువు ప్రాయం రెండేళ్ళలోపులో వుంటుందని అంచనా వేసాడు. కనుక బేల్లెహేము ప్రాంతంలో రెండేండ్లలోపులో వున్న మగబిడ్డల నందరినీ దారుణంగా చంపించాడు. ఆ ఘోర హత్యలో క్రీస్తుశిశువుకూడ నాశమై పోయి వండాలనుకొని సంబ్రాలుపడ్డాడు - మత్త 2,16. 8. క్రీస్తు ఉత్థానం అనంతరం యెరూషలేములో క్రైస్తవ సమాజం బలపడింది. ఆ సమాజానికి ఏడుగురు పరిచారకులుండేవాళ్లు, వాళ్ళల్లో స్తెపనుకూడ ఒకడు. ఇతడు పూర్వవేదంవలన ఇక ఫలితం లేదని బోధించాడు. మోషేధర్మశాస్త్రమూ యెరూషలేము దేవాలయమూ ఇక మనల రక్షించలేవనీ, మనలను రక్షించేది ఉత్దాన క్రీస్తు ఒక్కడేనని వాదించాడు. యూద నాయకులు ఆ బోధను సహించలేకపోయారు, యూదమతానికి తలవంపులు కలిగాయనుకొన్నారు. వాళ్ళు కోపంతో స్తెఫనుని ఊరిబయటికికి లాగుకోని వెళ్ళి రాళ్ళతోకొట్టి చంపారు. స్తెఫను ఉత్దాన క్రీస్తుని దర్శించి ప్రాణాలు విడిచాడు. అతనిచావు తలపెట్టిన వాళ్ళలో సౌలు కూడ ఒకడు - ఆచ 7, 54–60.

9. సౌలు డమస్కు పట్టణంలోని క్రైస్తవులను హింసించడానికి వెళ్తుండగా దారిలో క్రీస్తు ప్రత్యక్షమై అతని మనసు మార్చాడు. అప్పటినుండి సౌలు క్రీస్తే మెస్సియా అని డమస్కుపట్టణంలో ఆవేశంతో ఉపన్యసించడం మొదలెట్టాడు. ఆ పట్టణంలోని యూదులు, అతన్ని చంపాలని కుట్రలు పన్నారు. ఆ సంగతి గుర్తించి సౌలు మిత్రులు అతన్ని ఓ గంపలో కూర్చుండ బెట్టి రాత్రివేళ పట్టణపు గోడమీదిగా వెలుపలికి దింపారు. ఆ రీతిగా సౌలు శత్రువులనుండి తప్పించుకొన్నాడు – అచ 9, 23–25.

5. లంచాలు

నరులు లోభంవలన లంచానికి లొంగిపోతారు. డబ్బు తీసికొని కానిపనులు చేస్తారు. డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళు వట్టి నీచులు.

1. సమూవేలు ప్రవక్త మొదటి న్యాయాధిపతి. అతడు చక్కగా తీర్పులుతీర్చి ప్రజలకు న్యాయం జరిగించాడు. సమూవేలు తరువాత అతని కుమారులు న్యాయాధిపతులయ్యారు. కాని వాళ్ళకు తండ్రి గుణాలు అబ్బలేదు. వాళ్ళ కాసులకు దాసులై లంచాలు తీసికొని న్యాయం చెరిచారు-1 సమూ 8, 3-5.

2. ఆహాసు యిస్రాయేలు నేలిన దుష్టరాజుల్లో ఒకడు. ఇతనికాలాన అస్పిరియను రాజగు టిగ్లాతిప్పలేసరు పాలస్తీనా మీదికి దండెత్తి వచ్చాడు. ఆహాసు దేవాలయంసొమూ అపహరించి ఈ రాజుకు లంచం పెట్టాడు. కాని టిగ్లాతిప్పలేసరు ఆ లంచం పుచ్చుకొని గూడ ఆహాసును శిక్షించి వెళ్లాడు - 2 దిన 28, 20-21.

3. ఫిలిస్టీయుల ఆడపడుచు డెలేలాను సంసోను పెండ్లి చేసికొన్నాడు. కాని వాళ్ళకు సంసోనంటే గిట్టదు. కనుక ఫిలిస్టియదొరలు డెలీలాకు లంచం పెట్టారు. వారిలో ఒక్కొక్కడు ఆమెకు పదకొండువందల వెండి నాణాలు చెల్లించాడు. డేలీలా సంసోసు బలం అతని తలవెండ్రుకల్లో ఉంటుందని తెలిసికొని ఫీలిస్ట్రీయ సర్దారులకు ఎరిగించింది. ఆ రహస్యాన్ని తెలియజేసిన సంసోను తన చావు తానే తెచ్చి పెట్టుకొన్నట్లయింది - న్యాయా 16, 5.

4. గురుద్రోహియైన యూదా ప్రధానాచార్యుల దగ్గర ముప్పై వెండినాణాలు లంచం తీసికొని క్రీస్తును వాళ్ళకు పట్టీయడానికి ఒప్పకొన్నాడు - మత్త 26, 14-15.

5.ప్రధాన యాజకులు సైనికులను క్రీస్తుసమాధికి కాపుంచారు. ఈ సైనికులు క్రీస్తు ఉత్థానం కావడంచూచి భయపడిపోయి ప్రధాన యాజకులకు తెలియజేసారు. వాళ్ళు తమలో తాము కూడబలుకుకొని సైనికులకు లంచాలిచ్చి "మీరు మేము నిద్రబోతూండగా క్రీస్తు శిష్యులు వచ్చి అతని శవాన్నెత్తుకొని పోయారని పుకార్లపట్టించండి. మేము రోమను అధిపతులవలన మీకేలాంటి బాధా కలుగకుండా చూస్తాం" అని చెప్పారు. సైనికులు ఆ డబ్బులు తీసికొని యాజకులు చెప్పినట్లే పుకార్లు పుట్టించారు. కాని సత్యంమాత్రం యూదప్రజలకు తెలిసిపోయింది - మత్త 28, 12-15.

6. యూదుల నాయకులు పౌలును బంధించి కైసరయలోని ఫీలిక్సు అనే అధిపతివద్దకు తీసుకొని వచ్చారు. ఫీలిక్సు పౌలు సమాధానం విన్నాడు. పౌలు లంచం పెడితే అతన్ని విడిపించాలని ఫీలిక్సు ఉద్దేశం. కాని రెండేడ్లుగడిచినా పౌలు లంచమీయలేదు, ఫీలిక్సు అతన్ని విడిపించనూలేదు. తర్వాత ఫీలిక్సు మారిపోయి మరో అధికారి వచ్చాడు. పౌలు మాత్రం చెరలోనే వుండిపోయాడు - అకా 24, 26-27.

6.ధనమూ-ధనవాంఛా

నరులు ఆశతో డబ్బు కూడబెట్టగోరుతూంటారు. చివరికి దానికి దాసులైపోతూంటారు. కొందరు సొంత ప్రాణానికంటే దేవునికంటే గూడ అధికంగా డబ్బును గౌరవిస్తారు. అది చివరికి నరుల ప్రాణాలనే తీస్తుంది.

1. యోసేపు సోదరుల అతన్ని చంపివేయాలనుకొని ఓ గోతిలో పడద్రోసారు. మళ్ళా అతన్ని చంపివేయడమెందుకులెమ్మని పైకిలాగి యిరవై వెండినాణాలకు యిష్మాయేలీయులకు ఆమ్మివేసారు. ఈ విధంగా వాళ్ళు తమ్మునికంటె డబ్బుకే ఎక్కువ విలువనిచ్చారు ఆది - 37, 26-28.

2. యాకోబు తన మేనమామయైన లాబాను ఇంటిలో జీతానికున్నాడు. ఈ లాబాను వట్టి మోసగాడు. యాకోబుకు తక్కువజీతమిచ్చి ఎక్కువపని రాబట్టుకోవాలి అనుకొనేవాడు. అతడు యాకోబు జీతం మాటిమాటికి మారుస్తుండేవాడు. అలా పదిసార్లు మార్చాడు - ఆది 31, 7. 3. ఓ మారు సొలోమోను ప్రభువును ఆరాధించడానికి గిబ్యోను పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కన్పించి ఏమివరం కావాలో కోరుకొమ్మన్నాడు. సొలోమోను స్వార్దానికేమీ కోరుకొలేదు. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించడానికి వివేకంమాత్రం ప్రసాదించమని అడిగాడు. ఈ కోరిక ప్రభువుకి చాల నచ్చింది. దేవుడతనితో నీవు దీర్షాయువుగాని సిరిసంపదలుగాని శత్రువినాశంగాని కోరుకోక ప్రజలకు మేలుచేయడానికై వివేకాన్ని కోరుకొన్నావు. ఈ వరాన్ని ఇస్తున్నాను. పైపెచ్చు నీ వడగకపోయినా దీర్ఘాయువూ సిరిసంపదలుకూడ ఇస్తున్నాను ఆన్నాడు. స్వార్థంలేని నరనికి లభించే బహుమతి అది —1రాజు 3, 11-14.

4. యూదా ప్రభుని ముప్పది వెండినాణాలకు అమ్మాడు కదా! తరువాత అతనికి పశ్చాత్తాపం పట్టింది. అతడు మళ్లా ప్రధానయాజకుల వద్దకు వెళ్ళి మీ సొమ్ము మీరు తీసికొని క్రీస్తుని విడిపించండి అని అడిగాడు. వాళ్లు ఆ సంగతి మాకేమీపట్టదు అన్నారు. యూదా కోపంతో ఆ వెండినాణాలను అక్కడే దేవాలయంలోనే విసరికొట్టాడు. నిరుత్సాహంతో వెళ్ళిపోయి వురివేసుకుని చచ్చాడు. ధనలోభంవల్ల యూదాకు ప్రాణనష్టం కలిగింది — మత్త 27, 3–5.

5. ఓ మారు ఓ ధనిక యువకుడు క్రీస్తువద్దకువచ్చి నేనూ నిన్ను వెంబడిస్తానన్నాడు. క్రీస్తు మొదట నీ యాస్తిపాస్తులను అమ్మి పేదలకిచ్చి అటుపిమ్మటవచ్చి నా శిష్యుడవు కమ్మని చెప్పాడు. అతడు చాల ధనవంతుడు. ఒకవైపు తన సిరిసంపదలను వదలుకోలేకా, మరోవైపు క్రీస్తుశిష్యుడు కాలేకా ఆ యువకుడు విచారంతో వెళ్ళిపోయాడు. ఓకోమారు మన డబ్బే మనలను భగవంతునినుండి వైదొలగిస్తుంది - మార్కు 10, 21-22.

6. ఓ యజమానుడు దేశాంతరంవెళ్తు తన సేవకుల్లో ఒకనికి ఐదుసంచులూ, ఇంకో అతనికి రెండుసంచులూ, మరొకనికి ఒకసంచీ ధనమిచ్చి పోయాడు. అతడు మళ్లాతిరిగి వచ్చి సేవకులను లెక్క అడిగాడు. ఐదుసంచులు తీసుకొన్నవాడు ఇంక ఐదుసంచులూ, రెండుసంచులు తీసుకొన్నవాడు ఇంకో రెండు సంచులూ కూడబెట్టి వుంచారు. కాని ఒక సంచిధనం తీసికొన్నవాడు మాత్రం ఏమి వృద్ధిచేయకుండ మెదలకుండా వుండిపోయాడు. యజమానుడు వాడిమీద మండిపడ్డాడు. వాని సొమ్ముకూడ తిసుకుని మొదటివాని కిచ్చివేసాడు. కనుక భగవంతుడు మనకిచ్చిన శక్తిసామర్థ్యాలను వృద్ధిచేసికోవాలి - మత్త 25, 14, 30.

7. ఒక ధనవంతునికి పుష్కలంగా పంటలు పండాయి. అతడు తన కొట్లుపడగొట్టించి ఇంకా పెద్దకొట్ల కట్టించి ధాన్యం నిల్వజేయిస్తాననుకొన్నాడు. నేను చాల అదృష్టవంతుణ్ణి. నాకు చాల యేండ్లవరకు సరిపోయేంతగా సంపదలు అబ్బాయి. కనుక సుఖంగా తిని త్రాగి ఆనందిస్తూంటాను - అనుకొన్నాడు. కాని దేవుడు మాత్రం ఓరి మూర్ఖడా! ఈ రాత్రే నీవు చనిపోవాలి. ఇక నీవు కూడబెట్టినసొత్తు ఎవరిపాలౌతుందో గదా! అన్నాడు. సిరిసంపదలు శాశ్వతంగావు. నరుడు కేవలం వాటినే నమ్మకోగూడదు — లూకా 12, 16-20.

8. 1) ప్రభూ! నాకు పేదరికమూవడద్దు, సిరిసంపదలూ వద్దు. నాకు కావలసినంత కూడుమాత్రం ఇస్తుండు. నాకు సిరిసంపదలు అబ్బాయో, నిన్ను ధిక్కరించి దేవుడెవరు అనే కాడికి వస్తానేమో! మరి పేదవాణ్ణియిపోయానో, పరుల సౌమ్మదొంగిలించి నీకు అపకీర్తి తేస్తానేమో! - 30, 8-9.

2) ఈ లోకంలో సంపదలు చేకూర్చుకొంటే వాటిని చిమ్మటలూ త్రుప్ప తినివేస్తాయి. దొంగలు అపహరిస్తారుగూడ, కాని పరలోకంలో ధనం కూడబెటుకుంటే అది అక్షయంగా వుండిపోతుంది. మన సంపదలెక్కడుంటాయో మన హృదయంగూడ అక్కడే వుండిపోతుంది - మత్త 6, 19-21.

3) విత్తవాని విత్తనాలు కొన్ని ముండ్లపొదల్లో పడ్డాయి. ఆ విత్తనాలు మొలవగానే ముండ్లపొదలు వాటిని అణచివేస్తాయి. ఇక్కడ ముండ్ల మొక్కలంటే యేమిటి? కొందరు క్రీస్తుని గూర్చిన బోధలను ఆలిస్తారు. మంచి జీవితం జీవించాలని కోరుకొంటారుగూడ. కాని లౌకిక చింతలూ ధనాశా, వ్యామోహాలూ ఆ మంచి కోరికలను కాస్త అణచివేస్తాయి. కనుక వాళ్ళు తాముకోరుకున్న దివ్యజీవితంగాక ప్రాపంచిక జీవితమే జీవిస్తారు - మార్కు 4, 18-19.

4) మన పాపవిమోచనానికై ఒడ్డిన మూల్యం వెండి బంగారాలుకాదు, అమూల్యమైన క్రీస్తురక్తం -1 పేత్రు 1,18

5) సకల అనర్దాలకు మూలం ధనాపేక్ష - 1 తిమో 6,10

6) మంచి దుస్తులు ధరించివచ్చిన ధనికుని ఆప్యాయంగా ఆదరించి, చింపిరి గుడ్డలు తొడుగుకొని వచ్చిన పేదవాణ్ణి ఆనాదరం చేయడం ధర్మమా? - యాకో 2, 2-4.

7) పొలంలో పని చేయించుకొన్నవాళ్ళకు కూలి నిరాకరించగూడదు. ఆ పంటకూలీల యేడ్పు దేవుని చెవుల్లో పడుతుంది - యాకో 5, 4. {{center|

7. దురాశ

ఒకోమారు నరులు దురాశకు లొంగిపోతూంటారు. లోతైన నీళ్ళలోబడి మునిగిపోయినట్లు పేరాసకు చిక్కి నాశమైపోతూంటారు.

1. యోషువా హాయిపట్టణాన్ని ముట్టడించి పోరు సాగిస్తున్నాడు. అందలి వస్తువులనన్నీటినీ శాపంపాలుచేసి కాల్చివేయమని యావే ఆజ్ఞ యిచ్చాడు. కాని యోషువా సైనికుల్లో ఒకడైన ఆకానుమాత్రం హాయిలో దొరికిన దోపిడి సొమ్మను - పట్టుబట్టలనూ నాణాలనూ - దాచుకొన్నాడు. అతడు యావే ఆజ్ఞ మీరినందున యోషువాకు యుద్ధంలో అపజయం కలిగింది. యోషువా విచారణ జరిపి చూడగా ఆకానునేరం బయటపడింది. అంతట ఆకానునీ అతని కుటుంబాన్నీ రాళ్ళతో కొట్టి చంపారు - యోషువా 7.

2. యెలీషా ప్రవక్తగానున్న రోజుల్లో సిరియా సైన్యాధిపతియైన నామాను కుష్టరోగియై చికిత్సకొరకు వచ్చాడు. ప్రవక్త అతన్ని ఏడుసార్లు యోర్దానునదిలో స్నానం చేయమన్నాడు. ఆలా చేయగా నామానుకు కుష్టపోయింది. అతడు యెలిషాకు కానుక లర్పింపబోయాడూని, ప్రవక్త అవేమీ స్వీకరించకుండానే నామానును పంపివేసాడు. కాని యెలీషా శిష్యుడైన గేహసీ దురాశతో నామానువెంట బోయాడు. మా గురువుగారు కానుకలు అడుగుతున్నారని బొంకి ఆతనివద్ద నుండి వెండి నాణాలూ పట్టుబట్టలూ ఇప్పించుకొని వచ్చాడు. గేహసీ యెలీషాకు పరిచర్య చేయడానికి రాగానే ప్రవక్త అతనిమీద మండిపడి “నాయాత్మనీతోకూడ వచ్చి నీవు చేసిన పాడుపని చూచింది. నీవు ఈలాంటి అకార్యానికి పాల్పడ్డావు గనుక నామానును వదలిపోయిన కుష్ట నిన్ను పట్టి పీడిస్తుంది" అన్నాడు. వెంటనే గేహసీకి కుష్టసోకగా అతని వొళ్ళు మంచులాగ తెల్లబడిపోయింది - 2 రాజు 5, 20-27.

3. సాలు అమాలెకీయుల మీదికి యుద్దానికి పోయాడు. ప్రభువు అమాలెకీయులను శాపంపాలుచేసి సర్వనాశంచేయమని చెప్పాడు. కాని సౌలు అమాలెకీయుల రాజైన అగాగును చంపకుండ వదలివేసాడు. పైగా అతడు అమాలెకీయుల గొడ్లలో పోతరించిన యెడ్లను దూడలను గొర్రెలను చంపలేదు. శ్రేష్టమైన జంతువులన్నిటిని తాను మిగుల్చుకొని క్షుద్రజంతువులను మాత్రం శాపంపాలుచేసి వధించాడు. అంతట ప్రభువు పంపగా సమూవేలు ప్రవక్త వచ్చి సౌలును చెడబడ తిట్టాడు. నీవు యావేమాట త్రోసివేసాడు గనుక యావే నీ రాచరికం త్రోసివేసాడు అని చెప్పాడు. దానితో సౌలు రాజదవి కోల్పోయాడు -1సమూ 15, 9.

4 అహాబు దుష్టరాజు. అతని మేడ ప్రక్కనే నాబోతు అనే పేదవాని పొలముండేది. ఆ రాజుకు ఆ పొలంమీద ఆశ పుట్టింది. అతడు నేను కూరగాయలు పండించుకోవాలి ఆ పొలం నా కమ్మమని కోరాడు. నాబోతు అది పిత్రార్జితం, నేనా పొలాన్ని అమ్మనని మొండిపట్టు పట్టాడు. అంతట అహాబు ప్రోద్బలంపై ఇద్దరు దుర్మార్గులు నాబోతు మీద నేరం తెచ్చారు. అతడు దేవుడ్డీ రాజనీ దూషిస్తున్నాడని కూటసాక్ష్యం పలికారు. అహాబు నాబోతును రాళ్ళతో కొట్టి చంపించి అతని పొలాన్ని స్వాధీనం చేసికొన్నాడు. అప్పడు యేలీయా ప్రవక్త అహాబును కఠినంగా శపించాడు. నాబోతు పొలంలోనే నీ నెత్తురు కుక్కలు నాకుతాయిపో అన్నాడు. ప్రవక్త అన్నంతపనీ జరిగింది-1 రాజు 21, 1-16,

5. యూదాలో దయ్యం ప్రవేశించింది. అతడు ఆసబోతుతనంతో గురువుని ముప్పది వెండికాసులకు అమ్మకొన్నాడు-లూకా 22, 3-6.

6. యెరూషలేములోని తొలినాటి క్రైస్తవులు ఉమ్మడి జీవితం జీవిస్తూండేవాళ్ళ ఈ సమాజానికి పేత్రు పెద్ద, అననీయ సఫీరా అనే భార్యాభర్తలు వాళ్ళంతట వాళ్లేవచ్చి ఈ సమాజంలో చేరారు. కాని వాళ్ళ పొలం ఆమ్మకోగా వచ్చిన డబ్బులో కొంతసొమ్ము మిగుల్చుకొని మిగతాసొమ్మ మాత్రమే పేత్రుకు ముట్టజెప్పారు. పేత్రు అననీయాను పిల్చి నీకు వచ్చిన డబ్బు ఇంతేనా అని అడుగగా, అతడు ఇంతేనని బొంకాడు. వెంటనే అతడు ప్రాణాలు విడిచి నేలమీద పడ్డాడు. అతని శవాన్ని పాతిపెట్టారు. కొంత సేపయ్యాక సఫీరా భర్త చనిపోయాడన్న సంగతి తెలియక ఎక్కడికోవెళ్ళి తిరిగివచ్చింది. పేత్రు సఫీరా డబ్బువిషయమై ప్రశ్నించగా ఆమెకూడ బొంకింది. సఫీరాకూడ ప్రాణాలు విడిచి నేలమీద పడగా ఆమెనుగూడ పాతిపెట్టారు - ఆచ 5, 1-11

7. పౌలు ఎఫెసు పట్టణంలో బోధిసూ విగ్రహారాధనను ఖండించాడు. ఆ పట్టణంలో దెమిత్రి అనేకమసాలివాడు ఆర్తెమి దేవతకు వెండిగుళ్ళను చేయించి అమ్మేవాడు. ఈ గుళ్ళవలన అతనికి అతని పనివాళ్ళకీ మంచి ఆదాయం వస్తూండేది. కాని పౌలు బోధలవల్ల చాలమంది ఈ గుళ్ళను కొనడం మానేసారు. దెమిత్రి వ్యాపారం పడిపోయింది. కనుక అతడు తన పనివాళ్ళనందరినీ ప్రోగుజేసికొనివచ్చి పౌలుమీద గలాటా లేవదీసాడు. ఎఫెసీయులు పౌలును చంపేకాడికి వచ్చారు. కాని అక్కడి పురపాలక ఉద్యోగులు దొమ్మీదారులను అణచివేసి పౌలు ప్రాణాలను కాపాడారు - ఆచ 19, 23-41

8. పదవీ వ్యామోహం

నరులకు పట్టే ఓ దుర్బుద్ధి పదవీకాంక్ష పేరు ప్రతిష్టల కాసపడి జనులు అందనిపండ్లకు ఆర్రులు చాచుతారు. చివరకు ఎంత పైకి లేవాలనుకొన్నారో అంతక్రిందికి పడిపోతారు.

1. పిశాచం ఏవను మభ్యపెట్టి తినగూడని చెట్టుపండు తినమని దురోధచేసింది. ఆలాతింటే మీరూ మంచిచెడ్డలు తెలిసికొని దేవళ్ళాఐపోతారు ఆంది. ఏవకు ఆ పండ్లమీద ఆశపుట్టింది. అవి కంటికింపుగా వున్నాయి. నోటికి రుచిగా కూడ వుండవచ్చు. తామూ ఆ పండ్లతిని మంచిచెడ్డలు తెలిసికొని దేవుళ్లిపోతే ఎంతబాగుంటుంది అనుకొంది. దేవుళ్లు కావాలన్న కోర్కెతోనే ఆదామేవలు తినరానిపండ్లు తిన్నారు - ఆది 3, 5-6

2. కోరా మరియు అతని యనుచరులూ మోషే అహరోనుల్లాగ యాజకులు కావాలనుకొన్నారు. కనుక వాళ్లు మోషే అహరోనులమీద తిరగబడ్డారు. ఇంకా దాతాను ఆబీరాము అనేవాళ్లు మోషే అహరోనుల్లాగ ప్రజానాయకులు కావాలనుకొన్నారు. కనుక వాళ్లగూడ ఆ యన్నదమ్ములమీద తిరగబడ్డారు. అపుడు మోషే దేవుని ప్రార్ధింపగా నేల నోరువిప్పి తిరుగుబాటుదారులందరిని బ్రిమింగివేసింది - సంఖ్యా 16, 31-32.

3. అబ్సాలోమునకు తండ్రి దావీదునకు బదులుగా తాను రాజకావాలన్న బుద్ధిపట్టింది. అతడు రథాలూ గుర్రాలూ చేకూర్చుకొని వైభవంగా తిరగడం మొదలెట్టాడు. ఏబైమంది బంటులు ముందునడచి అతనికి బరాబరులు చేస్తూండేవాళ్లు, అతడు నగర ద్వారంవద్ద నిలుచుండి వస్తూపోతూండేవాళ్ళను ఆప్యాయంగా పలుకరించి వాళ్ళమన్ననలను సంపాదించాడు. తరువాత అబ్వాలోము దావీదును తరిమేపి తాను రాజయ్యాడు. కాని దావీదు అనుచరులు అతన్ని యుద్ధంలో ఓడించి చంపివేసారు - 2సమూ 15, 1-6.

4. యూదులు బాబిలోను ప్రవాసంలో వుండగా వాళ్ళ ఆడపడచు ఎస్తేరు ఆ దేశపు రాజును పెండ్లి చేసికొని రాణి ఐంది. ఆ దేశపు రాజుకు మంత్రి హామాను. యూదులనాయకుడు మొర్దేకయి. ఇతడు ఎస్తేరురాణికి బంధువు. హామానుకు మొర్దేకయి పాలకవ గిట్టదు. ఓమారు హామాను రాజు కొలువునకు వసూండగా మొర్దేకయి రాజభవన ద్వారం వద్ద కూర్చుని వున్నాడు. కాని అతడు పైకిలేచి నమస్కారంగూడ చేయలేదు. కనుక హామాను మొర్దేకయిని హతమార్చాలనుకొన్నాడు. అతడు భార్యతో మిత్రులతో సంప్రతించి మొర్దేకయిని ఉరితీయించడానికికై ఏబదిమూరలు ఎత్తుగల ఉరికంబాన్ని సిద్ధం చేయించాడు. కాని చివరకు హామానునే ఆ కంబంమీద వరితీసారు - ఎస్తేరు 5, 12-14.

5. జబదెయి కుమారులు యాకోబు యోహానులు. వీరి తల్లి క్రీస్తుకు బంధువరాలు. ఒకతడమ ఆమె కుమారులను వెంటబెట్టుకొని క్రీస్తువద్దకువచ్చి కుమారులిద్దరూ నీ రాజ్యంలో కుడియెడమల కూర్చుండేలా చేయమంది. అనగా వాళ్ళిద్దరికి అందరికంటె పై యుద్యోగాలు లభించాలని ఆమె కోరిక. క్రీస్తు వాళ్ళను జూచి మీరు నా బాధల్లో పాల్గొనగలరా అని అడిగాడు. వాళ్ళ ఏమి తెలియక పాల్గొంటామని తలలూపారు. క్రీస్తు వాళ్ళ అజ్ఞానాన్ని క్షమించి "నా రాజ్యంలో కుడియెడమలందు కూర్చుండే అధికారం నా తండ్రి అనుగ్రహించిన వాళ్ళకేగాని లభించదు" అని చెప్పాడు. తరువాత మిగిలిన పదిమంది శిష్యులూ ఈ సంగతంతా విని యాకోబు యోహానులను చీవాట్లు పెట్టారు - మత్త 20, 20–24.


6. ఓ తడవ శిష్యులు కపెర్నహూము అనే వూరికి వెళూన్నారు. వాళ్ళ త్రోవలో నేను గొప్పంటే నేను గొప్పని తమలోతాము వాదోపవాదాలు చేసికొన్నారు. ఆ వూరు చేరినంక క్రీస్తు వాళ్ళనుజూచి మీలో మీకు వివాదమెందుకు పుట్టిందని ప్రశ్నించాడు. వాళ్ళు నిజం బయటపడిందని తెలిసికొని సిగ్గుతో తలలు వంచుకొన్నారు - మార్కు9, 33-35.

7. శిష్యులు క్రీస్తురాజ్యమొకటుందనీ, అక్కడ తమకు గొప్ప పదవులు లభిస్తాయనీ అపోహపడేవాళ్లు కనుక వాళ్లు క్రీస్తుదగ్గరకివచ్చి పరలోకరాజ్యంలో ఎవడు గొప్పవాడౌతాడో చెప్పమని అడిగారు. ప్రభువు శిష్యులు పదవీవ్యామోహం గుర్తించి వాళ్ళకు ఓ చిన్నబిడ్డను చూపించాడు. ఈ చిన్న బిడ్డలా తన్నుతాను తగ్గించుకొనేవాడే పరలోకరాజ్యంలో గొప్పవాడౌతాడని బోధించాడు. దేవుని యెదుట రాణించేది మన పెద్దరికం కాదు, అణకువ — మత్త 18, 1-5.

8. ఒకమారుపేతురు యోహాను సమరయ పట్టణానికి వచ్చారు. అంతకుమందే ఫిలిప్ప అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. పేతురు యోహాను అక్కడి జనులమీద చేతులు చాచగా వాళ్లు పరిశుద్దాత్మను పొందారు. ఆ పట్టణంలో మంత్ర విద్యలో మెప్పవడసిన సిమోననే అతడు ఉన్నాడు. అతడు పేతురు, యోహాను, ఫిలిప్ప శిష్యులకు పరిశుద్ధాత్మను ఈయడం చూచాడు. తానూ ఆ యాత్మను సంపాదిస్తే ఇతరులకు డబ్బుకు అమ్ముకోవచ్చుగదా అనుకొన్నాడు. కనుక అతడు అపోస్తలుల మందు కొంతడబ్బుపెట్టి నాకుకూడ ఈ యాత్మను సంపాదించే శక్తినీయండని కోరాడు. అప్పడు పేత్రు నీవు డబ్బుపెట్టి దేవుని వరాన్ని కొనగలవా అని అతన్ని చీవాట్లపెట్టి పంపాడు - అచ 8, 17-24.

9. కోపం

మనం సులభంగా కోపానికి వశులమైపోతాం. కోపం వచ్చినపుడు మంచిచెడ్డలుకూడ మరచిపోయి చేయరాని పనులు చేస్తాం. తర్వాత తెలివివస్తుంది. కాని చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటే యేమిలాభం?

1. దేవుడు తమ్ముని కానుకను అంగీకరించి తన కానుకను నిరాకరింపగా కయీనుకు విపరీతమైన కోపర వచ్చింది. అతడు హేబెలును పొలానికి తీసికొనివెళ్ళి అక్కడ అతన్ని చంపివేసాడు - ఆది 4, 3–8.

2. యాకోబు యేసావునకు రావలసిన తండ్రి దీవెన మోసముతో తాను కొట్టేసాడు. కనుక ఏసావు యాకోబుమీద పగబట్టాడు. తండ్రి యీసాకు మృతినిగూర్చి శోకదినాలు గడచిన పిమ్మట యాకోబు తిత్తి తీయాలనుకొన్నాడు. కాని జిత్తులమారియైన యాకోబు ఈ సంగతి పసిగట్టి ముందుగనే మేనమామ లాబాను నొద్దకు పారిపోయాడు - అది 27, 41.

3. నీనివే యూదులుగాని అన్యజాతివాళ్ళు వసించే పట్టణం. ఆ పట్టణ పౌరులు దుర్మారులైపోయారు. ఐనా ప్రభువువాళు నాశమైపోవాలని గాదు, పశ్చాత్తాపపడి మనసుమార్చుకోవాలని కోరుకొన్నాడు. కనుక యోనా అనే ప్రవక్తను పిలిచి నీవు వెళ్ళి నీనివేపట్టణవాసులకు బోథించు వాళ్ళకు పశ్చాత్తాపం కలుగుతుంది అన్నాడు. కాని అన్యజాతిజనులు ఆలా పశ్చాత్తాపపడి బ్రతికిపోవడం యోనాకిష్టంలేదు. అతడు దేవునిమీద కోపపడ్డాడు. నీనివే పట్టణానికి వెళ్ళడానికి మారుగా ఓడనెక్కి మరో దిశనున్న తర్పీసు పట్టణానికి వెళూన్నాడు. కాని దారిలో ఓడసరంగులు యోనాను సముద్రంలో పడద్రోసారు. ఓ పెద్దచేప అతన్నిబ్రిమింగి ఒడ్డున వెళ్ళగ్రక్కింది. ప్రభువు మళ్ళాయోనాను నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈమారు అతడు వెళ్ళాడు - యోనా 1-2

4. యోనా ప్రవక్త మీరు పరివర్తనం చెందండని బోధించగానే నీనివే పట్టణ పౌరులు పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వాళ్ళను నాశం చేయకుండ క్షమించి వదలివేసాడు. ఈలా అన్యాజాతివాళ్ళను క్షమించి వదలివేసినందులకైయోనా మళ్లాదేవునిమీద అలిగాడు. అతడు నీనివే పట్టణానికి వెలుపల ఓ పందిరి వేసికొని దానిక్రింద కూర్చున్నాడు. ఒకవేళ పట్టణం నాశమై పోతుందేమోనని అటువైపు పారజూస్తూన్నాడు. ఇంతలో ఒక తీగ ఆ పందిరిమీదికి ఎగబ్రాకి యోనాకు నీడ నిచ్చింది, ఆ తీగను చూచి అతడు చాల సంతోషించాడు. కాని మరునాడు దేవుడు ఆ తీగ యెండిపోయేలా చేసాడు. నీడ లేకపోయేప్పటికల్లా యోనా యెండదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తీగ యెండిపోయినందుకు ఎంతో చింతించాడు. అప్పడు ప్రభువు యోనాకు గుణపాఠం నేర్పాడు. "నీవు ఒక్కతీగ చచ్చినందుకే ఇంతగా దుఃఖిస్తున్నావే! మరి నీనివే పట్టణంలో ఇందరు జనులూ ఇన్నిగొడల్లా నాశమైపోతే నాకు బాధ కలగదా? అన్నాడు. దేవుడు అందరిపట్ల దయ జూపేవాడని యోనా అప్పడు గ్రహించాడు - యోనా 4.

5. నామాను సిరియాదేశపు సైన్యాధిపతి. అతడు కుష్టరోగియై చికిత్సకోసం యిస్రాయేలు దేశంలో వున్న యెలీషా ప్రవక్తవద్దకు వచ్చాడు. నామాను, యెలీషా తన లావజూచి ఎదురువచ్చి తనను కలిసికొంటాడనుకొన్నాడు. కుష్ఠతో నిండిన తన దేహంమీద చేయిచాచి వ్యాధి నయంచేస్తాడనుకొన్నాడు. కాని యెలీషా తన మొగమైనా చూపించకుండానే అతన్ని యోర్గాను నదికివెళ్ళి ఏడుసార్లు స్నానం చేయమని కబురు పంపాడు. నామాను ఉగ్రుడైపోయాడు. ఈలాంటి నదులు మా దేశంలో చాలావున్నాయి. నేను అక్కడికెళ్ళి స్నానం చేసికొంటానులే అని తిరిగి వెళ్ళిపోవడానికి సంసిద్దుడయ్యాడు. కాని సేవకులు అతన్ని సముదాయించి యోర్దును నదికి తీసికొని వెళ్ళారు. ఆ నదిలో మునగగానే అతనికి కుష్ట పోయింది. నామాను తన తప్పను గ్రహించి యెలీషాకు కానుకలు అర్పించబోయాడుగాని ప్రవక్త అవేమీ స్వీకరించలేదు - 2 రాజు 5, 9–14.

6. హేరోదు జ్ఞానులతో "మీరువెళ్ళి యూదులకు రాజుగా బుట్టిన క్రీస్తుశిశువును ఆరాధించండి. మళ్ళా తిరిగి వచ్చి నాకు ఆ బిడ్డ వర్తమానము తెలియజేసారంటే నేను గూడ వెళ్లి అతన్ని ఆరాధించి వస్తాను" అన్నాడు. కాని వాళ్లవర్తమానం విని శిశువును చంపివేయాలనే హేరోదు కోరిక. అయినా జ్ఞానులు తిరిగి అతని వద్దకు రానేలేదు. హేరోదుకు శివమెత్తింది. అతడు బేత్లేహేముకు చుట్టుపట్ల ఉన్న మగబిడ్డలందరునీ చంపించాడు. క్రీస్తు శిశువుగూడ వాళ్లలో నాశమై ఉండాలి అనుకొని సంతృప్తి చెందాడు — మత్త 2, 1-8.

7. క్రీస్తు అద్భుతాలు చేస్తుండగా యూదనాయకులకు కన్ను కుట్టింది. ప్రభువు విశ్రాంతి దినాన అద్భుతాలు చేయకూడదని వాళ్లు కట్టడచేసారు. కాని ప్రభువు విశ్రాంతి దినాన గూడ ఓ అవిటిచేతివాని చేయి నయంచేసాడు. ఆ యద్భుత క్రియనుచూచి యూదనాయకులు పండ్లు పటపట కొరికారు. వెర్రికోపంతో క్రీస్తుని ఏమిచేయాలా అని కుట్రలు పన్నడం ప్రారంభించారు — లూకా 6, 6-10.

8. 1) త్వరగా కోపపడేవాడు తొందరపడిపోతాడు.
కాని వివేకవంతుడు ఓర్పుతో మెలుగుతాడు - సామె 14,17.

2) వీరునికంటె శాంతచిత్తుడు మేలు నగరాన్ని జయించినవానికంటె తన్నుతాను జయించుకొన్నవాడు అధికుడు - సామె 16,32.

10. అశ్రద్ధ

జీవితంలో ఒకోమారు సోమరితనానికి గురౌతాం. చేయవలసిన పని సరిగా చేయం. మన బాధ్యతలను మనం తృప్తికరంగా నిర్వహించం. ఈలాంటి అశ్రద్ధవలన ప్రభుశిక్షకు గురౌతాం. 1. యోసేపుతోపాటు ఫరోరాజు పానీయవాహకుడూ వంటవాడూ కూడ చెరలో ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెండు కలలొచ్చాయి. పానీయవాహకునికి తాను మూడు ద్రాక్షపండ్ల గుత్తులు చిదిమి రసంతీసి చక్రవర్తికి అందించినట్లుగా కల వచ్చింది. యోసేపు అతనితో "ప్రభువు మూడురోజుల్లో నిన్నుచెరనుండి విడిపించి మల్లానీ పదవిలో నిన్ను నిల్పుతాడు. 206 నీవు బయటపడినప్పడు నన్ను గుర్తుపెట్టుకో" అని చెప్పాడు. వంటవాడికి తన తలమీద ఉన్న మూడు గంపల్లోని పిండివంటలు పక్షులు తినిపోతున్నట్లుగా కలవచ్చింది. యోసేపు అతనితో "మూడు రోజుల్లో ఫరోరాజు నిన్ను ఉరితీయిస్తాడని ఈ కలభావం” అని చెప్పాడు. అతడు చెప్పినట్లే ప్రభువు పానీయవాహకుని వెలుపలకి తీయించి వంటవాణ్ణి ఉరిదీయించాడు. కాని పానీయవాహకుడు యోసేపువలన మేలు పొందినా చెరనుండి బయటికి రాగానే అతన్ని పూర్తిగా మరచిపోయాడు - ఆది 40.

2. న్యాయనిర్ణయాన్ని గూర్చి క్రీస్తు చెప్పిన సామెత ఒకటుంది. తోడి జనాన్ని ఆదరిస్తే దేవుణ్ణి ఆదరించినట్ల. తోడి జనాన్ని చిన్నచూపు జూస్తే దేవుణ్ణి చిన్నచూపు జూచినట్ల. కొందరు తోడి జనాన్ని అన్నంబెట్టక, దాహమీయక బట్టలీయక, ఉపచారంచేయక ఆ శ్రద్దచేసారు. ప్రభువు తన విషయంలోనే ఈలాంటి అశ్రద్ధ చూపినట్లుగా భావంచి, వాళ్ళకు నిత్య శిక్ష విధించాడు - మత్త 15, 45.

3. ఓ బాటసారి యెరూషలేమునుండి యెరికోకు వెళూన్నాడు. దారిలో దొంగలు అతన్ని దోచుకొని గాయపరచి త్రోవ ప్రక్కన పడవేసిపోయారు. ఓ యాజకుడూ లేవీయుడూ ఆ త్రోవవెంట వసూ గాయపడివున్న బాటసారిని చూచారు. చూచికూడ ఏమీ పట్టించుకోకుండ ప్రక్కకు తొలగి వెళ్ళి పోయారు - లూకా 10, 30-32.

4. క్రీస్తుని అనుసరింపగోరినవాళ్ళల్లో ఓ అతనికి చంచలబుద్ధి పట్టింది. అతడు నేను వెళ్ళి మానాన్న చనిపోయిందాకా వుండి అతన్ని పాతిపెట్టి మళ్లావస్తానన్నాడు. కాని ప్రభువు అతనితో "చనిపోయిన వాళ్ళసంగతి చనిపోయినవాళ్ళు చూచుకొంటారు. నీవువచ్చి నన్ను వెంబడించు" అన్నాడు మత్త 8,22.

5. ఓ యజమానుడు ముగ్గురు సేవకులకు డబ్బు ఇచ్చి దేశాంతరం పోయాడు. అతడు తిరిగి వచ్చేప్పటికల్లా తొలియిద్దరు సేవకులూ తాము తీసికొన్న డబ్బు వృద్ధి చేసారు. కాని మూడవ సేవకుడు తాను పుచ్చుకొన్న డబ్బు వృద్ధిచేయలేదు. యజమానుడు అతని అజాగ్రత్తకు మండిపడి నీవు పనికిమాలిన చెడ్డదాసుడవని చీవాట్ల పెట్టాడు. అతనికిచ్చిన డబ్బు కాస్త తీసికొన్నాడు — మత్త 25, 25-26.

6. ఒకరాజు తన కుమారుని పెండ్లి విందునకు ఆతిథులను ఆహ్వానించాడు. వాళ్ళల్లో ఒక్కడుమాత్రం విందు దుస్తులు తొడుగుకోకుండానేవచ్చి విందారగిస్తున్నాడు. రాజు అతిథులను చూడవచ్చి అతన్ని గుర్తుపట్టి కోపంతో బయటి గెంటించాడు. కనుక మన మెప్పుడూ ప్రభురాజ్యానికి సంసిద్దులమై యుండాలి - మత్త 22, 11-18.

7. ఓ పెండ్లిలో పదిమంది కన్నెలు పెండ్లికుమారునికి స్వాగతమీయడానికై వేచివున్నారు. వాళ్లల్లో ఐదుగురు తెలివైనవాళ్ళు ఐదుగురు తెలివిలేనివాళ్ళు తెలివైన కన్నెలు తమ దివ్వెలకు నూనె సిద్ధంచేసికొన్నారు. తెలివిలేని కన్నెలకు నూనెలేదు. పెండ్లికుమారుడు ఆలస్యం చేసినందున వాళ్ళంతా కొంచెంసేపు నిద్రపోయారు. అర్ధరాత్రికి పెండ్లికుమారుడు రాగా, ఆ కన్నెలందరూ లేచారు. అప్పడు తెలివైనవాళ్ళు నూనెపోసి దివ్వెలు వెలిగించుకొని అతనికి స్వాగతమిచ్చారు. వాళ్ళ అతనితోపాటు పెండ్లివిందు జరిగే శాలలోనికి వెళ్ళారు. తెలివిలేని కన్నెలు ఆ యపరాత్రిలో నూనెకోసమని అంగడికి పరుగెత్తారు. కాని వాళ్ళ తిరిగి వచ్చేటప్పటికల్లా పెండ్లివిందు జరిగేశాలను మూసివేయనే మూసివేసారు. - మత్త 25, 1-13.

8. ఓ అతని రాతిపునాదిమీద ఇల్లు కట్టాడు. వాన కురిసింది. వరదలు వచ్చాయి. వరదలు ఆ యింటిచుటూ పారినా దాని పునాది కదలలేదు. మరో అతను ఇసుకపనాది మీదనే యిల్ల కట్టాడు. వాన కురిసింది వరదలు వచ్చాయి. వరదలు ఆ యింటిచుటూ పారగా దాని పునాది కాస్త కొట్టుకొని పోయింది. క్రీస్తు బోధలు ఆలించి ఆ బోధల ప్రకారం జీవించేవాడు తొలివానిలాంటివాడు. కాని క్రీస్తు బోధలు ఆలించి వాటి ప్రకారం జీవించనివాడు రెండవవాని లాంటివాడు- మత్త 7, 24-27.

9. నీకు వెంటనే యిచ్చే శక్తివుంటే యిచ్చేయి. మల్లా రేపురా, అప్పడిస్తానులే అనవద్దు - సామె 8, 28.

11. పగ

అల్పమానవులు ద్వేషానికి లొంగిపోతూంటారు. పగ వలన తోడి నరులకు కీడు చేయబోతారు. కాని దీనివలన మన అల్పత్వమే బయటపడుతుంది.

1. పూర్వ ఉదాహరణల్లో కయీను హెబెలమీదా, యోసేపు సోదరులు యోసేపుమీదా, ఏసావ యాకోబుమీదా, అబ్వాలోము ఆమ్మోనుమీదా,సౌలు దావీదుమీదా, హామాను మొర్టెకయిమీదా, హెరోదియా స్నాపక యోహాను మీదా పగబూనారని చెప్పాం. షిమీ దావీదుమీద పగబూనాడు. దావీదు అబ్వాలోమునకు వెరచి పారిపోతుండగా ఇతడు మార్గంలో దావీదును కలిసికొని అతన్ని శపించాడు. అతనిమీద దుమ్మెత్తిపోసాడు రాళ్ళ రువ్వాడు. ఐనా దావీదు సహించి ఊరుకొన్నాడు. తరువాత దావీదు చనిపోతూ తన కుమారుడు సోలోమోనును ఇతనిమీద పగతీర్చుకొమ్మని చెప్పాడు - 2సమూ 16, 5-10.

2. ఫిలిస్టీయులు సంసోనును బంధించి అతని కండ్లు తీయించారు. అతన్ని నానాహింసలూ పెట్టారు. ఓమారు తమ దేవుడైన డాగోను దేవాలయంలో ఉత్సవం చేసికొంటూ సంసోనును రప్పించి అతన్ని ఎగతాళి చేసారు. ఆ యవమానాన్ని భరించలేక సంసోను దేవాలయాన్ని మోస్తున్న రెండు స్తంభాలనూ రెండుచేతులతో బలంగా నెట్టాడు. 208 డాగోను దేవాలయం కూలిపడి ఫీలిస్టీయులంతా చచ్చారు. వాళ్ళతోపాటు సంసోనుకూడ చనిపోయాడు. ఆ విధంగా అతడు బ్రతికివున్నప్పటి కంటె చనిపోయినపడే ఎక్కువమంది ఫిలిస్టీయులను చంపి వాళ్ళమీద పగతీర్చుకొన్నాడు - న్యాయాధి 16,28-30.

3. క్రీస్తు బోధలూ అద్భుతాలూ చూడగా యూదనాయకులకు కన్ను కుట్టింది. వాళ్ళు అతన్నిద్వేషించారు. ఏలాగైనా అతన్ని చంపించాలని కుట్రలు పన్నారు - యోహా 15, 22-25.

4

1) మీ పొరుగువాళ్ళను ప్రేమించి మీ శత్రువులను ద్వేషించమని
పూర్వవేదం బోధిస్తుంది. కాని నేను చెప్పడమేమిటంటే, మీ
శత్రువులనుగూడ ప్రేమించండి. అప్పుడు మీరు పరలోకంలోని
తండ్రికి కుమారులౌతారు — మత్త 5, 43.

2) ఎవడైన ఓ వైపున నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పకొంటూ
మరోవైపున తోడినరుణ్ణి ద్వేషిస్తూన్నట్లయితే వాడు అబద్దాలకోరు
ఔతాడు. కంటికి కనుపించే తోడినరుణ్ణి ప్రేమించలేనివాడు కంటికి
కనుపించని దేవుణ్ణి ఏలా ప్రేమిస్తాడు? - 1 యోహా 4,20.

3) నేను వెలుగులో ఉన్నానని చెప్పకొంటూ తోడి నరులను ద్వేషించేవాడు
ఇంకా చీకటిలోనే ఉన్నాడని చెప్పాలి - 1 యోహా 2,9.

12. అవిధేయత

పొగరువల్ల పెద్దలమాట జవదాటుతూంటాం. ఆలాగే దేవునిపట్లగూడ అవిధేయత చూపుతూంటాం. ఈ యవిధేయతకు దేవుడు నరుడ్డి శిక్షిస్తూంటాడు.

1. ప్రభువు తోటనడుమనున్న చెట్టుపండు తాకవద్దని ఆది దంపతులకు ఖండితంగా ఆజ్ఞ యిచ్చాడు. ఆలా తాకితే వాళ్ళకు చావు మూడుతుందనికూడ చెప్పాడు. అయినా వాళ్లు పిశాచంమాట నమ్మి ప్రభువు ఆజ్ఞమీరారు, చావు తెచ్చిపెట్టుకొన్నారు - ఆది 3, 2-3.

2. అబీహు నాదాబు అహరోను కుమారులు. వీళ్ళ ప్రభువు ఆజ్ఞాపింపకున్నా ధూపకలశాలు తీసికొని యావే యెదుట సాంబ్రాణిపాగ వేసారు. ప్రభువు వాళ్ళను నిప్ప మంటలతో కాల్చివేసాడు - లేవీ 10, 1-2

3. ప్రభువు తన్ను దప్ప అన్యదైవతాలను ఆరాధించగూడదని యిస్రాయేలు ప్రజకు ఆజ్ఞయిచ్చాడు. వాళ్ళ చుట్టుపట్లవున్న కనానీయులు ఎద్దును ఆరాధించడం చూచారు. మనమూ ఆ యెదును ఆరాధిస్తే ఎంతో బాగుంటుందని ఉవ్విళ్ళూరిపోయారు. ఓమారు మోషే సీనాయి కొండ మీదికిపోయి నలువది నాళ్ళదాకా అక్కడే వండిపోయాడు. అతడు కొంచెం ఆలస్యం చేసిందే తడవుగా, యిప్రాయేలీయులు అహరోను నాయకత్వం క్రింద బంగారు కోడెదూడను చేసికొని దాన్ని ఆరాధించడం మొదలెట్టారు - నిర్గ 32, 7-8.

4. బిలాము ప్రభువు వద్దన్నా వినక యిస్రాయేలు శత్రువూ మోవాబు రాజూ ఐన బాలాకును దీవించడానికి గాడిద నెక్కి పయనం కట్టాడు. యిప్రాయేలును శపించడానికే బాలాకు బిలామను పిలిపించాడు. త్రోవలో ప్రభువదూత బిలాము గాడిదకు అడ్డుపడి దాన్ని ఆపాడు. బిలాము మూడుసార్లు గాడిదను చావమోదాడు. అప్పుడు గాడిద దైవశక్తితో మాటలాడింది. తన్నుకొట్టవద్దని మొరపెట్టుకుంది. దేవదూతగూడ బిలాముకు ప్రత్యక్షమై అవిధేయతకుగాను అతన్ని మందలించాడు. - సంఖ్యా 22, 31-35.

5. మోషే అహరోనులు ఫరోవద్దకువచ్చి యిస్రాయేలు ప్రజను ఐగుపునుండి పంపవలసిందిగా యావే ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పారు. ఫరో అహంభావంతో "ఎవడా యావే? అతడు చెప్పిన మాటలు విని నేనెందుకు యిస్రాయేలీయులను పంపాలి?" అన్నాడు. ప్రభువు ఫరోను సర్వనాశంచేసి తన ప్రజను ఐగుప్మనుండి తోడ్కొని పోయాడు - నిర్గ5, 2.

6. యిప్రాయేలు ప్రజలను శత్రువులు బాధింపగా వాళ్లు ప్రభువుకి మొరపెట్టేవాళ్లు. ప్రభువు వాళ్ళమీద కరుణబూని ఓ న్యాయాధిపతిని నియమించేవాడు. ఈ న్యాయాధిపతి శత్రువుల నుండి యిప్రాయేలును రక్షించేవాడు. కాని అతడు చనిపోగానే వాళ్ళమూరులై అన్యదైవతాలను ఆరాధించేవాళ్ళు అపుడు ప్రభువు వాళ్ళను శిక్షించడానికై శత్రువుల పాలుచేసేవాడు. వాళ్ళ శత్రువుల బాధ భరించలేక మళ్లా ప్రభువుకు మొరపెట్టుకొనేవాళ్ళ నరుల బలహీనత ఈలా వుంటుంది - న్యాయాధి 2, 18-19.

7. సౌలు గిల్లాలువద్ద సమూవేలు కొరకు వేచివున్నాడు. సమూవేలు ప్రవక్త నేను వారందినాల్లో వస్తాను. నేను వచ్చిందాకా బలి సమర్పించవద్దన్నాడు. కాని ప్రవక్త తాను పెట్టిన గడువులో రాలేదు. శత్రువులైన ఫిలిస్టీయులువచ్చి మీద పడేలాగూ వున్నారు. సౌలు ఆతురత పట్టలేక తానే బలి సమర్పించాడు. ఆ బలి ముగియడంతోనే సమూవేలు వచ్చి మాట మీరినందుకు సౌలును మందలించాడు. నీవు దేవుని ఆజ్ఞ మీరావు గనుక దేవుడు నిన్ను రాచరికంనుండి త్రోసివేసాడని చెప్పాడు - 1సమూ 13, 13-14.

8. అహాబు సిరియారాజైన బెన్షద్రదును జయించాడు. ప్రభువు ఈ బెన్హ దదును శాపంపాలుచేసి సంహరించమని చెప్పాడు. కాని బెన్షదదు కపటంతో అహాబును శరణువేడగానే అహాబు గుండె కరిగి అతన్ని ప్రాణాలతో వదలివేసాడు. అపుడు ప్రభువు అహాబునొద్దకు ఓ ప్రవక్తను పంపి బెన్షదదు ప్రాణాలకు మారుగా నీ ప్రాణాలు పోతాయని చెప్పించాడు 1 రాజు 20, 42-43. 9. సోలోమోను రాజు మహాజ్ఞాని. కాని అతడు స్త్రీలోలుడై పోయాడు. అతడు చాలామంది అన్యజాతి స్త్రీలను పెండ్లియాడాడు. వాళ్ళంతా అతని హృదయాన్ని అన్యదేవతలవైపు త్రిప్పివేసారు. ఈ విధంగా అతడు అన్యజాతి స్త్రీలను వివాహ మాడకూడదన్నయావే యాజ్ఞ మీరి కడకు ఆ ప్రభుని ఆరాధించడం కూడ మానుకొన్నాడు1 రాజు 11, 2-3.

10. కోడి తన పిల్లలను రెక్కలకిందికి చేర్చుకొని కాపాడుతుంది. ఆలాగే క్రీస్తుకూడ యెరూషలేము పౌరులను కాపాడేవాడే కాని వాళ్ళు అతనిమాట వినలేదు - మత్త 23, 37-38.

13. గొణగుడు

మనం సహనం కోల్పోయి పై యధికారులమీద తప్పమోపుతాం. వాళ్ళమీద గొణగుతాం. ఈ గొణగుడు మన అసమ్మతిని తెలియజేస్తుంది. కనుక అది భగవంతునికి ప్రియపడదు. అతడు ఓకోమారు మన అవిధేయతను శిక్షిస్తుంటాడు గూడ.

1. యావే పంపించిన అరిష్టాలకు భయపడి ఫరో యిస్రాయేలును పంపివేసాడు. కాని వాళ్లు రెల్లసముద్రం వద్దకు పోగానే అతడు మనసుమార్చుకొని మళ్ళా వాళ్ళను పట్టుకొని రావాలని సైన్యంతో వచ్చాడు. సైన్యాన్ని చూచి యిస్రాయేలు ప్రజలు భయపడిపోయారు. మోషేమీద గొణిగారు. ఐగుప్తదేశంలో పూడ్చిపెట్టడానికి తావుదొరక్క మమ్ము ఇక్కడికి తీసికొని వచ్చావా అని అతన్ని నిందించారు. తరువాత ప్రభువు యిస్రాయేలును సముద్రం దాటించాడు. ఫరోచక్రవర్తినీ అతని సైన్యాన్నీ సముద్రంలో మంచివేసాడు - నిర్గ 14, 12.

2. యిప్రాయేలు ప్రజలు మోషేతో యెడారిలో ప్రయాణం చేస్తూ మెరిబా అనే తావుకి వచ్చారు. అక్కడ వాళ్ళకు త్రాగడానికి నీళ్ళ దొరకలేదు. వాళ్ళు వెంటనే మోషేమీద తిరగబడ్డారు. ఐగుప్తు లో వుండగా కడుపునిండా అన్నం దొరికింది. ఇక్కడ కూడూ నీళ్ళు కూడ కరువయ్యాయి అని గొణగారు. ప్రభువు ఆజ్ఞపై మోషే బెత్తంతో కొండబండను చరవగా నీటిపాయ పుట్టింది. జనం ఆ నీళ్ళు త్రాగి సంతృప్తి చెందారు - సంఖ్యా 20, 5-6.

3. యిప్రాయేలీయులు ఎడారిలో హోరు కొండ ప్రక్కగా నడుస్తున్నారు. వాళ్ళు మార్గాయాసంవల్ల సొమ్మసిల్లిపోయి మోషేమీద గొణగడం ప్రారంభించారు. "ఈయెడారిలో లభించే చవీసారమూ లేని అన్నం యెవరికి కావాలి? అసలు నీవు ఐగుప్తు నుండి మమ్మెందుకు తీసికొని వచ్చావు?" అని దబాయించారు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికై ప్రభువు నిప్పపాములను పట్టించాడు. అవి కరవగా చాలమంది చనిపోయారు. అపుడు ప్రజలు బుద్ధితెచ్చుకొని మోషేకు మనవిచేసారు. అతడు ఇత్తడి పామును చేయించి గడెమీద వ్రేలాడదీయించాడు. దానివైపు చూచినవాళ్ళంతా విషం విరిగి బ్రతికిపోయారు - సంఖ్యా 21, 5-9.

4. మళ్ళా యిస్రాయేలీయులు ప్రయాణం చేస్తూ మారా అనే తావుకి వచ్చారు. అక్కడి నీళ్ళు కటిక ఉప్పలు. ఆ నీళ్ళు త్రాగలేక జనం మోషేమీద తిరగబడ్డారు. వెంటనే గొణగుడు ప్రారంభించారు. అపుడు మోషే ప్రభువు ఆనతిపై ఒక చెట్టు కొయ్యను ఆ నీళ్ళలో పడవేయగా అవి తియ్యని నీళ్ళయ్యాయి - నిర్గ 15, 25.

5. కోరా, దాతాను, అబీరాము మోషేమీద తిరుగబడ్డారు. దాని ఫలితంగా నేల నోరువిప్పి వాళ్ళను ్రమింగివేసింది.అదిచూచి యిప్రాయేలు సమాజం మోషేమీద గొణగారు. నీవు ప్రభు ప్రజను చంపివేసావుగదా అని దూషించారు. అపుడు ప్రభువు ప్రత్యక్షమై ఆ ప్రజలను నాశంచేయబోయాడు. కాని మోషే ప్రభుని వేడుకొని ఆయుపద్రవాన్నివారించాడు - సంఖ్యా 16, 41.

6. యెరూషలేములో తొలినాటి యూదక్రైస్తవులు ఉమ్మడి జీవితం జీవిస్తున్నారు, వాళ్ళలో పాలస్తీనా యూదులు కొందరు. అన్యదేశాల నుండి వచ్చిన యూదులు కొందరు. అన్నాలు వడ్డించేకాడ అన్యదేశాల నుండి వచ్చిన యూదుల విధవలకు అన్నం అట్టే సరిపోలేదు. కనుక వాళ్ళ వెంటనే పేత్రుమీద గొణగడం ప్రారంభించారు. ఆ గొడవ విని పేత్రు అన్నపానీయాలను పరామర్శించడానికై ఏద్దరు పరిచారకులను నియమించాడు - అచ 6, 1-6,

14. తగాదాలు

కొందరు ఆట ఆడినంత సులభంగా తగాదా ఆడుతూంటారు. కాని ఇది మూర్డుల లక్షణం. బుద్ధిమంతుడైనవాడు తొందరపడి తగాదాకు దిగడు. దిగినా మళ్లా సరుకొని పోతూంటాడు.

1 అబ్రాహాముభార్య సార గొడ్రాలుగావుంది, ఆమె ఆనాటి ఓ ఆచారం ప్రకారం, తన దాసీ ఐగుప్తు బానిసా ఐన హాగారును అబ్రాహామునకు భార్యగానిచ్చి ఆమెకు కలిగిన సంతానాన్ని తన సంతానం చేసికోవాలనుకొంది. కాని హాగారు అబ్రాహామువలన గర్భవతియైననాటినుండి కన్నూ మిన్నూగానక యజమానురాలైన సారాను చిన్నచూపు చూడ్డం మొదలెట్టింది. సారా ఇది సహింపక అబ్రాహాముకు ఫిర్యాదు చేసింది. ఆ బానిసతొత్తును నేలబెట్టి కాలరాచింది. అది యజమానురాలు పెట్టేబాధలు పడలేక యిల్లవిడిచి పారిపోయింది - ఆది 16, 1-6. 2. అబ్రాహాము తమ్ముని కొడుకయిన లోతుకూడ అతని వెంట వచ్చాడు. వాళ్ళిద్దరూ కనానుమండలంలో మూడు పూవులూ ఆరు కాయలుగా వర్ధిల్లారు. ఇద్దరికీ గొర్రెల మందలూ గొడ్లమందలూ కావలసినన్ని వున్నాయి. క్రమేణ అబ్రాహాము జీతగాళ్ళకూ లోతు జీతగాళ్ళకూ తగాదాలు వచ్చాయి. అది చూచి అబ్రాహాము లోతుతో "మనం ఆయినవాళ్ళం. మనలో మనకు ఈలాంటి జగడాలా? ఇక మనం వేరుపడ్డం మంచిది. మనముందు కావలసినంత దేశముంది. నీవు ఎడమవైపుకుబోతే నేను కుడివైపుకు వెల్తాను లేదా నీవు కుడివైపు జరిగితే నేనే ఎడమవైపుకు జరుగుతాను" అన్నాడు. అపుడు లోతు తూర్పువైపునకు జరిగాడు. కనుక అబ్రాహాము పడమటివైపునకు వెళ్ళిపోయాడు. ఆవిధంగా వాళ్ళ తగాదా సమసిపోయింది - ఆది 13, 9–11.

3. మోషే యితియోపియను వధువును పెండ్లిచేసికొన్నాడు. మోషే సోదరియైనమిర్యాముకూ ఈమెకూ పడలేదు. కనుక మిర్యాము అన్నయైన అహరోనునిగూడ చేరదీసికొని మోషేమీద కలహానికి దిగింది - సంఖ్యా 12, 1-2

4. పౌలు బర్నబా స్నేహితులు. వాళ్ళిద్దరూ రెండవ ప్రేషిత ప్రయాణానికి బయలుదేరారు. బర్నబా తన బంధువూ సువిశేషకారుడూ ఐన మార్కునుగూడ వెంటబెట్టుకుని వెళ్లామన్నాడు. కాని దానికి పౌలు సమ్మతించలేదు. ఈ మార్కు మొదటి ప్రేషిత ప్రయాణంలో పౌలుతో పయనమై పోయాడు. కాని పంఫీలియా అనే పట్టనం వరకూ వెళ్ళి అమ్మమీద దిగులు పుట్టగా అక్కడినుండి వెనక్కువచ్చేసాడు. అలా చేయడం పౌలుకు నచ్చలేదు. కనుక అతడు మళ్ళా రెండవ ప్రేషిత ప్రయాణంలో మార్కును తీసికొని వెళ్ళడానికి అంగీకరించలేదు. ఈ విషయమై పౌలు బర్నబాలు గట్టిగా వాదించుకొని ఒకరి నుండి ఒకరు విడిపోయారు. తర్వాత పౌలు మార్కును క్షమించాడు - అచ 15, 、36一40.

5. పౌలు క్రీస్తుతో మోషే ధర్మశాస్త్రం అంతరించిందని ఇపుడు మనలను రక్షించేది ఉత్థాన క్రీస్తేగాని ధర్మశాస్త్రం కాదని బోధించాడు. తోలినాటి యూదక్రైస్తవ సమాజానికి ఈవాదం నచ్చలేదు. వాళ్ళనాయకుడు యాకోబు. ఇతడు క్రీస్తు బంధువు. యూదసమాజంలో పలుకబడి కలవాడు, యెరూషలేములోని యూద క్రైస్తవులంతా ఇతన్ని సమర్ధించారు. కాని అంటియోకయలోని గ్రీకు క్రైస్తవులంతా పౌలును సమర్ధించారు. పేత్రు లోలోపల పౌలు వాదాన్ని నమ్మినా బయటికి మాత్రం, యూకోబుతో చేరిపోతూండేవాడు. అతడు గ్రీకు క్రైస్తవులతో కలియడానికి జంకుతుండేవాడు, ఓమారు పేత్రు అంతియోకయకు రాగా పౌలు అతన్ని ఎదిరించి మాట్లాడాడు. నీనమ్మిక యేమిటో చెప్పమని నిలదీసి అడిగాడు. తర్వాత ఈతగాదా లన్నీ యెరూషలేము సమాజంలో పరిష్కారమయ్యాయి. అక్కడ పౌలు వాదమే నెగ్గింది - గల 2, 11-14 213 6. కొరింతులో పౌలే క్రైస్తవసమాజాన్ని స్థాపించాడు. కాని కొరింతు క్రైస్తవుల్లో చీలికలేర్పడ్డాయి. మనలను రక్షించేది మోషే ధర్మశాస్త్రమేనని వాదించే యూదులు కొందరు కొరింతుకువచ్చి పౌలుమీద లేనిపోని అభాండాలు మోపారు. ఆ రోజుల్లో అపొల్లో అనే ఉపన్యాసకుడుగూడ తన బోధలతో ప్రజలను ఉర్రూతలూగించేవాడు. ఈలాంటి పరిస్థితుల్లో కొరింతు క్రైస్తవులు కొందరు మేము అపొల్లో పక్షమన్నారు. కొందరు పేత్రు పక్షమన్నారు. కొందరు పౌలుపక్షమన్నారు. ఇంకా కొందరు క్రీస్తు పక్షమన్నారు. ఈగందరగోళమంతా చూచి పౌలు చాల బాధపడ్డారు. ఒక్క క్రీస్తు ఇన్ని ముక్కలుగా విభజింపబడ్డాడా అని దుఃఖించాడు - 1కొరి 1, 11-13.

7. తొలినాటి క్రైస్తవులంతా యూదులే. వీళ్ళ యెరూషలేములో ఉమ్మడి జీవితం జీవిస్తూండేవాళ్లు, వీళ్ళల్లో మళ్ళా పాలస్తీనా యూదులనీ, అన్యదేశాల యూదులనీ రెండు తెగలుండేవి. ఈ రెండుతెగలకు పడేదికాదు. అన్యదేశయూదుల తెగవాళ్ళు పాలస్తీనా యూదుల తెగమీద ఫిర్యాదు చేసారు. మా విధవలకు అన్న పానీయాలు సరిగా అందడంలేదు. అంతా మీరే అనుభవిస్తున్నారు అని నేరంతెచ్చారు. పేత్రు సమాజపు భోజన సదుపాయాలు చూడ్డానికి ఏడ్గురు పరిచారకులను నియమించాడు. అపోస్తలులు మాత్రం ప్రార్థనలోను వాక్యబోధలోను కాలం గడిపారు - అకా 6, 1-6.

8.1) మూరలు కయ్యానికి కాలు దువ్వుతూంటారు. కాని తగాదాలు మానుకొనేవాళ్ళ ఘనులు - సామె 20, 3.
2) గయ్యాళిగంపతో ఇంట్లో కాపురముండే దానికంటె ఒంటరిగా యింటిమీద ఓమూల పడివుండడం మేలు - సామె 21, 9.

15. గర్వం

తొలిపాపంవలన భ్రష్కలమైపోయిన మనకందరికీ గర్వం సులభంగా పట్టుకవస్తుంది. కాని దేవునికి గర్వమంటే యెంతో రోత అది పిశాచగుణం.

1. ఫరోరాజు కఠినహృదయుడై యిస్రాయేలీయులను బాధిస్తున్నాడు. ప్రభువు పంపగావచ్చి మోషే యిప్రాయేలును పంపివేయవలసిందిగా యావే ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పాడు. ఆ మాటలకు ఫరో మండిపడి "ఎవడా యావే? అతని మాటలు విని నేనెందుకు ఈ బానిసలను వదలుకోవాలి?" అన్నాడు. ప్రభువు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని అద్భుత క్రియలు చేసినా ఫరో గుండె రాయి జేసికొన్నాడేగాని ప్రజలను పోనీలేదు. కనుక ప్రభువు ఫరోకు తగినశాస్తి చేసాడు. అతన్నీ అతని రథాలనూ నడిసముద్రంలో మంచివేసాడు.

2. హిజ్మియా గొప్పరాజు, అతడు ఒకమారు జబ్బుపడి వుండగా బాబిలోనురాజు సానుభూతి తెల్పుతూ తన దూతల నంపాడు. ఆ దూతలనుజూచి హిజ్కియా ఉబ్బిపోయి తన సిరిసంపదలనూ కోశాగారాన్ని వాళ్ళకు చూపించాడు. ప్రభువు అతని మీద కోపించి ప్రవక్తను బంపి బాబిలోను ప్రజలువచ్చి నీవు చూపించిన ఈ సౌమ్మంతా అపహరించుకొని పోతారు అని చెప్పించాడు - 2 రాజు 20, 12 - 17.

3. యూదులు బాబిలోను ప్రవాసంలో వున్నపుడు మొర్దేకయి వాళ్ళ నాయకుడు. హామాను రాజు కొలువుకాడు. ఓమారు హామాను కొలువుకు వస్తుండగా మొర్దేకయి రాజమందిరంముందు కూర్చుండియుండి పైకిలేవనూలేదు, అతనికి నమస్కారం చేయనూలేదు. హామాను మహా గర్విష్టి అతడు మొర్దేకయిని ఉరిదీయించడానికై ఏబదిమూరల ఉరికంబం తయారుచేయించాడు. కాని ప్రభువు మొర్దేకయిని కాపాడ్డం వల్ల చివరకు హామానే ఆ వురికంబంమీద వ్రేలాడవలసి వచ్చింది - ఎస్తే 3,5.

4. ఉజ్జీయా తెలివైన రాజు, ఈ రాజు కొన్ని మారణ యంత్రాలను కనిపెట్టగా ప్రజలు ఇతన్ని పొగడారు. దానితో పొంగిపోయి అతడు దేవాలయంలో సాంబ్రాణిపొగ వేయబోయాడు. కాని ఎనభై మంది యాజకులు అడ్డువచ్చి ఇది యాజకులు చేయవలసిన పనిగాని రాజు చేయవలసిన కార్యం గాదని అతన్ని వారించారు. ఐనా ఉజ్జీయా వారిమాట విన్పించుకోకుండా అధికార గర్వంతో సాంబ్రాణిపొగ వేయడానికి పీఠందగ్గరికి వచ్చాడు. వెంటనే అతని నొసటిమీద కుష్ఠ పుట్టుక వచ్చింది. యాజకులు అతన్ని దేవాలయం నుండి బయటికి గెంటివేసారు. ఆ మీదట ఉజ్జీయా ఆమరణాంతం ఒంటరిగా వసించవలసివచ్చింది - 2 దినవృ26, 16-21.

5. యాకోబుని చంపించి పేత్రుని చెరలో వేయించిన మూడవ హెరోదు ఓమారు కొలువుదీర్చి ఉపన్యాసమిచ్చాడు. అతని బంటులంతా నీవు ఓ దేవుడిలా మాట్లాడావని పొగడారు. హెరోదు అ పొగడ్డకు ఉబ్బిపోయి తాను నిజంగా దేవుట్టేనని భావించాడు. వెంటనే ఒక దేవదూత ఆ రాజును ఫనోరంగా శిక్షింపగా అతడు పరుగులుపడి చచ్చాడు — ఆచ 12 –22-23.

6. ఓ పరిసయుడూ సుంకరీ ప్రార్ధనచేయడానికి దేవాలయానికి వెళ్ళారు. సుంకరి "ప్రభో? నేను పాపిని నన్ను క్షమించు" అని ప్రార్ధించాడు. కాని పరిసయుడు ప్రభో! నేను ఈ సుంకరిలాంటి వాణ్ణికాదు. నీతిమంతుడ్డి నీకు తెలియందేముంది?" అని ప్రార్థించాడు. దేవుడు ఆ సుంకరి మనవిని ఆలించి పరిసయని మనవిని త్రోసిపుచ్చాడు - లూకా 18, 10-14

7.

1) ప్రభువు ఏవగించుకొనేవి ఏడున్నాయి. అవి అహంకారమూ, అబద్ధాలాడ్డమూ, హత్యచేయడమూ, కీడెంచడమూ, చెడుపనికి పూనుకోవడమూ, కూటసాక్ష్యమూ, తగాదాలు పెట్టడమూను - ਹੇ 6 , 16-19.
2) వినాశానికి ముందుగా అహంకారమూ, పతనానికి ముందుగా ఆహంభావమూ పుట్టుకవస్తాయి - సామె 16, 18.

16. శోధనలు

నరులందరికీ శోధనలు వసూంటాయి. కాని శోధనలతో పాటు దేవుడు వాటిని జయించే శక్తినిగూడ ప్రసాదిస్తూంటాడు. కొందరు ఈ శక్తిని వాడుకొని శోధనలను జయిస్తూంటారు. ఆలా చేయనివాళ్లు వాటికి లొంగిపోతూంటారు.

1. పిశాచం ఆదామేవలను శోధించింది. వాళ్ళ ఆ శోధనలకు లొంగిపోయారు. బత్తెబా సౌందర్యం దావీదు శోధనకు కారణమైంది. అతడు లొంగిపోయాడు. సూసన్న సౌందర్యం ఇద్దరు వృద్దులకు శోధనకారణమైంది. వాళ్ళూ లొంగిపోయారు. పోతీఫరుభార్య యోసేపను శోధించింది. కాని అతడు లొంగిపోలేదు. ఈ యంశాలన్నీపూర్వమే చూచాం. అహాబు దుష్టరాజు. అతని భార్య యెసబెలు పరమ దుర్మారురాలు. હ9o ప్రబోధానికి లొంగిపోవడంవల్ల అహాబు చేయని దుష్కార్యమంటూ లేదు. భార్య అతనికి శోధన కారణమైంది - 1 రాజు 21, 25-26.

2. ఓదినం దేవుడు పిశాచంతో "నా భక్తుడు యోబుని చూచావా? అతడు చాల చిత్తశుద్ధికలవాడు" అన్నాడు. కాని దయ్యం యోబుకు కష్టాలువస్తే అతడు నిన్ను దూషించి తీరుతాడు అని దేవునిమందు సవాలు చేసింది. దేవుడు దయ్యంతో "యోబుని నీ యిష్టంవచ్చినట్లు శోధించుకో. అతని ప్రాణాలుమాత్రం తీయకు" అన్నాడు. కనుక పిశాచం యోబుని పరీక్షించడం మొదలెట్టింది. అతనికి మహా వ్యాధులు కలిగించింది. ఆస్తి నష్టం కలిగించింది. ఐనా యోబు "దేవుడు సిరిసంపదలిచ్చి నపుడు హాయిగా అనుభవించాను. ఇపుడు అతడు వాటిని తీసికొని వెళ్లాడు. కనుక ఆ ప్రభుని భూషిస్తానుగాని దూషించను" అన్నాడు. ఈ రీతిగా యోబు పిశాచ శోధనలను ఎదిరించి నిల్చాడు - యోబు 2, 2-6.

3. ప్రభువు అబ్రాహాముని పరీక్షించడానికై అతని కుమారుడ్డి బలి ఈయమని అడిగాడు. ఆ ముసలి ప్రాయంలో ఈసాకుని కోల్పోతే అబ్రాహాముకి మరోకొడుకు పుట్టాడు. ఐనా అతడు దేవుణ్ణి నమ్మి తన కుమారుడ్డి బలి ఈయడానికి సంసిద్దుడయ్యాడు. దేవుడు ఏదోవిధంగా తన కుమారుణ్ణి బ్రతికించక పోతాడా అని అతని నమ్మకం. అతడు నమ్మినట్లే ప్రభువు ఓ పొట్టేలును బలిగా స్వీకరించి ఈసాకును వదిలివేసాడు - ఆది 22.

4. పిశాచం క్రీస్తుని తండ్రి చిత్తాన్ని మీరమని యెడారిలో ముమ్మారు శోధించింది. ఐనా అతడు పిశాచం శోధనకు లొంగలేదు. అతడు ఏవిధంగానైన సిలువ మరణాన్ని నిరాకరించేలా చేయాలని పిశాచం కోరిక, కాని దయ్యం ప్రభుని ఇక మీదట నేరుగా శోధింపక పేత్రుద్వారా శోధింపబూనుకొంది. ఈ పేత్రు పిశాచ ప్రేరితుడై "ప్రభూ! ఈ సిలువమరణం నీకు వద్దనేవద్దు" అన్నాడు. ప్రభువు పేత్రుని పిశాచం పరి కొల్పిందని గుర్తించి "సైతానూ! నా వద్దనుండి తొలగిపో!" అని గద్దించాడు - మత్త 16, 21-23.

5. దయ్యం పేత్రుద్వారా క్రీస్తుని శోధించాలనుకొంది గాని ఆ ప్రయత్నంలో నెగ్గలేదు. ఇక యూదాద్వారా క్రీస్తుని కూల ద్రోయానలనుకొంది. కనుక యూదాను శోధించడం మొదలెట్టింది. క్రీస్తుని శత్రువుల కైవసం చేయమని యూదా హృదయంలో దురాలోచన పట్టించింది - యోహా 13,2. ఈ యూదా కడపటి భోజన సమయంలో ప్రభువు ఆశీర్వదించి యిచ్చిన రొట్టెముక్కను పుచ్చుకోగానే దయ్యం అతనిలో ప్రవేశించింది. దానితో అతడు క్రీస్తును పట్టీయడానికి వెళ్ళిపోయాడు - యోహా 13, 26-30

6. అననీయ సఫీరా అనే భార్యాభర్తలు యెరూషలేములోని ఉమ్మడి సమాజంలో చేరాలనుకొన్నారు. కనుక వాళ్ళు సొంత ఆస్తిని అమ్మకొంటూండగా పిశాచం వాళ్ళను ప్రేరేపించి, ఆ వచ్చిన డబ్బులో కొంత పైకం మిగుల్చుకొనేలా చేసింది. పిశాచ ప్రేరితులై వాళ్ల పేత్రు ఎదుట బొంకి ప్రాణహాని తెచ్చుకొన్నారు - ఆచ 5, 3.

7. క్రైస్తవులను హింసిస్తున్న సౌలు క్రీస్తు శిష్యుడూ ప్రేషితుడూ అయ్యాడు. ప్రభువు అతనికి చాలసార్లు దర్శనమిచ్చాడుగూడ, ఈ దర్శనాలవల్ల ఒకవేళ పౌలుకి తలతిరుగుతుందేమోనని ప్రభువు అతనికి సైతాను శోధనలు కూడ పంపాడు. పిశాచం పౌలుని కాలిలోని ముల్లలాగ బాధించడం మొదలెట్టింది. దానితో పౌలు తన బలహీనతను అర్థంచేసికొని వినయంతో దేవుని సహాయం అడుగుకొన్నాడు - 2 కొరి 12,7-10.

8.

1) మీరు శోధనల్లో చిక్కుకోకుండా వుండేందుకై ముందుగానే ప్రార్ధన చేయండి — లూకా 22, 40, 2) పిశాచం మొదటినుండి నరహంతకుడే. అబద్దాలాడ్డం వానికి స్వభావసిద్ధం. వాడు అసత్యానికి తండ్రిలాంటివాడు — యోహా 8, 44, 3) దేవుడెప్పడూ మన శక్తికి మించి శోధించడు. శోధనలు వచ్చినపుడు వాటిని భరించే శక్తి నిచ్చి వాటినుండి బయటపడేలా చేస్తాడు - 1Se 10,13.
17. భగవంతుని తోడ్పాటు
నరుడు అల్పుడు. ఐనా భగవంతుడు ఉద్దేశపూర్వకంగా అతన్ని ఆదుకొంటూంటాడు. భగవంతుని ఆదరణను పొందిన వాళ్ళు నీరుపోసిన చెట్టులా పెరిగి వృద్ధిలోకి వస్తారు. దేవుడు మేలుచేయగోరినవాణ్ణి ఎవరూ చెరుపలేరు.

217

1. అన్నలు యోసేపును బానిసగా అమ్మివేసారు. ఐగుప్తదేశంలో ఫరోరాజు సైనికోద్యోగియైన పోతీఫరు అతన్ని కొన్నాడు. ఆ సైనికోద్యోగి యింటిలో యోసేపు మన్ననపొందాడు. కాని అతని భార్య మూలకంగా చెరలో త్రోయబడ్డాడు. ఐనా యోసేపుకు ప్రభువు తోడ్పడ్డాడు. చెరసాల అధికారికి అతనిమీద దయపట్టింది. యోసేపు దైవశక్తివలన తనతోపాటు చెరలోవున్న వంటలవాని కలకూ పానీయవాహకుని కలకూ వివరణం చెప్పాడు. అది తెలిసికొనిఫరోచక్రవర్తికూడ అతనితో తన కలలకు అర్థం చెప్పించుకొన్నాడు. ఫరో యోసేపును మెచ్చుకొని అతన్ని ఐగుప్న దేశాని కంతటికీ సర్వాధికారినిగా నియమించాడు. ఈ విధంగా ఒక హీబ్రూ బానిస గండాలన్నీ తప్పించుకొని ఐగుప్తుకు ప్రధానమంత్రి కాగలిగాడంటే అది భగవంతుని తోడ్పాటువలననే గదా! - ఆది 39, 2.

2. యోసేపు ఐగుప్తున మంత్రిగా వుండగా ప్రపంచమంతటా దారుణమైన కరువు వచ్చింది. అతని సోదరులు కనాను మండలంలో మలమల మాడి చస్తున్నారు. కాని యోసేపు బుద్ధికుశలతతో ఐగుప్శన ముందుగానే ధాన్యం సేకరించి వుంచాడు. యోసేపు సోదరులు ధాన్యం కొనితెచ్చుకోవడానికి ఐగుప్తుకు రెండుసార్లు వెళ్ళారు. రెండవసారి వాళ్ళ యోసేపు తమ్మ శిక్షిస్తాడేమోనని భయపడిపోయారు. ఐనా యోసేపు వారిని క్షమించాడు. సోదరుల ప్రాణాలను కాపాడ్డానికి దేవుడే తన్ను ముందుగా ఐగుప్తుకు చేర్చాడని చెప్పాడు. సోదరులు తనకు కీడు తలపెట్టి తన్ను బానిసనుగా అమ్మివేసినా, దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడని పలికాడు. భగవంతుని తోడ్పాటు లేందే యోసేపు అంత వృద్ధిలోకి వచ్చేవాడా? అతని సోదరులు ఆ కరువు తప్పించుకొని బ్రతికేవాళ్లా?- ఆది 45,7-8; 50.20.
3. ఏలీయా ప్రవక్తగానున్న కాలంలో ఆహబురాజు పరిపాలిస్తూండేవాడు. అతని భార్య యెసబెలురాణి పరమ దుర్మార్గురాలు. ఆమె యావే ప్రభువును నిరాకరించి దేశమంతటా బాలు దేవత ఆరాధనను ప్రోత్సహించింది. ఏలీయా యావేభక్తుడు కావడంవల్ల ఆ దుష్టరాణికి భయపడి పారిపోయి కేరీతు లోయలో దాగుకొన్నాడు. దేవుని ఆజ్ఞపై కాకులు రేపుమాపు అతనికి ఆహారం కొనివసూండేవి. అతడు ఆ యాహారం భుజించి ఆ లోయలోని నీటిపాయలో నీళ్లుత్రాగి ప్రాణాలు నిలుపుకొన్నాడు - 1 రాజు 17,2-6.
4. ఆకాశంలోని పక్షులు విత్తనాలు చల్లి పంటపండించవు. పైరుకోసి నూర్పుళ్లుచేసి ధాన్యం గిడ్డంగుల్లో నిల్వజేయవు. ఐయినా పరలోకంలోని తండ్రి వాటిని పోషిస్తూంటాడు. మరి అతడు పక్షులకంటె శ్రేషుడైన నరుణ్ణి పోషింపకుండా వుంటాడా? ఇంకా, పొలంలో యెదిగే పూల మొక్కలు కష్టపడవు. నూలు వడికి వస్తాలు నేసికొనవు. అయినా భగవంతుడు వాటిని పూలు అనే వస్తాలతో అలంకరిస్తాడు. వాటి పూబట్టలు సాలోమోను మహారాజు తాల్చిన వస్తాలకంటె యింకా అందంగా వుంటాయి. ఈ పూలమొక్కలకంటె శ్రేషులైన నరులను భగవంతుడు పోషింపడా? తప్పక పోషిసాగు. 

కనుక నరుడు కూడూగుడ్డా యిలూవాకిలికై తాపత్రయపడకూడదు. ఆ భగవంతుణ్ణి నమ్ముకొని జీవిస్తూండాలి - మత్త 6,25-30.

5. పిచ్చుక అల్పప్రాణి. ఒక అణాబెడితే రెండు పిచ్చుకలు వస్తాయి. అలాంటి క్షుద్రప్రాణియైన పిచ్చుకను గూడా భగవంతుడు పోషిస్తూంటాడు. అతని యనుజ్ఞలేందే అది చావదు. ఇక, ఆ పిచ్చుకకంటె యెన్నోరెట్లు అధికుడైన నరుద్ధిదేవుడు చేయి విడుస్తాడా? విడువడు. భగవంతుడు నరుని తల వెండ్రుకలు గూడ లెక్కబెట్టుకొని వుంచుకొంటాడు. అతని అనుమతి లేందే మన వెండ్రుకగూడ రాలదు. భగవంతుని ప్రాణి పోషణాచాతుర్యం అలా వుంటుంది — మత్త 10, 29-30.
6. ఓ బాటసారి యెరూషలేమునుండి యెరికోకు దిగివసూత్రోవలో దొంగలచేతజిక్కి గాయపడ్డాడు. ఓ యాజకుడూ లేవీయుడూ ఆ త్రోవవెంట వచ్చిగూడ అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. తరువాత ఓ సమరయుడు ఆ దారివెంటవచ్చి గాయపడివున్న తెరువరిని జూచి జాలి పడ్డాడు. అతని గాయాలకు కట్టగట్టి అతన్ని ఓ సత్రానికి తీసికొని వచ్చాడు. ఈ మంచి సమరయుడు ఎవరోగాదు క్రీస్తే, మనుష్యజాతి పాపంవలన గాయపడివుండగా ప్రభువు పచ్చి సిలువ మరణంద్వారా మనకు పాపపరిహారం జేసాడు. మన గాయాలను మాని మనకు ప్రాణం పోసాడు. ప్రభువుతోడ్పాటు అలాంటిది - లూకా 10,33-34.
7. 1) ప్రభువే నాకు కాపరి. నాకిక యే కొదవాలేదు - కీర్త 23,1.
2)

అతడు ఓ కాపరిలా తన మందను మేపుతాడు
 తన చేతులతో గొర్రెలను మందగూరుస్తాడు
గొర్రెపిల్లలను తన రొమ్ముమీద మోసికొని పోతాడు - యెష 40,-11.

3)

యిస్రాయేలు ప్రజకు కావలిగాసే ప్రభువు
కునికిపాట్లు పడనూపడడు, నిద్ర పోనూపోడు కీర్త 121,4.

4)

గరుడపక్షి తన గూటిమీదికి లేచి పిల్లలకు ఎగరడం
 నేర్పినట్లుగానే ప్రభువు యిస్రాయేలును పైకెత్తి
 తన రెక్కలమీద నిలుపుకొంటాడు - ద్వితీ 32,11.

5)

ప్రభువు తన రెక్కలమాటున నిన్ను దాచివుంచుతాడు
 అతని రెక్కలమరుగున నీవు సురక్షితంగా
 వుండిపోతావు కీర్త 91,4.

6)

ప్రభువు నాకు దీపం వెలిగిస్తాడు
 నా త్రోవలోని చీకటిని తొలగిస్తాడు - కీర్త 18,28.

 7) నిన్ను అంటుకొనినవాడు నా కనుపాపను
అంటుకొన్నట్లే - జెకరయా 2,8.

8)

అతడు నిన్ను గూర్చి జాగ్రత్తపడతాడు- 1 పేత్రు 1,7.

18. శీలవ్యత్యాసం

నరులు ఒకేపని చేస్తున్నపుడుగూడ వాళ్ళవాళ్ళ శీలాన్నిబట్టి భిన్నభిన్నంగా ప్రవర్తిస్తూంటారు. కొందరు స్వార్థబుద్ధితో ఆత్మలాభం వెదకుతూంటారు. ఈలాంటి వాళ్ళను భగవంతుడు ఆదరించడు. కొందరు నిస్వార్థబుద్ధితో ప్రవర్తిస్తారు. భగవంతుణ్ణి పొందాలని కోరుకొంటారు. ఈలాంటి వాళ్ళను ప్రభువు కరుణిస్తాడు. దైనందిన జీవితంలో ఒకే కార్యరంగంలో పనిజేసే నరులు ప్రదర్శించే శీలవ్యత్యాసం గమనించదగ్గది.

1. కయానూ హేబెలూ అన్నదమ్ములు. ఇద్దరూ దేవునికి కానుకలు సమర్పించారు. ఐనా ప్రభువు కయీను కానుకను నిరాకరించి హేబెలు కానుకను చేకొన్నాడు. ఎందుకు? కయీనుది వక్రబుద్ధి హేబెలుది సరళబుద్ధి ఋజువర్తనులు కాని వాళ్ళు ప్రభువుకి ప్రియపడలేరు - ఆది 4,3-4.
2. ప్రభువు సౌలుని త్రోసివేసి దావీదుని రాజుగా ఎన్నుకొన్నాడు. సమూవేలు ప్రవక్త బేల్లెహేము వెళ్ళి యిూషాయి కుమారుడు దావీదును రాజుగా అభిషేకించాలి. యూషాయికి యెనమండుగురు కొడుకులు. వీరిలో దావీదెవరో ప్రవక్తకు తెలియదు. యీషాయి తన పెద్ద కుమారుడు ఎలియాబును సమూవేలు చెంతకు గొనివచ్చాడు. ప్రవక్త యొలియాబు ఎతూ రూపము చూచి మెచ్చుకొని అతన్ని అభిషేకింప బోయాడు. కాని ప్రభువు "నేనితన్ని నిరాకరించాను. నరులు వెలుపలి రూపానికి బ్రమసిపోతారు. కాని నేను లోపలి హృదయాన్ని పరిశీలిస్తాను" అన్నాడు. ఈ రీతిగా యిూషాయి తన కుమారుల్లో తొలి యేడురునీ సమూవేలు వద్దకు తీసికొని రావడమూ, దేవుడు వాళ్ళను నిరాకరించడమూ జరిగింది. అప్పుడు అతని కడగొట్టకొడుకు దావీదు ఎక్కడో పొలంలో గొర్రెలుకాచుకొంటున్నాడు. ప్రవక్త ఆజ్ఞపై యీషాయి అతన్ని పిలిపించాడు. దావీదురాగానే ప్రభువు ప్రవక్తతో "నేను ఎన్నుకొన్నవాడితడే. ఇతన్ని అభిషేకించు" అని చెప్పాడు. వెంటనే సమూవేలు అతనికి అభిషేకం చేసాడు. ఈ రీతిగా ప్రభువు ఏడురు అన్నలను కాదని ఎన్మిదవవాడైన దావీదునే ఎన్నుకొన్నాడు. ఎందుకు? ప్రభువుకి అతని హృదయం నచ్చింది - 1 సమూ 16,6–13.
3. గొల్యాతు మహవీరుడు. యుద్ధంలో కాకలుతీరిన జోదు. దావీదు పసివాడు. గొర్రెలు కాచుకొని బ్రతికేవాడు. వాళ్ళిద్దరికీ పోరుజరిగింది. సామాన్య పరిస్థితుల్లో గొల్యాతు దావీదుని పరుగును నలిపివేసినట్లుగా నలిపివేయవలసింది. కాని దావీదు ఒడిసెల రాతితో గొల్యాతు నొసటిని పగులగొట్టాడు. అతడు మొదలు నరికిన చెట్టులాగ గభీలున నేలమీద కూలాడు. దావీదు గొల్యాతు కత్తితోనే అతని మెడ తెగనరికాడు. గొల్యాతు కత్తిడాలు 

మొదలైన ఆయుధాలతో యుద్ధానికిరాగా దావీదు దేవుడైన యావేపేరిట వచ్చాడు. ఇక్కడ దైవబలమూ మనుష్యబలమూ ఒకదానితో వొకటి-పోరాడాయి. చివరికి దైవబలమే నెగ్గింది. జీవితంలో దైవబలంమీదనే ఆధారపడేవాళ్లు కొందరూ, కేవలం మనుష్య బలంమీదనే ఆధారపడేవాళ్లు కొందరూ - 1సమూ 17,45-51.

4. యెషయా యిర్మీయా యిద్దరూ మహా ప్రవక్తలే. ప్రభువు ఇద్దరినీ బాల్యప్రాయంలోనే ప్రవచనం చెప్పడానికి పిల్చాడు. యెషయా ధైర్యవంతుడు, యిర్మీయా పిరికివాడు. దేవుని పిలుపు విన్పింపగానే యెషయా “ప్రభో! నేను సిద్ధంగానే ఉన్నాను. నన్ను పంపు" అన్నాడు. కాని యిర్మీయా “ప్రభో! నేను బాలుణ్ణి. నాకు మాటలాడ్డం చేతకాదు. ఇంకెవరినైనా పంపుకో" అన్నాడు. యెషయాకు ముందుకుపోయే గుణముంది. యిర్మీయాకు జంకే గుణముంది. కాని ప్రభువు ఈ ప్రవక్తలిద్దరికీ తన శక్తిని ప్రసాదించి యిద్దరినీ తన పనికి నియోగించుకొన్నాడు - యెష 6,8 ; యిర్మీయా 1,6.
5, ఓ సేవకుడు తన యజమానునికి లక్షల వరహాలు అప్పుపడ్డాడు. అయినా యజమానుడు జాలిపడి అతని యప్పును క్షమించాడు. ఈ సేవకునికి యింకో సేవకుడు కొన్ని రూకలు అప్పుపడ్డాడు. అయినా ఆ సేవకుడు అప్పుపడిన తన దాసుణ్ణి క్షమింపక వాని గొంతు పట్టుకొన్నాడు. అప్పు తీర్చిందాక యిక్కడే ఉండమని అతన్ని చెరలో త్రోయించాడు. అదిచూచి యజమానుడు మొదటి సేవకుణ్ణి కఠినంగా శిక్షించాడు. "నీచుడా! నేను నీ యప్పు మన్నించినట్లే నీవూ నీ తోడిదాసుని యప్పు మన్నించవద్దా?" అని గద్దించాడు. మనం భగవంతునినుండి క్షమాపణం పొందాలి అంటే మన తోడిజనాన్ని క్షమించడం నేర్చుకోవాలి. కొంత మందిలో క్షమించే గుణముంటుంది, కొంత మందిలో ఉండదు - మత్త 18,32-33. 

6. పదిమంది కన్నెలు దివ్వెలు తీసికొని రాత్రిలో పెండ్లికుమారునికొరకు వేచివున్నారు. వాళ్లల్లో ఐదుగురు తెలివైనవాళ్ళ వాళ్ళదగ్గర నూనెవుంది. పెండ్లి కుమారుడు రాగానే వాళ్ళ తమ దివ్వెలు వెలిగించుకొని అతనితోపాటు వివాహ శాలలోనికి వెళ్లారు. మిగిలిన అయిదుగురు తెలివి తక్కువవాళ్లు. వాళ్లవద్ద నూనె లేదు. అపరాత్రిలో పెండ్లికుమారుడు రాగానే ఆ కన్నెలు చమురుకోసం అంగడికి వెళ్లారు. కాని వాళ్లు తిరిగి రాకముందే వివాహశాలను మూసివేసారు. ప్రభువు ఎప్పుడు విజయం చేస్తాడో మనకు తెలీదు. అతడు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవాళ్లు అతని వెంట పరలోకానికి వెళ్లారు. కాని అలా సిద్ధంగా ఉండేవాళ్లు కొందరు, ఉండనివాళ్లు కొందరు. - మత్త 25,1-13.

7. పేత్రూ యూదా యిద్దరూ ఘటోరపాపంచేసారు. పేత్రు ప్రభువుని ఎరగనని ముమ్మారు బొంకాడు. అయినా అతడు ఆశాభావంతో పశ్చాత్తాపపడ్డాడు. తన పాపానికి 

సంతాపపడి యేడ్చాడు. యూదా గురుద్రోహంచేసి క్రీస్తుని ముప్పది వెండి కాసులకు అమ్ముకొన్నాడు. కాని అతడు తన పాపాన్ని తలంచుకొని నిరుత్సాహపడ్డాడు. ఇక తన పాపానికి పరిహారంలేదని నిరాశచెంది ఉరివేసికొని చచ్చాడు. నరుడు ఎంతటి పాపం చేసినా భగవంతుడు క్షమిస్తాడు. కనుక అతడు నమ్మికతో పశ్చాత్తాప పడాలిగాని నిరుత్సాహపడగూడదు - లూకా 22,62; మత్త 27,5.

8. ప్రభువు ఇద్దరు యజమానులను సేవించవద్దన్నాడు. ఈ ಇద్దరు యజమానులు దేవుడూ ధనమూను - మత్త 6,24. పేత్రు దేవుణ్ణి మాత్రమే సేవించినవాడు. కనుకనే యేసు మీరు గూడ నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడగ్గానే అతడు "ప్రభో! మేమెక్కడికి వెత్తాం? నిత్యజీవమిచ్చే మాటలు నీ నుండి వెలువడుతూన్నాయి" అన్నాడు. కాని యూదా ధనాన్ని సేవించినవాడు. క్రీస్తూ అతని శిష్యులూ తమతో కొంతడబ్బు ఉంచుకొంటూండే వాళ్లు. ఆ డబ్బులసంచి యూదా దగ్గిర ఉండేది. అతడు తనకు అవసరమైనపుడెల్లా ఆ సంచి నుండి డబ్బు కొట్టేస్తూండేవాడు. ఈ దురభ్యాసంతోనే చివరికి గురువును కూడ అమ్మేసుకొన్నాడు - యోహాను 6,68; 12,6.

9. పదిమంది కుష్టరోగులు తమ వ్యాధిని తొలగించమని ప్రభుని వేడుకొన్నాడు. అతడు మీ కుష్ట పోతుంది. మీరు వెళ్లి దేవాలయంలో యాజకునికి చూపెట్టుకొండని చెప్పాడు. త్రోవలో వాళ్లందరికి కుష్ట నయమయింది. కాని వాళ్లల్లో ఒక్కడు మాత్రం తిరిగివచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలుపుకొన్నాడు. అతన్నిచూచి ప్రభువు తతిమ్మా తొమ్మిది మంది యేరి అని అడిగాడు. తొమ్మిది మంది కృతఘ్నులూ, ఒక్కడు కృతజ్ఞతాపరుడూను - లూకా 17,17.

10. ఓ తెరువరి యెరూషలేమునుండి యెరికో వెళ్తూ దొంగలకు జిక్కిగాయపడి త్రోవప్రక్కన పడిఉన్నాడు. ఓ యాజకుడూ లేవీయుడు ఆ త్రోవవెంట బోతూ అతన్ని పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. తరువాత ఓ సమరయుడు ఆ దారి వెంట వచ్చి అతన్ని పరామర్శించాడు. ఇద్దరు అక్కరలో ఉన్నవారిని ఆదుకోకపోగా, ఒక్కడు ఆదుకొన్నాడు — లూకా 10,30-34.

11. ఓ పరిసయుడూ సుంకరీ ప్రార్థన చేసికోవడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయుడు గర్వాత్ముడు. అతడు "ప్రభూ! నేను పుణ్యాత్ముణ్ణి. ఈ సుంకరిలాగా పాపాత్ముణ్ణి కాదు, నీకు తెలియందేముంది?" అని ప్రార్థించాడు. కాని సుంకరి వినయవంతుడు. అతడు "ప్రభో నేను పాపిని. నన్ను కరుణించు" అని ప్రార్థించాడు. భగవంతుడు పరిసయుని త్రోసిపుచ్చి సుంకరి ప్రార్థన ఆలించాడు. జీవితంలో కొందరు గర్వాత్ములూ కొందరు వినయవంతులూను. ప్రభువు మాత్రం గర్విష్తులను అణగదొక్కి వినయాత్మలను ఆదుకొంటాడు - లూకా 18,10-14. 12. ఓ యజమానుడు దేశాంతరమెళూ తన సేవకులను ముగ్గురిని పిలిచి వాళ్లకు ధన మప్పగించాడు. ఒకనికి అయిదు సంచులూ, మరొకనికి రెండు సంచులూ, ఇంకొకనికి ఒక సంచీ యిచ్చి వెళ్ళాడు. యజమానుడు తిరిగి వచ్చేప్పటికల్లా అయిదు సంచులు తీసికొన్నవాడు ఇంకా అయిదు సంచులూ, రెండు సంచులు తీసికొన్నవాడు ఇంకా రెండు సంచులూ డబ్బు సంపాదించి ఉంచారు. కాని ఒకసంచి డబ్బు తీసికొన్నవాడు మాత్రం వొట్టినే ఉండిపోయాడు. ప్రభువు అతన్ని కోపగించుకొన్నాడు. అతని డబ్బుకూడ తీసికొని మొదటివాని కిచ్చేసాడు. కొందరు భగవంతుడు తమకిచ్చిన శక్తిసామర్థ్యాలను వృద్ధిచేసి కొంటారు. కొందరు అలా వృద్ధిచేసికోరు - మత్త 25,24-80.

18. ప్రభువు చాలామంది శిష్యులను పిల్చాడు. సుంకపు మెట్టులో పన్నులు వసూలు చేస్తున్న మత్తయిని పిల్చాడు. అతడు తాను లెక్కబెట్టుకొనే డబ్బుగూడ వదలిపెట్టి వెంటనే క్రీస్తుని అనుసరించాడు. అలాగే ప్రభువు ధనిక యువకుణ్ణి గూడ పిల్చాడు. కాని అతడు చాల ఆస్తిపాస్తులు కలవాడు. తన సిరిసంపదలను వదలుకోవడానికి అతనికి మనసురాలేదు. అందుచేత ఆ యువకుడు ప్రభుని అనుసరించలేక బాధపడుతూ వెళ్ళిపోయాడు. భగవంతుని పిలుపునీ ప్రబోధాన్నీ ఆలించేవాళ్ళు కొందరు, పెడచెవిని బెట్టేవాళ్ళు కొందరు - మత్త 9,9 ; లూకా 18,23.

19. అంతరాత్మ

నరుల్లో అంతరాత్మ అంటూ ఉంది. ఇది భగవంతుడు హృదయాల్లో నిల్పిన ఓ దీపంలాంటిది. ఈ యంతరాత్మ పాడుపనులు చేస్తుంటే హెచ్చరిస్తుంది. మంచిపనులు చేస్తుంటే మెచ్చుకొంటుంది. నరుడు మనస్సాక్షి ప్రబోధం వింటే దేవుని ప్రబోధం విన్నట్లే.

1. యోసేపు సోదరులు ధాన్యం కొనితెచ్చుకోవడానికి ఐగుప్శనకు వెళ్లారు. అక్కడ యోసేఫే పెత్తనదారుడు. అతడు అన్నలను గుర్తుపట్టాడు గాని వాళ్లు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు అన్నల చిత్తశుద్ధిని పరీక్షించడానికి గూఢచారులన్న నేరంతో వాళ్ళను చెరలో వేయించాడు. అప్పుడా సోదరులు "ఆనాడు మనం తమ్మునికి కీడు తలపెట్టాం. వాడు ఎంత బతిమాలినా మనం వాడిగోడు విన్పించుకోలేదు. వాడిఉసురుకొట్టి యిప్పుడు ఈ కడగండ్ల పాలయ్యాం" అని అనుకొన్నారు. సోదరునికి చేసిన అపరాధానికిగాను వాళ్ల అంతరాత్మ వాళ్ళను నిందించింది. ఆది 42,21.

2. ఓ మారు క్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నాడు. అప్పుడు యూదులు వ్యభిచారంలో పట్టుపడిన ఓ స్త్రీని అతని వద్దకు తీసికొని వచ్చారు. మోషే ఆజ్ఞాపించినట్లుగా ఆమెను రాళ్ళతో కొట్టి చంపవచ్చాఅని అడిగారు. అందుకు ప్రభువు "మీలో పాపంలేనివాడు ఎవడైనా ఉంటే అతడు ఆమెమీద మొదటిరాయి వేయవచ్చు" అన్నాడు. వాళ్లంతా సిగ్గుపడిపోయి ఆమెను వదలివేసి ఒకరి తరువాత వొకరు మెల్లగా జారుకొన్నారు. మీరూ ఈమెలాగే పాపాత్ములైయుండగా ఈమెను దండించే అధికారం మీకెక్కడి నుండి వచ్చిందని వాళ్ల అంతరాత్మే వాళ్లను ప్రబోధించింది - యోహా 8, 7-11. ప్రథమాచార్యులు క్రీస్తుకు మరణశిక్ష విధించమని పిలాతుని ఒత్తిడిచేసారు. అతడు వెనుదీసాడు. వాళ్ళ క్రీస్తుని చంపించకపోతే నీవు సీజరు చక్రవర్తికి స్నేహితుడివి కాలేవు. మేము నీమీద ఫిర్యాదుచేస్తాం” అని బెదిరించారు. పిలాతు దడిసాడు. అయినా యేసు యే నేరమూ చేయలేదని అతనికి బాగా తెలుసు - యోహా 16,6, ఈలా తెలిసికూడ అతడు యూదులకు జంకి నిర్దోషియైన క్రీస్తుకి మరణశిక్ష విధించాడు. పిలాతు అంతరాత్మ ప్రబోధాన్ని అణచుకొని ఈలాంటి పాడుపనికి తలపడ్డాడు. - యోహా 19,16. 1) నేను దేవుని యెదుటా మానవుల యెదుటా గూడ నిర్మలమైన అంతరాత్మను కలిగి యుండడానికై శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాను - అచ 24, 16. 2) నిర్మలమైన వాళ్లకి అన్నీ నిర్మలంగానే ఉంటాయి. మలిన మనస్కులకు అన్నీ మలినంగానే వుంటాయి. -తీతు 1, 15

20.సలహా

నరుడు నరునికి సలహా యిస్తుంటాడు. ఈ సలహామంచిదైనా కావచ్చు చెద్దదైనా కావచ్చు మంచి సలహా విన్నవాళ్ళ బాగుపడతారు. చెడ్డ సలహా విన్నవాళ్ళ నాశమైపోతారు. క్రైస్తవభక్తుడు తాను యితరులకు ఏలాంటి సలహా యిస్తుంటాడో, ఇతరులనుండి తాను ఏలాంటి సలహా పొందుతుంటాడో జాగ్రత్తగా ఆలోచించిచూచుకోవాలి. 1. యూదులు బాబిలోను ప్రవాసంలో వుండగా వాళ్ల ఆడపడుచు ఎస్తేరు ఆ దేశపు రాజును పెండ్లి చేసికొని రాణి అయింది. ఆ దేశపు రాజునకు సలహాదారుడయిన హామాను యూదులకు ప్రబల శత్రువు, ఎస్తేరునకు బంధువయిన మొర్దేకయి యూదులకు నాయకుడు. హామాను మొర్దేకయిని ఈసడించుకొన్నాడు. అతన్నేవిధంగా హతమార్చాలో చెప్పమని మిత్రులను సలహా అడిగాడు. అతని మిత్రలూ భార్యా ఏబది మూరల యెత్తుగల ఉరికంబాన్ని తయారు చేయించవలసిందనీ, దానిమీద మొర్దేకయిని ఉరితీయమని రాజుని మనవి చేయవలసిందనీ సలహా యిచ్చారు. వారు చెప్పిన దుష్టాలోచన ప్రకారమే హామాను ఉరికంబం సిద్ధం చేయించాడు. కాని దేవుడు యూదులకోపు తీసికొన్నందున చివరకు హామానునే ఆ కంబంమీద ఉరితీసారు. - ఎస్తే 5, 14. 2. దావీదు కుమారుడు అబ్సాలోమ దౌర్జన్యంతో తండ్రిరాజ్యం ఆక్రమించు కొన్నాడు. దావీదు అతనికి భయపడి పారిపోయి ఓ యెడారిలో తల దాచుకున్నాడు. తండ్రిని ఏవిధంగా పట్టుకోవాలా అని అబాలోము మంత్రులను ఆలోచన అడిగాడు. అహిటోఫెలు అనే సలహాదారుడు తాను ఆ రాత్రే సైన్యంతోపోయి దావీదును పట్టుకొని వస్తానన్నాడు. హుషయి అనే సలహాదారుడు అబ్వాలోమే సైన్యంతోపోయి దావీదుని పట్టుకొంటే బాగుంటుందని సూచించాడు. రాజు హుషయి సలహాను పాటించాడు. అహిటో ఫెలు ఆలోచనను అనాదరం చేసినందుకు అతనికి మొగం కొట్టినట్లయింది. ఆ చిన్నతనాన్ని భరించలేక అహిటోఫెలు స్వీయగ్రామానికెళ్ళి అక్కడ ఉరివేసుకొని చచ్చాడు. -2 సమూ 17, 23.

3.సిరియా దేశపు సైన్యాధిపతియైన నామాను కుష్టరోగియై చికిత్సకోసం యిస్రాయేలు ప్రవక్త యెలీషా వద్దకు చచాడు. ఎలీషా అతనికి మొగమైనా చూపించకుండానే యోర్గాను నదికివెళ్ళి స్నానం చేయవలసిందని సేవకునిచేత కబురు పెట్టించాడు. నామాను మండిపడ్డాడు. స్నానం చేసికోవాడానికి మా దేశంలో నదుల్లేక మీ దేశానికి వచ్చాననుకొన్నారా అంటూ సిరియాకు వెడలిపోవడానికి సంసిద్దుడయ్యాడు. కని అతని సేవకుడు "అయ్యా! ప్రవక్తయేదైన పెద్దపనిచెస్తే నీవు తప్పకుండ చేసేవాడివేకదా? నదిలో స్నానం చేయమని ఈపాటి చిన్న పనిచెస్తే చులకన చేయడం దేనికి? ప్రవక్తమాట పాటించడం మేలు" అని హితోపదేశం చేసాడు. నామాను ఆ వుపదేశం విని నదిలో స్నానం చేసి కుష్టనుండి విముక్తుడయ్యాడు. - 2 రాజు 5, 13.

4. దేవుడు తన సేవకుడైన యోబు మహా భక్తుడని మెచ్చుకొన్నాడు. కాని పిశాచం అతని భక్తిని నమ్మలేదు. దేవుని అనుమతిపై యోబుని శోధించి పరీక్షింప గోరింది. యోబుకి నానా కష్టాలు కలిగించింది. అతని ఆస్తంతా నాశమైపోయింది. అతని దేహమంతా మహా వ్రణంకాగా, చీమూ నెత్తురూ కారుతున్నాయి. బంధువులంతా యోబుని ఈసడించుకున్నారు. అతడు ఒంటరిగా బూడిదమీద కూర్చున్నాడు. యోబు మిత్రులుగూడ అతడు దుర్మార్గుడై యుండాలి లేకపోతే అలాంటి కష్టాలు వస్తాయా అని శంకించారు. అలాంటి పరిస్థితుల్లో యోబు భార్య దేవుణ్ణి దూషించమని పెనిమిటికి సలహా యిచ్చింది. అయినా యోబు మహాభక్తుడు. ఆతడు “మూరురాలా! మనం దేవుడిచ్చే మేళ్లు అనుభవించినట్లే అతడిచ్చే కీడులూ అనుభవించాలి" అని జవాబిచ్చాడు - యోబు 2, 9-10.

5. యూదుల నాయకులు ప్రభుని సంహరించడానికై కుట్రలు పన్నుతూన్నారు. వాళ్ళంతా ప్రధానయాజకుడైన కైఫా యింటిలో సమావేశమై మంత్రాంగం నడిపారు. ఒకరి సలహా వొకరు విన్నారు. చివరకు మాయోపాయంతో యేసుని బంధించి చంపివేయాలని నిశ్చయించుకొన్నారు. - మత్త 26, 3-4

6. పరిశుద్ధాత్మ దిగివచ్చాక శిష్యులు యేసే మెస్సియాయని యెరూషలేములో బోధిస్తున్నారు. అతని పేరుమీదిగా అద్భుతాలు చేస్తున్నారు. యూదుల ప్రధాన యాజకుడు వాళ్ళని దడిపించాడు. చెరలో వేయించాడు. యేసు పేరుమీదిగా బోధించవద్దన్నాడు. అయినా శిష్యులు మానలేదు. యూదుల నాయకులు అపోస్తలులను బంధించి వాళ్ల మహాసభ యెదుటికి కొనివచ్చారు. ఆ సభలోని సభ్యులు అపోస్తలులను చంపివేయాలని సలహా యిచ్చారు. అప్పడు గమలియేలు అనే వృద్దుడులేచి "వీళ్ల ఉద్యమం మానవ ప్రయత్నమైతే దానంతట అదే అణగిపోతుంది. దైవ ప్రయత్నమైతే మీరు దాన్ని అణచివేయలేరు. పైగా మీరు దేవునితోనే పోట్లాడినట్ళాతుంది. కనుక యిప్పడు వీళ్లను ఏమి చేయకుండా వదలివేయండి" అని ఆ సభలోని సభ్యులకు ఆలోచన చెప్పాడు. మహాసభ సభ్యులు అతని సలహాను పాటించి అపోస్తలులను వదలివేసారు. - అచ 5, 38,39.

7. సలహ లేకపోతే ప్రజ నాశమైపోతుంది. చాలమంది సలహదారులుంటే భద్రత కలుగుతుంది. - సామె 11,14.

21. కృతజ్ఞత

మనం తోడినరులకు ఏదైనా ఉపకారం చేసినపుడు వాళ్లు మనకు కృతజ్ఞులై వండాలని అనుకొంటాం. భగవంతుడు గూడ నరుడు తనకు కృతజ్ఞడై ఉండాలనే కోరుకొంటాడు. కృతజ్ఞతాపరుల చరిత్రలు వింటానికి చాల రమ్యంగా ఉంటాయి.

1. సౌలు కుమారుడైన యోనాతానూ దావీదూ మిత్రులు. సౌలుకు దావీదుమీద అసూయ పుట్టగా అతన్ని చంపివేయాలని తలపోస్తున్నాడు. యోనాతాను ఆ సంగతి దావీదుకు తెలియజేసి అతన్ని భద్రంగావుండమని హెచ్చరించాడు. పైగా అతడు దావీదు నమ్మదగిన బంటుగాని ద్రోహిగాడు అని తండ్రికి నచ్చజెప్పాడు. సౌలు ఆ మాటలకు సంతృప్తి చెంది దావీదును మళ్ళా కొలువులో చేర్చుకొన్నాడు. ఈ యుపకారానికి దావీదు యోనాతానుకు కృతజ్ఞతలు తెలిపాడు -1 సమూ 19, 1-7.

2. యోసేపుతోపాటు ఫరోరాజు వంటలవాడూ పానీయ వాహకుడూ కూడ చెరలో వున్నారు. వాళ్ళిద్దరికీ కలలు వచ్చాయి. పానీయవాహకుడు బ్రతికి బయటపడతాడనీ వంటలవానికి మరణశిక్ష ప్రాప్తిస్తుందనీ యోసేపు కలలకు వివరం చెప్పాడు. అతడు చెప్పినట్లే జరిగింది. కాని పానీయవాహకుడు చెరనుండి బయట బడినంక యింకా చెరలోనే వుండిపోయిన యోసేపుని పూర్తిగా మరచిపోయాడు. కొంతకాలమయ్యాక ఫరో రాజుకుగూడ కలలు వచ్చాయి. కాని యెవరు ఆ కలల భావాన్ని వివరించి చెప్పలేక పోయారు. అప్పడు పానీయవాహకునికి యోసేపు గుర్తుకి వచ్చాడు. తనకు మేలు చేసిన యోసేపును మరచి పోయినందున అతడు పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళి చెరలోనున్న హీబ్రూ పడుచువాడు ఓ మారు తన కలకు అర్థం చెప్పాడనీ, ఫరో కలలకుగూడ వివరం చెప్పగలడని విన్నవించాడు. అతని కృతజ్ఞత పండిందో అన్నట్లు ఫరోరాజు యోసేపని చెరనుండి విడిపించాడు- ఆది 4, 8-13.

3. సౌలు కుమారుడైన యోనాతాను దావీదునకు ఇష్టుడు. సౌలు యోనాతాను గిల్బోవా యుద్ధంలో మరణించారు. సౌలుకు మారుగా దావీదు రాజయ్యాడు. యోనా తానునకు మెపిబోసెతు అనే కొడుకుండేవాడు. అతడు అవిటికాలివాడు. దావీదు తన్నెక్కడ చంపివేస్తాడో అని మెపిబోసెతు భయపడుతున్నాడు. కాని దావీదు అతన్ని తన సమక్షానికి పిలిపించి అభయమిచ్చాడు. “నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నేను నీకు దయజూపుతాను. నీ వికమీదట రోజు నా సరసన కూర్చుండి భోజనం చేయవచ్చు" అని చెప్పాడు. ఆ మాటలకు మెపిబోసెతు విస్తుపోయాడు. "ప్రభూ! ఈ దాసునిమీద ఎంత ఆదరం జూపించావు! నేనెంత నా బ్రతుకెంత? ఓ చచ్చిన కుక్కలాంటి వాడ్డిగదా!" అని తన కృతజ్ఞత తెలుపుకొన్నాడు. - 2 సమూ 9,6-8.

4. ప్రభువు మగ్డలీన మరియనుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టాడు. మరియ కృతజ్ఞతాభావంతో ప్రభువు శిష్యురాలైంది. ఆమె పుణ్యస్త్రీలతోజేరి క్రీస్తువెంట వెళూండేది. అతని అవసరాలను తీరుస్తుండేది — లూకా 8,8.

5. ఓ మారు యేసు పదిమంది కుష్టరోగులకు వ్యాధి నయం జేసాడు. కాని వాళ్ళల్లో ఒక్కడు మాత్రం తిరిగివచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలుపుకొన్నాడు. అప్పడు ప్రభువు "పదిమందికీ కుష్ట నయమైందికదా, మిగిలిన తొమ్మిది మంది యేరీ?" అని అడిగాడు. నరులు స్వార్థపరులు. వాళ్లల్లో కృతజ్ఞతాభావం అరుదుగాగాని కన్పించదు - లూకా 17,17.

22. భక్తుల హృదయం

పసిబిడ్డ తల్లి కంటిపెట్టుకొని ఉన్నట్లుగానే భక్తుడు భగవంతునికి అంటిపెట్టుకొని ఉంటాడు. అతని హృదయం భగవంతునిమీద లగ్నమౌతుంది. ఆ ప్రభుని తలంచుకొని ద్రవించి పోతుంది. భగవంతుడు అతన్ని కరుణతో జూస్తాడు. దీవిస్తాడు. దానితో భక్తనికి • జన్మ తరిస్తుంది. 1. అబ్రాహాము తొంబై తొమ్మిది యేండ్లవాడైయుండగా భగవంతుడు ప్రత్యక్షమై "నీవు నా సన్నిధిలో నడుస్తూ ఉత్తముడిగా మెలగాలి” అని చెప్పాడు. అబ్రాహాము చిత్తశుద్ధిగల భక్తుడు. అతడు భగవంతుని సన్నిధిలో నడిచాడు. చివరకు ప్రభువు అబ్రాహాముని పరీక్షించడానికై అతని కుమారుడ్డి బలియిూయమని అడిగాడు. అబ్రాహాముకి ఏకైక కుమారుడు ఈసాకు. ఆ ముసలి ప్రాయంలో అతన్ని కోల్పోతే మరో కొడుకు పుడతాడనే నమ్మకంగూడ లేదు. అయినా అబ్రాహాము వెనుకాడలేదు. ప్రభువు ఏదో విధంగా ఈసాకుని మళ్ళా బ్రతికిస్తాడనే నమ్మకంతో అబ్రాహాము అతన్ని బలియిూయడానికి సంసిద్దుడయ్యాడు. ప్రభువు "నీ ఏకైక కుమారుడ్డి నాకు సమర్పించడానికి వెనుకాడలేదు కనుగ నీవు దైవభీతిగలవాడవని రుజువయింది" అని అతని విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు. - ෂධි 17, 1; 22, 10-12.

2. మోషేగూడ మహాభక్తుడు. అతడు ప్రభువుతో ఓ స్నేహితుళ్లాగే ముఖాముఖి మాటలాడేవాడు. యావే తన భక్తులతో కలలద్వారా దర్శనాలద్వారా పరోక్షంగా మాటలాడేవాడు. కాని మోషేతో మాత్రం నేరుగా మాటలాడేవాడు - నిర్గ 33,11. మోషే పది ఆజ్ఞలు తీసికొని కొండదిగి వచ్చేప్పటికల్లా యిస్రాయేలు ప్రజలు విశ్వాసఘాతుకులై ఎద్దును ఆరాధించుకొంటున్నారు. ప్రభువు వాళ్లని వేరంట నాశం జేస్తానన్నాడు. ఆ తలబిరుసుజాతికి మారుగా మోషే సంతానం నుండి యింకో క్రొత్త జాతిని పుట్టిస్తానన్నాడు. అప్పడు మోషే జాతిపితగావచ్చు. అయినా ఆ భక్తునికి అలాంటి బిరుదాలేమీ అక్కరలేదు. అతడు ఆ ప్రజల తరపున దేవుణ్ణి మనవిచేసాడు. ప్రభువు వాళ్లను క్షమించడాని కిష్టపడకపోయినట్లయితే జీవగ్రంథంనుండి తన పేరు తొలగించమని మనవి చేసాడు. అతని చిత్తశుద్ధిని మెచ్చుకొని ప్రభువు యిప్రాయేలీయులను క్షమించి వదలివేసాడు. - నిర్గ 32. 10; 32, 32.

3. అన్నా పెనిన్నా సవతులు. ఎల్మానా భార్యలు. పెనిన్నాకు సంతానం కలిగిందిగాని అన్నాగొడ్రాలుగా ఉండిపోయింది. అందువలన సవతి ఆమెను ఎగతాళిజేసి యేడిపించేది. అన్నాషిలో నగరంలోవున్న ప్రభుమందిరానికి యాత్ర వెళ్ళి దేవునిమందు తన గోడు విన్పించుకొంది. "సైన్యములకు అధిపతివైన ప్రభూ! నాకొక మగబిడ్డను ప్రసాదించావంటే వాడ్డి నీకే సమర్పించుకొంటాను" అని ప్రార్ధించింది. ఆ భక్తురాలి మనవి నాలించి ప్రభువు ఆమెకు ఓ మగకందును ప్రసాదించాడు. ఆతడే సమూవేలు ప్రవక్త -1సమూ 1,11.

4. యిప్రాయేలీయుల అడపడుచు నవోమి మోవాబు దేశంలో వసిస్తూండేది. ఆమెకు ఓర్చ, రూతు అని ఇద్దరు కోడళ్ళ వాళ్ళిద్దరూ మోవాబుదేశస్త్రీలు. నవోమి తన కొడుకులిద్దరు చనిపోగా సొంత దేశానికి తిరిగిరావాలనుకొంది. కనుక కోడండ్లను పుట్టిండ్లకు వెళ్ళిపొమ్మని చెప్పింది. పెద్దకోడలు ఓర్చా కన్నవారింటికి వెళ్లిపోయింది. కాని చిన్నకోడలైన రూతు మాత్రం “నేనుగూడ నీ వెంటనే వస్తాను. నీ బంధువులే నాకు బంధువు లౌతారు. నీ దేవుడే నాకు దేవుడౌతాడు. నీవు చనిపోయేకాడనే నేనూ చనిపోతాను. మరణం వరకూ మన మిద్దరం విడిపోగూడదు” అంది. నవోమి కోడలిబుద్ధికి మెచ్చుకొని ఆమెనుగూడ వెంటబెట్టుకొని యిస్రాయేలు దేశానికి వచ్చింది. పూర్వం యూదస్త్రీలు సంతానం కలుగకముందే భర్త చనిపోయినట్లయితే ఆ భర్తకు దగ్గరి చుట్టమైన పురుషుని గూడి సంతానం పొందేవాళ్లు. ఆ యాచారాన్నే దేవరన్యాయం అనేవాళ్లు.ఆ యాచారం ప్రకారమే రూతు నవోమికి దగ్గరి బంధువయిన బోవసువలన బిడ్డనుగని తన జీవితం ధన్యం చేసికొంది - రూతు 1, 16-17.

5. హిజియారాజు యావే భక్తుడు. అతడు ప్రభువు మీదనే మనసు నిల్పి ప్రభువు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవాడు. ప్రభువు హిజియాకు తోడ్పడినందున అతడు ఎక్కడికి వెళ్ళినా ఏమిచేసినా విజయం లభిస్తూండేది. ఈలా ఉండగా అస్సిరియా రాజైన సనెర్రీబు యూదామీది కెత్తివచ్చాడు. హిజ్కియాను భయపెడుతూ కమ్మవ్రాసి పంపాడు. "ఓయి హిజ్కియా! నన్నెదిరించిన రాజులందరూ మంటగలిసిపోయారు. ఆ రాజులు కొలిచే దేవతలు వాళ్లను నా దాడినుండి కాపాడలేకపోయారు. నీకూ అదేగతి పడుతుంది. కాని నీవు నా శరణుజొచ్చావో, బ్రతికిపోతావు" అని కబురు పంపించాడు హిజ్కియా ఆ జాబును తీసికొనివెళ్లి ప్రభువు దేవాలయంలో పీఠంమీద విప్పిపెట్టాడు. కొయ్యబొమ్మలనూ రాతి బొమ్మలనూ కొలుచుకొనే రాజులను సనెర్రీబు జయిస్తే జయించవచ్చు గాక, యావేను కొలిచే రాజును మాత్రం ఆతడు జయించకుండా ఉండేలా చేయమని ప్రార్ధించాడు. యావే ఆ భక్తుని ప్రార్థన ఆలించాడు. ఆ రాత్రి ప్రభువదూత వెళ్లి సనైర్రీబు సైన్యంలో కొందరిని చంపివేయగా అతడు భయపడి వెనుదిరిగి పారిపోయాడు - 2 రాజు 19, 14-19.

6. ఇత్తాయి దావీదు అంగరక్షకులకు నాయకుడు. అతడు యూదుడుకాడు, అన్యజాతివాడు. దావీదు కొలువులో చేరి అతనికి ఊడిగం చేస్తున్నాడు. ఓ మారు దావీదు అబ్సాలోమునకు వెరచి యెరూషలేమునుండి పారిపోతున్నాడు. అపుడు యిత్తాయిగూడ దావీదువెంట ప్రవాసానికి బయలుదేరాడు. దావీదు అతన్ని తనవెంట రావద్దని వారించాడు. తన మీద యిక ఆశవదలుకొమ్మనీ, అబాలోము కొలువులోచేరి అతనికి ఊడిగంచేయమనీ సలహా యిచ్చాడు. కాని స్వామిభక్తిగల యిత్తాయి “యావేతోడు. చావుగానీ బ్రతుకుగానీ రాజెక్కడ ఉంటాడో ఈ దాసుడు గూడ అక్కడే ఉంటాడు" అని పలికి తానూ దావీదువెంట వెళ్లిపోయాడు - 2 సమూ 15, 20-21. 7. ఓమారు ప్రభువు దేవాలయంలో బోధిస్తుండగా భక్తులువచ్చి కానుకల పెట్టెలో డబ్బు వేస్తున్నారు. ధనవంతులు మస్తుగా డబ్బు పడవేస్తున్నారు. అప్పడు ఓ పేద విధవ గూడవచ్చిరెండు పైసలు మాత్రం కానుక వేసింది. అది చూచి ప్రభువు శిష్యులతో "అందరికంటె ఈ పేదరాలు ఎక్కువదానం చేసింది. వాళ్లంతా సమృద్ధిగా ఉండి దానం చేసారు. కాని ఈమె లేమిలో ఉండిగూడ దానంచేసింది. తన జీవనాన్నేత్యాగంచేసి కొంది" అన్నాడు. భగవంతునికి మన వస్తువులతో పనిలేదు. అతనికి కావలసింది మన హృదయం. ఆ హృదయాన్నిభగవంతునికి సమర్పించుకొన్నవాడే భక్తుడు - మార్కు 12, 41-43.

8. లాజరు చనిపోయి మళ్ళా బ్రతికినాక ప్రభువు ఓమారు బెతానియా గ్రామానికి వచ్చాడు. అతడు లాజరుతో విందారగిస్తుండగా మరియు పరిమళద్రవ్యం తీసికొనివచ్చి యేసు పాదాలపై కుమ్మరించింది. పరమ భక్తి భావంతో ఆ పవిత్ర పాదాలను తన తలవెండ్రుకలతో తుడిచింది. ఈ భక్తిక్రియ ద్వారా ఆమె యేసు భూస్థాపనాన్ని సూచించింది. - యోహా 12, 1-3.

9. ఇంకొక మారుగూడ ప్రభువు లాజరు ఇంటికి వచ్చాడు. మార్తతొందరపాటుతో భోజనం తయారు చేస్తుంది. కాని మరియమాత్రం ప్రభువుపాదాల చెంతనే గూర్చుండి నిమ్మళంగా అతని బోధ ఆలిస్తూంది. మార్త చిరాకుతో క్రీస్తు దగ్గరికివచ్చి "ఈ పనంతా నేనే చేసికోవాలి. చెల్లెలినిగూడ వచ్చి కాస్త సహాయం చేయమని చెప్పండి” అంది. కాని ప్రభువు "మార్త! నీవు ఏమేమో పనులు పెట్టుకొని సతమతమౌతూన్నావు. ఆతుర పడుతూన్నావు. కాని అవసరమైంది ఒక్కటే. భగవంతుని మీద హృదయం నిల్పుకోవడం. మరియు పరలోకంలోని దేవుని మీద మనసునిల్పి నా బోధలు ఆలిస్తూంది. ఆమెను కాదనడందేనికి?" అన్నాడు. అలా ఆ భక్తురాలు మరియు ప్రభువ మన్నలను అందుకొంది - లూకా 10, 32-42.

10. పౌలు పగటిపూట క్రీస్తునిగూర్చి బోధించేవాడు. రాత్రుల్లో డేరాబట్టలు కుట్టుకొని పొట్టకూడు సంపాదించుకొనేవాడు. అతడు ఎవరి డబ్బులమీద ఆధారపడలేదు. కాయకష్టంచేసి బ్రతికాడు. ఆకుల అనే యూద కుటింబీకుడూ అతని భార్య ప్రిస్కపౌలుని పరామర్శించేవాళ్లు.అతడు కొంతకాలం ఆ దంపతుల యింటనే తలదాచుకొన్నాడు. ఆనాటి క్రైస్తవులుగూడ ఈ పుణ్యదంపతుల యింట సమావేశమై ప్రార్థనలు జరుపుకొనేవాళ్ళు ఈ దంపతులు పౌలుకోసం ప్రాణాలు బలి యూయడానికిగూడ వెనుకాడలేదు. పౌలు ఈ భార్యాభర్తల భక్తి భావాన్ని వేనోళ్ళ కొనియాడాడు - రోమా 16, 3-5.

11. మరియా యోసేపలు క్రీస్తు శిశువుని యెరూషలేము దేవాలయంలో కానుక పెట్టడానికి కొనిపోయారు. ఆ రోజుల్లో అన్న అనే ప్రవక్తి దేవాలయానికివచ్చి ప్రభువుని పూజించుకొంటూండేది. ఆమె యేండ్లగడచిన వృద్ధురాలు, విధవ, ఉపవాసాలతో ప్రార్థనలు చేసికొంటూ దేవాలయాన్ని విడిచిపోయేదికాదు. ఆమె క్రీస్తు బిడ్డనుజూచి సంతోషంతో దేవునికి ధన్యవాదాలు అర్పించింది. అక్కడి భక్తులకు ఆ శిశువుని చూపించి యెరూషలేముకు రక్షణం కొనివచ్చేది యీ బిడ్డదేనని చెప్పింది. అలా ప్రభుదర్శనంవల్ల ఆ భక్తురాలి హృదయం ద్రవించిపోయింది — లూకా 2, 36–38.

12.స్నాపక యోహాను తల్లిదండ్రులు ఎలిసబేతు జకరియాలు.వీళ్లు వృద్దులు, భక్తులు. ప్రభువు మోషే ద్వారా యిచ్చిన ధర్మశాస్తాన్ని పాటిస్తూ నీతిమంతులుగా జీవిస్తుండేవాళ్లు - లూకా 1, 5–7.

13.కన్యమరియు మహా భక్తురాలు. ఆమె దేవదూత శుభవార్త ద్వారా దేవుని చిత్తాన్ని తెలిసికోగానే “ఇదిగో ప్రభువు దాసురాలిని. ఆయన చిత్తప్రకారమే జరగాలి? అంది. దేవుడు తన్ను కరుణించిన విధానాన్ని తలంచుకొని భక్తిపారవశ్యంతో "నేను పూర్ణహృదయంతో ప్రభుని స్తుతిస్తున్నాను. రక్షకుడైన దేవుణ్ణి తలంచుకొని నిండుమనస్సుతో ఆనందిస్తున్నాను" అని యొలిగెత్తిపాడింది. ప్రభువు ఆమె వినయాన్నీ భక్తిభావాన్నీ మెచ్చుకొన్నాడు. ఆమెకు తన రక్షణాన్ని ప్రసాదించాడు. కనుకనే సకల తరాలవాళూ ఆమెను ధన్యురాలు అని కొనియాడుతున్నారు -లూకా 1, 46-48.

23.క్షమాగుణం

తోడి జనాన్ని క్షమించాలి అంటే పాపపు మానవులమైన మనకెంతో కష్టంగా వుంటుంది. కనుక భగవంతుడు మనలను క్షమించి మనంకూడ ఇతరులను క్షమించాలని నేర్పాడు. తోడి జనాన్ని క్షమించినవాడు నరుబ్లాకాదు దేవుళ్లా ప్రవర్తిస్తాడు. అపరాధులను క్షమించడమనేది నూత్నవేదం బోధించే గొప్ప సత్యాల్లో ఒకటి. 1. సోదరులు యోసేపని బానిసగా అమ్మివేసారు గదా! అతడు ఐగుప్తలో ప్రధానాధికారి అయ్యాడు. కరువురాగా సోదరులు రెండుసారులు ధాన్యంకోసం యోసేపు వద్దకు వెళ్లారు. రెండవసారి యోసేపు నేనేమీ తమ్ముజ్జని సోదరులకు తెలియజేసికొన్నాడు. ఆ యున్నలు యోసేవుని అమ్మివేసినందుకు అతడు తమమీద పగతీర్చుకుంటాడేమోనని భయపడిపోయారు. కాని యోసేపువారితో “మీరు అనుమానపడకండి. ఆనాడు మీరు నాకు కీడు తలపెట్టారు. కాని ఈనాడు దేవుడు ఆ కీడును మేలుగా మార్చాడు. నేను మీకంటె ముందుగా వచ్చి యిక్కడ ఉండబట్టే నేడు మీరు బ్రతకగలిగారు. నేను మిమ్మూ మీ పిల్లలనూ ఆదరిస్తాను.మీ యపరాధాన్ని పూర్తిగా క్షమిస్తాను" అని చెప్పాడు - ఆది 50, 18–21. 2.యాకోబు మోసంతో యేసావు జ్యేష్ఠభాగం కొట్టేసి మేనమామ దగ్గరికి పారిపోయాడు గదా! అతడు తన భార్యా బిడ్డలతో తిరిగిరాగా యేసావు తమ్మునికి ఎదురువోయాడు. అన్నయెదురు వస్తున్నాడని విని యాకోబు హడలిపోయాడు. యేసావు దగ్గరికివచ్చి ఏడుసారులు నేలమీదికి వంగి దండం పెట్టాడు. యేసావు తమ్ముణ్ణి క్షమించాడు. అతన్ని కౌగిలించుకొని ముద్దాడాడు. అతని భార్యాపిల్లలను ఆదరంతోజూచాడు.-ఆది 33, 1-4.

3. ఓ సేవకుడు తన యజమానునికి పెద్దమొత్తం బాకీ పడ్డాడు. అయినా యజమానుడు దయతలచి అతన్ని మన్నించాడు, ఆ సేవకునికి మరొకడు చిన్న మొత్తం బాకీ పడివున్నాడు. అయినా అతడు తన తోడిదాసుడ్డి మన్నించకుండా నా డబ్బు చెల్లిస్తావా లేక జైలుకి వెళ్లావా అని కుత్తిక పట్టుకొన్నాడు. యజమానునికి ఈ సంగతి తెలిసింది. అతడు తొలిసేవకుణ్ణి పిలపించి "దుర్మారుడా! నేను నిన్ను క్షమించినట్లే నీవూ తోడిదాసుడ్డి క్షమించవద్దా?" అని మండిపడ్డాడు. అతన్నికఠినంగా శిక్షించాడు గూడ- మత్త 18, 33.

4. సీమోను అనే పరిసయని ఇంటిలో క్రీస్తు విందారగిస్తూండగా ఓ పాపాత్మురాలు వచ్చి అతని పాదాలను కన్నీటితో తడిపి తలవెండ్రుకలతో తుడిచింది. ఆ పాదాలను భక్తిభావంతో మద్దిడుకొని వాటికి పరిమళ ద్రవ్యం పూసింది. ఇదంతా గమనిస్తున్న సీమోను “ఈమె పాపాత్మురాలుకదా! ఈలాంటి అయోగ్యురాలు తన్ను తాకుతుంటే క్రీస్తు చూస్తూ ఊరుకుంటాడేమిటి?" అనుకొన్నాడు. అతని తలపులెరిగి ప్రభువు " ఈమె అధికంగా ప్రేమించింది కనుక ఈమె చాల పాపాలు చేసినా అవన్నీ క్షమించబడ్డాయి" అన్నాడు. ఆమె గాఢమైన భక్తిభావం కలది కనుకనే తన పాపాలన్నిటికి క్షమాపణం పొందింది - లూకా 7, 47.

5. క్రీస్తు సిలువమీద వ్రేలాడుతూ తన్ను హింసించి చంపే శత్రువులకోసం ప్రార్థించాడు.“తండ్రీ వీళ్లేమిచేస్తున్నారో వీళ్లకే తెలియదు. వీళ్లను క్షమించు" అని మనవి చేసాడు...లూకా 23,34.

6. సైఫను ఏద్దరు పరిచారకుల్లో ఒకడు.అతడు మోషే ధర్మశాస్త్రమూ పూర్వవేద దేవాలయమూ ఇక మనలను రక్షింపలేవు,మనలను కాపాడేది ఉత్థానక్రీస్తేనని బోధించాడు. ఈ బోధ యూదుల యాజకులకు గిట్టలేదు.వాళ్ళు అతన్ని బలవంతంగా లాగుకొనివెళ్ళి యెరూషలేము పట్టణం వెలుపల రాళ్ళ రువ్వి చంపారు.అలా చనిపోతూగూడ సైఫను శత్రువులను దూషించలేదు. వాళ్లను క్షమించి వాళ్లకోసం ప్రార్ధించాడు."ప్రభో! ఈ పాపాన్ని వీళ్లమీద మోపవద్దు" అని దేవుణ్ణి మనవిచేసాడు.ఈ విధంగా అతడు క్రీస్తుచూపిన మార్గంలోనే పయనించాడు - అచ 7,59. 7.మనం ప్రార్ధనం చేసేపుడు తోడివాళ్ళమీద ఏమైనా మనస్పర్ధ వున్నట్లయితే వాళ్లను క్షమించాలి. మనం తోడి జనులను క్షమించకపోతే దేవుడు మనలను క్షమించడు.- మార్కు 11,25.

24. ప్రభుదీవెన

భక్తుడు భగవంతుని అనుగ్రహానికి నోచుకొంటాడు. ప్రభువు అతన్ని దీవిస్తాడు. దానితో అతడు మూడు పూవులూ ఆరు కాయలుగా పెంపజెందుతాడు. ఇక నరులు కలిగించే ఆటంకాలేమి అతనికి అడ్డురావు. దైవబలం కలవాళ్ళు పక్షిరాజులాగ పైకెగిరి పోతూంటారు.

1.అబ్రాహాము మహాభక్తుడు. ప్రభువుని నమ్మి సొంత దేశమైన కాల్టియాను వదలివచ్చినవాడు. కనుక ప్రభువు అతన్ని దీవించాడు. అతని సంతానం ఇసుకరేణువుల్లాగ, ఆకాశంలోని చుక్కల్లాగ లెక్కల కందనిరీతిగా విస్తరిల్లుతుందని చెప్పాడు. అతనిపేరు అబ్రామునుండి అబ్రాహామునకు మార్చాడు. అబ్రాహాము అంటే అనేక జాతులవాళ్లకు తండ్రి అని అర్థం. అనగా అబ్రాహాము సంతానం తామరతంపరగా వృద్ధి జెందుతుందని భావం, ప్రభువు ఆ భక్తుని కిచ్చిన దీవెన ఆలాంటిది.- ఆది 17, 5-6.

2.అబ్రాహాము కుమారుడు ఈసాకుగూడ ప్రభుభక్తుడు. కనుక దేవుడు ఈసాకుని దీవింపగా, అతడు వెదవెట్టిందే తడవుగా నూరంతల పంట చేతికివచ్చింది.అతని గొర్రెలమందలు గొడ్లమందలు వృద్ధిలోకి వచ్చాయి. అతని బానిసలు ఆ మందలన్నిటినీ కాస్తూవచ్చారు. ఈసాకు రోజు రోజుకి అభివృద్ధిచెంది మహా సంపన్నుడయ్యాడు.అతని వృద్ధిని చూడగా చుట్టుపట్లవున్న ఫిలిస్టీయులకు పండ్లు పలిసాయి.- ఆది 26, 12-14.

3.యోసేపును చాలమంది అణగద్రోక్కాలని చూచారు.కనానులో అతని అన్నలే అతన్ని పైకిరానీయలేదు. ఐగుపులో పోతీఫరు భార్య అతన్ని నాశం జేయజూచింది. అయినా దేవుడు ఆ భక్తునికి తోడుగా వున్నాడు. అతన్ని దీవించాడు. కావుననే యోసేపు శుక్లపక్షంనాటి చంద్రబింబంలాగ వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుడు మేలు చేయగోరినవాడికి ఎవడు చెరుపచేయగలడు? - ఆది 39,2.

4.యూదులకు మందసం పరమ పవిత్రమైంది. దానిలో ప్రభువు మోషేకిచ్చిన పదియాజ్ఞల పలకలుండేవి. దానిమీద ప్రభుసాన్నిధ్యముండేది. దావీదు ఈమందసాన్ని మూడు నెలలపాటు గితీయుడైన ఓబెదెదోమ యింటిలో ఉంచాడు. మందసము కారణంగా ప్రభువు ఓబెదెదోమును చల్లనిచూపు చూచాడు - 2 సమూ 6,12. 5. సౌలు దుష్టుడైపోగా యావే దావీదు నెన్నుకొన్నాడు.ప్రభువు సౌలును విడనాడి దావీదుకు తోడ్పడ్డం మొదలెట్టాడు.దానితో సౌలు ముసలిచెట్టులాగ క్షయించి పోయాడు.దావీదు లేతమొక్కలాగ ఏపుగా ఎదిగిపోయాడు.యావే తోడ్పాటువలన దావీదు పట్టిందల్లా బంగారమైంది.అతడు ఎక్కడికెళ్లినా విజయమే సిద్ధించింది -1 సమూ 18,12-16,

6. మోషే తరువాత యోషువా యిస్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. కాని ప్రజలను ఏలా నడిపించుకొని పోవాలో అతనికి తెలిసిందిగాదు. అప్పడు ప్రభువు యోషువాతో "నీవు నా యాజ్ఞల ప్రకారం జీవించినట్లయితే నేను నీకు తోడ్పడతాను. నీవు చేసే పనులన్నిటిలోను నీకు తోడైయుంటాను" అని అభయమిచ్చాడు. యావే చెప్పినట్లు యోషువా తరువాత ప్రభుదీవెన పొందాడు - యోషు 1, 8–9.

7. పిశాచం యోబుని నానా కష్టాలపాలు చేసింది. అతని సిరిసంపదలనూ బంధువులనూ ఆరోగ్యాన్నీ మనశ్శాంతినీ గూడ అపహరించింది. అయినా యోబు ప్రభు భక్తిపరాయణుడై ధైర్యంతో నిలిచాడు. ఇక పరీక్ష అయిపోయింది. ప్రభువు యోబుకి సాక్షాత్కారమై అతన్ని దీవించాడు. యోబు మళ్ళా సిరిసంపదలతో అలరాలాడు. అతనికి సంతానం కలిగింది. — యోబు 42, 12.

8. ఓమారు కొందరు తల్లలు చిన్నబిడ్డలను క్రీస్తు వద్దకు తీసికొనివచ్చి వాళ్ళను దీవించమని కోరారు. ప్రభువు పరలోక రాజ్యం ఈలాంటివాళ్లదే అంటూ ఆ బిడ్డలమీద చేతులుచాచి వాళ్లను దీవించాడు. — మత్త 19,15.

9. ప్రభువు మోక్షారోహణమయ్యే గడియ వచ్చింది.అతడు శిష్యులతో బెతానియావరకు వెడలిపోయి అక్కడ చేతులెత్తివారిని ఆశీర్వదించాడు.అలా ఆశీర్వదిస్తూ అతడు పరలోకాని కెక్కిపోయాడు.శిష్యులు ఆయనకు మొక్కి ఆనందంతో యెరూషలేముకు తిరిగి వచ్చారు. - లూకా 24, 50.

10.1) నీ లోగిట నీ భార్య పండ్లపండిన
ద్రాక్షతీగలా ఉంటుంది
నీ బిడ్డలు ఓలివు మొక్కల్లా ఎదుగుతారు
ప్రభువుపట్ల భయభక్తులతో మెలిగేవాళ్ళకు
ఈలాంటి దీవెనలు లభిస్తాయి - కీర్త 128, 3-4.
2) నేను చీకటిలోయగుండా పయనించినా
ఏ యపాయానికీ జంకను
నీవు నాకు తోడై యుంటావు
నీ చేతికర్రా, నీ కోలా
 నన్ను కాపాడుతూంటాయి - కీర్త 23, 4.

3) నేను విత్తనం నాటాను. మొక్కమొలిచింది. అపొల్లో వచ్చి మొక్కకు నీళ్ళ పోసాడు. కాని ఆ మొక్క పెరిగేలా చేసేదేమో దేవుడే - 1 కొరి 3.6.

25. దంపతులు

దంపతులకు ఒకరిపట్ల ఒకరికి ప్రేమా గౌరవమూ ఆదరమూ ఉండాలి. ఈ గుణాలు లేందే యిద్దరు వ్యక్తులు జీవిత కాలమంతా కలిసిమెలిసి వుండలేరు. కుటుంబ జీవితంతో సతమతమయ్యే ఆలుమగలు బైబులు దంపతులు ప్రదర్శించే ఆదర్శాలను జాగ్రత్తగా గమనించాలి.

1. దేవుడు మొదట ఆదామని సృజించాడు. అతడు ఒంటరిగా ఉండిపోయాడు. ప్రభువు ఆదామునకు తోడుగా ఉండడానికి ఓ స్త్రీని చేద్దామనుకొన్నాడు.ఆదామని నిద్రబుచ్చి అతని ప్రక్కటెముక నుండి స్త్రీని తయారుచేసాడు.ఆ స్ర్తీని ఆదామునకు చూపించాడు. ఆదాము ఏవనుచూచి ఈమె నా యెముకల్లో యెముక, నా దేహంలో ධීක්‍ෂිය అనుకొన్నాడు. అనగా ఆమె తనకు దగ్గరిచుట్టమూ ఆపరాలూ అని భావం - ఆది 2, 23-24.

2. యాకోబు తన అన్నయయిన ఏసావునుండి పారిపోయి మేనమామ లాబానునింట తలదాచుకున్నాడు. అతనికి లాబాను కొమార్తె రాహేలపై మనసుపోయింది.ఆమెను పెండ్లి యాడ్డంకోసం మేనమామకు ఏడేండ్ల జీతంచేసాడు.రాహేలు మీదగల వలపుచే ఏడేండ్లగూడ ఏడు గడియల్లాగ సాగిపోయాయి. ఇంత అయినా లాబాను యాకోబున కిచ్చింది రాహేలు అక్క లెయానుగాని రాహేలునుగాదు. అతడు రాహేలు కోసం ఇంకో ఏడేండ్ల జీతంచేయడానికి ఒప్పకొన్నాడు. యాకోబుకు రాహేలు మీద ఉన్న ప్రేమ అంత గాఢమైంది - ఆది 29, 20.

3. ఎల్మానాకు అన్నా పెనిన్నా అని ఇద్దరు భార్యలు. పెనిన్నాకు ఇద్దరు బిడ్డలు కలిగారుగాని అన్నాగొడ్రాలుగా ఉండిపోయింది. ఈ యలుసు చూచుకొని పెనిన్నా అన్నాను ఎగతాళిచేసి యేడ్చిస్తూండేది. ఆ రోజుల్లో ప్రభువు గుడారం షిలోలో ఉండేది. ఎల్మానా అతని యిద్దరు భార్యలూ షిలోలో ఉన్న ప్రభువుని సేవించుకోవడానికై యాత్ర వెళ్ళారు. బిడ్డలు కలగలేదన్న విచారంతో అక్కడ అన్నా పెద్దగా దుఃఖించింది. అన్నం తినడంగూడ మానివేసింది, ఎల్మానా ఆమెనోదార్చాడు."అన్నా! ఈ ఏడ్పు ఈ దిగులు దేనికి? నేను నీకు పదిమంది కుమారుల పెట్టుకాదా? నీకు నా ప్రేమ చాలదా?" అని ఆమెను బుజ్జగించాడు. తరువాత ప్రభువు దయవలన ఆ దంపతులకు సమూవేలు అనే కుమారుడు కలిగాడు - సమూ 1, 6-8. 4. ఈసాకు రిబ్మాను వివాహమాడాడు. ఆమెను నిండు హృదయంతో ప్రేమించాడు. కాలు క్రిందపెట్టనీకుండ చూచుకొన్నాడు. అప్పటికి ఈసాకు తల్లి సారా చనిపోయింది. కాని అతడు రిబ్మావల్ల తల్లిలేని కొరతదీరి ఊరడిల్లాడు - ఆది 24, 67.

5. యూదితు యిప్రాయేలీయుల ఆడపడుచు, విధవ. చాల ప్రజ్ఞావంతురాలు. ఆమె యెరూషలేముమీదికి దండెత్తి వచ్చిన హోలోఫెర్నెసు అనే శత్రుసైన్యాధిపతి శిరస్సు తెగనరుకుకొనివచ్చి పట్టణాన్ని కాపాడింది. యూదితు సౌందర్యాన్ని సాహసాన్నిజూచి చాలమంది ఆమెను పెండ్లియాడాలని ఉవ్విళూరారు. కాని ఆ ధీరురాలు గతించిన తనభర్త మనా షేను స్మరించుకొంటూ రెండవ పెండ్లిమానివేసింది. వైధవ్యంతోనే స్వీయగ్రామమైన బెతూలియాలో రోజులు వెళ్లబుచ్చింది. భర్తపట్ల ఆమె చూపిన గాఢానురాగాం ఆలాంటిది – యూదితు 16, 22.

6. సౌలు తన కొమార్తె విూకాలును దావీదుకిచ్చిపెండ్లిచేసాడు. ఓ రాత్రిదావీదు విూకాలు యింటిలో ఉండగా సౌలు అతన్ని చంపివేయాలనుకొన్నాడు. ఆ రాత్రి ఆమె యింటికి కాపంచాడు. ఉదయాన్నే దావీదును చంపించాలని అతని పన్నాగం. కాని విూకాలు నేర్పుతో ఆరాత్రేదావీదుని కిటికీగుండా వెలుపలికి దింపింది. అతడు సౌలుకు దొరకకుండా పారిపోయాడు 1సమూ 19, 11-12.

7. దావీదు ప్రవాసంలోవుండగా కర్మెలు కొండపై నాబాలు అనే సంపన్నుడయిన కాపరి ఉండేవాడు. దావీదు తిరిపెంకోసం తన అనుచరులను అతని వద్దకు పంపాడు. కాని నాబాలు వట్టి మూర్ఖడు. అతడు దావీదు జనాన్ని అవమానపరచి వెనుకకు పంపాడు. కనుక దావీదు అతని యనుచరులూ నాబాలుని మట్టపెట్టడానికి పయనమై వస్తున్నారు. కాని నాబాలు భార్య అబిగాయిలు చాల తెలివితేటలుకలది. ఆమె యీ సంగతంతా తెలిసికొని గబగబ కానుకలు సిద్ధం చేసికొనివచ్చి త్రోవలో దావీదును కలసి కొంది. మూర్ఖుడైన తన పెనిమిటిని మన్నించమని వేడుకొంది. ఆమె ముఖంజూచి దావీదు నాబాలును క్షమించి వదలివేసాడు. ఆ రీతిగా ఆమె ఆనాడు పెనిమిటి ప్రాణాలు కాపాడింది. తరువాత నాబాలు చనిపోగా దావీదు ఆమెను పెండ్లియాడాడు - 1సమూ 25, 32-35.

8. స్నాపక యోహాను తల్లిదండ్రులు ఎలిసబేత్త జకర్యాలు. ఎలిసబేత్త గొడ్రాలుగా వుంది. అయినా ఆ భార్యాభర్తలు నిర్మల జీవితం జీవిస్తూండేవాళ్లు, దేవుని అజ్నలు పాటిస్తూండేవాళ్లు, వృద్దులైన ఆ పుణ్యదంపతులకు తర్వాత యోహాను పట్టాడు 1, 5–7.

26. పశ్చాత్తాపము

నరులు బలహీనతలవల్ల పాపంచేస్తూంటారు. కాని భగవంతుడు పాపాన్ని అసహ్యించుకొన్నంతగా మరిదేన్నీ అసహ్యించుకోడు. అతడు మహా పవిత్రుడైన దేవుడు. ఆ ప్రభువు తన భక్తులకు పశ్చాత్తాపమనే వరాన్ని ప్రసాదిస్తూంటాడు. ఈ వరంతో భక్తులు రోజురోజుకి హృదయశుద్ధిని పొందుతుండాలి.

1. దావీదు ఊరియాభార్య బత్తైబాను ఆశించాడు. ఊరియాను చంపించి ఆమెను తన భార్యను చేసికొన్నాడు. అప్పడు ప్రభువు పంపగావచ్చి నాతానుప్రవక్త రాజును మందలించడానికై ఓ కథ చెప్పాడు. ఓ వూరిలో ఓ పేదవాడూ ఓ ధనవంతుడూ ఉన్నారు. ధనవంతునికి గొర్రెల మందలు చాలా ఉన్నాయి. పేదవానికి ఒక్క గొర్రెపిల్ల మాత్రమే ఉంది. ఓ దినం ధనవంతుని యింటికి చుట్టంరాగా అతడు తన గొర్రెల నంటుకోకుండా దౌర్జన్యంతో పేదవాని గొర్రెపిల్లను కోయించి బందుగునికి భోజనం తయారు చేయించాడు - అని చెప్పాడు. ఆ మాటలకు దావీదు మండిపడి ఆలాంటి పాడుపని చేసినవాణ్ణి దండించాలి అన్నాడు. అతడు నాల్గవంతులు నష్టపరిహారం గూడ చెల్లించాలి అన్నాడు. అప్పడు ప్రవక్త రాజుతో - ఆపాడు పని చేసినవాడవు నీవే. నీకు ఇంతమంది భార్యలుండగా వూరియా భార్యను గూడ అపహరించావు. నీవు చేసిన ఈ చెడుపని ప్రభువుకి నచ్చలేదు - అని అన్నాడు. దావీదు అంతరాత్మ ఆతన్ని మందలించింది. అతడు పశ్చాత్తాపపడి ప్రభువుని మన్నింపు అడుగుకొన్నాడు -2 సమూ 12, 1-13,

2. స్నాపక యోహాను క్రీస్తుకు ముందుగా వచ్చాడు. క్రీస్తుకు త్రోవ సిద్ధం చేయడం అతనిపని. అతడు 'దైవరాజ్యం సమీపంలో ఉందిగనుక పశ్చాత్తాపపడండి" అని బోధించాడు. ఇక్కడ దైవరాజ్యమంటే క్రీస్తే, యూద ప్రజలు తరతరాలనుండి ఎదురుచూస్తూవచ్చిన మెస్సీయా రానే వచ్చాడు. కనుక ప్రజలు తమ పాపాలకు పశ్చాత్తాపపడి హృదయం మార్చుకొని అతని బోధలు ఆలించాలి అని భావం, తర్వాత క్రీస్తువచ్చాక అతడు కూడ పై యోహాను వాక్యంతోనే తన బోధ ప్రారంభించాడు - మత్త 3, 2;4, 17.

3. ఓ కాపు తనతోటలో అంజూరపు చెట్టును పెంచాడు. కాని మూడేండ్ల గడిచినా దానికి కాపు పట్టలేదు. అతడు దానిపై కోపించి తోటమాలితో ఆ చెట్టును నరికివేయమని చెప్పాడు. కాని తోటమాలి అతనితో ఇంకొక్కయేడు చూద్దాం. దానిచుటూ త్రవ్వి యెరువవేద్దాం. అప్పటికీ కాపు దిగకపోతే కొట్టిపారేద్దాం అన్నాడు. ఏమిటి ఈ యుపమాన భావం? సకాలంలో పరివర్తనమనే ఫలితమీయని నరుడే యీ చెట్టు. న్యాయాధిపతియైన దేవుడు పశ్చాత్తాపపడని పాపాత్ముణ్ణిజూచి కోపగించు కొంటాడు - లూకా 13, 6-9.

4. పేత్రు ప్రభువుని ఎరుగనని ముమ్మారు బొంకాడు. అటుతరువాత అతడు మంటదగ్గిర కూర్చుండి చలిగాచుకొంటున్నాడు. అప్పడు యేసుని బంధించి తీసికొని వెళ్తున్నారు. ప్రభువు తన్నెరుగనని బొంకి ధీమాగా కూర్చొని ఉన్న పేత్రువైపు అలా తేరిపారజూచాడు. అంతకుముందే ప్రభువు పేత్రుతో "ఈ దినం నీవు నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు" అని చెప్పాడు. పేత్రుకి దిఢీలున ఆ విషయం గుర్తుకి వచ్చింది. ప్రభువు చూపు అతనిలో పశ్చాత్తాపం పట్టించింది. అతడు గురువుని ఎరుగనని బొంకాను గదా అని వెలుపలకిబోయి విచారంతో వెక్కివెక్కియేడ్చాడు - లూకా 22, 62.

5. ఓమారు ఓ పరిసయుడూ ఓ సుంకరీ ప్రార్థన జేసికోవడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయుడు దేవుని ముందు తన్నుతాను పొగిడేసుకొన్నాడు. తాను మంచి వాణ్ణేననుకొని తనలోతాను సంబరాలు పడ్డాడు. కాని సుంకరి చిత్తశుద్ధితో "ప్రభో! నేను పాపిని. నన్ను కరుణించు" అని మనవిచేసాడు. దేవుడు సుంకరి మొర ఆలించాడు, పరిసయుణ్ణి త్రోసిపుచ్చాడు - లూకా 18, 13.

6. క్రీస్తుతోపాటు ఇద్దరు దొంగలనుకూడ సిలువమీద కొట్టిచంపారు. వాళ్లల్లో ఒకడు పశ్చాత్తాపపడకుండానే మరణించాడు. పైగా అతడు "నీవే క్రీస్తువైతే మొదట నిన్ను నీవు రక్షించుకో, అటుపిమ్మట మమ్ముగూడ రక్షించు" అని సవాలు చేసాడు. కాని రెండవ దొంగ పశ్చాత్తాపపడ్డాడు. అతడు మొదట తన తోడి దొంగను మందలించాడు. మన పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తూగూడ ఈ వెర్రివాగుడేమిటి అని అతని నోరు మూయించాడు. అటుతరువాత ప్రభువుతో "అయ్యా! నీవు తప్పకుండా మోక్షరాజ్యానికి వెళ్తావు. అక్కడికి చేరాక నన్నుకూడ జ్ఞాపకముంచుకో" అని మనవి చేసాడు - లూకా 23, 39-43.

7. దుడుకుచిన్నవాడు తండ్రి ఆస్తిలో తన వాటా తీసికొని దూరదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ దూబరా ఖర్చులతో సొత్తంతా పాడుచేసికొన్నాడు. ఆ దేశంలో పెద్ద కరువు రాగా తినడానికి తిండిలేక మలమలమాడి చచ్చాడు. అప్పడు అతనికి బుద్ధివచ్చింది. ఇంటివద్ద తన్ను ప్రేమతో చూచుకొనే నాన్నను వీడి వచ్చినందుకు పశ్చాత్తాపం పట్టుక వచ్చింది. అతడు “నేను మా నాన్నదగ్గిరికి వెళ్లి మన్నింపు అడుగుకొంటాను. ఇక మీదట నేను నీ కుమారుడ్డి అన్పించుకోవడానికి తగను. నన్నునీ సేవకుల్లో ఒకణ్ణిగానైన చేర్చుకో. ఏదో కమికెడు కూడు తిని బ్రతికిపోతాను అని చెప్తాను" అనుకొన్నాడు. పాపమంటే యీ దుడుకు చిన్నవాడిలాగ తండ్రియైన దేవునివద్దనుండి వెళ్ళిపోవడం. సృష్టికర్తను వీడి సృష్టి వస్తువులేమో మనలను సుఖపెడతాయనుకొని వాటి దగ్గరికి వెళ్లిపోవడం. పశ్చాత్తాపమంటే ఆ దుడుకుచిన్నవాడిలాగే మరల తండ్రియైన దేవుని యింటికి తిరిగిరావడం. ఆ తండ్రి యనురాగాన్ని పొందడం - లూకా 15, 17-19. 8. క్రీస్తునాడు పాలస్తీనా దేశం రోమను సామ్రాజ్యం అధీనంలో ఉండేది. యూదులు రోమను ప్రభుత్వానికి కప్పం గట్టేవాళ్ల స్థానికంగా కొందరు యూదులు పాలస్తీనాలోని ఒక్కోమండలంలోను ఈ కప్పానికి పాటపాడేవాళ్ళ వాళ్ళ ప్రజలవద్దనుండి పెద్ద మొత్తాలు వసూలుజేసి వానిలో కొంత భాగంమాత్రమే రోమను ప్రభుత్వానికి ముట్టజెప్పేవాళ్ళు. మిగతాడబ్బు వాళ్లు కొట్టేసేవాళ్లు, ఈ కాయిదాదారులకే సుంకరులు అని పేరు. ఈ సుంకరులు చేసే మోసానికి వీళ్ళను "పాపాత్ములు" అని పిలిచేవాళ్లు, యెరికొమండలములోని సుంకరులకు నాయకుడు జక్కయ, ఓమారు ప్రభువు యెరికో పట్టణానికి వచ్చి జక్కయను సందర్శించాడు. దానితో అతనికి పశ్చాత్తాపం కలిగింది. అతడు తాను నోళ్ళగొట్టి సంపాదించిన సొత్తులో సగం పేదలకు దానం జేసాడు. పైగా ఎవరెవరికి వ్యక్తిగతంగా అన్యాయం చెసాడో వాళ్ళందరికి నాల్గవంతులు నష్టపరిహారంగూడ చెల్లించాడు. ప్రభువు అతని పశ్చాత్తాపానికి మెచ్చుకొని నేడు ఈ యింటికి రక్షణ లభించింది అని పల్కాడు - లూకా 19, 1-10.

9. పౌలు యూదుడుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు. డమస్క త్రొవ లొ ప్రభువు ప్రత్యక్షం కాగా పౌలు మనసు మార్చుకొని క్రీస్తు శిష్యుడయ్యాడు. అతడు క్రీస్తుకు ఎంతో సేవ చేసాడు. కొరింతులాంటి గ్రీకు పట్టణాల్లో క్రైస్తవ సమాజాలు స్థాపించాడు. తీతు తిమోతీలవంటి శిష్యులను ప్రోగుజేసాడు. మహత్తరమైన భక్తిభావాలతో పదునాలు జాబులు వ్రాసాడు. ఇంతసేవ చేసినంక చివరిరోజుల్లో గూడ పౌలు తాను మహా పాపిననుకొని పశ్చాత్తాపపడ్డాడు. "పాపాత్ముల్లో నేను మొదటివాణ్ణి అయినా నాలాంటి పాపిని మన్నిస్తే ఇక భవిష్యత్తులో రాబోయే పాపాత్ములు నన్నుజూచి ధైర్యం తెచ్చుకొంటారనుకొని వాళ్ళకు ఆదర్శంగా ఉండడం కోసం ప్రభువు నన్ను మన్నించాడు" అని వ్రాసికొన్నాడు. ఈలా పౌలు తానెప్పడో క్రైస్తవులను హింసించినందుకు జీవితాంతమువరకూ పశ్చాత్తాపపడ్డాడు -1 తిమో 1. 50-16.

10.

1) పాపి మరణించడం వలన నాకు సంతోషం కలుగదు. అతడు మనసు మార్చుకొని బ్రతకడంవలన నాకు సంతోషం కలుగుతుంది - యెహె 23, 11.
2) దేవా! నాలో నిర్మల హృదయాన్ని సృజించు క్రొత్త అంతఃకరణాన్ని నాలో నెలకొల్పు నీ సన్నిధినుండి నన్ను గెంటివేయకు నీ పరిశుద్దాత్మను నాయొద్దనుండి తీసివేయకు - కీర్త51, 10-11 239 N

27. దయ

భగవంతునిలో కన్పించే ఓ. కల్యాణగుణం, దయ. ఆ భగవంతుణ్ణి చూచి నరుడుకూడ దయతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇతరులపట్ల ఖచ్చితంగా ప్రవర్తించడమూ, ఇతరులను ప్రమశిక్షణలో ఉంచుకోవడమూ సులభం. కాని ఇతరుల యెడల దయతో మెలగడం కష్టం. అయినా దయాగుణం అలవర్చుకొన్నవాడే దొడ్డవాడు.

1. అబ్రాహాము తన కుమారుడు ఈసాకునకు పిల్లను వెదకడానికై సేవకుణ్ణి పంపాడు. అతడు ఒంటెలతో వెళ్ళి ఆరాము అనే గ్రామం చేరుకొని ఆ యూరి దిగుడుబావివద్ద దిగాడు. అప్పడు అబ్రాహాము తమ్ముని కుమారుడైన బెతువేలుని కుమార్తె రిబ్కాబావికి నీళ్ళకు వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి ఆబ్రాహాము సేవకుడని ఆమెకు తెలియదు. ఆ బాలిక అతనికి నీళ్లు చేది యిచ్చింది. దయతో అతని ఒంటెలకుగూడ నీళ్లు తెచ్చిపోసింది. తరువాత ఆ యువతిని ఈసాకునకిచ్చి పెండ్లిచేయడం జరిగింది - ఆది 24, 18-19.

2. సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికై ఎంగెడీ ఎడారి అంతా గాలిస్తున్నాడు. ఓమారు సౌలు మలవిసర్జనకై ఆ ఎడారిలోని ఓ కొండ గుహలో ప్రవేశించాడు. అంతకు ముందే దావీదు తన అనుచరులతో ఆ గుహలో దాగివున్నాడు. అలా తలవని తలంపుగా గుహలోనికి వచ్చిన సౌలునుజూచి అతన్ని చంపివేయమని మిత్రులు దావీదుకు సలహా యిచ్చారు. కాని రాజుపై గల గౌరవంచే దావీదు అతన్ని ముట్టుకోలేదు. సౌలు తనకు దొరికిపోయాడు అనడానికి ఆనవాలుగా దావీదు అతని ఉత్తరీయపు చెంగుమాత్రం కత్తిరించుకొన్నాడు. అలా దావీదు తనపట్ల దయజూపి తన బొందిలో ప్రాణాలు నిలిపినందుకు సౌలు చాల ఆశ్చర్యపడ్డాడు. 1 సమూ 24, 11-16,

3. సౌలు కుమారుడైన యోనాతాను దావీదునకు మిత్రుడు. ఈ యోనాతాను కుమారుడు మెపిబోసెతు. ఇతడు అవిటికాలివాడు. సౌలు కుటుంబమంతా యుద్ధంలో నాశమైపోయాక దావీదు మెపిబోసెతును పిలిపించి అతని మీద దయజూపాడు. అతన్ని రోజూ తన సరసన కూర్చుండి భోజనం చేయమని చెప్పాడు. ఆలా రాజాదరణ పొందిన మెపిబోసెతు "నేను చచ్చిన కుక్కలాంటివాణ్ణి గదా! దావీదు ప్రభువు నాపట్ల యింత కరుణ జూపాలా" అని విస్తుపోయాడు -2 సమూ 9, 7-8.

4. రూతు నవోమికి కోడలు. ఈ నవోమి బోవను బంధువురాలు. బోవసు ధనవంతుడు. నవోమి పేదరాలు. ఓ దినం రూతు బోవసు పొలంలో పరిగలేరుకోవడానికి పోయింది. బోవసు ఆమెను కరుణతోజూచి పరిగలేరుకోనిచ్చాడు. తన కూలివాళ్లతోగూడ ఆమెను బాధించవద్దని చెప్పాడు. ఆమెకు దాహమైనప్పడు కూలివాళ్ళ చేదుకొని వచ్చిన కుండల్లోని నీళ్ళ త్రాగమని చెప్పాడు. అతని కారుణ్యానికి రూతు ఎంతో సంతోషించింది — రూతు, 2, 8–9.

5. పౌలు ఓడపై ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చి ఆ వోడ మునిగిపోయింది. అతడూ అతని యనుచరులూ ఒడ్డజేరి మాల్టాదీవి చేరుకొన్నారు. ఆ ద్వీపవాసులు పౌలును ఆదరంతో జూచారు. అప్పడు చలిగా వున్నందున మంటలువేసి అతన్ని పరామర్శించారు - అచ 28,చ 1-2.

6. ఓ యజమానునికి ఓ సేవకుడు పెద్దమొత్తం బాకీపడి ఉన్నాడు. యజమానుడు అతనిమీద దయతలచి బాకీని మన్నించాడు. ఆ సేవకుని ఇంకో సేవకుడు చిన్నమొత్తం బాకీపడి ఉన్నాడు. అయినా అతడు తనతోడి సేవకుణ్ణి మన్నించలేదు. బాకీ చెల్లించవా అని అతన్నిచెరలో వేయించాడు. ఆ సంగతి తెలిసికొని యజమానుడు మొదటి సేవకుణ్ణి పిలిపించి "ఓయీ! నేను నీయెడల దయచూపినట్లే నీవూ తోడి సేవకునియెడల దయజూపవద్దా?" అని అతన్ని కఠినంగా శిక్షించాడు- మత్త 18, 83. 28. పని మనకు పనిచేయాలంటే యిష్టంగా ఉండదు. పని నుండి తప్పించుకొంటే యెంతోగొప్ప అనుకొంటాం. కాని బైబులు భగవంతుడు స్వయంగా పనిచేసేవాడు. ఆ భగవంతునిలాగే అతని భక్తుడుకూడ పనిచేయాలి. చివరికి మనలను రక్షించేదీ శిక్షించేదీగూడ మనం చేసే పనే. 1. దేవుడు ఆరునాళ్లు పనిచేసి భూమ్యాకాశాలనూ వాటిలో ఉండే సకల ప్రాణులనూ సృజించాడు. ఏడవనాడు పనిచాలించి విశ్రాంతి తీసికొన్నాడు. ఏడవరోజును దీవించి దాన్ని పవిత్ర దినంగా చేసాడు - ఆది 2, 1-3.

2. ఆదాము పాపంచేయకముందుగూడ ఏదెను తోటలో పని చేస్తూండేవాడు - ఆది 2, 15, అయినా ఆ పని అతనికి కష్టమనిపించలేదు. ఇక ఆదాము పాపంచేసాక నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొమ్మని దేవుడతన్ని శపించాడు. ఈ శాప ఫలితంగా ఆదామునకు పనిభారమనిపించింది. నాటినుండి నేటివరకు నరులందరికీ పని అంటే అనిష్టంగానే ఉంటుంది - ఆది 3, 19.

3. చీమలనుచూచి సోమరియైన నరుడు జ్ఞానం తెచ్చుకోవాలి. చీమలకు నాయకుడూ లేడు, తనిఖీదారుడూ లేడు, అయినా అవి సోమరితనంతో కాలం వెళ్లబుచ్చవు. పంటకాలం రాగానే ఆహారం నిల్వజేసికొంటాయి. ఆ యాహారంతో సంవత్సరమంతా హాయిగా బ్రతుకుతాయి. ఈలాగే నరుడుగూడ కృషిచేస్తే ఆ కృషి ఫలితంగా బ్రతికి పోతాడు - సామె 6, 6-8. 4. క్రీస్తు తానుచేసిన పనులన్నీ చక్కగాజేసి ముగించాడు. అతడు ఇతరులకు ఉపకారంజేస్తూ పర్యటనం జేసాడు - ఆచ 10,38.

5. మనం చేసేపనులు మంచివైయుండాలి. మంచి పనులు ఓ దీపంలా ప్రకాశిస్తాయి. ఆ వెలుగునుజూచి తోడి జనులు పరలోకంలోని దేవుణ్ణి కొనియాడతారు - మత్త 5,16.

6. మనం చేయవలసిన పనంతాచేసి ముగించాక గూడ గొప్పలు చెప్పకోగూడదు. మేము అది చేసాం. యిది చేసాం అని డప్పవాయించుకోగూడదు. మన బాధ్యత ప్రకారం చేయవలసిన పని చేసినపిదపగూడ "మేము అయోగ్యులమైన సేవకులం. మా కర్తవ్యం ప్రకారం చేయవలసినపని చేసాం. మేము అధికంగా చేసిందే ముంది?" అనుకోవాలి - లూకా 17.10.

7. క్రీస్తు తన తండ్రి చిత్తప్రకారం జీవించాడు. తాను చేసిన పనులన్నీ తండ్రి చిత్తాన్ననుసరించే చేసాడు. అతడు "నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమూ ఆయన పనిని పూర్తిచేయడమూ నా యాహారంగా భావిస్తాను" అని యన్నాడు - యోహా 4,24.

8. మంచిచెట్టు మంచిపండ్లనూ, పాడుచెట్టు పాడుపండ్లనూ కాస్తాయి. పండ్లనుబట్టి చెట్టు ఏలాంటిదో తెలిసిపోతుంది. అలాగే మనంచేసే పనులనుబట్టే మనమేలాంటి వాళ్లమో తెలిసిపోతుంది - మత్త 7, 16, 30.

9. పౌలు బ్రతికివుండగా క్రీస్తు మళ్ళా రెండవ మారు విజయంచేసే కాలం ఆసన్నమైంది అనే వదంతి బయలుదేరింది. ఆ వదంతిని ఆసరాగా దీసికొని కొంతమంది పనిపాటలు మానేసి గాలికి తిరగడం మొదలెట్టారు. తెస్సలోనిక పట్టణంలో ఈలాంటి పోస్కోలు రాయుళ్లు కొంతమంది పౌలు కంటబడ్డారు. అతడు వాళ్ళను నిశితంగా మందలించాడు. "పని చేయనివాడు కూడు దినడానికి అరుడుకాడు" అని శాసించాడు - 2 తెస్స 3,10.

10. పౌలుకు చివరిరోజులు సమీపించాయి. అతడు తన జీవితాన్నంతటినీ ఓమారు సమీక్షించి చూచుకొన్నాడు. తాను వ్యర్థంగా కాలంగడపలేదనీ ప్రభువుకోసం ఏదో కొంత సాధించాననీ సంతృప్తిచెందాడు. ఇంకా అతడు ఈలా అనుకొన్నాడు - "ఇంతకాలమూ నేను మంచి పోరాటమే పోరాడాను. పందెంలో చక్కగా పరుగెత్తాను. ప్రభువమీద విశ్వాసం నిలుపుకొన్నాను. ఇప్పడు నాకు పందెపు బహుమానం లభిస్తుంది. న్యాయాధిపతియైన ప్రభువు నాకు నీతిమంతుల కిరీటాన్ని బహూకరిస్తాడు. ఒక్కనాకేగాదు, ప్రభువు కొరకు పనిచేసి ఆయన దర్శనంకోసం వేచివున్న భక్తులందరికీ ఈలాంటి కిరీటం లభిస్తుంది" -2 తిమో4, 7-8.


29. విశ్వాసం

భగవంతుని మీద భక్తి అంటే ఏమిటి? ఆ ప్రభుని నమ్మి ఆతన్ని ఆశ్రయించడం. కనుక నమ్మికంలేందే దేవుని మీద భక్తి కుదరదు. ప్రస్తుతం మనం భగవంతుణ్ణి కంటితో చూడలేం. కేవలం విశ్వాసం ద్వారానే అతన్ని అంగీకరించాలి. భగవంతుణ్ణి నమ్మినవాళ్లకి ఈ జీవితంలోని సుఖదుఃఖాలద్వారా అతడు రోజురోజుకీ అనుభవానికి వస్తూనే ఉంటాడు. 1. అబ్రాహాము కాల్డియాదేశ నివాసి. ప్రభువు అతన్ని “నీ దేశాన్ని నీ చుట్టపక్కాలనూ వదలి నావెంట రమ్మని పిల్చాడు. ఆబ్రాహాముకి తానెక్కడికి వెళ్ళాలో యేమిచేయాలో ఏమీ తెలియదు. అయినా అతడు ప్రభునినమ్మి అతనివెంట వచ్చేసాడు. ఇది యతని విశ్వాసంలో మొదటి మెట్టు - ఆది 12, 1. ఈ అబ్రాహాముకి సంతానం కలుగలేదు. అతడూ అతని భార్య సారా వృద్దులు. అయినా అతడు ప్రభుని నమ్మాడు. ప్రభువు అబ్రాహాముకి సంతానం కలిగిస్తానని చెప్పాడు. పైగా అతని వంశీయులు ఆకాశంలోని చుక్కల్లాగ, సముద్రతీరమందలి యిసుకరేణువుల్లాగ వృద్ధి చెందుతారని మాటయిచ్చాడు. అబ్రాహాము దేవునిమాట నమ్మాడు. ఆ నమ్మికనుబట్టే దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు. ఇది అతని విశ్వాసంలో రెండవమెట్టు -15, 5-6.

ఆ మీదట ప్రభువు అబ్రాహాముని తన యేకైక కుమారుడైన ఈసాకుని బలియిూయమని కోరాడు. ఆ ముసలి ప్రాయంలో ఈసాకు గతిస్తే అతనికి మరో కుమారుడు పడతాడా? అయినా అతడు దేవుణ్ణినమ్మాడు. తన కుమారుడ్డి ప్రభువు ఏలాగైనా బ్రతికించకపోతాడా అనుకొన్నాడు. అతడు ఈసాకును బలి యిూయడానికి పూనుకొన్నాడు. ప్రభువు మాత్రం ఒక పొట్టేలిని బలిగా స్వీకరించి ఈసాకును వదలివేసాడు. ఇది యతని విశ్వాసంలో మూడవమెట్టు. ఈలా అబ్రాహాము విశ్వాసంతో జీవించిన నీతిమంతుడు - ఆది 22, 11-13. 2. ప్రభువు యిస్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నా కురిపించాడు. అయినా ఆ యాహారం వాళ్ళకు రుచించలేదు. చవీసారమూ లేని ఈ యన్నం ఎవరికి కావాలి అని వాళ్లు మోషేమీద తిరగబడ్డారు. అప్పడు ప్రభువు ప్రజలపై కోపించి నిప్పపాములు పంపాడు. అవి కరవగా వాళ్లల్లో చాలమంది చచ్చారు. అప్పడు ప్రజలు మోషేను ప్రార్ధింపగా అతడు దేవుని యాజ్ఞపై ఓ యిత్తడిపామును చేయించి దాన్ని ఓ యెత్తయిన గడెమీద వ్రేలాడదీయించాడు. పాములు కరచిన వాళ్ళంతా నమ్మికతో ఆయిత్తడి పామువైపు చూడగా విషంవిరిగి బ్రతికిపోయారు. ఒట్టినే యిత్తడిపామువైపు చూడ్డంవల్లకాదు, ఆ పామువైపు చూడమని చెప్పిన దేవుని ఆజ్ఞను నమ్మడంవల్ల వాళ్లకు చావు తప్పింది - సంఖ్యా .21, 8–9. 3. సిరియాదేశపు సైన్యాధిపతియైన నామాను కుష్ట వ్యాధిని నయంజేయించు కోవడానికైయిస్రాయేలు ప్రవక్త ఎలీషా వద్దకు వచ్చాడు. ప్రవక్త అతన్నియోర్గానునదిలో స్నానం చేయమని చెప్పాడు. కాని నదిలో స్నానంచేస్తే కుష్టపోతుందనే నమ్మకం నామానుకు లేదు. కనుక అతడు తిరిగి సిరియాకు వెళ్ళిపోబోతున్నాడు. కాని నామాను సేవకుడు ప్రవక్తమాట నమ్మాడు. అతడు తన యజమానునికి నచ్చజెప్పి అతనిచేత ఏటిలో స్నానం చేయించాడు. దానితో నామానుకు కుష్టపోయింది 2-రాజు 5, 13-14.

4. గొల్యాతు మహావీరుడు. దావీదు చిన్నకుర్రవాడు. కాని గొల్యాతు ఆయుధాలను నమ్మకొన్నాడు. దావీదు యావే ప్రభువుని నమ్మకొన్నాడు. సామాన్య పరిస్థితుల్లో గొల్యాతులాంటి వీరుడు దావీదును పేలపిండి చేయవలసింది. కాని దైవబలాన్ని నమ్మకొన్న దావీదు గొల్యాతుని పచ్చడిచేసాడు. చివరికి నవ్విన నాపచేనే పండింది - 1సమూ 17,45.

5. యోబుని పిశాచం నానా శ్రమలతో బాధిస్తూంది. యోబు మిత్రులు అతడు దుర్మార్ణుడైయుండాలి అనుకొన్నారు. యోబు భార్య దేవుణ్ణి శపించమని భర్తను రెచ్చగొట్టింది. ఆలాంటి పరిస్థితుల్లోగూడ యోబు దేవునిమీద నమ్మిక కోల్పోలేదు. అతడు “ప్రభువు నన్ను చంపినాసరే నేను అతన్ని నమ్మితీరతాను" అన్నాడు - యోబు 13, 15.

6. యేసు చనిపోయిన లాజరుని బ్రతికించడానికి వచ్చాడు. లాజరుని ఓ కొండగుహలో పాతిపెట్టి రాతితో మూసి ఉంచారు. ప్రభువు ఆ రాతిని తొలగించమన్నాడు. మార్త "ప్రభూ లాజరు చనిపోయి నాలురోజులైంది. అతని శరీరం ఇప్పటికల్లా కంపుకొడుతూంటుంది" అంది. ప్రభువు ఆమెతో “మారా! నీవు నా పలుకులు విశ్వసించావంటే దేవునిశక్తి ఏలాంటిదో చూస్తావు" అన్నాడు. మార్త క్రీస్తుమాట విశ్వసించింది. అపుడు ప్రభువు లాజరుని వెలుపలికిరమ్మని పిల్వగానే అతడు సజీవుడై సమాధి నుండి వెలుపలికి వచ్చాడు - యోహా 11, 40.

7. ఓమారు ఓ తండ్రి పిశాచం సోకిన కుమారుడ్డి శిష్యులవద్దకు తీసికొనివచ్చాడు. కాని శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. తర్వాత తండ్రి ఆ చిన్నవాణ్ణి క్రీస్తువద్దకు తీసికొని రాగా ప్రభువు అతనికి పట్టివున్నదయ్యాన్ని పారద్రోలాడు. అటుపిమ్మట శిష్యులు ఏకాంతంగా క్రీస్తుదగ్గరికివచ్చి ఆ భూతాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామో చెప్పమని అడిగారు. ప్రభువు "మీకు చాలినంత విశ్వాసంలేదు కనుకనే పిశాచం మీ మాట వినలే”దని పల్కాడు - మత్త 18, 19-20. 8. ఓ రాత్రి శిష్యులు గలిలయ సరస్సులో పడవమీద ప్రయాణం చేస్తున్నారు. వేకువజామున ప్రభువుగూడ నీళ్లమీద నడుస్తూ వాళ్ళదగ్గరికి వచ్చాడు. ప్రభువునిజూచి పిశాచ మనుకొని భయపడి వాళ్ళంతా కెవ్వన కేకవేసారు. ప్రభువు తన్నెరుకపరచుకొని వాళ్లకు ధైర్యంచెప్పాడు. అపుడు పేత్రు తనూ నీటిమీద నడచి ప్రభువు దగ్గరికి వెళ్లాలనుకొన్నాడు. అతడు నీటిమీద కొన్ని అడుగులు బాగానేవేసాడు. కాని అంతలోనే అతనికి అనుమానం పట్టుకవచ్చింది. అతని విశ్వాసం గూడ సన్నగిల్లిపోయింది. వెంటనే అతడు నీటిలో మునిగిపోవడం మొదలెట్టాడు. ప్రభో నన్ను రక్షించు అని అరచాడు. ప్రభువు చేయిచాచి అతన్ని పట్టుకొని "పేత్రూ! నీవు అల్పవిశ్వాసివి. నీవు సందేహించకుండా ఉన్నట్లయితే నా వద్దకు నడిచివచ్చేవాడివే గదా!" అన్నాడు - మత్త 14, 30-31. 9. ఇంకోమారు పేత్రు రాత్రంతా చేపలు పట్టాలని ప్రయత్నం చేసాడుగాని, అతనికి ఓ పక్కెపిల్లగూడ దొరకలేదు. తర్వాత ప్రభువు అతన్ని పిలిచి లోతులోకి వల విసరమన్నాడు. పేత్రు ప్రభువుమాటనమ్మి లోతులోకి వలవిసిరాడు. వెంటనే వల పిగిలిపోయేటంతగా చేపలు పడ్డాయి. అదిచూచి పేత్రు ఆశ్చర్యపోయి "ప్రభో! నేను పాపిని. నన్ను విడిచి వెళ్లిపో" అని అరిచాడు. — లూకా 5, 4-6. 10. ఓ తడవ ఓ తండ్రి మూగదయ్యం పట్టిన కుమారుడ్డి క్రీస్తువద్దకు తీసికొనివచ్చి నీకు సాధ్యమైతే ఈ దయ్యాన్ని పారద్రోలి నాకు ఉపకారం చేసిపెట్టమని అడిగాడు. క్రీస్తు ఈ పని నాకు సాధ్యమౌతుంది. అనేనమ్మకం నీకువుందా అని ప్రశ్నించాడు. ఆ తండ్రి "ప్రభో! మీకు సాధ్యమౌతుందనే నా నమ్మకం. అయినా నాకేమైనా అపనమ్మకం కలిగినట్లయితే తమరే తోడ్పడాలి" అని వినయంగా అడుగుకొన్నాడు. ప్రభువు ఆ తండ్రి కోరినట్లే అతని కుమారునినుండి దయ్యాన్ని పారద్రోలాడు - మార్కు 9, 22-24. 11. సొలోమోను వైభవంగా జీవించాడు. సుందరమైన వస్తాలను ధరించాడు. కాని ప్రభువు పొలంలో ఎదిగే లిల్లీ మొక్కలకుగూడా చక్కనిపూలు తొడుగుతున్నాడు. అవి కష్టపడి పనిచేయవు, నూలు వడకవు. అయినా వాటి పూబట్టలు సాలోమోను తాల్చిన దుస్తులకంటే యింకా అందంగా ఉంటాయి. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిమంటలో కాలిపోయే గడ్డిపోచలనే భగవంతుడు యింత సుందరంగా అలంకరిస్తూంటే, వాటికంటె ఎంతో యోగ్యడైన నరుడ్డిగూర్చి అతడు ఆలోచించడా? ఆలాంటి భగవంతునిమీద మనకు నమ్మకం ఉండవద్దా? - లూకా 12, 27-28. 12. కఫర్నాము పట్టణంలో ఓ రోమను సైన్యాధిపతి ఉండేవాడు. అతనికి యూదులంటే యిష్టం. వాళ్లకు ప్రార్థనా మందిరంగూడ కట్టిపెట్టారు. ఓమారు అతనికి ఇష్ణుడైన సేవకునికి జబ్బుచేసింది. ఆ సేవకుని వ్యాధి నయంచేయవలసిందిగా అతడు ప్రభువుకి కబురు పెట్టాడు. ప్రభువు అతని యింటికి వస్తూండగా సైన్యాధిపతి అతని యొద్దకు దూతలనపంపి "తమరు మా యింటికి రానక్కరలేదు. అందుకు నేను యోగ్యణ్ణి గూడకాదు. మీరకుడనే ఉండి ఒక్కమాట సెలవిస్తేచాలు నా దాసుడు బ్రతికిపోతాడు. మీ యధికారవాక్యం ఏలా పనిచేస్తుందో నాకు బాగా తెలుసు” అని చెప్పించాడు. అతని విశ్వాసానికి ప్రభువు ఆశ్చర్యపోయి "నేను యిప్రాయేలీయుల్లోగూడ ఇంతటి విశ్వాసం చూడలేదు" అని అన్నాడు — లూకా 7,9.

13. ఓమారు ప్రభువు యాయిూరు అనే అధికారి యింటికి వెళూన్నాడు. జనసమూహం ఆయననుసరించి వెళూంది. అప్పడు పండైండేండ్ల నుండి రక్తస్రావవ్యాధితో బాధపడుతున్నఓ దీనురాలు ఆ మహానుభావుని అంగీ ముట్టుకొంటేచాలు నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకొంది. ఆమె జనసమూహంగుండా చోటుచేసికొనివచ్చి నమ్మికతో ఆయన అంగీ అంచును అంటుకొంది. ప్రభువు ఆమె హృదయాన్నిగుర్తించి కూమారీ! నీ విశ్వాసమే నీకు ఆరోగ్యం చేకూర్చి పెడుతుందిపో" అన్నాడు. వెంటనే ఆమె వ్యాధి నయమయింది - మత్త 9,20-22.

14. ఉత్థానక్రీస్తు శిష్యులకు కన్పించినపుడు తోమా వాళ్లతోలేడు. తర్వాత శిష్యులు ప్రభువు తమకు కన్పించాడని చెప్పినా తోమా నమ్మలేదు. ఆయన ప్రక్క గాయాలలో వేలుపెట్టి చూస్తేనేగాని నేను నమ్మనుపొండి అన్నాడు. తర్వాత ప్రభువు మళ్ళా శిష్యులకు కన్పించాడు. అప్పడు తోమాకూడ వున్నాడు. ప్రభువు అతన్ని పిల్చి "ఓయి! నీవు కోరినట్లే నా గాయాల్లో వేళ్లపెట్టి చూడు. నీవు అవిశ్వాసివిగాక విశ్వాసివిగావుండు. నీ విప్పడు కండ్గార చూచావుగనుక నన్ను విశ్వసిస్తున్నావు. కాని కంటితో చూడకుండానే నన్ను విశ్వసించేవాళ్లు నీ కంటే ధన్యులు సుమా!" అన్నాడు - యోహా 20, 27-29.

15. నీతిమంతుడు విశ్వాసంతో జీవిస్తాడు - హబకూకు 2-4

30. దైవవాక్కు

ప్రభువువాక్కు ప్రభువులాగే అద్భుతమైన క్రియాశక్తిగలది. అది మన హృదయాలమీద పనిచేసి మనకు చైతన్యం కలిగిస్తుంది. కనుక భక్తుడు బైబులువాక్కుతో పరిచయం కలిగించుకోవాలి. ఆ వాక్కును ధ్యానించుకోవాలి.

(1) పఠనాభ్యాసం

1. తిమోతి చిన్ననాటినుండేపూర్వవేదగ్రంథాలు చదువుకొనే అలవాటు కలవాడు. అవి అతనికి క్రీస్తు జ్ఞానాన్నిగలిగించాయి. అతడు ఆజ్ఞానంద్వారా విశ్వాసమూ దానిద్వారా రక్షణమూ పొందాడు - 2 తిమో 3, 15. 2. క్రైస్తవుడు క్రీస్తుసందేశంతో నిండుకొని ఉండాలి. కుండ నీటితో నిండివున్నట్లే భక్తుని హృదయం బైబులు సందేశంతో నిండి ఉండాలి. అనగా అతనికి భైబులుతో పరిచయముండాలి - కొలొ 3, 16.

3. ప్రభువు కరువు పంపిస్తాడు. ఆ కరువు కూటికీ నీళ్లకూ గాదు, దైవవాక్యానికి. అనగా ప్రజలు బైబులు వాక్యం తెలిసికోకపోవడం అనే కరువు వస్తుంది. నేటి మన పరిస్థితి అలాగే ఉందిగదా! - ఆమోసు 8, 11.

4. ఎజ్రా ధర్మశాస్త్రగ్రంథాన్ని చదివి విన్నిస్తూండగా యిస్రాయేలు ప్రజలంతా విని భక్తిపారవశ్యంతో కన్నీళ్లు రాల్చారు - నెహమ్యా. 8, 8–9. ఆలాగే ధర్మశాస్త్రం చదువుతూండగా విని యోషియారాజు పరితాపంతో బట్టలు చించుకొన్నాడు -2 రాజు 22,11.

(2) దైవవాక్కులో వుండే శక్తి

1. వానా మంచూ కురిసి నేలను పదునుజేసి పైరు ఎదిగిస్తాయి. సేద్యగానికి ధాన్యం చేకూర్చిపెడతాయి. ఆలాగే దైవవాక్కుగూడ మన హృదయమనే పొలాన్ని పదునుజేసి దానిలో మంచికోరికలు మొలకెత్తిస్తుంది. మనం దైవసంకల్పం ప్రకారం జీవించేలా చేస్తుంది. కురిసిన వర్షంలాగే దైవవాక్కుగూడ వ్యర్థంగాబోదు - యెష55, 10-11.

2. వేటగాడు పక్షులమీదికి విడిచిన డేగలాగే దైవవాక్కుగూడ రౌద్రంగా నరులమీదికి దిగివస్తుంది - యొష 9,8.

3. సమ్మెట గండశిలలను బ్రద్దలు చేసినట్లే ప్రభువు వాక్కునరుని హృదయాన్ని వ్రయ్యలు చేస్తుంది —యిర్మీ 23, 29.

4. దావాగ్ని అరణ్యాన్ని కాల్చివేస్తుంది. అలాగే దేవునిమాట విననివాళ్లను ఆతని వాక్కు భస్మం చేస్తుంది - యిర్మీ 5, 14.

5. ప్రభువు వాక్కుఓ దూతలాగ వడివడిగా పరుగెత్తుకొని వచ్చి నరుని చేరుతుంది - కీర్తన 147, 15.

6. ఆ వాక్కు ఓ యుద్ధవీరుళ్లాగ దుముకుతూ వస్తుంది. అది శత్రువమీదపడి అతన్ని హతమారుస్తుంది - సొలోమోను జ్ఞాన 18, 14-16.

7. ప్రభువు వాక్కు ఓ దీపంలాంటిది మన త్రోవకు ఓ వెలుగులాంటిది - కీర్త 119, 105.

9. ప్రభు పలుకులు ఎంతో రుచిగా ఉంటాయి తేనెకంటె తీయగా ఉంటాయి 119, 103. 9. ప్రవక్త యెహెజ్కేలు ప్రభుగ్రంథాన్ని భక్షించగా అది అతని నోటికి తేనెవలె తీయగా వుంది - యెహెజ్కేలు 3,3

10. పాలు శిశువును పోషించినట్లే దైవవాక్కు భక్తులను పోషిస్తుంది - 1 పేత్రు 2,2.

(3) వాక్యాన్ని వివరించి చెపూండగా భక్తితో ఆలించాలి.

1. క్రీస్తు ఉత్తానానంతరం ఇద్దరు శిష్యులు ఎమ్మావుకు వెళూన్నారు. వాళ్లకింకా ప్రభువు ఉత్థానమయ్యాడని తెలీదు. పైగా వాళ్లు క్రీస్తు రోమను ప్రభుత్వంతో యుద్ధంచేసి పాలస్తీనా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టకుండానే చనిపోయాడుగదా అని నిరుత్సాహంగా ఉన్నారు. త్రోవలో క్రీస్తు వాళ్లను కలిసికొన్నాడు. అయినా వాళ్ళతన్ని గుర్తుపట్టలేదు. క్రీస్తు రాజకీయాల్లో జోక్యంచేసికోవడానికి రాలేదనీ, అతడు మొదట బాధలననుభవించి అటుపిమ్మట మహిమను పొందుతాడనీ ప్రవక్తలు వచించారని ప్రభువు వాళ్లకు తెలియజెప్పాడు. తరువాత ఎమ్మావు చేరుకొన్నంక క్రీస్తు రొట్టె విరుస్తుండగా శిష్యులతన్ని గుర్తుపట్టారు. దానితో ప్రభువు అదృశ్యుడయ్యాడు. తరువాత ఆ ఇద్దరు శిష్యులూ యెరూషలేముకు తిరిగివస్తూ "ఆయన మార్గంలో మనతో మాట్లాడుతూ లేఖనాలను వివరించి చెపూంటే మన హృదయం భక్తిపారవశ్యంతో నిండిపోలేదా? అనుకొన్నారు. ప్రభువు వాక్యాన్నిగాని ఆ వాక్యాన్ని గూర్చిన బోధనుగాని వింటూన్నపుడు మనకుగూడ ఈలాగే భక్తిపారవశ్యం కలగాలి — లూకా 24, 32.

2. ఓమారు ప్రభువు మరియామార్తల ఇంటికి వచ్చాడు. మార్త ప్రభువుకి భోజనం సిద్ధంజేయడంలో సతమతమౌతుంది. కాని మరియు మాత్రం ప్రభు పాదాల దగ్గిరే కూర్చుండి స్త్రిమితంగా ఆయన బోధ వింటూంది. మరియనుగూడ వంటపనికి పంపమని మార్త ప్రభుని అడిగింది. అయినా ప్రభువు ఆమెను పంపలేదు. మరియు ఉత్తమమైన కార్యాన్ని ఎన్నుకొందని ఆమెను సమర్ధించాడు. ఈ మరియలాగే మనమూస్త్రిమితంగా ప్రభు వాక్యాన్ని వినాలి — లూకా 10, 38–42.

3. ఇతియోపీయుడు రథంమీద గూర్చుండి హిబ్రూ బాషలో యెషయా ప్రవచనం చదువుకొంటూన్నాడు. "అతన్ని ఓ గొర్రెపిల్లగా వధ్యస్థానానికి నడిపించుకొని వెళ్లారు. అయినా అతడు పల్లెత్తి మాటాడలేదు" - అనే వాక్యం దగ్గరికి వచ్చేప్పటికల్లా ఇతియోషీయునికి ప్రవక్త యెవరినిగూర్చి - ఈలా చెప్తున్నాడబ్బా అని సందేహం కలిగింది. అప్పడు ఫిలిప్ప అతన్ని కలిసికొని అదేవాక్యం ఆధారంగా తీసికొని క్రీస్తుని గూర్చి బోధించాడు. అలా పల్లెత్తి మాట్లాడకుండా వధ్యస్థానానికి వెళ్ళిన మహానుభావుడు క్రీస్తేనని వివరించి చెప్పాడు. యితియోపీయుడు అతని బోధను విశ్వసించి జ్ఞానస్నానం పొందాడు. అతనిలాగే మనమూ దైవవాక్య బోధను నమ్మికతో ఆలించాలి - అచ 8, 26-40.

4. ప్రభో! నీవు నా కండ్లు తెరువు అప్పడు నేను నీ ధర్మశాస్త్రం బోధించే అద్భుత సత్యాలను తెలిసికొంటాను - కీర్త 119,18.
5. ప్రభో! నీ దాసుడు ఆలించడానికి సిద్ధంగానే వున్నాడు. సెలవీయి - 1 సమూ 3, 10.
6. ఇద్దరు ముగ్గురు నా పేరుమీదుగా సమావేశమైన కాడ నేనూ నెలకొని వుంటాను - మత్త 18,20.

(4) భక్తుడు దైవాక్కును ధ్యానించుకోవాలి

1. ప్రభో ! నేను నీ ఉపదేశాలను ధ్యానించుకొంటున్నాను - కీర్త 119, 78.
 2. నేను పడకమీద పండుకొని నిన్ను స్మరించుకొంటూంటాను - 63, 6.
 3. ప్రభువు కట్టడలను రేయింబవళు మననంబేసికొంటూ ఆనందించే నరుడు ధన్యుడు అతడు ఏటియొడ్డున పెరిగే చెట్టులాంటివాడు అది సకాలంలో పండ్లనిస్తుంది దాని యాకులు వాడిపోవు ఆలాగే అతడుకూడ సఫలుడౌతాడు 1, 2-3
 4. మరియు ఆ సంగతులన్నీ హృదయంలో పదిలపరచుకొని మననం జేసికొంటూండేది - లూకా 2, 29-251.

(5) భక్తుడు ప్రభువాక్యాన్ని పాటించాలి

1. ఒకడు పొలంలో విత్తనాలు వెదజల్లాడు. కొన్ని విత్తనాలు త్రోవలో పడగా పక్షులు వాటిని ఏరుకొని తినేసాయి. కొన్ని విత్తనాలు రాతినేలపైబడి మొలిచాయి. కాని అవి వేరు పాతుకోలేనందున ఎండవేడి తగిలి మాడిపోయాయి. కొన్ని విత్తనాలు ముండ్లపొదల్లోబడి మొలిచాయిగాని ముండ్లుకాస్త వాటిని అణచివేసాయి. కొన్ని మాత్రమే సారవంతమైన నేలలోపడి ముప్ఫైయంతలూ అరవైయంతలూనూరంతలూ ఫలించాయి. మన హృదయం ఈ చివరన పేర్కొన్న సారవంతమైన నేలలా ఉండాలి. అప్పడే దైవ వాక్యం మన జీవితలో ఫలితమిచ్చేది - మత్త 12,4-8.

2.ఓ అతని రాతిపునాదిమీద యిల్లకట్టాడు. గాలి వీచి వాన కురిసి వరదలు వచ్చాయి.అయినా ఆ యింటి పునాది కదలలేదు. ఇల్లు సురక్షితంగానే ఉండిపోయింది. ప్రభు వాక్కు విని దాన్ని పాటించేవాడు ఈ బుద్ధిమంతుని లాంటివాడు. మరో అతని యిసుక పునాదిమీద ఇల్లు గట్టాడు. గాలివీచి వానకురిసి వరదలు వచ్చాయి. ఆ యింటి పునాదికాస్త కొట్టుకొనిపోగా యిల్లుకూడ కూలిపోయింది. ప్రభువాక్కును విని దాన్ని పాటించనివాడు ఈ మందమతిలాంటివాడు. - మత్త 7, 24-27.

3.ఓ అతని అద్దంలోకి చూచుకొని తన ముఖం అశుభ్రంగా ఉందని తెలుసుకొన్నాడు. వెళ్లి ముఖం కడుగుకొందామని పదడుగులు వేసాడు. కాని అంతలోనే తాను అద్దంలోకి చూచుకొన్న సంగతి ముఖం కడుగుకొందామనుకొన్న సంగతీపూర్తిగా మరచిపోయాడు. ఆ యేబ్రాసి మొగంతో అలాగే తిరుగుతున్నాడు. అదేవిధంగా మనం కూడ ప్రభు గ్రంథమనే అద్దంలోనికి చూచుకొన్నపుడు మన హృదయం ఎంత వికృతంగా ఉందో తెలిసిపోతుంది. ఆ గ్రంథంలోనికి చూచుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. కనుక కేవలం వాక్యం విని మరచిపోతే లాభంలేదు. దాన్ని ఆచరణలో పెట్టగలిగి ఉండాలి - యాకో 1, 22-25.

4.ప్రభువాక్కుని పాటించేవాళ్లని అతడు తన సొంత తల్లిలాగ, సొంత సోదరుల్లాగ భావిస్తాడు. అనగా వాళ్ల క్రీస్తుకి ఆత్మబంధువులూ ప్రీతిపాత్రులూ ఔతారని భావం - లూకా 8, 19, 21.

(6) వాక్యపఠనంవలన కలిగే ఫలితాలు

1. నరుడు ఆహారంతో మాత్రమే జీవించడు. ప్రభువు నోటినుండి వెలువడే ప్రతిమాటద్వారాగూడ జీవిస్తాడు - ద్వితీ 8,3. యథార్థంగా భూమిమీద పైరుపంటలు నరులను పోషింపలేవు. ప్రభుని నమ్మిన జనాన్ని పోషించేది అతని నోటిమాటలే

- సొలోమోను16,26.

2.ప్రభువు నోటినుండి వెలువడేమాటలు నిత్య జీవమిస్తాయి - యోహా 6, 68. 3.ప్రభువు ధర్మగ్రంథాన్ని అనాదరంజేసేవాళ్లు మృత్యువు వాతబడతారు - කාර්යංතිය 4,1. 4 ప్రభువు ఆజ్ఞలను పాటించేవాళ్లు అతని దీవెనలు పొందుతారు. పాటించని వాళ్లు శాపానికి గురౌతారు - ద్వితీ 30, 16-18.

5. పరిశుద్ధ గ్రంథం దైవప్రేరణంవల్ల పుట్టింది. అది సత్యాన్ని బోధిస్తుంది. దోషాన్ని ఖండిస్తుంది. తప్పలను సరిదిద్దుతుంది. సత్ర్పవర్తన నేర్పుతుంది. సత్కార్యాలు చేయిస్తుంది –2 తిమో 3, 16-17.

6. పరిశుద్ధ గ్రంథములోని సంగతులన్నీ మనకు ప్రబోధం కలిగించడానికే వ్రాయబడ్డాయి - రోమా 15,4.

7. జ్ఞానస్నానంద్వారాలాగే వాక్కుద్వారా గూడ మనకు క్రొత్తపట్టువు కలుగుతుంది -1 పేత్రు 1, 23.

8. వాక్కుద్వారా పాపపరిహారం కలిగి హృదయం శుద్ధిచెందుతుంది - యోహా 15, 3. అందుకే కీర్తనకారుడు గూడ "ప్రభో! నీ సమక్షంలో పాపంచేయకుండా ఉండేందుకై నీ వాక్యాన్ని నా హృదయంలో నిల్పుకొన్నాను" అన్నాడు -119, 11.

9. ప్రభువు వాక్కు సజీవమైంది. క్రియాత్మకమైంది. రెండంచుల కత్తికంటె పదునైంది. అంతరంగందాకా కోసుకొని పోతుంది. అది మన హృదయాల్లోని కోర్కెలనూ ఆలోచనలనూ పరిశీలించి చూస్తుంది - హెబ్రే 4,12.

10. నరుడు క్షణమాత్రజీవి. అతడు పొలంలోని గడ్డిలా యెండిపోతాడు. పూవులా వాడిపోతాడు. కాని దేవుని వాక్కు శాశ్వతంగా వుండిపోతుంది - యెష 40, 6-8

(7) మనకు వాక్యాన్ని బోధించేది పరిశుద్ధాత్మే

1. పవిత్రాత్మవచ్చాక మీకు సమస్త విషయాలు బోధిస్తుంది. నేను చెప్పిన సంగతులన్ని మీకు తలపునకు తెస్తుంది - యోహా 14, 26. ఆ యాత్మ మిమ్మ సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆయన తనంతటతాను ఏమీ బోధించక తాను నావలన వినిన సంగతులనే మీకు బోధిస్తాడు - 16, 13.

2. ప్రవచనం అనేది కేవలం మానవ సంకల్పం వలన పుట్టలేదు. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని విన్పించారు. ఈనాడు మనం బైబులు అర్థంచేసికొనేలా చేసేది కూడ ఆయాత్మే - 2 పేత్రు 1,21.

3. క్రీస్తు ఆత్మ మీయందు ఉన్నంతకాలమూ మీకు మరో బోధకునితో అవసరంలేదు. ఆయాత్మే మీకు అన్ని విషయాలు బోధిస్తుంది -1 యోహా 2, 27

4. బిడ్డలందరు ప్రభువువలన ఉపదేశం పొందుతారు. - యెష54, 31.