బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/పీఠిక
పీఠిక
శ్లో|| క్వసూర్య: ప్రభవో వంశ క్వచాల్పవిషయామతి |
తతీర్షుగున్‌స్తరం మోహాదుడు పేనాస్మిసాగరం ||
మందరం కవియశం ప్రార్ధిగమిష్యామ్యపహాస్యతాం |
ప్రాంశు లభ్యే ఫలే లోభా మద్బాహురివవామన: ||
కాళిదాసు, రఘు 1 - 3-4
లోకము కర్మసూత్రగ్రధితము కర్మము ద్వివిధము : స్తోకమని, అస్తోక మని. మనుజుడు కర్మిష్ఠి. కర్మ లేని భోగం బపోహంబు. అసందర్భంబు లసంభవములు. వర్తమాన దు:ఖంబులు భూతకాల స్వకర్మోపార్జితంబులు, స్వస్తోకకర్మోద్భవంబులు - ఇవి యసాధువులు, రిక్తములు, దేశాభివృద్ధి నిరోధకములు. ఆ హేతువం జేసి త్యాజ్యంబులు స్తోకకర్మిష్ఠులు కనిష్ఠులు.
వర్తమానమెటుల భూతకాలభవమో, అటులనె, భవిష్యత్కాలము వర్త మానోద్భవము. భవిష్యత్కాలభోగంబులకు వర్తమానకర్మ లుపాదానంబులు. ఆ కారణముం జేసి, అస్తోకకర్మ లనుష్ఠేయంబులు.అస్తోకకర్మిష్ఠులు. గర్విష్ఠులు. స్వాస్తోకకర్మ లతి రేకములు. అతిపధమునకు గర్విష్ఠు లధ్వగులు. వారి నిదర్శనము లనన్యాదృశంబులు; వారి యనుభవములు మనుజుల కనుబోధము; వారిరాకలు మేలురాకలు, వారి సంభాషణలు మోహాంధకారవిదళన చంద్రికలు. వారి సఖ్యము శ్రేయోదాయకము, వారి యుపదేశము శ్రోతవ్యము. వారి సంపర్కము షడ్గుణైశ్వర్య సంధానకరణి. వారు నిర్మలులు, నిష్కళంకులు, నిరాశ్రయులు, నిత్యతృప్తులు, నిరాభాసులు. వారు లక్ష్యైకాగ్రచిత్తులు, సిద్ధసంకల్పులు, మృతజీవులు. వారి యాచరణవిధానము నుపలక్షించి, తద్విధమున దేశ కాలానుగుణ్యముగ గమనించుట మనుజులకు కర్తవ్యంబు.
ఆంధ్రభాషయందు పుశ్చాత్యమహాపురుష జీవితచరిత్రంబులు లోపంబులు. తల్లోపపూరితార్థం బీ మదీయపధమ్రోద్యమంబు. ఈ గ్రంధము స్వకల్పనశక్తిశూన్యంబు, సరసవచన విరహితంబు. ఈ చరిత్రములు "బుధులకు నవనిధుల దాపురంబును విపులజయలక్ష్మికి గాపురంబును" గనుక, మదీయ లోపంబులు సహ్యంబులగుగాక.
ఇంతియకాదు ఆంధ్రదేశముననుండు "సకలకళావిభూషితులు శబ్దవిదు ల్న యతత్త్వబోధకుల్ప్రకటకవీంద్రు" లందఱు తమ తమ శక్త్యానుసార మాంధ్ర మాతను "ప్రీతిపూర్వకంబుగా జతుర్విధ శుశ్రూషలు గావించుచు సేవించుచు బూజించుచు భావించుచు నమస్కరించుచు నారాధించు"చున్న సమయంబున,షోడశోపచారపూజావిధానంబు గుర్తెఱుంగని నే నామెనారాధించుటకు సమకట్టి, 'పత్రపుష్పం ఫలం తోయం యోమె భక్త్యా ప్రయచ్ఛితి' అనునటుల నామెప్రెసన్నవదనయై సంభావించు నని నాభావము. క్లిష్టపండితజనంబుల కామె సం స్తవనం బసంగతంబు. కాలిదాస విరచితంబగు నీ స్తవము నిందు, బొందుపఱచుచున్నాడను:-
కళ్యాణి - ఖండజాతి - లఘువు
పల్లవి - నమోభక్తసురతరు లతే దేవి లలితే,
(1) త్రిపురసుందరి కృపాపాంగ లలితే
చంద్రచూడ: ప్రియే చంద్రతిల కాలికే చంద్రముఖ చంద్రి
కామందహాసే | కుంద సుందర గదన బంధు జీవాధరే కోటి
విద్యుల్లతా బృందభాసే ||
నమో భక్త ---------||
(2) దరదలిత కమలముకులోచ్చలిత మదకలిత విల పదలి లలిత
లోచన విలాసే | అధరరాగారుణోదయ విధ్బత దైత్యగురు రుచి
రుచిర మౌక్తికోల్లసితనాసే ||
నమో భక్త-----------||
(3) హంసగమనే సకల నిగమ వనశారికే హంసముని హంసమా
నస మరాళే |కంసరిపు సోదరీ కామితార్థప్రప్రదేత్వాంశరణ్యం
కాళిదాస వరదే||
నమో భక్త -------||
- ఇట్లు
- విధేయుడు
- గ్రంథకర్త.
గంజాం జిల్లా.
శ్రీకాకుళం
22-5-1913