బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము


మహాపురుషులు - వారి జీవితచరిత్రములు

సృష్టియనాది అందులోని జంతువు లనంతములు అండజ. పిండజ, ఉద్భిజ, శ్వేదజములని వానిలో దరగతులు గలవు, వీనిని జేతనము లని యెదరు తరుశైలపాషాణము లచేతనములు ఈ నేలినాచేతనములలో మనుజుడు రాజు నిద్రాహారసంగమము లన్ని జంతువులకు సమానవై నను, వీని నన్నిటికంటె యెక్కుడగు బుద్ధికలవారు మనుజులు.

మొదట మనుజులు దిగంబరులై, నిలుచుటకు నీడ, తినుటకుగూడును లేక. పశుప్రాయులవలె సంచరించుచుండిరి. ప్రకృతిలో 'పరిణామము' (Evolution) ననుసరించి, పిపీలికాది జంతువు లారోహణముగ, గ్రమముగ వానరరూపమెత్త యా వానరముఖమే, సీత, దమయంతి, తారా మొదలగు స్త్రీలయొక్క పూర్ణ చంద్రముఖముగ మారుటకును, ఆ వానరుని బుద్ధియే, కాళీదాసు, భోజుడు, చాణక్యుడు, శంకరుడు మొదలగు మహాపురుషుల కుశాగ్రబుద్ధిగ మార్పునొందుటకు నెంతకాలము పట్టియుండునో మనము చెప్పలేము. అటులనె, మనమిప్పుడు నాగరికులమని విఱ్ఱవీగుచు బ్రగల్బములు బలుకు నీస్థితికివచ్చుట కెంతకాలము బట్టియుండును?

జుట్టులను బెంచి, తీరుగ వానిని దిద్దుటయా, ద్రాక్షారసము నాస్వాదించుటయా, వీనిలో నేది నాగరికము? ఆ పదమున కర్థ మేమి? పండితపామరులు దానిని వాడుక చెయుదురె? అది నిర్గుణమా, సగుణమా? "ఏమి చెప్పుదును గురునాధా" అట్టిట్టిదనరానిదై, మహాచోద్యపై, వింతయైనది, నాణెమైనది నాగరికము. అన్నిటియొక్క సముదాయమె యది సముదాయము విడిన, నది లేదు, సముదాయము నిలబడిన, నది యున్నది.

పుట్టినది మొదలు గిట్టువఱకు, దే జాతిభేదములు లేక, ప్రతి మనుజునకు ముఖ్యముగ కావలసిన వస్తువులేవి, నిలుచుటకు నీడ, తినుటకు తిండి, కట్టుటకు బట్ట. ఇవి సమకూడిన మనుజుడు కొంత తృప్తిగ నుండును. మొదట చెట్లక్రిందలలో బ్రతుకుచున్నవారికి, గుడిసెలు, గృహములు, భవనములు, ప్రాసాదములు గాలక్రమమున గట్టినపురుషు లెట్టివారై యుందురు? ఆకు, అలము, దుంపలు, పచనము చేయని మాంసమును దిని బ్రతుకుచున్న వారికి, నేలదున్నుకొని, పంటలను పండించి, వానిని పచనముచేయువిధము నేర్పిన పురుషులొకరో, యిరువురో, మువ్వురో, యెందరో మనకు దెలియదు. వీర లెవరు? దిగంబరులై, కొంతకాలమాకులను, తదుపరి నారలను, మంతోళ్లనుగట్టు, కొనుచున్న వారికి, ట్విడు, మస్లిను, బెనారసు బట్టలను నేయుట నేర్పినవారెట్టివారో, నేర్పినవారో, నిప్పును గని పెట్టినవాడు, దానిని రగిలించు సాధనములను గనుగొనినవాడు. ఈ పురుషులందరు మహాపురుషులు గారా?

ఎందరి మహాపురుషుల యనుధవములను, వారి నామములు దెలియకయే, మన మనుభవించుచున్నాము. వానిని పని యనుధవములని యెంచుటకంటె బుద్ధిహీనత కలదా? ఆ మహాపురుషుల నామములను స్మరించకపోవుటకంటె, హెచ్చు కృతఘ్నత కలదా?

గుండుసూది, దారము, పెన్సలు, కాగితములు మొదలగు వస్తువులలో నేదిలేకపోయినను మనుజునకు వ్యవహారము జరుగదు. ఇవి దిగువయంతస్థులోనివి. షట్చాస్త్రములు, షద్దర్శనములు, ప్రకృతిశాస్త్రములు, ఈ మొదలగు వానిని రచించినవారు, వాని నభివృద్ధినొందించిన వార లెందరో మనకు దెలి యదు. వీనిని నేర్చుకొనుటకు మనుజుని జీవితకాలము చాలదు ఆ మాటకేమి. ఈ రెండంతస్థులలోనివాని సభిన్న సముదాయఫలమును పండితపామరులు, సామంతసంసారులు, పెద్ద పిన్న వారలు, నగర గ్రామవాసులు వీరిలో నెవడు ప్రతిదినము బొందకయుండును.

ఇవియన్నియు సమకూడి, సముదాయ మగుసరికి యెంతకాలముపట్టెనోగదా' వీని సముదాయమె సంఘము కొంతకాలమునకు సాంఘిక సూత్రము లల్లబడి, వర్ణాశ్రమ ధర్మములు విభజింపబడెను. సాంఘికుల మైనంతవఱకు, మనము వీని శుభాశుభ ఫలముల ననుభవింతుము. సంఘమునకు శుభఫలము నిచ్చువారు మహాపురుషులు, అశుభఫలము నిచ్చువారు నీచులు. అనేక సంఘములు గలిసిన, దేశవాసులగుదురు, వీరినే మహాదేశీయులని పిలిచెదరు. శరీరమునం దెక్కడ వ్రేటుతగిలినను, దానికి బాధకలిగినవిధమున, మనము చేసిన యశుభకార్యఫలములను మన సంఘమువారే కాదు, మన దేశీయులు సహిత మనుభవింతురు. యుక్తాహారవిహారముల చేత బోషింపబడినందున, రక్తముధారాళముగ నాళములయందు బ్రవహించి, కర్మేంద్రియములకు ---, జ్ఞానేంద్రియములకు సైర్మల్యము గలుగ జేసినపుడు, శరీరము సుఖమనుభవించునటుల, సంఘములో బ్రతిమనుజుడు భిన్నముగజేయు శుభకర్మము లతనికిమాత్రమె గాక సంఘమునకును దేశమునకును అంతటికిని శుభంబు లొసంగును.

ఈ శుభాశుభ కార్యములు సజ్జన దుర్జనులచేత జేయబడి, సంఘములను దేశములను ఉద్ధరించుటయో యధోగతిపాలు చేయుటయో జరుగును. ఈ గతుల ప్రదర్శనమే దేశచరిత్రనాంబడు దేశములోనివారె సజ్జనులు, దుర్జనులు. భిన్నముపైని 'పురుషుల జీవిత చరిత్రము' లని, సముదాయము పైని 'దేశచరిత్ర' యని, మన మొకదానినె ద్వివిధముగ జూచుచుందుము. శరీరము నాశ్రయించుకొని మూడు ధాతువులు, పంచప్రాణములు లున్నవి. వీనిలో బ్రాణవాయువు, పైత్యము ముఖ్యమైనవి. భేషించిన వాని విని యుద్రేకించనీయవు, అటుల నె, లోకములో సజ్జనులు, వారు దుర్జనుల నణగగొట్టుదురు. --- డెటుల సజ్జనుండయ్యెనో, యెటుల తన జీవిత కాలములోసాధువుల రక్షించెనో'దుర్జనుల శిక్షించెనో, యెవరితో మైత్రి జేసెనో, యెవరితో వైరము బాటించెనో, బాల్య యౌవన కౌమార వార్ధకదశల నెటుల గడిపెనో, బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ధర్మముల నెటుల ప్రవర్తింప జేసెనో, దేనియందు ఈయంశములు సవిస్తరముగ వ్రాయబడి యుండునో అదియే 'మహాపురుషుని జీవితచరిత్రము', ఈ మహాపురుషుల సంక్షిప్తచరిత్రయే 'దేశచరిత్ర'.

వారి, చెయంబడిన కార్యములయొక్క ఫలముల ననుభవించుటచేత, మనకింత యౌన్నత్యము, నాణెము వచ్చినపుడు, వారివలె మనముగూడ మహత్కార్యములను యధాశక్తిజేయ సమకట్టినయెడల, మన మెటువంటివారమగుదుము, వానిని నెర వేర్చినయెడల, వారి కార్యములకు దేశకాలపరిమితి లేదు, మన కార్యములకు గలదు. 'ఆత్మవత్సర్వభూతాని' అను న్యాయము వారియందుబ్రవర్తించెను.

సూర్యచంద్రు లుదయించుచున్నారు, అస్తమించుచున్నారు. అటులనె గ్రహములు, నక్షత్రములు, పరిపాటియగుట త, నివిమన దృష్టిని యరికట్టుట లేదు. 'హాలీ' తోకచుక్క, తుపానులు మొదలగు ప్రకృత విపరీతములు మనసృష్టి నాకర్షించుచున్నవి. అవి శాశ్వతమైనవి; ఇవి క్షణభంగురములు అటులనె మహాపురుషులు, వారి కార్యములు, దుర్జనులు, వారి కృత్యములు.

వారి కాలములో వారు మహత్తుగలవారని పరు లెరుగరైరి. సామాన్యులవలె వారుగూడ సుఖదుఖము లనుభవించిరి. సూర్యకాంతి మొదటనధిత్యకలమీద బ్రసరించి, క్రమముగ నుపత్యక భూములకు దిగునటుల, వారిప్రభా వము మొదట -----ములకు గ్రాహ్యమై, తదనంతరము మనకు ---- వారిని జూచు భాగ్యములేదు, వారి చర్యలను వినుటకు నోము నోచుకొనలేదు. వారి నెఱిగినవారినైన గన్నులారజూచుటకు దగినంతపుణ్యమైననుజేయలేదు; అట్టి మహాపురుషులు ప్రపంచములో నొక కాలమున జీవించియుండిరను జ్ఞానమైనను మనకు లేదు.

ఇటులకూపస్థమండూకమువలె, బుట్టుచుగిట్టుచు, చిర్వితచర్వణులై, విషయములకులోబడి కాలమును గుర్తెఱుగక, పశువులవలెప్రజలు సంచరించుచున్నారు. ఈ యజ్ఞానమును బోగొట్టుకొనుటకు, వారు గురువుల నాశ్రయించవలెను. దానిని బోగొట్టినవి గురూపదేశములు కావా? స్వయముగ వారి వలన వినుటకు దగినంత యదృష్టములేదు. ఆయుపదేశములే, లిఖితరూపమును బొంది, జీవితచరిత్రములయినవి.

           "యదా యదాహి ధర్మస్యగ్లావిర్భవతి భారత |
           అభ్యుత్ధాన మధర్మస్య తదాత్మాము సృజామ్యహం
           పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం |
           ధర్మసంస్థాపనార్ధాయ సం వామి యుగే యుగే ||"

ఏ యే కాలములో బ్రజలు ధర్మమార్గము విడనాడి, యధర్మమార్గము బొందుదురో, యా యా కాలములలో బురుషోత్తముండు తన నిజవిభూతిని దెలుపుటకు బ్రపంచములో దనకుళ చేత మహాపురుషుల నుద్భవింపజేసి, వారిచేత లోకముల నుద్ధరింపజేయును. వారినే మనము క్రైస్తువని, మహమ్మదని, గౌతమబుద్ధుడని, శంకరుడని, ఆనందతీర్థులని, రామానుజులని, కన్ఫూశియనని, లూథరని మొదలగు నామములతో స్మరించుచున్నాము. వారిలో నెంత మహాత్మ్యముండక పోయిన, ననేకకోటి ప్రజలు వారిని ప్రతిదినము స్మరించుటయే గాక, వారిసిద్ధాంతములను బరించి, వారి ధర్మముల నాచరించుచున్నారు. సాధుజనరక్షణ, దుష్టజనదండన వీనికై బరమేశ్వరుం డనంతకోటి జన్మముల నెత్తి భూభారముదగ్గించెను. పురాణములలో జెప్పిన యవతారములే గాక, మఱియెన్ని యవతారము లాయన యెత్తెనో మనము చెప్పలేము, లోక కంటకులను సంహరించకపోయినయెడల, లోకములకు స్వాస్ధ్యముండునా? కనుక, మహావీరులందఱు భగవంతుని కళలని తెలియనగును. థాతువు లుద్రేకించి, శరీరమును గష్ట పెట్టుచున్నప్పుడు, స్కంధత్రయము దెలిసిన వైద్యుడు వానిని శాంతింప జేయువిధమున, సంగపంచకము గుర్తెఱిగిన మహావీరులు చతురంగముల నడిపించి, దేశములకు మేలుగలుగంజేయుదురు.

దేహము స్వస్థతగ నుండినపుడు, హృదయకమల మెటుల నాళములలోనికి బరిశుద్ధరక్తమును బంపునో, యటులనె, దేహములు చల్లబడి యర్థప్రాణములకు నెమ్మదిగలిగినపుడు, శాస్త్రజ్ఞులు, వేదాంతులు, పండితులు మొదలగు ప్రాజ్ఞులు బయలువెడలి, వారి వారి యుపన్యాసములచేత, బోధనలచేత, ప్రత్యక్ష నడవడికలచేత బ్రజల యజ్ఞానమును బోగొట్టుదురు. వైతాళికులవలె, వీరు మనుజులను మోహనిద్రనుండి మేలుకొలుపుదురు. అనేక జన్మములలనుండి వచ్చుచున్న యజ్ఞానము మనస్సునుబట్టి యాక్రమించి యున్నందున, వీరి ప్రబోధనములచె, వారికి ప్రబోధోదయమగుట కష్టము. అందు చేత, మనము నిరాశజేసికొని, దిగులొందవచ్చునా? పఠనము, వ్యాసంగము, మననము, ఆచరణవిధానములయం దానిని మేలుకొలుపవలెను. దౌవారికుడైన మనస్సు జాగరూకతతో నుండకపోయిన, బుద్ధి చెడును. బుద్ధినాశాత్ర్పణ్యుతి, బుద్ధి చెడుట మనుజుడు చెడుట ఈ రెండు నొకటే. మనస్సును మేలుకొలిపి, బుద్ధిని వికసింపజేయ వారె, కాళిదాసులు, షెక్స్పియరు, ప్లేటో, సోక్రటీసు, గాథె మొదలగువారు. సూర్యుడొక్క బాహ్యలోకమునకే వెలుగు నిచ్చునుగాని, వీరంతర్భహిర్లోకములం బ్రకాశింపజేయుదురు.

వర్తమానకాలము నధిష్ఠించి, భూతకాలావళిగండ జూచిన, మనకు సమీపముననున్నవి. దృశ్యములై, దూరముననున్నవి యదృశ్యము లగుచున్నది. అనంతమగుకాలమున నెందఱు మహాపురుషులు జననమై, భూభారమును వహించిరి? దేశచరిత్రలలో జెప్పబడినవారుకాక, మఱి యెందరు మినహాయించంబడిరో గదా' వారిప్పుడు లేరా' ముందుకుండరా' వా రన్ని కాలములలోను గలరు భూమి నిలబడియుంటయె, వారు కలరనుటకు నిదర్శనము వారు కనుపులవంటివారు; ఈ కనుపులను బట్టుకొనియే, మనము కాలారోహణము జేయుచున్నాము.


                        "నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
                         ఏషతూద్దేశత: ప్రాక్తో విభూతేర్విస్తరోమయా ||"
                        "యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా |
                         తత్తదేవాగచ్ఛత్వం మమ తేజోం శ సంభవం ||"