బాల నీతి/సత్యము
తే.గీ."విద్యయొసగును వినయంబు♦వినయమునను
బడయు బాత్రత పాత్రత♦వలన ధనము
ధనమువలనను ధర్మంబు♦దానివలన
నైహికాముష్మికసుఖంబు♦లందు నరుడు."
సత్యము.
సత్యమనగా నితరులచే జెప్పబడినదికాని వినినది కాని తానుజూచినదికాని యున్నదానిని నుడువుటయే.
ఇటుల జెప్పబడినవిషయమందును, వినినవిషయ మందును, గనినవిషయమందును, బుదిపూర్వక ముగా దాఱుమాఱుగా లేనిపోనివి కల్పించి చెప్పుట యసత్యమనబడు.
ఈయసత్యము బలుకువా రవినీతులు, వీరు చెప్పువాక్యముల నెవరును విశ్వసించరు విశ్వసింపక పోవుటవలన దమకాశ్యకములైన పనులన్నియు జెడిపొవును. చెడినతోడనె యలజడుల గుందుచు దరిగానక యుండుదురు. దీంచ్వలనగ్రమముగా మనోవ్యాధి జనింపగలదు. ఈమనోరోగమువలన మృతిజెందిన జెందవచ్చు. ఈయసత్యమాడువారు ఘోరనరక వాసులై యుందురు., "అసత్యమాడుట బ్రహ్మహత్యతో సమాన" మని పండితప్రకాండులు నుదివిరి. తన్నునెవరైన నొకధర్మవిషయమును గురించి నడిగినయెడల గతి తనకు తెలిసియు నూరకుండువాడసత్యదోషము నందర్దభాగఫలము బొందగలడు. వీడును గౌరవార్హుడు కాడు. అసత్యమనిత్యముకాన మనమెట్టిసమయము నం దసత్యమాడ కూడదుసరిగదా మనము వీక్షించుచుండగా బరులు కల్లలాడుచుండినయెడల నాపాడుబాటనుంది వారిని దప్పించుటకు యత్నించుచుండవలెను. ఒక్కొక్కసారి యసత్య వాదిత్వ వలన లాభముబొందిననుదుదకది యశ్రేయస్సునకాకరంబగు. "అది తప్పరాదు, పలికి బొంకరాదు." సత్యమాడినందువలన లాభమువచ్చి నను నష్టమువచ్చినను సంతోషించుటయె సత్తముని లక్షణము. కాననసత్యమాడుట యేరికైనను నెప్పుడైనను మంచిదికాదు.
సుదనుడొకడు ధర్మసందేహముకలిగి దానినిదీర్చు కొనుటకై పండితమండితంబగుసభకువచ్చి తనమది నున్నసందేహము దీర్పుడని యాకొవిదుల నడిగెను. అంతట వానిపశ్చితుడాతడడిగినదాని కుత్తరమొసగ బూనియు లాభముకలుగుననికాని, పిసినితనము వలనగాని, పక్షపాతముచేగాని ధర్మవిరుద్ధముగా బలికినయెడల వారనృతదోషఫలముబొందుదురు. కాన నున్నసంగతి చెప్పితీరవలయును. ఇదియే సమంజసము.
సత్యమునకుసాటియైన ధర్మము వేఱొకటిమంచి దేశానంబడదు. సత్యమాడుచుంటిన మనమున భీతియుండదు. రమణీయముగనుండును. వివేకులు సంతోషించక యుండరు. కాశిమొదలగు పుణ్యతీర్దముల సేవించిన నెంతఫలముకలదో యంతఫలముకలదు. నాలుగువేదములను, వనియంగములను బఠించిననెంతపుణ్యముకలదో యంతపుణ్యముకలదు. సత్యసంధత వలన గోపము, కామము, లోభము, మదము, మాత్సర్యమను నీయరిషడ్వర్గము నడగుచుండును. ఓర్పు, వినయము, శమము, మొదలగుసుగుణములు చేకూడుచుండును.
ఇదిగాక మన యార్యు లీసత్యమునునొకతపస్సుగా గణనజేసిరి. ఈతపమునాచరించినవారి కిహలోకమున సమస్తైశ్వర్యములు కలుగుననియు బరమున స్వర్లోకమున నివాసము కాగలదనియు వచించిరి. "సత్యమేవజయతి, నానృతం" అనగా "సత్యమే జయించు న్నది, అనృతముజయించుటలే" దని యుపనిషత్తులు పలుకుచున్నవి. ఒకపరి మనమన ములకు సత్యమాడుటవలనలాభములేక నష్టమున్న టుల దోచినను దుదకదిశ్రేయస్సునకు మూలకంబుగా బరిణమించును. నిత్యమగుసత్యమును బలుకువారు మృతజీవులు కాగలరు.
అటులమృతజీవులై వాసిగన్నవారిలో నొకనిజెప్పెద-
మున్నాహరిచంద్రమహారాజు సత్యమాడుయందు నిరుపమానుడని భూతలమున వాసిగాంచియుండెను అంత నింద్రలోకమున, మునులు సింహాసనాసీనులై యుండ నాయింద్రునిచే, భూతలమున నెల్లపుడు సత్యమాడు వారెవరని ప్రశ్నవచ్చెను. దానికి ససిష్టుడను నొకముని హరిశ్చంద్రుడని యుత్తర మొసగెను. అంతట విశ్వామిత్రుడు క్రోధోల్లసితమూ ర్తియై యతడు కాడని దృఢముగా జెప్పెను. అంతట నామునులిద్దఱికి గలహముక్రమముగాబెరిగెను. అంత నిద్దఱు కొన్నిపంతముల నేర్పఱచుకొనిరి. విశ్వామిత్రుడు తన పంతము గెలువవలయునని యనే కోపాయములాలోచించి యింద్రునివీడ్కొని హరిశ్చంద్ర మహారాజుదరికివచ్చి "నేయజ్ఞముచేయదలచిగాన నీవు నాకేనుగుపై నెక్కి గవ్వబైకెగరవేసిననెంత యెత్తుండునో యంతయున్నతముగల ధనరాశి నిప్పింపవలయు" ననికోరెను. దానికారాజంగీకరించి ధనము నిచ్చివేసెను. అంతనాగాధేయుడు తిరిగి యారాజుసమీపముననే యాయర్దమునుంచెను. అంత నారాజీవిశ్వామిత్రుని సంభావించి పంపించెను. తరువాత నీముని తన యాశ్రమమున కరిగి దుష్టమృగ ములను సృజించి యారాజును దనసమీపమునకు రప్పించుకొనెను. మాతంగకన్యల నుసృష్టించి యధర్మంబునకు బాల్పడి మమ్ము వివాహమాడుమని కోరుండనిచెప్పియారాజు సమీప మునకు వారిని బంపీంచెను. వారామునివచించినటు లనే యారాజును వివాహమాడగోరిరి. అంత నారాజ ధర్మంబని తఱిమివేసెను. ఆసంగతి నీముని విని, కునిసి, యదలించి, మాయోపాయమున నాతనిచే రాజ్యము దానముగాగైకొని యారాజుని సకుటుంబ ముగా గాననమునకంపెను. మఱియు దానిదివఱకు దాచుకొనియున్న ధనమును దీసికొనివచ్చుటకై వారి వెంట "నక్షత్రకుడను తనశిష్యుం బంపెను. ఆనక్షత్రకు డనేకధంగులవారిని గష్టపెట్టెను. దాని కీర్తా 33
బా ల నీ తి.
బా ల నీ తి.
తనిని గ్రమ్మఱ సార్చభౌమునిజేసి చక్కగా నాశీర్వదించి చనెను.
పరికింతురా? ఎన్నికష్టములననుభవించినను సత్యము మాత్రము విడనాడకపోవుటవలనగదా యాగాధేయుని తపము సందర్దభాగఫలము బొందగలి గెను. బ్రహ్మాదుల వనిముల నాసత్యముచేతనేకదా యారాజు పొందినది. అదిగాక యామహారాజు 'సత్యహరిశ్చంద్రు" డని యిప్పటికిని బ్రసిద్ధిజెంది యున్నాడు. "సంత్యవద సత్యాన్నిప్రమదిత వ్యం" అనగా "సత్యముచెప్పుము, సత్యమునుమఱు వకు" మని ప్రాబలుకులు పలుకుచున్నవి.తనయజమానుని కనిష్టమైనను, సత్యమునే చెప్పవలయునుగాని యిష్టమగుననియెంచి యసత్యముజెప్పగూడదు. సాధుస్త్రీల యందును, బీదవారల వివాహముల యందును, మొదలగుసమయములందసత్యమాడి నను దోషములే"దని కొందఱు పెద్దలు వక్కాణించిరి. ఈ యాధారమువలన జీటికి మాటికి నసత్యమాడుట శ్రేయోదాయకమని తలచెదరేమో? అటుల దలచుట తప్పని ముమ్మాటిని నమ్ముడు. ఈసత్యమువలన సమస్తధర్మములు కరతలాకములుగా నుండగలవు. కాన మనమందఱము సర్వజన సన్నుతమగు సత్యమును బల్కుచుందము. ఆపదలకాకరంబగు నసత్యమును విడనాడుదము.
క.నడవడియను మున్నీటిం
గడపం బెట్టంగనోడ♦కరణిం దగితా
35
బా ల నీ తి.
నొడగూడననిన సత్యము
గడచినగుణమింకనొండు♦గలదే? యరయన్ ॥
భారతము
శాంతము.
శాంతమున నోర్పుగానుండుట.
శాంతమనునది సర్వొత్తమమైనది. శాంతముదా ల్చిన వాడు క్రతు సహస్రంబుల నొనరించినవానికంటె నధికుడనిచెప్పదగు. ఇతరులు తనపయి నలిగినను మగుడ నలుగకయు దిట్టులదిట్టినవి విని వినని యటులనటించి యెదురుమాటలాడుటయు, బదిధవక రములగు బనులు దాబొందిన నవిడెందమందు విచారింపకయు నుండువాడు శాంతుడనబరగు. మనము మనమనముల శమమువిడనాడిన విపత్తుల బొందగలము. నీతిధర్మరహితములగు రాజ్యంబును, నిర్లక్ష్యంబగు సంపదయు, శమములేని తపసియొక్క తపమును, భిన్నమైన కుండయుందుదకమిడుటయే యగును. ఓర్పులేక పనులనారంభించినయెడల నవి నిర్మూలములగును. అదిగాక హానియుగూడ సంప్రాప్తించును. మనుజుడు శాంతమువీడిన కొలది కోపమధికమగును. కోపముహెచ్చగుచున్నకొలది వానికి వాక్శూరత్వ మెక్కువయగుచుండును. క్రియా శూరత్వము తగ్గుచుండును. అల్పమలగు కుక్కల్ త్రోవనుబోవు నే