బాల నీతి/శాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

35

బా ల నీ తి.

నొడగూడననిన సత్యము
గడచినగుణమింకనొండు♦గలదే? యరయన్ ॥

భారతము


శాంతము.


శాంతమున నోర్పుగానుండుట.

శాంతమనునది సర్వొత్తమమైనది. శాంతముదా ల్చిన వాడు క్రతు సహస్రంబుల నొనరించినవానికంటె నధికుడనిచెప్పదగు. ఇతరులు తనపయి నలిగినను మగుడ నలుగకయు దిట్టులదిట్టినవి విని వినని యటులనటించి యెదురుమాటలాడుటయు, బదిధవక రములగు బనులు దాబొందిన నవిడెందమందు విచారింపకయు నుండువాడు శాంతుడనబరగు. మనము మనమనముల శమమువిడనాడిన విపత్తుల బొందగలము. నీతిధర్మరహితములగు రాజ్యంబును, నిర్లక్ష్యంబగు సంపదయు, శమములేని తపసియొక్క తపమును, భిన్నమైన కుండయుందుదకమిడుటయే యగును. ఓర్పులేక పనులనారంభించినయెడల నవి నిర్మూలములగును. అదిగాక హానియుగూడ సంప్రాప్తించును. మనుజుడు శాంతమువీడిన కొలది కోపమధికమగును. కోపముహెచ్చగుచున్నకొలది వానికి వాక్శూరత్వ మెక్కువయగుచుండును. క్రియా శూరత్వము తగ్గుచుండును. అల్పమలగు కుక్కల్ త్రోవనుబోవు నే
36

బా ల నీ తి.

నుగునుజూచి మొఱగుచుండ నాద్విప మాయఱపులు వినియు విననియట్లునటించి తనత్రొవను జనుటలేదా? మొఱుగుచుండుకుక్క లాకరిని నించుకైన బాధించినవి యై లాభమేమైనబొందినవా? నోరునొచ్చుటతప్ప లాభమేమియు బొందలేదనికదా చెప్పవలెను.

     కాన శాంతుడు సహించుచుండవలెను. ఈయోర్పు గలిగినవాడు సకలజనుల జక్కగా బరిపాలించు ప్రభువుతొ సమానుడని చెప్పవచ్చు. వీడే క్రియావంత మును దాల్చియుండవలెను. ఈశాంతము వహించుట వలన సౌఖ్యములుబొందగలరు. "శమస్తవ" యని వేదములు వాకొనుచున్నవి. కాబట్టి ప్రతిమనుజునికి యాచరణీయంబు.
    ఈశాంతమువలన వృద్దికివచ్చినవారలు చాలమందికలరు. వారిలో నొకనిజెప్పెద.
సకలజనానందకరుడును, ధర్మమార్గ తత్పరుడును, సత్యవాదియు నగుధర్మరాజు తనపెద తండ్రి కుమారులగు దుర్యోధనాదులప్రొత్సాహమున ఢృతరాష్ట్రునిచేజక్కగాజూడబడకపోయినను గినియడాయె. వారు తనతమ్ముడగు భీమునికి విషాన్నము బెట్టించినను శాంతమును విడనాడలేదు. మఱియు నతనిని బాశములచేగట్టించి నను గినుకజెందడాయె. తమ్మునాధార్తరాష్ట్రులు రాజ్యమునుంది వెడలగొట్టించినను నిదానము మానలేదు. మధ్య

37

బా ల నీ తి.

వర్తులప్రోత్సాహమున దనకువచ్చిన యర్దరాజ్యమును శకుని మొదలగువారిచే జూదమాడించి యన్యాయము గా గైకొనినను నోర్పును విడనాడలేదు. తుదకు దమకు ధర్మపత్నియగుద్రౌపదీదేవిని గుత్సితులగుదుశ్శాసనా దులు కొప్పుబట్టికొని బటబటనీడ్చుకొంచు గురువరుల చేతను గురువృద్దులచేతను రాజులచేతను నిండియున్న సభకు దీసికొనివచ్చినను శాంతమును విడనాడలేదు. అంత నాదుర్యోధనాదు లామానినీయ మణిని దుచ్చమగుసంభాషణ నాడుటవినియు గూడ నాధర్మరాజు శాంతమునువీడలేదు. మఱియు నాదుర్యో ధనాదులామెయడిగిన ప్రశ్నలకుత్తరమియ్యక వస్త్రాప హరణము గావించుచు "నీమగలిక్కడనేయున్నారు. వారు పౌరుషహీనులుగా గనుపడుచుండిరి. అట్టివారల నీవుచేపట్టదగలదని చెప్పుచు మానభంగమొనరించు చుండిరి. దానిని విని యతని యనుజులగు భామాదు లాగ్రహావేశులయి "యిప్పుడో దుర్మధాంధులజంపి విడిచెద" మని దిక్కుల్లిపిక్కటిల్లు ఘోరరవముతొ బలికిరి. అంత నాధర్మరాజు తానుకినియక వారికి "దమ్ములారా! ఇదిసమయముకాదు. ధర్మవిరుద్ధముగా నొనరించకూడదని సామవాక్యము లు జెప్పి వారిని గ్రోధరహితులనుగా జేసి కాననము లకు సతీభ్రాతృసమేతముగావెడలెను.

   విలోకించితిరా!అట్టిమహాపత్సమయములం దోర్పును  వీడక యాధర్మరాజుండెను. కాని ఘోరము లును బరిభనకర ములుమనగు పనుల దానుబొందినపు డీధరంరాజువలె శాంతముదాల్చి మిన్నకిండినవారలు కలరా? లేరు. లేరని నొక్కివక్కాణించవ్లయును.ఇట్టి యసాధ్యమగునోర్పు నవలంబించుటవలననే యాధర్మరాజు కలక్రమమున శత్రువుల్నందఱినిజంపి సార్వభౌముడై సకలసామంతులును, జననిచయమును, ధర్మముగా బరిపాలొంపగలిగెను. మఱియు నాయమనందనుడు శాంతమువహించుట వలనగాదె “యజతశత్రు” డని యన్వర్ధనామమునుబడసెను. అతనికీర్తి. శాంతమునందిప్పటికి దశదిక్కుల దేజరిల్లుచున్నదికదా. కాబట్టి మనము, కష్టములబొందినను నోర్పువిడనాడకయుండుదము. మఱియు దీనిచే మనపనుల గొనసాగించు చుందుము.

క.ఒరులేమనినొనర్చిన
  పరపర?యత్రయముదనమనంబుకగుదా
  డొరులకు నవినీయకునికి
  పరాయణము పరమధర్మశ్బధములనెల్లన.

వినయము.

వినయమనగా బెద్దలసన్నిధినణకువగా నుండుట అట్టివానికిని గురుశిక్షవలన మంచిగొనములు కలుగునని వచించియుంటినిగదా. ద్నివలన సకలసుజనమనోహరము వినయము కలుగును. ఈవిషయము నేజనుడుతాదలసినపని