Jump to content

బాల నీతి/సంస్కృతభాష

వికీసోర్స్ నుండి

యంగనలతో నెల్లప్పుడు రమించుటవలనఁ గ్రమక్రమముగా శుష్కించి చిన్నతనములోనే క్షయవ్యాధి బాధితుఁడై యమ పురికిఁజనెను.

కంటిరా! ఆవిచిత్రవీర్యుఁడారోగ్య విధ్వంసక మగునమిత రతివలనఁగాదె యటులఁ జిన్నతనములోనేమృతిఁజెందినది. కా బట్టి యెవరైన నిదివఱకుఁదెల్పఁబడిన యారోగ్యమార్గములసం చరించిన సుఖభాగులగుదురు. కావున మనమారోగ్యమార్గము లను సంచరించుచు సుఖలమైపూర్ణాయుష్యము కలిగిన వార మైయుండుటకుఁ బ్రయత్నింతము. మనయాయుర్వేదీయౌషధ ములనె వాడుచుందము. మఱియు నేవిధముననైనయారోగ్య ముగా నుండుదము.


క. యోగ్యులు బల్కుదురెపు డా
     రోగ్యము భాగ్యమె యటంచు రూఢిగ నేరా
     రోగ్య విహీనులొ వార లు
     ర్భోగ్యాదుల దూరులౌచుఁబోదురు సఖుఁడా!


సంస్కృతభాష


వ్యాకరణాదులచేఁజక్కఁగా సంస్కరింపఁబడినభాష సం స్కృతభాషయనఁబడు. భాషయన జనులు పరస్పరము తమతమ మనోభావముల నెఱిగించుకొనుటయె. ఈజగముననుండు భాషలకన్నిఁటికి నిదియెమూలము. అనఁగానేభాషయైనను దీనిననుసరించియెయుండును. కాబట్టియె లోకజ్ఞానులీభాష కాదిభాషయనిపేరిడిరి. ఈయాదిభాష, ప్రా కృతము, సంస్కృతమను నామధేయములతో రెండువిధములై యొప్పారు చుండును.

ప్రాకృతమున సరస్వతీదేవి బాల్యమునఁదొట్రుపాటుగ మాటలాడినది. ఇదియాఱువిధములైయుండును. దీనిని నాటకా దులయందునీచపాత్రాదులకుపయోగించు చుందురు. ఈప్రాకృ తమునకుఁ దగినవ్యాకరణశాస్త్రమును వాల్మీకి మహర్షిరచిం చెను.

ఇఁక సంస్కృతమన సలక్షణముగా లక్షణగ్రంధములచే సంస్కరింపఁబడినదని యిదివఱకె చెప్పితినిగదా. ఇది సర్వజ నులకుపయోగించును. ప్రాకృతమంతగా నుపయోగములో లేదు. కాన దానినివిడిచి యుపయోగమెక్కువగాఁగలిగిన సం స్కృతవిషయమై మహర్షీ తరులగు ప్రకృతము ప్రసిద్ధినిబొంది యున్నగ్రంధనిర్మాతలను గొందఱినిమాత్రము గైకొని సంగ్రహముగాఁ దెలిసికొందము.

మన మత నీతి జ్ఞాన చారిత్రముల కాటపట్టగు వేదము లపౌరుషేయములై సుస్వరయుక్తములై యీసంస్కృతభాష యందె ప్రకాశమానము లగుచున్నవి. ఈవేదములు శ్లోక రూపములుగా నుండవు. ఇవి హిందువులకుఁ బ్రబలప్రమాణ ములును, బూజ్యములు నగుచున్నవి. వాల్మీకి ఈవైదికభాష నక్కడక్కడననుకరించుచుఁ జాతురి గాలౌకికభాషను జొన్పుచునీగీర్వాణమందునఁ గ్రొత్తగాఁబద్య కవనంబుఁబన్ని భగవదవతారమగు శ్రీరాముని సచ్చారిత్ర మును రామాయణమను పేరిట సరసముగా రచించిసంస్కృతం బునఁ బద్యకవనంబునఁ దామార్గదర్శియని జననికరముచేఁ గొనియాడఁబడెను.

ఇతనితరువాత వేదములు సంగ్రహముగాఁ దెలిపినమ తనీతిజ్ఞాన రాజకీయ విషయముల వివరించుచు శాసనములుగా ధర్మశాస్త్రములను, మనుపరాశరాది మహానుభావులేర్పాటు చేసి లోకోపకారధురీణులై ప్రసిద్ధికెక్కిరి. ఈస్మృతులలోనికి నుత్తమము మనుస్మృతియె. కాని యీకలియుగంబునఁ బరా శరస్మృతియె జనులకుఁబ్రమాణమని వివేకధురీణులు చెప్పిరి. కాఁబట్టి మనకుఁ బ్రమాణగ్రంధము పరాశరస్మృతియె. ప్ర స్తుతము మనలనుబరిపాలించు నీహూణప్రభువులును, మనువు చే రచింపఁబడిన మనుస్మృతిని, నింకనితరమహర్షులచే రచింపఁ బడిన స్మృతులను, దమయాంగ్లేయభాషలోనికి భషాంతరీకర ణముఁజేసికొని “ఇండియన్ పీనల్ కోడ్“అను మొదలగు పేరు లఁబెట్టి (లాబుక్సు) శిక్షాస్మృతులనేర్పాటుఁ జేసిరి. వేదముల తరువాత మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రము లన్నియు హిం దువులకుఁ బరమప్రమాణము లనియు, నందలిధర్మములాచర ణీయములనియఁ దెలిసికొనవలయును. వీరి తరువాతఁబరాశర పుత్త్రుండగు వ్యాసుండష్టాదశ పురాణములను, సకలధర్మాదర్శంబును బంచమవేదంబును నగుభారతంబును రచియించి నిలింపభాషయందున రెండవకవి యని ప్రఖ్యాతిఁగొనెను. ఈపురాణము లందనేక చరిత్రలభిజ్ఞు లకు మనోజ్ఞములై యొప్పుచుండును. వీనియందు ధర్మములు వివరముగాఁ జెప్పఁబడును. కాననివియును హిందువులకు గౌర వార్హములు.

ఇంతవఱకు లక్షణగ్రంధములు లేకపోయినను బైవా రాది కవియగువాల్మీకి మహర్షిననుసరించి వ్రాసిరి. క్రీస్తు పుట్టుటకుఁబూర్వము 12వ శతాబ్దమందున్న పాణినిమహర్షియీ శ్వరానుగ్రహమునఁ బదునాలుగు సూత్రములఁబొంది వాని కిఁ దానునాలుగువేల సూత్రముల నైపుణిగా రచించి "యష్టా ధ్యాయి"యను పేర నొకగ్రంధమును బ్రకటించెను.

తదుపరి వరరుచియను మహానుభావుఁ డాపాణిని మహ ర్షిచేసిన నాలుగువేల సూత్రము లీసంస్కృతభాషను సంస్క రింపఁజాలకపోవుటఁగాంచి తానువాతిన్‌కములను గొన్నిరచిం చి భాషోద్ధారకుఁడై లోకభూషితుఁ డాయెను.

ఇతని తరువాత క్రీస్తుశకమునకుఁ బూర్వము 2వ శతా బ్దమందున్న పతంజలియను మహాముని యాపాణిని మహర్షి రచించిన నాలుగువేలసూత్రములను, వరరుచిప్రణీత వాతిన్‌క ములను, గైకొని వానికి భాష్యమొనరించిలోకకృతజ్ఞతా పా త్రుఁడయ్యెను. సూత్రకారుఁడగు పాణినిమహర్షియు, వాతిన్‌కకారుఁ డగు వరరుచియు, భాష్యకారుఁడగు పతంజలియు వీరుముగ్గురు చేరి లక్షణగ్రంధమొకదానిని రచించి సంస్కృతమును నియ మబద్ధముగా నొనరించిరి. ఈముగ్గురునుజేరి లక్షణగ్రంధ మే ర్పఱచిరికాన వీరికిమునిత్రయమని పేరువచ్చినది. అన్ని బాష లకు మూలమగు నీయాదిభాషకు సరసముగా వ్యాకరణంబొ నర్చిన నీమహనీయులయొక్క పాండితీవైదగ్ధ్యమెంతగొనియా డినను దక్కువయెకదా.

మఱియుఁ గాత్యాయనుఁడను నొకమహర్షికూడఁగొన్ని సూత్రముల రచించి భాష కుపకారమొనరించి వాసిఁగాంచెను.

మహాశయులగు నీనలువుర సూత్రభాష్యముల ననుస రించిపండిత ప్రకాండులు కొందఱు వృత్తులను రచించిరి. ఈవృ త్తులకు మఱికొందఱు సుధీవరులు వ్యాఖ్యానముల నొనరించిరి. మహర్షికృతసూత్ర వాతిన్‌కభాష్యములకు వృత్తులరచించినవా రియందును, వృత్తులకు వ్యాఖ్యానముల నొనరించిన వారియం దును భట్టోజిదీక్షితుఁడు కడుప్రసిద్ధుఁడైయున్నవాఁడు. ఈయన పాండిత్యాతిశయ మనిర్వచనీయము. ఈతనిగ్రంధబోధకతా శక్తి నిరుపమానము. ఈమహానుభావుని నామునిత్రయముతో సమానునిగా లెక్కించవచ్చును. ఈతఁడు రచించినసిద్ధాంత కౌ ముదియనునది సుబోధకమై నుతిపాత్రమగుచుండును.

అద్వైతమతావలంబుఁడును, సారస్వత బ్రాహ్మణుఁ డునునగు శ్రీకాళిదాసు క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 56వ సం వత్సరముననున్నవాఁడు. ఈకవి, రఘువంశ కుమారసంభవ, మేఘసందేశ, ఋతుసంహారములను కావ్యములను, శాకుంత ల, విక్రమోర్వశీయ, మాళవికాగ్నిమిత్రములను నాటకములను మనోభిరామముగా రచించి రాజాదరణంబుగలిగి లోకప్రసిద్ధుఁ డయ్యెను. ఈమహాకవి గొప్పగొప్ప పండితులచే మెచ్చుకొనఁ బడినవాఁడు. ఈకవి రచించిననాటకములు, కావ్యములు, న వరసమిశ్రములై కమ్రతమములై పాఠకులకు లోకజ్ఞానోపే తాభిరుచిఁ గలిగించుచుండును. ఈకవి యుపమాలంకారముల నుబ్రయోగించుటయందుఁ గడుచతురిమ కలవాఁడు. ఇతఁడు చేసినగ్రంధములు, పైనఁదెలిపినవె కాక యింకనున్నవని కొం దఱు చెప్పుదురు. కవులలోనికి నితఁడెయుత్తముఁడని చెప్ప నొప్పు.

ఇతని తరువాతబ్రాహ్మణోత్తముండగు దత్తకునిఁ బు త్రుఁడగు మాఘమహాకవి శిశుపాలవధ మహాకావ్యంబును ర చించి దిగ్దశకంబున సద్యశమును సంపాదించెను. ఈశిశుపాలవ ధమహాకావ్యము 20 సర్గలుకలది. ఈకావ్యమందున భాగవత కధకలదు. ఈతనికవిత్వమతిపటునై నానాలంకారశోభితమై శ్ర వణానందముఁ జేయుచుండును. ఈకావ్యమందున 9 సర్గలుచ క్కఁగాఁ బఠించినవారికి సమస్తశబ్దములు తెలిసియుండునను టయె. కావ్యములన్నిఁటిలో నీకావ్యమె మిన్నయని యెన్నిరి.

ఇతని తరువాత శిష్టాచారకర్మఠుఁడును, శ్రీకంఠపదాం కితుఁడును, పదవాక్యప్రమాణజ్ఞుండును, నగుభవభూతి హూణ భాషించు చుందురు. ఇట్టియనర్ఘమగు నాదిభాషను మనమె క్కువగా నభివృద్ధిఁజేయ వలయును. సంస్కృత పండితులను స న్మానించుచుండవలెను. అటులఁజేసిన మనముగూడ నభివృద్ధికి రాఁగలము. మనకీర్తియుఁగూడ నాచంద్రార్కముగా నుం డఁగలదు.

అమూల్యంబగు నీగీర్వాణంబును వృద్ధిఁజేసితాము విద్వాంసులై విద్యావంతుల గౌరవించి, శాశ్వతంబగు సద్యశ మార్జించినవారు పూర్వులలోఁగలరు. వారిలోనిద్దఱిని జూపిం చుచున్నాను.

విక్రమార్క మహారాజు పరోపకారకుఁడై విద్వాం సుఁడై విచక్షణదక్షుఁడై సంస్కృతమాహాత్య్మంబెఱింగి దా నిని వృద్ధింజేయందలంచి ధన్వంతర్యాదిననకవీశ్వరులను దన యొక్క యాస్థానమందునిచికొని వారినిఁబోషణఁ జేయుచు విశేషసన్మాన మొనరించుచు వారిచే సరసగ్రంధములను ర చింపఁజేసి యాగ్రంధములకుఁ దగినటుల బహూకరించి ధీవ రులనామోద సాగరమగ్నులనుగాఁజేసి యితరులకుఁబ్రోత్సా హమొనరించుచు ననేకభంగుల నీయాదిభాష నభివృద్ధిఁ జేసి శాశ్వతకీర్తిగడించెను.

అట్లనెభోజమహారాజును ధనయొక్క యాస్థానమందు గొప్పపండితుల నుంచుకొని వారినిబోషించుచు సంస్కృతం బునఁ గవిత్వముఁజెప్పువాఁడు నాచే బహుమానముఁ బడ యఁగలఁడని ప్రకటించి యావిధముననె తనదగ్గఱకు దూర దేశములనుండి పండితులువచ్చి సరసకవనంబు సెప్పిన వారిని మెచ్చుకొని విశేషముగా గౌరవించి ధనమిచ్చి నిజరాజధాని యగు ధారానగరమునందె వారిని నివాసముగలవారినిగా నొనరించుచుండెడివాఁడు. ఇట్లీరాజు చేయుటవలనఁ గడజాతి వాఁడును సంస్కృతభాషను గవనముఁజెప్పఁ గలవాఁడయ్యె ను. ఆసమయమున నీదేవభాష దేశబాషగా మాఱినదని చె ప్పవచ్చు. ఈవిధముగాఁ దనరాజ్యమంతయు నుండుట వలన మనమున నానందమందు చుండెను. తాను విద్యావంతుఁడ గుటవలన సరస్వతీకంఠాభరణమను గొప్పయలంకారగ్రంధ మును, రామాయణచంపువును రచించి గీర్వాణము నభివృద్ధిఁ జేయుచు లోకసంన్తవనీయుఁ డాయెను.

చూచితిరా? ఆవిక్రమార్క మహారాజు ధన్వంత ర్యాది కవీశ్వరులను గౌరవించుటవలననె కదా లోకోపకార కారకగ్రంధములు బయలువెడలినవి. అవివెడలుటవలననెకదా యామహారాజుకీర్తి దిగంతముల వ్యాపించఁగలిగెను. మఱి యు భోజమహారాజు పండితులగౌరవించి వారిచేగ్రంధముల రచింపఁజేయుటయె కాక తానొకగొప్పయలంకార గ్రంధ మును, స్వాద్యపద్యగద్య చంపువును రచించుటవలననె కదా యామహారాజు నిప్పటికి జనులు కీర్తించుచున్నారు. కాఁబట్టి మనము సదసద్విమర్శనసాధన భూతంబును,. యోగవేదాంత వైద్యవిద్యాహృద్యంబును, నగుసంస్కృతసాహిత్యమందు సా హిత్యమును సంపాదించి పండితప్రకాండుల సత్కరించుచు స శకము 730 వ ప్రాంతమునఁగలడు. ఈతఁడు మహాకవియై మాలతీమాధవము, మహావీరచరితము, ఉత్తరరామచరితము లను మూడునాటకములను రచించెను. అందున నుత్తరరామ చరితము కడుసొగసని కోవిదు లనెదరు. ఈమహాకవి రచించిన నాటకములన్నియు నీతియుతములై శ్రోత్రపేయములై తన రారుచుండును.

ఇతనితరువాత మురారియను మహాకవి యనర్ఘ రాఘ వమనుపేరిట నొకనాటకమును రచించెను. ఈనాటకము, శబ్ద శాస్త్రనిపుణులకును, నిఘంట్వాది పరిశోధకులకును, గ్రాహ్య మగునదిగానుండి శ్రీరామచరితోపేతమై నయయుతమై చదువరుల కింపునింపుచుండును.

ఇతని తరువాత బహుకాలమునకు మల్లినాధుఁడను మహాపండితుఁడు శోలచలవంశమునందు జనించిచతుష్షష్టి కలావిశారదుఁడై పంచకావ్యంబులకును, శ్రీహర్షకృతనైషధ మహాకావ్యంబునకును, మఱియుఁగొన్ని నాటకములకుఁ గించి ద్జ్ఞబోధకంబగు సులభశైలిని వ్యాఖ్యానముల రచించి కవిభా వములఁ జక్కఁగాఁదెలియఁ బఱచుచు "మహామహోపాధ్యా య"బిరుదమును విద్వాంసులచేఁగొని సంస్కృతవాఙ్మయ విమర్శకులకెల్ల వంద నీయుఁడై వన్నె కెక్కెను.

హూణశకము 1550 వ సంవత్సరమున విశ్వజిద్యాజి యగు రంగరాజ మఖి కప్పయ్యదీక్షితుఁడను సుధీవరుఁడుద్భ వమంది దురాచారముల నాశనమొనరించుచు నద్వైతమత రతుఁడై శివభక్తశిఖామణియై నిరుపమాన పండితుఁడై వివిధ శతగ్రంధములను రచించి ప్రణుతికెక్కెను. అందునఁ గొన్నికబ్బములపేరుల నుదాహరించెదను. శివకర్ణామృతము, బ్రహ్మతర్కస్తవము, వరదరాజస్తవము, సిద్ధాంతవేశసం గ్రహము, విధిరసాయనసుఖోపజీవిని, వృత్తివార్తికము, భా రత తాత్పర్యసంగ్రహము, శబ్దప్రకాశము, చిత్రమీమాంస, కువలయానందము, రసికజనరంజని, మొదలగునవి. ఆగ్రంధస మూహమున నుండుకువలయానందము ప్రస్తుతమెక్కువగా నాలంకారికులకుపకార మొనర్చుచున్నది. రసిక జనరంజని దీని టీకయనితెలిసి కొనుఁడు.

ఇంకను నీసంస్కృతంబునఁ గవులనేకులు సుప్రసిద్ధులు కలరు. వారురచించిన గ్రంధసముదాయమును గలదు. కాని గ్రంధవిస్తరభీతిచే వానిని విడిచి పెట్టితిని.

ఈసంస్కృతమున షట్శాస్త్రములును గలవు. ఈసం స్కృతగ్రంధముల వలననే మనపూర్వులాకాశవిమానముల ను, నణిమాద్యష్టాంగ సిద్ధులను, దూరదృష్టిమొదలగు వానిని గనిపెట్టిరి. మఱియుఁ బరకాయ ప్రవేశాదుల నొనరించిరి. వే యేల? సమస్తకార్యము లీసంస్కృతగ్రంధసముదాయము వలననె నెఱవేర్చు చుండిరి. భూగోళఖగోళ విషయముల విశ దీకరించునది యిదియె. జగమునంత వ్యాపించియుండునదియు నిదియె. ఇదియె, మనకాధారము. ఈయాదిభాషయె యి తర భాషలకన్నిఁటికి మూలము. ఈభాషనె దేవతలుకూడ సం హారాజుతో "వల్లె" యని యింటికిఁజనెను. అటుపిమ్మటఁ దనకిష్టుఁడును, సతీర్ధుఁడును, సంస్కృతద్రావిడ కర్ణాటభాషా పండితుఁడునునగు నారాయణభట్టుచే నాంధ్రభాషకు సం బంధముకలిగిన కన్నడమునం దక్కడక్కడ చంధోవిషయ మున సాహాయ్యమందుచు నదివఱకుఁ గక్కిరిబిక్కిరిగానున్న యాంధ్రమును సంస్కరించుచుఁ బద్య గద్య యుక్తముగా నూతనముగా నారాజనరేంద్రునిఁ గృతిపతినిఁజేసి వ్యాస రచితభారత మాంధ్రీకరించ మొదలిడెను. క్రమముగానాతఁ డాభారతము నందాదిసభారణ్యపర్వములను రచించెను. అం తటనానన్నయభట్టు తనయభీష్టమును దుదివఱకుఁ గొన సాఁగనీయని దైవవశమున విధివశుఁ డాయెను. ఈతనికవ నము, రెండువంతులు సాంస్కృతికపదములను, నొకవంతు తెలుఁగుపదములును, గలిగి బహుసరసముగాననేకాలంకారశో భితమై దూరాన్వయములు లేక యొప్పుచుండును. మన తెలుఁ గుబాసలోనికి నితఁడె మొదటికవి. ఈనన్నయభట్టాదికవికాఁ డని కొందఱనెదరు. కాని ఈతనికిఁబూర్వమున నొకపుస్తకమై న నాంధ్రమందునఁ గనుపడకపోవుటవలన వారుచెప్పునది వి శ్వసనీయముకాదు. ఇప్పుడిప్పుడుకొన్నిపొత్తముల బయలుదేఱఁ దీసి యవి నన్నయకుఁబూర్వములె యని వాడుచున్నారు. కాని యీపొత్తములన్నియునారయ నిటీవలివె యగుచున్నవి. కాన నన్నయ యాదికవియని చెప్పనొప్పు. ఈయాంధ్రకవితా పిత, యాంధ్రశబ్దచింతామణియను లక్షణగ్రంధమొకదాని ని రచించెనని కొందఱు ధీవరులనెదరు. కాని యది చింత్యము. ఈయాదికవి బుద్ధియందు బృహస్పతితో సమానుఁడు. నిగ ర్వి, పరోపకారి, కృతజ్ఞుడుఁనై యున్నవాఁడు. ఈకవి యాం ధ్రమునుసలక్షణముగా నొనరించుటవలన విద్వాంసులచే "వా గను శాసనుఁ"డని బిరుదమునందెను. కొందఱీతనిని నియో గియనెదరు. కాని వైదికుఁడని తెలిసికొనుఁడు.

ఈకవికిఁ దరువాత హూణశకము 12వ శతాబ్దమందునఁ దిక్కనయనుమహాకవి కొమ్మనపుత్త్రుఁడై యుభయకవిమిత్త్రుఁ డై నియోగిశిఖామణియై ప్రసిద్ధినిగాంచుచుండెను. అంతనొకస మయమున నదివఱకు నన్నయచేఁ గొంతవఱకు రచింపఁబడిమూ లఁబడియున్న భారతమునుగాంచెను. అంతటనాభారతమును బూ రితిఁజేయవలయునని తనకుబుద్ధివొడమెను. అటుతరువాత హరి హరనాధునిఁ గృతినేతగా నొనరించివిరాటపర్వాది పంచదశప ర్వములను, బహుశ్రద్ధతో సరసముగా నాంధ్రీకరించి వాని నిఁబూరితిఁజేసెను. ఈకవి, యీభారతమును బూరితిఁ జేయ కమున్నె మనుమ భూపాలునిఁ గృతినాయకుని గా నొనరించి నిర్వచనోత్తరరామాయణమును రచించెను. మఱియుఁగవివా గ్బంధనమను గ్రంధమును రచించెను. ఈతనికవిత్వము మూ డుపాళ్ళు తెలుఁగుపదములును, నొకపాలు సంస్కృతపదము లును కలిగి ద్రాక్షపాకమైదీర్ఘసమాసములు లేనిదై నానాలం కారశోభితమైసరళమైమనోజ్ఞముగా నుండును. ఎట్టిపట్టుల నెట్టిప దములఁ బెట్టి యారసముట్టిపడునటులఁ జేయవలయునో యావి ద్గ్రంధముల రచించి సద్యశమార్జించుట కెక్కువగాఁ బ్రయ త్నింతము.


ఆ. వె. ఎల్లభాషలకును♦దల్లి యిల్ల యినట్టి
         సంస్కృతంబు మనము♦చదువవలయుఁ
         జదివి దానిమహిమఁ♦జాటించవలయును
         జాటి దాని వృద్ధి♦సలుపవలయును.




ఆంధ్రభాష.

మన తెలుఁగు బాసనెయాంధ్రభాషనియనెదరు.

మన తెలుఁగు బాసకీయాంధ్రసంజ్ఞ యెటులఁ గలి గినదన - మగధదేశమును బరిపాలించు, ఆంధ్రనామక ప్ర భువు మనపూర్వులు నివశించుదేశమును జయించి పరిపాలిం చుటంబట్టి మనదేశమునకును, మనబాసకు నాంధ్రసంజ్ఞ కలిగినది. అప్పటినుండి యిప్పటివరకు మనదేశమాంధ్రదేశ మనియు, మనబాసనాంధ్రభాషయనియు వ్యవహరించుచు న్నారు.

ఈభాష స్వతంత్రభాష కాదు. ఈభాష సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడము,కర్ణాటమను నాలుగుబాసలతోఁ గూడికొనియున్నది. సంస్కృత ప్రాకృతభవపదములు తప్ప ద్రావిడ కర్ణాటపదములన్నిఁటిని దేశ్యములని మనవారు వా డుచున్నారు. మనదేశమునకు వేగియను నామాంతరము క