Jump to content

బాల నీతి/శ్రద్ధ

వికీసోర్స్ నుండి

119

బా ల నీ తి.

శ్ర ద్ధ.

     తాననుకొనినకార్యము నెఱవేఱువఱకు బట్టుబట్టి యుండుట "శ్రద్ధ" యనబడును.
ఈశ్రద్ధయనునది ప్రతికార్యమున కత్యావశ్వకైమై నది. ఇదిలేనియెడల నేపనియు గొనసాగదు. మిక్కిలి బుద్ధిమంతులుకూడ నీశ్రద్ధ నవలంబింపవలసి యున్నది. వీరవలంబించనయెడల దామనుకొనిన కార్యము నెరవేఱదు. విద్యార్ధులులీశ్రద్ధనవలంబింపని యెడల వారికి విద్యరాదని దృఢముగాజెప్పవచ్చును. మంచినిక్కుటద్దములైనను వెనుక గళాయిని బొందనియెడల నితరుల ప్రతిబింబముల జూపగలవా? లేవు. అటులనె యెవరెంతగొప్పవారైనను శ్రద్ధను బూననియెడల నేమియుబ్రయొజన మందనేరరు. విద్యార్ధులీశ్రద్దనెతాల్చినయెడల విద్య జక్కగస బొందగలగు. శ్రద్ధకొలది విద్య వచ్చును. కాన విదార్దు లందఱు తప్పక దీనిని గల్గియుండవలెను. మతిమంతుడు తాను చలనములేక శ్రద్ధకలిగియాలొ చించుచుండిన వానికిలాబముగల యొకయుపా యము తోచును. ఇట్లాలొచించుసమయమున దనమనము చలనమొందుచుండెనేని నిక్కమగు లాభముగల యొకయుపాయమును గ్రహింపనేరడు. కాబట్టి విద్యార్ధులు, మంత్రులు, గార్యారంభకులు, తప్పక యీశ్రద్ధనుగల్గి యుండవలెను. దాన బ్రతిష్ట బొందగలరు.
120

బా ల నీ తి.

   ఇటుల శ్రద్దవలన బ్రసిద్దివహించినవారలు చాల మందికలరు. వారిలో నొకనిని జూపించుచున్నాను.
  
మున్ను "హిరణ్యధ్వన్వు" డను నెఱుకరాజునకు గొడుకగు "నేకలవ్యు" డనువాడు, ద్రోణాచార్యుల ప్రసిద్ధిని విని యాయాచార్యుల సమీపమునకువచ్చి "ధనురాచార్యా! నేనుశ్రద్ధగా దమసమీపమున ధనుర్విద్య నేర్చుకొనవలయునని యిష్టపడుచు న్నాను. కాన నన్ననుగ్రహించుడనికోరెను. అంత ద్రోణాచార్యులు, వానినిబోయవానికుమారునిగా నెఱింగి వానివేడికోలు నంగాకరింపకబోయెను. అంత నా యేకలవ్యు డాయాచార్యుల యానతిగైకొని యడవికేగి యొకచో గూర్రుండి మృత్తికతొ ద్రోణాచార్యరూపమును జేసికొని దానినె గురువువాభావించుకొని నమస్కారాదు లసలిపి మిక్కిలిశ్రద్ధతో నెల్లప్పు డస్త్రవిద్య నభ్యసించు కొను చుండెను. అంతట నొక సమయమున నాయడవికి గురుకుమారులందఱు భటసమూహమునం దొకనికుక్క ప్రత్యేకముగా నొకడె మిక్కిలిపట్టుదలతో ధనుర్విద్యనభ్యాసంము జేసికొనుచుండెడి నాయేక లవ్యునిజూచి మొఱిగెను. అట్లు మొఱుగుట నా యేక లవ్యుడు చూచి యాకుక్క మొగమున నైదుబాణము లను, నొకయమ్మును వేసెను. ఆబాణములు, దూరముగానున్నకురు కుమారుల సమీపమునకు బాఱెను. దానిజూచి వీడెవడో కనుగొంద
(10)

121

బా ల నీ తి.

మని యల్లన నేయేకలవ్యుని జేరిరి. అంతనిద్దఱొక మొగము నొకరు చూచుకొనిరి. అంతట నా యేకలవ్యుని దృష్టికి శరలాఘవంబునకు మెచ్చుకొని "నీవెవ్వడ" వని వానినడిగిరి. అంతట వాడు నేను హిరణ్యధన్వుకొమరుడను. ద్రోణాచార్యులశిష్యుడను న "న్నేకలవ్యు"డని లోకమువాకొనుననియుత్తర మొసంగెను. అంతట నా కురుకుమరులంద ఱటనుండి బయలుదేఱి ద్రోణునిసమీపమున జేరి జరిగినసంగ తంతయు నివేదించిరి. మఱియు నర్జునుడొకనా డేకాంతమున దన గురువుదరిజేరి "గురువరా! విలుదిద్యయందు నన్నుబ్రసిద్ధునిగా జేసెద నని యిది వఱకు వచించియుంటిరి. నేనడవికి మొన్నటిదినము పోయినప్పుడు నిన్ను నన్నును మించినధనుర్విద్యా విశారదుని నొక యెఱుకను జూచితిని. వాడు నీశిష్యు డట. నాతోనానావిధముగజెప్పి యీవిధముగమీరు చేయుటపాడియా"? యని యడిగను. అంత ద్రోణు డాయర్జునునితొ "వానిజూతముర"మ్మని యిద్దఱు కలిసి యడవికరిగి యాయేకలవ్యుని దరి జేరిరి. అంత నాయెఱుక యాద్రోణాచార్యుని గాంచి నమస్కరించి స్వామీ! మీశిష్యుడను. మిమ్మారాధించి యింతవాడ నైతిని. కాన గురుధక్షిణ నివ్వదలచితి. కాన గోరు" డనిపలికె. అంత నాద్రోణు డాయెఱుకను బొటనవ్రేలిని గురుదక్షిణగానిమ్మని కోరెన్. అంత నాయెఱుక యటులనె చేసెను.

చూచితిరా! ఆయేకలవ్యుడు తన్ను బోయవాడని
122

బా ల నీ తి.

యాద్రోణా చార్యుడు చేకొనకపోయినను విలువిద్య యందు శ్రద్ధకలవాడగుట బట్టియేకదా స్వకీయజన మును విడిచి భయంకరమగు నడవికేగి మన్నుతో నాద్రోణుని రూపమునుజేసికొని దానినె గురువుగా దలచికొని శ్రద్ధతో స్వయముగా నేర్చుకొని త్రిలోకము లందు విలువిద్యయందు దానె మేటియని ప్రసిద్దికెక్క గలిగినది. ఆప్రసిద్ధినివిని యొకడాయర్జునుడును ద్రొణుడును నంతపని జేసినది. కాబట్టి శ్రద్ధనుబట్టి విద్యయుండును. ఒకవిద్యయే యననేల? సమస్తము నీశ్రద్ధనుబట్టియే యుండును. కాన మనము శ్రద్ధవలన విద్యాదులబొంది ప్రసిద్ధి బొందుదము.

క. శ్రద్ధ రవితనయ సాత్వికి
    బోద్ధవ్యా వాస్తిశుభము♦బొనరించుమన
    శ్శుద్ధి స్వరూప దాని బ్ర
    బుద్ధుడు పాటించు జూవె♦పురుషాత్మికగన్.

(భారతము.)

దు ర్జ ను లు, వా రి గు ణ ము లు.

     చెడ్డగుణములుకలవారు దుర్జనులని చెప్పబడు దురు.   ఈదుర్జనులు విద్యావంతులైనను బలవంతులైనను ధనాడ్యులైనను గులీనులైనను త్యాజులు. ఎందువలననన? వీరుచేయుచేతలబట్టి వారు చేయుచేతలెవ్వియనిన? మా