బాల నీతి/ఐకమత్యము
స్వరూపం
< బాల నీతి
క. కలిమియచుట్టల జేర్చుం
గలిమియ చెలులనుఘటించు♦గలిమియశౌర్యో
జ్ఝ్వలుడనిపించుచుం గలిమియ
పలువురు సద్బుద్ధియనగ♦బరగంజేయున్
(భారతము)
ఐకమత్యము
జనులొకపనియందున భిన్నభావములులేక చేరికగా నుండుట యైకమత్యమనబడు.
ఈయైకమత్యము పరస్పరప్రేమ గలిగించుచుండును. ఇదియె దిగంతముల గీర్తిని వ్యాపింపజేయుచున్నది. ఇదిసర్వత్ర సాధకము. కాన దీనిని దప్పక జనులవలంబించవలయును. కాని యీయైకమత్యమును మంచిపనులయందె యుపయోగించుచుండవలెను. అటులజేయుటయే శ్రేయస్కరము. ఐకమత్యములేనివారలు మహాపరాక్రమశాలులైనను గొనరాని వారుకాగలరు. మనమైకమత్యముకలిగి యుండనిది యేపనిని చేయ జాలము. మనము విస్తరియందున బువ్వనుంచుకొని మనచేతివ్రేళ్ల నొకచోట జేర్చనియెడల మనమా యన్నమును భుజించగలమా? లేము. కాబట్టి ప్రతివిషయమునను నైకమత్యము కావలయును. 117
బా ల నీ తి.
ఈయైకమత్యముననున్నదమ్ములను, దండ్రికొడుకులను నత్తకోడండ్రును, భార్యాభర్తలును, మఱియునింటిలోనివారందఱును గలిగియుండిన యెడల గృహమున గలతలు లేక గృహకృత్యముల జక్కగానడుపుకొనగలరు. వారలకు దమగృహమె భూతలస్వర్గముగా నొప్పుచుండును. ఈయైకమత్యము గలిగినవారిని నితరులెంతమాత్రమును భాధింప జాలరు. కానబ్రతివాడు నీయైకమత్యమును గలిగి యుండవలెను. "ఉహ్హ" యనియాడినంతమాత్రమున నూరుదాటి పోవునంత బలగముగలిగినవారలు కొందఱైమత్యముతో నుండినయెడల వారలే జగజ్జెట్టినిగూడనోడించి తమకాళ్లబట్టుకొనునటుల జేయగలదు. అల్పమగు కొన్ని గడ్డిపోచలుకలిసి బలిష్టమగునొకయేనుగునుబట్టి కట్టివేయుచున్నదికదా ఈయైకమత్యముకలిగిన వారలు బలములేనివారైనను నొకపనియందొకటె యభి ప్రాయము కలిగియుండిన వీరాపని యెంత గొప్పదైనను జిటికలోదానినిజేసి కృతార్దులుకాగలరు.
ఇట్లైకమత్యముతో నల్పబలులు గొప్పపను లొనరించి కీరితిని గడించినవారుకలరు. వారలలో నొక సమూహమును జూపించుచున్నాను.తొల్లి వానరు లల్పబలము కలవారైనను జాలమంది యొకటిగాజేరి యగాధంబగుసముద్రము పై గట్టవేసి లంకకు మార్గమేర్పరచిరి. అటుతరువాత రామకార్యార్దమై లంకాపట్టణముజేరి మిక్కిలి బలము గలవారును, బగలుచూచినరా
118
బా ల నీ తి.
తిరి కలలోనగుపడి గుండెలుజల్లుమనిపించెడివికరాకార ముగలిగినవాడు. మాయాయుద్ధము తెలిసినవాడును, నగురాక్షసులతో యుద్ధమొనరించి వారినందఱినిర్జజెండి చెకపికలాడిరి, అంతట నీవానరు లసాధ్యంబగు నా శ్రీరామకార్యము ను నెఱవేర్చి కృతార్దతగాంచిరి.
కనుగొంటిరా! ఆవానరులు కొంచెపుబలము కలవారైనను వేలకొలది యొకటిగా జేరుటవలనగదా యగాధంబగునబ్ధికి మహత్తరంబగునొకవంతెనవేసి దాని వలన లంకాపట్టణముజొచ్చినది. మఱియు నీయైక మత్యము వలననెకదా యావానరులు పటిష్ఠులగు నారక్కసులను గొట్టి కోలాహలముజేసి శ్రీరామకార్యము నెఱవేర్చి కృతార్దతగాంచగలిగినది. కాబట్టి మనయైక మత్యముకలిగి గొప్పగొప్పపనులజేసి గొప్పవారలచేత మెప్పుంబొందుచుందము.
తే.గీ. బలముగలవాని బలువురు♦బలహీను
లొక్కటైకూడి నిర్జింతు♦రుత్సహించి
మధువుగొన నుత్సహించిన♦మనుజు బట్టి
కట్టి నిర్జించు మధుకర♦కులమునట్లు.
(భారతము.)