బాల నీతి/ధనము
ధనము.
సంతోషము పెట్టునది, లేక, ధాన్యమువలనఁ గలిగి
నది ధనమనఁబడు.
ధనము ప్రతివాని కావశ్యకము. ఇదిలేనివానిని దరి ద్రుఁడని పలికెదరు. వీనినెవరును దగ్గఱఁజేరనీయరు. వీడు విద్యావంతుఁడైనను గణనసేయరు. ఈదరిద్రుఁడు వచించు మంచిమాటలనుగూడ నావల ద్రోసివేయుచుందురు. ఈతని కోపమితరుల నెంతమాత్రమును సాధించనేరదు. "పేదకోప ము పెదవులచే"టని వినియుండలేదా? ఈతఁడు మంచిపనిఁ బ్రారంభించినను జెడుపనియని చెప్పుచుందురు. ఈదరిద్రుని గని కన్నతల్లి నిందించుచుండును. తండ్రి సంతసించఁడు. సోదరు లితనితో మాట్లాడరు. తాను కన్నకుమారుఁడు తన దగ్గఱకు రాఁడు. సేవకు లీదరిద్రునిఁ దిరస్కరించుచుందురు. సంభాషించిన నెక్కడ డబ్బునడుగఁ గలఁడోయను వెఱపుచే త నెచ్చెలులు పెడమొగముపెట్టుకొని మాట్లాడక యుండు దురు. ఇంతయేల? ఆదరిద్రుని భార్యయుఁగూడ నానిర్భాగ్యు నందుఁ బ్రేమగానుండదు. ఈతనితప్పు గోరంతయున్నఁ గొం డంతఁజేయుచుందురు. ఈదరిద్రునిఁబట్టి బ్రతివాఁడు చెవు లబట్టి యాడించుచుండును. ఈతని కెంతమాత్రము సుఖము లేదు. వీఁడుతనజీవిత మెప్పుడు పోవునాయని యంతఃక రణంబునఁ జింతించుచుండును. చూడఁ జూడ నీతని కష్టము లనిర్వాచ్యములునుదుర్గమములు నగుచున్నవి. కాబట్టి యిట్టి నికృష్టకష్టముల కునికిపట్టగు నీదారిద్ర్యమును బలుతెఱఁగు లఁబొగొట్టుకొనుచుఁ బ్రతివాడును ధనమును సంపాదింపఁ గ డంగవలయును.
ఈధనమార్జించుటకు మూడుమార్గములు కలవు.
చక్కగా నొకవిద్యయందుఁ బాండిత్యము సంపాదించి వివేకియై దానినిఁ బ్రాజ్ఞులసమక్షమునఁ దెలియబఱచి వారిచే ధనాదులను మెప్పుగా బడయుట. ఇది మొదటితరగతి. ఇది యన్నిఁటిలోనికి నుత్తమము. వ్యవసాయము మొదలగువృ త్తులందుఁ గష్టించి ధనమును సంపాదించుట. ఇదిరెండవతర గతి. ఇది మధ్యమము. ఒకరిజుట్టునకు మఱియొకరిజుట్టునకు ముఁడిబెట్టి వారిద్దఱును తగవులాడునటులఁజేసి తానువారిద్దఱి లో నొకరితట్టుచేరి కొలఁదిదినములైన తరువాత రెండవ వానిపక్షముగూడఁజేరి వానికిఁ దగినమాటలు వానికి వీనికిఁ దగినమాటలు వీనికిఁజెప్పుచు లంచముగొట్టి సంపాదించుటయు జూదము మోసము దొంగతనము మొదలగు చెడుగుపనుల వలన నార్జించుటయు. ఇదిమూడవతరగతి. ఇది యన్నిఁటిలో నికి నధమము
ఈయధమవృత్తిచే సంపాదింపఁబడిన ద్రవ్యము సజ్జ నత్యాజ్యము. కానఁ బ్రతిమనుజుఁడును పైనదెలిపిన మొద టిరెండు తరగతులవలననే ధనమార్జింపవలయు. ఈధనము పండితపామరజనసేవ్యంబు. ఇదియె గర్వోద్దీపకంబు. ఇదియె ఇదియె యైహికాముష్మిక ఫలసాధనము. ఇదియె యుపయో గరీతినిఁ గీర్త్యపకీర్తి సాధకంబు, ఇదియే యనేకుల నువ్వి ళ్లూరించుచుండును. ఇదియె సోదరులనువిభాగులునుగాఁ జేయు ను. ఇదియె జుట్టులు జుట్టులు పట్టుకొనుటకుఁ బురికొల్పు చుండును. ఇదియె గొప్పవారలతోడ స్నేహమొదవించును. కాఁబట్టియెమనవారలు "సర్వేగుణాఃకాంచనమాశ్రయంత్తి". అనఁగా "సకలగుణములు బంగారము నాశ్రయించుచున్న"వని చెప్పిరి. ఎవనికి బొక్కస మెక్కువగా నుండునో వాఁడే బుద్ధి మంతుడు. వాఁడే పండితప్రకాండుఁడు. వాఁడే గుణగ్రహ ణదక్షుఁడు. వాఁడే దర్శనీయుఁడునగుచున్నాఁడు. ఆధనవం తుఁడు కొలఁదిగా నొకప్పుడొక మంచికార్యమును జేసినయె డల దానినిఁ జేకొని యనేకులు వారినిఁజేరి వందిమాగధుల వలె స్తోత్రముఁ జేయుచుందురు. ధనహీనుఁ డెంతవిద్యావంతుఁ డైనను మతిమంతుఁ డైనను సజ్జన సహాయము వలన నెటు వంటిమంచి కార్యములఁ జేసినను వాని నితరులు నుతించకపో వుటయెకాక యేవగించుకొను చుందురు. పాడిగలిగిన బఱ్ఱె ను జక్కఁగాఁజూచి దానికి గడ్దిమొదలగు వానినిబెట్టినటులఁ బాడిలేని పశువును జూచు చున్నారా? చూచుటలేదు. బెల్ల మెక్కువగా నెక్కడ నుండునో యక్కడనే యీగలు చీమ లు చేరునుగాని రిత్తచోటుల నవి గుమికూడునా? కూడవు. అటులనే ధనమెచటనుండునో యచటికి జను లేగుదురు కాని దారిద్ర్యవంతునిజేరుదురా? చేరరు. దారిద్ర్యముగలవానిని జేరకపోయిననుఁ బ్రీతిగాఁ జూచు చుందురని యనుకొందమ న్నను నదియులేదు. కాన దరిద్రుఁడు జీవించి యుండుటయుఁ బ్రయోజనము లేదు. "నిర్ధనస్తు మృతస్సమ" యని వినమో కావున మంచిమార్గమున నత్యాశవిడనాడి ధనమార్జించవల యును.
ఈధనమును దుష్కార్యములకు వినియొగించక తాను చక్కఁగా ననుభవించి మిగిలినదానిని లోకోపకార కార్యము ల కుపయోగించు చుండవలెను. అంతియకాని ప్రభువులు త క్కఁ దక్కినవారలు విశేషముగాడబ్బు నిలువనుంచఁ గూడ దు. ఎందువలన నన? ఎపుడు ధనమును నిలువనుంచఁ దలచితి మో యపుడె దానిని భద్రముగా దాఁచి పెట్టవలయును. గ దా. ఆదాఁచిపెట్టుటయందుఁ గొంచె మశ్రద్ధ వహించితిమా యది మ్రుచ్చులచేతులఁ జిక్కును. దానివలన నితరములగుప నులు పటాపంచలైపోవును. వెండియుఁ కొంచెము డబ్బునిలు వయున్నదని యొక యసూయాపరుఁడు వినెనా వాఁడువెం టనె దానినపహరింప మాయోపాయములఁ బన్నుచుండును. కాన విశేషముగా డబ్బుదాచుట సామాన్యుల కనర్ధదాయ కమని చెప్పవచ్చును. కొందఱు కులక్రమాగతధనము నిలు వయున్నను నష్టములేదని చెప్పిరి. కాని ప్రభువులకుఁ దక్కఁ దక్కినవారల లాపత్కరమనియె తోఁచెడిని.
ఈధనవంతులు, వివేకులైముఖస్తుతులకులొంగక యు క్తాయుక్తవిచక్షణదక్షులై తమధనము నుపయోగించుచుఁ గీర్తినిఁగాంచుచుండవలెను. ఈవిషయమునఁ బూర్వులలోనుండి యొకనిఁ జూ పెద.
తొల్లిసకలాలంకారాలంకృతంబగు నలకయనుపురం బున కధినాధుఁడైనకుబేరుఁ డాదిని మంచిమార్గమున ధనము ను సంపాదించెను. అటుతరువాతఁ దానెక్కువగాఁ గష్టించ కపోయినను నాధనమునానాఁటికి వృద్ధిఁజెందుచుండెను. క్ర మక్రమముగా నవనిధులుచేరెను. నవనిధినాధుఁడైన యీకు బేరుడు వివేకియై యెటుల ధనముదేనికి నుపయోగింపవలయు నో యాసంగతిఁ దెలిసికొనుచు బాగుగా నుపయోగించుచుం డెను. ఇతడీ ధనమువలన యక్షులను, గిన్నరులను, గుహ్య కులను, మొదలగుబీదవారినిఁ గాపాడుచుండెడివాఁడు. ఈధ నమువలననే యుత్తరదిశకు దానధిపతియయ్యెను. దీనివలననే రాజరాజని పేరుగాంచెను. ఇతఁడుధనమెక్కువగా దానముఁ జేయుచున్నందువలననె ధనదుఁడనియు వాసిగాంచెను. మ ఱియు నితడీధనమువలననె మహానుభావుడగు పరమేశ్వ రునితోడ స్నేహమొనరించెను.
చూచితిరికదా. ఆకుబేరుఁడీధనమువలనఁ బొందినలా భములన్నియు, కాన "ధనమూలమిదంజగ"త్తనుమాటను జ్ఞా పకముంచుకొని యత్యాశవిడనాడి మంచిమార్గమున ధన మార్జించి గర్వించక దానిని దుష్కార్యములకు వినియోగించ
క మంచిపనుల కుపయోగించుచుఁ గీర్తినిగాంచుచుందము.
క. కలిమియచుట్టలఁజేర్చుం
గలిమియ చెలులనుఘటించుఁ♦గలిమియశౌర్యో
జ్జ్వలుఁడనిపించుం గలిమియ
పలువురు సద్బుద్థియనఁగఁ♦బరగంజేయున్
(భారతము)
ఐకమత్యము
జనులొకపనియందున భిన్నభావములులేక చేరికగా నుండుట యైకమత్యమనబడు.
ఈయైకమత్యము పరస్పరప్రేమ గలిగించుచుండును. ఇదియె దిగంతములఁగీర్తిని వ్యాపింపఁజేయుచున్నది. ఇదిసర్వ త్ర సాధకము. కాన దీనిని దప్పక జనులవలంబించవలయును. కాని యీయైకమత్యమును మంచిపనులయందె యుపయోగిం చుచుండవలెను. అటులఁజేయుటయే శ్రేయస్కరము. ఐకమ త్యములేనివారలు మహాపరాక్రమశాలులైనను గొనరాని వారుకాఁగలరు. మనమైకమత్యముకలిగి యుండనిది యేపని నిచేయజాలము. మనమువిస్తరియందున బువ్వనుంచుకొని మన చేతియైదువ్రేళ్లు నొకచోఁ జేర్చనియెడల మనమాయన్న మును భుజించగలమా? లేము. కాబట్టి ప్రతివిషయమునను నైకమత్యముకావలయును.