బాల నీతి/వివేకము
చూచితిరా? ఆశ్రీకృష్ణుఁ డాయుద్ధవుఁడు వచించిన రీతిగా నడచుటఁ బట్టియేకదా తనపనుల రెంటిని నేకకాల మందు సాధించుకొనఁగలిగెను. తనయన్నపలికిన విధముననే చేసినయెడలఁ దనపనుల నేకకాలమం దిటులఁ గొనసాఁగించు కొనఁగలఁడా? కొనసాఁగించుకొనలేఁడు. కాఁబట్టియె, యిప్ప టికాయుద్ధవునిఁ "విమర్శక చూడామణి" యనియు, మహా పరాక్రమశాలియగు నా బలరామునిఁ "సాహసికుఁ" డనియు వచించుచున్నారుకదా. కాన మనము విమర్శనజ్ఞానము కలిగి యుండుదము. మనకుఁదెలియని విశేషసంగతులను సద్విమర్శ కులనడిగి వారు వచించినపగిది మనము నడచు కొందము. మనము విమర్శనగ్రంధములఁ గావించి లోకోపకారుల మగు దము.
క. మిత్త్రత్వము శత్రుత్వముఁ
బాత్రతయు నపాత్రతయుఁ♦బరికించుసుచా
రిత్రుఁడు చిరతరగణనా
సూత్రితముగ దాననెల్ల♦శుభముల నొందున్
(భారతము.)
వివేకము.
దేహమును నాత్మయును విభాగించు జ్ఞానమును, సుగు ణ దుర్గుణములను విచారించుటయును వివేక మనఁబడు. ఈవివేకము, స్వకీయములగు తప్పులను నగుపఱచి వానిని దిద్దుకొనునటులఁ జేయుచుండును. మఱియుఁబరకీయు ల తప్పులఁగూడ సవరణఁజేయఁ బాటుపడుచుండును. ఇదియె యసాధ్యమగు నాపదనుండి రక్షించును. ఇదియె న్యాయాన్యా యవిచారణఁ జేయుచుండును. యిదియే యింద్రియ నిగ్రహ త్వము సంపాదింపఁజేయును. ఈవివేకమె నీచమార్గగతముల గుమనములను ద్రిప్పి వానిని సన్మార్గయుతములుగాఁ జేయు ను. ఇదియెసుఖదుఃఖసమదర్శి. ఇదియె సచ్చిదానందమార్గదర్శి. కాన మానవులకిది యాచరణీయంబు.
ఈవివేకముకలిగినవారలను వివేకులనియనియెదరు. వీరు ప్రారంభించిన పని యంతరాయములులేక చక్కఁగా నెఱవే ఱును. వీరుపట్టినదియె బంగారమగుచుండును. అప్పట్టున వీరు గర్వించరు. మఱియు వినయముగా నుండుదురు. కాఁబట్టి వీరు జగజ్జనవంద్యులు.
అనర్ఘంబగు నీవివేకము లేనివారలు విద్వదాదరణీయు లు కానేరరు. ఎందువలననన? ఈవివేక రహితులు దురాశకు లొంగుచుందురు. గర్వముఖస్తుతులకుఁ బాల్పడుచుందురు. తాము పట్టినకుందేటికి మూఁడేకాళ్ళని వితండవాదముఁ జే యుచుందురు. కయ్యమునకుఁ గాలుఁద్రువ్వుచుందురు. యుక్తా యుక్త విచారణశూన్యులగుచుందురు. ఇవియవియననేల? ఈ వివేకశూన్యులు దుర్గుణములకెల్లఁ దల్లియిల్లువలె నుందురు. కాన వీరు జగన్నింద్యులు. వివేకులు స్వయముగాఁ బ్రతివిషయమును జక్కఁగా బరిశీలిచి గ్రహించు చుందురు. దాన విశేషలాభములు కలవుగదా. ఇఁక వివేకదూరులన్ననో యటుల నొనరించుట కుపేక్షించుచుందురు. ఉపేక్షఁజేయుట బహ్వనర్ధదాయకము కదా. కాఁబట్టి మనము వివేకముకలిగియుండుదము. ఇది భావిభావుకసూచకము. ఇది పూవులనమ్మినయంగడినె కట్టెల నమ్మనీయదు. ఈవివేకమువలన ననేకసుగుణములు పట్టు వడును. మనమావివేకము కలిగియున్నయెడల దుఃఖములను బొందము. మనమొకవేళ హానిని బొందినను దీనిచేత దాని నవలీలగాఁ బోఁగొట్టుకొనఁగలము. మనము దీనినలవరించు కొనుటకు సుజనసహవాస మొనరించవలెను. వివేకము కల్గి యున్నవారలు విశేషసౌఖ్యములఁ జెందగలరు.
ఇటుల వివేకమున విశేషసౌఖ్యముఁ జెందినవారలలో నొకనిని జూపుచున్నాను.
తొల్లి ధర్మరాజు నలుగురుతమ్ములతోఁ గొండొక కారణంబున నరణ్యవాసముఁ జేయుచుండెను. ఇటులుండ నొకసమయమునఁ దననలుగురుతమ్ములకు దాహమాయెను. అంత ధర్మరాజు జలమునుదీసికొనివచ్చుటకై మొదట నకు లునిఁ బంపెను. అంత నానకులుఁ డొకచెఱువుఁజొచ్చి నీరుఁ ద్రాగుటతోడనే యచటనే పడిపోయెను. అంతట ధర్మరాజు "నకులుఁడుదకముఁదీసికొని యింకనురాకపోయెను. ఇది యర ణ్యముకదా" యని భయమందుచు నింకొకతమ్మునిఁబంపె ను. వాఁడటులనె రాకపోయెను. మరల మఱియొకతమ్మునిఁ బంపెను. వాఁడటులనె రాకపోయెను. మఱియు నింకొక్క తమ్మునిఁ బంపించెను. వాఁడటులనె రాకపోయెను. ఇట్లునలు గురుతమ్ములెంతసేపటికి సలిలమును దీసికొనిరాకపోవుటగాం చి ధర్మరాజుగూడఁ బయలుదేఱి యా చెఱువుదరిఁ జేరెను. అచ్చటఁ దనతమ్ములందఱు నిర్జీవులైపడియుండుటఁజూచి య ధికముగా దుఃఖించుచుఁ గారణమారయుచుండెను. ఇంతలో నాకసముననుండి "ఇచటఁబడియున్నవారందఱు చెఱువునకు నాయకుఁడనగు నాయనుజ్ఞ లేనిదే ప్రవేశించి యీవిధమున నైరి. కాన నీవైనను నేనడిగినప్రశ్నములకు సదుత్తరముల నిచ్చి యిందుఁబ్రవేశించు" మను మాటలు కొన్ని శ్రవణ గోచరములయ్యెను. అంతట ధర్మరాజు మగుడ "సరే" యని యుత్తరమొసఁగెను. అంతఁ దత్తటాకనాయకుఁడు ముప్పది రెండుప్రశ్నముల నాధర్మనందను నడిగెను. వానికిఁ దగిన యుత్తరముల ధర్మరాజు వచించెను. అంత నాచెఱువున కధి పతియగుయక్షుఁడాతని యుత్తరములకు మెచ్చి "ధర్మజ్ఞా! నీవు నీరుఁద్రాగుము. మఱియు నిచటఁబెద్దనిద్దురఁజెందియున్న యీనలుగురిలో నొకనిని బ్రతికించఁగలను. కాన నీకిష్టుఁడె వఁడో చూపించు"మని యడిగెను. అంత ధర్మరాజు, నకు లుని నాకిష్టుఁడని చూపించెను. అంత నాయక్షుఁడు బలవం తులగు భీమార్జునులనుగోరక నకులునిఁగోరుటకుఁ గతమే" మ ని యడిగెను. అంత ధర్మరాజు "మహాత్మా! కుంతీపుత్త్రు లమగు మామూవురలో నేనొకఁడనుంటిని. మీరు వచించిన పగిదిఁగోరిన మాద్రీపుత్త్రులలో నొకరుగూడఁ గన్పడరుకదా. అటులఁజేయుట వివేకిలక్షణమా?" యని చెప్పెను. అంత నాయక్షుఁ డీతనివివేకమునకుమెచ్చి యతఁడుకోరకపోయినను నతనినలుగురు తమ్ములను బునర్జీవితులను చేసెను.
కంటిరా! ఆధర్మరాజాయక్షుని బలవంతులగు భీమా ర్జునులలో నొకరినిగోరక సామాన్యుఁడగు నకులునిఁ గోరిన దేల? వివేకిలక్షణము కాబట్టియెకదా. ఆవివేకమునకే కదా మెచ్చి యాయక్షుఁ డాధర్మరాజు కోరకపోయినను నతని నలుగురు తమ్ములను బ్రతికించినది. కాబఁట్టి యెవరైనను గష్టమువచ్చినను సుఖమువచ్చినను వివేకమును విడువకుండి రేని వారికి సకలసౌఖ్యములు చేకూరును. కాన మనము వివే కమునువిడువక కార్యాకార్యములను వివేకించుకొనుచు సుఖ ముగా నుండుదము.
ఆ. వె. విను వివేకమనెడి ♦ వింతగొడ్డలిచేత
నల యవిద్య యనెడు ♦ నడవినఱికి
తెలివియనెడుగొప్ప ♦ దీపంబుఁజేఁబట్టి
ము కిఁ జూడవచ్చు ♦ మొనసివేమ.