బాల నీతి/పితృభక్తి

వికీసోర్స్ నుండి

విడిపింపు“ డని. పలికెను. అవ్విధముననే వారొనరించిరి.

చూచితిరా!అనిహంగేంద్రుడు మహాబలజవోపేతుడయ్యుదల్లిమాట నిరాకరించలేక పాములమోసెనుగదా. మఱియు దనతల్లిబానిసపని బాపుటకై యెంతపని జేసెనో తెలిసినదిగదా. ఈసమయముననేకదా విష్ణుమూర్తివలన వరములబొందుటయు నింద్రునితోసఖ్యంబు సంభవించుటయు మాతృభక్తివలన నాకస్మికముగావచ్చినలాభములేకదా. కాబట్టి మాతౄభక్తిగలిగినవారలు మహాసంపన్నులుకాగలరు. కాన మనము మాతృభక్తికలిగియుండుదము.

ఆ.వె. వచ్చిపోయి చూచు♦వాడుగాకిడుమల
      బడునె? తల్లివోలె♦బట్టితోడ
      దండ్రిచెప్పునిట్లు♦ధర్మశాస్త్రంబుల
      నంబ గౌరవమున♦నధికయగుట.

         

భారతము

పితృభక్తి.

తండ్రియందు భక్తిగానుండుట పితృభక్తియనబడు.

కన్నతండ్రి మనలబెంచిపెద్దజేయుచు మనకుగావలసిన యాహారవిహార పదార్దములదెచ్చియుచ్చును. మనతోగూడ నాడుచు మాటలాడుచు మనకానందము గూర్చుచుండును. మనతోడనే సంతోషముగాగోల ముగడవుచుండును. మనకు దండ్రియే, తవమును, విద్యయును, ధర్మమును, బరమాత్మయునుగాన గొమరులమగు మనము వారిని వివిధముల సంతోషింపజేయుచుండవలెను.

మనము మనతండ్రియందంతగా నెందులకుండ చలెనన? మనజనకుడెల్లప్పుడు మనయభివృద్దికై యనేకరీతుల బాటుపడుచుండును. "సర్వత్రజయ మన్విచ్చేత్పుత్త్రాదిచ్చేత్పరాజయం" అనగా "దండ్రి యంతట జయముగోరవలెను. తనకుమారునివలన బరాజయమందగోరవలయు" ననునీతివాక్యను సారముగా మనతండ్రియుండుటను,మఱియు "గొమరులుపుట్టిత్గమకేమో యెట్టెత్రవ్వి తలకెత్తెద" రని నాశతొనుండుటను వారియందెక్కువభక్తిగా నుండవలెను.

"పితృదేవోభవ" అనగా "దండ్రియే దైవముకల వాడనైకమ్మా" యని యుపనిషత్తులు వచించు చున్నవి. ఎవడు తనతండ్రిని మంచిమాటలచేతను, మంచిపనులచేతను, సంతోషింపజేయుచున్నాడో వాడే సుపుత్రుడు. ఇటువంటి సద్గుణగణఖనియగు నొకపుత్రుడున్నజాలును. దుర్మార్గులు వందమంది యున్నను నిష్ప్రయోజనము. మఱియు గులనాశకు లనిచెప్పవచ్చు. వియత్పధమును బ్రకాశింపజేయు టకుసకల కళాపరిపూర్ణుండగు ఒక చంద్రుడున్న జాలదా? కాంతిని హీనములగు పెక్కుడుచుక్కలేల? కాబట్టి కులమునుద్ధరించుట కొకౌత్రుడున్న జాలు. ఈసుపుత్రునివలన డండ్రి యమిత ముగా సంతోషమందుచుండును తండ్రియందు భక్తికల వాడైయాతనిని సంతసమందించినవాడే కుమారుడు తక్కినకుమారులు జనకమారకులని చెప్పవచ్చు. జనకహర్షప్రదాతయగు గుమారుడనెక లాభముల బొందగలడు.

అటుల పితృభక్తిగలిగి లాభముల బొందినవారలలో నొకనిని జూపెద.

భారతవీర శ్రేష్ఠుడని వాసిగాంచిన గాంగేయుడు తనతండ్రియందు భక్తిగలవాడై యుండెను. ఇట్లుండ నొకపరి తనతండ్రియగు శంతన మహారాజునకు దాశరాజపుత్రికయగు యోజనగంధిపై మోహము జనించెను.అతడామెను వివాహమాడుటకు దాని తండ్రి కడకు జని తనమనోరధమునుదెలియబఱచెను. అంత నాదాశరా "జీపిల్లకు జనించిన పిల్లనికి నీరష్ట్రమంతయు బట్టముగట్టినట్లొడమబడితివేని నొసగెదని పలికెను. అంతనామహారాజు తన పెద్దకుమారుదలచి మిన్నకుండి యింటికిజేరి డెందమున గుందు చుండెను. ఇవ్విధమున దనతండ్రి యుండుట నొక సమయమున గాంచి యతని యాంతరంగిక మిత్రు లను విచారించి కారణముదెలిసికొనెను. అంత దానా దాశరాజుదరి కరిగి "నీకొరినయట్లె యీనతికి జనించిన కుమారుడు రాజదురంధరుడు కాగలడు. ఇందుకుసందియమంద నవసరములేదు. వైళమెన" తండ్రికి నీకొమరైతె నిచ్చి వివాహంబొనర్చుము. నాతండ్రి చింతవిడనాడి సుఖముగానుండిటయే నాకు బ్రధానముకాన నిదుగో బ్రహ్మచర్యంబుబూనితి" ననిదృఢప్రతిజ్ఞజేయ నాతనిపై నాకసమునుండి దేవతలు పుష్పవృష్టి గురిపించిరి. అంతట దాశరాజు నతని పితృభక్తికి మెచ్చుచు దన కూతును శంతనునకిచ్చి వివాహం బొనర్చెను. అంత నాశంతనమహారాజు తనకుమరుని ప్రతిజ్ఞకును, సద్భుద్దికిని, భక్తికిని, ననంతముగా నద్భుతమంది మదిని మెచ్చి యాతనికి స్వచ్చంద మరణము బ్రసాదించెను.

చూచితిరా! ఆభీష్మాచార్యుల పితృభక్తి కలవాడగుటచేతనేకదా బాణములవలనగాని కత్తులవ లనగాని మఱియొక దానిచేగాని మృతిజెందక తన యిష్టమువచ్చినప్పుడు విధివశమగు వరమును బొంద గలిగెను. అట్టివరముల నితరులు పొందగలరా? పొందలేరు. కాబట్టిపితృభక్తి గలిగినవారలు పెక్కు ఫలములుబొందగలరు. కాన మనము మనతండ్రి మొదలగు పూజ్యులయందు భక్తిగా నుండుదము.

క.జనకుడు దపమునుధర్మం
   బును విద్యయుబరమదైవ♦మును గావున
   తనికిబ్రియంబగుపనిసే
   సినదేవతలెల్లబ్రీతి♦జెందుట గలుగున్

భారతము.