బాల నీతి/గురుభక్తి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గురుభక్తి.

అజ్ఞానమునరికట్టువాడు. శ్రేష్టుడు, తనకువిద్య, జెప్పిన వాడు, వీరలయందుభక్తిగానుండుటయే గురుభక్తియన బడు.

మనల ముందబివృద్దికిదీసికొనివచ్చునదియు, భక్తి భుక్తి శ క్త ముక్తుల నొసంగునదియు, గౌరవార్హ మును నగు విద్యను నిష్కపటముగా జెప్పినవారలు గురువులు కాన వారియందు మనము భక్తిగానుండ వలెను. ఆవిద్యాదాతలను మనజీవితాంతమువఱకు గౌరవించుచుండవలెను. గురువుగూడ మన తలిదండ్రు లతో సమానుడని చెప్పచెప్పు. ఏలయన? మన జననీ జనకులు శరీరపోషణాదులయందెక్కు వశ్రద్ధవహించు చుందురు. ఇక గురువులన్ననో మనల నితరులచే గౌరవింపజేయువిద్య నఱమఱలేక యఱిముఱిగా నొసంగుచుందురు. అటులనుండుట వలన వారు మనకు గౌరవస్ధానమేకదా. వారు మనము విద్వాంసు లగుటకు గోరుచుందురు. మనకుశలమును వారభిల షించుచుందురు. కాబట్టి మనమారంబదశనుండి గురుశిక్ష బొందవలెను. దానివలన మనము విద్య లెస్సగానేర్చి విద్వాంసులమై లోకమున నెడదెగనికీర్తి గడింపగలుగుదుము. ఈయవనియందుద్భవించిన ప్రతిమనుజుడును జిన్నతనముననే గురుశిక్షనొందిన యెడల వాడనేక లాభముల బొందగలడు. నగ్గురిశిక్షబొందక చిన్నతనమును వ్యర్దముగా గడపినయెడల వానికి లెక్కలేని చెడుగుణము లలవడును. పొట్లతీగ లయందు దగులుకొనియున్న చిన్నకాయలతుంతురు. ఱాలను గట్టనియెడల నవి వంకరలు పోక యెటులుండును. కాపరిమంచక గొఱ్ఱెలయలనుంచిన నవి వంకరత్రోవలబడక యెటుల చక్కగాబోవును? కాబట్టి గురు శిక్షబొందనివారలు విశేషవక్రమార్గముల జొరబడుదురు. కానబ్రతివాడును గురుశిక్ష బొందవలెను. విద్యనెక్కువగా గడించవలెను.

    తాము బాల్యమున నొకగురువువద్ద విద్యనభ్యసించి క్రమక్రమముగానతినియెడ ద్వేషమువహించి "నీకు మేము శిష్యులముకాము. నీవు మాకు జెప్పినదేదియునులేదు" అని యా గురువుతో గ్రుద్దులాడి యాయనకు బంగనామమిడి యతని దిరస్కరించుట నరక హేతువు.ఇటులొనర్చువారలవినీతులు కాన బ్రతివాడును గురువునం దెక్కువ భక్తి కలిగియుండవలెను. గురువేఋబ్రహ్మ, గురువేవిష్ణువు, గురువేమహేశ్వరుడని మన పెద్దలు చెప్పుదురు. అటులనే "ఆచార్యదేవోభవ"అనగా గురువేదైవ ముకలవాడవైకమ్మా' యని యుపనిషత్తులనుచున్నవి. కాన మనము గురుభక్తికలిగియుండినయెడల ననేక ప్రయోజనములు నందగలము.
  అటులం బ్రయోజనములందినవారలలో నొకనిం జెప్పెద. ద్రోణాచార్యులను నొకసుప్రసిద్ధ ధనురాచార్యుడు ధృతరాష్ట్రపాండు నందనులకు జక్కగా ధనుర్విధ్యాదులను జెప్పెను. అంత నాధార్తరాష్ట్ర పాండవేయులు, గురువుదగ్గఱకు వచ్చి "స్వామీ! మేము మీకు గుదక్షిణ నీదలచితిమి. కాన దమకేది యిష్టమో తెలియగోరెదము. అని పల్కిరి. అంతట నాగురువు "చాత్రచూడామణులారా! మీబుద్దికిమెచ్చితి.ఇదుగొ నాకోరిక వినుడు. పాంచాలదేశాధీశుడును, మిత్రపరాబవ కారియు నగు నాద్రుపదుని బట్టుకొని పాశములచే గట్టి మీయరదమున బెట్టికొని వచ్చి నాముందఱ బెట్టుటయే నాకు గురుదక్షిణ. ఇటుల జేసినవాడే గురుభక్తి కలవాడని పలికెను. దానికి వారందఱు వల్లెయని మహోత్సాహముతో నాద్రుపదుపురంబునకు జనిరి. అందున మొదట దుర్యోధనాదులహమహమికచే నట్టిప్రయత్నముజేసిరి కాని వారాపాంచాలపతితన యాదులచే నోటువడి స్వగృహాభిముఖులైది. అంతట బాండవమధ్యముండగు నర్జునుండు ధైర్యస్దైర్యములు కలవాడై తా జేయుప్రయత్నమున కడ్దువచ్చినవారందఱిని దుక్కుదూళిగగొట్టి యాద్రుపదునిగట్టిగగట్టి తనరధమున నిడుకొని వాయువేగమున దన యొజ్జ యెదుటికి దీసికొనివచ్చి   "ఇదుగోయితడే ద్రుపదు డని యచట నునిచెను. అంత నాగురు వాసవ్యసాచియొక్క బాహుబలమునకును, దనయందుండు భక్తికిని మెచ్చి యెక్కువ గా నాశీర్వదించెను. ఈకవ్వడి, గురుభక్తిజూపుట ఈ సమయము నందే కాక యుత్తర గోగ్రఃహణమందుగూడ జూపెను. ఆయర్జును డుత్తరకుమారునికి, బృహన్నల,యనుమాఱుపేరుతో సారధ్యము సల్పుచు గారణాంతరమునగ్రమముగా దాను రధికుడై గాండీవాదుల ధరించి యదివఱకు బ్రచ్చన్న వేషంబుతో విరటుని కొలువునందుండుటంబట్టి ప్రతి పక్షికోటిలోనున్న గురువరునకు సమస్కారంబు జేయుటకు వీలులేక నమస్కార మాచక భాణంబుల నాగురు వరుని పాదారైందమువంకబ్రయోగించెను. అందులకాగురుడమితముగా సంతొషించెను. దాన నీకిరీటియాయుత్తరగోగ్రహణమందు జయంబత్యద్బుతంబుగా సందెను. మఱియు నీగురుభక్తివలన గలిగిన నీధనంజయుని మహిమ మఱియు నీగురుభక్తివలన గలిగిన నీధనంజయుని మహిమ మఱియెందుకలదు. అది వినుడు, భారతయుద్దాన సాసంబున బుత్త్రభూతియు, ద్రోణాచార్య తనూభవుండును, నగు నశ్వద్ధామకు నీయర్జుననౌ గలహముసంభవించెను. క్రమక్రమముగా నాకలహముప్రబలి యొకరిపైనొకరు బ్రహ్మశిరోనామ  శాస్త్రంబుల బ్రయొగించుకొనిరి. అంత నక్కడనుండు మహామునులెల్ల నీకల్లోలమునుగాంచి వీరిజేరి మీయస్ద్త్రంబులు బ్రహ్మశిరోనామకబులు లోకముల దహించగలవు. కానమీయస్త్రంబుల నుపసంహరింపు డని పలికిరి. అంత వారి యనుమతిన నర్ఝునుడుమాత్రము తనయస్త్రము నుపహరించెను. అటుపై నశ్వద్ధామ తన యస్త్రము నుపసంహరింపలేక తన మాన మున "నాకవ్వడి యెక్కువ గురు భక్తి కలవాడగుటవలన వాయుస్త్రము నుపహరింపగలిగెను. నేనాధనురా చార్యుని పుత్రుడనయ్యు నంతగురుభక్తి లేకపోవుటవలనగదా యుపహరింప జాలనైతి"  నని కుందెను.
   తిలకించితిరా! ఆయర్జునుడు గురువువద్దవిద్యనభ్యసించి క్రమముగా నతనికన్న నెక్కుడు బలవంతుడయ్యునాతనియందు భక్తికలవాడగుటవలనగదా తాను లోకవిఖ్యాతుడైనది. మఱియు నతని గురుపుత్రుడుకూడ నుపసంహరింపలేని యస్త్రమును గురుభక్తికలవాడగుట వలన గదా యాయర్జునుడుపసంహరింప గలిగెను. కాబట్టి యట్టులనె పత్రివారును గురుభక్తికలిగియుండిన యెడల వారికి మేలుకలుగును. కాన మున్నెట్టులైనను మనమీదినమునుండి యీవిధమున నుండుదము.

క. సగ్గురుకృప జ్ఞానంబున
    సద్గతిదీవించుచున్న చాలగజదువుల్
    సద్గతిగలుగంజేసెడి
    సద్గురువేడై వమనుజాటర వేమాడి

రాజభక్తి

మనలను సుఖముగా బరిపాలించురాజులయందు భక్తి గానుండుట రాజభక్తియనబడును.