Jump to content

బాల నీతి/ధైర్యము

వికీసోర్స్ నుండి

ఆ.వె.దంతియడుగులోన♦దక్కినజంతుచ
       యంబునడుగులెల్ల♦నడగియుండు
       నట్ల ధర్మకోటు♦లన్నియులోనగు
       నిద్ధగుణయహింస♦కింతనిజము.

(భారతము.)

ధైర్యము.

ధైర్యమనగా నాపదలవలన వికారము నొందకుండ కార్యోత్సాహముకలిగియుండుట.

ఇది, మనోధైర్యమనియు, దేహబలముకలిగినందు వలన గలుగు ధైర్యమనియు రెండువిధములుండును. ఈధైర్యమొకకార్యము సాధించుటయందుగాని పౌరుషమునందుగాని యొకబలవంతునియాశ్రయము వలనగాని జనించుచుండును. ఈధైర్యము కలిగిన వారిని ధీరులని వచించెదరు. వీవలె కార్యసాధకులు. ఈధీరులు తాముదైవవశమున నొకానొకప్పుడు పలుకడగండ్లజిక్కినను వానినెంతమాత్రము లక్ష్యముంచక తమపనినే కొనసాగించుకొన యత్నిందుచుందురు. కాబట్టి ధీరులెప్పుడైన నెన్ని దు:ఖములుకలవారైన నవి యితరుల కగుపఱచ కుండ నుండును. ధీరులు వానలదడసినను, నెండల గ్రాగినను సరకుసేయక కార్యముసాధించుచుందురు.
(8)

57

బా ల నీ తి.

ఈధీరులు మెత్తని పరుపులను, కఱకునేలలను, పంచభక్ష్యపరమాన్నములును, గందమూలఫలాహార ములును జీనిచీనాంబరములను, జీర్ణామబరములను, లాభనష్టములను, గీర్త్యపకీర్తులను, సుఖదు:ఖములను నుధ్యానవనవిహారంబును, దుర్గమకాననాంతరపరిబ్రమ ణంబును, మొదలగువానినన్నిటిని సమములుగా నెంచి సమాఅనుకూలముగా నడచుచు నితరుల మనముల నొప్పించక కార్యమూసాదించుచు లోకమునకు మేలుజెయుచుందురు. ధీరులు తాము పూనినపని కెన్నియాతంకములువచ్చినను నవియన్నియు లక్ష్యముచేయక యాకార్యమును నెఱవేర్చుకొనుచుందురు. ధైర్యము కలవాని నెట్టివిపత్తు లైన బాధింప జాలవు. లోకమున ధైర్యములేక పరుగెత్తుచుండు మబ్బులను గాలిపాఱద్రోలునుగాని ధైర్యమూనిపరుగిడక డీకొనసిద్ధముగానుండు ధరాధరముల బాఱద్రోలలేదుకదా. కాబట్టి ధైర్యవంతుని నెవరును బాదింపజాలరు. ధైర్యమవలంబించనిది యేకార్యమును జేయజాలము. చూడుడు. ఒకడు లోకోపకారము సేయనెంచి యొకమహానదినిగాంచి దీనియుదకము జనులకంద జేయవలయునను తలంపున దానికొకదరివేయ నుద్యుక్తుడాయెను. కాని యాతడు దైరవంతుడుకాకపోవుటవలన బ్రతిప్రదేశమునకువచ్చి యెడ్డుననిలువబడి యిక్కడ నెంతలోతుకలదోయని భయపడుచు దానూనినపని గొనసాగించకొనలేకపోయెను. వాడే ధీరు
58

బా ల నీ తి.

డైనయెడల ధైర్యముగైకొని యేదియొయొకప్రదేశమున నదిలోనికిదిగి యెంతలోతుకలదో యాసంగతిదెలిసికొని యొడ్దువేసి జనులకుపకారముజేయుకుండునా? కాబట్టి ప్రతికార్యమునకును ధైర్యముకావలెను. ధీరత్వముకలవాడు సంపదలపోందినను, డిందినను, గొప్పవారలు దూషించినను, భూషించినను, గీడులు సంభవించినను, సంభవించకపోయినను, దుదకు దనకు మరణముతటస్దించుసమయమువచ్చినను తబ్బిబ్బుపడక ధైర్యమవలంబించి యాకష్టములదాటు నుపాయమును యోచించుచుండును. జనులు సామాన్యముగా నాధీరునజూచిన నాతనికేలొటునులేదు ఇంకను మనము నిర్లక్ష్యముగా జూచినంతమాత్రమున వానిధీరత్వమెచటికేగును? నిప్పును దలక్రిందుగా నుంచినను దానిసెగలు పైకిగదావ్యాపించును. ధీరత్వముచేతవచ్చుయోగ్యత యింకొకదానిచేతరాదు. ధీరులు విఘ్నములకు భీతిజెందక నవి బ్రారంబించి నడుమవిడువకుండ నాపనిని గొనసాగించుకొందురు. దాన విశేషకీర్తి జెందగలదు.

     అట్లుకీర్తిజెందినవారును బూర్వమందునగలదు. అందున గొందఱసంగతి దెలియబఱచెద.
మున్ను సురాసురుల ధైర్యమవలంబించి ఘోర గభీరమగు సముద్రమధ్యమందు మందర పర్వతమున దఱచిన మొదట నాసంద్రమున బెరుగు రత్నములు, మొదలగుమచివి జనించినని సంతోషించి తృప్తింజెంది యూరకుండిరా?

59

బా ల నీ తి.

తదుపరి ప్రాణోపద్రవకరమగు విషమ మొదలగు చెడ్డవి పుట్టినప్పుడు వానికి భయపడి మిన్నకుండిరా? మంచిని పుట్టినవని భయపడి యూరుకొనలేదు. విషముమున్నగు చెడ్డవిపుట్టినవని భయపడి యూరు కొనలేదు. ఇక వారెప్పుడూరుకొనిరన? తాము సాధించ దలచుకొన్న యమృతము పుట్టినతరువాత దృప్తిచెంది ననిజూపించిరి.

     కాబట్టి యెట్టి కాలమందైనను ధీరులు ఆటంకములకు భయపడక నడుమనడుమ స్వాభావి కముగా గలుగు సుఖదు:ఖముల బాటింపక తాము పూనుకొనిన కార్యమును సాధించితీరును. కావున మనము మంచి పనులయందు ధైర్యమూని యవి బాగుగా బ్రయోజన మందువఱకును నడుమ గలుగు సుఖదు:ఖముల సరకుసేయక "యెన్నిదినముల "కార్యమునెఱవేఱదే" యని విసుగుకొని విడువక యుండి యాకార్యఫలములనంది సుఖమును బొందుము.

క.ధృతి యారోగ్యము నొసగును
   ధృతియజ్జ్వలలక్ష్మిదెచ్చు♦ధృతికీర్తనము
    న్నతిజేయు గాలగత్యవ
    గతి గలిగిన గలుగు ధృతివి♦కారవిదూరా!

(భారతము)