బాల నీతి/భూతదయ

వికీసోర్స్ నుండి

వాసమువిడనాడి సజ్జనసహవాసముజేసి సుఖముల గూంచుచుండుము.

క. సత్యక్షమాదమంబులు
    నిత్యపదంబునకు నెక్కు♦నిచ్చెన లవి సం
    గత్యనుగతములు నత్సాం
    గత్యం బమెగాన ముఖ్య♦కార్యముసుండీ.

(భారతము)

భూతదయ.


ప్రాబలయందు గనికరముగానుండుట. లేక వానిని బాధ బెట్టకుండ నుండుటయే భూతదయ యనబడు.

పైవిధమున నుండినవారలు కీర్తనీయులు. తదిత రులు నిర్దయులు. కాన దూషణీయులు. కావున నీలోకమున నుండుప్రతిపూరుషుడును దయదాల్చి యుండవలెను. "అహింసాపరమోధర్మ:" అనగా "నరుడితగుల బాధపెట్టకుండ నుండిటయే సర్వోత్కృష్టధర్మ మని నయశాస్త్రము నొక్కి చెప్పు చున్నది. ఇటుల జెప్పుచుండినను దీనిని లక్ష్యము చేయక కొందఱు దుర్మార్గు లితరుల బలు తెఱంగుల హింసించుచునే యున్నారు. నిర్దయ యనునది దుష్ట చిత్తునే వరించుచున్నది. నిర్దయగలిగిన యీకుమతి యితరులను హింసించు ట కించుకయు శంకింపడు. కత్తి గొంతులనఱకుటకు సందేహించునా? ఇక దయయనునది సచ్చిత్తునే వరించుచున్నది. ఈసత్పురుషుడు పరులను హింసించుటకు లాతిగా నసహ్యించుకొనుచుండును. మేలిమిబంగార మితరులను హింసించనియటులనే! కాబట్టి దుర్మార్గుడే నిర్దల్యదాల్చి యితరులను హింసించుననియు, సన్మార్గుడిపనికి జొరుబడడనియు గుర్తెఱుగుడు. పండితుడైనను క్రూరుడై యితరుల హింసించుచున్న వారిని నాపనినుండి యధాశక్తి దొలగింప బ్రయత్నముజేయవలెను. అట్టి ప్రయత్నము జేయనిచో బాపభూసిష్ఠంబదు హింస నొనరించినవారి కే గతియో యాదుర్గతియే వీరికిగూడ గలుగును. కాన మనము చూచుచుండగా నెవరైన నితరులను హింసించుచుండిన యెడల వారిని నాపనినుండి తప్పింపవలయును. ఏనుగుయొక్క యడుగున సకల జంతువులయొక్క పాదము లిమిడినటుల నీయహింస యను ధర్మములో సమస్తధర్మము లిమిడియున్నవి. కాన మజులకిది యమష్ఠేయంబె.

కొందఱుకుమతులు బలాబివృద్దికై యాజాది మృగములజంపి వానిమాంసమును మిక్కిలి మక్కువతో మెక్కుచుందురు. ఇది కడునన్య్హాయము. ఏలయన? మనబలాభివేద్దికై వానిమాంసమును మెక్కుచుంటిమని కుతుకం బందుచున్నాముకాని నోరులేని యాపశువుల విషయమై వొచారించక పోతిమి. వానిని జంపుట కీశుమశు లుద్యమించిన పుడు వానిమన ము లెటులుండవచ్చును? ఈహంతకుల నెంత దూఱు చుండును? ఎంతదు:ఖించు చుండును? తెలియునా? తెలియనియెడల నీదృష్టాంతమున దెలిసికొనుడు. మన మితరుల వలన నొక పేము బెత్తపు దెబ్బెబడితిమని యనుకొనుడు. ఆదెబ్బ మనముపడిన సమయము నందు గొట్టినవారిని దూషించక విడుచుచుంటిమా? ఆ బెత్తపు దెబ్బలవలనబడిన దద్దురుగాంచి "అబ్బా! అమ్మా! " యని యేడ్చుచుంటిమే? మఱియు మనల గొట్టినవారిని మనముందుంచుకొని మగుడదన్నక యూరక పోనిచ్చెదమా? పోనియ్యము. మనమీకొంచెపు దెబ్బకే యీవిధమున నుండినపుడు నోరులేని యాపశువులు హింసపడుచు దమ్ముజంపెడి వారల నేమియు జేయజాలక స్వకీయ ప్రానముల గోల్పోవుతఱి వానిమనము లెట్లుండ వచ్చునో? వాని బాద యెంతపరిమితికలదో? యించుక యాలోచించుడు. మనము బలాభివృద్ది జేయవలయు ననిన శాకాధులు లేవా? ఘృతాదులను బుచ్చుకొనవచ్చును. మనమా పశువుల జంపినయెడల నొకవిధమగునష్టము మనకె కలుగుచున్నది. అదేదన? ఏసమయమునం దీపశువులజంపుచున్నామో యత్తఱి జలినాపెడి కంబళుగాని బలాభివృద్ది జేసెడి నెయ్యిమొదలగునవి కాని వ్యవసాయాభివృద్ది నొనరిచు పెంటలు కాని లభ్ణింపనేరవు. ప్రతిమనుజుడును తనవలెనే ప్రతిజీవుని ప్రతివిషయమందును సమానముగాజూచుకొనవలెను. అనగా "దనతల్లివలె నితరులభార్యలయందును, పరుల ధనముల బెంకుముక్కలుగాను, తనవలె సమస్త భూతములను నెవడు చూచుచున్నాడో వాడే పండితు" డని నీతిశాస్త్రముద్ఘోషించుచున్నది. కాన మనమితరుల వలన బాధబొందినపుడు మనకెంత యసహ్యముగా నుండునో యటులనే యితరులకుగూడ నంత కష్టముగానుండునని తెలిసికొనుడు. మఱికొందఱు కుచరితులు లేనిపోని దేవతలపేరుబెట్టి యామృగముల గొట్టి యాక్షుద్రదేవతలముందఱ బెట్టి నివేదనము బెట్టినట్టుజేసి తిరిగి ప్రసాదమని స్వీకరించి వాని మాంసమును దిట్టముగా దిని పొట్టనింపుకొనెదరు. ఇది యేమో మహాభక్తియని వీరియభిప్రాయము. కాని యది రిత్తయనినమ్ముడు మఱియు వారికి బాపముకూడ గలదని తెలిసికొనుడు.

ఈ జీవహింస కొన్నిసమయములందు దోషము కలదికాదని పందితప్రకాండులుపలికిరి. ఆసమయ ములేవియనిన? శ్రుతిస్మృత్యుక్త యజ్ఞాదిక్రవువు లందు మాత్రము విధివిహితముగా జీవహింసజేసిన నది దోషయుతముకాదని చెప్పిరి.ఈయాధారము వలన బ్రతిదేవతాకార్యమునందు జీవహింస చేయ వచ్చునని తలచెదరేమో? అటులదలచుటకు వీలు లేదు. ఆ యజ్ఞము శారీర శాస్త్రజ్ఞల నిమిత్తమై యేర్పఱుపబడినది. మఱియు సలిలము బుచ్చు కొనునపుడు, కట్టెలగాల్చు నపు డు భూమిని దున్నునపుడు, నింకనిట్టి సమయము లందు జీవహింస జరుగుచుండును.అట్టిసమయము లయందు మనమేమియు జేయజాలము. కాబట్టి పైన దెలిపిన సమయములందు మనమేమియు జేయ జాలము. కాబట్టి పైనదెలిపిన సమయములదు దప్ప దక్కినసమయములందు బ్రాణులను హింసించిన యెడల వారు దొషబీషణమూర్తియగు గృతాంతుని లోకమ్న వచించరాని పలువిధములగు బాధలను నిక్కముగా బొందుదురు. ఇందుకు డెందమందున సందియమావంతయు నందవలసిన యవసరము లేదు. మనహింసనుజేయునరొత్తములను గౌరవింప వలెను. అహింస దామొనరించి యితరులకు బోధించిన వారు శాశ్వతంబును, జన్మరహితంబును. నానంద దాయకమును, నగు పదవినిబొంద గలరు. అట్టివారు లోకపూజ్యులు కాగలరు. అటుల లోకపూజ్యతనందిన వారలలో నొకనిని జూపించు చున్నాను.

బుద్ధుడను మహానుభావుడు సకలజనులజ్ఞా నాంధకారమునబడి గ్రుడ్దివారై తన్నుకొనులాడుచుండ వారికి దగిన యుపదేశములొనరించి హింసాభూయిష్ట ములగు కార్యములనుండిత్రిప్పి "అహింసా మరమోధర్మ" అనువాక్యములోనగు వానినిజెప్పి జ్ఞానమను వెలుగునకు దీసికొనివచ్చి యానందము కలవారినిగా జేసెను. తానహింసనాచరించి యితరులచే జేయించువాడు మహనీయుడుకదా, కాబట్టియె యీబుద్ధుడు బోధించినబోధనలన్నిటిని జనులు విని యతడు సన్మార్గ గామి యౌటచే నాతనిమార్గ మవలంబించిరి. ఆజనుల చేత నీబుద్ధుడు విశేషముగా గౌరవింప బడుచున్నాడు.

కాబట్టి యహింసజేయువాడు పూజ్యుడనబరగు. చెప్పువారలు చాలమందియుందురుగాని యాచరించు వారలు కడునరుదు. దూరమందుండి బావిలొ"దూకు దూకు" మనువారలుందురుకాని తాము ముందు దూకి యటుపిమ్మట ననువారలుండరుకదా. కాబట్టి మన మహింసనుజేయుచు నితరుల కదిబోధించ వలెను.నరుడు జన్మమెత్తినతరువాత గరుణ్యము లేక యుండగూడదు.మనమితరుల బాధదోలగించిన యెడల మబాధల భగవంతుడు తొలగించుచుండును. సజ్జనులు ప్రతిఫలముకోరకయే యితరులసిలుగుల బాపుచుందురు. ఎక్కువగా శరీరమంతట జెమటలు పోసి నపుడు కమ్మతెమ్మిరలు చల్లగా నాచెమటలారి పోవునటుల వీచుచుండును. అట్లు వీచుచున్నగాలికి మనమేమిప్రతిఫలము జూపించుచున్నాము? ఏమియులేదుకదా. ఇక గొందఱు దుర్మతులు ఫలమును గోరకయే యితరులకేదోవిధమున హింస గలిగించుచుందురు. ఇంగల మించుకయుగొంకక జనుల నదనముల భగ్గుభగ్గుమని కాల్చుటలేదా? ఆయగ్నికి నిటులగాల్చుటవలన నేమిలాభమో తెలియరాకున్నది.కాబట్టి వారివారినైజమని తెలిసి కొనవలసియున్నది. సజ్జనులు వీరువరనియనక వారికి దమనహాయముగా వలసియున్నయెడల దగ్గఱ జేర్చి సాయముజేసి వారిపీడపోగొట్టుచుందురు. మామిడిచెట్లు చిలుకలను, గోకి లలను, రానిచ్చి తదితరములగు కాకులు మొదలగు వానినిరానియ్యకపోవుట మనము చూచితిమా? చూడలేదుకదా! కాన మనలంగోరకపోయినను నితరుల బాధపడుచుండినటుల మనముకాంచినతోడనే దయతో యధాశక్తి వారిబాధ తొలగు నుపాయమాలోచించి సౌఖ్య ముగలవారినిగా జేయవలెను.

వేదచోదితమగు హింసనుకూడ గొన్నిస్మృతులు నిషేధించుచున్నవి. ఆనిషేధముననుసరించియే రామానుజులువారును, ఆనందతీర్దులవారును, వారివారి మతము నవలంబించిన వారికి యజ్ఞాదుల యందుగూడ బశుహింసలేకుండ శాసించి యున్నారు. దీనినిబట్టి యహింసకన్న నుత్తమమగునయజ్ఞయా గాదులుకూడ గానరావని తెలియవలసియున్నది. వీరు యజ్ఞయగాదులందుండెడి హింసనుగూడ నిరసించుట వలన నహింసయే యుత్కృష్టధర్మమని తెల్లమగు చున్నది.

కాబట్టి యట్టియహింసను పైవిధమున బల్కినపగిది విధిసమయములందు దప్ప నహింస యనుదాని నవలంబించి యింకనితరులెవరైన హింసించుచున్నట్లుండిన వారిని నాహింసనుండి తగిన నద్భోధజేసి తప్పించి వారిచేతగూడ దీనినను ష్టిమజేయవలయును. మనము ప్రతిభూతమునందు దయగా నుండవలెను. ఇటుల మనముండుటవలన మన మనేకలాభముల బొందగలము.

ఆ.వె.దంతియడుగులోన♦దక్కినజంతుచ
       యంబునడుగులెల్ల♦నడగియుండు
       నట్ల ధర్మకోటు♦లన్నియులోనగు
       నిద్ధగుణయహింస♦కింతనిజము.

(భారతము.)

ధైర్యము.

ధైర్యమనగా నాపదలవలన వికారము నొందకుండ కార్యోత్సాహముకలిగియుండుట.

ఇది, మనోధైర్యమనియు, దేహబలముకలిగినందు వలన గలుగు ధైర్యమనియు రెండువిధములుండును. ఈధైర్యమొకకార్యము సాధించుటయందుగాని పౌరుషమునందుగాని యొకబలవంతునియాశ్రయము వలనగాని జనించుచుండును. ఈధైర్యము కలిగిన వారిని ధీరులని వచించెదరు. వీవలె కార్యసాధకులు. ఈధీరులు తాముదైవవశమున నొకానొకప్పుడు పలుకడగండ్లజిక్కినను వానినెంతమాత్రము లక్ష్యముంచక తమపనినే కొనసాగించుకొన యత్నిందుచుందురు. కాబట్టి ధీరులెప్పుడైన నెన్ని దు:ఖములుకలవారైన నవి యితరుల కగుపఱచ కుండ నుండును. ధీరులు వానలదడసినను, నెండల గ్రాగినను సరకుసేయక కార్యముసాధించుచుందురు.