Jump to content

బాల నీతి/ఆశ

వికీసోర్స్ నుండి

ఆశ.

ఆశయనగా నొకదానినిగోరుటయే.

ఈయాశయనునది ప్రతిమనుజునికి స్వాభావికముగా నున్నది. బాలురకు విద్యయందుఁ గోరికయుండును.యౌవ నవంతులకు భోగాదివిషయము లందాసక్తి యుండును. వృద్ధు లకుఁ దమపుత్త్రులయభివృద్దియం దాశయుండును. కవులకుఁ గావ్యరచనయందును, గాయకులకు సంగీతమందునను, గోరిక యుండును. రాజులకుఁ బరరాజ్యస్వీకరణమం దాస యుండు ను. విరాగులకు భగవంతునిఁజేర నపేక్షయుండును. వేయేల? ప్రతివానికి నేదోయొకదానిపై నాశయుండియే తీరు. దీనిని బోఁగొట్టుట కెవరునుజాలరు. ఇటులఁ గోరికయుండుటమంచిద నియే నాయభిప్రాయము. ఎందులకన? మన మొకఫలమును గోరనిదే యేపనినిఁ జేయజాలము. ఈయాశయే మనయభి వృద్ధిసూచకము. ఈయాశవలననే కష్టములనుండి విడుదలఁ జెందుచున్నాము. కాఁబట్టి ప్రతివాఁడాశకలిగియుండుట మం చిదేకాని తనతలకుఁదగనియాశ కలిగియుండఁగూడదు. ఈత లకుఁదగనియాశనె యత్యాశయని యనెదరు. ఇది మంచిది కాదు. ఎవఁడైనను, దనసామర్ధ్యమును గుఱ్తెఱుఁగక గొప్ప కోరికలఁగోరఁగూడదు. ఒకవేళ నటులఁ గోరినను నవి వ్యర్థ ములు కాఁగలవు. వీనినే గొంతెమ్మకోరికలనెదరు. ఇట్టి వ్య ర్ధమగునాశనే దురాశయని వచించెదరు. దీనిని నేను ముమ్మా టికి నిరసించుచున్నాను. కారణమేమన? ఈదురాశ, విషవృ క్షముతో సమానముకాఁబట్టియే!. విషవృక్షతుల్యమగు నీదు రాశను గోరినవారల కది విషఫలములనిచ్చుచుండును. వాని ని దినినవారలగతిఁ జెప్ప, వ్రాయ, నలవిగాదు.

ఈదురాశ, యొకతల్లికిఁబుట్టిన కొమరులను విడఁదీ యుచున్నది. వారలను న్యాయసభలకెక్కించుచున్నది. అంత వారిచే సొమ్మునంతయు నమ్మొనరింపఁ జేయుచున్నది. మఱి యుఁ దండ్రికొమరులకుఁ దలపట్లు పట్టించుచున్నది. జనులయై కమత్యమును ధ్వంసము సేయుచున్నది. ఇది, యది, యననేల? ఈదురాశ, సుఖములనెల్ల జిటికలోఁ బాపి యనేకకష్టముల జేయించఁ గలదు. ఈదురాశ,చేయఁ దగనిపనులఁ గూడఁజే యించఁ గలదు. ఓకవేళ మనము దురాశకులొంగి చేయఁద గనిపనులఁ జేసిన నవి మననాశనమునకె కారణములగుచుం డును. దురాశ గలిగిన వారలకుఁ దృప్తియుండదు. తృప్తిలే నివారల కొకకాసైన (పైసలో 5 వవంతు) నివ్వగూడదు. ఒక సమయమున నిచ్చినను నది బూడెదలో నాజ్యముఁబోయు టయె యగును. దురాశగలిగినవారలు, తమసామర్ధ్యముల గుఱ్తెఱుఁగక గొప్పగొప్పపనులఁ జేయ నుంకించు చుందురు. ఇటులఁ బ్రయత్నించుట "అందనిమ్రానిపండ్లకు నఱ్ఱులు జాచుటయె" యగును. దానివలన నితరులనగుబాటుకు లోన గుచుందురు. మఱియు నవమానముల కొడిఁ గట్టవలసి వచ్చును. అమూల్యములగు బాల్యయౌవనములుగడచి వార్ధ క్యమువచ్చినను నాసమాత్రమువిడనాడక యుండును. ఈ యాశకంతమేలేదు. ఇట్లంతములేనిదురాశ మనముకలిగి యుండఁగూడదు. కలిగినయెడల నిడుములఁబడఁగలము. ఇటుల దురాశవలన నిడుములఁబడినవారలు కొందఱు కల రు. వారిలో నొకనిని జెప్పుచున్నాను.

తొల్లి దుర్యోధనమహారాజు దురాశచేఁ బిన్నవార లును, దనపినతండ్రికుమారులను నగుధర్మరాజాదులకు భాగ మెగవేయఁదలఁచెను. అందులకుఁ దగినకపటోపాయముల ననేకములఁ జేసెను. అవియన్నియు వ్యర్ధములాయెను. తుదకు ధర్మాత్ములగు నాధర్మరాజాదులను జంపనెంచెను. అందునకుఁ దగినదురాలోచనము దురాత్ములతోడ నొనరించి తనతం డ్రిచే నాధర్మరాజాదులు కాశీపట్టణమునకుఁజనునటుల వారి కిఁ జెప్పించెను. తదుపరి యాదుర్యోధనుఁ డావారణావత మున ధర్మరాజాదులునివసించుటకై తననెచ్చలియగు పురో చనునిఁబిలిచి రహస్యముగా వానితో "నీవుముందుగాఁ గాశీ పట్టణమునకుఁబోయి నయనాభిరామముగా నొకలక్కయిల్లుఁ గట్టుము. మఱియు నీవుకట్టినలక్కయింటిలో వా రేమఱి కాఁపురముఁజేయుచుండుతఱి నాయింటికిఁజిచ్చు పెట్టి వారిని దగ్ధులనుగాఁజేయు" మని పంపెను. అంత నతఁడటులసేయుట కుఁజని లక్కయిల్లు సొగసుగాఁగట్టి సిద్ధముగా నుండెను. తరువాత ధర్మరాజాదులు తమపెదతండ్రిగారియానతిని శిర సావహించి గురుకురువరులయాజ్ఞగైకొని యావారణావతమ్ము నకుఁజని యాలక్కయింటిలోనె జాగరూకులై సుఖముగాఁ గాఁపురముఁజేయుచుండిరి. కొలఁదికాలమైనతరువాత నీతివి శారదుఁడగువిదురుఁడు ఖనకుఁడనునొకనిని బిలిచి నా తో "నీవు వారణావతమ్మునకుఁజని పాండవులఁజేరి పరమరహస్య ముగా నీబహుళచతుర్దశీదివసమున రాత్రియందుఁ బురోచ నుఁడనువాఁడు మీరున్నలక్కయింటికగ్గి పెట్టి మిమ్ములను దగ్ధులుగాఁజేయగలఁడు. కాన జాగ్రత్తతో నుండుడని వారికిఁ జెప్పవలసిన"దని పంపించెను. అంత నాఖనకుడటులనేచేసెను. అంతట భీముఁడానియమితదినమున రాత్రియం దాపురోచ నుఁ డాయింటికగ్గిబెట్టకమునుపె యాపురోచనాదు లాయిం టిలోనే గాఢనిద్రఁబోవుచుండెడిసమయమున నాలక్కయిం టికిఁజిచ్చుఁబెట్టి విదురునిపంపునవచ్చిన ఖనకునికిఁ దమక్షేమ ముఁదెలియఁబఱచి తనయన్నను, దమ్ములను, దల్లిని, దనపై నిడికొని యొకబిలమునుసొచ్చి యొకచో సుఖముగాఁ జేరెను.

చూచితిరా! ఆదుర్యోధనుఁడు దురాశచేతఁ బిన్నవార అగుపినతండ్రి కుమారుల భాగమున కెగనామముఁ బెట్టఁద లఁ చెనుగదా! తుదకు వారినిఁ జంపఁదలఁ చెనుగదా! దాని కిఁ దగినయుపాయ మాలోచించి పురోచనునిచే లక్కయిల్లుఁ గట్టించి వారిని నాశనమును జేయుమని యాపురోచనుని కు పదేశమొనరించి పంపించెనుగదా. ఆతడావిధమునఁ చేయుస మయమును వేచుచుండ నింతలో భీముఁడు తెలిసికొని యాపు రోచనుఁడు పెట్టకమునుపె తానగ్గి నాయింటికంటించి వారి ని దగ్ధులనుగా నొనరించి మాతృసోదరస మేతముగా సుఖ ముగా నొకచోఁ జేరెనుగదా. ప్రస్తుతము దురాశవలనఁ జెడినదెవరు? దుర్యోధనుఁడేకదా. ఈతఁడుతన్నుఁ గట్ట ద్రా ళ్ళు తానెతెచ్చుకొనెనుకదా. వీని కీదురాశయెలేనియెడల బాగుపడునుగదా. కాఁబట్టి దురాశఁ గలిగినవారలు దు:ఖ భాగులగుదురు. కావున మనము దురాశవిడనాడి తగినయాశ కలిగియుండి సత్కార్యములఁ జేయుచుందము.


క. అది సర్వదోషముల కా
    స్పద మది దురితక్రియాను♦బంధంబులకున్
    మొదలు నిరంతర దు:ఖ
    ప్రదమని మదిఁదలఁచి తృష్ణఁ♦బాతురు సుమతుల్
                                                          (భారతము)




అహంకారము.



నేనేశ్రేష్ఠుఁడననుబుద్ధిని జనింపఁ జేయునదియహంకా రమనఁబడు.

ఇది, తన మాట కెదురు మాటాడక యుండునపుడును, లోకము తాఁజెప్పుదానినె విశ్వసించి యాచరించుసమయము నందునను, మఱియు నొక విషయమునఁ దానధికుఁ డని జను లచేఁ బొగడ్తనుజెందినపుడును జనించుచుండును.