Jump to content

బాల నీతి/అసూయ

వికీసోర్స్ నుండి
82

బా ల నీ తి.

క్కువగా నతడు చెప్పుదానియందున బ్రవేశించకూ డదు. ఈ విషయము జ్ఞాపకముంచుకొనుడు.

క.ఇచ్చకము భువిని వశ్యము
   కుచ్చితమీలోకనింద♦కోవిదునకు నీ
   తుచ్చమున హాని వచ్చును
   మచ్చరమే తన్ను జెఱచు♦మహిలోనేమా!.

అ సూ య.

   ఓర్వలేనితన మసూయ యనబడు.
మనుజున కీయసూయయుండిన నభివృద్దికి రానేరడు. జనసుతులైన నీయసూయనుగలిగి యున్నయెడల వారు నిందాపాత్రులు కాగలరు. తనతొసమానమైన వారల కొంచముచ్చదశకుబోయిన యెడల వారిని గాంచి లోలోపల గుందుచు సమయమునువేచి వంచింప జూచుచుందురు. ఇట్టి యసహనము కలిగినవారలన సహిష్టులని యనెదరు. ఒకడు మంచిని జేయుటయె లేక వాడు ప్రజలచే సంస్తుతినిబొందుచుండుటయొకాంచియశక్తి దుర్జనులై యింటిలోపల నొకమూలన గూర్చుండి పరితాపము జెందువారు కొందరసహిష్టులుకలరు. అటులవృద్ది బొందినవానిని బాహాటముగా నసహిష్టు తాలాపముల నాడుచుండెడివారు మఱికొందఱు గలరు.

83

బా ల నీ తి.

     యోగ్యులగు ధనికులు కొందఱొకమంచివిద్వాంసు ని సన్మానించి యాయనకు బహుమానము లొస గుట కుద్యమించుచుండ నాసంగతి నీయనహిష్టు లెఱిగిన వెంటనే యాతని గౌరవించువారల వద్దకువెళ్ళి ముందు దాజెప్పుమాటలవారు నినను వినకపోయినను రహస్యముగా మెల్లగా" నాపండితుడు యోగ్యుడుకాడు కాన గౌరవపాత్రుడుకాడ" ను మొదలగు నసత్యాంశముల జేకొని స్వకీయధనముపోయినటుల కర్ణమంత్రముల నుపదేశించుచుందురు. కాని యీయన నహిష్టువాక్యములు యోగ్యులకవాచ్యము లుగా కన్పట్టును. 
     ఒకకవి లోకోత్తరసత్కవియై యాబాలవృద్దులచే గొనియాడ బడుచు రసవత్తరములగు దనపొత్తముల మొత్తముల జనుల చిత్తముల రంజింపజేయుచు లోకోపకారియై యెనగుచుండ గొంద ఱసూయాక్రాంత చేతస్కులై దురబిమానముచే నాకవీశ్వరుని బ్రకటనముగా దూలనాడుచు నెవ్విధముననైన నాకవీశ్వరునియశ నడుగంటుటకు బ్రయత్న మొనరించుచు గృతార్దులమని తలంచు చుందురు. నీనినిదగినటుల దండించిన వారలు లోకపూజ్యులని చెప్పవచ్చు.
ఈయేర్వలేని వారందఱు మంచిజట్టుల గట్టి తిరుగుచుండినను మంచిమంచి యుపాయములతో నన్నమును వలపక్షముగా దినుచుండి నను, జనులందఱు సంతసమదువటుల బ్రాజ్యంబగు రాజ్యంబును బరిపాలించు చుండినను
84

బా ల నీ తి.

లేక సద్గుణములవలనగాని పాండితులవలనగాని, దానమువలనగాని, వన్నెకెక్కుచుండిన నాయన హిష్ణువులు చూడజాలక వారికిదగినటుల నెగ్గుల ఘటించుచు దుదకు వారిని దీనులుగాజేయుట కుంకించుచుందురు.

 పైజెప్పినవిషయములందెకాక ప్రతి విషయమందు నను దనకంటె నితరు డభివృద్ధిగానున్నాడనిన వానివృద్ధి నంతరింపజేయుటకు వీరు యత్నించు చుందురు. "ఒకరికి నున్నదని యేడ్వ నొకకన్ను, తనకు లేదని యేడ్వ నొంకొకకన్ను పోయినదను సామెత నిక్కమగుచున్నది. ఎందువలననన? ఈ యోర్వలేని వారు తమగతి ముందెటులగాగలదో దానిని విచారించకుందురు. కాబట్టి విచారించిన వారీయమా యక లిగియుండరని చెప్పగలను. అమాయకకలిగిన వారలు సర్వసుఖములవీడి యప్రతిష్టతో నవసానదశకు రాగలరు. 
  ఇట్లసూయభావముకలిగియట్టి  యధోగతికివచ్చిన  వారలు పూర్వులలో గొంతమందిగలరు. వారిలో నొకనిజెప్పెద.
తనయనుజులు నలుగురు చేదొడువాదోడుగానుండ ధర్మరాజుచేయు రాజసూయాద్వరమబునకు దుర్యొధనుడరిగెను. అంత నతడా మహాద్వరంబు ముగిసిన పిమ్మట మయునిచే నివ్వబడిన సభజూచి యందలి చిత్రములుగాంచి యబ్బురపడెను. అంత నామహారాజాసభావిభవంబును, నారజమాయాధ్వర మహోత్సవంబును, గన్నులారజూడలేక పాండవుల వీడ్కొని నిజరాజదానియగు హస్తినాపురంబున

85

బా ల నీ తి.

(ఢిల్లీ)కు జని కుందుచు నిద్రాహారముల విడనాడి కృశించుచుండెను. అంత నాతని యాంతరంగిక మిత్రుడును, మేనమామయునగు శకుని తనయల్లుని జూచి "సుయోధనా! నీవేల యిటుల గృశించుచు న్నావు? కారణము దెల్పుమనియడిగెను. అంత నారాజరాజు "మామా! ఆధర్మరాజుసభావిభవంబును, నధ్వరముయొక్క తుదిదినమున నతడధ్వర్యులకు దక్షిణలొసంగి సత్కరించినపిమ్మట,ధర్మజ్ఞలగు ధౌమ్యాదులా సభయం దాయుధిష్టరుని నవరత్నఖచిత సింహాసననాసీనుగావించి వివిధ దేశాగతరాజు లాయజాత శత్రునకు దెచ్చినరత్నములు, మణులు, ఏనుగులు,గుఱ్ఱములు, కాల్బలము, మొదలగుగొప్ప గొప్పకానుకల నాయారాజులచే సమర్పింపజేయుచు జనులందఱు జయజయధ్వనులు సేయుచుండం రారాట్టనుపేరుతో నుండిననేను జూచుచుండ బట్టాభిషిక్తుని జేసిరి. అహా! ఏమివానివైభవము, మఱియు నతడు నన్ను రత్నపరిగ్రహణమందుని చెను. ఆధర్మరాజుయొక్క సదనము రత్నాకరమన జెల్లు.ఆవైభవమంతయు నేగనులార జూడలేక వీనులార వినలేక నిక్కముగా నిటులగృశించుచు న్నాను. అతనిసంపదనంతయు నేంబొందినపుడు సుఖముగా నుండగలను. కాన దీనికిదగిన యుపాయమాలోచించుమని పలికెను. అంత నాశకుని విచారించి తనయల్లునితో "వారిసంపదంతయు బొందుటకు మాయాద్యూతమె సాధనము. కాని దీనికి మీతండ్రి సమ్మతింప వలయు"
86

బా ల నీ తి.

నని పలికెను. అంతట దుర్యోధనుడు తనమామతో దండ్రియగుధృతరాష్ట్రునిపాలికిబోయి నమస్కరించి రాజసూయ సభావైభవంబుల దెలియబఱచి తనయసహనముగూడ బ్రచురపఱచి ద్యూతమాడుట కనుజ్ఞనిమ్మని కోరెను. అంత నాయంబికేయుడు కుమారా! నీతివిశారదుండగు విదురుడు సమ్మతించిన నేనంగీకరించెద.,ననియెను. అంతనాదుర్యొధనుడు "నాయనా! ఆవిదురుడు పాండవపక్షపాతిగాన సమ్మతింపడు. గనుక మీరానతిచ్చిననాతడంగీకరించి నట్లే" యని పలుభంగుల భాధపెట్ట నెట్టకేలకు గాధారీ పతి వల్లెయని వారిని వీడ్కొలిపెను. అంత నాయాంబికే యుడు విదురిని బిలిపించి తనకొమరుని మనోరధ మును దెలియపఱచెను. అంతటడాద్యూతము కులక్షయకారి" యని చెప్పెను. అంతట నా ధృతరాష్ట్రుడు మగుడ తనసుతునిబిలిచి "సుతుడా! నీవును రాజసూయంబుజేసి వాసిగాంచుము.నీకు ననేకరాజులు గొప్పకానుకలు తీసికొనిరాగలరు. వారిసంపదజూచి యేర్వలేనితనమును విడనాడుము. మాయాద్యూతము మానుకొనుమని యనెకరీతుల నీతులబొధించెను. కానియాదురోధనుడు పెడచెవిని బెట్టెను. అంత నాధృతరాష్ట్రుడు పుత్త్రప్రేరితుడై విదుని చేధర్మరాజుబిలిపించి తనకుమారునిబిలిచి "యిక నీయిష్టమువచ్చినట్టుసేయు" మనిపలికను. అంత నాదుర్యొధనుడు తనకుమారుగా శకునిని బలవంతముగా ధర్మరాజును, నరవరగురుపర నికర పరీ

87

బా ల నీ తి.

వృతంబగు నాసభయందున జూదమాడుటకు బ్రారంభముగలవారినిగా నొనరించెను. ఆయన ధర్మరాజోడువడునట్లుగావించెను. ఆధర్మరాజుయొక్క విత్తము నపహరించి కాననమునకు సతీసోదర సమేత ముగా బంపించి కృతార్దుడనైతి" నని యానంద మందుచుండెను.ఇంతలో నాధర్మరాజూదులు తిరిగివచ్చి భండనమున నూఱుగురు తమ్ములతొ గూడ నాసుయోధనుని బరలొకగతునిగా నొనరించిరి.

 విలోకించితిరా! ఆదుర్యొధను డాధర్మరాజుచేయు రాజసూయంబును, జూచి సహనముగా నుండిన నిట్టి యిక్కట్టుల కాటపట్టుకాగలడా? కాడు. వానియందోర్వ లేని తనముండుటంబట్టియే యిప్పటికిమనవార లాదుర్యోధను ననహిఅష్ణువుగా లెక్కించుచుందురు. కాన మనమసూయకలిగి యనహిష్ణులమని యనిపిముకొనక యుండి సర్వసుఖముల బొందుటకు యత్నించుచుందము.

ఆ.వె. ఓర్వమిద్రునై న♦నూరక కష్టాల
        పాలుజేసి మిగుల♦బాధపఱచు
       గాన దాని మనము♦గైకొనంగనురాదు
       మిత్త్రులార!సచ్చ♦రిత్రుభార.!