బాల నీతి/ఆంధ్రభాష
149
బా ల నీ తి.
ర్గ్రంధముల రచించి నద్యకమార్జించుట కెక్కువగా బ్రయత్నింతము.
ఆ.వె. ఎల్లభాషలకును♦దల్లి యిల్ల యినట్టి
సంస్కృతంబు మనము♦చదువవలయు
జదివి దానిమహిమ♦జాటించవలయును
జాటి దాని వృద్ధి♦సలుపవలయును.
ఆం ధ్ర భా ష.
మన తెలుగు బాసనెయాంద్రభాషయనియెదరు.
మన తెలుగు బాసకీయాంధ్రసంజ్ఞ యెటుల గలిగినదన. మగధదేశమును బరిపాలించు, ఆంధ్ర నామకప్రభువు మనపూర్వులు నివశించుదేశమును జయించి పరిపాలించుటంబట్టి మనదేశమునకును, మనబాసకు నాంధ్రసంజ్ఞకలిగినది. అప్పటినుండి యిప్పటివరకు మనదేశమాంద్రదేశమనియు, మనబాస నాంధ్రభాషయనియు వ్యవహరించుచు న్నారు.ఈభాష స్వతంత్రభాష కాదు. ఈభాష సంస్కృతము, ప్రాకృతము, ద్రావిడము,కర్నాటమను నాలుగుబాసల తో గూడికొనియున్నది. సంస్కృత ప్రాకృతభవపద ములు తప్ప ద్రావిడ కర్ణాటటపదములన్నింటిని దేశ్యములని మనవారు వాడుచున్నారు. మనదేశమునకు వేగియను నామాంతరము క
బా ల నీ తి.
లదుగాని భాషకుగానరాదు. మనదేశమునందు మొదట కొంతకాలమువరకు సంస్కృతద్రావిడకర్ణాట భాషలు మిక్కిలి ప్రచారము కవియై యున్నవి. ఆ భాషలయందు లెక్కలేని కబ్బములు బయలువెడలినవి. గొప్పగొప్ప పండితులున్నారు. కాని మన తెలుగుబాస మిక్కిలి ప్రచారములేక పోవుటయు కాక దానియందొకపొత్తమైనను బయలువెడలక నియమరహితమై వంకరభాషయై యుండెను. దానినె జనులు మాటలాడుకొనుచుండిరి.
ఇట్టితరుణముఇన నాపస్తంబసూత్రుడును, ముర్గలతోత్రజాతుడును, వైదికశిఖామణియునగు నన్నయభట్టు జనించి యిదివఱకబివేద్ధిదశలోనున్న స్సంస్కృత పంచకావ్యంబులను, నాటకంబులను, వ్యాకరణశాస్త్రములును, చందశ్శాస్త్రంబును జక్కగా బఠించి పిమ్మట ద్రావిడభాషను బ్రాకృతభాషను బాగుగాజదివి విద్వాంసుడై లోకజ్ఞానమలవరించు కొనుచు నెగడుచుండెను. ఇటుల నెగడుచుండు నన్నయఃభట్టును 111.వ సంవ్చత్సరమున రాహ్యము సుఖముగాబరిపాలించు రాజరాజనరేంద్రుడు తన యాస్దానమునకు బిలిపించుకొని సగౌరవముగా నిటుల బల్కెను. "పండితవరా!నేనుభారతంబును ఇనుట కెక్కువయిష్టపడుచున్నాను. కాన నీవు సంస్కృతముననుండు భారతమును సలక్షణముగా నాంధ్రీకరించి నన్ను గృతర్దుజేయు" మని ప్రార్దించెను. అంతనన్నయభట్టు తానదివఱకె సంస్కృత ద్రావిడ కర్ణాటభాషాపండితుడై నందువలన నామ 153
బా ల నీ తి.
షయమీమహాకవికి దెలిసిన ట్లింకొకరికి దెలియదు. కాబట్టియె యీకవి మహాపండితులచే గవిబ్రహ్మ" యని గౌరాలాంచనము నందగలిగెను. ఈకవి నియోగియైనను వేదాధ్యయనసంపన్నుండయి యజ్ఞమొనరించినవాడు. ఈకవి సమకాలికుడగు కేతనచే దశకుమారచరిత ము ను గృతినందెను. ఈమహాకవివలన భారతము సంపూర్ణముగ నాంధ్రీకృతమయ్యెను. కాని కొలదికాలమై న తరువాత నాదికవిచేరచింపబడిన భారతారణ్య పర్వమున గొంతశిధిలమైపోయినది. అందువలన బూర్తికాలేద్.
ఈతిక్కనకు దరువాత హూ ళ 14వ శతాబ్దమందు న "నెఱ్ఱాప్రగడ"యను మహాకవి శిధిలమైన యాయరణ్యపర్వశేషమును నన్నయకృతముగానె పూర్తిజేసెను. ఈకవి నియోగి. ఈతనితల్లి పోతమ్మ, తండ్రిసూరన్న, ఈతనిది శ్రీవత్సగోత్రము, ఇతడు సంస్కృతాంద్ర పండితుడు. ఈతని కవిత్వము నన్నయతిక్కనల కవనమువలె నుండును. ఈతదు శివభక్తుడగుటవలన శంభుదాసు డనియు బ్రబంధశైలిని భారతమున నరణ్యపర్వశేష మును బూర్తిజేసెను. కానబ్రబందపరమేశరుడనియు నామాంతరములు కలవాడు. ఈకవి,హరివంశము, రామాయణము, నృసింహపురాణమును నాంధ్రీకరించె ను. ఈమూడు నృసింహపురాణ మహొబలస్వామి కంకితముసేసియున్నవాడు. శ్రీమదాంధ్రభారత మీ మువ్వురు రచించుటంబట్టి వీరికి గవిత్రయమని పేరిడిరి. బా ల నీ తి.
యాంధ్రీకరనము. "మక్కికిమక్కి" గాలేదు. కాని చక్కగా సంస్కృతభారతానుసారముగానున్నది. మనకీ మువ్వురెయాంధ్రబాషయందు బ్రబలప్రామాణికులు. వీరి ప్రయోగములె మనకు శరణ్యములు. మన తెలుగు బాసలోనికి భారతము మొదటి పొత్తము. ఈ బారతము లో సమానమగుగ్రంధమింతవఱకు బుట్టలేదు. సద్గుణ నికరోపేతంబగు నీకవిత్రయంబును, సులక్షణలక్షితంబు గు నీభరతంబును, నటులుంచి యీయాంధ్రభాష యందున నుండుముఖ్యకవులను గైకొని యింకను దెలుగును గుఱించి తెలిసి కొందము.
ఈపదునాలుగవ శతాబ్దమందె హుళక్కిభాస్కర మహాకవియుండెను. అతడు వాల్మీకికృతరామాయణ మును దెనిగించెను. ఈతడిరామాయణమందున నారణ్యకాండమును యుద్ధకాండలో గొంతభాగమును, మాత్రమురచించెను. తక్కినభాగములో బాల,కిష్కిందా, సుందరకాండములను దత్పుత్త్రుడగు మల్లికార్జునబట్టును, అయొద్యాకాండములోని తుది భాగమును నతనిమిత్త్రుడగు నయ్యలార్యుడును వ్రాసిరి. ఈమువ్వురు, తామురచించినను మొదట బ్రారంబించి కొంతవఱకు జేసిన యాహుళక్కి భాస్కరునె గ్రంధకర్తగానేర్పాటుజేసిరి. కాబట్టియె దానికి బాస్కరరామాయణమని పేరువచ్చినది. ఈతని కవిత్వమతి పటువై యానందము నింపుచుండును. 155
బా ల నీ తి.
ఈ 14వ శతాబ్దమందెభారద్వాజసగోత్రజుడును, నాపస్తంబమాత్రుడును, మారయ్యపుత్తురుడును నగుశ్రీనాధుడు మహాకవియై మరుత్తరాజ చరిత్రము, పండితారాజ్యచరిత్రము, శాలివాహన సప్తశతి, నైషధము, భీమపురాణము, కాశీఖండము, వీధినాట కము, హరవిలాసము, పల్నాటివీరచరిత్రమను ద్విపద కావ్యమును మున్నగుగ్రంధములను రచించి యాంధ్రభాషా పోషితుడాయెను. ఈకవికవిత్వము నిర్దుష్టమై సంస్కృతపద వ్యావృతమై దీర్ఘసమాసములు కలదై యనేకాలంకరమణీయమై రమ్యముగానుండును.ఈకవికి సమకాలికుడును, బావమఱదియునగు బమ్మెరపోతన కౌండిన్యగొత్రజ కేతనపుత్త్రుడై మహా కవియైయుండెను. ఈకవి సంస్కృతభాగవతమును రెనిగించెను. ఈతనికవనము శబ్దలంకార విరాజితమైన పదలాలిత్యము కలదియై భక్తిరస ప్రధానమై యొప్పు చుండును. ఇతదు భగవంతునియందవ్యాజ భక్తి కలవాడు. ఈకవి వీరభధ్రవిజయమను మఱియొక గ్రంధమును రచించెను. ఈకవి తాను రచించిన గ్రంధమును శ్రీరామస్వామికంకితముజేసెను. ఈభాగవతమును గారణాంతరమున గొన్నిభారములుత్పన్నములై పోయెను. ఆభాగములను గంగన, సింగన, నారయ యనువారలు పూరితిజేసిరి. ఈబాగవతగ్రంధము నందక్కడక్కడ రేఫశకటరెఫములకు బ్రాసాద్లు చెల్లించుటవలన బూర్వలాక్షణికులు దీనిని లక్షణగ్రంధముగా బరిగణించరైరి.
బా ల నీ తి.
ఇతనికి దరువాత 15వ శతాబ్దమందున చొక్కన కుమారుడును, నియొగిబ్రాహ్మణుడును నగు నల్లసానిపెద్దన శ్రీకృష్ణదేవరాయాస్దాన ప్రధానపండితుడై హరికధాసారము, స్వారొచిషమను చరిత్రములను రచించెను. ఈకవి రచించినవానిలోనికి మనుచరిత్రమె మిక్కిలి వన్నెకెక్కినది. ఈతనిబూర్వమందున్న కవులు సంస్కృతకోశముల నాంధ్రీకరించుటయె కాని విపులీకరణముగా నొకగ్రందమైనరచించియుండలేదు. కాని యితడు మార్కండేయ పురానమునుండి కధను గైకొనిపెంచి మనుచరిత్రప్రబంధమును రచించెను. కాబట్టియె యాంధ్రకవితా పితామహుడని బిరుదము నందెను. ఈకవి కవనము శ్రొత్రనీయమై శృంగారాది రససమన్వితమై యుండును.
ఇతనికి సమకాలికుడగు పింగళిసూరన యుభయ భాషాకొవిదచూడామణియై రాఘవపాండవీయమును, గళాపూర్ణోదయమును, గరుడపురాణమును, ప్రభావతీ ప్రధ్యుమ్నమునింకను గొన్ని గ్రంధముల రచిచించెను.ఈతనిరాఘవపాండవీయము శ్లేషకావ్యమైనను గ్లీష్మార్దములు లేక సులబశైలిలొ బహురసపరముగా నుండును.ఈకవికించుమించు సమకాలికుడగు రామరాజ భూషణుడు వసుచరిత్రయను శ్లేషకావ్యమును మనుచరిత్ర ననుసరించి తిరుమలదేవరాయలను గృతినాయకునిగా నొనరించి రచించెను. ఈయన కవన మర్దగంభీర్యముకలదై యమకా
157
బా ల నీ తి.
ష్యాలంకారభూషితమైకల్పనాచమత్కారము కలదియై యొప్పుచుండును.
ఇతనితరువాత 17వ శరాబ్దమందున గంగనసుతు
డున్, నియొగిబ్రాహ్మణుడును నగుకూచిమంచి తిమ్మ కవి రాజశేఖరచరిత్రమును, కలభళ్లాణచరిత్రను, రుక్మిణీ పరిణయము, సింహాచలమహత్మ్యంబును, సర్వలక్షణ సారసంగ్రహంబును, *నీలాసుదరీ పరిణయము* అచ్చ తెలుగు రామాయణము(*ఈరెండును శుద్ధాంధ్రములు) సారంగధరచరిత్రము, సాగరసంగమహాత్మ్యంబును, సర్పపురమహాత్మ్యంబును,రసికజనమనోభిరామమునుశివలీలావిలాసము మొదలగు గ్రంధములను రచించెను. అంతదానభినవవాగనశాసనుడని బిరుదము నందెను. ఉభయబాషలయందీతని కవనము మృదుమధురశైలిలోనుండి వినువారికిని, జరుపువారికిని నానందము గూర్చుచుండును.
ఇతనితరువాత 18వ శతాబ్దమందున్న నృసింహా చార్యతనూభవుందును, నైధ్రువకాశ్యసాన్వయుండు ను నగు మాడభూషి వేంకటాచార్యులు సంస్కృతాంధ్ర భాషలయందు సమానపందితుడై నూజివీడుసంస్ధాన పండితుడుగా బహుకాలముండెను. ఈతడు శాతావధానాష్టావధానవిధానములందుగడునేర్పరి. ఇతడు నాలుగాశ్వాసములుగల భరతాభ్యుదయ కావ్యమొకటి రచించెను. ఈతనికవనము సలక్షణమై బా ల నీ తి.
మనోజ్ఞముగానుండెను. ఈతడభినవ "పండితరాయ" యని బిరుదమునంది యున్నవాడు.
ఇతనితరువాత వైదికబ్రాహ్మణుడును, లక్ష్మీపుర గ్రామమవాసియగు గోపీనాధము వేంకటకవి వేంకటగిరి సంస్ధానమందాస్ధానకవివరుడై వాల్మీకి రచితరామాయణ మును, మాఘకవికృత శిశుపాలవధ మహాకావ్యంబును, బ్రహ్మకైవర్తపురాణస్ధ కృష్ణజన్మఖం డమును, భగవదీతను నాంద్రీకరించెను.అంతట నాసంస్ధానాధీశు లీతనికవనమునకు మెచ్చి యగ్రహార మొసంగిరి. ఈతనికవనము పండితపామరబోధకంబగు మనోహరశైలికలదై లలితముగా నుండును.
ఈతెలుగు బాసయందు సుప్రసిద్ధకవులింకను చాల మందికలరు. కాని గ్రంధవిస్త్గరభీతిచే వారినివిడిచిపెట్టి వ్రాసితిని.
మనపూర్వకవులకు బద్యకవనమునమందు న్నంత ప్రేమ గద్యకవనమందు గన్పడదు. కాని యిటీవలబాలకావ్యాకరణప్రణేతయగు పరవస్తు చిన్నయసూరి మనోహరశైలిని వచనరచనజేసెను. ఈతనినీతిచంద్రిక కడుసొగసుగా నుండును. ఇతనిబాల వ్యాకరణమాధునికకవులకు గొందఱ కుపకారమొనర్చుచున్నది. ఈచిన్నయసూరని వచన రచన చతురుడని పలుకనగు.ఇటుల హృద్యంబగు నీతెనుగుబాసను మనమెక్కువగా గౌరవించవలెను. మనమాతృబాష యెప్పుడభివృద్దిబొం
159
బా ల నీ తి.
దునోయప్పుడె మనమబివృద్దికిరాగలము. రాజకీయభాషల మనమభ్యసించు చుండినను మన భాషవిడనాడక యభిమానముగా దానియందుండ వలెను. దానిని బూజించుట మనతల్లిని బూజించు టయె యనినమ్ముడు. మనమ మొదట తెలుగు పండితులన్ గౌరవించవలెను. వారిచే గ్రంధముల జేయించవలెను. అటుల మనబాసయభివృద్దిజేయ సమకట్టిన మనముగూడ విద్వాంసులము కాగలము. అంతటగ్రంధములరచించి కీర్తిమంతులము కాగలము.
ఇటులవృద్దిజేసి కీర్తిజెందిన వారలలో నొకరిని జెప్పద.
క్రీ.శ.11వ శతాబ్దమున రాజరాజనరేంద్రుని వేడికోలు మీద నన్నయచే సృజింపబడిన యాంద్రకవితను 15వ శతాబ్దమందున్న కృష్ణదేవరాయలుచేకొని తన యాస్ధాన మందున్న కవులచే బోషణజేయించుచు రమారమి నూటికంటె నధికముగా గ్రంధములరచింపజేసి యాగ్రంధకర్తలను సత్కరించెను. అటుపై నాశ్రీకృష్ణదేవరాయలు విద్వాంసుడై యాముక్తమాల్యదయను గ్రంధరాజమును రచించెను. తదుపరి కీర్తనీయుడాయను.చూచితిరా!ఆకృష్ణదేవరాయలు తాను మహారాజు నని యీతెలుగుబాసను నిర్లక్ష్యముచేయక చేరదీసి యాంధ్రపండితుల నెక్కువగా గౌరవించుచుండెను. అందువలనెకదా యనర్ఘంబులగు నూఱుగ్రంధములు బయలు
బా ల నీ తి.
వెడలినవి. దాననెకదా తెలుగుబాసకదియె వర్దమానదశ యని వాకొనుచుండిరి. మఱియు నామహారాజాముక్త మాల్యదయను గ్రంధరత్నమును రచించి బైలుదేఱదీ యుటవలనెనకదా యితరులకుగూడ నాంధ్రగ్రంధము లం దభిరుచి కల్గుచున్నది. ఇటులననేకవిధముల దెలుగు నబివృద్దిజేయుటవలననేకదా యాకృష్ణదేవరా యలను గీర్తించుచున్నారు. కానమందఱము మనమాతృబాషయగు తెలుగునమదభిమానము కలిగి యుండవలెను. మనమాంధ్రమును జక్కగా జదివి విద్వాంసులముకావలయును. అటుతరువాత నిస్సార మగు గ్రామ్యభాషను గ్రంధములరచించక హృదయంగ మమగు గ్రాంధికభాషయందె మంచికబ్బముల రచించి యాంధ్రలోకసన్నుతికి బాత్రులమగుటకు బ్రయత్నింతము.
క. ఆయాదేశమువారికి
నాయాదేశంబుభాష♦నమరినకావ్యం
బాయుతపురుషార్దంబుల
బాయక సమకూర్చు దేవ♦భాషయు బోలెన్
(అప్పకవీయం)
ఓం తత్సరత్
శ్రీ చివుకుల అప్పయ్యశాస్త్రి ప్రణీతంబగు
బాలనీతియను గ్రంధము సమాప్తము.
శ్రీ. శ్రీ. శ్రీ.