బాలకాండము - సర్గము 8
శ్రీమద్వాల్మీకియరామాయణే బాలకాండే అష్టమః సర్గః |౧-౮|
వాల్మీకి రామాయణము | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
|
తస్య చ ఏవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః |
సుతార్థం తప్య మానస్య న అసీత్ వంశకరః సుతః |౧-౮-౧|
ధర్మవిదుడు, మహాత్ముడు మరియు ప్రభావశాలియు అయిన ఆ దశరథ మహారాజుకు , పుత్రునికొరకై తపించు చున్నప్పటికీ, వంశోద్దారకుడైన పుత్రుడు లేకుండెను.
చిన్త్యమానస్య తస్య ఏవం బుద్ధిః ఆసీన్ మహాత్మనః |
సుతార్థం వాజిమేధేన కిం అర్థం న యజామి అహం |౧-౮-౨|
అంతట ఆ మహాత్మునకు సంతానమునకై అశ్వమేథ యాగము చేయవచ్చును కదా అను ఆలోచన వచ్చెను.
స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యం ఇతి బుద్ధిమాన్ |
మంత్రిభిః సహ ధర్మాత్మా సర్వైః అపి కృత ఆత్మభిః |౧-౮-౩|
తతోఽబ్రవీత్ మహాతేజాః సుమంత్రం మంత్రి సత్తమం |
శీఘ్రం ఆనయ మే సర్వాన్ గురూన్ తాన్ స పురోహితాన్ |౧-౮-౪|
అంతట తన మంత్రులందరితో కలసి చర్చించి అట్టి యాగము చేయ తగునని నిశ్చయించి, మంత్రి యైన సుమంత్రునితో "మా కులగురువులను, పురోహితులను శీఘ్రముగా తోడ్కొని రావలసినది" అని ఆజ్ఞాపించెను.
తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరిత విక్రమః |
సమానయత్ స తాన్ సర్వాన్ సమస్తాన్ వేద పారగాన్ |౧-౮-౫|
సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అథ కాశ్యపం |
పురోహితం వశిష్ఠం చ యే చ అపి అన్యే ద్విజోత్తమాః |౧-౮-౬|
తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా |
ఇదం ధర్మ అర్థ సహితం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్ |౧-౮-౭|
మమ లాలస్య మానస్య సుతార్థం నాస్తి వై సుఖం |
తదర్థం హయమేధేన యక్ష్హ్యామి ఇతి మతిర్ మమ |౧-౮-౮|
తత్ అహం యష్టుం ఇచ్ఛమి శాస్త్ర దృష్టేన కర్మణా |
కథం ప్రాప్స్యామి అహం కామం బుద్ధిః అత్ర విచింత్యతాం |౧-౮-౯|
తతః సాధు ఇతి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |
వశిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖేరితం |౧-౮-౧౦|
ఊచుః చ పరమ ప్రీతాః సర్వే దశరథం వచః |
సంభారాః సంభ్రియంతాం తే తురగః చ విముచ్యతాం |౧-౮-౧౧|
సరయ్వాః చ ఉత్తరే తీరే యజ్ఞ భూమిర్ విధీయతాం |
సర్వథా ప్రాప్స్యసే పుత్రాన్ అభిప్రేతాన్ చ పార్థివ |౧-౮-౧౨|
యస్య తే ధర్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగతా |
తతః తుష్టోఽభవత్ రాజా శ్రుత్వా తద్ ద్విజ భాషితం |౧-౮-౧౩|
అమాత్యాన్ అబ్రవీత్ రాజా హర్ష పర్యాకుల లోచన |
సంభారాః సంభ్రియంతాం మే గురూణాం వచనాత్ ఇహ |౧-౮-౧౪|
సమర్థ అధిష్ఠితః చ అశ్వః సః ఉపాధ్యాయో విముచ్యతాం |
సరయ్వాః చ ఉత్తరే తీరే యజ్ఞ భూమిర్ విధీయతాం |౧-౮-౧౫|
శాంతయః చ అపి వర్ధంతాం యథా కల్పం యథా విధి |
శక్యః ప్రాప్తుం అయం యజ్ఞః సర్వేణ అపి మహీక్షితా |౧-౮-౧౬|
న అపరాథో భవేత్ కష్టో యది అస్మిన్ క్రతు సత్తమే |
చ్ఛిద్రం హి మృగయంతే స్మ విద్వాంసో బ్రహ్మ రాక్షసాః |౧-౮-౧౭|
విధి హీనస్య యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి |
తద్యథా విధి పూర్వం మే క్రతురేష సమాప్యతే |౧-౮-౧౮|
తథా విధానం క్రియతాం సమర్థాః సాధనేషు ఇతి |
తథా ఇతి చ అబ్రువన్ సర్వే మంత్రిణః ప్రతిపూజితా |౧-౮-౧౯|
పార్థివేంద్రస్య తద్ వాక్యం యథా పూర్వం నిశమ్య తే |
తథా ద్విజాః తే ధర్మజ్ఞా వర్థయతో నృపోత్తమం |౧-౮-౨౦|
అనుజ్ఞాతాః తతః సర్వే పునర్ జగ్ముర్ యథా ఆగతం |
విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివాన్ ఇదం అబ్రవీత్ |౧-౮-౨౧|
ఋత్విగ్భిః ఉపసందిష్టో యథావత్ క్రతుర్ ఆప్యతాం |
ఇతి ఉక్త్వా నృప శార్దూలః సచివాన్ సముపస్థితాన్ |౧-౮-౨౨|
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహామతిః |
తతః స గత్వా తాః పత్నీర్ నరేంద్రో హృదయంగమాః |౧-౮-౨౩|
ఉవాచ దీక్షాం విశత యక్షేఽహం సుత కారణాత్ |
తాసాం తేన అతి కాంతేన వచనేన సువర్చసాం |
ముఖ పద్మాన్ అశోభంత పద్మానీవ హిమాత్యయే |౧-౮-౨౪|
ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే అష్టమః సర్గః |౧-౮|