Jump to content

బాలకాండము - సర్గము 12

వికీసోర్స్ నుండి

శ్రీమద్వాల్మీకియరామాయణే బాలకాండే ద్వాదశః సర్గః |౧-౧౨|

వాల్మీకి రామాయణము
రామాయణ కాండములు
1. బాలకాండము
2. అయోధ్యాకాండము
3. అరణ్యకాండము
4. కిష్కింధకాండము
5. సుందరకాండము
6. యుద్ధకాండము
7. ఉత్తరకాండము

తతః కాలే బహు తిథే కస్మిన్ చిత్ సుమనోహరే |

వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోఽభవత్ |౧-౧౨-౧|

ఋశ్యశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలాకాలమునకు మనోహరమైన ఒకానొక వసంత-ఋతు ప్రారంభమున(చైత్రశుధ్ధపూర్ణిమనాడు)దశరథమహారాజు అశ్వమేథయాగమును ప్రారంభిచుటకై సంకల్పించెను.(1)

తతః ప్రణమ్య శిరసా తం విప్రం దేవ వర్ణినం |

యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య చ |౧-౧౨-౨|

పిమ్మట దశరథమహారాజు దివ్యతేజశ్శాలియైన ఋశ్యశృంగమహామునికి శిరసాప్రణమిల్లి ఆయన అనుగ్రహమును పొందెను.పుత్రసంతానప్రాప్తిద్వారా వంశాభివృధ్ది కొరకై(చేయబడు)యజ్ఞమునకు ప్రధాన-ఋత్విజునిగా ఉండుటకై ఆయనను అభ్యర్థించెను.(2)

తథేఇతి చ స రాజానం ఉవాచ వసుధాధిపం |

సంభారాః సంభ్రియంతాం తే తురగశ్చ విముచ్యతాం |౧-౧౨-౩|

ఋత్విజునిగా అభ్యర్థింపబడిన ఋశ్యశృంగుడు అందులకు సమ్మతించి,"యజ్ఞద్రవ్యములను సిధ్ధము చేయింపుడు.యాగాశ్వమును విడిచి పెట్టుడు"అని రాజుతో పలికెను.(3)

సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞ భూమిః విధీయతాం |

తతో అబ్రవీత్ నృపః వాక్యం బ్రాహ్మణాన్ వేద పారగాన్ |౧-౧౨-౪|

అంతట దశరథుడు మంత్రిముఖ్యుడైన సుమంత్రుని ఇట్లు ఆదేశించేను."సుమంత్రా!వేదపండితులును,ఋత్విజులును ఐన సుయజ్ఞుని,వామదేవుని,జాబాలిని,కాశ్యపుని,పురోహితుడైన వసిష్టుని,తదితర ద్విజోత్తములను శీఘ్రముగా వెంటగొని రమ్ము."అని(4-5)

సుమంత్ర ఆవాహయ క్ష్షిప్రం ఋత్విజో బ్రహ్మ వాదినః |

సుయజ్ఞం వామదేవం చ జాబాలిం అథ కాశ్యపం |౧-౧౨-౫|

పురోహితం వసిష్ఠం చ యే చ అన్యే ద్విజ సత్తమాః |

తతః సుమంత్రః త్వరితం గత్వా త్వరిత విక్రమః |౧-౧౨-౬|

అనంతరము శీఘ్రగమనుడైన సుమంత్రుడు త్వరత్వరగా వెళ్ళి,వేదసారంగతులైన ఆ బ్రాహ్మణోత్తములను అందరిని వెంటబెట్టుకొనివచ్చెను.(6)

సమానయత్ స తాన్ సర్వాన్ సమస్తాన్ వేద పారగాన్ |

తాన్ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథః తదా |౧-౧౨-౭|

ధర్మాత్ముడైన దశరథమహారాజు వారిని పూజించి,ధర్మార్థసాధనకు ఉపయుక్తములగు మధురవచనములను పలికెను.(7)

ధర్మార్థ సహితం యుక్తం శ్లక్ష్ణం వచనం అబ్రవీత్ |

మమ తాతప్య మానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం |౧-౧౨-౮|

పుత్రార్థం హయమేధేన యక్షయామి ఇతి మతిర్మమ |

తదహం యష్టుం ఇచ్ఛామి హయమేధేన కర్మణా |౧-౧౨-౯|

"పుత్రులకొరకై తపనతో తహతహలాడుచున్ననాకుమనశ్శాంతియే కరువైనది.

ఋషిపుత్ర ప్రభావేణ కామాన్ ప్రాప్స్యామి చ అపి అహం |

తతః సాధు ఇతి తద్ వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్ |౧-౧౨-౧౦|

వసిష్ఠ ప్రముఖాః సర్వే పార్థివస్య ముఖాత్ చ్యుతం |

ఋష్యశృఙ్గ పురోగాః చ ప్రతి ఊచుః నృపతిం తదా |౧-౧౨-౧౧|

సంభారాః సంభ్రియంతాం తే తురగః చ విముచ్యతాం |

సరవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞ భూమిః విధీయతాం |౧-౧౨-౧౨|

సర్వథా ప్రాప్యసే పుత్రాం చతురో అమిత విక్రమాన్ |

యస్య తే ధర్మికీ బుద్ధిః ఇయం పుత్రార్థం ఆగతా |౧-౧౨-౧౩|

తతః ప్రీతోఽభవత్ రాజా శ్రుత్వా తు ద్విజ భాషితం |

అమాత్యాన్ అబ్రవీత్ రాజా హర్షేణ ఇదం శుభ అక్షరం |౧-౧౨-౧౪|

గురూణాం వచనాత్ శీఘ్రం సంభారాః సంభ్రియంతు మే |

సమర్థ అధిష్టితః చ అశ్వః సః ఉపాధ్యాయో విముచ్యతాం |౧-౧౨-౧౫|

సరయవ్యాః చ ఉత్తరే తీరే యజ్ఞ భూమిః విధీయతాం |

శాంతయః చ అభివర్థంతాం యథా కల్పం యథా విధి |౧-౧౨-౧౬|

శక్యః కర్తుం అయం యజ్ఞః సర్వేణ అపి మహీక్షితా |

న అపరాథో భవేత్ కష్టో యద్య అస్మిన్ క్రతు సత్తమే |౧-౧౨-౧౭|

ఛిద్రం హి మృగయంత ఏతే విద్వాన్సో బ్రహ్మ రాక్షసాః |

విధిహీనస్య యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి |౧-౧౨-౧౮|

తద్ యథా విధి పూర్వం క్రతుః ఏష సమాప్యతే |

తథా విధానం క్రియతాం సమర్థాః కరణేషు ఇహ |౧-౧౨-౧౯|

తథా ఇతి చ తతః సర్వే మంత్రిణః ప్రత్యపూజయన్ |

పార్థివ ఇంద్రస్య తత్ వాక్యం యథా ఆజ్ఞప్తం అకుర్వత |౧-౧౨-౨౦|

తతో ద్విజాః తే ధర్మజ్ఞం అస్తువన్ పార్థివర్షభం |

అనుజ్ఞాతాః తతః సర్వే పునః జగ్ముః యథా ఆగతం |౧-౧౨-౨౧|

గతేషు తేషు విప్రేషు మంత్రిణః తాన్ నరాధిపః |

విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహామతిః |౧-౧౨-౨౨|

ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే ద్వాదశః సర్గః |౧-౧౨|