బసవరాజు అప్పారావు గీతములు/హెచ్చరిక
స్వరూపం
హెచ్చరిక
మంచిరోజు కాదోయి, చందమామా !
మంచిదారి కాదోయి, చందమామా !
ఇంద్రధనసు విమానాన
చందమామ! యెచటికంత
తొందరగా బొయ్యేవోయ్
ముందు కీడు తెలియదేమొ!
మంచిరోజు కాదోయి చందమామా !
మంచిదారి కాదోయి చందమామా !
కవిలా గున్నావు నీకు
కానరాదొ కిందు మీదు ?
*[1] మిత్తిలా తమస్సు నిన్ను
మింగి గుటక వేసేనోయ్
మంచిరోజు కాదోయి చందమామా !
మంచిదారి కాదోయి చందమామా !
- ↑ మిఠాయిలా తమసు