బసవరాజు అప్పారావు గీతములు/వియోగి విలాపము

వికీసోర్స్ నుండి

    వేగిరము వద్దు, చనవద్దు వెర్రినిబడి,
       ప్రేమ మది బూని యోచించు వెనుకముందు
       చేతి ధనమును వీడకు చేతులార,
       నీటిబుగ్గలపై వల దేట దుముక!


వియోగి విలాపము

       న్నులకు న్నిదురరాదు
       ఎన్నో చింతలు వేచెడు
       కన్నె నిన్ను వీడి ఒంటి
       నిన్ని వెతలు బడుచుంటినె!

       మెత్తపాన్పుపైన వలపు
       మత్తత నిను గూడెడు నే
       నుత్త కటికనేలను మే
       నొత్తుకొన బరుంటి నిపుడు!

       చిలుక పలుకులం బలె వీ
       నులకు విందుసలిపి వలపు
       గొలుపు నీదు తియ్యనైన
       పలుకులు విననోచనైతి!

        మది గల తమిమంటలార
        వదలని బిగికౌగిట ని
        న్నెద నెద గదియించెడు సం
        పదకు పెట్టి పుట్టనైతి !

        సొగసు గుల్కు నీదు ముద్దు
        మొగము గాంచి మది వేచెడు
        వగపు మరచి వలపుకలిమి
        నగుటుండునె యీ జన్మకు ?

        కలలోనైనను కనుపడి
        చెలియా, యీ దీనుని మది
        యలజడి యంతయు బోవన్
        కలసి వలపు దీర్చలేవె ?


మాయమైపోతె

        గువరో యింతలో మాయమైపోతే
        మాటాడకుండనే మాయమైపోతే,
        మల్లెపూజాడలనె మాయమైనావె,
        మనుగొట్టి కనులలో మాయమైపోతే ?